న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయపు పన్ను) పోర్టల్ అందుబాటులోకి వచ్చి నెలరోజులవుతున్నప్పటికీ ఇంకా సాంకేతిక లోపాలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ–ప్రొసీడింగ్స్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ వంటి కీలకమైనవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇక కొన్ని విదేశీ సంస్థలు .. పోర్టల్‌లో లాగిన్ కావడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని చార్టర్డ్ అకౌంటెంట్లు వెల్లడించారు.
గడిచిన సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్నులను ఫైల్ చేయలేకపోవడం, ఇంటిమేషన్ నోటీసులను డౌన్‌లోడ్ చేసుకోలేకపోవడం, వివాద్ సే విస్వాస్ స్కీముకు సంబంధించిన ఫారం 3 పోర్టల్‌లో ఎక్కడా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. పోర్టల్‌ను రూపొందించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌తో వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమీక్ష జరిపి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ ఇంకా కష్టాలు తీరలేదు.
Comments
Please login to add a commentAdd a comment