![ఫోన్ ఆర్డరిస్తే రాయి వచ్చింది!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/3/71431709186_625x300.jpg.webp?itok=NNDniph_)
ఫోన్ ఆర్డరిస్తే రాయి వచ్చింది!
ఘజియాబాద్: ఆన్ లైన్ మొబైల్ ఫోన్ ఆర్డరిస్తే రాయి పంపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది. తన డబ్బు తిరిగిచ్చేందుకు నిరాకరించడంతో ఆన్ లైన్ పోర్టల్ పై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కారు షోరూమ్ లో పనిచేస్తున్న బసంత్ శర్మ ఈనెల 11న ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చి రూ.1580 తీసుకుని అతడికి ఓ ప్యాకెట్ అందించాడు.
ప్యాకెట్ విప్పి చూస్తే ఫోన్ కు బదులు రాయి ఉండడంతో శర్మ షాక్ అయ్యాడు. తన డబ్బు తనకు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా, అతడు ఒప్పుకోలేదు. తమ కంపెనీ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ నంబర్ ఇచ్చాడు. అతడికి ఫోన్ చేసినా అదే సమాధానం వచ్చింది. చేసేదీ లేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.