పాస్‌పోర్ట్ ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలికంగా మూతపడింది. నిర్వహణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు పోర్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు రోజులూ దరఖాస్తుదారులకు పోర్టల్ అందుబాటులో ఉండదు. కొత్త అపాయింట్‌మెంట్‌లేవీ కేటాయించరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్‌లను సైతం రీషెడ్యూల్ చేస్తారు.
"సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్ అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్‌మెంట్‌లను తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు తెలియజేస్తాం" అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను వినియోగిస్తారు. అపాయింట్‌మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకుని ధ్రువీకరణ కోసం తమ పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీని తరువాత, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment