ప్లైట్స్‌లో ఎలక్ట్రానిక్స్ రవాణాపై అమెరికా నిషేధం
ప్లైట్స్‌లో ఎలక్ట్రానిక్స్ రవాణాపై అమెరికా నిషేధం
Published Tue, Mar 21 2017 6:54 PM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM
విమానంలోని క్యాబిన్‌లో ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకెళ్లడంపై అమెరికా నిషేధం విధించింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ఈ నిషిద్ధ ఆంక్షలు అమలులో ఉంటాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. సైజులో స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దగా ఉండే వస్తువులను (ఉదాహరణ: ఐప్యాడ్, కిండిల్, ల్యాప్‌టాప్) విమాన క్యాబిన్‌లోకి తీసుకెళ్లడం ఇక కుదరదని తెలిపారు.
టెర్రరిస్టులు ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పేలుడు పదార్ధాలను అమెరికాకు తీసుకువస్తున్నారనే భద్రతా కారణాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంతో మిడిల్‌ఈస్ట్, ఆఫ్రికాల నుంచి భారీ సంఖ్యలో అమెరికాకు సర్వీసులు నడుపుతున్న దిగ్గజ ఎయిర్‌లైన్ సంస్ధలు ఎమిరేట్స్, ఖతార్, టర్కీష్ తదితర సంస్ధలు ఇబ్బందులు పడనున్నాయి.
ఈ రూట్లలో ఒక్క అమెరికన్ ఎయిర్‌లైన్ సంస్ధ సర్వీసులు నడుపుతూ లేకపోవడం గమనార్హం. నిషేధానికి ఇంత కాలపరిమితి ఏమీ లేదని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలను అమెరికాకు సర్వీసులు నడిపే సంస్ధలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు.
Advertisement
Advertisement