
వి–గార్డ్ చేతికి హైదరాబాద్ కంపెనీ
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వి–గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌కు చెందిన గట్స్ ఎలెక్ట్రోమెక్‌లో మెజారిటీ వాటా తీసుకుంటోంది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ వి–గార్డ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్‌కు చెందిన గట్స్ ఎలెక్ట్రోమెక్‌లో మెజారిటీ వాటా తీసుకుంటోంది. బోర్డు సభ్యుల నుంచి ఈ మేరకు సూత్రప్రాయంగా అనుమతి పొందింది. ఎంత పెట్టుబడి పెట్టేదీ కంపెనీ వెల్లడించలేదు. 1983లో ఏర్పాటైన గట్స్ ఎలెక్ట్రోమెక్ స్విచ్ గేర్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేస్తోంది.
ఈ విభాగంలో కంపెనీకి మంచి పేరుంది. 2015–16లో గట్స్ రూ.30 కోట్ల టర్నోవర్ సాధించింది. 2016–17లో రూ.35 కోట్లకుపైగా టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీకి హైదరాబాద్‌తోపాటు హరిద్వార్‌లో ప్లాంటు ఉంది. కాగా, 2015–16లో వి–గార్డ్ రూ.1,862 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లు ఆశిస్తోంది.