online portal
-
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ బంద్!
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ తాత్కాలికంగా మూతపడింది. నిర్వహణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు పోర్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు రోజులూ దరఖాస్తుదారులకు పోర్టల్ అందుబాటులో ఉండదు. కొత్త అపాయింట్మెంట్లేవీ కేటాయించరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను సైతం రీషెడ్యూల్ చేస్తారు."సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్ అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు తెలియజేస్తాం" అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్మెంట్లను బుక్ చేయడానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను వినియోగిస్తారు. అపాయింట్మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకుని ధ్రువీకరణ కోసం తమ పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీని తరువాత, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది. -
అమెరికా కోటీశ్వరుడు సింఘంకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: న్యూస్‌క్లిక్ ఆన్లైన్ పోర్టల్‌పై నమోదైన మనీల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా అమెరికన్ బిలియనీర్ నెవిల్లె రాయ్ సింఘంకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. భారత్‌లో చైనాకు అనుకూలంగా కథనాలు రాసేందుకు న్యూస్‌క్లిక్‌కు డ్రాగన్ దేశం నుంచి నిధులు అందుతున్నట్లు గతంలో న్యూయార్క్‌టైమ్స్, తదితర పత్రికల్లో కథనాలు వచ్చాయి. నెవిల్లె రాయ్ సింఘం, ఆయనకు చెందిన న్యూస్‌క్లిక్‌ను అత్యంత ప్రమా దకరమైనవని పేర్కొన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన ఈడీ..న్యూస్‌క్లిక్ ఫౌండర్, ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థకు చెందిన ఢిల్లీలోని రూ.4.52 కోట్లు విలువ చేసే భవనాన్ని, రూ.41 లక్షల బ్యాంకు డిపాజిట్లను అటాచ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సింఘం ప్రస్తుతం చైనాలోని షాంఘైలో ఉన్నారు. దీంతో, ఆయ నకు విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు పంపింది. కాగా, ఈడీ ఆరోపణలను సింఘం ఖండించారు. దర్యాప్తు చేపట్టిన ఈడీ మొదటిసారిగా 2021లో సింఘంకు నోటీసు పంపింది. -
బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిందా? సింపుల్‌గా యాక్టివేట్ చేసుకోండిలా!
రిజర్వ్ బ్యాంక్ నియమాల ప్రకారం, ఒక కస్టమర్ నిర్ణీత గడువు లోపల తప్పకుండా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. అలా చేయని పక్షంలో అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఇది జరిగితే లావాదేవీలు చేయడం కుదరదు. అయితే కేవైసీ ప్రక్రియ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ కథనంలో అకౌంట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం. కేవైసీ అప్డేట్ అనేది హై రిస్క్ కస్టమర్లకు రెండు సంవత్సరాలు, మీడియం అండ్ లో (తక్కువ) రిస్క్ కస్టమర్లకు వరుసగా 8, 10 సంవత్సరాల వరకు ఉంటుంది. RBI ప్రకారం, 2019 మే 29న జారీ చేసిన సర్క్యులర్‌ను 2023 మే 4న అప్డేట్ చేసింది. కావున దీని ప్రకారం ఖాతాదారుడు పాన్ కార్డు లేదా ఫారమ్ 16ని అందించనట్లైతే అకౌంట్ తాత్కాలికంగా నిలిపివేస్తారు. అంతకంటే ముందు బ్యాంకులు ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా కష్టమరలకు హెచ్చరికలు జారీ చేస్తాయి. అకౌంట్ యాక్టివేట్ చేయడం ఎలా? కేవైసీ పూర్తి చేయకపోతే ఖాతా తాత్కాలికంగా నిలిపివేసిన అకౌంట్‌ను మళ్ళీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. దీనికి సులభమైన మార్గాలు ఉన్నాయి. 1) కేవైసీ ఫారమ్‌తో నేరుగా బ్యాంకుని సందర్శించి యాక్టివేట్ చేసుకోవచ్చు 2) మీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: మహీంద్రా ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే! మీకు తెలుసా? ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్.. బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ పోర్టల్ లాగిన్ చేసి, 'KYC' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్‌పైన సూచనలను అనుసరించి మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు ఫిల్ చేయాలి. ఆధార్, పాన్ ఇతర అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్లోడ్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత సర్వీస్ నెంబర్ పొందుతారు. దీనికి సంబంధించి ఎస్ఎమ్ఎస్ లేదా ఈ-మెయిల్ వంటివి పొందుతారు. -
అవినీతిపై రోజుకు 195 ఫిర్యాదులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతికి తగ్గట్లు ప్రజా ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృత పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీపీగ్రామ్స్) ఆన్లైన్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. అవినీతికి సంబంధించి ఏకంగా 46,627 ఫిర్యాదులు ఈ పోర్టల్ ద్వారా అందినట్లు ఆగస్టు–2022 నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన రోజుకు 195 ఫిర్యాదులు దఖలుపడ్డాయి. అత్యధికంగా ఫిర్యాదులు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్)పైనే నమోదవడం గమనార్హం. డీఎఫ్ఎస్ పరిధిలోని బ్యాంకింగ్ విభాగంపై అధికంగా 14,934 ఫిర్యాదులు వచ్చాయి. బీమా విభాగంపై 3,306 ఫిర్యాదులు, సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ)పై 2,223, శాస్త్ర,సాంకేతిక విభాగంపై 1,831, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కార్యాలయంపై 1,784, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖపై 1,005 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25 వరకు సీపీగ్రామ్స్ ద్వారా కేంద్రప్రభుత్వానికి మొత్తంగా 7,50,822 ఫిర్యాదులు అందాయి. వీటిలో 7,27,673 ఫిర్యాదులను పరిష్కరించారు. బ్యాంకింగ్ విభాగంలో 1,088, కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖలో 260 ఫిర్యాదుల్ని పరిష్కరించాల్సి ఉంది. -
‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15
న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్లైన్ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్లైన్ పోర్టల్ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది. ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది. అదేవిధంగా, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్ ఇన్ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్ గోపాలరత్న–2022కు, నేషనల్ వాటర్ అవార్డ్స్‌కు సెప్టెంబర్ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్–2023కి అక్టోబర్ 31 చివరి తేదీ అని వివరించింది. -
రైతులే నేరుగా విక్రయించుకునేలా సరికొత్త వెబ్సైట్
Mangoes Doorstep-Delivery: కర్నాటక ప్రభుత్వం ఎటువంటి మధ్యవర్తుల అవసరం లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు మామిడి పండ్లను విక్రయించడానికి సరి కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. మామిడి అత్యంత రుచికరమైన పండ్లలో ఒకటి. పైగా వేసవిలో విరివిగా లభించేది కూడా. దేశ వ్యాప్తంగా వందలాది మామిడి రకాలు ఉన్నాయి. ఐతే వాటిలో స్థానికంగా ప్రసిద్ధి చెందినవి సేకరించడం కష్టం. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ సమస్యకు చెక్‌పెట్టేలా సరికొత్త వెబ్‌సెట్‌ను ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్రంలో పండించే స్థానిక రకాల మామిడి పండ్లను ఆన్లైన్ మాధ్యమం ద్వారా వినియోగదారులకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా కర్ణాటక స్టేట్ మ్యాంగో డెవలప్మెంట్ అండ్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మే 16న మధ్యవర్తులు లేకుండా ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు మార్కెట్ చేయడానికి వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లతో రైతులు నేరుగా కనెక్ట్ అవ్వడమే కాకుండా మంచి తాజా పళ్లను కూడా పొందగలుగుతారు. ఈ ఆన్లైన్ పోర్టల్ కర్ణాటక ట్రేడ్‌మార్క్ కర్సిరి మాంగోస్ పేరుతో వెళ్తోంది. దీంతో వినియోగదారులు కనిష్ట ధరతో వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడిన రుచికరమైన తాజా మామిడి పళ్లను ఆస్వాదించగలుగుతారు. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
ఆన్లైన్లో ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారా? ఎదురయ్యే ఇబ్బందులు.. పరిష్కారాలు
మేము ఐటీఆర్ ఫారం ఆన్లైన్లో వేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఏం చేయాలి? – హసిత, వినీత, హైదరాబాద్ చాలా మంది సైటుకి వెళ్లి ఆన్లైన్లో రిటర్నులు వేద్దామని మొదలెడితే ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు, ఫారం1ను పోర్టల్‌లో నింపినప్పుడు అన్ని వివరాలు పొందుపర్చాకా ఆ సమాచారం మాయం అవుతోంది. దీనివల్ల మళ్లీ పని చేయాలి. లాగ్అవుట్ అయ్యి, మళ్లీ లాగిన్ కావాలి. అక్కణ్నుంచి మళ్లీ కథ మొదలు. ఒక్కొక్కప్పుడు తొలిసారే సమాచారం సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాతే రిటర్నులను దాఖలు చేయగలరు. అలాగే ఐటీఆర్ 2ని నింపినప్పుడు ’క్యాపిటల్ గెయిన్ సమాచారం’. ఆన్లైన్లో నింపే విధానంలో ప్రతి పేజి మీదా షెడ్యూల్ లేదా పట్టిక మీదా క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించిన సమాచారం ’వేలిడేట్’ (అంటే సమాచారాన్ని చెక్ చేసుకుని, అవునని నిర్ధారించడం) అవడం లేదు. అంటే కన్ఫర్మ్ కావడంలో జాప్యం జరుగుతోంది. ఇలాంటి వాటి వల్ల చేసిందే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుండటం, జాప్యం వల్ల సమయం వృ«థా కావడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కానీ తప్పదు. వీటితో పాటు ముందుకు సాగాల్సిందే. కొందరు ఐటీ రిటర్నులను ఆన్లైన్లో వేయలేకపోతున్నారు. ఆఫ్‌లైన్‌లో నింపి ఆన్లైన్లో వేయవచ్చా? – రిద్ధి, రిత్విక్, విశాఖపట్నం ఇక్కడ కొంత అవగాహన ఏర్పడాలి. ఆదాయాన్ని బట్టి, స్టేటస్‌ను బట్టి రకరకాల ఫారాలు ఉన్నాయి. అన్ని ఫారాలు ఆన్లైన్లో లాగిన్ అయ్యి, ఒక్కొక్క సమాచారాన్ని నింపుకుంటూ, వేలిడేట్ చేసుకుంటూ ఫైల్ చేస్తారు. సవ్యంగా, ఏ ఆటంకాలు లేకుండా ఉంటే ఇది సులువుగాను, వేగంగానూ పూర్తవుతుంది. కొన్ని విభాగాల వారికి .. అంటే ట్రస్టులు, సొసైటీలు, కంపెనీలు మొదలైన వాటికి డైరెక్టుగా నింపడం ఇంకా రాలేదు. వీటిని కంప్యూటర్ సహాయంతో ఆఫ్‌లైన్‌లో, వాడుకలో ఉన్న ’యుటిలిటీ’ ద్వారా నింపాలి. 5,6,7 ఫారాలు ఎక్సెల్ యుటిలిటీ ద్వారా నింపిన తర్వాత ’JSON’ ఫైల్ (జావా ఫైల్) ద్వారా ఆన్‌లైన్‌లోకి వెళ్లి ’అప్లోడ్’ చేయాలి. ఇది కూడా త్వరగానే అవుతుంది. 1,2,3,4 ఫారాలు ఆన్లైన్లోనే డైరెక్టుగా వేయవచ్చు. ఫారం 26 అ తో పాటు అఐ కూడా డౌన్లోడ్ చేసుకుని రిటర్న్ వేయాలా? – భాను, సుమంత్, వరంగల్ రిటర్నులు వేసే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్‌కం తయారు చేసుకోండి. ఫారం 26 అ లో అంశాలు తీసుకోండి. కొన్ని రోజుల క్రితం అఐ వచ్చింది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS )లో ఎన్నో అంశాలు ఉంటాయి. అయితే, ఈ మధ్యే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ఉపశమనం కల్పించింది. అఐ లో సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని పేర్కొంది. 26 అ లో ప్రస్తావించని ఎన్నో అంశాలు అఐ లో ఉన్నాయి. అఐ లో పూర్తి సమాచారం ఉంటుందని చెప్పవచ్చు. పూర్తి సమాచారం వల్ల మీ ఆదాయం ఎక్కువ కావొచ్చు. పన్ను భారం పెరుగుతుంది. ప్రస్తుతానికి ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఉత్తరోత్రా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కెవీఎన్ లావణ్య (ట్యాక్సేషన్ నిపుణులు) చదవండి: సీనియర్ సిటిజన్లకు ‘పన్ను’ లాభాలు -
పవన్‌కు ఎందుకంత భయం: మంత్రి అనిల్
-
ఏపీ: ఆన్లైన్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్ల బుకింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా థియేటర్లలో టికెట్ల ఆన్లైన్ బుకింగ్ కోసం ప్రత్యేకంగా ఓ పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే టికెట్ల బుకింగ్ తరహాలో ఈ పోర్టల్‌ను రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సినిమా టికెట్ల విక్రయాల విధానాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆన్లైన్ పోర్టల్ రూపొందించడం, అమలును పర్యవేక్షించడానికి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీలో ఐటీ శాఖ కార్యదర్శి, సమాచార శాఖ కార్యదర్శి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ప్రతినిధి, ఏపీటీఎస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఇవీ చదవండి: అందగత్తెకు మత్తు మరక.. మళ్లీ తెరపైకి ప్రముఖ యాంకర్ ఉప్పొంగుతున్న వరద.. టీచర్ల సాహసం -
ఐటీ పోర్టల్‌ను వీడని సమస్యలు
న్యూఢిల్లీ: కొత్త ఐటీ (ఆదాయపు పన్ను) పోర్టల్ అందుబాటులోకి వచ్చి నెలరోజులవుతున్నప్పటికీ ఇంకా సాంకేతిక లోపాలు పూర్తిగా పరిష్కారం కాలేదు. ఈ–ప్రొసీడింగ్స్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ వంటి కీలకమైనవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇక కొన్ని విదేశీ సంస్థలు .. పోర్టల్‌లో లాగిన్ కావడానికి కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని చార్టర్డ్ అకౌంటెంట్లు వెల్లడించారు. గడిచిన సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్నులను ఫైల్ చేయలేకపోవడం, ఇంటిమేషన్ నోటీసులను డౌన్లోడ్ చేసుకోలేకపోవడం, వివాద్ సే విస్వాస్ స్కీముకు సంబంధించిన ఫారం 3 పోర్టల్‌లో ఎక్కడా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. జూన్ 7న కొత్త ఐటీ పోర్టల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్నుంచి సాంకేతిక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. పోర్టల్‌ను రూపొందించిన ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌తో వీటిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా సమీక్ష జరిపి దాదాపు రెండు వారాలు అవుతున్నప్పటికీ ఇంకా కష్టాలు తీరలేదు. -
కోవిడ్ దడ.. ఆన్లైన్ అండ..
కోవిడ్ బాధితులకు ముఖ్యంగా కావాల్సింది చికిత్సకు సంబంధించిన సమాచారం, అవగాహన. ఈ రెండు అంశాలపై సేవలందించేందుకు ఇంటర్నెట్ ఆధారంగా నగరానికి చెందిన ఐటీ నిపుణుడు శ్రీధర్ ‘ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్’ పేరిట ఓ వేదికనే కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆన్లైన్ గ్రూప్స్ ద్వారా డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలను అనుసంధానం చేస్తూ కోవిడ్, పోస్ట్ కోవిడ్ బాధితులకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. –సాక్షి, సిటీబ్యూరో తన భార్య కోవిడ్ బారిన పడటంతో ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎన్నో ఇబ్బందులు, అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో తనలాగే ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులకు ఆసరాగా నిలవాలనుకున్నానని శ్రీధర్ పేర్కొన్నారు. కోవిడ్ సమస్యలన్నింటికి పరిష్కారం లభించేలా ఆన్లైన్ వేదిక ఏర్పాటు చేశానని, దీని ద్వారా స్పెషలిస్టు డాక్టర్లతో కోవిడ్ పేషెంట్లకు అవసరమైన ఆరోగ్య సలహాలు, సూచనలను అందిస్తున్నామన్నారు. వలంటీర్ల సహాయంతో హాస్పిటళ్లలో బెడ్స్ వివరాలు, వెంటిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, ఎక్మో చికిత్స తదితర సమాచారాన్ని సేకరించి కోవిడ్ పేషెంట్స్‌కు అందిస్తున్నామన్నారు. ఐదుగురు డాక్టర్లు, కొద్ది మంది సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రారంభించి నెల రోజుల్లోనే వంద మంది డాక్టర్లతో సిటీలోనే కాకుండా ఏపీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ తదితర నగరాలకు తమ సేవలను విస్తరించామన్నారు. విభజించు..సేవలందించు.. ఈ నెట్‌వర్క్‌ను చిన్నారులు, పెద్దవారు, వ్యాక్సిన్ అనే మూడు విభాగాలుగా విభజించి ప్రతి విభాగానికి 4 వాట్సప్ గ్రూప్‌లను ఏర్పాటు చేశామని శ్రీధర్ తెలిపారు. మొత్తం 12 గ్రూప్స్ ద్వారా కోవిడ్ పేషెంట్లకు వ్యాక్సిన్, చికిత్సకు సంబంధించిన సమాచారం అందిస్తున్నా మన్నారు. థర్డ్‌వేవ్‌పై ముందస్తుగా... థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని జూమ్ కాన్ఫరెన్స్‌లలో ప్రత్యేకంగా పిల్లల కోసం పీడియాట్రిక్ సెషన్స్, జూమ్ క్లినిక్స్, పోస్ట్ కోవిడ్ పేషెంట్ల కోసం సైకలాజికల్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సేవలను పొందాలనుకునే వారు 84639 12345 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. నిరంతర సేవలు.. వైద్యురాలిగా నా వృత్తిని నిర్వహిస్తూనే సామాజిక బాధ్యతగా ఈ ఆన్లైన్ వేదికలో సేవలందిస్తున్నాను. ప్రస్తుతం చిన్నారుల విషయంలో ఎన్నో భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అర్థరాత్రి సంప్రదించినా సరే వారి సమస్యలను నివృత్తి చేస్తూ, ఆరోగ్య సలహాలు, సూచనలను అందిస్తున్నాను. –డా.మాధవి బొర్రా,కన్సల్టెంట్ పీడియాట్రీషియన్, గచ్చిబౌలి -
ఆన్లైన్లో అపోలో టైర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ అపోలోటైర్స్ ఈ-కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో ఆన్లైన్ టైర్ల అమ్మకాల కోసం ఇ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో దేశీయ కస్టమర్లు ఇక నుంచి కార్లు, ద్విచక్ర వాహన టైర్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ‘బై ఆన్లైన్.. ఫిట్ ఆఫ్‌లైన్’ మోడల్లో ఈ విధానం పనిచేస్తుంది. అంటే ఆన్లైన్లో టైర్లు కొనుగోలు చేసి వాటిని బిగించేందుకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. దగ్గర్లోని అపోలో టైర్స్ డీలర్ లొకేషన్‌కు చేరుకొని టైర్లను వాహనానికి బిగిస్తాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఢిల్లీ, ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, కొచ్చిలలో ప్రారంభించిన ఈ సేవలను త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనుంది. -
పారదర్శక పాలనలో సీఎం వైఎస్ జగన్ మరో అడుగు
-
పారదర్శక పాలనలో సీఎం జగన్ మరో అడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను, పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల కమిషన్లు, ముడుపుల బాగోతాలతో అస్తవ్యస్తంగా వున్న రిజిస్ట్రేషన్స్ శాఖలో సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ఇకపై క్రయ, వియక్రయదారులే స్వయంగా తన డాక్యుమెంట్ ను తానే తయారు చేసుకుని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని రాష్ట్ర ప్రభుఏత్వం భావిస్తోంది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్లైన్లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు తమ పనుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి పూర్తి స్థాయిలో స్వస్తి చెబుతున్నారు. ఆన్లైన్ లో తమకు సంబంధించి క్రయ, విక్రయాలపై సొంతగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకోవడంతో పాటు, దానిని రిజిస్ట్రేషన్ల శాఖకు అప్లోడ్ చేయడం ద్వారా టైం స్లాట్‌ను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాష్ట్రంలో ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాసస్థలాలకు సంబంధించి సేల్‌డీడ్, సేల్‌అగ్రిమెంట్, తాకట్టు రిజిస్ర్టేషన్, బహుమతి రిజిస్ర్టేషన్లు, జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వివిధ అవసరాలకు తగినట్లు దాదాపు 16 నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ డాక్యుమెంట్లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్లోడ్ చేయాల్సి వుంటుంది. ఈ వ్యవహారం గతంలో డాక్యుమెంట్ రైటర్లు చేసేవారు. ఇప్పుడు వారితో అసవరం లేకుండానే క్రయ, విక్రయదారులే నేరుగా చేసుకునే వీలు కల్పించారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా కూడా దీనిలో నమోదు చేసుకునే అవకాశం వుంది. సిద్దం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన కార్యాలయానికి వెళ్తే.. సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇప్పటికే విశాఖపట్నం, కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ ప్రక్రియ అమలులో ఇబ్బందులను తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఇందులోని పలు లోపాలను అధికారులు గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్ ఒకటో తేదీనుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకుంటున్న సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆ శాఖ కమిషనర్ సిద్దార్ధా జైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రెండు బృందాలను ఎంపిక చేశారు. ఈనెల 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం, 17న చిత్తూరు, తూర్పు గోదావరి, 18న నెల్లూరు, పశ్చిమ గోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాల్లో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో న్యాయవాదులు, వైద్యులు, రియాల్టర్లు, బిల్డర్లు, పురప్రముఖులు, సాధారణ ప్రజలను ఆహ్వానిస్తున్నారు. వారి నుంచి అవసరమైన సలహాలను, సూచనలను స్వీకరిస్తారు. తిరస్కరించే డాక్యుమెంట్లపై అప్పీల్‌కు అవకాశం నూతన విధానం ద్వారా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సమర్పించే డాక్యుమెంట్లను ఏదైనా కారణం వల్ల తిరస్కరిస్తే, దానిపై అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చట్టం 73, 74 కింద జిల్లా రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చ. ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ను తిరస్కరించారో సదరు అధికారి నిర్ణీత సమయంలో పూర్తి వివరణ అందిస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్లలో పారదర్శకత మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. -
ఇదేం వింత.. హెడ్‌ఫోన్ ఆర్డర్ చేస్తే..?
కోలకతా: ఆన్లైన్ కొనుగోళ్లలో మోసానికి సంబంధించి మరో షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. కానీ కోలకతాకు చెందిన వినియోగదారుడికి మాత్రం మరో వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ ఆన్లైన్ కంపెనీకి హెడ్‌ఫోన్స్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు. ఫుట్‌బాల్ పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ అభిమాని అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్లనుఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందుకు రెండుటీవీ హెడ్సెట్లను ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది. అయితే ఆ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్‌లో ఉన్నది చూసి బిత్తరపోయాడు. ఇక్కడే ఈయనకు మరో షాక్ తగిలింది. హెడ్‌ఫోన్‌కు బమదులుగా ఒక హెయిర్ ఆయిల్ డబ్బా దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్ ఫ్రీకి (1800) ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ ఒకసారి మ్రోగి.. డిస్ కనెక్ట్ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్ చేశాడు. సేమ్ ఎస్ఎంఎస్ రిపీట్. ఇక ఈ విషయాన్ని వాళ్ల స్నేహితులతో షేర్ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన అసలైన టోల్ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్ సెట్ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్ చేస్తామంటూ సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్ రావడం. దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్లైన్ పోర్టల్ వాళ్లు వచ్చి ఆదే బాటిల్ వాపస్ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్బాల్ మ్యాచ్‌లను మ్యూట్‌లోనే వీక్షిస్తున్నాడుట. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్లైన్ పోర్టల్ కస్టమర్ కేర్ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. -
ఫోన్ ఆర్డరిస్తే రాయి వచ్చింది!
ఘజియాబాద్: ఆన్ లైన్ మొబైల్ ఫోన్ ఆర్డరిస్తే రాయి పంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. తన డబ్బు తిరిగిచ్చేందుకు నిరాకరించడంతో ఆన్ లైన్ పోర్టల్ పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు షోరూమ్ లో పనిచేస్తున్న బసంత్ శర్మ ఈనెల 11న ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి రూ.1580 తీసుకుని అతడికి ఓ ప్యాకెట్ అందించాడు. ప్యాకెట్ విప్పి చూస్తే ఫోన్ కు బదులు రాయి ఉండడంతో శర్మ షాక్ అయ్యాడు. తన డబ్బు తనకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా, అతడు ఒప్పుకోలేదు. తమ కంపెనీ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ నంబర్ ఇచ్చాడు. అతడికి ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. చేసేదీ లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.