Electronic equipment
-
టెక్నాలజీ ఊబిలో భారతీయులు
భారతీయులు ఉదయం లేచించి మొదలు రాత్రి పడుకునేదాకా ఎల్రక్టానిక్ డివైజ్లతో గడుపుతున్నారు. డెస్క్ టాప్‌తో మమేకమవుతారు. డెస్క్ టాప్ నుంచి తల పక్కకు తిప్పితే నేరుగా ల్యాప్‌టాప్‌లో తలదూర్చేస్తారు. ఒకవేళ ల్యాప్‌టాప్ పక్కనబెడితే స్మార్ట్‌ఫోన్ లేదంటే ట్యాబ్ లేదంటే ఇంకో డివైజ్‌కు దాసోహం అవుతున్నారు. దీంతో ఎన్నో సమస్యలు. తక్కువ నిజాలు, ఎక్కువ అబద్ధాలతో కూడిన సమాచారాన్ని మాత్రమే నమ్మడం, సోషల్‌మీడియా లో ప్రతికూల వార్తలనే ఎక్కువగా ఫాలో అవడం, ఫోన్ రింగ్ కాకపోయినా వచ్చినట్లు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్లు భావించడం, అతి డివైజ్‌ల వాడకంతో సాధారణ విషయగ్రహణ సామర్థ్యం సన్నగిల్లడం, ఒంటరిగా ఉంటేనే బాగుందని అనిపించడం, వెంటనే స్పందించే గుణం కోల్పోవడం, అతి ఉద్రేకం లేదంటే నిస్సత్తువ ఆవహించడం, ఏకాగ్రత లోపం.. ఇలా ఎన్నో సమస్యలకు ఎల్రక్టానిక్ డివైజ్‌లు హేతువులుగా మారాయి. వాటి అదుపాజ్ఞల్లోకి వెళ్లకుండా వాటినే తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్న భారతీయులు కేవలం మూడు శాతమేనని తాజా సర్వే కుండబద్దలు కొట్టింది. దాదాపు 83,000 కౌన్సిలింగ్ సెషన్లు, 12,000 స్క్రీనింగ్‌లు, 42,0000 అంచనాలను పరిశీలించి చేసిన సర్వేలో ఇలాంటి ఎన్నో విస్మయకర అంశాలు వెలుగుచూశాయి. డిజిటల్ డివైజ్లతో సహవాసం చేస్తూ భారతీయులు ఏపాటి మానసిక ఆరోగ్యంతో ఉన్నారనే అంశాలతో వన్టూవన్హెల్ప్ అనే సంస్థ ‘ది స్టేట్ ఆఫ్ ఎమోషనల్ వెల్బీయింగ్,2024’అనే సర్వే చేసి సంబంధిత నివేదికను వెల్లడించింది. సగం మంది డివైజ్‌లను వదల్లేక పోతున్నారు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది తమ ఎల్రక్టానిక్ డివైజ్‌లను వదిలి ఉండలేకపోతున్నారు. మరో పది శాతం మందికి డిజిటల్ జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి కౌన్సిలింగ్ తీసుకుంటున్న వారి సంఖ్య 15 శాతం పెరిగింది. ఆదుర్తా, కుంగుబాటు, పనిచేసే చోట ఒత్తిడి వంటి ప్రధాన కారణాలతో ప్రజలు మానసిక ఆరోగ్యం బాగు కోసం నిపుణులను సంప్రతించడం పెరిగింది. వృత్తిసంబంధ అంశాల్లో సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 23 శాతం మంది తాము పనిచేసేచోట ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నట్లు తేలింది. ఇది ఆరోగ్యవంతమైన పని వాతావరణం ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. కౌన్సిలింగ్ కోసం పురుషుల్లో పెరిగిన ఆసక్తి గతంలో ఏదైనా థెరపీ చేయించుకోవాలన్నా, మానసికంగా ఒక సాంత్వన కావాలంటే ఒకరి తోడు అవసరమని మహిళలు భావిస్తుంటారు. మగాడై ఉండి థెరపీ చేయించుకోవడమేంటనే ఆలోచనాధోరణి ఇన్నాళ్లూ పురుషుల్లో ఉండేది. ఇప్పుడు ఆ ధోరణిలో కాస్తంత మార్పు వచ్చింది. గతంతో పోలిస్తే 7 శాతం మంది ఎక్కువగా పురుషులు థెరపీలు సిద్ధపడుతున్నారు. ఆర్థికసంబంధ కన్సల్టేషన్లు పొందిన వారిలో 70 శాతం మంది పురుషులే ఉన్నాయి. ఇక మానవీయ సంబంధాలకు సంబంధించిన కౌన్సిలింగ్ సెషన్లలో 60 శాతం దాకా మహిళలే కనిపించారు. యువతలో పెరిగిన మానసిక సమస్యలు ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువతలో నైరాశ్యం పెరుగుతోంది. 30 ఏళ్లలోపు వయసు యువతలో అత్యధికంగా ఆదుర్దా, కుంగుబాటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉద్యోగం మారాల్సి రావడం, జీవితభాగస్వామితో సత్సంబంధం కొనసాగించడం వంటి అంశాలకొచ్చేసరికి యువత ఆత్రుత, కుంగుబాటుకు గురవుతోంది. పాతికేళ్లలోపు యువతలో 92 శాతం మందిలో ఆత్రుత, 91% మందిలో కుంగుబాటు కనిపిస్తున్నాయి. ఆత్మహత్య భయాలూ ఎక్కువే ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్న వారి సంఖ్య గతంతో పోలిస్తే 22 శాతం పెరిగింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పిన వాళ్ల సంఖ్య 2023తో పోలిస్తే 17 శాతం పెరగడం ఆందోళనకరం. తమకు కౌన్సిలింగ్ అవసరమని భావిస్తున్న వారిలో సగం మంది ఇప్పటికే తీవ్రమైన భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువ మందికి తక్షణం మానసిక సంబంధ తోడ్పాటు అవసరమని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయుల్లో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన బాగా పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హేయర్ ఇండియాపై దిగ్గజాల కన్ను
ముంబై: చైనీస్ కన్జూమర్ అప్లయెన్సెస్ కంపెనీ హేయర్ దేశీ కార్యకలాపాలపై పలు కార్పొరేట్ దిగ్గజాలు కన్నేసినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. హేయర్(Haier) అప్లయెన్సెస్ ఇండియాలో 51 శాతం వాటా కొనుగోలు చేయాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు పలు పీఈ దిగ్గజాలు, దేశీ కార్పొరేట్ల(Corporate)తో చేతులు కలిపాయి. వార్బర్గ్ పింకస్.. భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో, బెయిన్ క్యాపిటల్ దాల్మియా భారత్ గ్రూప్‌తో జట్టు కట్టాయి. ఈ రేసులో వెల్స్పన్ గ్రూప్‌తోపాటు.. ఇతర పీఈ దిగ్గజాలు టీపీజీ క్యాపిటల్, గోల్డ్‌మన్ శాక్స్, జీఐసీ(సింగపూర్) పోటీ పడుతున్నాయి. ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ చైనీస్ దిగ్గజం హేయర్ ఇండియా దేశీయంగా హోమ్ అప్లయెన్సెస్‌లో మూడో పెద్ద కంపెనీగా నిలుస్తోంది. రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ, టీవీల విక్రయాలలో కొరియన్ దిగ్గజాలు ఎల్జీ, శామ్సంగ్తో పోటీ పడుతోంది. అయితే హేయర్ ఇండియాలో నియంత్రిత వాటా (51 శాతం) కొనుగోలు చేసేందుకు దేశీ కార్పొరేట్లతోపాటు.. గ్లోబల్ పీఈ(Global PE) సంస్థలు సైతం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. వివరాలు చూద్దాం..ఇప్పటికే ఆఫర్లుహేయర్ ఇండియాలో నియంత్రిత వాటా కొనుగోలుకి కొన్ని సంస్థలు ఇప్పటికే నాన్‌బైండింగ్ బిడ్స్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆసక్తిని చూపుతున్న ఇతర దేశీ కార్పొరేట్లలో మణిపాల్ గ్రూప్, డాబర్ గ్రూప్, ముంజాల్ కుటుంబం ఉన్నట్లు సమాచారం. కంపెనీతో చర్చలు చేపట్టిన పీఈ దిగ్గజాలలో బ్లాక్‌స్టోన్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, ఈక్యూటీ, టీఏ అసోసియేట్స్ సైతం ఉన్నాయి. లిస్టెడ్ కంపెనీల ద్వారా కాకుండా ప్రమోటర్లు, గ్రూప్ ప్రయివేట్ సంస్థల నుంచి ఆసక్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికతకు ప్రాధాన్యందేశీ నియంత్రణ సంస్థల నిశిత పరీక్షల నేపథ్యంలో హేయర్ ఇండియా కార్యకలాపాలలో స్థానికతను పెంచుకునే వ్యూహాల్లో ఉంది. దీనిలో భాగంగా దేశీ భాగస్వామి కోసం చూస్తోంది. 20–49 శాతం వరకూ వాటాను సైతం ఆఫర్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 51 శాతం వాటాకు స్థానిక సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా చైనాయేతర సంస్థలు మెజారిటీ వాటాను కలిగి ఉండటం ద్వారా యాజమాన్య నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాయి. ఆపై స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు వీలుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: భారత్‌కు ‘తయారీ’ స్వర్ణయుగంభారీ వృద్ధిపై దృష్టిఈ క్యాలెండర్ ఏడాది(2024)లో బిలియన్ డాలర్లకుపైగా(రూ.8,900 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించే లక్ష్యంలో సాగుతున్నట్లు హేయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ఇందుకు పండుగలు, వేసవి సీజన్, ప్రీమియం ధరలు సహకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో 2025లో రూ. 11,500 కోట్ల ఆదాయాన్ని అందుకోవాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి 2024లో 35 శాతం వృద్ధి సాధించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించనున్నట్లు వివరించారు. ప్రధానంగా లెడ్, వాషింగ్ మెషీన్ల విభాగం పటిష్ట పురోగతిని అందుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా.. ఇప్పటికే దేశీయంగా రూ. 2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎల్రక్టానిక్స్, కన్జూమర్ కంపెనీ మూడో తయారీ కేంద్రాన్ని దక్షిణాదిలో ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది. 2026 లేదా 2027కల్లా కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళికల్లో ఉంది. ప్రస్తుతం పుణే, గ్రేటర్ నోయిడాలలో తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. -
ఫోన్లూ వణుకుతాయ్
ఎండలకు రాళ్లు కూడా పగులుతాయని విన్నాం. కానీ.. చలికి ఫోన్లు సైతం పగిలిపోతాయట. వేసవితో పోలిస్తే శీతాకాలంలో స్మార్ట్ఫోన్లు కిందపడితే స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయని ఎలక్ట్రానిక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్లతో పాటు స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరుపై చలి తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని పేర్కొంటున్నారు. చలికాలం వచ్చిందంటే చాలామంది ఆరోగ్య విషయాల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటారని.. ఇకపై చలికాలంలో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతివిలువైన డేటా కోల్పోయే అవకాశంప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ సమాచారమైనా పేపర్ డాక్యుమెంట్ల రూపంలో భద్రపరుచుకోవడం కంటే.. వాటిని ఫోన్లు లేదా వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో సేవ్ చేసుకుని భద్రపరచుకుంటుంటాం. అయితే ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే హార్డ్ డ్రైÐవ్లు కొన్ని సందర్భాల్లో విపరీతమైన చలికి ప్రభావితమై పనిచేయకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో హార్డ్ డ్రైవ్‌లలో మాత్రమే నిక్షిప్తమై ఉండే మన విలువైన సమాచారం, డాక్యుమెంట్లను పూర్తిగా తిరిగి చూడడానికి వీలులేని విధంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేవారు తాము వాడేవి కొత్తవి కదా అని అజాగ్రత్త ఉండొచ్చు. కానీ, కొత్తవి అయినంత మాత్రాన చలికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకోవడం కేవలం అపోహేనట. కొత్త ఎల్రక్టానిక్ పరికరాలు కూడా విపరీతమైన చలి పరిస్థితుల్లో వాటి పనితీరు తగ్గుముఖం పట్టవచ్చని నిఫుణులు పేర్కొంటున్నారు.చలి విపరీతంగా ఉంటే ఫోను ఆగిపోయే ఛాన్స్» ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల ఎల్సీడీ, ఓఎల్ఈడీ స్కీన్లు నిదానంగా పనిచేయడం వల్ల ఆ సమయంలో వాటిని ఉపయోగిస్తున్నప్పుడు ఆ పరికరాల స్కీన్లపై కనిపించే బొమ్మలు, అక్షరాల నాణ్యత, స్పష్టత సరిగా ఉండకపోయే అవకాశం ఉంది. » ప్రమాదవశాత్తు స్మార్ట్ ఫోను వంటివి కిందపడితే వేసవి కాలంలో కంటే శీతాకాలంలో వాటి స్క్రీన్లు అత్యంత సులభంగా పగిలిపోతాయి. » ఎలక్ట్రానిక్ పరికరాలను వేలిముద్రల గుర్తింపు, ముఖ గుర్తింపు ద్వారానే త్వరగా అన్, ఆఫ్ అయ్యేలా పెట్టుకుంటాం. కానీ.. ఎక్కువ చలి సమయంలో సెన్సార్ విధానం సరిగా పనిచేయక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు వంటి ధరించగలిగేవి విపరీతమైన చలిలో కచి్చతమైన రీడింగ్‌లను తెలపలేవు. » కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లో ఉపయోగించే హార్డ్ డ్రైవ్‌లు చలి ప్రభావంతో ఆలస్యంగా ఓపెన్ కావడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. » ఎల్రక్టానిక్ వస్తువులలో ఉండే సున్నితమైన, అతి సున్నితమైన సర్క్యూట్లు చలికి తుప్పు పట్టే అవకాశం ఉండటంతో ఆయా వస్తువులు పూర్తిగా పనిచేయకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. » కెమెరాలు సైతం చలి తగ్గి ఎండ పెరిగే కొద్దీ వాటి అద్దాలపై పొరగా ఏర్పడే పొగమంచు ఫొటోల్లోని బొమ్మ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. » ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు చల్లని ఉష్ణోగ్రతలలో పేలవంగా పనిచేస్తాయని, విపరీతమైన చలిలో బ్యాటరీ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోవచ్చు లేదా శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. » స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్ బడ్లు వేగంగా బ్యాటరీ నష్టానికి గురికావడంతో అవి పనిచేయడంలో ఎక్కువగా అవాంతరాలు ఏర్పడే వీలుంది. » ఎలక్రానిక్ పరిరకాలకు ఉపయోగించే గాజు, ప్లాస్టిక్ వంటివి చలికి పెళుసుబారి చిన్న ఒత్తిడికే పగుళ్లు లేదా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇలా చేయడం బెటర్» చలికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో.. ఎల్రక్టానిక్ పరికరాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిఫుణులు సూచిస్తున్నారు. » శీతాకాలంలో ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లకు సాధారణ కన్నా ఎక్కువసార్లు చార్జింగ్ పెడుతూ ఉండాలి. ఎక్కువ కాలం పాటు గడ్డకట్టే చలికి పరికరాలను బహిర్గతం చేయకుండా ఉంచాలి. తప్పనిసరిగా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు చలి సోకని కవర్లలో వాటిని ఉంచాలి.» చలికాలంలో స్మార్ట్ ఫోన్లు సహా అన్ని ఎల్రక్టానిక్ వస్తువులను ఆరుబయట చలిలో ఎక్కువ సమయం వినియోగించాల్సి వస్తే.. ఇంటికి చేరుకోగానే వాటిని శుభ్రం చేయడం మంచిదని సూచిస్తున్నారు. » చల్లటి పరిస్థితులను తట్టుకునేలా రూపొందించిన ఎల్రక్టానిక్ పరికరాలను కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
మై లిటిల్ మార్ఫీ..! చిన్నారులు హాయిగా నిద్రపోయేలా..!
చిన్నపిల్లలకు కథలు చెబుతుంటే, నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు. దీనికోసం చాలామంది తల్లిదండ్రులు మొబైల్లో వారికి కావాల్సినవి పెట్టి పడుకోబెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా కొన్ని పరిశోధనలు నిద్రపోవడానికి ముందు అరగంట సమయం పిల్లల మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని నిర్ధారించాయి. మొబైల్ వల్ల పిల్లల నిద్రకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ‘మై లిటిల్ మార్ఫీ’నీ రూపొందించారు. ఇందులో చిన్నారుల ప్రశాంతమైన నిద్ర కోసం 128 కథలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే 32 రకాల ధ్యానాలు, పిల్లి, కుక్క, ఏనుగు వంటి 16 జంతువుల ధ్వనులు, సముద్ర కెరటాలు, గాలి, నీటి తుంపరలు, మంటల చిటపట శబ్దాలతో పాటు ‘మై లిటిల్ మార్ఫీ’ కోసం ప్రత్యేకంగా కంపోజ్ చేసిన 16 శ్రావ్యమైన సంగీత స్వరకల్పనలు ఉన్నాయి. ఇవే కాకుండా, ప్రపంచంలోని వివిధ ప్రదేశాలలో రికార్డ్ చేసిన ప్రకృతి శబ్దాలున్నాయి. ఇలా మొత్తం మై లిటిల్ మార్ఫీ 192 సెషన్లను 5 థీమ్‌లుగా విభజించింది. పడుకునే ముందు మన కిష్టమైన సెషన్ , ఆ సెషన్ వ్యవధిని ఎంచుకుంటే చాలు. అది వింటూ హాయిగా నిద్ర పోవచ్చు. చిన్నారులకే కాదు ఈ పరికరం అన్ని వయసుల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఇందులో అద్భుతమైన నాణ్యతతో వాయిస్ రికార్డింగ్ చేసుకునే వీలుండటం విశేషం. దీనిని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు మూడు గంటల పాటు పనిచేస్తుంది. అంటే మొత్తం ఎనిమిది కథలు, పదహారు పాటల వరకు వినొచ్చు. ధర 8 వేల నుంచి 9 వేల రూపాయల వరకు ఉంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్‌ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్‌గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్‌గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్‌లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
ఎల్రక్టానిక్ విడిభాగాలకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు (డ్యాష్‌బోర్డ్, ఇంజిన్లు వంటివి) 2030 నాటికల్లా డిమాండ్ అయిదు రెట్లు పెరగవచ్చని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక నివేదికలో తెలిపింది. అప్పటికల్లా ఇది 240 బిలియన్ డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. మదర్‌బోర్డులు, లిథియం అయాన్ బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపింది. ఈ పరిస్థితిని తొలగించేందుకు 35–40 శాతం శ్రేణిలో అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఎల్రక్టానిక్ విడిభాగాల కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని సవరిస్తే దేశీయంగా తయారీకి ఊతం లభించగలదని వివరించింది. ‘2023లో 102 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎల్రక్టానిక్స్ కోసం 45.5 బిలియన్ డాలర్ల విడిభాగాలు, సబ్–అసెంబ్లీలకు డిమాండ్ నెలకొంది. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి కోసం 240 బిలియన్ డాలర్ల కాంపోనెంట్స్, సబ్ అసెంబ్లీలు అవసరమవుతాయి‘ అని తెలిపింది. నివేదికలోని మరిన్ని ప్రత్యేకాంశాలు.. → 2022లో మొత్తం విడిభాగాలకు నెలకొన్న డిమాండ్‌లో బ్యాటరీలు, కెమెరా మాడ్యూల్స్, డిస్ప్లేలు, పీసీబీలు మొదలైన అత్యంత ప్రాధాన్యమైన ఉత్పత్తుల వాటా 43 శాతంగా నమోదైంది. ఇది 2030 నాటికి గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా నామమాత్రంగానే తయారవుతున్నాయి లేదా ఎక్కువగా దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. → చైనా, వియత్నాం, మెక్సికో వంటి పోటీ దేశాలతో పోలిస్తే భారత్‌లో తయారీ సంబంధ వ్యయాలు 10–20 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశీయంగా భారీ తయారీ కార్పొరేషన్లు లేవు. భారతీయ కంపెనీల కోసం డిజైన్ వ్యవస్థ, ముడి సరుకుల లభ్యత కోసం సరైన వ్యవస్థలాంటిది లేదు. ఇవన్నీ కూడా విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయి. → విడిభాగాలు, సబ్–అసెంబ్లీల తయారీకి ఊతమిచ్చేలా ప్రభుత్వం 6–8 ఏళ్ల పాటు ఆర్థిక తోడ్పాటును అందించే తగు స్కీమును రూపొందించాలి. → యూరోపియన్ యూనియన్, యూకే, జీసీసీ దేశాలు, ఆఫ్రికాలోని వర్ధమాన దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (ఎఫ్‌టీఏ) కుదుర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేయాలి. → భారతీయ ఉత్పత్తులకు విదేశాల్లో మార్కెట్ సృష్టించడం ద్వారా ఎగుమతులు పెరగడంతో పాటు దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రభుత్వం పాలసీపరమైన మద్దతునిస్తే 2026 నాటికి 2.8 లక్షల మేర ఉద్యోగాల కల్పన జరిగేందుకు సహాయకరంగా ఉంటుంది. దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుతుంది. -
రాష్ట్రంలో టీసీఎల్ యూనిట్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ టీసీఎల్.. తెలంగాణలో కంపెనీని ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్థతో కలసి కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ గూడ్స్ తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ మేరకు బుధవారం పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. టీసీఎల్ ఎల్రక్టానిక్స్ తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత ఇతర దేశాల్లో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం గమనార్హం. ఈ కంపెనీలో తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేస్తారు. అనంతరం రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్ల వంటి ఇతర ఉపకరణాలనుకూడా తయారు చేస్తారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని ’ఈ– సిటీ’లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్ కోసం టీసీఎల్ రూ.225 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. ఈ యూనిట్‌తో తొలిదశలోనే సుమారు 500 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెపుతున్నారు. రాష్ట్రంలో టీసీఎల్ కంపెనీ పెట్టుబడులు పెట్టడాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగానికి తెలంగాణ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ఇక్కడ హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్‌ను షెన్జెన్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను, టీసీ ఎల్ సంస్థ చైర్పర్సన్ జువాన్ డూకి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీకి ఉన్న అనుకూల పరిస్థితులు, మౌలిక వసతులు, తమ ప్రభుత్వ విధానాలను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్ ఆమెను ఆహా్వనించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కంపెనీ రెజల్యూట్ గ్రూప్ చైర్మన్ రమీందర్ సింగ్ సొయిన్, రాష్ట్ర ఎల్రక్టానిక్స్ విభాగం డైరెక్టర్ సుజాయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్యంలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్య రంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రాలలో ఏపీ ఒకటని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సెక్రటరీ ఆర్.కే. రాయ్ కొనియాడారు. ఇంధన భద్రత, పర్యావరణ లక్ష్యాలను సాధించడంతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఇంధన తీవ్రతను తగ్గించడానికి సహాయపడే ఇంధన సామర్థ్య కార్యకలాపాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య పరికరాలను అమర్చే ప్రాజెక్టును ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) రికార్డు స్థాయిలో నెల రోజుల్లోనే పూర్తిచేసింది. ఈ ప్రాజెక్టును రాయ్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీ భవన్లో ఏటా 1.96 లక్షల యూనిట్ల విద్యుత్తును, రూ.39 లక్షల మేర ప్రజా ధనాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. 139 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించొచ్చన్నారు. ఇందుకోసం పెట్టిన పెట్టుబడి 13 నెలల్లోనే ఇంధనం ఆదా రూపంలో తిరిగి పొందవచ్చన్నారు. తొలి దశలో హాలోజన్ ల్యాంప్‌ల స్థానంలో 190 వాట్ల కెపాసిటీ గల 12 ఎల్ఈడీ ఫ్లడ్ లైట్లు, సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 28 వాట్స్ కెపాసిటీ గల 170 బీఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, 1.8 టీఆర్ 3 స్టార్ రేటెడ్ హాట్ అండ్ కోల్డ్ ఇన్వర్టర్ టైప్ స్ప్లిట్ ఏసీలు, కారిడార్ల వద్ద లైట్లను నియంత్రించడానికి 40 మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేశారని తెలిపారు. దీనివల్ల ఏటా రూ.6.25 లక్షల విలువైన49,469 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందన్నారు. నెల రోజుల్లోనే పనులు పూర్తి చేసిన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డిని రాయ్ అభినందించారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఇంధన సామర్థ్య చర్యలకు న్యూ ఢిల్లీలో బీఈఈ ఎంపిక చేసిన తొలి రాష్ట్ర భవన్ ఏపీ భవన్. ఇక్కడి ఇంధన పొదుపు చర్యల ఫలితాల ఆధారంగా ఇతర రాష్ట్ర ప్రభుత్వాల భవనాల్లోనూ ఇదే ప్రాజెక్టును అమలు చేయాలని బీఈఈ భావిస్తోంది. ఏపీ భవన్‌ను ఎంపిక చేసి ఏపీఎస్ఈసీఎం ద్వారా ఇంధన సామర్థ్య చర్యలను విజయవంతంగా అమలు చేసిన బీఈఈకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కృతజ్ఞతలు తెలిపారు. -
స్టయిలిష్ క్యాంపింగ్ గ్రిల్ తక్కువ ధరకే.. త్వరపడండి
అవుట్ డోర్ పార్టీలు.. లాంగ్ డ్రైవ్‌లు.. ఎంజాయ్ చెయ్యడానికి చాలా బాగుంటాయి కానీ.. ఆకలేసే సమయానికి నచ్చిన వంటకం దొరక్కుంటే మాత్రం ఆ ఎంజాయ్మెంట్ అంతా క్షణంలో ఆవిరైపోతుంది. అలాంటప్పుడే మనతో పాటు ఒక కంఫర్టబుల్ కుక్ వేర్, కొంత వంట సామాగ్రి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదే ఈ క్యాంపింగ్ గ్రిల్. చూడటానికి చిన్న బ్రీఫ్కేస్లా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా తేలికగా తీసుకెళ్లొచ్చు. ఈ మేకర్‌ను ఓవర్ హీట్, స్క్రాచ్ రెసిస్టెన్స్, డిఫార్మేషన్ వంటి వాటిని తట్టుకోగల హైక్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందించారు. 130 చదరపు అంగుళాల బార్బెక్యూ గ్రిల్‌పై క్రిస్పీ రుచులను వేగంగా చేసుకోవచ్చు. కార్బన్ ఫైబర్ ట్రేలో బొగ్గులను నింపి.. నిప్పు రాజేస్తే.. ఎక్కడైనా దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కారులో వెళ్లినా, బస్సు మీద వెళ్లినా.. ఫ్యామిలీతో వెళ్లినా, ఫ్రెండ్స్‌తో వెళ్లినా దీన్ని చాలా స్టయిలిష్‌గా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ధర 140 డాలర్లు (రూ.10,409) -
ధమాకా ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్‌ను రిలయన్స్ ప్రారంభించింది. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్ ఈ సేల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్‌ట్యాప్‌లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంటాయి. దేశంలోని 80 నగరాల్లో ఉన్న 460 స్టోర్లలో ఈ సేల్ ప్రారంభం కానుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఆఫర్లు - ఆగస్టు 16 వరకు జరిగే కొనుగోళ్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ని అందిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3,000 వరకు తగ్తింపు పొందవచ్చు - కనీసం రూ.9999 కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.10,000 ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్‌మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక గరిష్ట పరిమితి రూ.5,000లుగా ఉంది. ఫైనాన్సింగ్ సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్‌తో డిజిటల్ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా మారింది. కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్‌స్టా డెలివరి కింద మూడు గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు తమ వీలుని బట్టి సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. -
గ్రేట్ జర్నీ స్టీరింగ్ ఉమన్
ఆమె ఆటో రిక్షా నడుపుతుంటే ఆ పట్టణంలోని పిల్లలు ఆసక్తిగా చూస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు... ఇలా కూడా ఉంటుందా? అన్నంత విచిత్రంగా చూస్తారు. నిజమే... వాహనం స్టీరింగ్ ఆడవాళ్ల చేతిలో ఉండడం అంటే వాళ్లకు ప్రపంచంలో ఎనిమిదో వింతను చూడడమే. నడివయసు మగవాళ్లైతే ఆ దృశ్యాన్ని కళ్లెర్రచేసి చూస్తారు. ఆమె తల్లిదండ్రులను, భర్తను తలుచుకుని ఆడపిల్లను ఎలా పెంచాలో, స్త్రీ పట్ల ఎంతటి కట్టుబాట్లు పాటించాలో తెలియని మూర్ఖులు అన్నట్లు ఓ చూపు చూసి, తమ ఇంటి ఆడవాళ్లను గూంగట్ చాటున దాచిన తమ ఘనతను తలుచుకుని మీసం మీద చెయ్యేసుకుంటారిప్పటికీ. ఈ సంప్రదాయ సంకెళ్లను ఛేదించింది నలభై ఏళ్ల మాయా రాథోడ్. ఒక్క సంప్రదాయ సంకెళ్లను మాత్రమే కాదు, పోలియో బారిన పడిన అమ్మాయి జీవితం అక్కడితో ఆగిపోదని, సంకల్పం, పట్టుదల, శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే బతుకుపథంలో అడుగులు చక్కగా వేయవచ్చని కూడా నిరూపిస్తోంది. మరో ముఖ్యమైన విషయం కూడా ప్రముఖం గా గుర్తించాల్సిందే ఉంది. కాలుష్య రహిత సమాజ స్థాపనలో భాగంగా కాలుష్యాన్ని విడుదల చేసే ఆటోరిక్షాలను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టినప్పుడు మగవాళ్లు ఎలక్ట్రానిక్ స్టీరింగ్ పట్టుకోవడానికి సాహసించలేదు. అలాంటప్పుడు మాయా రాథోడ్ వేసిన ఓ ముందడుగు ఇప్పుడు రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో పలువురికి స్ఫూర్తినిస్తోంది. అక్కడి మహిళలకు మాయా రాథోడ్ ఓ రోల్ మోడల్ అయింది. బహుముఖ పోరాటం మాయా రాథోడ్ ఆరేళ్ల వయసులో పోలియో బారిన పడింది. అసలే ఆడపిల్లలు బతికి బట్టకట్టడం కష్టమైన రాజస్థాన్ రాష్ట్రం. ఆడపిల్లలను బడికి పంపించమని ప్రభుత్వాలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న రాష్ట్రం. అలాంటి చోట మాయా రాథోడ్ బతుకు పోరాటం చేసింది. ఏకకాలం లో పోలియోతోనూ సమాజంతోనూ పోరాడింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆ జీతంతో బతుకు కుదుట పడడం కుదిరే పని కాదని కూడా త్వరలోనే అర్థమైందామెకు. భర్త సంపాదనకు తన సంపాదన కూడా తోడైతే తప్ప పిల్లల భవిష్యత్తుకు మంచి దారి వేయలేమని కూడా అనుకుంది. అదే సమయంలో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఆటో రిక్షాలను సబ్సిడీ ధరలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ క్షణంలో మాయా రాథోడ్ తీసుకున్న నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. బ్యాంకు లోన్ తీసుకుని ఎలక్ట్రానిక్ ఆటో రిక్షా తీసుకున్నది. ఇది జరిగి మూడేళ్లవుతోంది. ఆ క్షణం నుంచి ఆమెను సంప్రదాయ సమాజం విమర్శన దృక్కులతో వేధించింది. అభివృద్ధి పథం లో నడవాలనుకున్న సమాజం ఆమెను ఆదర్శంగా తీసుకుంది. ఆమె మాత్రం... ‘మహిళలు యుద్ధ విమానాలు నడుపుతున్న రోజులివి. ఆటో రిక్షా నడపడాన్ని కూడా ఆక్షేపించే రోజులు కావివి. ఆటో నడపడం నాకు వచ్చో రాదో అనే సందేహాలు వద్దు. నా ఆటోలో ప్రయాణించి చూడండి’ అని సవాల్ విసురుతోంది. ఈ మూడేళ్లలో బిల్వారాలో మంచి మార్పే వచ్చింది. చిల్లర దొంగతనాలు ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రంలో రాత్రిళ్లు మగవాళ్ల ఆటోలో ప్రయాణించడం కంటే మాయ ఆటోలో ప్రయాణించడానికి ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా ఇష్టపడుతున్నారు. -
దర్భంగా పేలుడు కేసులో కొత్తకోణం
-
శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్ ఛార్జింగ్..!
సాధారణంగా స్మార్ట్‌వాచ్స్, ఇయర్ బడ్స్, వాడేవారికి ఎక్కువగా వెంటాడే సమస్య బ్యాటరీ. బ్యాటరీ పూర్తిగా ఐపోతే అవి ఎందుకు పనికిరావు. ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను తప్పక ఛార్జ్ చేస్తూండాలి. కాగా సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలతో భవిష్యత్తులో ఈ ఛార్జింగ్ సమస్యకు వీడ్కోలు చెప్పవచ్చు. మన శరీరాన్నే వాహకంగా ఉపయోగించి స్మార్ట్‌వాచ్ లాంటి ఇతర వేయరబుల్స్ ను మొబైల్‌తో, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లతో ఛార్జీంగ్ చేయవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)కు చెందిన డిపార్టమెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం ఈ టెక్నిక్‌ను ఆవిష్కరించింది. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ ద్వారా మన దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా మనం ధరించిన స్మార్ట్ వాచ్‌లను సులువుగా ఛార్జ్ చేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. బాడీ కపుల్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటి..? మమూలుగా మన చుట్టూ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంతోకొంత ఎలక్ట్రోమ్యాగ్నటిక్ క్షేత్రాన్ని సృష్టిస్తాయి. ఈ క్షేత్రాలనుపయోగించి మన శరీరంలో ఏర్పాటుచేసిన రిసీవర్, ట్రాన్స్‌మీటర్‌తో ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, (స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్)లాంటి బ్యాటరీలను చార్జ్ చేయవచ్చును. ఫోటో కర్టసీ: నేచర్ ఎలక్ట్రానిక్స్ చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
ఆస్ట్రల్ పాలీ జోష్- యాంబర్ డౌన్
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీవీసి పైపుల కంపెనీ ఆస్ట్రల్ పాలీటెక్నిక్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో పనితీరు నిరాశపరచడంతో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఆస్ట్రల్ పాలీ టెక్నిక్ లాభాలతో కళకళలాడుతుంటే.. రికార్డుల మార్కెట్లోనూ యాంబర్ ఎంటర్ ప్రైజెస్ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆస్ట్రల్ పాలీటెక్నిక్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆస్ట్రల్ పాలీటెక్నిక్ నికర లాభం దాదాపు 7 శాతం బలపడి రూ. 88 కోట్లను తాకింది. నికర అమ్మకాలు సైతం 10 శాతం పెరిగి రూ. 747 కోట్లను అధిగమించాయి. అధెసివ్స్ బిజినెస్ 29 శాతం ఎగసి రూ. 190 కోట్లకు చేరడం మెరుగైన పనితీరుకు దోహదం చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిటా మార్జిన్లు 2.2 శాతం పుంజుకుని 21 శాతాన్ని దాటాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఆస్ట్రల్ పాలీటెక్నిక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 3 శాతం జంప్ చేసి రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.2 శాతం పురోగమించి రూ. 1,249ను తాకింది. యాంబర్ ఎంటర్ ప్రైజెస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో యాంబర్ ఎంటర్ ప్రైజెస్ నికర లాభం 77 శాతం పడిపోయి రూ. 3 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం నీరసించి రూ. 408 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 1.34 శాతం క్షీణించి 4.8 శాతానికి చేరాయి. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం యాంబర్ ఎంటర్ ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 5.5 శాతం పతనమై రూ. 2,193 వద్ద ట్రేడవుతోంది. తొలుత 7.3 శాతం వెనకడుగుతో రూ. 2,150ను తాకింది. -
విద్యార్థుల ప్రతిభ.. ఆకట్టుకుంటున్న సృజన!
నేటితరం విద్యార్థులు కేవలం మార్కుల సాధనకేకాకుండా చదువుకుంటూనే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీపై దృష్టిపెడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే వివిధ రకాల పరికరాలను తయారుచేస్తూ అబ్బురపరుస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వినూత్న తరహా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. దీనికిగాను ఆయా కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సాహం ప్రశంసనీయం. పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలోని భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. సాక్షి, భిమవరం(పశ్చిమ గోదావరి) : హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్, స్మార్ట్ సెక్యూరిటీ ఆలర్ట్ ఫర్ హెవికల్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ వంటివి ఎన్నో ప్రాజెక్టులను భీమవరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సహకారంతో రేయింబవళ్లు విద్యార్థులు తమ మేథస్సును ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తయారుచేసిన పలు ప్రాజెక్టులకు మరింత మెరుగుపర్చి వినియోగంలోకి తీసుకువస్తే ధనికులకేకాకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ప్రస్తుతం ఈవీఎంలు మొరాయిస్తున్న కారణంగా ఎన్నికల పోలింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించడం మరికొంత ఆలస్యానికి కారణం. దీనిని అధిగమించడానికి ఈసీఇ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న పి నిర్మల, వి సాయిభారతి, పి వెంకటలక్ష్మి, బి హిమసాయి తయారుచేసిన ఎలక్ట్రానిక్స్ ఓటింగ్ సిస్టమ్ ఎంతగానో దోహదపడుతుంది. దీని ద్వారా ఓటింగ్ త్వరితగతిని పూర్తిచేయించడమేకాక సిబ్బంది సంఖ్యను కూడా ఘననీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ కళాశాలలోని ఈసీఈ డిపార్ట్మెంట్కు చెందిన విద్యార్థులు వై రోహిత్, కె హరిలత, కె శివ, బి దేవి కేవలం రూ.2,500 వ్యయంతో తయారుచేసిన హార్ట్‌బీట్ మానిటరింగ్ సిస్టమ్ ఆకట్టుకుంటోంది. దీని ద్వారా ఆసుపత్రులు, నివాసాల్లో సైతం రోగుల హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ప్రధానంగా వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించుకోవడం ఎంతో సులువు. తక్కువ ఖర్చుతో రూపొందించిన ఈ యంత్రాన్ని అన్ని వర్గాల ప్రజలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ఈసీఈ తృతీయ సంవత్సరం విద్యార్థిని జి సుప్రియ నేతృత్వంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎస్ జ్యోతిక, సీహెచ్ సాయి మహేష్, పి లలిత రూ.3 వేల వ్యయంతో రూపొందించిన స్మార్ట్ రిజర్వాయర్ సిస్టమ్ ద్వారా రిజర్వాయర్లు, డ్యామ్‌లలో నీటి పరిమాణాన్ని గుర్తించే వీలుంటుంది. నివాసాల వద్ద ఏర్పాటుచేసుకునే వాటర్ ట్యాంక్లులో నీరు నిండిన సమయంలో ఈ సిస్టమ్ ద్వారా ఆలారమ్ మోగుతుంది. తద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు. వెహికల్స్ అలర్ట్ నేటి ఆధునిక యుగంలో అన్ని వయస్సులవారు వాహనాలను యథేచ్చగా వినియోగిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలకు గురై అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోతున్ననవారు కొందరైతే, సకాలంలో వైద్యం అందక తుదిశ్వాస విడిచేవారు మరికొందరు. అయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు సీహెచ్ సంతోష్, బి దేవిశ్రీ, వి థామస్, వై లోకేష్, ఎన్ శరత్ తయారుచేసిన స్మార్ట్ సెక్యూరిటీ అలర్ట్ ఫర్ వెహికల్స్ సిస్టమ్ ద్వారా మోటారుసైకిల్స్, కార్లు నడిపే సమయంలో హెల్మ్‌ట్, సీట్‌బెల్ట్ ధరించకపోయినా, మద్యం సేవించి డ్రైవింగ్ చేసినా స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేసిన పద్ధతి వల్ల వెంటనే సదరు కుటుంబ సభ్యులకు మెసేజ్ వెళ్తుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా క్షణాల్లో తెలుస్తుంది. తద్వారా ప్రమాదం జరిగి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చును. దీనిని కేవలం రూ.4 వేల వ్యయంతో రూపొందించారు. చదువుతో పాటు ప్రయోగాలు మా కళాశాలలో విద్యనేర్చుకోవడంతో పాటు సరికొత్త అంశాలపై ప్రయోగాలను చేస్తున్నాం. దీని ద్వారా కేవలం ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూడనవసరం లేకుండా సొంతంగా చిన్న కంపెనీ ఏర్పాటు చేసుకుని మరొక పదిమందికి ఉపాధి అవకాశం కల్పించవచ్చును. –జి.సుప్రియ, ఈసీఈ విద్యార్థి కళాశాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది కళాశాలలో విద్యాబోధనతో సమానంగా వివిధ రకాల ప్రాజెక్టుల రూపకల్పనకు యాజమాన్యం ఎంతగానో అవకాశం కల్పిస్తోంది. సొంతంగా ప్రాజెక్టులు తయారు చేయడం వల్ల చదువు పూర్తయిన తరువాత వివిధ ఆంశాలపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఉద్యోగంలో చేరినా కష్టం లేకుండా పనిచేసుకునే అవకాశం ఉంటుంది. –పి.నిర్మల, విద్యార్థిని మాలో మాకే పోటీ ప్రాక్టికల్స్ వల్ల ఎక్కువ ప్రయోజనం బట్టిపట్టే విద్యకంటే ప్రాక్టికల్స్ ద్వారా ఎక్కువ విజ్ఞానాన్ని గ్రహించవచ్చు. మా కళాశాలలో వివిధ రకాల ప్రాజెక్టులను తయారు చేసే విద్యార్థులకు మంచి ప్రోత్సహం లభిస్తోంది. అందువల్లనే తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ఉపయోగకకరంగా ఉండే వివిధ రకాల ప్రాజెక్టుల తయారీలో విద్యార్థులం పోటీ పడుతున్నాం. –సీహెచ్ సంతోష్, విద్యార్థి -
ధరాభారానికి ఆన్లైన్ ‘ఔషధం’!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గ్రోసరీలు, ఇతర వస్తువుల విషయంలో ఈ–కామర్స్ లావాదేవీలు పెరుగుతున్నట్టే... ఫార్మసీ రంగంలోనూ ఆన్లైన్ లావాదేవీలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. వచ్చే నాలుగేళ్లలో... అంటే 2023 నాటికి దేశీయంగా ఈ–ఫార్మసీల మార్కెట్ 18.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుందనేది కన్సల్టెన్సీ సంస్థ ఈవై (ఎర్నస్ట్ అండ్ యంగ్) అంచనా. స్మార్ట్‌ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, ప్రాణాంతక వ్యాధులు.. వైద్య చికిత్స వ్యయాలు ఎక్కువవుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం కానున్నాయని ఈవై అభిప్రాయపడింది. ఈ నివేదిక మేరకు... ప్రస్తుతం ఈ–ఫార్మా సంస్థలకు అందు బాటులో ఉన్న మార్కెట్ పరిమాణం సుమారు 9.3 బిలియన్ డాలర్లు. ఇది వార్షికంగా 18.1% వృద్ధి చెందుతోంది. ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరుగుతుండటం.. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా ఔషధాలను సులభతరంగా ఆర్డరు చేయగలుగుతుండటం వంటి అంశాలు ఈ–ఫార్మా మార్కెట్ వృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రాణాంతక వ్యాధులు, తలసరి ఆదాయం, వైద్య చికిత్స వ్యయాలు పెరుగుతుండటం సైతం ఈ–ఫార్మసీ మార్కెట్‌కు తోడ్పడుతోంది. ‘మొబైల్స్ వినియోగం పెరగటం, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు మెరుగుపడటం వంటి అంశాలతో భారత్‌లో ఈ–కామర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. దీంతో ఈ–కామర్స్‌లో భాగమైన ఆన్లైన్ ఫార్మసీలకు క్రమంగా ప్రాచుర్యం పెరుగుతోంది. వీటికి గణనీయమైన వృద్ధి అవకాశాలున్నాయి‘ అని ఈవై ఇండియా పార్ట్నర్ (ఈ–కామర్స్ అండ్ కన్జూమర్ ఇంటర్నెట్ విభాగం) అంకుర్ పహ్వా చెప్పారు. ప్రభుత్వ వ్యయాల తోడ్పాటు.. వైద్యంపై ఇటు ప్రభుత్వం అటు ప్రజలు చేసే వ్యయాలు గణనీయంగా పెరుగుతుండటం వచ్చే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ మార్కెట్ మరింతగా విస్తరించేందుకు దోహదపడనుందని ఈవై తెలిపింది. ప్రస్తుతం దేశీయంగా 35 శాతం ఫార్మా మార్కెట్ ప్రాణాంతక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఔషధాలది కాగా మిగతా 65 శాతం.. తీవ్ర అనారోగ్యాలకు సంబంధించినదిగా ఉంటోంది. ప్రాణాంతక వ్యాధుల ఔషధాల మార్కెట్లో 85 శాతం వాటాను, తీవ్ర అనారోగ్యాల ఔషధాల మార్కెట్లో 40 శాతాన్ని ఈ– ఫార్మసీలు లక్ష్యంగా చేసుకోవచ్చని నివేదిక సూచించింది. స్థానిక ఫార్మసీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని నేరుగా ఇంటి దగ్గరకే ఔషధాలను అందించగలగడం ఈ– ఫార్మసీలకు దోహదపడవచ్చని పేర్కొంది. ఈ–ఫార్మా కంపెనీలు భారీమొత్తంలో డిస్కౌంట్లు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. లాభనష్ట రహిత స్థితికి రావాలన్నా, అర్థవంతమైన లాభాలు చూడాలన్నా డిస్కౌంట్లు సముచిత స్థాయిలకు రావాల్సిన అవసరం ఉందని నివేదిక వివరించింది. అంతర్జాతీయ సంస్థల దూకుడు.. రాబోయే రోజుల్లో ఈ–ఫార్మా వ్యాపార విభాగంలో అంతర్జాతీయ ఈ–కామర్స్ సంస్థలు మరింత దూకుడుగా కార్యకలాపాలు విస్తరించవచ్చని ఈవై నివేదిక వివరించింది. అంతర్జాతీయ అనుభవం, దేశీయంగా వివిధ విభాగాల్లో కార్యకలాపాలు ఉండటం వాటికి తోడ్పడగలదని పేర్కొంది. ఫిన్‌టెక్, హెల్త్‌టెక్ సంస్థలు కూడా ఈ విభాగంలోకి ప్రవేశించి తమ సేవల పరిధిని మరింతగా విస్తరించడానికి వీలుందని వివరించింది. డెలివరీ వ్యవస్థను మరింత మెరుగ్గా వినియోగించుకునేందుకు హైపర్‌లోకల్ సంస్థలు (ఫుడ్ టెక్, నిత్యావసరాల విక్రయ సంస్థలు, కేవలం డెలివరీ మాత్రమే చేసే సంస్థలు) కూడా ఈ–ఫార్మా విభాగంపై దృష్టి పెట్టొచ్చని పేర్కొంది. -
‘పవర్’పై పన్ను!
ఖమ్మంమయూరిసెంటర్: విద్యుత్ వినియోగదారులపై పిడుగు పడింది. వస్తు సేవా పన్ను(జీఎస్టీ) రూపంలో ప్రభుత్వం భారం మోపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీని విద్యుత్ మీటర్లపై కూడా వసూలు చేస్తోంది. పల్లె, పట్నం, పేద, ధనిక తారతమ్యం లేకుండా అన్ని వర్గాలకు 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు. కొత్త మీటర్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే.. లేదంటే వారి దరఖాస్తుకు మోక్షం కలగదు. జీఎస్టీ అమలులోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారులపై వస్తు సేవా పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి నెల నుంచి వినియోగదారులకు వేసే విద్యుత్ బిల్లులో వస్తు సేవా పన్నును కలుపుతున్నారు. అలాగే కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకున్న వారికి ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కూడా కలిపి వడ్డించారు. ఇన్నాళ్లూ విద్యుత్ శాఖకు మినహాయింపు ఉందనుకుని జీఎస్టీ వసూలు చేయని విద్యుత్ సంస్థ.. ఇప్పుడు జిల్లావ్యాప్తంగా ఉన్న వినియోగదారుల నుంచి వసూలు చేయబోతోంది. జీఎస్టీ అమలైన సమయంలో విద్యుత్ శాఖకు మినహాయింపు అవకాశం ఉంటుందనే సమాచారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుంచి పన్ను వసూలు చేయలేదు. జిల్లావ్యాప్తంగా 2017, జూలై 1 నుంచి 2018, డిసెంబర్ 31వ తేదీ వరకు కొత్తగా 18,322 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. వారికి ఇన్నాళ్లూ కొత్త కనెక్షన్లు తీసుకోవడంపై జీఎస్టీ విధించలేదు. వాళ్లందరికీ ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లులో జీఎస్టీని జమ చేశారు. బిల్లుతోపాటు మరో 18 శాతం పన్ను వసూలు చేయబోతున్నారు. పన్ను ఇలా.. గృహ వినియోగం కోసం తీసుకున్న 240 వాట్స్ సామర్థ్యానికి రూ.108, వెయ్యి కిలోవాట్స్ సామర్థ్యమున్న వాటికి రూ.216, వాణిజ్య కనెక్షన్లలో కిలో(1000) వాట్స్ సామర్థ్యమున్న వాటికి రూ.225 చొప్పున అదనంగా ఈ నెల బిల్లులో వేశారు. మీటరు సామర్థ్యం పెరిగేకొద్దీ రుసుము పెరుగుతూ పోతుంది. జిల్లావ్యాప్తంగా రూ.75,17,000 వినియోగదారులపై సేవా పన్ను భారం పడుతోంది. కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద నామమాత్రపు రుసుముతో ఇస్తున్న కనెక్షన్లకు మాత్రం జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. 2017, జూలై 1వ తేదీ నుంచి 2018, డిసెంబర్ 31 వరకు జిల్లాలో వినియోగదారులు 18,322 కొత్త కనెక్షన్లు తీసుకున్నారు. ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫిబ్రవరి విద్యుత్ బిల్లులో జీఎస్టీని జమ చేశాం. ఇందులో శాఖాపరంగా ఎలాంటి ప్రమేయం లేదు. వినియోగదారులు ఉపయోగిస్తున్న విద్యుత్ సామర్థ్యాన్నిబట్టి జీఎస్టీ ఉంటుంది. జూలై 2017 నుంచి కొత్త కనెక్షన్లు తీసుకున్న వినియోగదారులకు ఫిబ్రవరి బిల్లులో జీఎస్టీని కలిపి బిల్లు వేస్తాం. – కె.రమేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ, ఖమ్మం సర్కిల్ -
బిల్లు కట్టండి
మెదక్‌జోన్: విద్యుత్ బకాయిల వసూళ్ల కోసం ట్రాన్స్‌కో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బకాయిలు పడ్డవారు వెంటనే చెల్లించాలని లేనిచో కనెక్షన్లు తొలగిస్తామంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆటోల్లో ఊరూర ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో 1,58,516 నివాస గృహాలకు కనెక్షన్లు ఉండగా ఇందుకు సంబంధించి సుమారు ఏడాదిగా రూ. 18.81 కోట్లు బకాయి ఉంది . అలాగే జిల్లాలో అధికారికంగా 89,312 వ్యవసాయానికి కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి నాలుగు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా రూ. రూ. 13 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. ఇళ్లకు, వ్యవసాయ బోరుబావులకు సంబంధించి మొత్తం జిల్లాలో రూ 31.81 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని ఎలాగైన వసూళ్లు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బకాయిలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండటంతో వాటిని చెల్లించాలని గ్రామాల్లో చాటింపును సైతం వేస్తున్నారు. వినియోగదారులు నెలనెల సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే నెలదాటితే ఆ బిల్లుపై అదనంగా రూ. 20 ఫైన్‌వేస్తున్నారు. గతంలో సకాలంలో బిల్లులు కట్టని వినియోగదారులకు అస్సలుకు వడ్డీ, చక్రవడ్డీలను సైతం వేసే వారు ప్రస్తుతం సకాలంలో చెల్లించని వారికి కేవలం రూ. 20 ఫైన్ మాత్రమే వేస్తున్నారు. దీంతో బకాయిలు పడ్డా విద్యుత్‌వినియోగదారులకు ఎంతోలాభం చేకూరుతోంది. వ్యవసాయానికి రోజుకో రూపాయి.. 2004 సంవత్సరం నుంచి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించారు. నాటినుంచి నేటివరకు అన్నదాతలను ఆదుకునే బృహత్తర పథకంలో ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. 24 గంటలపాటు వ్యవసాయినికి ఉచిత విద్యుత్‌ను వాడుకున్నా రోజుకొక్క రూపాయిచొప్పున నెలకు రూ. 30 చొప్పున సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 89,312 వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఉండగా నెలకు రూ. 26,79,360 రూపాయలను వినియోగదారులు సంబంధిత ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంటోంది. కాగా ఒక్కోబోరుకు నెలకు రూ. 30 రూలు చెల్లించాల్సి ఉండగా సకాలంలో చెల్లించకుండా ఒక్కరోజు ఆలస్యం చేసినా ఫైన్‌కింద రూ. 25 చెల్లించాల్సిన పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించి మొత్తం రూ. 13 కోట్లు బకాయిలు ఉన్నాయి. వ్యవసాయ పంపుసెట్లకు రోజుకో రూపాయి చొప్పున నామమాత్రపు బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఇళ్లకు మాత్రం వినియోగించినంత చెల్లించాల్సిందే. 0–50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.45 , 51–100 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ. 2.60, 100–200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్‌కు రూ.4.30 చొప్పున చెల్లించాల్సి ఉంటోంది. వ్యవసాయం, ఇళ్లకు సంబంధించిన మొత్తం బకాయిలు రూ. 31.81 కోట్లు ఉంది. వీటిని ఎలాగైనా వసూలు చేయాలనే ఉద్దేశంతో నిత్యం ఊరూర ఆటోల్లో తిరుగుతూ బిల్లులు చెల్లించాలని లేనిచో సర్వీస్ వైర్‌ను తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచితం... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఇళ్లకు 0–50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు. 50 యూనిట్లు దాటితే అందరిలాగా బిల్లులు చెల్లించాల్సిందే. కాగా పరిమితి మేరకు మాత్రమే ఉచితంగా ఇస్తుండగా విషయం తెలియని చాలామంది ఎస్సీ, ఎస్టీలు పూర్తిగా తమకు విద్యుత్ ఉచితంగా వస్తుందంటూ పరిమితి దాటాక సైతం బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్లకు కరెంట్ బిళ్లులు పేరుకపోతునట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ విషయాన్ని సంబంధిత అధికా>రులు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అర్థమైయ్యేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే చెల్లించండి జిల్లాలో విద్యుత్తుశాఖకు బకాయిలు పడిన వినియోగదారులు వెంటనే బిల్లులు చెల్లించండి. వ్యవసాయ పంపు సెట్లు, ఇళ్ల బిళ్లులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా రూ.31.81 కోట్లు బకాయిలు పేరుకపోయాయి. వాటిని వెంటనే చెల్లించాలి. లేచినో సర్వీస్ కనెక్షన్లను తొలగించాల్సి ఉంటుంది. విద్యుత్ వినియోగదారులు సహకరించి బిల్లులు వెంటనే చెల్లించాలి. –శ్రీనాథ్, ఈఈ, ట్రాన్స్‌కో మెదక్ -
'పండగ' చేస్కో!
సాక్షి, హైదరాబాద్: పండుగ వస్తుందంటే చాలు ఆన్లైన్ ఆఫర్ల కోసం నగర యువత ఎదురుచూస్తోంది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు చేసిన తరువాతే కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద పండుగలైన దసరా.. దీపావళి.. ఆన్లైన్ సేల్స్ ఊపందుకున్నాయి. నచ్చిన వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేయడంలో గ్రేటర్ సిటిజన్లు ముందుంటున్నారు. స్మార్ట్ జనరేషన్గా మారుతోన్న యువత ఈ విషయంలో అగ్రభాగాన నిలుస్తున్నారు. ప్రధానంగా 18–35 వయసున్న వారు సుమారు 90 శాతం ఆన్లైన్ కొనుగోళ్లకు మక్కువ చూపుతున్నట్లు అసోచామ్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇక స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఆన్లైన్లో వస్తువులు కొనేవారి సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తోందని అసోచామ్ పేర్కొంది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా పలువురు నెటిజన్ల అభిప్రాయాలను సేకరించి అధ్యయన వివరాలను వెల్లడించింది. ఈసారి దేశవ్యాప్తంగా దసరా, దీపావళి సందర్భంగా సుమారు 15 మెట్రో నగరాల్లో ఆన్లైన్ ఈ కామర్స్ సేల్స్ సుమారు 30 వేల కోట్ల మేర జరిగే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఇక ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడానికి స్మార్ట్‌ఫోన్ వినియోగం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడమే కారణమని అసోచామ్ అభిప్రాయపడింది. వీటిని కొనేందుకు ఆసక్తి... మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, బ్రాండెడ్ షూస్, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, గృహోపకరణాలు తదితరాల ఆన్లైన్ కొనుగోలుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. వీటిల్లోనూ ప్రధానంగా మొబైల్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను 78 శాతం మేర కొనుగోలు చేస్తున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. పండుగ ఆఫర్స్, నిర్ణీత సమయాల్లో బుక్‌చేస్తే భారీ తగ్గింపు ధరలు, వన్ ప్లస్ వన్ ఆఫర్లు, ధమాకా సేల్స్‌తో సుమారు 20 ఈ కామర్స్ సంస్థల సైట్లకు ఈసారి వ్యాపార సేల్స్ పంట పండించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మెట్రో నగరాల్లో ఈ–కామర్స్ ఫుల్... దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలతోపాటు అహ్మదాబాద్, పుణే, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, నాగ్‌పూర్, ఇండోర్, కోయంబత్తూర్, విశాఖపట్నం లాంటి నగరాల్లో ఈ–కామర్స్ జోరు కనిపిస్తోందని పేర్కొంది. ఈ మెట్రో నగరాల్లోనూ ఏటా 60 నుంచి 65 శాతం మేర ఆన్లైన్ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పురుషులే అధికం.. : ఈ అధ్యయనం ప్రకారం.. ఆన్లైన్ కొనుగోళ్లలో పురుషులదే పైచేయి అని తేలింది. వీరి వాటా 65 శాతం ఉండగా.. స్త్రీలు 35 శాతం మంది ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నారు. ఇక పండుగ సీజన్లో 18–35 మధ్య వయసున్న స్త్రీ, పురుషులే అధిక భాగం ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు అంచనా వేసింది. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
జస్ట్ క్లిక్..స్విచ్ ఆఫ్
ఉరుకుల పరుగుల జీవితం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకుపరుగులు తీసే వేళ. ఇళ్లల్లో ఫ్యాన్లు, ఏసీలు, విద్యుత్ పరికరాలుఒకొక్కసారి అలాగే వదిలేసి వెళ్లిపోతుంటారు. ఆఫీస్ నుంచివచ్చాక అయ్యో..ఎంత కరెంట్ వృథానో అని బాధపడుతుంటారు. విద్యుత్ మోటార్లు కట్టేందుకు అర్ధరాత్రి వేళల్లో కునికి పాట్లుపడుతూ రైతులు పొలాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. ఒక్కోసారి చీకట్లో విద్యుదాఘాతానికి గురై ప్రమాదాలబారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలకువాసవి ఇంజినీరింగ్ విద్యార్థులు చెక్ పెట్టారు. ఎక్కడి నుంచైనాఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ ఆన్ అయ్యేందుకు ఓ పరికరాన్ని రూపొందించారు. దాని సంకేతాలతో స్మార్ట్ ఫోన్ సాయంతోఎక్కడి నుంచైనా స్విఛ్ ఆఫ్ ఆన్ చేసి చూపించి పలువురి ప్రశంసలందుకుంటున్నారు. వీరు రూపొందించిన పరికరంపైప్రత్యేక కథనం.. పెడన: గృహాల్లోను, కార్యాలయాల్లో, పరిశ్రమలలో వినియోగించే వివిధ రకాల ఎలక్ట్రికల్ మోటార్లు, లైట్లు, ఫ్యాన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు తదితర వాటిని మనిషి ద్వారానే నియంత్రించే పరిస్థితి. ఒక్కో సమయంలో వీటి ద్వారా విద్యుదాఘాతానికి గురై ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాలం ద్వారా వీటిని నియంత్రిం చేలా మండలంలోని శ్రీ వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నాలుగో సంవత్సరం ఈఈఈ చదువుతున్న విద్యార్థులు ఎలక్ట్రికల్ వస్తువులను ఎక్కడ నుంచైనా నియంత్రించేలా పరికరాన్ని కనిపెట్టారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా ఇండస్ట్రీ, హోమ్ ఆటోమిషన్ అనే ప్రాజెక్టును రూపొందించారు. ఎస్.రామ్‌గణేష్, సి. లీలాసాయికుమార్, ఎంబీఎల్ నారాయణ, జెఎస్ నరేష్ ఒక బృందంగా ఏర్పడి నాలుగు నెలలు శ్రమించి దీనిని రూపొందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పి. హేమంత్‌కుమార్ పర్యవేక్షణలో హెచ్‌వోడీ బి. జ్యోతిలాల్ నాయకత్వంలో దీనిని రూపొందించి పరీక్షించారు. విద్యార్థులు రూపొందించిన ఈ పరికరాన్ని కళాశాల కార్యదర్శి మెహర్‌బాబా, కరస్పాండెంటె కాకి కుమార్బాబా, డైరెక్టర్లు సాయికుమార్, దోసపాటి బాబా, ప్రిన్సిపాల్ ఏబీ శ్రీనివాసరావులు పరిశీలించి అబ్బురపడి విద్యార్థులను మరింత ప్రోత్సహించారు. ఇలా చేశారు... ఈ పరికరంలో ఆర్టీనో మిని, వైఫై మాడ్యుల్స్, బ్లింక్ యాప్, ట్రాన్స్ఫార్మర్, బ్రిడ్స్రెక్టిఫైర్, కెపాసిటర్, ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించారు. ఆర్టినోమిని అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. దీనిని ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రించడానికి ఉపయోగించారు. దీనికి అనుసంధానం చేసే ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్, ఆఫ్ చేయవచ్చు. వైఫై మాడ్యుల్స్ ద్వారా వచ్చే అంతర్జాలం ఆర్టీవో మిని ఎలక్ట్రిక్ పరికరం, బ్లింక్యాప్ను అనుసంధానం చేస్తోంది. బ్లింక్ యాప్ అప్లికేషన్‌ను ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా మొబైల్ నుంచి ఇచ్చే సందేశాలకు అనుగుణంగా ఆర్టీవో మిని పరికరానికి అనుసంధా నమైన ప్రతి ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను నియంత్రించవచ్చు. 230/5 కెపాసిటీ గల ట్రాన్స్ఫార్మర్ అందుబాటులో ఉన్న 230 వాట్స్ వోల్టెజిని 5 వాట్స్ వోల్టెజిగా తగ్గించి సరఫరా చేస్తోంది. బ్రిడ్జిరెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకున్న ఏసీ విద్యుత్‌ను డీసీగా మార్చుతుంది. కెపాసిటర్ విద్యుత్‌లోని హెచ్చతగ్గులను తొలగించి సమాంతర విద్యుత్‌ను ఆర్టీవోమినికి, వైఫై మాడ్యుల్స్కు అందిస్తుంది. నాలుగు నెలలు...రూ.4వేలు ఖర్చు చిన్నప్పుడు న్యూస్పేపర్లలో విద్యుదాఘాతంతో చనిపోయినవారి గురించి చదివాం. వ్యవసాయ సమయంలో విద్యుత్ మోటార్లు వేయడం, ఆఫ్ చేయడం వల్ల రైతులు చనిపోయిన సంఘటనల గుర్తుకు వచ్చాయి. సులువుగా ఎటుంటి విద్యుదాఘాతానికి గురికాకుండా ఎక్కడ నుంచైనా ఆన్, ఆఫ్ చేసేలా పరికరం రూపొందించాలని నిర్ణయించి అసిస్టెంట్ ప్రొఫెసర్ హేమంత్‌కుమార్‌కు తెలిపాం. ఆయన,హెచ్‌వోడీ, కళాశాల యాజమాన్యం ఇచ్చిన ప్రొత్సాహంతో దీనిని కనిపెట్టాం. ఈ పరికరం వల్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా విద్యుత్ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. – రామ్‌గణేష్, నారాయణ, లీలాసాయికుమార్, నరేష్ మరిన్ని ప్రయోగాలు విద్యార్థులు రూపొందించిన అంతర్జాలం ద్వారా విద్యుత్ పరికరాలను నియంత్రించేలా చేసిన ప్రయోగం బాగుంది. ఇలాంటి ప్రయోగాలతో విద్యార్థులను మరింత ప్రోత్సహిస్తే వీటిల్లోనే మరింత రాణించేలా సహాయసహకారాలు అందించడానికి మేం ఎప్పుడూ సిద్ధమే. విద్యార్థుల ప్రయోగాలకు కళాశాల యాజమాన్యం కూడా ముందుండి తోడ్పాటును అందిస్తోంది. – డాక్టర్ ఎబి శ్రీనివాసరావు,కళాశాల ప్రిన్సిపాల్ -
ఎలక్ట్రానిక్ రుజువులకు ధ్రువీకరణ తప్పనిసరికాదు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భంగా పరిగణనలోకి తీసుకునే ఎలక్ట్రానిక్ ఆధారాలకు ధ్రువీకరణ తప్పనిసరి కాదని, న్యాయబద్ధంగా ఉందని కోర్టులు భావిస్తే విశ్వాసంలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని 65బీపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన వివరణ కోర్టుల్లో నేర విచారణ తీరుపై ప్రభావం చూపనుంది. దీంతో సీడీలు, మొబైల్ వీడియో రికార్డులు, ఫోన్ కాల్‌డేటా, సీసీటీవీ ఫుటేజీల వంటి ఎలక్ట్రానిక్ రుజువులను కోర్టులు ప్రభుత్వ అధికారి ధ్రువీకరణ లేకున్నా పరిశీలించవచ్చు. అయితే, ఈ రికార్డులను సమర్పించే వ్యక్తి బాధ్యతాయుత పదవిలో ఉన్న అధికారై ఉండాలని జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ యు.యు.లలిత్‌ల బెంచ్ పేర్కొంది. -
ఆధార్ ఓ ఎలక్ట్రానిక్ పగ్గం
న్యూఢిల్లీ: ఆధార్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిదనీ, జంతువులను తాళ్లతో కట్టేసినట్లు ప్రభుత్వం ఆధార్‌తో ప్రజలను బంధిస్తోందని న్యాయవాది శ్యాం దివన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్లపై బుధవారం విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరఫున శ్యాం వాదనలు వినిపించారు. ‘ఆధార్ ఒక ఎలక్ట్రానిక్ పగ్గం లాంటిది. ఇది సెంట్రల్ డేటాబేస్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. పౌరుల రోజువారీ కార్యకలాపాలను, అలవాట్లను గమనించే అవకాశం ఇవ్వడం ద్వారా మెల్లగా ప్రజల్లో అసమ్మతిని అణచివేసి, ప్రభుత్వానికి అనుకూలంగా వారి ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. ప్రతి దానికీ ఆధార్‌ను లింక్ చేయడం వల్ల ఏ పని చేయాలన్నా అది అవసరమవుతుంది. ఆధార్ నంబర్ లేకుండా బతకలేమనే స్థితి వస్తుంది. అప్పుడు ప్రభుత్వంలోని వారికి ఎవరిపైనైనా ఆగ్రహం వస్తే వారి ఆధార్ నంబర్‌ను స్విచాఫ్ చేస్తే చాలు. సామాజికంగా ఆ వ్యక్తి మరణించినంత పనవుతుంది. ఇలా ఇది ప్రజల్లో అసమ్మతి అనేదే లేకుండా చేస్తుంది’ అంటూ శ్యాం వాదించారు. తదుపరి వాదనలు గురువారం కొనసాగనున్నాయి. -
తక్కువ ధర ఆశ చూపి దగా
నరసరావుపేటటౌన్: తక్కువ ధరకు తమ సంస్థ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తుందని నమ్మబలికి ఓ ప్రముఖ సంస్థ ప్రతినిధి వ్యాపారులు, ప్రజలను దోచుకున్న ఘటన ఆదివారం వెలుగుచూసింది. లక్షల రూపాయలు చెల్లించిన వినియోగదారులు ఎన్నిరోజులైనా వస్తువులు రాకపోవడంతో చివరకు మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు, వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు రోడ్డులోని రిలయన్స్ జియో స్టోర్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రామ్ ప్రసాద్ తమ సంస్థ తక్కువ ధరకు ఏసీలు, రిఫ్రిజిరేటర్స్, సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, డేటా కేబుల్ ఇస్తుందని తెలుపడంతో నమ్మిన వినియోగ దారులు, పలు వ్యాపార నిర్వాహకులు నగదు చెల్లించి రశీదులు పొందారు. అయితే రోజులు గడుస్తున్నా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు రాకపోవడంతో ఈ విషయంపై మేనేజర్‌ను ఆడుగగా, ఆయన కాలయాపన చేస్తూ వస్తున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమర్లు ఆరా తియ్యగా సంస్థకు డబ్బులు చెల్లించలేదని తెలుసుకున్నారు. దీంతో పాటు ఇచ్చిన రశీదు కూడా నకిలీదని తెలుసుకొని బెంబేలెత్తిపోయారు. దీంతో అతన్ని పట్టుకొని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రూ.10 లక్షల వరకు వసూలు సుమారు 15 మంది కస్టమర్ల వద్ద పదిలక్షల రూపాయల వరకు వసూలు చేశారు. పట్టణంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ దుకాణ నిర్వాహకుడు రూ.5 లక్షలకు పైగా నగదు చెల్లించినట్లు తెలిసింది. అయితే కంపెనీ నిబంధనల ప్రకారం కస్టమర్లకు మాత్రమే తక్కువ ధరకు విక్రయించాల్సిన గృహోపకరణాలు, సెల్ఫోన్లు రిటైల్ వ్యాపారులకు బిల్లులు లేకుండా విక్రయించేందుకు బేరం కుదుర్చుకొని నగదు తీసుకున్నట్లు తెలియవచ్చింది. ఇలా రశీదు లేకుండా కొన్న కారణంగా కేసు పెట్టేందుకు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. ఈ విషయంపై సీఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా కొంతమంది కస్టమర్లు డబ్బులు చెల్లించినా రిఫ్రిజిరేటర్స్, సెల్ఫోన్లు ఇవ్వడంలేదని రిలయన్స్ జియో స్టోర్ మేనేజర్‌పై ఫిర్యాదు చేశారన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
మైక్రోవేవ్ ఓవెన్ భగ్గుమంటే...!
ఇంట్లో ఉన్నట్టుండి.. మీ గ్యాస్ స్టౌ భగ్గుమని వెలిగిందనుకోండి! ఎలా ఉంటుంది? ఏ దెయ్యమో.. భూతమో చేరిందని కొందరు అను కుంటారుగానీ.. ఈ కాలంలో అవేవి అవసరం లేదు. కేవలం ఇంటర్నెట్కు అనుసం ధానమైన ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే చాలు. సరిగ్గా ఇదే తరహాలో ఈ మధ్య ఓ కంపెనీకి చెందిన మైక్రోవేవ్ ఓవెన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం కారణంగా అవి కాస్తా భగ్గుమంటున్నాయంట! ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మైక్రోవేవ్ ఓవెన్లను తమ నియంత్రణలోకి తెచ్చేసుకున్నారు. ఇంకేముంది.. హ్యాకర్లు ఎప్పుడు కావా లంటే అప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మైక్రోవేవ్ ఓవెన్లను ఆన్/ఆఫ్ చేయడం లేదంటే.. ప్రీహీట్ చేయడం హ్యాకర్లకు వీలైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇలా జరిగితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. వేడి ఎక్కువైతే అగ్ని ప్రమాదం కూడా జరగవచ్చు. అంతేనా ఆటోమేటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లలోని కెమెరాలతో హ్యాకర్లు మీ ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని రహస్యంగా గమనిం చేందుకూ వీలేర్పడింది. మరి నిజంగా ఇలా జరిగిందా? స్పష్టంగా తెలియదుగానీ.. చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అనే సంస్థ ఈ లోపాన్ని పసిగట్టింది. సదరు కంపెనీని అప్రమత్తం చేసింది. దీంతో తాము నెల రోజుల క్రితమే సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దామని కంపెనీ తెలిపింది. గత ఏడాది దాదాపు 8 కోట్ల స్మార్ట్ హోమ్ పరికరాలు అమ్మిన ఈ కంపెనీ వినియోగదారులందరూ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. హమ్మయ్యా.. గండం గడిచిందన్నమాట! -
ఆకతాయిలకు షాక్
మృగాళ్ల అకృత్యాలకు ఎందరో అతివలుబలవుతున్నారు. దేశంలో ఏదో ఒక చోట రోజూ అత్యాచారాలు, మహిళలపై దాడులుజరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆ యువశాస్త్రవేత్తలో ఆలోచనలు రేకెత్తించాయి. మహిళా భద్రతకు ఏదైనా చేయాలనే సంకల్పాన్నికల్పించాయి. నిర్భయ ఘటనను చూసి చలించిన ఆ యువకుడు... రెండేళ్లు శ్రమించి ‘ఎలక్ట్రో షూ’లను రూపొందించాడు.ఆకతాయిలు మహిళలపై దాడికి పాల్పడినప్పుడు ఈ షూల ద్వారా షాక్ రావడంతో పాటు...పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. ఈ పరికరం, తన పరిశోధన గురించి నగరానికి చెందిన సిద్ధార్థ్ మందల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... నాకు 12 ఏళ్లున్నప్పుడు నిర్భయ ఘటన జరిగింది. నిరసన ర్యాలీల్లో అమ్మతో పాటు నేనూ పాల్గొన్నాను. అప్పుడు మనసులో ఒకటే ఆలోచన... ఈ ఘోరం మనవాళ్లలో ఎవరికైనా జరిగితే? ఆ ఆలోచన చాలా రోజులు వెంటాడింది. అప్పుడే లక్ష్యం నిర్దేశించుకున్నాను. మహిళా భద్రతకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా ఆలోచనకు అనుగుణంగా స్నేహితుడు అభిషేక్ సహాయంతో ఈ ఎలక్ట్రో షూలను తయారు చేశాను. ఆటోమేటిక్ చార్జింగ్.. అలర్ట్ మెసేజ్ పీజోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఆధారంగా సర్క్యూట్ బోర్డులను తయారు చేసి ఈ షూలలో అమర్చాను. వీటిని ధరించిన మహిళలపై ఎవరైనా దాడికి పాల్పడితే.. వాటి ద్వారా 0.1 ఆంపియర్ షాక్ వస్తుంది. అదే సమయంలో పోలీసులు, బంధువులకు అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. నడుస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఇవి చార్జింగ్ అవుతాయి. రెండేళ్ల శ్రమ... ఈ షూలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డాం. సోషల్ మీడియా ద్వారా చాలా మంది గైడ్లను కాంటాక్ట్ చేశాను. వివిధ భాషల్లో ప్రోగ్రామింగ్ చేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు కరెంట్ షాక్‌లు తగిలాయి. ఓసారి నా స్నేహితుడికి గాయమైంది. ఏదైతేనేం అనేక ప్రయత్నాల అనంతరం ఫలితం వచ్చింది. రెండేళ్ల తర్వాత నా ప్రయోగం సక్సెస్ అయింది. ఈ షూలు కొందరి జీవితాలు కాపాడినా చాలు. ఎలక్ట్రో షూతో పాటు పోర్టబుల్ వాటర్ ప్యూరిఫయర్నూ రూపొందించాను. మిత్రులతో కలిసి ‘కాగ్నిజెన్స్ వెల్ఫేర్ ఇనిషియేటివ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఎన్నో చర్చలు.. సెషన్స్ వేసవి సెలవుల్లో డాక్టర్ ఏఎస్ కుమార్ దగ్గర ఇంటర్న్‌షిప్ చేశాం. జెనోమిక్స్, ప్రొటీన్, మలిగ్నంట్ మెలనోమా పనితీరుపై.. పోలరైజ్డ్ లెన్సెస్ సహాయంతో చర్మ కణాల తీరులో తేడాలు గుర్తించాను. అప్పుడే చిత్రాల ద్వారా కంప్యూటర్లో ఈ తేడాను గుర్తించే అవకాశం ఉందా? అని ఆలోచించాను. ప్రణీత్, నేను ట్రై చేయగా వర్కవుట్ అవుతుందనిపించింది. ఇక డాక్టర్‌తో అనేక చర్చలు, ప్రాక్టికల్ సెషన్స్ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కనిపెట్టాం. – సిద్ధార్థ్ స్కిన్ కేన్సర్ గుర్తించే సాఫ్ట్వేర్ ఎలక్ట్రో షూని కనిపెట్టిన సిద్ధార్థ్... స్నేహితుడు ప్రణీత్ షాతో కలిసి మరో ఆవిష్కరణకు బీజం పోశాడు. వీరిద్దరు కలిసి చర్మ కేన్సర్‌ను కనుగొనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్వేర్ చర్మ కేన్సర్ తొలి దశలో.. అంటే మలిగ్నంట్ మెలనోమాని గుర్తిస్తుంది. ఫోన్ కెమెరా సహాయంతో లైవ్ స్ట్రీమ్ చేస్తూ కంప్యూటర్లో కనిపించే ఫీడ్ ద్వారా అది కేన్సరో? కాదో? గుర్తించొచ్చు. ‘మాకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే దీన్ని కనిపెట్టే విషయంలో అపోలో హాస్పిటల్ డాక్టర్ ఏఎస్ కుమార్ అవగాహన కల్పించారు. ఖరీదైన పరికరాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో చర్మ కేన్సర్‌ను గుర్తించేందుకు ఇది ఉపయుక్తం’ అని చెప్పారు సిద్ధార్థ్. ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మారుస్తా.. – ప్రణీత్ షా కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ చదువుతున్నాను. ఓ సోషల్ ఇంటర్న్‌షిప్‌లో సిద్ధార్థ్‌ని కలిశాను. ఈ ప్రయోగంలో టెక్నికల్‌కు సంబంధించి నేను సహాయం చేశాను. ఏ ప్రాంతంలో అయినా వినియోగించే విధంగా సాధారణ మొబైల్, కంప్యూటర్ని ఒకే రూటర్కి కనెక్ట్ చేయాలి. దీనిని భవిష్యత్తులో ఇంటర్నెట్ మాడ్యూల్‌కి మార్చే ప్రయత్నం చేస్తాం. -
నకిలీ డీడీలతో దుకాణాలకు బురిడీ..
సాక్షి, హైదరాబాద్: దుకాణ యాజమానులను మోసం చేస్తున్న ఓ వ్యక్తి బాగోతం ఎట్టకేలకు బయటపడింది. నకిలీ అనే పదం ఎక్కువగా నేడు సమాజంలో వినపడుతుంది. అలాగే నకిలీ డీడీలను వాడుతూ విలువైన వస్తువులను కొనుగోలు చేస్తున్న ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్వర్ అలీ అనే వ్యక్తి హైదరాబాద్, ముంబై, బెంగళూరు నగరాలలో తిరుగుతూ నకిలీ డీడీలతో విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేవాడు. ఇతని మోసాలు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నారాయణగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోల్‌కతాకు చెందిన సర్వర్ అలీ అనే నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని నుంచి మూడు లాప్ టాప్‌లు, ఐదు సెల్ ఫోన్లు, రెండు ప్రింటర్లు, పలు నకిలీ డీడీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన అభిజిత్ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. -
మీ కదలికలతో చార్జింగ్!
వాషింగ్టన్: మీ ఫోన్లో చార్జింగ్ అయిపోయిం దా.. ఇకపై చార్జర్ కోసం వెతకాల్సిన పని లేదు.. కేవలం ఒక్కసారి లేచి అటూ ఇటూ తిరిగితే చాలు మీ ఫోన్ చార్జ్ అవుతుంది. ఎందుకంటే మనిషి కదలికలతోనే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జింగ్ అయ్యే సరికొత్త సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ఈ బృందంలో భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త ఉండటం విశేషం. బ్యాటరీ సాంకేతికతను ఆధారంగా చేసు కుని కేవలం పరమాణువుల మందంలో ఉండే పలుచటి బ్లాక్ ఫాస్ఫరస్ పొరలతో తయారు చేసి న ఈ వ్యవస్థ ద్వారా తక్కువ మొత్తంలో విద్యుత్ తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘భవిష్యత్తులో మన కదలికలతోనే మనమంతా ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కేంద్రాలుగా మారుతామని భావిస్తున్నాను’అని అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యారీ పింట్ పేర్కొన్నారు. కొత్త సాంకేతికతతో రెండు రకాల ప్రయోజనాలున్నాయన్నారు. విద్యు త్ను పుట్టించే పరికరం చాలా సన్నగా ఉంటుం దని, కనీసం బయటకు కన్పించకుండా దుస్తు ల్లోని పొరల్లో కూడా అమర్చొచ్చని చెప్పారు. చాలా చాలా తక్కువ కదలికల నుంచి కూడా విద్యుత్‌ను పుట్టించొచ్చని వివరించారు. భవిష్య త్తులో దుస్తులకు కూడా విద్యుత్ అందించొచ్చని, అంటే దుస్తుల రంగులు, డిజైన్లను స్మార్ట్‌ఫోన్ ద్వారా మార్చుకునే వీలు కలుగుతుందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతికి చెందిన నితిన్ మురళీధరన్ పేర్కొన్నారు. -
మోత మొదలు!
జీఎస్టీతో పెరిగిన వస్తువులు, సేవల ధరలు పెరిగిన పన్ను తక్షణమే అమల్లోకి.. - బాగా పెరిగిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్ల ధరలు - యథాతథంగా నిత్యావసరాలు - పన్ను తగ్గినా వస్తువుల ధరల్లో కనిపించని మార్పు - పాత స్టాక్ అంతా ఇంకా పాత రేట్లకే విక్రయిస్తున్న వ్యాపారులు - ఏసీ హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లుల మోత - అల్పాహారంపైనా ధరలు పెంచేసిన వైనం - బంగారం వ్యాపారంపై పెద్దగా పడని ప్రభావం - హైదరాబాద్ వ్యాప్తంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన - జీఎస్టీ కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాని వ్యాపారులు - పలు వర్గాలకు ఆనందం.. మరికొన్ని చోట్ల నిరసనలు సాక్షి, హైదరాబాద్: జనంపై జీఎస్టీ మోత మొదలైంది.. శనివారం నుంచి అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను మార్కెట్లో వస్తువుల ధరలపై ప్రభావం చూపింది. అత్యధిక శాతం పన్ను శ్లాబ్‌లలో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, కాస్మెటిక్స్, ఫోన్ల ధరలు, వినోద రంగానికి చెందిన సేవల చార్జీలు భారీగా పెరిగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే బిల్లుల రూపంలో ఆ భారం స్పష్టంగా కనిపించింది. ఇంటింటా వినోదాన్ని పంచే టీవీ దగ్గర నుంచి దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగిన పన్ను మేరకు కొత్త ధరలను ప్రకటించాయి. మరోవైపు ధరలు తగ్గుతాయని భావించిన నిత్యావసర వస్తువులు, ఆటోమొబైల్, మందుల ధరల్లో మార్పులేమీ కనిపించలేదు. వ్యాపారులంతా పన్ను తగ్గే వస్తువులన్నింటినీ కూడా పాత ధరలకే విక్రయించారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలిరోజున దాని ప్రభావం, ధరల్లో వ్య త్యాసం తెలుసుకొనేందుకు ‘సాక్షి’ శనివారం హైదరాబాద్ నగరం లో క్షేత్త్రస్థాయిలో పర్యటించి.. పరిశీలించింది. పలు రకాల వస్తు సేవల ధరలపై జీఎస్టీ ప్రభావం బలంగా ఉందని, మరికొన్నింటిపై అంతగా కనిపించలేదని గుర్తించింది. ఆ వివరాలివీ.. స్మార్ట్ఫోన్లు ప్రియం.. నిత్య జీవితంలో తప్పనిసరి అవసరంగా మారిపోయిన స్మార్ట్ఫోన్ల ధరలూ పెరిగిపోయాయి. ఉదాహరణకు శుక్రవారం వరకు సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ (జీ615 గోల్డ్) ధర రూ. 15,291 ఉంటే ఇప్పుడు రూ.17,100కు చేరింది. జీఎస్టీ అమలుకు ముందు 5 శాతం వ్యాట్ ఉండగా.. ఇప్పుడు 7 శాతం అదనంగా 12 శాతం జీఎస్టీ విధించడమే కారణం. ఎలక్ట్రానిక్ వస్తువులు భారం టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మెషీన్, కూలర్లు, మైక్రోవేవ్ ఒవెన్ వంటి అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధించారు. శుక్రవారం వరకు వీటిపై పన్ను 14.5 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీంతో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఉదాహరణకు... సోనీ ఎల్ఈడీ టీవీ (32 అంగుళాలు, మోడల్ డబ్ల్యూ562డి) ధర శుక్రవారం 14.5 శాతం వ్యాట్‌తో రూ.37,773గా ఉండగా.. శనివారం నుంచి 28 శాతం జీఎస్టీతో రూ.42,227కు పెరిగింది. వాస్తవంగా ఈ ఎల్ఈడీ టీవీ ధర రూ.32,990 మాత్రమే. దీనికి స్టేట్ జీఎస్టీ రూ.4,618, సెంట్రల్ జీఎస్టీ రూ.4,618 కలుపుకొని రూ.42,227 కు విక్రయించారు. విందులు, వినోదాలపై దెబ్బ! విందులు, వినోదాలపై తొలిరోజే జీఎస్టీ ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా థియేటర్లలో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ హోటల్లో రోటీ, బిర్యానీ కలిపి ధర రూ.1,362 కాగా.. దానిపై రూ.207 జీఎస్టీ భారం పడింది. హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం ధరలు పెరిగాయి. కాఫీ ధర రూ.32 నుంచి రూ.38 కి పెరిగింది. ఇక సినిమా టికెట్ల ధరలూ భారీగా పెరిగాయి. రూ.100 టికెట్‌కు పన్నుతో రూ.118 వసూలు చేశారు. పలు ఏసీ హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లలో 18 శాతం జీఎస్టీ వేయడంతో.. వినియోగదారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సగటున ప్రతీ లావాదేవీ మీద రూ.100 నుంచి రూ.300 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. పలు సినిమా థియేటర్లు జీఎస్టీ పేరుతో టికెట్లపై 18 శాతం అదనంగా చార్జీలు వసూలు చేశాయి. అయితే సెకండ్, థర్డ్ క్లాస్ టికెట్లను మాత్రం జీఎస్టీ నుంచి మినహాయించారు. బంగారం వ్యాపారంపై పడని ప్రభావం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలిరోజున బంగారం వ్యాపారంపై ఎలాంటి ప్రభావం కనిపించలేదు. బంగారు ఆభరణాల దుకాణాలన్నీ శనివారం సందడిగానే కనిపించాయి. బంగారంపై జీఎస్టీ అమల్లోకి రాకపోవడంతో పాత ధరలతోనే విక్రయాలు కొనసాగాయి. జీఎస్టీ అమలు చేసినా అదనంగా పడే భారం ఒక శాతమేనని వ్యాపారులు చెబుతున్నారు. జీఎస్టీతో బంగారు ఆభరణాల ధరలు పెరుగుతాయన్న ఆందోళన అవసరం లేదని ఆలిండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ ట్రేడర్స్ సదరన్ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్‌లాల్‌జైన్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే పన్ను కారణంగా బంగారం ధరల్లో వ్యత్యాసం పోతుందని, అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. యథాతథంగా నిత్యావసరాలు బియ్యం, పప్పులు, ఉప్పు, వంటనూ నెలు, చక్కెర, గోధుమ లు, గోధుమ పిండి, తృణధాన్యాలు తదితర నిత్యావసర వస్తువులను మాత్రం పాత ధరల మేరకే విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రా బాద్ మోండా మార్కెట్, ఉస్మాన్‌గంజ్, మలక్‌పేట్ ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అన్ని రకాల నిత్యావసరాలు పాత ధరల ప్రకారమే కనిపించాయి. షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లలోనూ ధరల్లో తేడా లేదు. పాత స్టాక్ ఉండడంతో పాత పన్నుల ప్రకారమే విక్రయిస్తున్నట్లు కొందరు వ్యాపారులు పేర్కొన్నారు. మందులపై కనిపించని ప్రభావం జీఎస్టీతో మధుమేహం, రక్తపోటు, కేన్సర్, టీబీ వంటి కొన్ని రకాల జబ్బులకు వినియోగించే మందుల ధరలు తగ్గనున్నట్లు పేర్కొన్నా.. శనివారం హైదరాబాద్‌లో వాటి ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. అన్ని చోట్లా పాత ధరల ప్రకారమే విక్రయించారు. పాత స్టాక్ అయిపోయే వరకు పాత ధరలే అమల్లో ఉంటాయని మెడికల్ షాపుల నిర్వాహకులు చెప్పడం గమనార్హం. ఆటోమొబైల్పైనా అంతే.. జీఎస్టీతో కొన్ని వాహనాల ధరలు తగ్గి, మరికొన్నింటిపైన పెరిగే అవకాశం ఉంది. కానీ శనివారం పాత ధరల ప్రకారమే విక్రయించారు. జీఎస్టీపై మరికొంత స్పష్టత రావాల్సి ఉందని.. సోమవారం నుంచి తక్కువ సామర్థ్యమున్న ద్విచక్ర వాహనాలు, లగ్జరీ వాహనాల ధరలు తగ్గనున్నాయని ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి. వినోదమూ దూరమే.. ‘‘సగటు మనుషులకు అందు బాటులో ఉన్న వినోదం సినిమాయే. అటువంటి వాటిపైనా పన్నుల రూపంలో రేట్లు పెంచడం దారుణం. ఓ కుటుంబంలో నలుగురు సినిమా చూడాలనుకుంటే ఖర్చు తడిసి మోపడవుతుంది.’’ – రాజు, ముషీరాబాద్ బార్ అండ్ రెస్టారెంట్లలో తగ్గిన రేట్లు ‘‘బార్ అండ్ రెస్టారెంట్లలో ఆహారం మీద ఇంత కుముందు వ్యాట్ 14.5 శాతం, సర్వీస్‌ట్యాక్స్ 6 శాతం, లిక్కర్ మీద సర్వీస్‌ట్యాక్స్ 6 శాతం విధించేవారు. ఇప్పుడు కేవలం ఆహారం మీద 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో 6 శాతం రేట్లు తగ్గుతున్నాయి..’’ – నవీన్, అన్నపూర్ణ బార్ యజమాని సామాన్యుడిపైనే భారం ‘‘జీఎస్టీతో ప్రభుత్వం, వ్యాపారస్తులు బాగానే ఉంటున్నారు. కానీ సామాన్యుడిపైనే భారం పడుతుంది. గరిష్టంగా 28 శాతం పన్నును విధించడం వలన సామాన్యుల జీవితాలు మరింత దుర్భరంగా మారుతాయి..’’ – తుమ్మలపల్లి సత్యనారాయణ, అడ్వొకేట్ జీఎస్టీ పరిధిలోకి రానివి మార్కెట్లో లభ్యమయ్యే 1,200 రకాల వస్తుసేవలను జీఎస్టీ పరిధిలోనికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. కొన్నింటిని మాత్రం మినహాయించింది. ఈ కేటగిరీల్లో ఎంత టర్నోవర్ సాధించినా వారు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ► ఒక సంస్థ నియమించుకునే ఉద్యోగులకు సంబంధించి పన్ను కట్టాల్సిన పనిలేదు ► కోర్టులు, ట్రిబ్యునళ్లలో అందించే సేవలపై పన్ను ఉండదు. ► ఎంపీలు, ఎమ్మెల్యేలు, మున్సిపల్, గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాలకు అయ్యే ఖర్చుపై కూడా పన్ను ఉండదు. ► అంత్యక్రియలు, మృతదేహాల తరలింపు, మార్చురీ సేవలకు కూడా పన్ను ఉండదు. వీటన్నింటినీ విలీనం చేస్తే.. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) చట్టాన్ని రూపొందించడం కోసం గతంలో రాష్ట్రం పరిధిలో ఉన్న 8 చట్టాలను ప్రభుత్వం విలీనం చేసింది. వాటి వివరాలివీ.. 1) తెలంగాణ విలువ ఆధారిత పన్ను (వ్యాట్) చట్టం – 2005 2) వినోద పన్ను చట్టం –1939 3) వాహనాల ప్రవేశ పన్ను చట్టం – 1996 4) సరుకుల ప్రవేశ పన్ను చట్టం – 2001 5) విలాస పన్ను చట్టం – 1987 6) గుర్రపు పందేలు, బెట్టింగ్ చట్టం – 1358 ఫసలీ 7) గ్రామీణాభివృద్ధి చట్టం – 1996 8) ప్రకటనల చట్టం ఇవి చేస్తే జరిమానానే.. జీఎస్టీ చట్టం కింద డీలర్లు లేదా అధికారులు ఎవరు తప్పు చేసినా జరిమానాలు, కేసులు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన చట్టంలో పేర్కొంది. ఆ ఉల్లంఘనలలో కొన్ని.. ► ఏదైనా వస్తువును అమ్మినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన ఇన్వాయిస్ లేకున్నా.. ఇన్వాయిస్లో తప్పులున్నా.. ► సరుకు సరఫరా చేయకుండా ఇన్వాయిస్లు తయారుచేసినా ► పన్ను వసూలు చేసిన తర్వాత మూడు నెలలలోపు ఆ పన్నును ప్రభుత్వానికి చెల్లించకపోయినా ► ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అర్హత లేకుండా క్లెయిమ్ చేసుకున్నా ► తప్పుడు అకౌంట్లు, తప్పుడు డాక్యుమెం ట్లు కలిగి ఉన్నా ► రూ.20 లక్షల కన్నా ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉండి జీఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోకపోయినా ► రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చినా ► విధి నిర్వహణలో ప్రభుత్వ అధికారులకు ఆటంకం కలిగించినా.. పన్ను ఎగవేత కోసం టర్నోవర్‌ను తప్పుగా చూపెట్టినా ► ఒకరి రిజిస్ట్రేషన్ నంబర్‌ను మరొకరు వాడుకున్నా జరిమానాలు విధించడంతో పాటు కేసులు పెడతారు. ఇంటి బడ్జెట్‌పై ప్రభావమెంత? - జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. మనపై ఉండే ప్రభావమెంతనేది అందరిలోనూ తలెత్తే ప్రశ్న. జీఎస్టీ పరోక్షపన్ను. మన దైనందిన జీవితంలో వాడే వస్తువులు, సేవల పన్నుల్లో హెచ్చుతగ్గులు... మన నెల బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. నెలకు 50 వేలు సంపాదించే కుటుంబ బడ్జెట్లో పెద్దగా తేడా పడదు. అలాగే రూ.80 వేలు ఆర్జించే కుటుంబంపై అదనంగా రెండు నుంచి మూడు వందల భారం పడుతుంది. మధ్యతరగతి జీవి నెల బడ్జెట్‌పై జీఎస్టీ ప్రభావం ఎంతనేది లెక్క వేసి చూస్తే.... జీఎస్టీ వెనుక వస్తు, సేవల పన్ను జూలై 1 నుంచి అమల్లోకి రావడం వెనుక 12 మంది కృషి ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో బృందాన్ని మొదలుబెడితే పూర్వపు సెంట్రల్ బోర్డాఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మాజీ చైర్మన్ నజీబ్ షాతో ముగించాల్సి ఉంటుంది. – (సాక్షి నాలెడ్జ్ సెంటర్) అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టడమేగాక చట్ట రూపంలోకి రావడా నికి మూడేళ్లలో చేయాల్సింది చేశారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జీఎస్టీ కౌన్సిల్‌కు అరుణ్ తొలి చైర్మన్ గా వ్యవహరించారు. అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతో తీసుకోవాలనే పట్టుదలతో అవసరమైతే సమావేశాలు వాయిదా వేయడానికీ వెనుకాడలేదు. వనజా ఎస్ సర్నా ఏప్రిల్ నుంచి సీబీఈసీ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఈమె జీఎస్టీని విజయవంతంగా ఆవిష్కరించి, అమలుచేసే బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ప్రకాశ్‌కుమార్ ఐఐటీలో విద్యనభ్యసించిన కుమార్‌కు టెక్నాల జీపై విస్తృత అవగాహన ఉన్న కారణంగా శరవేగంగా జీఎస్టీ ఆవిష్కరణకు అవసరమైన అన్ని రకాల పత్రాలు సకాలంలో సిద్ధంచేశారు. ఆయన ఐఐటీ అనుభవం జీఎస్టీ ఆవిష్కరణలో ఎంతగానో తోడ్పడింది. శక్తికాంతదాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవ హారాల మాజీ కార్యదర్శిగా అందరికీ తెలిసిన దాస్ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీఎస్టీ బాధ్యత తీసుకుని ఇది చట్టరూపం దాల్చడానికి విశేష కృషి చేశారు. నజీబ్ షా జీఎస్టీ పరిశీలన దశలో ఉండగా సీబీఈసీ చైర్మన్‌గా పనిచేసిన షా దీన్ని ప్రస్తుత స్వరూపంలోకి తీసుకురా వడానికి, అమలుకు సిద్ధమయ్యేలా చేయడానికి అవసరమైన పని పూర్తిచేశారు. హస్ముఖ్ అధియా కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా తెలిసిన ఈ ఐఏఎస్ అధికారి(గుజరాత్ కేడర్) లేకుంటే జీఎస్టీ బిల్లు పార్ల మెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో చట్టమయ్యేది కాదనేది అందరూ అంగీకరించే సత్యం. జీఎస్టీపై ఉన్న అనుమా నాలు, భయాలు తొలగించే పనిలో భాగంగా అన్ని ప్రభుత్వ సంస్థలు, వాణి జ్య, పారిశ్రామిక మండళ్లు, ఇతర సంఘాల సమావేశాలు ఏర్పాటు చేశారు. ఉపేంద్ర గుప్తా సీబీఈసీలో పనిచేస్తూ జీఎస్టీ కమిషనర్‌గా మారిన గుప్తాకు సాంకేతిక విషయాలు కొట్టినపిండి. రెవెన్యూ సర్వీస్ అధికారిగా ఆయనకు ప్రతి విషయంలోనూ ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు తెలుసంటారు. నవీన్ కుమార్ జీఎస్టీ నెట్వర్క్ చైర్మన్‌గా కుమార్ పన్ను నిర్ణ యం, ఇతర అంశాలకు సంబంధించిన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. పన్ను ప్రక్రియకు సంబంధించిన అనేక అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల(యూటీ) కేడర్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రెటరీ ఉదయ్‌సింగ్ కుమావత్, సీబీఈసీ పన్ను పరిశోధనా విభాగంలో జాయింట్ సెక్రెటరీలు ఆలోక్ శుక్లా, అమితాబ్ కుమార్ జీఎస్టీ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. -
సృజనాత్మకతకు టీ–వర్క్స్
♦ నూతన సంస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ♦ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం ♦ హార్డ్‌వేర్ నమూనాల అభివృద్ధి, ఇంక్యూబేషన్, నైపుణ్యాభివృద్ధికి సదుపాయాలు ♦ ఆలోచనతో వచ్చి ప్రొడక్ట్‌తో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: మీ దగ్గర ఓ సరికొత్త ఆలోచన ఉందా? ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని సృష్టించాలనుకుంటున్నారా? అందుకు తగిన సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారా.. ఇలాంటి వారికి చేయూత అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఒక సృజనాత్మక ఆలోచనతో వచ్చి ఉత్పత్తి (ప్రొడక్ట్)ను అభివృద్ధి చేసుకుని వెళ్లగలిగేలా సదుపాయాలను కల్పిస్తూ ‘టీ–వర్క్స్’ పేరుతో నూతన సంస్థకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో–మెకానికల్, మెకానికల్ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ రంగాల్లో అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు దీనిని ఏర్పాటు చేసింది. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచ స్థాయి నమూనాల రూపకల్పన (ప్రొటోటైపింగ్) సదుపాయంతో పాటు ఔత్సాహిక పరిశోధకుల అభివృద్ధి కేంద్రం (ఇంక్యుబేషన్ సెంటర్), నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను ఈ ‘టీ–వర్క్స్’లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు లాభాపేక్ష లేని సంస్థగా టీ–వర్క్స్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో పరిశ్రమలకు అనువైన వాతావరణం సృష్టించడం, హార్డ్‌వేర్ నమూనాల తయారీ సదుపాయం కల్పించడం, ఉత్పత్తుల అభివృద్ధి క్రమంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు నిపుణులైన మానవ వనుల అభివృద్ధి కోసం ఈ సంస్థ పనిచేయనుంది. ఈ సంస్థకు డైరెక్టర్లుగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ (ఎలక్ట్రానిక్స్) వ్యవహరిస్తారు. టీ–వర్క్స్ ప్రధాన ఉద్దేశాలివీ..నమూనాల ఉత్పత్తి కోసం: ఏదైనా ఓ ఆలోచనతో ఔత్సాహిక పరిశోధకులు అడుగు పెట్టి.. ఉత్పత్తిని రూపొందించుకుని బయటకు వెళ్లేందుకు కావాల్సిన అత్యాధునిక సదుపాయాలు, యంత్రాలు టీ–వర్క్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఉత్పత్తుల నమూనాల అభివృద్ధి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇంక్యుబేషన్: హార్డ్‌వేర్ ఉత్పత్తికి సంబంధించిన ఆలోచనలకు కార్యరూపం కల్పించి ఉత్పత్తుల తయారీకి సహకరించడం, హార్డ్‌వేర్ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడిదారులు, సలహాదారులు, మార్గదర్శకులను ఆకర్షించడం, హార్డ్‌వేర్ రంగ అభివృద్ధికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఏకమై పనిచేసేందుకు ఇంక్యుబేషన్ కేంద్రం ఉపయోగపడనుంది. -
ఎన్సీఎల్టీ ముందుకు 2 మొండిబాకీల కేసులు
♦ ఎలక్ట్రోస్టీల్పై ఎస్బీఐ, ఎస్సార్ స్టీల్‌పై ♦ స్టాండర్డ్ చార్టర్డ్ దివాలా పిటిషన్లు న్యూఢిల్లీ: కార్పొరేట్ల నుంచి మొండిబాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్షియం తాజాగా ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేసినట్లు ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాల సమస్య పరిష్కారంపై జూన్ 22న జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్బీఐ కన్సార్షియం ఈ చర్యలు చేపట్టింది. కోల్‌కతాకు చెందిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్.. బ్యాంకులకు సుమారు రూ. 10,000 కోట్ల పైగా బాకీ పడింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ. 293 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు మరో ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్ స్టీల్‌పై స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ దివాలా చర్యలు చేపట్టింది. ఎన్సీఎల్టీలో ఈ మేరకు కేసు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ. 37,284 కోట్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులకు భారీగా బాకీ పడ్డాయని ఆర్బీఐ గుర్తించిన 12 సంస్థల్లో ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎస్సార్ స్టీల్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు రూ.8 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండి బకాయిల్లో ఈ 12 కంపెనీలవే 25%. -
ఎలక్ట్రానిక్ పరికరాలు తెస్తే డీబార్: యూపీఎస్సీ
న్యూఢిల్లీ: సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ల్యాప్‌టాప్‌లు, బ్లూటూ త్ పరికరాలను పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చే అభ్యర్థుల్ని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరవకుండా డీబార్ చేస్తామని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) హెచ్చరించింది. పరీక్షా కేంద్రాలకు ఎటువంటి విలువైన వస్తువులు తీసుకురావద్దని సూచించింది. జూన్ 18న సివిల్స్ సర్వీస్ పరీక్ష జరుగనున్న నేపథ్యంలో యూపీఎస్సీ ఈ మేరకు స్పందించింది. -
విద్యుత్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకం
అనంతపురం అగ్రికల్చర్: ఐఎన్టీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర కమిటీలో కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.ఈశ్వరయ్యను నియమిస్తున్న ట్లు యూనియన్ సెక్రటరీ జనరల్ ఆర్.సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పవర్‌ఆఫీస్ మీటర్ విభాగంలో పనిచేస్తున్న తనకు కం పెనీ కార్యకలాపాల నిమిత్తం ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం కల్పిం చడం సంతోషంగా ఉందని ఈశ్వరయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు. -
నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయ అవార్డు
ప్రధాని చేతుల మీదుగా స్వీకరించిన జిల్లా కలెక్టర్ యోగితా రాణా సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ/ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఎలక్ట్రానిక్ వ్యవసాయ మార్కెటింగ్ విధానం (ఈ–నామ్) అమలులో నిజామాబాద్ మార్కె ట్‌కు ‘ప్రధాన మంత్రి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–2017’ దక్కిం ది. 11వ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆ జిల్లా కలెక్టర్ యోగితా రాణా అవార్డు స్వీకరించారు. ఈ–నామ్ విభాగం లో ఈశాన్య రాష్ట్రాల కేటగిరీలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సోలన్ జిల్లా, ఇతర రాష్ట్రాల కేటగిరీలో నిజామాబాద్ జిల్లా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ప్రశంసా పత్రంతోపాటు రూ.10 లక్షల నగదు బహుమతిని యోగితా రాణా అందుకున్నారు. అవార్డు సాధించినందుకు జిల్లా కలెక్టర్, మార్కెటింగ్ అధికారులు, సిబ్బందిని మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటనలో అభినందించారు. ‘ఈ నామ్’ అమలుకు కేంద్రం దేశవ్యాప్తంగా 22 మార్కెట్లను గుర్తించగా అందులో తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, తిరుమలగిరి, మలక్‌పేట, బాదేపల్లి మార్కెట్లు ఉన్నట్లు హరీశ్ తెలిపారు. -
ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి నకిలీనే
దుబాయ్ : మార్కెట్లో శరవేగంగా విక్రయాలు దూసుకెళ్లే ఉత్పత్తులు ఏమన్న ఉన్నాయా? అంటే అవి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే. వాటిలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు. వినియోగదారులు చూపుతున్న ఆసక్తికి కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లను దుమ్మురేపుతున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజ్ లు కొనేటప్పుడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. ప్రతి ఐదు స్మార్ట్ ఫోన్లలో కనీసం ఒకటి నకిలీదేనని తాజా రిపోర్టుల్లో వెల్లడవుతోంది. నాలుగు వీడియో గేమ్ ల కన్సోల్స్ కూడా ఒకటి ఫేకేనని తేలింది. దీనిపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) మంగళవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లోకి వస్తున్న నకిలీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఎలక్ట్రిక్ డివైజ్ లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇవి కేవలం తక్కువ నాణ్యతను కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయని ఓఈసీడీ రిపోర్టు హెచ్చరించింది. అమెరికా నుంచి వచ్చే పాపులర్ ఉత్పత్తులను చాలామంది కాపీ చేస్తున్నారని పేర్కొంది. మంచి ఫోన్లతో పోలిస్తే నకిలీ ఫోన్లలోనే ఆరోగ్యానికి హానికలుగజేసే సీసం, కాడ్మియంలను ఎక్కువ ఉన్నాయని ఓఈసీడీ రిపోర్టు పేర్కొంది. నకిలీ ఫోన్ల ఛార్జర్లు పేలుళ్లకు, ఎలక్ట్రిక్ షాక్‌లకు గురవుతాయని రిపోర్టు నివేదించింది. అమెరికా కంపెనీల మేథో సంపత్తి హక్కులు ఉల్లంఘించి నకిలీ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నట్టు తెలిపింది. దీంతో కంపెనీల బ్రాండు వాల్యు దెబ్బతిని, రెవెన్యూలు కోల్పోతున్నాయని పేర్కొంది. ఈ కారణంతో 2011, 2013కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనీసం సగం శాతం(43శాతం) ఉత్పత్తులను సీజ్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. అసలివి ఏవో నకిలీవి ఏవో తెలుసుకోలేకపోతుండటంతో ఫేక్ ఉత్పత్తులకు మార్కెట్లో వస్తున్న సంపద కూడా ఎక్కువగానే ఉంది. 143 బిలియన్ డాలర్ల(రూ.9,27,648కోట్ల) విలువైన నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో ఇప్పటికే అమ్ముడు పోయినట్టు తెలిసింది. ఫేక్ ఉత్పత్తులను తయారుచేయడంలో చైనానే ప్రధాన సోర్స్ గా ఉందని రిపోర్టు వెల్లడించింది. -
వి–గార్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వి–గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌కు చెందిన గట్స్ ఎలెక్ట్రోమెక్లో మెజారిటీ వాటా తీసుకుంటోంది. బోర్డు సభ్యుల నుంచి ఈ మేరకు సూత్రప్రాయంగా అనుమతి పొందింది. ఎంత పెట్టుబడి పెట్టేదీ కంపెనీ వెల్లడించలేదు. 1983లో ఏర్పాటైన గట్స్ ఎలెక్ట్రోమెక్ స్విచ్ గేర్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లను తయారు చేస్తోంది. ఈ విభాగంలో కంపెనీకి మంచి పేరుంది. 2015–16లో గట్స్ రూ.30 కోట్ల టర్నోవర్ సాధించింది. 2016–17లో రూ.35 కోట్లకుపైగా టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు హరిద్వార్‌లో ప్లాంటు ఉంది. కాగా, 2015–16లో వి–గార్డ్ రూ.1,862 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు ఆశిస్తోంది. -
ప్లైట్స్‌లో ఎలక్ట్రానిక్స్ రవాణాపై అమెరికా నిషేధం
విమానంలోని క్యాబిన్లో ఎలక్ట్రానిక్స్ వస్తువులను తీసుకెళ్లడంపై అమెరికా నిషేధం విధించింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే విమానాల్లో ఈ నిషిద్ధ ఆంక్షలు అమలులో ఉంటాయని అమెరికా అధికారులు పేర్కొన్నారు. సైజులో స్మార్ట్‌ఫోన్ కంటే పెద్దగా ఉండే వస్తువులను (ఉదాహరణ: ఐప్యాడ్, కిండిల్, ల్యాప్‌టాప్) విమాన క్యాబిన్లోకి తీసుకెళ్లడం ఇక కుదరదని తెలిపారు. టెర్రరిస్టులు ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పేలుడు పదార్ధాలను అమెరికాకు తీసుకువస్తున్నారనే భద్రతా కారణాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయంతో మిడిల్ఈస్ట్, ఆఫ్రికాల నుంచి భారీ సంఖ్యలో అమెరికాకు సర్వీసులు నడుపుతున్న దిగ్గజ ఎయిర్‌లైన్ సంస్ధలు ఎమిరేట్స్, ఖతార్, టర్కీష్ తదితర సంస్ధలు ఇబ్బందులు పడనున్నాయి. ఈ రూట్లలో ఒక్క అమెరికన్ ఎయిర్‌లైన్ సంస్ధ సర్వీసులు నడుపుతూ లేకపోవడం గమనార్హం. నిషేధానికి ఇంత కాలపరిమితి ఏమీ లేదని అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలను అమెరికాకు సర్వీసులు నడిపే సంస్ధలు వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. -
మీ షేర్లు పేపర్ల రూపంలో ఉన్నాయా?
ఎలక్ట్రానిక్ రూపంలోకి మారిస్తేనే అమ్మగలం ∙మార్చుకునే సమయంలో ఎన్నో పరిశీలనలు సంతకం సరిపోవాలి... పేర్లు కూడా మ్యాచ్ అవ్వాలి ∙లేదంటే అఫిడవిట్, నోటరీ సాయం అవసరం బెనిఫీషియరీ మరణిస్తే వారసుల పేరిట బదిలీ ∙అందుకోసం మరింత సుదీర్ఘ ప్రక్రియ షేర్లు ఎన్ని ఉన్నా, ఎంత విలువైనవి అయినా ఎలక్ట్రానిక్ రూపంలో స్మార్ట్‌ఫోన్ నుంచే యాక్సెస్ చేసుకునే రోజులివి. కానీ, 20 ఏళ్ల క్రితం షేర్లన్నీ సర్టిఫికెట్ల రూపంలోనే ఉండేవి. 1996లో డిపాజిటరీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ఎన్నో వ్యయ, ప్రయాసలు తప్పాయి. మరి 20, 30 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన షేర్ల పత్రాలు మీ దగ్గర ఇప్పటికీ ఉన్నాయా...? వాటిని తీరిగ్గా ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలోకి (డీమ్యాట్) మార్చుకోవాలని అనుకుంటున్నారా...? అయితే, ఇందులో ఉన్న సాధక బాధకాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి మరి. అలా చేస్తే అనవసర సమస్యలను ముందే నివారించుకోవచ్చు. డీమ్యాట్ తప్పనిసరి... షేర్లు ఎవరి పేరుతో అయితే ఉన్నాయో, వారి పేరిట డీమ్యాట్ ఖాతా కలిగి ఉండడం తప్పనిసరి. లేదంటే కొత్తగా డీమ్యాట్ ఖాతా తెరవాలి. స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, బ్యాంకుల ద్వారా డీమ్యాట్ ఖాతా తెరిచేందుకు వీలుంది. ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ సంస్థల తరఫున డీమ్యాట్ ఖాతాలను అన్ని బ్రోకింగ్ సంస్థలూ అందిస్తున్నాయి. ఖాతా తెరిచిన తరవాత డిపాజిటరీ పార్టిసిపెంట్లకు (డీపీ) డీమ్యాట్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. డీఆర్ఎఫ్ను పూరించి షేర్ల సర్టిఫికెట్లను జత చేసి డీపీకి అందించిన తర్వాత... డీపీ వాటిని సంబంధిత కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు పంపిస్తుంది. సంతకాలు సరిపోలకుంటే...? సాధారణంగా డీమ్యాట్ దరఖాస్తుల్లో ఎక్కువగా ఎదురయ్యే సమస్య సంతకాలు సరిపోలకపోవడమే. షేర్ల కొనుగోలు సమయంలో దరఖాస్తులో చేసిన సంతకానికి, తాజా డీమ్యాట్ దరఖాస్తులో ఉన్న సంతకానికి మధ్య తేడాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న వాటితో ఈ సమస్య ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో ఆర్టీఏ పంపిన అఫిడవిట్ పత్రాన్ని బెనిఫీషియరీ పూర్తి చేసి, దాన్ని బ్యాంక్ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయించి, అదనంగా బెనిఫీషియరీ గుర్తింపు పత్రం (ఆధార్/పాన్ కార్డు/పాస్‌పోర్ట్‌లలో ఏదో ఒకటి) జతచేసి తిరిగి పంపాల్సి ఉంటుంది. డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమై ఉన్న బ్యాంకు శాఖ మేనేజర్‌తో అటెస్టేషన్ చేయిస్తేనే చెల్లుబాటు అవుతుంది. పేరులో తేడాలుంటే... షేర్ సర్టిఫికెట్‌పై ఉన్న పేరుకు, డీమ్యాట్ ఖాతాలో ఉన్న బెనిఫీషియరీ పేరుకు మధ్య స్వల్ప తేడా ఉన్నా ఇటువంటి ప్రక్రియనే అనుసరించాల్సి వస్తుంది. ఉదాహరణకు స్వామి సుందర్ అని డీమ్యాట్ ఖాతాలో ఉందనుకుందాం. షేర్ల సర్టిఫికెట్‌పై ఎస్.సుందర్ అని ఉంటే ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చడానికి ముందు... ఆర్టీఏ మరింత స్పష్టత కోరతారు. ఇటువంటి సందర్భాల్లోనూ బెనిఫీషియరీకి అఫిడవిట్ పంపడం జరుగుతుంది. ఆ అఫిడవిట్‌ను పూర్తి చేసి దాన్ని నోటరీతో అటెస్టేషన్ చేయించిన అనంతరం, గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి వెనక్కి పంపాలి. ఉమ్మడి భాగస్వామ్యంతో ఉంటే... తమ దగ్గరున్న షేర్ల సర్టిఫికెట్లు ఉమ్మడి భాగస్వామ్యం (జాయింట్ హోల్డర్) లోనివి అయితే అప్పుడు ఉమ్మడిగా జాయింట్ డీమ్యాట్ ఖాతా తెరిచి ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ అభ్యర్థన పంపవచ్చు. అలాగని జాయింట్ ఖాతానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. జాయింట్ షేర్ సర్టిఫికెట్లలో ఇద్దరు బెనిఫీషియరీలు ఉంటే, వారిలో ఎవరో ఒకరి పేరు మీదకు అయినా వాటిని డీమ్యాట్ చేసుకునేందుకు అవకాశం ఉంది. కాకపోతే ఇందుకు గాను ట్రాన్స్ఫర్ డీడ్ పత్రాన్ని పూర్తి చేసి పంపాలి. ఇటువంటి సందర్భాల్లో 0.25 శాతం స్టాంప్ డ్యూటీ (సంబంధిత షేర్ల మార్కెట్ విలువపై) విధించడం జరుగుతుంది. అయితే, ఇలా ట్రాన్స్ఫర్ డీడ్ రూపంలో కంటే ఉమ్మడిగా డీమ్యాట్ ఖాతా తెరిచి షేర్ల సర్టిఫికెట్‌ను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకోవడమే ఉత్తమం. ఎలక్ట్రానిక్ రూపంలోకి ఇలా... ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చాలని కోరుతూ తమ వద్దకు వచ్చిన షేర్ల పత్రాలను కంపెనీ రిజిస్ట్రార్, ట్రాన్స్ఫర్ ఏజెంట్ (ఆర్టీఏ) క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కంపెనీ రికార్డుల్లో బెనిఫీషియరీ (షేర్ల హక్కుదారుడు) సంతకంతో, తమకు అందిన దరఖాస్తులోని సంతకాలను పోల్చి చూస్తారు. జాయింట్ హోల్డర్ అయితే, ఆ వివరాలను కూడా పరిశీలిస్తారు. అలాగే, ఆ షేర్లను అప్పటికే ఎక్కడైనా తాకట్టు పెట్టి ఉన్నారా? ఆ షేర్లకు సంబంధించి ఏవైనా కోర్టు కేసులు ఉన్నాయా? అవి ఫోర్జరీ చేసినవా? ఇలా అన్ని అంశాలను సరిచూస్తారు. ఒకవేళ మీ దగ్గరున్న షేర్ సర్టిఫికెట్ల తాలూకూ కంపెనీ మరేదైనా కంపెనీలో విలీనమై ఉంటే, ఆ కంపెనీని వేరే కంపెనీ కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు మనుగడలో ఉన్న కంపెనీ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు వివరాలు అందించాల్సి ఉంటుంది. రవాణాలో సర్టిఫికెట్లు పోతే..? షేర్ల డీమ్యాట్ ప్రక్రియలో భాగంగా షేర్ల సర్టిఫికెట్లు పోతే అందుకు కంగారుపడాల్సిన పనిలేదు. డీపీ ఆ బాధ్యత తీసుకుంటుంది. రవాణాలో షేర్ల సర్టిఫికెట్లు పోయినా, వాటికి నష్టం జరిగినా డీపీ నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. లబ్దిదారు మరణించి ఉంటే...? ఇంట్లో షేర్ల సర్టిఫికెట్లు ఉన్నా కానీ దాని యజమాని అప్పటికే మరణించి ఉండొచ్చు. ఆ షేర్లకు ఉమ్మడి భాగస్వామి కూడా లేకపోవచ్చు. ఇలాంటప్పుడు వారసుల్లో (జీవిత భాగస్వామి లేదా కుమారుడు లేదా కుమార్తె) ఒకరు తమ పేరిట షేర్లను మార్చుకునేందుకు హక్కు ఉంటుంది. ఆర్టీఏ ఆమోదం అనంతరం సంబంధిత షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చి వారసుల డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తారు. ఆర్టీఏ ఆమోదం కోసం బెనిఫీషియరీ మరణ ధ్రువీకరణ పత్రం, వారసత్వ పత్రం, కోర్టు అధికారి అటెస్ట్ చేసిన దర్యాప్తు పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ రూపంలో ఉన్న షేర్ల విలువ భారీ మొత్తంలో ఉంటే ఆర్టీఏ వాటిని వారసులకు బదిలీ చేయడానికి గాను మరిన్ని అదనపు పత్రాలను కూడా కోరే అవకాశం ఉంటుంది. బెనిఫీషియరీకి ఒకటికి మించిన కంపెనీల్లో వాటాలు ఉంటే అప్పుడు వాటిని ఎలక్ట్రానిక్ రూపంలోకి మార్చుకునేందుకు గాను ప్రతీ కంపెనీకి విడివిడిగా వీటిని పంపాల్సి వస్తుంది. డీమ్యాట్ రూపంలో ఉన్నపుడు... డీమ్యాట్ ఖాతా ఒక్కరి పేరిటే ఉండి, దాని యజమాని మరణించిన సందర్భాల్లో నామినీగా ఉన్న వారు బదిలీ పత్రం, డీమ్యాట్ ఖాతాదారుడు మరణించినట్టు నోటరీ ధ్రువీకరణ సమర్పిస్తే చాలు. ట్రాన్సిమిషన్ పత్రం డీపీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాల పరిశీలన తర్వాత డీపీ సంబంధిత ఖాతాలోని షేర్లను నామినీ ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుంది. ఒకవేళ నామినీగా ఎవరి పేరునూ నమోదు చేసి లేకుంటే చట్టబద్ధమైన వారసులు ఎన్వోసీ, కుటుంబ ఒప్పంద పత్రం తదితర అన్ని వివరాలను సమర్పించడం ద్వారా వాటిని పొందవచ్చు. ఇక జాయింట్ డీమ్యాట్ ఖాతా అయితే, అందులో ఒక బెనిఫీషియరీ మరణిస్తే, జీవించి ఉన్న వారు ట్రాన్సిమిషన్ పత్రం, మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. -
గీకే మిషన్లదే... గిరాకీ !
కరెన్సీ రూపంలో చెల్లించకుండా, షాపులో ప్లాస్టిక్ కార్డు గీకడం ద్వారా చెల్లింపులు జరపడానికి ఇవాళ అందరూ షాపుల్లో వాడుతున్న మిషన్లను ‘ఎలక్ట్రానిక్ డ్రాఫ్ట్ క్యాప్చర్ (ఇ.డి.సి)’ మిషన్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, స్వైప్ కార్డ్ మిషన్. చైనాలో... సగటున ప్రతి 25 మందికి ఒక స్వైప్ మిషన్ ఉంది. మలేసియాలో సగటున ప్రతి 31 మందికీ, బ్రెజిల్లో ప్రతి 200 మందికీ ఒక మిషన్ ఉన్నాయి. కానీ, మన దేశంలో మాత్రం ఇప్పటికీ ఈ స్వైప్ మిషన్ల సంఖ్య తక్కువే. ఇక్కడ సగటున ప్రతి 900 మందికీ ఒక స్వైప్ మిషన్ ఉంది. 14.4 లక్షలు... ఈ ఏడాది జూలై నాటికి మన దేశవ్యాప్తంగా ఉన్న కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య. తాజాగా ఈ పెద్ద నోట్ల రద్దు దెబ్బతో చేతిలో డబ్బులు లేక, జనమంతా కార్డుల వినియోగాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది చిల్లర వర్తకులు ఇప్పుడు కార్డ్ స్వైప్ మిషన్లు ఆర్డర్ చేస్తున్నారు. కాలేజ్ క్యాంటీన్లు, చిన్న స్థాయి వర్తకులు, టోకు వ్యాపారులు - ఇలా అందరూ ఆర్డర్ చేస్తుండడంతో, ఈ గీకే మిషన్ల గిరాకీ రెట్టింపయింది. దాంతో, కార్డ్ స్వైప్ మిషన్ల సంఖ్య దాదాపు 60 శాతం మేర పెరుగుతాయని అంచనా. ఏ.టి.ఎం.లలో డబ్బులు, మార్కెట్లో చిల్లర దొరకడం కష్టమవడంతో తాజాగా క్రెడిట్ కార్డుల వినియోగం ఒకే రోజులో 60 శాతం పెరిగింది. డెబిట్ కార్డులపై ఖర్చు చేయడం 108 శాతం ఎక్కువైంది. -
గాడ్జెట్స్.. ఫ్లాప్స్
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్.. సాంకేతిక విప్లవంలో సరికొత్త ఒరవడిని సృష్టించాయి. ముఖ్యంగా యువతకు వీటిపై ఉండే మక్కువను మాటల్లో చెప్పలేం. అందుకే యువతను ఆకర్షించేలా నిత్యం ఏదో ఒక కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వస్తోంది. దిగ్గజ కంపెనీలు కూడా మార్కెట్లో పోటీని తట్టుకునే విధంగా సరికొత్త గాడ్జెట్లను రూపొందిస్తున్నాయి. అవి క్లిక్ అయితే అందరికీ చేరువవుతాయి. కానీ ప్రపంచంలోనే టాప్ కంపెనీలు బెస్ట్ అని భావించి, ఎన్నో కొత్త ఫీచర్స్‌తో తెచ్చిన గాడ్జెట్స్ సైతం వినియోగదారులను ఆకట్టుకోలేక తెరమరుగైన సందర్భాలెన్నో! అలా మార్కెట్లో ఫెయిల్ అయిన గాడ్జెట్లు సెగ్వే పీటీ, గూగుల్ గ్లాస్ గురించి తెలుసుకుందాం.. సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్) ఐఫోన్ తర్వాత అంతే స్థాయి అంచనాలతో మార్కెట్లోకి వచ్చిన ఆవిష్కరణ.. ది సెగ్వే పీటీ (పర్సనల్ ట్రాన్స్‌పోర్టేషన్). ఇది రెండు చక్రాలుండే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బ్యాటరీ ఎలక్ట్రానిక్ వెహికల్. దీన్ని 2001లో అమెరికాకు చెందిన డీన్ కామెన్ రూపొందించారు. దీన్ని ఇండియాలో బర్డ్ సెగ్వే పేరుతో బర్డ్ గ్రూప్ కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. సెగ్‌వేను నడపడం చాలా సులువు. ఇది మోషన్ సెన్సార్ల ఆధారంగా రైడర్ కదలికలను బట్టి ముందుకు వెనక్కి, కుడి, ఎడమ వైపులకు కదులుతుంది. సెగ్వే పీటీలను కేవలం సాధారణ ప్రయాణాలకు మాత్రమే కాకుండా.. విమానాశ్రయాలు, పెద్ద పెద్ద పరిశ్రమలు, టూరిజంలో ఎక్కువగా వినియోగిస్తారు. దీని గరిష్ట వేగం గంటకు 20 కి.మీ. చాలా అంచనాలతో ఈ వెహికల్‌ను లాంచ్ చేశారు. స్టీవ్ జాబ్స్ సైతం పర్సనల్ కంప్యూటర్ లాగే సెగ్వే కూడా ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఒక కొత్త ఆవిష్కరణగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. దీంతో ప్రజల్లో దీని పట్ల చాలా ఆసక్తి పెరిగింది. కానీ ఇది లాంచ్ అయిన తర్వాత అంచనాలను అందుకోకపోవడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పోలీస్ పెట్రోలింగ్, పోస్టల్ డిపార్ట్మెంట్, పర్యాటక రంగాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. గూగుల్ గ్లాస్.. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి మరో అద్భుత టెక్నాలజీగా భావించిన ప్రొడక్ట్.. గూగుల్ గ్లాస్. కీబోర్డులు, టచ్ స్క్రీన్ల అవసరం లేకుండా మాటలతోనే గారడీ చేయడానికి కళ్ల జోడు రూపంలో అందుబాటులోకి వచ్చిన సరికొత్త గాడ్జెట్ గూగుల్ గ్లాస్. ఇది కళ్లజోడు ఆకారంలో ఉండే ఆప్టికల్ హెడ్ మౌంటెడ్ డిస్ప్లే. ఈ గ్లాస్ ఆధారంగా వీడియో చాటింగ్, మెసేజింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటివి చేయొచ్చు. క్లిక్ ఎ పిక్చర్ అంటే వెంటనే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని ఫొటో తీస్తుంది. రికార్డ్ అంటే వీడియో తీస్తుంది. అంతేకాదు దీని ద్వారా తీసిన ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేసుకోవచ్చు. గమ్యం తెలియని చోట దారి చూపుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. గూగుల్ గ్లాస్ ధరిస్తే ఒక చిన్న కంప్యూటర్ కళ్ల ముందు ఉన్నట్టే. ఇన్ని సదుపాయాలతో మార్కెట్లోకి వచ్చిన గూగుల్ గ్లాస్ మొదట్లో ఎక్కువ మందిని ఆకర్షించింది. కానీ దీనికి సరైన మార్కెటింగ్ లభించలేదని నిపుణుల అభిప్రాయం. దీనికి తోడు గూగుల్ గ్లాస్ సాయంతో ఎదుటివారికి తెలియకుండా ఫొటో లు, వీడియోలు తీసే అవకాశం ఉండటంతో ప్రైవసీ, పైరసీ లాంటి వివాదాలు తలెత్తాయి. అప్పట్లో ఇంగ్లండ్‌లోని రెస్టారెంట్లు, థియేటర్లు, ఆసుపత్రుల్లాంటి ప్రదేశాల్లో గూగుల్ గ్లాస్ వాడకంపై నిషేధం విధించారు. గొప్ప టెక్నాలజీ ఇన్నోవేషన్‌గా, పెద్ద హంగామాతో ఎంతో ఆసక్తి రేపుతూ జనం ముందుకు వచ్చిన గూగుల్ గ్లాస్ చివరకు ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేక తెరమరుగైంది. -
అనంతలక్ష్మిలో జాతీయ సదస్సు
ఎస్కేయూ : అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ‘ఎలక్ట్రో–ప్యాడ్ 2కే16’ పేరుతో గురువారంlజాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ పులివెందుల ప్రొఫెసర్ గణేష్ హాజరై మాట్లాడారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పుల గురించి పరిశోధనలకు గల అవకాశాల గురించి వివరించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల ప్రొటో టైప్ మోడల్స్‌ను పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ అనంతరాముడు, డైరెక్టర్ రమేష్‌నాయుడు, ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు, ఎలక్ట్రికల్ విభాగాధిపతి మహేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భారీగా ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు స్వాధీనం: ఒకరి అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా యాడికి మండలం చందనలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1200 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
ఈ- ఫైలింగ్ ద్వారా బ్లాక్‌మనీ వెల్లడి అవకాశం
న్యూఢిల్లీ: డాక్యుమెంట్లను స్వయంగా సమర్పించడానికి బదులు అవసరమైతే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ద్వారా కూడా నల్లధనం వివరాలను తెలియజేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) మరో నాలుగు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ తాజా సర్క్యులర్ జారీ చేసింది. బెంగళూరు, సీపీసీ, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ను ఉద్దేశించిBlackmoney declarants can now e-file their disclosure: CBDTతో ఈ-ఫైలింగ్ ద్వారా ఆదాయం వెల్లడి పథకాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సర్క్యులర్ వెల్లడించింది. సెప్టెంబర్ 30 దాటిన తరువాత ఈ పథకాన్ని పొడిగించే ప్రసక్తే ఉండదని కూడా స్పష్టం చేసింది. ఈ పథకం కింద అక్రమ ఆదాయం వెల్లడించేవారు జరిమానా, సర్‌చార్జ్ మొత్తం కలిపి 45 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రాసిక్యూషన్ ఎదుర్కోనక్కర్లేదు. -
వికారాబాద్‌లో షార్ట్‌సర్క్యూట్..
రూ.5 లక్షల ఆస్తి నష్టం వికారాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడిలో మంగళవారం షార్ట్‌సర్క్యూట్ జరిగి ఆస్తినష్టం సంభవించింది. సుమారు 30 ఇళ్లల్లో ఈ ప్రమాదం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయాయి. వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. టీవీ, రిఫ్రిజిరేటర్‌తో పాటు పలు విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కాలనీలో రూ.5 లక్షల విలువ చేసే ఎల క్ట్రానిక్స్, ఫర్నిచర్ బూడిదైంది. -
షావొమీ... ‘స్మార్ట్’ బాట!
దశలవారీగా భారత్‌లో స్మార్ట్ ఉపకరణాలు ఈ ఏడాదే ఎయిర్ ప్యూరిఫయర్స్ షావొమీ ఇండియా హెడ్ మను జైన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ ‘స్మార్ట్’ బాట పట్టింది. భారత్‌లో స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ బ్యాండ్, పవర్ బ్యాకప్, యాక్సెసరీస్‌ను విక్రయిస్తున్న ఈ సంస్థ వినూత్న స్మార్ట్ ఉపకరణాలను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్లను పరిచయం చేయనుంది. టీవీలు, రౌటర్లు, వాటర్ ప్యూరిఫయర్లు, మస్కిటో రెపెల్లెంట్, ఎలక్ట్రికల్ బైసికిల్, డ్రోన్, బూట్లు, రైస్ కుకర్, ల్యాప్‌టాప్‌ల వంటి స్మార్ట్ ప్రొడక్ట్స్‌ను సైతం కంపెనీ తయారు చేస్తోంది. వ చ్చే ఏడాది నుంచి వీటిని దశలవారీగా ఇక్కడి మార్కెట్లోకి తీసుకు రావాలని నిర్ణయించినట్టు షావొమీ ఇండియా హెడ్ మను జైన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ప్రతి ఉపకరణాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించవచ్చని తెలిపారు. వేటికవే ప్రత్యేకం..: షావొమీ వాటర్ ప్యూరిఫయర్‌లో నాలుగు ఫిల్టర్లుంటాయి. ఏది పాడైనా వెంటనే కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌కు, అలాగే కంపెనీ కేంద్ర కార్యాలయానికి సమాచారం వెళ్తుంది. ఒక్క క్లిక్‌తో ఫిల్టర్‌ను ఆర్డరివ్వొచ్చు. టెక్నీషియన్ అవసరం లేకుండానే అయిదు నిముషాల్లో బిగించొచ్చు కూడా. -
ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు
పులివెందుల రూరల్: ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఎంతో అవసరమని అనంతపురం జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ పాండు రంగడు అన్నారు. పట్టణంలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఈసీఈ విభాగంలో ‘శ్యాండ్ అన్ లైనింగ్ ప్రోగ్రాం ఆన్ ఎంఎస్పీ 430 అండ్ టీఐవీఏ మైక్రో కంట్రోలర్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు బోధించి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పరిశోధన రంగంలో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సుబ్బారెడ్డి, ఈసీఈ హెచ్‌వోడీ చంద్రమోహన్‌రెడ్డి, అధ్యాపకులు అపర్ణ, తాజ్ మహబూబ్‌తోపాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
ఆదిలాబాద్ క్రైం : ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్‌నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. భీంరావు నార్వేడే బుధవారం తన కుటుంబ సభ్యులతో ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ఉదయం వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భీంరావుకు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ చేరుకునేలోపే స్థానికులు మంటలు ఆర్పేశారు. భీంరావు ఇంటికి వచ్చే సరికి పూర్తిగా ఇల్లు దగ్ధమైంది. ఇంటిపై కప్పుతో పాటు ఇంట్లోని టీవీ, బీరువా, అందులోని రూ. 1200 నగదుతో పాటు, ముఖ్యమైన దస్తావేజులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ. లక్ష వరకు ఆస్తినష్టం జరిగిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్ విజయ్ వారిని పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా చూస్తామని విజయ్ పేర్కొన్నారు. -
ఆ పనికే రోజుకు పదిన్నర గంటలు పోతోంది
న్యూయార్క్: స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్స్, పర్సనల్ కంప్యూటర్స్, మల్టీ మీడియా డివైసెస్, వీడియో గేమ్‌లు, రేడియోలు, డీవీడీలు, డీవీఆర్లు, టీవీల స్క్రీన్లపై మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాం. ఎవరైనా అధ్యయనం జరిపి, వాటి వివరాలను క్రోడీకరిస్తే చెప్పవచ్చు. వీటిపై అమెరికా పౌరులు మాత్రం రోజుకు సరాసరి సగటున పది గంటల 39 నిమిషాల సమయాన్ని వెచ్చిస్తున్నారని నీల్సన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణలోకి తీసుకొని సర్వే చేయగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమెరికా పౌరులు ఈ స్క్రీన్లపై వెచ్చించిన సమయం 9 గంటల, 39 నిమిషాలు. అంటే గతేడాదికి ఈ ఏడాదికి వీటిపై వెచ్చిస్తున్న సమయం గంట పెరిగింది. ఫొటోలు తీయడానికి, టెక్స్ట్ టైప్ చేయడానికి పడుతున్న సమయాన్ని ఈ పదిన్నర గంటలలోకి తీసుకోలేదు. ఎక్కువ వరకు స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం వల్ల ఈ గంట సమయం పెరిగింది. నెట్ఫిక్స్, హులు లాంటి ఆన్లైన్ డిమాండ్ ద్వారా సినిమాలు చూడడం వల్ల కూడా ఇందులో కొంత సమయం పెరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలేవీ తనకు ఆశ్చర్యానికి గురి చేయడం లేదని, ఎలక్ట్రానిక్ డివైసెస్ పెరుగుతుండడం వల్ల స్క్రీన్లపై మనం వెచ్చిస్తున్న సమయం పెరుగుతోందని, వచ్చే ఏడాది ఇది మరింత పెరిగే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్శిటీలోని హెల్త్ సోషియాలోజి విభాగానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్ గోర్ట్మేకర్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి సర్వేకు, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇలా వెచ్చిస్తున్న సమయంపోను మిగతా సమయాన్ని మనిషి ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారన్నదే తన ముఖ్యమని ఆయన అన్నారు. అమెరికాలోని పెద్దవాళ్లలో 81 శాతం మందికి స్మార్ట్ఫోన్లు ఉన్నాయని, వారు తమ స్మార్ట్ఫోన్లను వారు రోజులో సరాసరి సగటున గంటా 39 నిమిషాలు ఉపయోగిస్తున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో ఇప్పటికీ రేడియోలు, టెలివిజన్లను ఉపయోగించడం విశేషం. 94 శాతం పెద్దవారికి అక్కడ హెచ్డీ టెలివిజన్లు అందుబాటులో ఉన్నాయి. వారు సినిమాలు, ఇతర కార్యక్రమాలను రోజుకు నాలుగున్నర గంటలపాటు టెలివిజన్‌లో వీక్షిస్తున్నారు. వారానికి 168 గంటలు. వాటిలో నిద్రకుపోయే సమయాన్ని రోజుకు ఆరు గంటల చొప్పున తీసేస్తే మిగిలే సమయం 126 గంటలు. అందులో ఆఫీసులో పనిచేసే కాలాన్ని వారానికి 40 గంటలు తీసేస్తే మిగిలే సమయం 86 గంటలు. కాలకృత్యాల నుంచి మొదలుకొని స్నానం చేసేవరకు, వంట వండుకొని తిని ఆఫీసుకు బయల్దేరే వరకు వ్యక్తిగత పనులకు రోజుకు మూడు గంటల చొప్పున వారానికి 21 గంటలను తీసేస్తే మిగిలే సమయం 65 గంటలు. రోజుకు పదిన్నర గంట బదులు పది గంటలనే స్క్రీన్లపై వెచ్చిస్తున్నామనుకొని లెక్కిస్తే దానికే వారానికి 70 గంటలు కావాలి. అంటే మిగిలే సమయమే అమెరికా పౌరులకు లేదన్నమాట. నిద్రనో, వ్యక్తిగత పనులకు వెచ్చిస్తున్న సమయాన్నో వారు ఇందుకు ఉపయోగించుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇక వ్యక్తిగల అలవాట్ల విషయానికి వస్తే వాకింగ్, జాగింగ్, స్నేహితులతో ముచ్చట్లు, వీకెండ్ పార్టీలు, పిల్లలతో గడిపేందుకు ఒక్క నిమిషం కూడా మిగలడం లేదన్న మాట. ఇలాంటి పరిస్థితుల కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఆటలు, పాటలు లేకుండా పిల్లలు స్క్రీన్లకే అతుక్కు పోతుండడం వల్ల అమెరికాలో ఊబకాయం సమస్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు తరుణోపాయం కనుక్కోవాల్సిందే! -
ఫ్రిజ్కి ‘ముక్కు’ వచ్చింది!
కుళ్లిపోయిన లేదా కుళ్లిపోవ డానికి సిద్ధంగా ఉన్న ఏ ఆహార పదార్థాలనైనా, మనం వాసనను బట్టి ఇట్టే పసిగడుతుంటాం. కానీ ఫ్రిజ్‌లో ఉన్నవి అలా గుప్పుమని వాసన వేయవు. దాంతో మనం వాటిని పట్టించుకోం. బాగానే ఉంటాయ్‌లే అనుకుంటాం. తీరా అవసరమై చూసేసరికి అవి కాస్తా కుళ్లిపోతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీ ఫ్రిజ్కి ఓ ముక్కుని తగిలించండి. అంటే... ఈ ‘ఫ్రిజ్ నోస్’ అనే పనికరాన్ని బిగించండి. ఇది ఓ ఎలక్ట్రానిక్ పరికరం. ఇందులో సెన్సార్లు ఉంటాయి. ఫ్రిజ్‌లో పదార్థాలు పాడైపోయే దశకు కనుక చేరుకుంటే ఇది పసిగట్టేస్తుంది. అలారం మోగించి మనల్ని అలర్ట్ చేస్తుంది. దాంతో మనం వెంటనే వాటిని వాడేయవచ్చు. వద్దు అనుకుంటే కుళ్లిపోయేలోపే తీసి పారేయొచ్చు. భలేగా ఉంది కదూ ఈ ‘ముక్కు’ ముచ్చట! -
‘గురుత్వ’ మూలాలను కనిపెట్టే టెలిస్కోప్
వాషింగ్టన్: గురుత్వతరంగాల మూలాలను గుర్తించే పరిశోధనలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. అత్యంత శక్తివంతమైన కాంతి కణాలను నాసా శాస్త్రవేత్తలు ఫెర్మి గామా రే అంతరిక్ష టెలిస్కోప్‌లో కనుగొన్నారు. వీటి ద్వారా గురుత్వాకర్షణ తరంగాల మూలాలను కచ్చితంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 14న తొలిసారిగా గురుత్వ తరంగాలకు సంబంధించి ఉనికిని గుర్తించడంలో కొద్దిమేరకు పురోభివృద్ధి సాధించారు. కాగా, ప్రస్తుతం ఆకాశంలో సెకనులో సగం వంతు సమయంలో గామా కిరణాలను టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. టెలిస్కోప్‌లో గుర్తించిన ఈ కాంతి శక్తి రెండు నుంచి మూడు ఎలక్ట్రానిక్ వోల్ట్లు ఉంటుందని వారు తెలిపారు. -
ప్రమాదకర వ్యర్థాల కోసం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. తొలిసారి ఈ జాబితాలో టైర్లు, ఖనిజపు చెత్త, కాగితం, కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్ని చేర్చారు. వాటిని పునశ్శుద్ధి చేసి తిరిగి వినియోగించవచ్చని కేంద్రం తెలిపింది. పునర్వినియోగానికి దిగుమతి చేసుకునే ఖనిజపు చెత్త, పేపర్ వ్యర్థాలు, వివిధ రకాల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని వీటి నుంచి మినహాయించారు. అనుమతి, రవాణా, దిగుమతి, ఎగుమతుల నిబంధన ల్లో మార్పులతో పాటు ప్రమాదకర వ్యర్థాల నిర్వహణను సరళతరం చేశామని కేంద్రం తెలిపింది. -
విద్యార్థినితో ఇన్చార్జి అసభ్యకర ప్రవర్తన
♦ పాఠశాలపై కుటుంబ సభ్యుల దాడి ♦ మల్కాజిగిరి పీఎస్ పరిధిలో ఘటన హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని పట్ల ఇన్చార్జి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె తరఫువారు పాఠశాలపై దాడి చేసిన ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన విద్యార్థిని (15) మౌలాలీలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టెన్త్ చదువుతోంది. పాఠశాల ఫ్లోర్ ఇన్చార్జి వెంకటరమణ కొన్ని రోజులుగా విద్యార్థినికి అసభ్యకర ఎస్ఎంఎస్లు పంపించడమే కాకుండా, ఆమె చదువుకొనే డెస్క్‌పై పేరు రాసి వేధిస్తున్నాడు. తనతో బాగుం టేనే ఇంటర్నల్ మార్కులు బాగా వేస్తానని బెదిరించడంతో విద్యార్థిని విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. శనివారం ఆమె తండ్రితో పాటు మరికొందరు పెద్ద ఎత్తున వచ్చి స్కూల్ అద్దాలు పగులగొట్టారు. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు దాడికి పాల్పడినవారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు: ఏసీపీ విద్యార్థిని డెస్క్‌పై పేరు ఎవరు రాశారన్నది దర్యాప్తులో తేలుతుందని, అయితే పాఠశాలపై దాడి చేయడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్‌రెడ్డి అన్నారు. పాఠశాల అడ్మినిష్ట్రేషన్ అధికారి వికాసరావు దాడిపై ఫిర్యాదు చేశారన్నారు. కాగా, తన కుమార్తెను పాఠశాల ఇన్చార్జి వేధిస్తున్నాడంటూ విద్యార్థిని తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమని భావిస్తున్న ఫ్లోర్ ఇన్చార్జి పరారీలో ఉన్నట్టు తెలిసింది. -
విశాఖలో ‘సమీర్’కు కేంద్రమంత్రి శంకుస్థాపన
► ఏర్పాటుకానున్న ఎలక్ట్రానిక్ రీసెర్చ్, ఇంక్యుబేషన్ కేంద్రాలు విశాఖపట్నం: సాగర నగరిలో మరో ప్రతిష్ఠాత్మక కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో కేంద్ర కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో రూ.80.02 కోట్లతో గంభీరం ఐటీ సెజ్‌లో ఏర్పాటు కానున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) సెంటర్‌కు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం శంకుస్థాపన చేశారు. ఎలక్ట్రానిక్ రీసెర్చ్ సెంటర్, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘సమీర్’ విశాఖలో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇంటర్ఫిరెన్స్ అండ్ కంపాటిబిలిటీ విభాగంలో పరిశోధనలు చేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలకు అవసర మైన ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్‌కు ఇది వేదిక కానుంది. దీనివల్ల రక్షణ రంగంతో పాటు అకడమిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పరిశోధనల స్థాయి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సంబంధిత ఇంటర్ఫిరెన్స్, కంపాటిబిలిటీ, పల్స్ తదితర సౌకర్యాలను ఈ కేంద్రం కల్పిస్తుంది. దీని ద్వారా తూర్పు తీరం లో ఐటీ ఉత్పత్తుల విక్రయ, వినియోగదారులకు ల బ్ధి చేకూరనుంది. ఆర్మీ, నేవల్ సైన్స్ అండ్ టెక్నాల జీ ల్యాబ్, డీఆర్డీవో తదితర సంస్థల అవసరాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.45 కోట్లతో ఇంక్యుబేషన్ కేంద్రం కాగా విశాఖలో ఐటీకి ఊతమిచ్చే ఇంక్యుబేషన్ సెంటర్ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చుతోంది. ఈ కేంద్ర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని వుడా కేటాయించగా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఆఫ్ ఇండియా నిర్మాణం చేపట్టబోతోంది. సిరిపురం జంక్షన్లో ఉన్న వుడా స్థలంలో ఈ కేంద్రాన్ని రూ.45 కోట్లతో నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనిషన్ అండ్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ల సమక్షంలో గురువారం దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకోనున్నారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుతో సుమారు 25వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. -
బారులు తీరును కురులు
బ్యూటిప్స్ జుట్టును స్ట్రెయిటెనింగ్ చేసుకోవడం కోసం కొందరు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించి జుట్టును పాడు చేసుకుంటారు. అలా చేయకుండా ఇంటి చిట్కాను పాటించండి. ఒక కప్పు ముల్తానీ మట్టిలో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి నీళ్లతో బాగా కలపండి. అందులో ఒక గుడ్డు తెల్లసొనను వేసి పేస్ట్ చేసుకోండి. తర్వాత జుట్టును స్ట్రెయిట్‌గా దువ్వుకుంటూ ఈ మిశ్రమంతో ప్యాక్ వేసుకోండి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలంటు స్నానం చేయండి. మీ జుట్టు స్ట్రెయిట్ గానే కాక నిగారిస్తుంది కూడా. జుట్టుకు కండీషనర్ రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మాడుకు తగలనివ్వకండి. కేవలం జుట్టు సగభాగం నుంచి మాత్రమే అప్లై చేసుకోండి. అందులోని రసాయనాలు మాడుకు తగిలితే కుదుళ్ల దగ్గరుండే ఆరోగ్యకరమైన ఆయిల్స్ తొలగిపోతాయి. అంతేకాకుండా మార్కెట్లోని కండీషనర్లతో కాకుండా ఏ పెరుగుతోనో కొబ్బరిపాలతోనో జుట్టును కండీషన్ చేసుకోవడం మేలు. జుట్టుకు సరైన పోషకాలు అందాలంటే రోజూ రాత్రి పడుకునే ముందు మాడుకు నూనెను రాసుకోండి. అలాగే పెద్ద పళ్ల దువ్వెనతో కుదుళ్లకు తగిలేలా దువ్వుకోవాలి. రోజూ కుదరని వాళ్లు వారానికి నాలుగుసార్లు ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది. అందుకు ఆలివ్ ఆయిన్ను కానీ కొబ్బరి నూనెను కానీ ఉపయోగించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కురులు బారులు తీరక మానవు. -
అదిగో.. ఆటోమేటెడ్ భూతం..!
‘ఐటీ’ జనులారా.. జర భద్రం..! ♦ ఐఓటీ, ఏఐ విప్లవంతో అన్ని రంగాల్లో సమూల మార్పులు ♦ వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధస్సు ♦ మనుషులకన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యంతో పనులు ఇరవయ్యో శతాబ్దం ముగిసే సమయానికి సమాచార విప్లవం ప్రపంచ స్వరూపాన్నే మార్చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతికత) విశాల ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది. ఐటీ .. అన్ని రంగాలనూ అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది. 21వ శతాబ్ది ఆరంభంలో అన్ని రంగాల్లోనూ ఐటీ అత్యంత ముఖ్యమైన భాగమైంది. అయితే.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కార్మికుల ఉపాధి అవకాశాలను యాంత్రీకరణ, కంప్యూటరీకరణ విప్లవాలు దెబ్బతీసినట్లుగా.. ఐటీ రంగాన్నీ ముంచుకొస్తోన్న మరో విప్లవం వణికిస్తోంది. దానితో మున్ముందు ఐటీ రంగం.. అందులోని ఉపాధి అవకాశాల పరిస్థితులు సమూలంగా మారిపోనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ విప్లవమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్! అంటే.. ఇంటర్నెట్తో కూడిన వస్తుజాలం.. వాటికి కృత్రిమ మేధస్సు! కార్మికుల ఉపాధి అవకాశాలు తగ్గిపోవటానికి కంప్యూటరీకరణే ప్రధాన కారణమైతే.. ఆ కంప్యూటర్ల నిర్వహణలో పని చేసే నిపుణులు ఐటీ ఉద్యోగులుగా విలసిల్లుతున్నారు. భవిష్యత్తులో ఈ కంప్యూటర్ల నిర్వహణ సర్వస్వమూ కంప్యూటర్లే చూసుకోనున్నాయి. ఒక్క ఐటీనే కాదు.. సమస్త రంగాలనూ రానున్న విప్లవం ప్రభావితం చేయనుంది! సకల వస్తుజాలమూ ఇంటర్నెట్తో అనుసంధానమై.. కృత్రిమ మేధస్సుతోమనుషులకన్నా ఎక్కువ కచ్చితత్వంతో మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. - పృథ్వీరాజ్ ఏమిటీ.. ఐఓటీ - ఏఐ? ఎలక్ట్రానిక్ పరికరాలు.. హైటెక్ పరికరాలు కానీ, మామూలు పరికరాలు కానీ.. అన్నీ ఒక దానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. మెషీన్ టు మెషీన్ (ఎం టు ఎం) ప్రొటోకాల్ సాయంతో పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో ఆ సమాచారాన్ని విశ్లేషించుకుని తమకు తాముగానే పనులు చేసుకుంటూ పోతుంటాయి. ఇందులో మానవ ప్రమేయం కానీ.. సూచనలు కానీ అవసరం ఉండదు. కానీ.. వీటిని దూరం నుంచి నియంత్రించవచ్చు (రిమోట్ కంట్రోలింగ్). స్మార్ట్ ఇళ్లు, ఆటోమేటెడ్ రైళ్లు, రోబోటిక్ ట్రక్కులు, ఎస్కలేటర్లు, మినరల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, కార్ల తయారీ తదితర చాలా పారిశ్రామిక రంగాల్లో ఇప్పటికే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతోంది. అంటే.. ఇప్పటివరకూ యంత్రాలను నియంత్రించేందుకు అవసరమైన మానవ శ్రమ కూడా మరింతగా తగ్గిపోతోంది. యంత్రాలు తమకు తాముగా పని చేసుకుపోవటం.. సుదూరంగా ఎవరో ఒకరు మాత్రమే అన్ని యంత్రాలనూ నియంత్రించటం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్తే.. వేర్వేరు ప్రాంతాల్లోని వివిధ స్వయంచలిత యంత్ర పరిశ్రమలను.. ఒకే కేంద్రం నుంచి అతి తక్కువ సంఖ్యలో మానవులు నియంత్రించవచ్చన్నమాట. ఆ నియంత్రణను కూడా ఆటోమేటెడ్ చేసేస్తే.. మానవ పర్యవేక్షణను అత్యంత కనిష్ట స్థాయికి కుదించవచ్చు. దీనివల్ల భారీ పరిశ్రమల్లో కార్మికులు, ఉద్యోగుల జీతభత్యాల వంటి నిర్వహణ వ్యయం కనిష్టానికి తగ్గిపోవటమే కాదు.. ఐఓటీ, ఏఐల వల్ల ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి, విశ్లేషణ జరుగుతుంది కాబట్టి.. అవసరమైన పరికరాలను, అవసరమైన మార్పులతో ఉత్పత్తి చేస్తుంటాయి. అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు... మనుషులకు అవసరమైన సమస్త సేవల్లోనూ ఐఓటీ, ఏఐ విస్తరిస్తుంది. వాటితో కూడిన పరికరాలు ఆరోగ్య రంగంలో సైతం మనుషుల్లో రక్తపోటు, చక్కెర వంటి వాటిని నిరంతరం పరిశీలిస్తూ, సమాచార మార్పిడి ద్వారా విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్సలు, మందులను అందించటం చేస్తాయి. న్యాయవ్యవస్థలోనూ ఐఏ, ఐఓటీ పెను మార్పులు తీసుకువస్తుంది. ఆర్టిఫిషియల్ జ్యుడీషియల్ ఇంటెలిజెన్స్‌తో.. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు, లేదా ప్రమాదాలు చేసినపుడు వాటికవిగానే ఆగిపోతాయి. వాటికవిగానే ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి.. సాక్ష్యాధారాలను రికార్డు చేసి.. అక్కడికక్కడే తీర్పు చెప్పటం జరిగిపోతుంది. పోలీసులు లేదా వైద్య సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇలా.. కేవలం పారిశ్రామిక, ఉపాధి రంగాల్లోనే కాదు మొత్తం ఆర్థిక వ్యవస్థ రూపురేఖలే సమూలంగా మారిపోతాయని.. ప్రస్తుత స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవ్యవస్థ ‘స్మార్ట్, క్లౌడ్ ఎకానమీ’గా మారుతుందని విశ్లేషకుల అంచనా. మానవ శ్రమకు డిమాండ్ పడిపోతుంది కృత్రిమ మేధస్సుతో కూడిన ప్రత్యేక అప్లికేషన్లు, రోబోటిక్ పరికరాలు, ఇతర ఆటోమేషన్ రూపాల ఫలితంగా.. మానవ శ్రమకు డిమాండ్ గణనీయంగా పడిపోతుంది. వాటి ఉత్పత్తి, వినియోగం పెరిగిపోతున్న కొద్దీ.. నిరుద్యోగితా పెరిగిపోతూ ఉంటుంది. తరచుగా చేసే ఒక తరహా పనుల్లో మనుషుల శక్తి సామర్థ్యాల కన్నా యంత్రాల శక్తి సామర్థ్యాలు అధికంగా ఉండటం దీనికి కారణం. ముందుగా ప్రభావితమయ్యే రంగం.. సమాచారం ఆధారంగా నడిచే ఐటీ ఉద్యోగ రంగమని, అందులోనూ ప్రవేశ స్థాయిలో ఉద్యోగాలపై ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. భారీ స్థాయిలో సమాచార మార్పిడి, విశ్లేషణలు చేయగల ఎక్స్పర్ట్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్ వ్యవస్థల వినియోగంతో ఈ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోతాయన్నది అంచనా. ఐటీ రంగం ఆటోమేటెడ్ అవుతుంది..! రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) వంటి ‘ఆటోనామిక్స్’లో వస్తున్న పరిణామాల ఫలితంగా.. కాల్ సెంటర్, టెక్నికల్ ఆపరేషన్ వర్క్ వంటి మనుషులు చేసే పనులు ఆటోమేటెడ్ అయిపోయే అవకాశముందని ఐటీ రంగ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. మెషీన్ లెర్నింగ్, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధితో పలు పనుల ఆటోమేషన్ జరుగుతుందని.. ఫలితంగా ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ వస్తుందని నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) చైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తాజాగా హైదరాబాద్‌లో జరిగిన స్పిన్ (సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ నెట్వర్క్) సదస్సులో పేర్కొన్నారు. ప్రస్తుత ఐటీ రంగ నిపుణులకు కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంలో పునఃశిక్షణనివ్వటం పెద్ద సవాలు అవుతుందన్నారు. ఇప్పటికే దేశంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని.. గత ఏడాది 2.5 లక్షల మందికి ఈ రంగంలో ఉద్యోగాలు లభించగా.. ఈ ఏడాది అది 2.3 లక్షలకు తగ్గుతుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మేధస్సును మెషీన్లు అనుకరించగలవా? మానవ మెదళ్లను మెషీన్లు అనుకరించగలవని.. మానవ మెదళ్లు తెలివైనవి కాబట్టి మెషీన్లు అనుకరించే మెదళ్లు కూడా తెలివైనవిగా తయారయ్యే అవకాశముందని కొందరు నిపుణుల వాదన. మెదడును నేరుగా హార్డ్వేర్లోకి, సాఫ్ట్‌వేర్‌లోకి కాపీ చేయటం సాధ్యమేనని.. అలా కాపీ చేసిన మెదళ్లు తెలివిగలవై ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే.. యంత్రాలు ఇప్పటికే తెలివైనవని.. కానీ దానిని గుర్తించటంలో పరిశీలకులు విఫలమవుతున్నారని మరికొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. డీప్ బ్లూ అనే సూపర్ కంప్యూటర్ గ్యారీ కాస్పరోవ్‌ను చదరంగంలో ఓడించినపుడు ఆ యంత్రం తెలివిగా ప్రవర్తించిందని వారు ఉదహరిస్తున్నారు. అయితే.. ఈ ఆటను చూసిన వారు అది కేవలం యంత్రపు కృత్రిమ మేథస్సు ప్రవర్తనేనని.. నిజమైన మేధస్సు కాదని వాదిస్తున్నారని చెప్తున్నారు. ఐఏ పరిశోధనలు.. పరిణామాలివీ... తర్కశాస్త్రం - గణితశాస్త్రంలో పరిశోధనల ఫలితంగా ప్రోగ్రామబుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ను తయారు చేశారు. అదే సమయంలో న్యూరాలజీ (నాడీ శాస్త్రం)లో పరిశోధనలు, సమాచార సిద్ధాంతం, సైబర్నెటిక్స్ (సమాచార నియంత్రణ యంత్రాధ్యయనం)ల్లో కొత్త ఆవిష్కరణల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మెదడును నిర్మించవచ్చని శాస్త్రవేత్తలు బలమైన విశ్వాసానికి వచ్చారు. ఈ క్రమంలో 1956లో అమెరికాలో డార్ట్మౌత్ కాలేజ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనకు బీజం పడింది. చెకర్స్ ఆటలో గెలిచే కంప్యూటర్లు, అల్జీబ్రాలో పద సమస్యలను పరిష్కరించే, ఇంగ్లిష్ మాట్లాడే కంప్యూటర్లను తయారు చేశారు. 1997లో ఐబీఎం తయారు చేసిన డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ తయారైంది. అది.. నాటి ప్రపంచ చదరంగం చాంపియన్‌ను ఓడించి తన మేధస్సును చాటింది. 2011లో ఐబీఎం సంస్థే తయారు చేసిన వాట్సన్ సూపర్ కంప్యూటర్ జియోపార్టీ క్విజ్ (ప్రశ్న - సమాధానాలు) షోలో ఇద్దరు గొప్ప చాంపియన్లను ఓడించింది. ఐఓటీ పరిశోధన.. పరిణామాలిలా... ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, సెన్సర్స్, నెట్వర్క్ కనెక్టివిటీ అన్నీ కలసివున్న భౌతిక వస్తువులను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వస్తువులు సమాచారాన్ని సేకరించి.. పరస్పరం మార్పిడి చేసుకోగలవు. వైర్లెస్ కమ్యూనికేషన్ నుంచి ఇంటర్నెట్ వరకూ.. ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి మైక్రో ఎలక్ట్రానికల్ సిస్టమ్స్ వరకూ అనేక సాంకేతిక పరిజ్ఞానాల కలయికతో ఐఓటీ ఏర్పడుతుంది. స్మార్ట్ పరికరాల అనుసంధానం విధానాన్ని 1982లో తొలిసారిగా చర్చించారు. కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో తొలిసారిగా ఒక కోక్ మెషీన్‌ను ఇంటర్నెట్తో అనుసంధానించారు. తనవద్ద ఉన్న కోక్ బాటిళ్ల వివరాలు, కొత్త బాటిళ్లు చల్లగా ఉన్నాయా లేదా అన్న సమాచారాన్ని అది ఎప్పటికప్పుడు నివేదిస్తుంటుంది. 1999 నాటికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విస్తృత ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడి నుంచి మీడియా, పర్యావరణ పర్యవేక్షణ, మౌలికవసతుల నిర్వహణ, తయారీ, ఇంధన నిర్వహణ, వైద్య, ఆరోగ్యపరిరక్షణ వ్యవస్థలు, భవనాలు, ఇళ్ల ఆటోమేషన్, రవాణా తదితర రంగాల్లో ఐఓటీ విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ అనుసంధానం పెరుగుతోంది. ప్రస్తుతం అత్యధికంగా దక్షిణ కొరియాలో ప్రతి 100 మందికీ 37.9 వస్తువులు ఐఓటీలో ఉండగా.. 24వ స్థానంలో ఉన్న భారత్‌లో ప్రతి వేయి మందికీ ఆరు వస్తువులు ఐఓటీలో ఉన్నాయి. ఈ ఐఓటీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను జతచేయటంతో.. అది పెను విప్లవంగా మారుతోంది. 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఐదువేల కోట్ల పరికరాలు ఐఓటీలో ఉంటాయని పరిశీలకుల అంచనా. కృత్రిమ మేధస్సుతో మానవ మనుగడకే ముప్పు! పూర్తిస్థాయి కృత్రిమ మేథస్సు అభివృద్ధి చెందితే.. అది మానవ జాతి అంతానికి దారితీయవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేర్కొన్నారు. అదెలాజరుగుతుందనే దానిపై నిక్బోస్ట్రామ్ అనే రచయిత తన ‘సూపరింటెలిజెన్స్’ పుస్తకంలో అంచనా వేశారు. దాని ప్రకారం.. తొలుత మనుషులు కృత్రిమ మేథస్సుకు బీజం వేస్తారు. ఆ ఏఐ మనుషులపై ఆధారపడుతూ తన మేధస్సును పెంచుకుంటుంటుంది. రెండో దశలో తనకు తానుగా మేధస్సును మెరుగుపరచుకునే స్థాయికి చేరుతుంది. ఈ దశలో మానవ మేధస్సు పరిమితులను అధిగమించిపోయే అవకాశముంది. ఈ దశలో మానవ మేధస్సుకు అందని నైపుణ్యాలను, వ్యూహాలను సంతరించుకుని తన రూపురేఖలను (డిజైన్‌ను) తానే మార్చుకోగల స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. మూడో దశలో మరింత దీర్ఘ కాలిక లక్ష్యాల కోసం రహస్యంగా వ్యూహాలను తయారు చేసుకుని, రహస్యంగా ఏర్పాట్లు చేసుకునే పరిస్థితిలోకి వెళ్లవచ్చు. చివరిదైన నాలుగో దశలో ఏఐ మనుషులపై దాడికి దిగవచ్చు.. మనుషులు తనను ఎదుర్కోవటానికి ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న ఏర్పాట్లను ధ్వంసం చేసి.. మనుషులు తన మనుగడకు ప్రమాదకరమన్న భావనతో మానవజాతినే నిర్మూలించే ప్రయత్నం చేయవచ్చు. ఈ క్రమంలో మొత్తం భూగోళాన్నే తీవ్రంగా ధ్వంసం చేసే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు. ఈ అంచనాలతో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై అనేక సైన్స్ ఫిక్షన్ నవలలు, సినిమాలు వచ్చాయి. ఇస్సాక్ అసిమోవ్ ‘త్రీ లాస్ ఆఫ్ రోబోటిక్స్’ నుంచి.. ఆర్థర్ సి. క్లార్క్ రాసిన 2001 ఎ స్పేస్ షిప్ ఒడిస్సీ నవల, సినిమా.. అనంతరం వచ్చిన టెర్మినేటర్ సినిమాలు ఈ కోవలోనివే. -
గాయం మాయం
హాలీవుడ్ సినిమా ఎక్స్‌మెన్ చూశారా మీరు? అందులోని వొల్వరీన్ పాత్ర గుర్తుందా? హ్యూగ్ జాక్‌మ్యాన్ చేసిన ఈ పాత్రకో ప్రత్యేక లక్షణముంది. ఎంతటి గాయమైనా సరే... క్షణాల్లో మానిపోతుంది. మధుమేహం బారిన పడితే ఏమవుతుంది? రక్తంలో చక్కెర మోతాదులు పెరిగిపోతాయి. కాలేయం తగుమోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తే అంతా సర్దుకుంటుంది. ఇంకోలా చెప్పాలంటే... మందులు మింగే పనిలేకుండా... వ్యాధి నయమవుతుందన్నమాట! ఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? చాలానే ఉంది. వోల్వరీన్ పాత్ర మాదిరిగా మన శరీరాలకూ తనంతట తానే వ్యాధులను నయం చేసుకోగల సామర్థ్యం అబ్బితే ఎలా ఉంటుందో చెప్పేందుకే పై ప్రస్తావన. అదెలా సాధ్యమనుకోవద్దు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతుతో అక్కడి మిలటరీ పరిశోధన సంస్థ డార్పా ఇప్పటికే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టేసింది. అన్నీ సవ్యంగా సాగితే... కొన్నేళ్లలోనే కొన్ని రకాల వ్యాధులకు శరీరమే చికిత్స చేసుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. మానవశరీరం ఎంత సంక్లిష్టమైందో మనకు తెలియంది కాదు.. కానీ శాస్త్ర విజ్ఞానం పుణ్యమా అని మనకు మన శరీరం ఎలా పనిచేస్తుందన్న విషయంపై కొంత అవగాహన ఉంది. దీని ప్రకారం... మన నాడీ వ్యవస్థ అవయవాల స్థితిగతులపై నిత్యం ఓ కన్నేసి ఉంటుంది. ఏదైనా గాయమైనా, లేదా ఇన్ఫెక్షన్ సోకినా ఆయా అవయవాల స్పందనలను నియంత్రించేందుకూ నాడీ వ్యవస్థ తోడ్పడుతుంది. ఈ నియంత్రణ వ్యవస్థలో తేడాలొచ్చినప్పుడు ఇదే నాడీ వ్యవస్థ నొప్పి, వాపు, పూత, రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యాలకు సంబంధించిన సంకేతాలూ పంపుతుంది. ఈ ప్రాథమిక పరిజ్ఞానం ఆధారంగా డార్పా తన సరికొత్త ప్రాజెక్ట్ ‘ఎలక్ట్రిక్స్’ ద్వారా శరీరమే ఆటోమెటిక్‌గా వ్యాధులను నయం చేసుకునే వ్యవస్థను రూపొందిస్తోంది. సూక్ష్మ రోబోలు కీలకం... ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్‌లో శరీరంలోకి ఎక్కించే అతిసూక్ష్మమైన రోబోల్లాంటి పరికరాలు కీలకమవుతాయి. చిన్న ఉదాహరణతో ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు పేస్‌మేకర్ గురించి వినే ఉంటారు. గుండెకు సూక్ష్మస్థాయిలో ఎలక్ట్రిక్ షాక్‌లు ఇస్తూ అది సాధారణ రీతిలో కొట్టుకునేలా చేస్తుంది ఈ పరికరం. పేస్‌మేకర్ మాదిరిగా ఇతర అవయవాలను ప్రేరేపించేందుకూ చిన్నచిన్న రోబోల్లాంటి పరికరాలను అభివృద్ధి చేయడం ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్ లక్ష్యం. అంటే... మధుమేహం కారణంగా ఎవరికైనా రక్తంలోని చక్కెర మోతాదులు పెరిగిపోతే... ఈ చిన్ని రోబోలు కాలేయానికి షాక్‌లాంటిది ఇచ్చి... అధికమోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా చేస్తాయన్నమాట! అన్ని రకాల వ్యాధులకూ పనికొస్తుందా? ఊహూ. ప్రస్తుతానికైతే ఎలక్ట్రిక్స్ ప్రాజెక్ట్‌ను కొన్ని వ్యాధులకే పరిమితం చేశారు. కీళ్లనొప్పులతోపాటు కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ వ్యాధులు, డిప్రెషన్ లాంటి మానసిక వ్యాధులకు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్, మూర్ఛ వంటి నాడీసంబంధ వ్యాధులకూ ఎలక్ట్రిక్స్ ద్వారా పరిష్కారాలు కనుక్కునేందుకు డార్పా ప్రయత్నిస్తోంది. కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ వ్యాధుల చికిత్స కోసం ఇప్పటికే కొన్ని పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి సైజులో చాలా పెద్దవి. శరీరంలోపలికి వాటిని చొప్పించేందుకు శస్త్రచికిత్స అవసరమవుతుంది కూడా. ఎలక్ట్రిక్స్‌లో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇంజెక్షన్ ద్వారానే పరికరాలను శరీరంలోకి పంపించవచ్చు. ఎలక్ట్రిక్స్ ద్వారా సైనికులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వెన్నుపూస సంబంధిత గాయాలను సమర్థంగా మాన్పే వీలు ఏర్పడుతుందని డార్పా అంచనా వేస్తోంది. మొత్తమ్మీద చూస్తే... డార్పా ఎలక్ట్రిక్స్ టెక్నాలజీ వ్యాధి నిర్ధారణ మొదలుకొని చికిత్స వరకూ అన్ని వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందనడంలో సందేహం లేదు. -
వారంటీ పొడిగిస్తే ఎవరికి లాభం?
ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు... బైక్, కారు వంటి ఆటోమొబైల్స్ కావచ్చు... వీటిని కొనేటపుడు ప్రతిసారీ శ్రీధర్‌కు షోరూమ్ వాళ్లు ఒక ఆఫర్ ఇస్తుంటారు. ‘‘సర్! దీనికి ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది. తీసుకోండి’’ అని. అంటే... సదరు వస్తువుకు కంపెనీ ఇచ్చే వారంటీ కాకుండా డీలర్ ఇచ్చే అదనపు వారంటీ అన్నమాట. దానిక్కాస్త ఎక్స్ట్రా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. అయితే శ్రీధర్ ప్రతి సందర్భంలోనూ వద్దని చెప్పేస్తూ ఉంటాడు. తరవాత బయటికొచ్చి... అరె! తీసుకుని ఉంటే బాగుండేదేమో!! అనుకుంటుంటాడు. మరి ఈ ఎక్స్టెండెడ్ (పొడిగించిన) వారంటీని తీసుకోవటం మంచిదా..? లేక వద్దని వదిలేయటమే మంచిదా? ఒకసారి చూద్దాం. పొడిగించిన వారంటీ అంటే నిజానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదే. ఎందుకంటే ప్రతి వస్తువుకూ సాధారణంగా ఇచ్చే వారంటీ ఒకటుంటుంది. అది నెల కావచ్చు... ఏడాది కావచ్చు. ఈ గడువులో గనక వస్తువుకేదైనా అయితే కంపెనీ దాన్ని రిపేరు చేయటమో, లేక మార్చి కొత్తది ఇవ్వటమో చేస్తుంది. ఆ గడువు అయిపోయాక గనక ఆ వస్తువు దెబ్బతింటే అప్పుడు ఈ పొడిగించిన వారంటీ పనికొస్తుంది. బీమా కంపెనీలు ఎలా పనిచేస్తాయో మనకు తెలియంది కాదు. అవి క్లెయిమ్ రూపంలో చెల్లించే మొత్తం కంటే ప్రీమియం రూపంలో వసూలు చేసే మొత్తమే ఎక్కువగా ఉంటుంది. అప్పుడే అవి క్లెయిమ్‌లు చెల్లించ గలుగుతాయి. లేదంటే దివాలా తీస్తాయి. ఈ పొడిగించిన వారంటీ కూడా ఇలానే పనిచేస్తుంది. అంటే దీనర్థం పొడిగించిన వారంటీలో క్లెయిమ్‌లు ఎక్కువగా ఉండవనేగా!? అంకెల్లో ఓ సారి చూద్దాం.. శ్రీధర్ ఎలా ఆలోచించాడో ఓ సారి చూద్దాం. తను ఓ ల్యాప్‌టాప్ కొందామనుకున్నాడు. పేరున్న రిటెయిలర్ దగ్గరకు వెళ్లాడు. రూ.36,000 ధర చెప్పిన రిటెయిలర్... కంపెనీ ఇస్తున్న ఏడాది వారంటీతో పాటు తాము రెండేళ్లు పొడిగింపు వారంటీ ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ రెండేళ్ల పొడిగింపు వారంటీ లేకుండా ల్యాప్‌టాప్ ఎంతని అడిగితే... ఆ వారంటీ (బీమా) ధర మైనస్ చేసి రూ.26,000కు ఇస్తానన్నాడు. గమనించాల్సిందేంటంటే ఏడాదిలోపు ల్యాప్‌టాప్‌కు ఏదైనా అయితే తిరిగి కొత్తదిస్తారు. రూ.36,000 పెట్టి కొంటే ఈ గడువు మూడేళ్లకు పెరుగుతుంది. అదే 26వేలు పెట్టి కొంటే ఏడాది మాత్రమే వారంటీ. ఆ తరవాత ఒక్కరోజు గడిచినా రీప్లేస్మెంట్ ఉండదు. శ్రీధర్ ఆలోచన మరోలా ఉంది. ఎలాగూ ఏడాది వరకు వారంటీ ఉంటుంది. పెపైచ్చు ల్యాప్‌టాప్ 26వేలకే వస్తుంది. ఒకవేళ ఏడాది తరవాత ఏదైనా జరిగితే... రోజురోజుకూ టెక్నాలజీ మారుతోంది కనక అప్పటికి మార్కెట్లో ఉండే కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్‌ను దాదాపు 26వేలకే కొనుక్కోవచ్చు. అలా కాకుండా ప్రస్తుతం కొన్న మోడల్‌నే అప్పుడు కూడా కొనాలంటే పాతదై పోతుంది కనక ధర కూడా దాదాపు 15-20 వేల మధ్యనే ఉంటుంది. ఒకవేళ ల్యాప్‌టాప్‌కు ఏమీ కాకపోతే మొత్తం మిగిలినట్టే. ఇలా ఆలోచించాకే... రిటెయిలర్ ఎంత ఆశ చూపించినా, ఎంతగా భయపెట్టినా శ్రీధ ర్ లొంగలేదు. తన నిర్ణయానికే కట్టుబడి ఈ పొడిగింపు వారంటీ వద్దనుకున్నాడు. మానసికంగా లాభమే! శ్రీధర్లానే అందరూ చేయాలని లేదు. ఎందుకంటే ఈ పొడిగింపు వారంటీ తీసుకోవటం వల్ల ఇతర లాభాల మాటెలా ఉన్నా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన నోబెల్ విజేత డానియెల్ కానెమన్ వంటి మానసిక విశ్లేషకులు ఏమంటారంటే... ఏదైనా లాభం వల్ల కలిగే ఆనందం కన్నా నష్టం వల్ల కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుందట. ఈ లెక్కన చూస్తే నష్టం వల్ల కలిగే బాధను, నష్టం వస్తుందనే ఒత్తిడిని దూరం చేసే పొడిగింపు వారంటీ మంచిదే. గతంలో శ్రీధర్ ఇలాంటి వారంటీలు అవసరం లేదని, వద్దని తన తోటి కస్టమర్లకు చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ మానసిక ప్రశాంతత కోణంలో ఆలోచించాక తను ఆ సిఫారసు మానుకున్నాడులెండి!!. అవసరమైనచోటే బీమా ఎప్పుడైనా బీమా తీసుకునేది అవసరమైన చోటే. అంటే... తద్వారా జరిగే నష్టాన్ని మనం భర్తీ చేసుకోలేని పరిస్థితి ఉంటేనే! మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ అన్నీ ఇలాంటివే. ఎందుకంటే నష్టం జరిగినపుడు మనం కోల్పోయేదాన్ని ఈ పాలసీలు లేకుంటే భర్తీ చేసుకోవటం కష్టం. నిపుణులు చెప్పేదేంటంటే... ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో అలా కాదు. వాటికేదైనా జరిగితే ఆ నష్టాన్ని మనం భర్తీ చేసుకోగలం. మరి అలాంటపుడు బీమా ఎందుకనేది వారి ప్రశ్న. ఇటీవల ‘బ్లూమ్‌బర్గ్’ చేసిన సర్వే ప్రకారం... ఈ పొడిగించిన వారంటీలు అమ్మకం దార్లకు ఊహించని లాభాల్ని అందిస్తున్నాయట. ఈ రకం వారంటీల కోసం కంపెనీలకయ్యే ఖర్చు చాలా తక్కువని, అవి వీటిద్వారా వినియోగదారులకు అందిస్తున్న ప్రయోజనాలు కూడా తక్కువ కావటంతో వాటికి లాభాలొస్తున్నాయని బ్లూమ్‌బర్గ్ వివరించింది. -
లైట్‌తో లాగేస్తుంది!
వాషింగ్టన్: మీరు రోడ్డుపై నడుస్తూ వెళుతున్నారు.. ఒక్కసారిగా మీపై విచిత్రమైన కాంతి పడింది.. అది అయస్కాంతంలా మిమ్మల్ని లాగేసుకుంది.. మీరు గాల్లోనే తేలిపోతూ ఆ కాంతి వచ్చినవైపు వెళ్లిపోయారు. ఇదేదో ఫిక్షన్ సినిమాలో దృశ్యంలా ఉంది కదా..! ఇలా కాంతి, విద్యుదయస్కాంత శక్తితో వస్తువులను లాగేసుకునే ‘ట్రాక్టర్ బీమ్ (ఆవేశిత విద్యుదయస్కాంత వికిరణం)’ పరికరాన్ని తయారు చేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గాల్లో తేలే స్కేట్‌బోర్డు ‘హెండో హోవర్‌బోర్డు’ను తయారుచేసిన ఆర్క్స్ పాక్స్ అనే సంస్థతో నాసా చేతులు కలిపింది. ‘ట్రాక్టర్ బీమ్’ను రూపొందించి అంతరిక్షంలోకి పంపాలని.. భూమి చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న శాటిలైట్లను ఒక్కచోటికి చేర్చి, పనితీరును మెరుగుపర్చాలని నాసా భావిస్తోంది. దాంతోపాటు శాటిలైట్లవైపు దూసుకువచ్చే చిన్న చిన్న గ్రహశకలాలను దారిమళ్లించడమో, ధ్వంసం చేయడమో చేయవచ్చని చెబుతోంది. -
ఫోన్ల నుంచి విమానాల వరకూ అన్నీ పరుగులే!
ఈ చిప్ కొంచెం.. వేగం మాత్రం ఘనం. స్మార్ట్ఫోన్ల నుంచి విమానాల వరకూ ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలను, వాహనాలను ఇది పరుగులెత్తిస్తుందట. ప్రస్తుతం కంప్యూటర్లలో 14 నుంచి 22 నానోమీటర్ల మధ్య సైజులో గల చిప్‌లను వాడుతున్నారు. అయితే, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నప్పటికీ.. కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వేగం తక్కువ, విద్యుత్ వినియోగం ఎక్కువ అన్న రీతిలో పని జరుగుతోంది. అందుకే, సిలికాన్-జెర్మేనియంతో ఐబీఎం కంపెనీవారు దీనిని తయారు చేశారు. దీని సైజు 7 నానోమీటర్లేనట. సైజు తగ్గినా దీనిపై 20 బిలియన్ల ట్రాన్సిస్టర్(స్విచ్)లను అమర్చవచ్చట. ఈ చిప్‌తో విద్యుత్ వినియోగం కనీసం 50 శాతం తగ్గి, వేగం కనీసం 50 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డాటా వ్యవస్థల సామర్థ్యం పెంచేందుకూ ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు. బుల్లి చిప్‌తో భలే ప్రయోజనాలే ఉన్నాయన్నమాట. 3 బిలియన్ డాలర్ల నిధులతో చేపట్టిన పరిశోధక ప్రాజెక్టులో భాగంగా శాంసంగ్, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన గ్లోబల్ ఫౌండరీస్తో కలిసి ఐబీఎం ఈ బుల్లి చిప్‌ను రూపొందించడం విశేషం. -
డాంగిల్ సైజులో కంప్యూటర్
ఐబాల్ స్ల్పెండో ః రూ.8,999 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీలో ఉన్న ఐబాల్.. ‘స్ప్లెండో’ పేరుతో డాంగిల్ సైజులో మినీ కంప్యూటర్ను ఆవిష్కరించింది. హెచ్డీఎంఐ పోర్ట్ సౌకర్యం ఉన్న టీవీకి దీనిని అనుసంధానిస్తే చాలు. టీవీ కాస్తా కంప్యూటర్‌లా, స్మార్ట్ టీవీలా మారిపోతుంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో ఐబాల్ ఈ పరికరాన్ని రూపొందించింది. వైర్లెస్ కీబోర్డు, మౌస్ ఉచితం. ధర రూ.8,999. ఇంటెల్ ఆటమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను దీనికి పొందుపరిచారు. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. హెచ్డీ గ్రాఫిక్స్, మల్టీ చానెల్ డిజిటల్ ఆడియో, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్, రెగ్యులర్ యూఎస్బీ పోర్ట్, మైక్రో యూఎస్బీ పోర్ట్, వైఫై, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు ఉన్నాయి. అందుబాటు ధరలో లభించే చిన్న సైజు ఉపకరణాలను వినియోగించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని ఐబాల్ డెరైక్టర్ సందీప్ పరస్రామ్పురియా ఈ సందర్భంగా తెలిపారు. ఉపకరణంపై ఏడాది వారంటీ ఉంది. జూలై నుంచి మార్కెట్లో లభిస్తుంది. -
ఏమిటీ ‘పరికరం’!
వ్యవసాయ పొలంలోంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు తాండూరు: తాండూరు పట్టణంలోని మల్రెడ్డిపల్లి కాలనీలో హనుమాన్ ఫంక్షన్ హాలు వెనుక నున్న ఓ రైతు పొలంలో ఆదివారం ఎలక్ట్రానిక్ పరికరం కనిపించింది. పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పొలంలో ఎలక్ట్రానిక్ పరికరం కనిపించడంతో స్థానికులు గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పరికరానికి కెమెరా ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ పరికరాన్ని రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయడానికి ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు. పరికరంలోని బ్యాటరీలో చార్జింగ్ అయిపోవడంతో పడిపోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ నమోదు వివరాలు తెలుసుకునేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని పోలీసులు తెలిపారు. -
సైయంట్ చేతికి ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్స్
74 శాతం వాటా కొనుగోలు ర్యాంగ్‌సన్స్ ఆదాయం రూ. 1,500 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ డిజైన్, మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉన్న ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 74 శాతం వాటాను సైయంట్ (ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్) కొనుగోలు చేసింది. మొత్తం నగదు లావాదేవీగా జరిగిన ఈ వాటా కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించిందో మాత్రం తెలియరాలేదు. మిగిలిన 26 శాతం వాటాను అవసరాన్ని బట్టి వచ్చే మూడు నాలుగేళ్లలో కొనుగోలు చేసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సైయంట్ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి తెలిపారు. మైసూరు కేంద్రంగా పనిచేస్తున్న ర్యాంగ్‌సన్స్ ఎలక్ట్రానిక్స్‌లో 1,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, గతేడాది రూ. 1,500 కోట్ల (422 మిలియన్ డాలర్లు) వ్యాపారాన్ని నమోదు చేసింది. ర్యాంగ్సన్కు కీలకమైన ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో మంచి క్లయింట్లు కలిగి ఉండటమే కాకుండా వ్యాపారంలో అత్యధిక భాగం ఎగుమతుల నుంచే సమకూరుతున్నట్లు ఆయన తెలిపారు. వ్యాపారపరంగా ర్యాంగ్సన్లో వాటాను కొనుగోలు చేయడం సైయంట్‌కు చాలా కీలకమైనదని, దీంతో మా కస్టమర్లకు ఎండ్ ప్రోడక్ట్‌ను అందించగలమన్నారు. మైసూర్లో 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ర్యాంగ్‌సన్స్ ఆదాయంలో ఏటా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నది. మా వ్యాపార వ్యూహం ‘ఎస్3’ (సర్వీసెస్, సిస్టమ్స్, సొల్యూషన్స్)లో భాగంగా ర్యాగ్సన్స్ను కొనుగోలు చేశామని, దీంతో ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎమ్) కస్టమర్స్‌తో వ్యాపారం బంధం మరింత బలపడుతుందని సైయంట్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కృష్ణ బోధనపు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా ప్రచారంలో భాగంగా మా ఖాతాదారులకు ఎండ్ టు ఎండ్ ప్రోడక్టులను అందించే స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. సైయంట్ గత కొంత కాలంగా కంపెనీల కొనుగోళ్లపై దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా ఏడాది కాలంలోగా మూడో కంపెనీని కొనుగోలు చేసింది. గతంలో అమెరికాకు చెందిన సాఫ్టెన్షియల్, ఇన్వైటీ ఇన్సైట్స్ కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
మామా అల్లుళ్లే సూత్రధారులు!
ఆర్ఆర్సీ పరీక్షపత్రం లీక్, ‘హైటెక్ కాపీయింగ్’పై కదులుతున్న డొంక పరారీలో మామ మచ్ఛేందర్, అల్లుడు మహేందర్ మహారాష్ట్రలోనూ ఇదే తంతు సాగించినట్లు వెల్లడి నిందితుల్లో తొమ్మిది మంది రైల్వే ఉద్యోగులు ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయించిన దుకాణం సీజ్ సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన ఆర్ఆర్సీ (రైల్వే నియామక విభాగం) పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో డొంక కదులుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనే కాకుండా ఈ ముఠా మహారాష్ట్రలో కూడా ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నవంబర్‌లో ఆర్ఆర్సీ రైల్వే గ్రూప్-డీ ఉద్యోగాల కోసం ఐదు దఫాలుగా 3.91 లక్షల మంది అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించింది. చివరగా నవంబర్ 30న జరిగిన పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు గుట్టు రట్టు చేసి పదిమంది అభ్యర్థులు, వారికి సహకరించిన ఇరవై మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరందరినీ మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ శేఖర్‌గౌడ్ సోమవారం కోర్టులో హాజరుపర్చి, జ్యుడీషియల్ కస్టడీ కోసం చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే పోలీసుల విచారణలో నిందితులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గత నెల 23న (ఆదివారం) నాలుగో దఫా పరీక్షల్లో కూడా ఇదే పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రశ్నపత్రం లీక్ చేసి అభ్యర్థులకు సమాధానాలు చేరవేశారని తేల్చింది. ఈ వ్యవహారానికి సూత్రధారిగా ఉన్న రైల్వే ఎలక్ట్రానిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మచ్ఛేంద్ర మౌలాలిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం మాదిరిగానే మహారాష్ట్రలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. తన అల్లుడు మహేందర్‌తో కలసి ఈ మొత్తం వ్యవహారం నడిపించాడు. వీరికి రెండు పరికరాలు కీలకంగా మారాయి. ఒకటి.. మెడలో వేసుకునే తాయెత్తు మాదిరిగా తయారు చేసిన ‘సిమ్’ కార్డులు కలిగిన అతి చిన్న ఎలక్ట్రానిక్ డివైస్ (సెల్‌ఫోన్), రెండోది..చెవిలో పెట్టుకునే ‘వైర్లెస్ ఇయర్‌ఫోన్’. ఈ అత్యాధునిక పరికరాలను నిందితులు బేగంపేటలోని ఓ సెల్‌ఫోన్ దుకాణం నుంచి కొనుగోలు చేశారని తేలింది. ఈ దుకాణంపై పోలీసులు సోమవారం దాడి చేసి, సీజ్ చేశారు. ఇక్కడి నుంచి కీలక సాక్ష్యాధారాలను (సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు) పోలీసులు సేకరించారు. దుకాణం యజమాని పరారీలో ఉన్నాడు. ఈ పరికరాలను ఢిల్లీ, ముంబాయి నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిందితుల వద్ద లభించిన 27 సిమ్‌కార్డుల వివరాలపైనా దర్యాప్తు సాగుతోంది. నిందితులను తిరిగి కస్టడీకి తీసుకునే అవకాశం ఉందని మల్కాజ్గిరి ఏసీపీ ఎం.రవిచందన్‌రెడ్డి తెలిపారు. సూత్రధారులైన మచ్ఛేందర్, మహేందర్ల కోసం గాలిస్తున్నామన్నారు. మామా అల్లుళ్ల పథకం ఇలా... మచ్చేందర్ లాలాగూడలోని లోకోషెడ్‌లో గ్రేడ్ వన్ టెక్నీషియన్‌గా, మహేందర్ తాండూరు రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆర్ఆర్బీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ ద్వారా డబ్బు సంపాదించుకోవాలనుకున్న వీరు.. కొందరు రైల్వే ఉద్యోగులు, నిరుద్యోగులతో ముఠా తయారు చేశారు. ప్రశ్నపత్రం బయటకు రావడానికి మచ్ఛేందర్ పరీక్ష జరిగే రోజు పరీక్షా సెంటర్ వద్దకు తనతోపాటు అల్లుడు మహేందర్‌ను వెంటబెట్టుకెళ్లేవాడు. అక్కడి ఇన్విజిలేటర్లకు స్క్వాడ్‌గా పరిచయం చేసుకొని పరీక్ష హాల్లోకి వెళ్లేవాడు. ఆ సమయంలో మహేందర్ తన ఫోన్లో ప్రశ్నపత్రం ఫొటో తీసి బయట ఉన్న వ్యక్తికి పంపేవాడు. ప్రశ్నపత్రం అందుకున్న వ్యక్తి దానికి జిరాక్స్ తీయించి నలుగురైదుగురు నిపుణులైన వారితో జవాబులు తయారుచేయించేవాడు.వాటిని సెల్ ఫోన్లతో పరీక్షహాల్లో అభ్యర్థులకు చేరవేసేవారు. పట్టుబడినవారిలో ఏడుగురు విద్యార్థులు, గృహిణి, ఏడుగురు రైల్వే ఉద్యో గులున్నారు. విద్యార్థుల్లో ఎల్ఎల్బీ, ఎంటెక్, బీఈడీ చదువుతున్న వారు, రైల్వే ఉద్యోగుల్లో జూనియర్ ఇంజనీర్, ముగ్గురు లోకోషెడ్ ఉద్యోగులు, ఇద్దరు కళాసీలు, పంప్ ఆపరేటర్ ఉన్నారు. ఆర్ఆర్సీ పరీక్షల రద్దు యోచన లేదు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో వెల్లడి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌పై దక్షిణమధ్య రైల్వే అధికారికంగా స్పందించింది. నవంబర్ నెలలో 5 విడుతలుగా జరిగిన ఆర్ఆర్సీ పరీక్షలను రద్దు చేసే యోచన లేదని, 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన మాస్ కాపీయింగ్‌పై ఉన్నత స్థాయి విచారణ చేపట్టామని దక్షిణమధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి కె.సాంబశివరావు తెలిపారు. హైటెక్ తరహాలో జరిగిన ఈ ఘటనలో రైల్వే ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం తన చాంబర్లో ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన వివిధ విభాగాల నుంచి కూడా నివేదికలను తెప్పిస్తున్నట్లు చెప్పారు. -
టాక్సీలకు ఎలక్ట్రానిక్ చిప్‌లు.. : మహేశ్ శర్మ
న్యూఢిల్లీ: పర్యాటకులకు భద్రత కల్పించడం కోసం.. టూరిస్టు టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ఎప్పటికప్పుడు పర్యాటకులు, వాహనాల కదలికలను గమనించవచ్చని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక మహిళా పర్యాటకురాలిని డెహ్రడూన్‌లో అత్యాచారం చేసి, హత్య చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్ శర్మ.. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. టాక్సీల్లో ఎలక్ట్రానిక్ చిప్‌లను అమర్చడం ద్వారా దేశ, విదేశాలకు చెందిన పర్యాటకుల భద్రతకు తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఈ చిప్‌లను అమర్చిన టాక్సీల డ్రైవర్లకు సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయని, దీనిని మూడు నెలల్లోగా అమలు చేస్తామని మహేశ్ శర్మ తెలిపారు. ఈ విధానం వల్ల పర్యాటకులను టాక్సీ డ్రైవర్లు మోసం చేయడం, అధికంగా డబ్బు వసూలు చేయడం వంటివాటిని కూడా నివారించవచ్చని వెల్లడించారు. -
గాడ్జెట్ గురూ
నవతరం మెచ్చే ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్’ శుక్రవారం ప్రారంభమైంది. రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల గాడ్జెట్ షోలో 40 అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. నిత్య జీవితంలో భాగమైపోయిన గాడ్జెట్స్‌ను మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఇక్కడ ఉంచామని ఐజీఆర్ ఫౌండర్ అండ్ సీఈఓ వరుణ్ బండి తెలిపారు. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సెల్ఫోన్లు, కెమెరాలు, గేమింగ్ యాక్సెసరీస్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.2 వేల నుంచే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులోని వెరైటీలను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరు గురించి తెలుసుకున్నారు. -
నాలుగేళ్లలో నాలుగు రెట్లు
భారత్‌లో ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరు ఆర్‌ఎన్‌సీఓఎస్ నివేదిక వెల్లడి గౌహతి: భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ జోరుగా దూసుకుపోతోంది. నాలుగేళ్లలో ఈ మార్కెట్ నాలుగు రెట్ల వృద్ధిని సాధిస్తుందని రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ ఆర్‌ఎన్‌సీఓఎస్ అంచనా వేస్తోంది. ఈ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం..., భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ 2014-18 కాలానికి 40-45 శాతం చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. ప్రస్తుతం 350 కోట్ల డాలర్లు (రూ.21,000 కోట్లు)గా ఉన్న ఈ మార్కెట్ 2018 నాటికి 1,450 కోట్ల డాలర్ల(రూ.88,000 కోట్లకు మించి)కు చేరుతుంది. డిజిటల్ విప్లవం కారణంగా భారత ఆన్లైన్ రిటైల్ మార్కెట్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌లోనే అన్లైన్ రిటైల్ మార్కెట్ వేగంగా వృద్ధి సాధిస్తోంది. స్మార్ట్ఫోన్ల విక్రయాలు పెరగడం, మొబైల్ ఇంటర్నెట్ విస్తరణ, సమయం కలసి వస్తుండడం, ఆన్లైన్లో షాపింగ్ చేయడం సులభంగా, సౌకర్యకరంగా ఉండడం, ఆన్లైన్లో భారీగా డిస్కౌంట్లు లభిస్తుండడం, స్మార్ట్ఫోన్ల ద్వారా ఆన్లైన్ షాపింగ్ సులభంగా చేసుకునే వీలుండడం, మహిళలు మరింతగా టెక్నాలజీని వినియోగిస్తుండడం, బ్రాండెడ్ ఉత్పత్తుల పట్ల మక్కువ పెరగడం, వంటి కారణాల ఈ మార్కెట్ వృద్ధికి ఇతోధికంగా దోహదపడుతున్నాయి. ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ పరికరాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో దుస్తులు, పుస్తకాలు ఉన్నాయి. భవిష్యత్తులో దుస్తులు, సంబంధిత యాక్సెసరీలు అగ్రస్థానంలోకి వస్తాయి. ఇళ్ల అలంకరణ, ఫర్నీషింగ్స్ ఉత్పత్తుల విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి. చెల్లింపు విధానాలు, వస్తువులను రిటర్న్ చేసే విధానాలు సౌకర్యకరంగా ఉండడం వంటి అంశాల కారణంగా ఈ మార్కెట్ వృద్ధి మరింతగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఇంకా అందుబాటులోకి రాకపోవడం, ఆన్లైన్లో చెల్లింపు విధానాలపై కొంతమంది వినియోగదారులకు సందేహాలు తొలగకపోవడం వంటి సమస్యలున్నాయి. -
రేషన్ డీలర్లపై కేసులు
న్యూస్‌లైన్ నెట్వర్క్ : బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు డీలర్లపై తహశీల్దార్ వెంకటిశివ కేసులు నమోదు చేయించారు. ఆయన సోమవారం దొప్పెర్ల, నునపర్తి, గండివానిపాలెం, మడుతూరు రేషన్డిపోలలో ఆకస్మిక తనిఖీలు చేశారు. గండివానిపాలెంలో డీలర్ నాగులపల్లి కన్నయ్య బియ్యం పంపిణీలో చేతివాటం చూపించారు. బియ్యం తూయడానికి కిలో బరువైన ఇనుప డబ్బాని వినియోగించారు. డబ్బా బరువును తూనిక రాళ్లవైపు చూపించడానికి గుడ్డలతో తయారు చేసిన మూటను కట్టారు. చూసేవారికి సక్రమంగా ఉన్నట్టు కనిపించింది. తూనికలో కిలో తరుగు వస్తోంది. పదికిలోలు ఇచ్చేవారికి ఐదుకిలోల వంతున రెండుదఫాలు తూయడంతో లబ్దిదారుడికి ఎనిమిది కిలోలే అందాయి. మడుతూరులో డీలర్ శ్రీను ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాన్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా, ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుపడబ్బా ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాతో 20 గ్రాముల తరగు వచ్చింది. ఇనుప డబ్బాతో కిలో తరుగు వచ్చింది. తనిఖీ సమయంలో ఇనుపడబ్బా వినియోగించి అడ్డంగా దొరికిపోయారు. మడుతూరు, దోసూరు పంచాయతీల రేషన్‌డిపోలను ఈయన నిర్వహిస్తున్నారు. తహశీల్దార్ ఇద్దరి డిపోలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను బాధితులకు సరుకుల పంపిణీ బాధ్యత విఆర్ఓలకు అప్పగించారు. ఇద్దరిపై కేసు పెట్టినట్టు ఎస్ఐ నర్సింగరావు తెలిపారు. విజిలెన్స్ తనిఖీలు సోమవారం మాకవరపాలెం మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం గ్రామాల్లో ఉన్న రేషన్‌డిపోలను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మండల కేంద్రంలోని షాపు నంబర్ 17లో డీలర్ బియ్యం కొలతల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై రేషన్ డీలర్‌పై కేసు నమోదు చేశారు. శెట్టిపాలెంలో రేషన్‌డిపోలో కాకుండా వేరొక ప్రదేశంలో సరుకులు నిల్వచేసినట్టు గుర్తించి డీలర్‌ను హెచ్చరించారు. దీంతో డీలర్ అక్కడి నుంచి సరుకులను డిపోకు తరలించారు. డీలర్ సస్పెన్షన్ నక్కపల్లి మండలం బంగారయ్యపేట రేషన్‌డిపో డీలర్ చేపల జ్యోతిపై సస్పెన్షన్ వేటుపడింది. డీలర్ కార్డుదారుల నుంచి రూ.20లు చొప్పున వసూలు చేయడం, బియ్యంలో కోత విధించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆదివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్డీవో విచారణకు ఆదేశించారు. సోమవారం డిప్యూటీ తహశీల్దార్లు లక్ష్మీనరసమ్మ, రమాదేవి, ఆర్ఐ రమలు గ్రామంలో విచారణ చేపట్టారు. గ్రామస్తులంతా డీలర్ పాల్పడుతున్న అక్రమాలను విచారణాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా డిపోలో స్టాకు పరిశీలించగా ఏడు క్వింటాళ్ల 80 కిలోల బియ్యం తక్కువ ఉన్నట్టు గుర్తించారు. డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్టు విచారణాధికారులు తెలిపారు. బంగారయ్యపేటకు ఇన్చార్జ్గా డీఎల్‌ఫురం డీలర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు వారు తెలిపారు. తూనికల్లో తేడా కె.కోటపాడు మండలంలోని ఆనందపురం, కె.సంతపాలెం, గొల్లలపాలెం, చంద్రయ్యపేట, కింతాడ, ఆర్లి గ్రామాలలో గల రేషన్ డిపోలలో విజిలెన్స్ ఎస్ఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఆనందపురం, కె.సంతపాలెం గ్రామాల రేషన్ డిపోల్లో తూనికల్లో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. విషయాన్ని విజిలెన్స్ ఎస్పీ వి.సురేష్‌బాబు దృష్టికి తీసుకువెళ్లి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
పొదుపు కాంతులు
ఎల్ఈడీ బల్బుల వినియోగంలో గిరిజనుల ఘనత గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్సుకు సిఫారసు పాడేరు: విశాఖ జిల్లా పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీల్లో 1002 మంది విద్యుత్ వినియోగదారులు ఎల్ఈడీ బల్బులను అమర్చుకొని ప్రపంచ స్థాయిలోనే రికార్డు సాధించారని పంచాయతీ విస్తరణ అధికారి(పీఈవో) కె.వెంకన్నబాబు తెలిపారు. ప్రభుత్వం విద్యుత్ పొదుపునకు ప్రాధాన్యమిస్తోంది. పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు జిల్లాల్లో రూ.10కే ఎఈడీ బల్బులు పంపిణీకి నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు కాకమునుపే విశాఖ జిల్లాలోని మారుమూల గిరిజన పంచాయతీల్లోని ఆదివాసీలు ఎల్ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్‌ను పొదుపు చేయడం విశేషం. ఈ మేరకు గురువారం ఆయా గ్రామాలను పీఈవో సందర్శించారు. ఎల్ఈడీ బల్బులు వినియోగిస్తున్న గిరిజనులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు గతంలో సీఎఫ్ఎల్ బల్బులను నాతవరం మండలం ఎస్.బి.పట్నంలో అమర్చినందుకు తెలుగుబక్ఆఫ్ రికార్డుల్లో నమోదయిందన్నారు. అదే తరహాలో ఈ రెండు పంచాయతీల గిరిజనులు కూడా ఎల్ఈడీ బల్బులను వినియోగించి విద్యుత్ పొదుపుకు స్పూర్తిగా నిలిచారని తెలిపారు. దీనికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డ్సు జ్యూరీ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. డి.గొందూరు, బర్సింగి సర్పంచ్‌లు సీదరి రాంబాబు, సీదరి పార్వతమ్మ, న్యాయవాది కొండలరావులను అభినందించారు. -
కన్నీటి కిన్నెర
పురాణ ప్రశస్తి పొందిన శతాబ్దాల నాటి అపురూప వాద్య పరికరం కిన్నెర. ఎలక్ట్రానిక్ వాయిద్యాల హోరులో అంతరించే దశకు చేరుకుంది. ఇప్పుడు దాని తయారీని పట్టించుకునే వారే లేరు. అలాంటి అరుదైన కిన్నెరను నేటికీ మీటుతున్న ఏకైక కళాకారుడు దర్శనం మొగులయ్య (63). కిన్నెరపై ఆయన చేసే స్వర విన్యాసాన్ని విన్నవారు, కన్నవారు ఎన్ని ప్రశంసలు కురిపిస్తున్నా, ఆ కళాకారుడికి పూట గడవడమే కష్టంగా ఉంటోంది. తరతరాలుగా నమ్ముకున్న కిన్నెర తనకు అన్నం పెట్టకున్నా, అదే తన ప్రాణమని చెబుతున్న మొగులయ్య గురువారం బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో కచేరీ ఇచ్చాడు. ఈ సందర్భంగా పలకరించినప్పుడు ‘సిటీప్లస్’తో తన అనుభవాలను పంచుకున్నాడు. అవి ఆయన మాటల్లోనే... ఈ కిన్నెరను మా తాతల కాలంలో తయారు చేశారు. దాన్నే మార్చుకుంటొస్తున్న. దీన్ని వాయించడం ఇంకెవ్వరికీ రాదు. నాకొస్తది. ఎంత బాగా వినిపించినా ఏం లాభం? కూటికొస్త లేదు, గుడ్డకొస్త లేదు ఈ విద్య. ఇంటిని నడపాలంటే కూలిపనే దిక్కు. ఇంతకు ముందు కూడా ఈ కళ అన్నంపెట్టనప్పుడు ఐదేళ్లు మట్టిపని చేసిన. కానీ, కిన్నెరను చూస్తే పాట మొదలెట్టాలనిపిస్తది. నా మూడో కొడుకుకు మూర్ఛరోగం. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో ఉన్న పెద్దపెద్ద దవాఖానలన్నీ తిరిగిన. అప్పుసొప్పుజేసి మూడు లక్షలదాకా ఖర్చుపెట్టిన. అవన్నీ ఇప్పుడు గుండెమీదున్నయి. పిల్లలు నేర్వరు.. ఉండ ఇల్లు లేదు. దున్న భూమి సంపాదించలేదు. బుక్కెడు బువ్వ అడుక్కోవడానికి పనికొచ్చే ఈ విద్యను నేర్చుకోం అంటున్నరు నా కొడుకులు. ముత్తాతల నుంచి వస్తున్న ఈ కళను ఈ తరమోల్లు కూడా అందుకోవాలని, అట్ల దీని సప్పుడు ఆగిపోవద్దని నా కోరిక. నా కుటుంబం ఎల్లే దారి దొరికితే నాకొచ్చిన ఈ విద్యను పదిమందికీ నేర్పిస్త. మనసున్నోళ్లు ఎందరో... ఈ కళ నాతోనే పోవద్దని దాసరి రంగ( తెలుగు యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్) ఎంతో ప్రోత్సహించినరు. దీని గురించి పేపర్ల రాసి ఎక్కడెక్కడో ప్రదర్శనలు ఇప్పించిండు. ప్రదర్శనలకు రావడానికి, ఇల్లు రిపేర్‌కు రంగయ్య సారే పైసలిచ్చిండు. లామకాన్‌లో ప్రదర్శన కోసం పైసల్లేక బస్టాండులో దిక్కుతోచక నిలుచుంటే భువనగిరి మారాజు సుధాకర్ సార్ టికెట్ పైసలిచ్చిండు. మూడువేల కోసం అప్పులోల్లు నా కిన్నెరను జప్తు చేసుకుంటే, లాయర్ సార్ (సీవీఎల్ నరసింహారావు) సాయం చేసిండు. గుర్తింపునకు కొదువ లేకపోయినా, దినదినం తిండికి తడుముకోవాల్సి వస్తోంది. కదిలివచ్చిన కళాభిమానులు మెట్ల కిన్నెర వాయిస్తూ తెలంగాణ వీరగాథలను అద్భుతంగా వినిపించే మహబూబ్‌నగర్ వాయిద్యకారుడు మొగులయ్య ప్రదర్శనకు జానపద కళాభిమానులు ఎంతోమంది కదిలి వచ్చారు. పండుగ సాయన్న, పానుగంటి మీరాసాహెబ్, వంగ పకీరయ్య కథలను ఆయన వినిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. దయనీయ స్థితిలో వున్న ఈ పేద కళాకారుడికి అక్కడికి వచ్చిన పలువురు తమకు తోచిన విధంగా విరాళాలు అందచేశారు. లామకాన్‌లో జరిగిన ఈ ప్రదర్శన వాగేశ్, శ్రీశైలం ఏర్పాటు చేశారు. సినీ దర్శకులు అజిత్ నాగు, అవసరాల శ్రీనివాస్.. రచయితలు సంగిశెట్టి శ్రీనివాస్, ఎస్.జగన్, రిటైర్డ్ ప్రొఫెసర్లు కిషన్రావ్, రాములు, కళాకారులు నిస్సార్, బైరాగి, గడ్డం యాదగిరి, కార్టూనిస్ట్ శివాజీతో పాటు రేడియో, టీవీలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదీ పరంపర... పన్నెండేళ్ల బాల్యం నుంచే కిన్నెరతో చెలిమి చేసిన మొగులయ్య పూర్వీకులు కాశీం, వెంకటరాముడు, మొగులాన్, రాములయ్య, ఎల్లయ్యలు. ఎల్లయ్య కొడుకే మొగులయ్య. యాభయ్యేళ్లుగా కిన్నెరతో సావాసం చేస్తున్న మొగులయ్య ఆత్మాభిమానం ఉన్న కళాకారుడు. ఎన్నడూ చేయిచాచి ఎరుగడు. వెదురు, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దుకొమ్ములు, అద్దాలతో ఎంతో నేర్పుతో ఈ కిన్నెర వాద్యాన్ని ఆయన పూర్వీకులు తయారు చేశారు. పానుగంటి మీర్‌సాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ వంటి తెలంగాణ కథలను మొగులయ్య వినసొంపైన తన వాద్యంతో హావభావ సహితంగా వినిపిస్తాడు. ఆయన ప్రదర్శనను తిలకించిన వారు మళ్లీ మళ్లీ తిలకించాలనుకుంటారు. కిన్నెర కమ్మదనాన్ని పదే పదే ఆస్వాదించాలనుకుంటారు. ఈ కన్నీటి కిన్నెరను ఆదుకోదలచినవారు ..9505513891నంబరుకు ఫోన్ చేయండి. - ఓ మధు -
బిగ్‌బజార్‌లో భారీ చోరీ
సుల్తాన్‌బజార్: ఒకప్పుడు ఉపాధినిచ్చి..ఆదుకున్న సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు. రూ.50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ క్రాస్ రోడ్‌లోని బిగ్‌బజార్‌ను శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే పని వేళలు ముగిసిన తరువాత మూసేశారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. డిస్ప్లేలో కొన్ని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలిస్తున్నట్లు అందులో గుర్తించారు. వెంటనే విషయాన్ని బిగ్‌బజార్ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ రవికుమార్, డీఐ కిషోర్ లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సిబ్బందిని విచారించారు. బిగ్‌బజార్ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే... గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ రూ.50లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి: ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తూనే కొన్ని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఓ కెమెరా వైర్లు కత్తిరించకపోవడంతో చోరీ దృశ్యాలు చిక్కాయి. అర్ధరాత్రి 12 గంటల 52 నిమిషాల నుంచి ఒంటిగంటన్నర వరకు చోరీ చేశారు. నిందితులు 4 సూట్‌కేసులు, 6 బ్యాగులను తీసుకువచ్చి వాటిలో చోరీ చేసిన వస్తువులు తీసుకుని దర్జాగా ఆటోలో వెళ్లిపోయారు. చివరకు రాత్రి డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ వద్ద నిందితుడు కూల్‌డ్రింక్ తాగి మరీ వెళ్లడం గమనార్హం. కీలకం కానున్న ఫోన్‌కాల్: చోరీ చేస్తున్న సమయంలో ముగ్గురిలో ఒకడు సరిగ్గా 1.05 గంటలకు ఎవరికో ఫోన్ చేశాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన పోలీసులు ఫోన్ కాల్‌పై దృష్టి పెట్టారు. బిగ్‌బజార్ నుంచిఆ సమయంలో వారు ఎక్కడికి ఫోన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల బయోడేటా ఆధారంగా వారి ఫొటోలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలోనే నిందితులు? నిందితులు పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్ల పట్టుకునేందుకు 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వారు. అసోం వె ళ్లేందుకు సోమవారం ఉదయం రైలుఉంది. మరే ఇతర మార్గాల ద్వారా నిందితులు వెళ్లినా పోలీసులకు దొరికిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు న గరం, శివారు ప్రాంతాలలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని బిగ్‌బజార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 35 సెల్ఫోన్లు, 15 ల్యాప్‌ట్యాప్‌లు. 7 కెమెరాలు చోరీ చేశారని ఏసీపీ రవికుమార్ విలేకరులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 3 బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టామని ఆయన తెలిపారు. తన పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ డీఐ కిషోర్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నార ని చెప్పారు. -
ఆంధ్ర, తెలంగాణల్లో ఇ-ఆస్పత్రులు
* పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు ఆస్పత్రుల ఎంపిక * గాంధీ, కింగ్‌కోఠి మెటర్నిటీ, విశాఖ కింగ్‌జార్జి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి * రూ.25 కోట్లు మంజూరు చేసిన కేంద్రం * మొత్తం రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఆస్పత్రుల (ఇ-ఆస్పత్రులు) పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇ-ఆస్పత్రులంటే కొత్తగా నిర్మించేవి కాదు. ఉన్న ఆస్పత్రులనే కంప్యూటరీకరిస్తారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వాసుపత్రులను కంప్యూటరీకరిస్తారు. పైలట్ ప్రాతిపదికన ముందుగా తెలంగాణలో గాంధీ, కింగ్‌కోఠి మెటర్నిటీ ఆస్పత్రి, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం కింగ్‌జార్జి, పార్వతీపురంలో ఏరియా ఆస్పత్రులను ఎంపిక చేశారు. దీనికోసం తొలిదశలో రూ.25 కోట్లు మంజూరు చేశారు. రెండు రాష్ట్రాల్లోని మొత్తం ఆస్పత్రుల్లో కంప్యూటర్ సేవలు అందించాలంటే సుమారు రూ.300 కోట్లు అవుతుందని అంచనా. ఇ-ఆస్పత్రుల్లో భాగంగా ఫార్మసీ, లేబొరేటరీ, శస్త్రచికిత్సలు, వైద్యుల హాజరీ తదితర 37 రకాల సేవలను ఆన్లైన్ చేస్తారు. ఈ విధానాన్ని ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో అమలు చేస్తున్నారు. వైద్యుల నియామకం, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆస్పత్రుల్లో ల్యేబొరేటరీ వసతులు, మౌలిక వసతులు, ఎక్స్‌రే, స్కానింగ్ ఇలాంటివి ఏర్పాటు చేయకుండా ఆస్పత్రులను కంప్యూటరీకరిస్తే ఫలితం ఏమీ ఉండదని వైద్యులు చెబుతున్నారు. -
చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు. కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు. -
పక డ్బందీగా కుటుంబ సర్వే
మహబూబ్‌నగర్‌టౌన్: సమగ్ర కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సర్వే నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు 19వరకు ఎట్టి పరిస్థితులలో మండలాలను విడవ రాదన్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో టాంటాం వేయించాలని, పత్రికలు, ఎలక్ట్రానిక్ చానళ్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీలు, హోటళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో సర్వేపై బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సర్వేపై అవగాహణ కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులను చైతన్యం చేయూలన్నారు. సినిమా హాళ్లలో స్లైడ్స్ వేయించాలన్నారు. సర్వేపై జిల్లా వ్యాప్తంగా 11వేల గోడ పత్రికలు పంపిణీ చేయనున్నామని, వాటిని సరైన ప్రాంతాల్లో అతికించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ఈనెల 7నుంచి మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తామని,అనంతరం ఇతరులకు శిక్షణ ఉంటుందన్నారు. ప్రత్యేకాధికారులు సర్వేకు సంబందించిన రూట్‌మ్యాప్, వాహనాలపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు అధికారులందరూ సమగ్ర కుటుంబ సర్వేను ఎన్నికల డ్యూటీలా భావించి జిల్లాలో విజయవంతం చేయూలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, ఏజెసి రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, జెడ్పీసీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ అధ్యయనం?
రసాయనశాస్త్రంలో పరమాణు నిర్మాణానికి సంబంధించి ‘కాంతి స్వభావం- విద్యుదయ స్కాంత వర్ణపటం’ పాఠ్యాంశాన్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా అధ్యయనం చేయాలి? - కె.సుప్రియ, మూసాపేట అన్ని పోటీ పరీక్షల్లో ‘కాంతి స్వభావం- విద్యుదయస్కాంత వర్ణపటం’ నుంచి ఎక్కువసార్లు ప్రశ్నలు వచ్చాయి. ముఖ్యంగా కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, గీ-కిరణాలు, ్ఖగ కిరణాలు, దృగ్గోచర కిరణాలు, పరారుణ(ఐఆర్) కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాల గురించి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఈ పాఠ్యాంశాన్ని అధ్యయనం చేయడం ఏంత తేలికో, అందులోని అంశాలను గుర్తుంచు కోవడం కూడా అంతే సులభం. ఉదాహరణకు ఒక గదిలో విద్యుత్ స్విచ్ వేస్తే మరో గదిలో విద్యుదయస్కాంత సిగ్నల్ ఆధారంగా పనిచేసే టీవీలో అలజడిని గమనించొచ్చు. అదేవిధంగా అత్యధిక శక్తి(అల్ప తరంగదైర్ఘ్యం) ఉన్న గామా కిరణాలను క్యాన్సర్ కణాలను నిర్మూలించడానికి ఉపయోగిస్తే, అత్యధిక తరంగదైర్ఘ్యం(అల్పశక్తి) ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను సెల్ఫోన్లలో ఉపయోగిస్తారు. ఈ అంశాలన్నీ మన నిత్యజీవితంతో ముడిపడినవే కాబట్టి వీటి ధర్మాలు, ఉపయోగాలపై తరచుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు 2012 సివిల్స్ ప్రిలిమ్స్‌లో ‘నీటి శుద్ధి ప్రక్రియలో అతినీలలోహిత కిరణాల పాత్ర ఏమిటి? అనే ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం... ్ఖగ కాంతి నీటిలోని సూక్ష్మజీవులను అంతం చేస్తుంది. మురికిని అవక్షేపించడంలో, వాసనను తొలగించడంలో దీని పాత్ర ఉండదు. 2010లో ఓజోన్ పొర ఉపయోగం, రేడియో తరంగాల ధర్మానికి సంబంధించి కింది ప్రశ్న అడిగారు. ప్రశ్న: అయనోవరణమనే భూ వాతావరణంలోని ఒక పొర, రేడియో కమ్యూనికేషన్లకు వీలు కలిగిస్తుంది, ఎందువల్ల? సమాధానం: రేడియో తరంగాలకు సుదీర్ఘమైన తరంగదైర్ఘ్యం ఉంటుంది. ఓజోన్ పొర కాస్మిక్, ్ఖగ కిరణాలను మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో ఉంటుంది. రేడియో తరంగాలకు అధిక తరంగదైర్ఘ్యం ఉండటం వల్ల సుదూర కమ్యూనికేషన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా 2010లో మైక్రోతరంగాలకు(మైక్రోవేవ్ ఓవెన్ పని చేసే సూత్రం) సంబంధించి కింది విధంగా అడిగారు. ప్రశ్న: తెల్లని, ముద్రించని, స్వచ్ఛమైన పేపర్ ప్లేట్ మీద బంగాళదుంపను ఉంచి, దాన్ని మైక్రో ఓవెన్లో పెడితే బంగాళదుంప వేడెక్కుతుంది కానీ, పేపర్ ప్లేట్ వేడెక్కదు, కారణమేంటి? సమాధానం: ఆహార పదార్థంలోని నీటి అణువులు మైక్రోతరంగాలను గ్రహించి అత్యంత వేగంగా కంపనం చెందడం వల్ల జనించిన ఉష్ణం కారణంగా ఆహారం వేడెక్కుతుంది. కాబట్టి బంగాళదుంపల్లోని నీటికారణంగా అవి వేడెక్కుతాయి. పేపర్లో నీటి అణువులు లేకపోవడంతో అది వేడెక్కదు. రాత్రివేళ చూడటానికి ఉపయోగించే పరికరాల్లో వాడే కిరణాలు ఏవి? అని 2009లో ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం పరారుణ తరంగాలు. పై ప్రశ్నలను గమనిస్తే విద్యుదయస్కాంత వర్ణపటంలోని వివిధ వికిరణాల ధర్మాలు, ఉపయోగాలు, వాటిని ఉపయోగించి పనిచేసే వస్తువులు, ఆ వస్తువులు పని చేసే సూత్రాలు లాంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. కాబట్టి గామా, ఎక్స్, యూవీ, ఐఆర్, మైక్రో, రేడియో తరంగాల ధర్మాలకు సంబంధించిన మౌలిక సూత్రాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ పుస్తకాలతో పాటు, సీఎస్ఐఆర్ ప్రచురించిన How? What? అనే పుస్తకాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇన్పుట్స్: డాక్టర్ బి.రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి డిజేబుల్డ్ పర్సన్స్ (మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సబార్డినేట్ హెల్పర్ వాచ్మెన్ క్లీనర్ దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 11 వెబ్సైట్: www.svuniversity.ac.in సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ పోస్ట్: స్టాఫ్ నర్స్ ఖాళీలు: 111 అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరిలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: జూలై 30 వెబ్సైట్: www.svppgip.org ఇండియన్ లా ఇన్స్టిట్యూట్-న్యూఢిల్లీ కోర్సులు: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ది ఇంటర్నెట్ ఏజ్ సైబర్ లాస్ కాలపరిమితి: మూడు నెలలు అర్హతలు: ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ తర్వాత డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఆగస్టు 18 వెబ్సైట్: www.ili.ac.in -
ఈ-బిడ్డింగ్‌పై వ్యాపారుల ఆందోళన
ఖమ్మం వ్యవసాయం: ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో అమలు జరుగుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మం మార్కెట్లో గురువారం కమీషన్ వ్యాపారులు జెండాపాటను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బాగంగా అమ్మకానికి వచ్చిన పంట ఉత్పత్తిని ఖరీదు దారులు చూసుకొని నాణ్యతా ప్రమాణాల మేరకు ధరను రహస్యంగా బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్‌లో అధిక ధరను కోడ్ చేసిన వ్యాపారికి రైతు సరుకును అమ్మేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ఖరీదుదారులు సరుకుకు తాము పెట్టే ధరను రైతులకు చెబుతూ బిడ్డింగ్ చేసేవారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చి రహస్య విధానం చేపట్టడంతో కమీషన్ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. గతంలో మాదిరిగా ఖరీదుదారులు సరుకుకు పెట్టే ధరను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విధానం అమలు చేసే వరకు సరుకు కొనుగోలు చేయనీయమని అడ్డుకున్నారు. జెండాపాట నిర్వహించవద్దంటూ పత్తి మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్‌బాబాను డిమాండ్ చేశారు. దీంతో ఆయనకు, కమీషన్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం అసిస్టెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.సీ.రెడ్డి అక్కడికి చేరుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావుతో చర్చించారు. ఆ తర్వాత జెండా పాట నిర్వహించడానికి వెళ్లగా, వ్యాపారులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులకు-అధికారులకు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖమ్మం మార్కెట్లోనే ఈ-బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కమీషన్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు కూడా ఈ విధానం తమకు అర్థం కావటం లేదని వాపోయారు. వ్యాపారుల ఆందోళన తీవ్రం కావడంతో త్రీటౌన్ సీఐ రహమాన్ మార్కెట్‌కు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాపారులు, ఖరీదుదారుల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, మన్నెం కృష్ణ, రమేష్ భద్రం తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నారని, రాష్ట్ర మంత్రి, ప్రభుత్వం మెప్పు పొందేందుకు అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ-బిడ్డింగ్ ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు విధానాలను అమలు చేస్తున్నామని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ చెప్పారు. ఇలా వాదోపవాదాల అనంతరం రైతులు ఇబ్బంది పడకుండా తాత్కాలికంగా పాత విధానంతో సరుకు కొనుగోలుకు అధికారులు అంగీకరించారు. దీంతో మద్యాహ్నం 2:45 గంటలకు జెండాపాట నిర్వహించారు. -
అవినీతి ఖ‘నిజం’
నెల్లూరు సిటీ : జిల్లాలో సిలికా ఇసుక, క్వార్ట్జ్ మెటల్, గ్రావెల్, బోల్డర్ రాయి తదితర విలువైన ఖనిజ సంపదను రక్షించాల్సిన గనులు, భూగర్భవనరులశాఖ అధికారులు భక్షకులుగా మారారు. విలువైన ఖనిజ సంపద పక్క రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోవడానికి ప్రత్యక్ష, పరోక్ష కారకులవుతున్నారు. జిల్లాలోని కాళంగి, స్వర్ణముఖి నదుల్లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన సిలికా ఇసుక లభ్యమవుతుంది. పలు రకాల ఔషధాలు, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వినియోగించే సిలికా ఇసుకకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అంతర్రాష్ట ముఠా జిల్లాలోనే తిష్టవేసి రాత్రింబవళ్లు ఈ ఇసుకను తరలిస్తుంటాయి. రవాణాలో అవాంతరాలు ఎదురుకాకుండా సంబంధిత పోలీసు స్టేషన్లు, రవాణాశాఖ అధికారులు, మైనింగ్ అధికారులకు నెల మామూళ్లు ముట్టజెప్తుంటారు. ఈ కోవలో నెల మామూళ్లు ముట్టజెప్పని లారీలను తనిఖీ చేసి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటుంటారు. జిల్లాలోని సైదాపురం, నాయుడుపేట, ఓజిలి, వెంకటగిరి, రాపూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో అపారంగా ఉన్న ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు ఎటువంటి రాయల్టీ చెల్లించకుండానే దర్జాగా తరలిస్తున్నా మైనింగ్ అధికారుల్లో చలనం లేదు. అప్పుడప్పుడు పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖ అధికారులు దాడులు చేసి సీజ్ చేసి తమకు అప్పగించిన వాహనాల యజమానుల వద్ద భారీగా ముడుపులు స్వీకరించి వదిలేయడం పరిపాటి. మైనింగ్ అధికారులు తనిఖీలు, దాడులు చేసి వాహనాలను పట్టుకున్న కేసులు జిల్లాలో స్వల్పమే. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం శుక్రవారం నాటి ఘటన. రవాణాశాఖ అధికారులు పట్టుకుని జరిమానా విధించి తమకు అప్పగించిన నాలు గు ఇసుక టిప్పర్ల యజమానుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన అసిస్ట్టెంట్ జియాలజిస్ట్ సుబ్బారెడ్డి, ఆర్ఐ మురారి వంటి అధికారులు, సిబ్బంది జిల్లా గనులశాఖలో కోకొల్లలున్నారు. ఉన్నతాధికారు లు సైతం వీరితో చే తులు కలిపి తమ వాటా తీసుకుని మిన్నకుండి పోతున్నారు. కొందరు ఉన్నతాధికారులు మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి విలాసవంతమైన వస్తువులు సేకరించి చూసీచూడన ట్టు వ్యవహరిస్తూ అపారమైన సంపదను అప్పనంగా వారికి అప్పగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. -
తూకంలో తిరకాసు!
కందుకూరు రూరల్ : పామూరు రోడ్డులో ఉన్న 27వ పొగాకు వేలం కేంద్రంలో కాటాలో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయి. సోమవారం వలేటివారిపాలెం చుండి క్లస్టర్‌కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. కొందరు రైతులు ఇళ్ల వద్ద బేళ్లను కాటా వేసుకుని తీసుకొచ్చారు. వేలం కేంద్రం వద్ద కాటా వేసి బిడ్డింగ్‌లో పెడతారు. కాటా వేసిన బేళ్లను పరిశీలించిన రైతులు తూకంలో తేడా వచ్చినట్లు గుర్తించారు. 147 కిలోలు ఉండాల్సిన బేలు వేలం కేంద్రం వద్ద కాటాలో 131 కిలోలు మాత్రమే తూగింది. గమనించిన రైతులు తిరిగి కాటా వేయించాలని ముఠా కూలీలపై ఒత్తిడి తెచ్చారు. రైతులందరూ ఈ విషయంపై పట్టుబట్టారు. దీంతో వేలం నిర్వహణాధికారి శ్రీనివాసులనాయుడు బేళ్లను మళ్లీ కాటా వేయించారు. ముగ్గురు రైతులకు సంబంధించిన బేళ్లలో తేడాలు కనిపించాయి. ఆగ్రహించిన రైతులు ఇలా ఎన్ని బేళ్లలో తేడాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా రోజూ జరుగుతోందా అని అధికారులను నిలదీశారు. అధికారులు, ముఠా కూలీలు, సిబ్బంది కుమ్మక్కై ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపించారు. ఎలక్ట్రానిక్ కాటా కావడంతో రైతులు తూకంలో తేడాను కనిపెట్టలేకపోతున్నారని, దీనిని ఆసరాగా చేసుకుని సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ కాటాలో తేడా : శ్రీనివాసులనాయుడు, వేలం నిర్వహణాధికారి ఎలక్ట్రానిక్ కాటాలో తేడా వల్ల ఇలా జరిగింది. విధుల్లో అశ్రద్ధగా ఉండే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రైతులకు ఎలాంటి నష్టం జరగదు. తూకంలో భారీ తేడా వచ్చింది : కామినేని నరసింహం, రైతు, చుండి ఒక బేలు తూకం 131 కిలోలు వచ్చింది. అనుమానం వచ్చి తిరిగి కాటా వేయిస్తే 147 కిలోలు ఉంది. ఈ విషయమై ఎవరిని ప్రశ్నించినా మాకు తెలియదంటున్నారు. రైతులను మోసం చేస్తున్నారు : ఎం.రాఘవయ్య, రైతు ఒక బేలు 139 కిలోలు ఉంటే 103 కిలోలు మాత్రమే చూపించారు. రైతులను మోసం చేయడం అన్యాయం. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. -
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్
డోర్నకల్, న్యూస్‌లైన్ : మాజీ ఐఏఎస్ అధికారి తేజావత్ రాంచంద్రునాయక్ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులయ్యూరు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆయనను నియమించారు. కురవి మండలం సీరోలు శివారు రూప్లాతండాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రాంచంద్రునాయక్ మూడు నెలల క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొదటి నుంచీ తెలంగాణవాది అయిన రాంచంద్రునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మేనిఫెస్టో కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రాంచంద్రునాయక్.. కేంద్రం, రాష్ట్రానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. రైతు కుటుంబానికి చెందిన రాంచంద్రునాయక్ ఐఏఎస్ అధికారిగా కీలక పదవులు నిర్వహించారు. మొదట ఐపీఎస్‌గా సెలక్ట్ అయినా శిక్షణ పొందే సమయంలో ఐఏఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. సీరోలులో ప్రాథమిక విద్య, మహబూబాబాద్‌లో ఇంటర్మీడియట్ చదివారు. 1971 నుండి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ సిస్టం పూర్తి చేశారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత 1983లో బీహార్ కేడర్ ఐపీఎస్‌కు ఎంపికై.. ఈ ప్రాంతం నుంచి ఐపీఎస్ సాధించిన మొదటి గిరిజనుడిగా రికార్డు సృష్టించారు. ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐఏఎస్‌గా ఒరిస్సా కేడర్‌కు ఎంపికయ్యారు. 1991-92లో ఒరిస్సాలోని నవరంగపూర్ జిల్లా కలెక్టర్‌గా, 1992-93లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ భారత ప్రభుత్వ కార్యదర్శిగా, డిఫెన్స్ కార్యదర్శిగా, ఒరిస్సా గవర్నర్ కార్యదర్శిగా రెండు సార్లు పనిచేశారు. అప్పటి ఒరిస్సా ముఖ్యమంత్రి గిరిధర్గోమాంగో వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఒరిస్సా రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ 2013 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ పొందారు. ఐఏఎస్‌గా కేంద్రంలో పలు కీలక పదవులు నిర్వహించిన రాంచంద్రునాయక్‌కు గుర్తింపునిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. -
కొత్త బ్యాటరీలు.. 50 ఏళ్లు పనిచేస్తాయ్..!
ఎలక్ట్రానిక్ పరికరాలకు ఉపయోగించే బ్యాటరీల జీవితకాలాన్ని గణనీయంగా పెంచేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ప్రస్తుతం గుండె పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగించే పేస్మేకర్ల వంటివాటికి అమర్చే బ్యాటరీలు గరిష్టంగా పదేళ్ల వరకూ పనిచేస్తున్నాయి. అందువల్ల పదేళ్లకోసారి ఆపరేషన్ చేసి కొత్త బ్యాటరీలను అమర్చాల్సి వస్తోంది. ఈ కొత్త బ్యాటరీలను పేస్మేకర్లకు అమరిస్తే గనక.. 30-50 ఏళ్ల వరకూ పనిచేస్తాయని ఓక్ రిడ్జ్ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఘన లిథియం థియోపాస్ఫేట్ ఎలక్ట్రోలైట్‌తో తయారు చేసిన ఈ లిథియం-కార్బన్ ఫ్లోరైడ్ బ్యాటరీలు ఇప్పుడున్నవాటి కన్నా 26 శాతం సమర్థంగా పనిచేస్తాయని అంటున్నారు. ఈ కొత్త బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్.. అయాన్ల రవాణాకు మాత్రమే కాకుండా క్యాథోడ్‌ల సరఫరాకూ ఉపయోగపడుతుందని, అందువల్ల బ్యాటరీల జీవితకాలం గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నారు. -
వీళ్లకు అవంటే యమక్రేజ్!
పంచామృతం ప్రతి మనిషికీ ఒక పిచ్చి ఉంటుంది. హాబీ రూపంలో కావొచ్చు, ఆసక్తిగా కావొచ్చు. ఆ పని ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి పిచ్చితో ప్రపంచంతో పనిలేదన్నట్టుగా బతికేయొచ్చనిపిస్తుంది. ఆ పిచ్చిలో ఉన్నప్పుడు మనకు మనమే ముద్దొస్తాం, మనకు మనమే గ్రేటనిపిస్తాం. మరి ఇదే విషయం గురించి కొంతమంది సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారి వ్యక్తిగత ఆసక్తులను గురించి వాకబు చేస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి... పేరుకైతే ‘దబాంగ్ ఖాన్’ కానీ సల్మాన్‌ది కళాహృదయం. పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ప్రసిద్ధ పెయింటర్లు గీసిన వాటిని సేకరిస్తూ ఉంటాడు. అలాగే మనసు స్పందించినప్పుడు తను కూడా బ్రష్‌కు పని చెబుతూ ఉంటాడు. కింగ్‌ఖాన్‌కు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే మహా ఇష్టం. మార్కెట్లోకి వచ్చే అధునాతన స్మార్ట్‌ఫోన్స్, వీడియో గేమ్స్, ట్యాబ్లెట్స్ను కొనేయడం అంటే షారూఖ్‌కు తెగ సంబరమట. ఏదైనా కొత్త గాడ్జెట్ కనిపిస్తే చాలు చిన్న పిల్లాడు అయిపోతాడు. కొనే సామర్థ్యం ఉంది కాబట్టి ఎంచక్కా కొనేసుకొంటాడు. అలాగే ఆయన కార్ల పిచ్చి కూడా ఉంది. షారూఖ్ గ్యారేజ్‌లో కనీసం ఏడు కార్లు అయినా పార్కింగ్‌లో ఉండాల్సిందే! నటనకు పరిపూర్ణ నిర్వచనంలా కనిపించే విద్యాబాలన్ ఆఫ్ ద రికార్డ్‌లో అచ్చమైన అతివ. ఆమెకు చీరలు సేకరించడం అంటే యమ క్రేజ్! పట్టు చీరలంటే పిచ్చి. విద్యను బాగా ఎరిగిన వారు ఇచ్చే సమాచారం ప్రకారం ఆమె వద్ద వెయ్యికిపైగా వెరైటీ వెరైటీ చీరలున్నాయి! తండ్రి హీరోగా ఎంత పెద్ద స్టార్ అయ్యాడో తాను హీరోయిన్గా అంతే స్టార్‌డమ్‌ను సంపాదించడం అనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్న సోనమ్ కపూర్ ఒక స్టైల్ దివా. ఆమె వార్డ్రోబ్ బ్రాండెండ్ వేర్‌తో నిండి ఉంటుంది. అలాగే సోనమ్‌కు హ్యాండ్‌బ్యాగ్స్ అంటే కూడా క్రేజే. ఈమెకు సరికొత్త వంటకాల గురించి తెలుసుకొని వండటం అంటే తెగ ఆసక్తి. వంటల పుస్తకాలను సేకరించి అందులోని థియరీని ప్రాక్టికల్ చేసి తనకు తెలిసిన వారికి వండిపెట్టడం అంటే కంగనకు చాలా ఇష్టమట. వంట గురించి మంచి మొబైల్ అప్లికేషన్లు ఉంటే చెప్పరా? అంటూ తన సహచర నటీనటులను అడుగుతూ ఉంటుందట. -
పనిచేస్తాయి... వద్దంటే కరిగిపోతాయి!
ఎలక్ట్రానిక్ పరికరాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో... కాలపరిమితి ముగిశాక వాటివల్ల పర్యావరణానికి అంతే చేటు జరుగుతోంది. ఇలా కాకుండా వినియోగం తర్వాత అవి నిరపాయకరంగా కరిగిపోతే? అద్భుతంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక పదార్థాలను అభివృద్ధి చేయగలిగితే ఇది సాధ్యమేనంటున్నారు అయోవా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రెజా మోంటజామీ. ఈ దిశగా తాము ఇప్పటికే బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ ఆధారిత పదార్థాలు కొన్నింటిని తయారు చేశామని, వీటిని ఎలక్ట్రానిక్ పరికరాల్లో రెసిస్టిర్, కెపాసిటర్, యాంటెన్నాలుగా వాడుకోవచ్చునని ఆయన వెల్లడించారు. ఈ ప్రత్యేక పదార్థాలు ఎంత వేగంతో నాశనం కావాలో కూడా మనమే నిర్ణయించవచ్చు. తాము ఇప్పటికే రెసిస్టర్, కెపాసిటర్లతోపాటు, కరిగిపోయే ఎల్ఈడీ బల్బు, సర్క్యూట్‌ను అభివృద్ధి చేశామని, ట్రాన్సిస్టర్ టెక్నాలజీపై ప్రస్తుతం మరిన్ని పరిశోధనలు జరుపుతున్నామని రెజా వివరించారు. ‘ట్రాన్సియెంట్ ఎలక్ట్రానిక్స్’గా పిలుస్తున్న ఈ విధానం మరింత -
రోడ్డుప్రమాదాల నివారణే లక్ష్యం
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా రాష్ట్ర రవాణా శాఖ అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. బస్సులు, ట్రక్కులు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచేవిధంగా పరిమితి విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రవాణా శాఖ రెండు విధానాలను అమలు చేయనుంది. వేగాన్ని నియంత్రించే స్పీడ్ గవర్నర్స్తోపాటు ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లను కొత్తగా తయారయ్యే వాణిజ్య వాహనాలు, బస్సుల్లో అమర్చనున్నారు. ఈ నిబంధనలను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రతి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో సగటున 13 వేల మంది మృత్యువాత పడుతున్నారు. వీటిని నియంత్రించేందుకు రవాణా శాఖ పలు నిబంధనలు విధించింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం.. అన్ని కొత్త రవాణా వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్లను కలిగి ఉండాలి. అదేవిధంగా వేగ నియంత్రణ పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో రవాణా శాఖ అధికారులు వీటిని సీల్ చేస్తారు. అయితే పురాతన వాహనాలకు వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా కొత్త బస్సుల్లో అంతర్గతంగా, బాహ్యంగా తప్పనిసరిగా సాంకేతిక పరమైన జాగ్రత్తలు ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థలు పలు జాగ్రత్తలతో కూడిన బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఎక్స్‌ప్రెస్ హైవేలకు మాత్రమే వేగ నియంత్రణ పరికరాలు అనుకూలంగా ఉంటాయని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇతర రోడ్లపై వాహనాన్ని వేగంగా నడపడంతో డ్రైవరు చూపు కోణం, ప్రతి స్పందన సమయం తక్కువగా ఉంటుందని డ్రైవింగ్ నిపుణులు పద్మకార్ హేలేకర్ తెలిపారు. దీంతో ఇతర రోడ్లపై గంటలకు 50 కి.మీ వరకు వేగ పరిమితిని విధించాలని సూచించారు. ఇదిలా వుండగా 3,500 కి.లోల బరువు కన్నా తక్కువగా ఉన్న ద్విచక్రవాహనాలు, నాలుగు చక్రవాహనాలు, పోలీసు వాహనాలు, అంబులెన్సులు, అగ్ని మాపక వాహనాలు, ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలకు వేగ నియంత్రణ పరికరాల నుంచి మినహాయింపు ఇచ్చారు. సర్వీస్ డోర్లు, అత్యవసర నిష్ర్కమణ ద్వారాలు, ప్రయాణికులకు అనుకూలంగా ఉండే సీట్లు, కిటికీలు, బస్సు ఫ్లోర్, ఎత్తు, మెట్లు తదితర అంశాల పట్ల ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సును తయారు చేయాల్సి ఉంటుందని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. -
ఈవీఎంలు మళ్లీ వివాదాస్పదమౌతాయా?
ఈవీఎంల పనితీరు విషయంలో తొలినుంచీ ఎన్నో ప్రశ్నచిహ్నాలున్నాయి. ఈవీఎంలో ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని పలువురు వాదిస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేసినా ఒక పార్టీకే పడేలా చేయవచ్చునని కూడా వాదనలున్నాయి. 2009 లోకసభ ఎన్నికల సమయంలో ఈవీఎంల సామర్థ్యం విషయంలో చాలా వివాదాలు చెలరేగాయి. అయితే ఈ సారి ఎన్నికల్లోనూ ఈవీఎంల విషయంలో ఇలాంటి వివాదాలే తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 2009 లో చెలరేగిన వివాదాల కారణంగా ఓటు వేసిన తరువాత ఓటరుకు తానే పార్టీకి లేదా అభ్యర్థికి ఓటేశారో తెలియచేసే ఒక రసీదు పత్రాన్ని ఇచ్చేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ పత్రాన్ని వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ లేదా వీవీపీఏటీ అని అంటారు. అయితే ఈ సారి చాలా నియోజకవర్గాల్లో ఈ పత్రాన్ని ఇవ్వడం లేదు. దీనితో ఓడిపోయిన అభ్యర్థులు, పార్టీలు ఎన్నికలపై సవాళ్లు లేవనెత్తే అవకాశాలున్నాయి. వీవీపీఏటీ పత్రాన్ని ఇవ్వాలంటే ఈవీఎంను ఒక ప్రింటర్ కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ఈవీఎంలకూ ఈ ప్రింటర్లను కనెక్ట్ చేయాలి. ఈ ప్రతిపాదనలను గతేడాది ఫిబ్రవరిలో ఆమోదించారు. ఇందుకు దాదాపు పధ్నాలుగు లక్షల ప్రింటర్లు అవసరం అవుతాయి. దీని కోసం 1860 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. ఈ నిధిని ప్రభుత్వం విడుదల చేయలేదు. అలాగే చాలా చోట్ల ఎన్నికలు లేనప్పుడు ఈ ఈవీఎంలను ఆరుబయటే ఉంచడం జరుగుతుంది. మళ్లీ వాడేటప్పుడు ఆ యంత్రాల్లోని చిప్ లను మార్చినట్టయితే ఇతరులెవరూ యంత్రంలో మార్పులు చేయడానికి వీలుండదు. అయితే ఒక చిప్ కి వంద రూపాయలు ఖర్చవుతుంది. దీనికి కూడా నిధులు లేకపోవడంతో చిప్ ను మార్చడం లేదు. ఫలితంగా ఈవీఎంలను తమకు అనుకూలంగా పనిచేసేలా చేసుకోవడానికి అధికార పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఈవీఎంలలో ఫలితాలను తారుమారు చేయడానికి, మోసాలకు పాల్పడటానికి వీలుందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమీషన్ డీఆర్ డీఓ కి చెందిన ప్రొఫెసర్ ఎస్ సంపత్, ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ డా. ఇందిరేశన్, ఎలక్ట్రానిక్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ డైరెక్టర్ డా. సి రావ్ కాసరబాదాలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈవీఎంలను గట్టిగా వెనకేసుకొచ్చింది. అయినప్పటికీ ఆరోపణలు ఆగడం లేదు. ఈ సారి వీవీపీఏటీ పత్రాలు ఇవ్వకపోతే ఆరోపణలు మరింత ఉధృతం అయ్యే ప్రమాదం ఉంది. -
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ఇద్దరు నిందితుల రిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఒకటికాదు, రెండు కాదు... ఏకంగా వెయ్యి జిలెటిన్‌స్టిక్స్, రెండువేల ఎలక్ట్రానిక్ డిటొనేటర్లను అక్రమంగా తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా కీసర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఆల్వాల్ ఏసీపీ జి.ప్రకాశరావు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం... బుధవారం రాంపల్లి చౌరస్తాలో వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు మారుతీ జెన్ కారు(ఏపీ11ఎఫ్6399)ను సోదా చేయగా, అందులో మొత్తం వెయ్యి జిలెటిన్ స్టిక్స్, 2150 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభ్యమయ్యాయి. వాటిని అక్రమంగా రవాణా చేస్తున్న టి.సురేందర్‌తోపాటు హోల్‌సేల్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నగర శివారు మండలాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బిల్డర్లు, కాంట్రాక్టర్లకు అవసరమైన జిలెటిన్ స్టిక్స్, డిటొనేటర్లను సరఫరా చేస్తున్న వీరిరువురిపై గతంలో మేడ్చల్ తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు విచారణలో ఉన్నాయి. భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
భార్యను అమ్మకానికి పెట్టాడు!
ఈబే (eBay)... ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలకూ కొనుగోళ్లకూ జనప్రియంగా మారిన వెబ్సైట్ ఇది. ‘మీ దగ్గరున్న పాత, కొత్త వస్తువులను మా వెబ్సైట్లో పెట్టండి, మంచి రేటుకు అమ్మేసుకోండి’ అంటూ జనాలకు ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఓ మగమహారాజు ఈ మధ్య... ఏకంగా తన భార్యనే ఈబేలో అమ్మకానికి పెట్టాడు! బ్రిటన్‌కు చెందిన షాన్... తన భార్యను అమ్మేస్తున్నానంటూ ఆమె ఫొటోలను ఈబే సైటులో అప్డేట్ చేశాడు. ‘నచ్చిన వాళ్లు కొనుక్కోండి, మంచి తరుణం మించిన దొరకదు’ అంటూ హడావుడి మొదలెట్టాడు. ఎక్కువ మొత్తాన్ని కోట్ చేసిన వారికి ఆమెను ఇచ్చేస్తానన్నాడు. విచిత్రం ఏమిటంటే... షాన్ తన భార్యను వేలానికి పెట్టిన కొన్ని గంటల్లోనే ఆమె కోసం 50 మంది మగ మహారాజులు బిడ్డింగ్ చేశారు. ఇంతలో ఈ విషయం కాస్తా మీడియా కంట పడింది. ఇంకేముంది... దీని గురించి కథనాల మీద కథనాలు వేయడం మొదలైంది. దాంతో షాన్ అడ్డంగా బుక్కయ్యాడు. ‘ఏదో సరదాగా ఈ పని చేశాను. పైగా ఈ విషయం నా భార్యకు కూడా తెలుసు’ అంటూ బిక్కమొగం వేశాడు షాన్. ఆ విషయాన్ని అతడి భార్యకూడా ధ్రువీకరించింది. వీరి సరదా గురించి బిడ్డింగ్ చేసిన వారికి చెబితే... ‘మేం మాత్రం సీరియస్‌గా ట్రై చేశామా ఏంటి, సరదాగానే చేశాం’ అంటూ తేల్చేశారు వాళ్లు! -
తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు
లండన్: ప్రపంచంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు నిండాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించిన తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ‘కోలోసస్’ 70వ వార్షికోత్సవాన్ని బ్రిటిష్ మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా జరుపుకొన్నారు. బ్రిటిష్ టెలిఫోన్ ఇంజనీర్ టామీ ఫ్లవర్స్ ఈ భారీ కంప్యూటర్ను రూపొందించారు. దీని విశేషాలు... ‘కోలోసస్’ కంప్యూటర్ పరిమాణం దాదాపు ఒక గదికి సమానంగా ఉంటుంది (7 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పు). బరువు 5 టన్నులు. 8 కిలోవాట్ల విద్యుత్తు అవసరం. 2,500 వాల్వ్‌లు, 100 లాజిక్ గేట్లు, 10 వేల రెసిస్టర్లతో తయారైన ఈ కంప్యూటర్లోని తీగల పొడవు 7 కి.మీ. తొలిసారిగా 1944 ఫిబ్రవరి 5న ఇది వినియోగంలోకి వచ్చింది. -
ఢిల్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం కొత్తపుంతలు తొక్కుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మోసగాడని, అన్నా హజారే కు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి ఎవరినైనా మోసగించగలడని వాయిస్ రికార్డెడ్ కాల్స్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు ఆప్ పార్టీ తమకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ఓటర్లకు వివరించే ప్రీరికార్డెడ్ కాల్స్‌తో సందేశాలను అందించడం ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, దాని నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేయరాదని హెచ్చరిస్తూ ఈ నెలారంభంలో పలువురు మొబైల్ ఫోన్ వాడకందారులకు కాల్స్ వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్, అన్నాహజారే నేతృత్వంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తాను పనిచేశానని, కానీ ఆ తరువాత కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై అన్నాకు వెన్నుపోటు పొడిచారని, తన వారిని మోసగించిన వ్యక్తి ఎవరికైనా ద్రోహం చేయగలడని, కాబట్టి రానున్న ఎన్నికలలో కేజ్రీవాల్‌కు, అతని పార్టీకి ఓటు వేయరాదని చెబుతూ రికార్డు చేసిన శ్రీఓమ్ అనే ఓ వ్యక్తి సందేశం మొబైల్ ఫోన్ల ద్వారా పలువురికి చేరింది. ఇటీవల ఎన్నికల అనంతరం అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతాడు కనుక బీజేపీకే ఓటువేయాలని కోరుతూ రికార్డు చేసిన వాయిస్ మెసేజ్ పలువురు మొబైల్ వినియోగదారులకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని, దేశ రాజధానిని గణనీయంగా అభివృద్ధిచేసిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరుతూ మరో వాయిస్ మెసేజ్ కూడా ఓటర్లకు అందుతోంది. ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకూడా వాయిస్ రికార్డు చేసిన కాల్స్‌తో రంగంలోకి దిగింది. ‘‘నమస్తే నేను అర్వింద్ కేజ్రీవాల్‌ను మాట్లాడుతున్నాను అంటూ ప్రారంభమయ్యే ఈ కాల్ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం కుమ్మక్కయ్యాయని, కాబట్టి ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేయాలని శ్రోతలకు చెబుతోంది. ఓటర్లకు ఇటువంటి కాల్స్‌ను చేరవేయడం కోసం నగరంలోని 20 లక్షల మొబైల్ వినియోగదారుల డేటాబేస్ ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద ఉందని, ప్రీ రికార్డు చేసిన మెసేజ్‌ను పార్టీ తరపున వినియోగదారులకు అందచేసేందుకు ఓ ప్రయివేటు కంపెనీకి 7-9 లక్షల రూపాయలు చెల్లిస్తుందని ఆప్ కార్యకర్త చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇలాంటి కాల్స్‌పై స్వచ్ఛందంగానైనా లేదా ఎవరైనా ఫిర్యాదుచేసినా ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించవచ్చు. ఫోన్ కాల్లో వాడిన భాషను బట్టి అది పరువు నష్టం కిందకు వస్తుందా రాదా? అన్నది నిర్ణయించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాల్ చేసినవారిపై కేసు నమోదుచేయవచ్చు. ఇలాంటి ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనప్పుడు ఆ కాల్ చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల బృందం, సంస్థ ఆచూకీ తెలుసుకుని చర్య తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీపై బురద చల్లే ఈ కాల్స్‌ని తాము పంపడం లేదని కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల తాము అటువంటి పిచ్చిపని చేయబోమని, సానుభూతి కొరకు ఆమ్ ఆద్మీ పార్టీయే అటువంటి కాల్స్ చేస్తోండవచ్చని బీజేపీ సందేహాన్ని వ్యక్తంచేసింది. 1.7 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని ఢిల్లీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సగటున ఒక్కో వ్యక్తి దగ్గర రెండు కనెక్షన్లు ఉన్నాయన్న మాట. వినియోగదారులు ఈ కాల్స్‌ను నివారించడం కోసం డు నాట్ కాల్ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రీలో ఇప్పటివరకు 20 శాతం మొబైల్ వాడకందారులు తమ పేర్లు నమోదుచేసుకున్నారు. -
ఢిల్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం కొంతపుంతలు తొక్కుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మోసగాడని, అన్నా హజారే కు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి ఎవరినైనా మోసగించగలడని వాయిస్ రికార్డెడ్ కాల్స్‌తో ఆమ్ అద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు ఆప్ పార్టీ తమకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ఓటర్లకు వివరించే ప్రీరికార్డెడ్ కాల్స్‌తో సందేశాలను అందించడం ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, దాని నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు వేయరాదని హెచ్చరిస్తూ ఈ నెలారంభంలో పలువురు మొబైల్ ఫోన్ వాడకందారులకు కాల్స్ వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్, అన్నాహజారే నేతృత్వంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తాను పనిచేశానని, కానీ ఆ తరువాత కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై అన్నాకు వెన్నుపోటు పొడిచారని, తన వారిని మోసగించిన వ్యక్తి ఎవరికైనా ద్రోహం చేయగలడని, కాబట్టి రానున్న ఎన్నికలలో కేజ్రీవాల్‌కు, అతని పార్టీకి ఓటు వేయరాదని చెబుతూ రికార్డు చేసిన శ్రీఓమ్ అనే ఓ వ్యక్తి సందేశం మొబైల్ ఫోన్ల ద్వారా పలువురికి చేరింది. -
పండుగ అమ్మకాలు బాగున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు అవుతుండడంతో ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు ఆనందంలో ఉన్నాయి. ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలతో కంపెనీల ఆశలు రెట్టింపయ్యాయి. రానున్న పండుగలకు కూడా ఇదే జోష్ ఉంటుందని విశ్వసిస్తున్నాయి. దీనికితోడు వినియోగ వస్తువుల కొనుగోళ్ల కోసం ఇచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం పరిశ్రమ పెద్ద ఊరటగా భావిస్తోంది. సీజన్‌ను మరింత రంగుల మయం చేసేందుకు కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక టీఎంసీ, ఆదీశ్వర్, బజాజ్, సోనోవిజన్ వంటి విక్రయ సంస్థలు ప్రకటించిన భారీ ఆఫర్లు కస్టమర్లను ఇట్టే ఆకర్శిస్తున్నాయి. అమ్మకాలు ఓకే.. పండుగల సీజన్లో తాము 17-18 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి పతనం కారణంగా ఉపకరణాల ధర పెరగడం, ఈఎంఐలు తగ్గకపోవడం కొంచెం ఇబ్బందికర పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల కొత్త వడ్డీ రేట్ల ప్రభావం రానున్న రోజుల్లో అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని అన్నారు. గతేడాది గృహోపకరణాల అమ్మకాలు ఎక్కువగా ఉంటే, ఈ ఏడాది ఎల్ఈడీ, 3డీ టీవీలకు డిమాండ్ ఉందని ప్యానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి అన్నారు. సీజన్లో 12-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. ఓనమ్ ఊపుతో.. ఓనమ్ పండుగ సందర్భంగా శాంసంగ్, సోని, ప్యానాసోనిక్, ఎల్జి తదితర కంపెనీలు రెండంకెల వృద్ధి నమోదు చేశాయి. వినాయక చవితి సమయంలోనూ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉపకరణాల విక్రయ దుకాణాలు కిటకిటలాడాయి. ఓనమ్ అమ్మకాలు రూ.250 కోట్లు జరిగాయని శాంసంగ్ వెల్లడించింది. మొత్తంగా పండుగల సీజన్లో ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం ల క్ష్యంగా చేసుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ ఇటీవల తెలిపారు. సోని ఇండియా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో 34 శాతం వృద్ధితో రూ.170 కోట్ల వ్యాపారం చేసింది. ఉత్పత్తులనుబట్టి 30-47 శాతం వృద్ధి నమోదు చేసినట్టు ఎల్జీ తెలిపింది. అమ్మకాలు పుంజుకోవడం ఖాయమని హాయర్ అప్లయాన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. ఓనమ్ సమయంలో రూ.200 కోట్ల వ్యాపారం చేశామని వివరించారు. కొత్త మోడళ్లతో.. సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్డీ టీవీలను బుధవారం విడుదల చేసింది. వీటి ధర రూ.3.30-4.50 లక్షలుంది. ప్యానాసోనిక్ ఆధునిక ఫీచర్లతో ఎల్ఈడీ, 3డీ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గత నెలలోనే 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్డీ టీవీలను ప్రవేశపెట్టింది. రూ.500-5000 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2 లక్షల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాన్ని సీమెన్స్ హోం అప్లయాన్సెస్ కల్పిస్తోంది -
ఈ-వేలం ద్వారా స్థలాల అమ్మకం
సీమాంధ్ర ఉద్యమంతో తీరు మార్చుకున్న స్వగృహ ఇప్పటికే విఫలమైన బహిరంగ వేలం ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: నిధులు లేక అల్లాడుతున్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తన ఖాళీ స్థలాలను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్ధమైంది. గతంలోనే బహిరంగ వేలం ద్వారా స్థలాలు అమ్మేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ సీమాంధ్రలో ఉద్యమం ఉధృతంగా సాగుతుండటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. తుదిదశలో ఉన్న ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉండడం. అందుకు తగ్గట్టుగా నిధులు సమకూరకపోవడంతో ఇప్పటికిప్పుడు స్థలాలను అమ్మేందుకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తాజాగా ఈ-వేలం బాట పట్టింది. తొలిదఫాగా కాకినాడ, కర్నూలు, రాజంపేటలలోని ప్లాట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితోపాటు తెలంగాణలోని కామారెడ్డిలో ఉన్న ఖాళీస్థలాన్ని అమ్మేందుకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల ప్రభుత్వం రూ.105 కోట్ల రుణాన్ని స్వగృహకు కేటాయించింది. వీటితో ఐదు ప్రాజెక్టుల్లోని ఇళ్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగతా వాటిల్లో పనులు పూర్తి చేసేందుకు కార్పొరేషనే సొంతంగా నిధులు సేకరించుకోవాల్సి ఉంది. ఇందుకోసం డిమాండ్‌లేని ప్రాజెక్టులు, డిమాండ్ ఉన్నవాటిల్లో ఖాళీగా ఉన్న భూములను అమ్మేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గతంలో కాకినాడ, తణుకుల్లోని భూములను అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఉద్యమం వల్ల విఫలం కావటంతో ఇప్పుడు ఈ-వేలం ద్వారా అమ్మాలనుకుంటున్నారు. కాకినాడలో తొలుత దాదాపు 5 ఎకరాల భూమిని 55 ప్లాట్లుగా, కర్నూలులో 10 ఎకరాల భూమిని 99 ప్లాట్లుగా, రాజంపేటలో 5 ఎకరాల భూమిని 60 ప్లాట్లుగా అభివృద్ధి చేశారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మిగతా భూమిని, ఇతర ప్రాంతాల్లోని మరికొన్ని ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకినాడ వేలం ఈ నెల 17వ తేదీన, రాజంపేటలో 18న, కర్నూలులో 19న నిర్వహించనున్నారు. అలాగే డిమాండ్ లేని ప్రాంతంగా ఇప్పటికే తేల్చిన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో అందుబాటులో ఉన్న 8.30 ఎకరాలను ఈ నెల 18న ఏకమొత్తంగా అమ్మేందుకు నిర్ణయించారు. -
వ్యవసాయ మార్కెట్లోఎలక్ట్రానిక్ బిడ్డింగ్
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: రైతు పంట ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల చేతిలో దోపిడీకి గురికాకుండా ఉండేందుకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చేపట్టిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పనులు పూర్తయ్యాయి. పంట ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని, రైతు మార్కెట్లో అక్రమార్కులు చేతిలో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మోడల్‌గా ఆరు మార్కెట్లలో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీటిలో ఖమ్మం, వరంగల్, కేసముద్రం, నిజామాబాద్, మిర్యాలగూడెం, గుంటూరు వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. అయితే వీటిలో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పనులు పూర్తి చేసుకున్నది ఖమ్మం వ్యవసాయ మార్కెటేనని మార్కెట్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మార్చి నెలలో ప్రభుత్వం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, పనుల పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన ఎన్సీడీఈఎక్స్(నేషనల్ కమాడిటివ్స్ అండ్ డెరివేటివ్స్ ఎక్చేంజ్) అనే సంస్థకు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పడిన కమిటీ నిర్ణయించిన విధంగా పత్తి మార్కెట్ యార్డ్‌లోని రైతు సమాచార కేంద్రంలో రెండు హాళ్లను ఆధునికీకరించారు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు అవసరమైన అన్ని రకాల పరికరాలను కొనుగోలు చేసి ఆయా గదుల్లో ఏర్పాటు చేశారు. 25 కంప్యూటర్లను, 10సీసీ కెమెరాలను అమర్చారు. మూడు సెక్యూరిటీ గార్డు రూములు నిర్మించారు. మార్కెట్ ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణను కూడా ఇప్చించారు. మరో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మొత్తానికి దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేశా రు. మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ విధానం మంచి ఫలితాలను ఇవ్వటంతో మన రాష్ర్టంలో కూడా అమలు చేసేందుకు మోడల్‌గా ఆరు మార్కెట్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆరింటిలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసింది. తూకాల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు కాంటాలను కంప్యూటర్లకు అనుసంధానం చేసే విధంగా ప్రాజెక్టును రూపొందించారు. పత్తి సీజన్ ప్రారంభంలోగా ఎలక్ట్రానిక్ బిడ్డింగా విధానం ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చెర్మైన్ మానుకొండ రాధాకిషోర్, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావిద్ తెలిపారు. -
అమ్మో.. హెలికాప్టర్ బొమ్మ!
విధి వక్రిస్తే మరణం ఎంత చిత్రంగా ఉంటుందో అమెరికాకు చెందిన 19 ఏళ్ల రోమన్ పిరోజెక్ అనే యువకుడి విషయంలో రుజువైంది. పిరోజెక్ ఓ హెలికాప్టర్ ఢీకొనడంతో మరణించాడు. ఏముంది ఇందు లో..? హెలికాప్టర్ ఢీకొన్నాక ఉంటారా? అనుకుంటారు కదూ.. కానీ, ఢీకొన్నది నిజం హెలికాప్టర్ కాదు... బొమ్మ హెలికాప్టర్! బ్రూక్లిన్ పట్టణంలో గురువారం పిరోజెక్ గాల్లో ఎగిరే ఎలక్ట్రానిక్ హెలికాప్టర్‌తో విన్యాసాలు చేయిస్తున్నాడు. కొద్దిసేపటికి అది అదుపుతప్పి నేరుగా దూసుకువచ్చి ఆయన తలను బలంగా ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మరణించాడు. మరో విషయం ఏమిటంటే.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగకుండా చర్యలు తీసుకునేందుకు కొంతకాలం పాటు బ్రూక్లిన్ పట్టణంలో ఎలక్ట్రానిక్ హెలికాప్టర్లను గాల్లో తిప్పడంపై నిషేధం విధించనున్నారు. -
తక్కువ ధరకు ఉపకరణాలు ఆఫర్ చేస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయ రంగంలో ఉన్న బెంగ ళూరుకు చెందిన పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రవేశించింది. హైదరాబాద్‌లో రెండు శాంసంగ్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ డిసెంబరుకల్లా అయిదు మల్టీ బ్రాండ్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. దక్షిణాదిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నందునే ఇక్కడ అడుగు పెట్టామని సంస్థ ఎండీ ఎస్.రాజ్‌కుమార్ పాయ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 13 ఏళ్లుగా కర్ణాటక కస్టమర్లకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచామని చెప్పారు. వ్యవస్థీకృతరంగ ఔట్లెట్లతో పోలిస్తే తక్కువ ధరకు ఉపకరణాలను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. పండగ ఆఫర్లు పారదర్శకంగా అందిస్తామని అన్నారు. ధరలు మరింత పెరుగుతాయి.. రూపాయి పతనం కారణంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు మరో 8% దాకా పెరుగుతాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే ఉపకరణాన్నిబట్టి 20 శాతం దాకా హెచ్చాయని చెప్పారు. ఉత్పత్తుల అమ్మకాలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గినా, పరిశ్రమ వృద్ధి 10 శాతం ఉంటుందని వివరించారు. పాయ్ ఇంటర్నేషనల్‌కు కర్ణాటకలో 56 ఔట్లెట్లు ఉన్నాయి. సెల్ఫోన్ల విక్రయానికై పాయ్ మొబైల్ స్టోర్లు 18 ఉన్నాయి. వచ్చే ఏడాది మొబైల్ స్టోర్లను హైదరాబాద్‌లోనూ నెలకొల్పనున్నారు. 2012-13లో పాయ్ ఇంటర్నేషనల్ రూ.511 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు అంచనా వేస్తోంది. రూ.40 వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాల విపణిలో ఆంధ్రప్రదేశ్ వాటా 7.5 శాతముంది. -
నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు
ముంబై:నగరంలో బాంబే హైకోర్టుకు చెందిన తొలి ఎలక్ట్రానిక్(ఈ) కోర్టును రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం ప్రారంభించారు. జస్టిస్ నితిన్ జందార్ ఆధ్వర్యంలో ఈ-కోర్టు పనిచేసే తీరును ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షాతో పాటు బాంబే హైకోర్టు న్యాయవాదులందరూ దగ్గరుండి వీక్షించారు. మొదటగా కంపెనీలకు సంబంధించి కేసులు విచారణకు వస్తాయని, ఆ తర్వాత ఇతర కేసులను కూడా విచారించనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. బాంబే హైకోర్టు భవనంలోని కోర్టు గది నంబర్ 47లో తొలి కేసును విచారించారు. ఈ కేసు విచారణ తీరును సెంట్రల్ హాల్లో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీక్షించారు. ఈ-కోర్టు గదిలో నితిన్ జందార్ టేబుల్‌పై ఫైల్లకు బదులుగా ఓ కంప్యూటర్ ఉంది. వ్యాజ్యదారుల ప్రయోజనార్ధం అదే కోర్టులో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్‌లో జందార్ కంప్యూటర్లో ఏ పేజీలు పరిశీలిస్తున్నారో అనేది కూడా కనిపించనుంది. ఎలక్ట్రానిక్ పత్రాల(పీడీఎఫ్, వర్డ్ ఫైల్)ను పెన్‌డ్రైవ్, సీడీలో కోర్టుకు పిటిషన్‌దారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ కోర్టు ఫీజు చెల్లింపులకు మంచి స్పందన లభించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా, సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్టులను ప్రోత్సహిస్తోంది. వచ్చే యేడాది మార్చి 31 నాటికి 969 కోర్టు కాంప్లెక్స్‌ల్లోని 2,249 కోర్టులను కంప్యూటరీకరణ చేయాలని భావిస్తోంది.