digital signature
-
ఐపీవోకు 2 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: కొత్తగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. జాబితాలో మల్టీ స్పెషాలిటీ పిడియాట్రిక్ ఆసుపత్రుల చైన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ సర్వీసుల సంస్థ ఈముద్ర చేరాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గతేడాది చివర్లో రెండు కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇతర వివరాలు చూద్దాం.. రెయిన్బో చిల్డ్రన్స్ ఐపీవోలో భాగంగా హైదరాబాద్ సంస్థ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 2,000 కోట్లకుపైగా సమకూర్చుకునే వీలుంది. యూకేకు చెందిన సీడీసీ గ్రూప్ తొలుత 1999లో చిన్నపిల్లలకు ప్రత్యేకించిన రెయిన్బో ఆసుపత్రిని హైదరాబాద్‌లో నెలకొల్పింది. ఈ ఆసుపత్రి 50 పడకలతో ఏర్పాటుకాగా.. తదుపరి కంపెనీ విస్తరణ బాటలో సాగింది. దీంతో 2021 సెప్టెంబర్‌కల్లా 1500 పడకలతో కూడిన 14 ఆసుపత్రులు, మూడు క్లినిక్‌లకు విస్తరించింది. ఈముద్ర దేశీయంగా అధికారిక సర్టిఫైయింగ్ లైసెన్స్ కలిగిన అతిపెద్ద సంస్థగా ఈముద్ర నిలుస్తోంది. 2021 మార్చికల్లా డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ మార్కెట్లో వాటాను 37.9 శాతానికి పెంచుకుంది. 2020 మార్చికల్లా ఈ వాటా 36.5 శాతంగా నమోదైంది. కాగా.. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, పరికరాల కొనుగోలు, డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు తదితరాల కోసం వెచ్చించనుంది. -
ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయపు పన్ను) పోర్టల్ అందుబాటులోకి వచ్చి నెలరోజులవుతున్నప్పటికీ ఇంకా సాంకేతిక లోపాలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ–ప్రొసీడింగ్స్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ వంటి కీలకమైనవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇక కొన్ని విదేశీ సంస్థలు .. పోర్టల్‌లో లాగిన్ కావడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని చార్టర్డ్ అకౌంటెంట్లు వెల్లడించారు. గడిచిన సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్నులను ఫైల్ చేయలేకపోవడం, ఇంటిమేషన్ నోటీసులను డౌన్లోడ్ చేసుకోలేకపోవడం, వివాద్ సే విస్వాస్ స్కీముకు సంబంధించిన ఫారం 3 పోర్టల్‌లో ఎక్కడా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. పోర్టల్‌ను రూపొందించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌తో వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమీక్ష జరిపి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ ఇంకా కష్టాలు తీరలేదు. -
తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనుషులకు కబుర్లు చెప్పేందుకు వచ్చిన సంస్థే ట్విటర్. మరి ఈ ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తొలిసారిగా ట్విట్ చేసిన ట్విట్ ఏంటో తెలుసా?. మార్చి 21, 2006లో తొలి సారిగా ‘‘జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విటర్’’ అని జాక్ డోర్సీ పోస్టు చేశాడు. మరి ఇది అంత మీకు ఎందుకు చెబుతున్నాను అంటే. ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైన ట్విటర్లో పెట్టిన తొలి ట్వీట్‌ను జాక్ డోర్సీ ‘వాల్యుయబుల్స్ బై సెంట్’ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని జాక్ డోర్సీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. డోర్సే 15 ఏళ్ల ట్వీట్ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటి వరకు ఉన్న అత్యంత ప్రసిద్ధ ట్వీట్లలో ఇది ఒకటి. ఇప్పటి వరకు లక్షల మంది ట్వీట్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బిడ్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు దీనికి అందిన అత్యధిక ఆఫర్ 2.5మిలియన్ డాలర్లు(దాదాపు రూ.18.30 కోట్లు). 2.5మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఓ ఔత్సాహికుడు ముందుకు వచ్చారు. ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా ఆటోగ్రాఫ్ చేసిన డిజిటల్ సర్టిఫికెట్‌ను పొందుతారు. ట్విటర్ సీఈవో సంతకాన్ని క్రిప్టోగ్రఫీని ఉపయోగించి సంతకం చేస్తారు. ఇందులో అసలు ట్వీట్ యొక్క మెటాడేటాతో పాటు అది పోస్ట్ చేసిన సమయం వంటి వివరాలు ఉంటాయి. just setting up my twttr — jack (@jack) March 21, 2006 చదవండి: వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
ఈ- ఫైలింగ్ ద్వారా బ్లాక్‌మనీ వెల్లడి అవకాశం
న్యూఢిల్లీ: డాక్యుమెంట్లను స్వయంగా సమర్పించడానికి బదులు అవసరమైతే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ద్వారా కూడా నల్లధనం వివరాలను తెలియజేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్) మరో నాలుగు వారాల్లో ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) తాజా అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ తాజా సర్క్యులర్ జారీ చేసింది. బెంగళూరు, సీపీసీ, ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ను ఉద్దేశించిBlackmoney declarants can now e-file their disclosure: CBDTతో ఈ-ఫైలింగ్ ద్వారా ఆదాయం వెల్లడి పథకాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు సర్క్యులర్ వెల్లడించింది. సెప్టెంబర్ 30 దాటిన తరువాత ఈ పథకాన్ని పొడిగించే ప్రసక్తే ఉండదని కూడా స్పష్టం చేసింది. ఈ పథకం కింద అక్రమ ఆదాయం వెల్లడించేవారు జరిమానా, సర్‌చార్జ్ మొత్తం కలిపి 45 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రాసిక్యూషన్ ఎదుర్కోనక్కర్లేదు. -
నేటి నుంచి ఈ-ఆఫీస్ సేవలు
గుంటూరు జిల్లాలో మరో నెల ఆలస్యం గుంటూరు ఈస్ట్: జిల్లాలోని పది శాఖల్లో ఈ ఆఫీస్ సేవలు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం తీసుకొస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఎలా పని చేస్తుంది అన్ని కార్యాలయాల్లో ప్రజలు పెట్టుకునే దరఖాస్తులన్నీ స్కానింగ్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. వీటిని సంబంధిత అధికారికి పంపుతారు. ఈ దరఖాస్తు కొన్ని సెకన్లకే సంబంధిత అధికారి ముందుకు వెళుతుంది. అన్ని స్థాయిల్లో ఫైలు ఎవరు ఆలస్యం చేస్తున్నారో స్పష్టంగా గుర్తించవచ్చు. ఆర్టీఏ యాక్ట్ తదితర అదనపు పనులు వేగవంతంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుల పరిష్కారం ఏ దశల్లో ఉందో ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల అధికారులు తెలుసుకోవచ్చు. జిల్లాలో ఎప్పటి నుంచి.. జిల్లాలో నేటి నుంచి పది శాఖల్లో ఈ ఆఫీసు ప్రారంభించాలని తొలుత జిల్లా అధికారులు భావించారు. కానీ డిజిటల్ సిగ్నేచర్ ఇతర సాంకేతిక కారణాలతో మరో నెల ఆలస్యమయ్యేలా ఉంది. డీఆర్వో నాగబాబు, ఈ ఆఫీస్ జిల్లా కో-ఆర్డి నేటర్ ఇప్పటికే రెవెన్యూలో ఈ ఆఫీస్ ప్రారంభమైంది. దీంతో జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారం వేగవంతమైంది. కొద్ది రోజుల్లో అన్ని ఆటంకాలు అధిగమించి 10 శాఖల్లో ఈ ఆఫీస్ ప్రారంభిస్తాం. ఈ విధానంలో ఏవైనా లోటుపాట్లను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం. -
మళ్లీ ఇంకు పడింది
సర్టిఫికెట్లపై డిజిటల్ సిగ్నేచర్‌కు రెవెన్యూశాఖ స్వస్తి వీఆర్వో నుంచి తహశీల్దార్ వరకు దరఖాస్తు పరిశీలన తప్పనిసరి సర్టిఫికెట్ల జారీలో మరింత జాప్యం తప్పదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్:కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని సమూలంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు కొత్త ఫార్మాట్‌ను సిద్ధం చేశారు. ధ్రువీకరణ పత్రాలపై గతంలో తహశీల్దారు చేసే డిజిటల్ సిగ్నేచర్‌కు బదులుగా ఇంకు సంతకం పెట్టాల్సిందేనని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు స్వీకరణ దగ్గర్నుంచి ధ్రువీకరణ పత్రం జారీ వరకు వివిధ స్థాయిల్లో (వీఆర్వో, ఆర్ఐ, డీటీ, తహశీల్దార్ వరకు) ఫైలుపై రిమార్కులు రాయడం తప్పనిసరి చేశారు. అయితే నూతన విధానం వ ల్ల ధ్రువీకరణ పత్రాల జారీలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, అధికారులు వాపోతున్నారు. మండల రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది కొరత, కంప్యూటర్లు పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఇంటర్నెట్ సమస్యలతో ప్రస్తుత విధానంలోనే ఎంతో జాప్యం జరుగుతుంటే ప్రభుత్వం కొత్త ఫార్మాట్ పేరిట మరింత మంది అధికారుల రిమార్కులను ఆన్లైన్లోనే పొందుపరచమనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. రోజూ వేలాది దరఖాస్తులు దాఖలయ్యే మండలాల్లో (ప్రత్యేకించి హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్‌నగర్, అంబర్పేట్, బండ్లగూడ, బహదూర్‌పురా మొదలైనవి) కొత్త విధానం ద్వారా సర్టిఫికెట్ల జారీ సాధ్యం కాదంటున్నారు. ఇంకుతోనే సంతకం... దరఖాస్తులు సమర్పించిన మీ-సేవ కేంద్రాల్లోనే గతంలో సర్టిఫికెట్లను ముద్రించి ఇచ్చేవారు. అయితే నూతన విధానంలో ధ్రువీకరణ పత్రం ముద్రణ ఆప్షన్‌ను తహశీల్దారుకే పరిమితం చేశారు. కొత్త ఫార్మాట్ ప్రకారం మీ-సేవ కేంద్రాల నుంచి వచ్చే ఆన్లైన్ దరఖాస్తులను తహశీల్దారు సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ)లకు ఆన్లైన్లో బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆర్ఐలు తమ పరిధిలోని వీఆర్వో ద్వారా దరఖాస్తులోని వివరాలను విచారించాలి. విచారణ పూర్తయిన దరఖాస్తులకు సంబంధించిన రిమార్కులను ఆన్లైన్లోనే ఆర్ఐ నమోదు చేయాలి. ఆ వివరాలను ఆన్లైన్లోనే డిప్యూటీ తహశీల్దారు (డీటీ) పరిశీలించి తన రిమార్కులను, చెక్‌లిస్ట్ సహా పొందుపరచాలి. ఆపై సదరు దరఖాస్తు వివరాలను, కిందిస్థాయి అధికారుల రిమార్కులను తహశీల్దారు పరిశీలించి మీ-సేవ పత్రాలపై సర్టిఫికెట్‌ను ముద్రించాలి. ముద్రిం చిన పత్రాలపై తప్పనిసరిగా ఇంకు పెన్నుతోనే తహశీల్దారు సంతకం పెట్టాలి. సంతకంతోపాటు కార్యాలయ ముద్రను తప్పనిసరిగా సర్టిఫికెట్‌పై వేయాలని ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే తెల్లకాగితంపై మరో కాపీని ముద్రించి ఆఫీస్ కాపీ కింద భద్రపరచాలని ఆదేశించారు. కోరిన వాళ్లకు ఇంటికే సర్టిఫికెట్.. ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఫార్మాట్ ద్వారా దరఖాస్తుదారు తన ధ్రువీకరణ పత్రాన్ని నేరుగా ఇంటికి వచ్చేలా ఆప్షన్ ఇచ్చుకోవచ్చు. మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు సమర్పించేటప్పుడు ‘పోస్ట్’ ఆప్షన్‌ను ఇస్తే సర్టిఫికెట్ తహశీల్దారు కార్యాలయం నుంచే నేరుగా దరఖాస్తులోని చిరునామాకు పోస్ట్ చేస్తారు. అలా కాని పక్షంలో సదరు సర్టిఫికెట్లు తహశీల్దారు కార్యాలయం నుంచి మీ-సేవ కేంద్రానికి పంపుతారు. దరఖాస్తుదారులు వారి ధ్రువీకరణ పత్రాలను అక్కడ్నుంచి పొందాల్సి ఉంటుంది. డిజిట ల్ విధానాన్నే కొనసాగించాలి ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న డిజిటల్ విధానానికి అధికారులు అలవాటు పడుతున్న తరుణంలోనే ప్రభుత్వం కొత్త ఫార్మాట్‌ను తీసుకురావడం సరికాదు. క్షేత్రస్థాయిలో అధిక పనిభారాన్ని మోస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి ఇది కచ్చితంగా అదనపు భారమే. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించాం. త్వరలోనే సానుకూల ఉత్తర్వులు వస్తాయని ఆశిస్తున్నాం. -లచ్చిరెడ్డి, తహశీల్దార్ల సంఘం అధ్యక్షుడు -
ఉపాధి హామీ పనుల బాధ్యత ఇకపై ఎంపీడీవోలదే
నందివాడ : గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులుగా ఎంపీడీవోలను పంతొమ్మిది నెలల విరామం తర్వాత మళ్లీ ప్రభుత్వం తిరిగి నియమించింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు కీలకమైన డిజిటల్ సిగ్నేచర్ ‘కీ’ని (నిధుల తాళం) ప్రభుత్వం అప్పగించింది. ఇక నుంచి మండల స్థాయిలో ఎంపీడీవో కీలకం కానున్నారు. వీరి పర్యవేక్షణంలోనే ఉపాధి పనులు, బిల్లులు చెల్లింపు, ఇతరత్రా వ్యవహారాలు సాగనున్నాయి. ఈ పథకం ఆరంభం తర్వాత 2007 జూన్‌లో పీవో బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించారు. అప్పట్లో ఉపాధి పనుల్లో ఎంపీడీవోలపై అవినీతి అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ పథకం అమలు బాధ్యతల నుంచి తమను తప్పించాలని ఎంపీడీవోలు ప్రభుత్వనికి తెగేసి చెప్పారు. తాము పీవోలుగా ఉండలేమని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ఎంపీడీవోల స్థానంలో ఆగమేఘాలపై 2013 మార్చి ఒకటోతేదీ నుండి ఏపీవోలకే పీవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. గత 19 నెలల్లో ఏపీవోలే మండల స్థాయిలో ఉపాధి పనులను నడిపించారు. రాష్ర్టంలో ప్రభుత్వం మారిన తర్వాత మళ్లీ ఎంపీడీవోలకే బాధ్యతలు అప్పగిస్తూ గత సెప్టెంబర్ 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ రెండో తేదీన జీవో నెంబర్ 139 విడుదల చేసింది. ఆ తర్వాత జన్మభూమి ఉండడంతో డీఎస్కే(కీ)లను ఎంపీడీవోలకు ఇవ్వలేదు. ఈ మధ్యనే వారికి వీటిని అప్పగించినట్లు సమాచారం. కూలి చెల్లింపులకు గ్రామకమిటీ ఉపాధి పథకం కూలీల బిల్లు చెల్లింపులు ఇక నుంచి గ్రామకమిటీల ద్వారా జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉపాధిహామీ పథకం సిబ్బంది చెబుతున్నారు. ఇన్నాళ్లు బిల్లుల చెల్లింపు చూసిన పీవో ఏజెన్సీని ప్రభుత్వం తొలగించింది. సాంకేతిక కారణాల వల్ల వచ్చేనెల 15 వరకు కూలీ చెల్లింపు మాన్యువల్‌గా జరుగుతుందని పథకం సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు గ్రామకమిటీని నియమించారు. ఈ కమిటీ కన్వీనర్‌గా గ్రామ కార్యదర్శి, సభ్యులుగా సర్పంచ్, క్షేత్ర సహాయకుడు గ్రామైక్య సంఘం(వీవో) నాయకురాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీఆర్పీ ప్రతినిధి ఉంటారు. అక్రమాలు జరిగినట్లు తేలితే వీరిదే పూర్తి బాధ్యత అని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. -
‘మీ సేవ’ కష్టాలు
జనన, మరణ ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం వేధిస్తున్న డిజిటల్ సిగ్నేచర్ సమస్య రెండునెలలుగా జనం అవస్థలు అనకాపల్లి : అనకాపల్లి జోనల్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల కోసం మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే జారీ కావడం లేదు. జీవీఎంసీ ద్వారా విడుదలయ్యే ధ్రువపత్రాలకు మీసేవా కేంద్రం హెడ్‌క్వార్టర్ ద్వారా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉండాలి. మీసేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే వారికి ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే వ్యవస్థ అనకాపల్లి జోనల్లో లేకుండా పోయింది. హైదరాబాద్‌లోని ఎన్ఐసీ మీసేవ కేంద్రాల ద్వారా వచ్చే దరఖాస్తులకు స్థానిక కార్యాలయంలో డిజిటల్ సిగ్నేచర్ సౌకర్యం కల్పిస్తేనే పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది. మూడురోజుల నుంచి అనకాపల్లి జోనల్ కార్యాలయంలో సర్టిఫికెట్లు మాన్యువల్ పద్ధతిలో అందించడంతో కొద్దిగా వత్తిడి తగ్గినప్పటికీ పెండింగ్ దరఖాస్తులు రెండువేలకు పైగానే ఉన్నాయి. అన్ని ధ్రువీకరణ పత్రాలతో పాటు పలు సేవలను మీసేవా కేంద్రం ద్వారా పొందవచ్చని ప్రభుత్వం గొప్పలు చెబుతూంటే అనకాపల్లి జోనల్లో మాత్రం జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు మీసేవా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. అనకాపల్లి అంటే అలుసే అనకాపల్లి జోనల్ అంటే జీవీఎంసీ అధికారులకు అలుసుగానే కనిపిస్తోంది. గతంలోనూ హెల్త్ ఆఫీసర్ పోస్టుకు ఇన్‌ఛార్జినే నియమించి కాలం వెళ్లదీసిన జీవీఎంసీ అధికారులు రెండు నెలలుగా హెల్త్ ఆఫీసర్ లేకపోయినా పట్టించుకోవడం లేదు. తాజాగా గాజువాక జోనల్ హెల్త్ ఆఫీసర్‌కు అనకాపల్లి జోనల్ హెల్త్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మళ్లీ ఇన్చార్జి పాలనలోనే పబ్లిక్ హెల్త్ విభాగం కొనసాగనుంది. కీలకమైన పారిశుద్ధ్య వ్యవస్థ నిర్వహణతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆహారోత్పత్తులపై పర్యవేక్షణ వంటి అధికారాలు ఉన్న హెల్త్ ఆఫీసర్ నియామకం విషయంలో ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ సిగ్నేచర్ కీ లేకే జాప్యం : జోనల్ కమిషనర్ ఈ సమస్యపై అనకాపల్లి జోనల్ కమిషనర్ డి.చంద్రశేఖరరావును వివరణ కోరగా డిజిటల్ సిగ్నేచర్ కీ సౌకర్యం ఉన్న జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నవారికి వెంటనే ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయని, మీ సేవా కేంద్రానికి ఆ సౌకర్యం లేకపోవడం వల్లే జాప్యం అవుతోందని చెప్పారు. డిజిటల్ సిగ్నేచర్ కీ కోసం ఇప్పటికే దరఖాస్తు చేశామని, ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిలో ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు.