ఈ- ఫైలింగ్ ద్వారా బ్లాక్మనీ వెల్లడి అవకాశం
న్యూఢిల్లీ: డాక్యుమెంట్లను స్వయంగా సమర్పించడానికి బదులు అవసరమైతే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ద్వారా కూడా నల్లధనం వివరాలను తెలియజేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) మరో నాలుగు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ తాజా సర్క్యులర్ జారీ చేసింది.
బెంగళూరు, సీపీసీ, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ను ఉద్దేశించిBlackmoney declarants can now e-file their disclosure: CBDTతో ఈ-ఫైలింగ్ ద్వారా ఆదాయం వెల్లడి పథకాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సర్క్యులర్ వెల్లడించింది. సెప్టెంబర్ 30 దాటిన తరువాత ఈ పథకాన్ని పొడిగించే ప్రసక్తే ఉండదని కూడా స్పష్టం చేసింది. ఈ పథకం కింద అక్రమ ఆదాయం వెల్లడించేవారు జరిమానా, సర్‌చార్జ్ మొత్తం కలిపి 45 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రాసిక్యూషన్ ఎదుర్కోనక్కర్లేదు.