shut
-
ఇరాన్‌పై దాడి.. మూడు దేశాల గగనతలం మూసివేత
టెహ్రాన్:తమపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇవాళ(శనివారం) తెల్లవారుజామున పెద్దఎత్తున దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్‌గా క్షిపణుల దాడి జరిపింది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రయోగించిన మిసైల్స్ కారణంగా విమాన సర్వీసులు నిలిపివేశారు. ఫ్లైట్ రాడార్ 24, ఓపెన్ సోర్స్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం.. మూడు దేశాలు( ఇరాన్, ఇరాక్, సిరియా) మీదుగా ఏ విమానమూ ప్రయాణించడం లేదు.ఈ మూడు దేశాల మధ్య విమనాలు ప్రయాణించే గగనతలం మూసివేశారు. అయితే.. దాడులు ముగిసిన అనంతరం గగనతలంలో విమాన సర్వీసుల ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా కొన్ని గంటల పాటు జోర్డాన్, ఇజ్రాయెల్ గగనతలం మూసివేయబడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.The airspace of #Iran, #Iraq, #Jordan, #Syria and #Israel is closed as Israeli war planes attack various locations in Iran for the last few hours. pic.twitter.com/5MEcNGaiNk— Hamdan News (@HamdanWahe57839) October 26, 2024అక్టోబర్ 1న హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్.. ఇజ్రాయెల్‌పై 200కుపైగా రాకెట్లు, క్షిపణుల ప్రయోగించింది. ఇరాన్ వైమానిక దాడులకు ప్రతీకంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఇజ్రాయల్ చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. ‘‘శనివారం తెల్లవారుజాము నుంచి ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇలామ్, ఖుజెస్తాన్, టెహ్రాన్‌లోని సైనిక స్థావరాలను ఐడీఎఫ్ లక్ష్యంగా దాడులు జరిపింది. అయితే ఈ దాడులు పరిమిత నష్టాన్ని మాత్రమే కలిగించాయి" అని ఓ ప్రకటనలో పేర్కొంది. -
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ బంద్!
పాస్‌పోర్ట్ ఆన్లైన్ పోర్టల్ తాత్కాలికంగా మూతపడింది. నిర్వహణ పనుల నిమిత్తం ఐదు రోజుల పాటు పోర్టల్‌ను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు రోజులూ దరఖాస్తుదారులకు పోర్టల్ అందుబాటులో ఉండదు. కొత్త అపాయింట్మెంట్లేవీ కేటాయించరు. అలాగే ముందుగా బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను సైతం రీషెడ్యూల్ చేస్తారు."సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా పాస్‌పోర్ట్ సేవా పోర్టల్ ఆగస్ట్ 29 రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పనిచేయదు. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, ఇతర ఏజెన్సీలకు సైతం ఈ రోజుల్లో పోర్టల్ అందుబాటులో ఉండదు. ఆగస్ట్ 30 కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న అపాయింట్మెంట్లను తగిన విధంగా రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు తెలియజేస్తాం" అని పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌లో పేర్కొన్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేయడానికి లేదా పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాలలో అపాయింట్మెంట్లను బుక్ చేయడానికి పాస్‌పోర్ట్ సేవా పోర్టల్‌ను వినియోగిస్తారు. అపాయింట్మెంట్ రోజున, దరఖాస్తుదారులు తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కేంద్రాలకు చేరుకుని ధ్రువీకరణ కోసం తమ పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీని తరువాత, పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇదంతా పూర్తయ్యాగా పాస్‌పోర్ట్ దరఖాస్తుదారు చిరునామాకు చేరుతుంది. -
అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్!
అగ్రరాజ్యం అమెరికాలో రికార్డ్ స్థాయిలో బ్యాంక్ శాఖలు మూత పడుతున్నాయి. అక్కడి బ్యాంకులు గత నెలలో ఒక్క వారంలో 37 బ్యాంచ్‌లను మూసివేయడానికి అనుమతి కోరాయి. మూసేస్తున్న బ్యాంచ్లలో మూడింట రెండు వంతులు బ్యాంక్ ఆఫ్ అమెరికా, టీడీ బ్యాంక్, కీబ్యాంక్ శాఖలే ఉన్నాయి. అమెరికాలో బ్రాంచ్‌లను మూసేస్తున్న బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు వరుసలో నిలిచింది. ఇది గత సంవత్సరం దాదాపు 160 శాఖలను మూసేసింది. 2024 మొదటి నెలలోనే 30 బ్రాంచ్‌లు మూసేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఈ ధోరణి ఇంతటితో తగ్గేలా కనిపించడం లేదు. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ‘ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ ఆఫ్ ద కరెన్సీ’ (OCC) నుంచి సమాచారం ఆధారంగా జనవరి 21 నుంచి 27వ తేదీ వరకు మూత పడిన బ్యాంక్ బ్రాంచ్‌ల వివరాలను డైలీ మెయిల్ కథనం పేర్కొంది. అమెరికాలో ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌ను మూసివేయాలనుకున్నా లేదా కొత్తది ఏర్పాటు చేయాలనుకున్నా ఓసీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూఎస్ బ్యాంకుల నియంత్రణ సంస్థ ప్రకారం.. గత జనవరి నెలలో మొత్తం 139 షెడ్యూల్డ్ బ్యాంక్ బ్రాంచ్‌లు శాశ్వతంగా మూతపడ్డాయి. 2023లో నెలవారీ సగటు కంటే ఇది అధికం. మరో వారంలో 41 శాఖలు మూసివేస్తామని అమెరికన్ బ్యాంకులు గత నెలలోనే ప్రకటించాయి. -
ఆ రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్.. పాఠశాలలకు సెలవులు!
చెన్నై: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కేరళలో ఈ రెండు రోజులు(బుధ, గురువారాలు) అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరి, కారైకల్‌లోని పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అటు.. తమిళనాడులోని 10 జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కేరళ, తమిళనాడులో గత నాలుగు రోజులుగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో వరుసగా 7 సెం.మీ, 5 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా జనం అవస్థలు పడుతున్నాయి. కాలనీల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాను బాధించిన వీడియో.. అందులో ఏముందంటే..? -
అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..!
న్యూఢిల్లీ: భారత్‌లో తమ హోల్‌సేల్ విభాగంలోని అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను మూసివేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. అయితే, హోల్‌సేల్ బీ2బీ మార్కెట్‌ప్లేస్ మాత్రం యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. కార్యకలాపాల వార్షిక సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.(టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్, న్యూ లుక్ చూస్తే ఫిదానే!) అమెజాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రస్తుతం కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని (బెంగళూరు, మైసూరు, హుబ్లి) చిన్న దుకాణాదారులకు పరిమిత స్థాయిలో సర్వీసులందిస్తోంది. ప్రస్తుత కస్టమర్లు, భాగస్వాములకు ఇబ్బందులు కలగకుండా దశలవారీగా అమెజాన్ డిస్ట్రిబ్యూషన్‌ను నిలిపివేయ నున్నట్లు అమెజాన్ ప్రతినిధి వివరించారు. ఇప్పటికే ఫుడ్ డెలివరీ, అమెజాన్ అకాడెమీ వ్యాపార విభాగాలను నిలిపి వేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకోగా.. ఇది మూడోది కానుంది. (డీఎల్ఎఫ్కు షాక్: అదానీ చేతికి ‘ధారావి’ ప్రాజెక్టు) మరోవైపు, క్లౌడ్ సర్వీసులకు సంబంధించి భారత మార్కెట్లో వృద్ధికి భారీగా అవకాశాలు ఉన్నాయని అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ బిజినెస్, ఏడబ్ల్యూఎస్ భారత్, దక్షిణాసియా విభాగం) పునీత్ చందోక్ తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కంపెనీలు మరింతగా క్లౌడ్ వైపు మళ్లగలవని తమ వార్షిక ’రీ:ఇన్వెంట్ 2022’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. -
‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఈ తరుణంలో మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ రావడం విశేషం. ఈ మేరకు మనీష్ సిసోడియా తనకు బిజేపీ ఒక మంచి ఆఫర్ ఇస్తూ ఒక సందేశాన్ని పంపిందని తెలిపారు. "మీరు ఆప్‌ని వదిలేసి బీజేపీలోకి చేరండి సీబీఐ కేసులన్ని మూసేస్తాం" అని ఒక ట్వీట్ వచ్చిందని చెప్పారు. అంతేకాదు తనపై పెట్టిన కేసులన్ని తప్పడు కేసులుని గట్టిగా నొక్కి చెప్పడమే కాకుండా మీరేం చేయాలకుంటే అది చేసుకోండి అని సిసోడియా బీజేపీకి సవాలు విసిరారు. తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడునని అన్నారు. తన తల నరుక్కుంటానేమో కానీ అవినీతి కుట్రదారుల ముందు తలవంచనని తెగేసి చెప్పారు. ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. (చదవండి: Delhi Excise Policy Scam: కేజ్రీవాల్‌కు సంకెళ్లే) -
43 మెక్‌డొనాల్డ్స్ మూత, ఉద్యోగాలు గోవింద
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్ విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్ల(సీపీఆర్ఎల్) 50:50 జాయింట్ వెంచర్ విక్రమ్ బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు మధ్య వివాదాలు తలెత్తడంతో మెక్డీలు మూత పడే స్థాయికి వచ్చింది. ఢిల్లీలో నిర్వహిస్తున్న మొత్తం 55 రెస్టారెంట్లలో 43 మూడింటిని మూతవేయాలని సీపీఆర్ఎల్ బోర్డు నిర్వహించింది. నేటి(గురువారం) నుంచి ఇవి మూతపడనున్నాయి. '' ఇది చాలా దురదృష్టకరం. కానీ సీపీఆర్‌ఎల్‌కు చెందిన 43 రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసి వేయాల్సి వస్తుంది'' అని సీపీఆర్ఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి చెప్పారు. సీపీఆర్ఎల్ మొత్తం 168 రెస్టారెంట్లను ఆపరేట్ చేస్తోంది. బక్షి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా లేనప్పటికీ, ఆయన, తన భార్యతో కలిసి సీపీఆర్ఎల్లో బోర్డు సభ్యులుగా ఉంటున్నారు. సీపీఆర్ఎల్ బోర్డులో మెక్‌డొనాల్డ్స్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులూ ఉన్నారు. కానీ బుధవారం ఉదయం స్కైప్ ద్వారా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 1,700 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అయితే మూసివేసే విషయానికి గల ప్రధాన కారణాలను ఈ జాయింట్ వెంచర్ భాగస్వామి వెల్లడించలేదు. బక్షికి, మెక్‌డొనాల్డ్స్‌కు వివాదం తలెత్తడంతో, సీపీఆర్ఎల్ కచ్చితంగా చేయాల్సిన రెగ్యులేటరీ హెల్త్ లైసెన్సులను కూడా రెన్యువల్ చేయించలేదు. 2013 ఆగస్టులో సీపీఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తొలగించబడ్డ బక్షి, మెక్‌డొనాల్డ్స్‌తో వివాదానికి దిగారు. ఈ విషయంపై కంపెనీ లా బోర్డులో విచారణ కూడా జరుగుతోంది. బక్షికి వ్యతిరేకంగా మెక్‌డొనాల్డ్స్ కూడా లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ దాఖలు చేసింది. నార్త్, ఈస్ట్ ఇండియాలో మాత్రమే మెక్డీలను కన్నాట్ ప్లాజా రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సౌత్, వెస్ట్ ఇండియాలో మెక్‌డొనాల్డ్స్ ఆపరేషన్లను హార్డ్ క్యాసిల్ రెస్టారెంట్ల ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. సీపీఆర్ఎల్ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం మెక్‌డొనాల్డ్స్‌కు ప్రమాదకరమని బ్రాండింగ్ నిపుణులు చెబుతున్నారు. -
ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారం పెట్రోల్ బంకులు మూత
చెన్నై: ప్రతి ఆదివారం పెట్రోల్, డీజిల్ బంకుల మూతకు సిద్ధమవుతున్న రాష్ట్రాల్లో తాజాగా తమిళనాడు కూడా చేరింది. మే 14వతేదీ నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూసివేయనున్నామని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, భారతీయ పెట్రోలియం డీలర్స్ కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ "మన్ కి బాత్" కార్యక్రమం సందర్భంగా ఇచ్చిన సేవ్ ఆయిల్ పిలుపుకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాల సంఖ్య ఎనిమిదికి చేరిందని అసోసియేషన్ ప్రకటించింది. తమిళనాడు, కేరళ, కర్నాటక, పుదుచ్చేరి, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానాలతోపాటుగా తమిళనాడులో సుమారు 20వేల ఔట్ లెట్స్ ఆదివారం మూతపడనున్నట్టు చెన్నై పెట్రోల్ బంకుల యాజమనుల సంఘం మంగళవారం ప్రకటించింది. తాము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ఆయిల్ కంపెనీల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అమలు కు వాయిదా వేసినట్టుతెలిపాయి. ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులను మూసివేసేందుకు తాము కూడా నిర్ణయించామని ఎనిమిది రాష్ట్రాల్లో మే 14నుంచి పెట్రోల్ పంపులు ఆదివారాలు 24 గంటలు పనిచేయవని ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు. మరోవైపు అసోసియేషన్ నిర్ణయానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు మద్దతు ప్రకటించాయా అని అడిగినప్పుడు, త్వరలో తమ నిర్ణయాన్ని వారికి కమ్యూనికేట్ చేస్తామని సురేష్ కుమార్ చెప్పారు. అలాగే పెట్రోల్ బంకుల మార్జిన్ లపెంపుపై ప్రశ్నించినపుడు దీనిపై అసోసియేషన్ చర్చిస్తోందన్నారు. దీనిపై అసోసియేషన్ త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్టు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నసంగతి తెలిసిందే. -
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
-
ప్రతి ఆదివారం ఇక పెట్రోల్ బంకులు క్లోజ్
ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే సెలవు కాదు. ఇక పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలు సెలవును తీసుకోనున్నాయి. మే 14 నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ ప్రకటించారు. కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్ లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. 2017 మే 14 నుంచి ప్రతి డీలర్ సెలవు తీసుకోవాలని సీఐపీడీ ఆదేశించినట్టు డీలర్స్ కన్సోర్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ చెప్పారు. ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటరు డీజిల్ పై రూపాయి 65పైసలు, లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల 56 పైసల కమిషన్ ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. ఈ కమిషన్ ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి నిరసనగా వారు ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూస్తామని ప్రకటించారు. అంతేకాక మే 10ని 'నో పర్చేస్ డే' గా చేపట్టబోతున్నారు. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడదని, సీఐపీడీ యాక్టివేట్ లో ఉండే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారాలు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడతాయని తెలిపారు. అసోసియన్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సపోర్టు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. తాము కూడా ప్రభుత్వం ఎక్కువ డీలర్ కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, కానీ మూత పెట్టడం లేదన్నారు. -
1,200 ఫ్యాక్టరీలు మూత
బీజింగ్ : దట్టమైన మేఘాల వల్లే అల్లుకుపోతున్న వాతావరణ కాలుష్యంతో బీజింగ్ పరిసర ప్రాంతాల్లో పొలుష్యన్ అలర్ట్ ప్రకటించించారు. రాజధాని సమీపంగా ఉన్న 1,200 ఫ్యాక్టరీలను మూసివేయడం లేదా ఉత్పత్తి తగ్గించుకోవడం వంటివి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీచేసిన వాటిలో ప్రభుత్వ దిగ్గజ ఆయిల్ రిఫైనరీ సినోపెక్ సంస్థ, కోఫ్కో ఫుడ్ ప్లాంట్లు ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ దిగ్గజం సినోపెక్ ఏడాదికి 10 మిలియన్ టన్నుల యన్షాన్ రిఫైనరీ చేస్తుందని మున్సిపల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 500 కంపెనీలకు ఉత్పత్తిలో కోత విధించి, 700 కంపెనీలు కచ్చితంగా కార్యకలాపాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు పేర్కొంది. ఉత్తర చైనా వ్యాప్తంగా దట్టమైన కాలుష్య మేఘాలు ఆవరించడంతో, శుక్రవారం అర్థరాత్రి పర్యావరణ నిపుణులు రెడ్ అలర్ట్ కూడా జారీచేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరొందిన చైనా ఎంతో కాలంగా పర్యావరణ సంబంధిత సమస్యతో సతమతమవుతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కలర్-గ్రేడెడ్ వార్నింగ్ సిస్టమ్‌ను కూడా ప్రభుత్వం చేపడుతోంది. -
బ్రాంచ్‌ల మూతకు ఎస్బీఐ ప్లాన్
ముంబై : దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన బ్రాంచులను తగ్గించుకునే ప్రణాళికను రచిస్తోంది. తన గ్రూపు నుంచి 30 శాతం బ్రాంచులను పునర్ నిర్మించుకోవడం లేదా మూసివేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకిన్సే సూచన మేరకు ఎస్బీఐ ఈ మేరకు అడుగులు వేయనున్నట్టు సమాచారం. బ్రాంచ్ అప్టిమైజేషన్కు మెకిన్సేను సలహాదారుగా నియమించామని ఎస్బీఐ ఎండీ రాజ్నీష్ కుమార్ స్పష్టంచేశారు. అయితే బ్రాంచుల సైజు తగ్గించడంపై మాత్రం వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు. బ్రాంచ్‌ల, ఏటీఎమ్‌ల అప్టిమైజేషన్ కోసం, వినియోగదారులకు మెరుగైన అనుభవాలు అందించడానికి మెకిన్సేతో కలిశామని కుమార్ వెల్లడించారు. యాక్సేంచర్ ఫైనాన్సియల్ సర్వీసులతో కూడా తాము కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. బ్రాంచుల అప్టిమైజేషన్ చర్యలో భాగంగా, ఎస్బీఐ ఇటీవలే తన 400 బ్రాంచులను మూసివేయడం లేదా పునర్ నిర్మించుకోవడం చేసింది. దీంతో బ్యాంకు తన వ్యయాలను తగ్గించుకుంది. కొత్త బ్రాంచులను కలుపుకోవడాన్ని యేటికేటికి తగ్గిస్తూ వస్తున్న ఎస్బీఐ..గతేడాది కేవలం 451 బ్రాంచులనే జోడించుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 16,784 బ్రాంచులు కలిగిఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంతో ముగిసే లోపు ఐదు అనుబంధ బ్యాంకుల, భారతీయ మహిళా బ్యాంకు విలీన ప్రక్రియతో మరో 6,978 బ్రాంచులు తనలో కలుపుకోనుంది అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియతో వ్యయాలు కచ్చితంగా తగ్గుతాయని కుమార్ తెలిపారు. లేకపోతే విలీనాన్ని తామెందుకు ప్రతిపాదిస్తామన్నారు. బ్రాంచుల కొత్త ఫార్మాట్ కోసం బ్యాంకు యోచిస్తోందని వెల్లడించారు. 133 ఇన్ టచ్ బ్రాంచులను సెల్ఫ్ సర్వీసు మోడ్ లో వివిధ రకాల ఆన్లైన్ సేవలు అందించడానికి ఎస్బీఐ ప్రారంభించింది. ఒక్కసారి విలీన ప్రక్రియ పూర్తయితే కంపెనీ రూ.37లక్షల కోట్ల అసెట్ బేస్‌తో, 24వేల బ్రాంచులు, 58వేల ఏటీఎమ్లుగా బ్యాంకు ఆవిర్భవించనుంది. . -
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన కలెక్టర్ !
తిరువనంతపురం: జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. విద్యార్థులు చదువును కోల్పోకుండా ఉండేందుకు ఏకంగా తన కార్యాలయాన్నే బడిగా మార్చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మలపరంబ హైస్కూల్ మూతపడటంతో విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పరిస్థితిపై దృష్టిసారించిన కలెక్టర్.. కార్యాలయంలో సగభాగాన్ని పాఠాలు చెప్పుకొనేందుకు ఇవ్వడంతోపాటు... విద్యార్థులకు ముఖ్యమైన సందేశాలను అందిస్తూ ఓరోజు తాను సైతం పాఠాలను చెప్పారు. కేరళ కోజిఖోడ్ జిల్లాలోని మలపరంబ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు రోజుల క్రితం మూతపడింది. కొన్ని కారణాలతో స్కూలును మూసివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. కేవలం పాఠశాల భవనం లేదన్న కారణంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఆలోచించిన జిల్లా కలెక్టర్.. విషయంపై మరింత దృష్టి సారించారు. తన కార్యాలయంలో సగభాగాన్ని తాత్కాలికంగా బడికి కేటాయించారు. దీంతో ఉపాధ్యాయులు సైతం అక్కడికే వచ్చి పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేయించారు. అయితే ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాఠశాలను స్వాధీనం చేసుకున్న అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లే అవకాశం ఉందని, స్కూల్ ఆందోళనల కారణంగా మూసివేయలేదని ఏఈవో చెప్పగా... త్వరలో పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని విద్యాశాఖ మంత్రి సి రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు మలపరంబ స్కూల్ నిర్వహణా వ్యవహారాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటుందని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లోకి చేరిన విద్యార్థులకు మొదటిరోజు కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ పాఠాలు చెప్పారు. ప్రపంచంలో బతకాలంటే డబ్బు కన్నా విజ్ఞానం ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే పాఠశాలను అధీనంలోకి తీసుకునేందుకు కావలసిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిందని, త్వరలో స్కూల్ ను స్వాధీనం చేసుకుంటుందని ప్రశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఆ పదిహేను రోజులు స్కూల్లు బంద్!
న్యూఢిల్లీ: కాలుష్య కోరల నుండి ఢిల్లీని రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించిన కేజ్రీవాల్ సర్కార్.. ఆ దిశగా తలపెట్టిన సరి-బేసి విధానాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలో జనవరి 1 నుండి 15 వరకు సరి-బేసి విధానాన్ని ట్రయల్ రన్ చేపట్టనున్నారు. దీనిలో భాగంగా సరిసంఖ్య నెంబర్లు గల కార్లు, బేసి సంఖ్య నెంబర్లు గల కార్లను ఆల్టర్నేటీవ్ రోజుల్లో రోడ్ల మీదకు అనుమతిస్తారు. దీని వలన ఢిల్లీలో ఈ పదిహేను రోజులు దాదాపు సగం కార్లు ఇంటికే పరిమితం కానున్నాయి. ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఏర్పరచడం సర్కారుకు తలకు మించిన భారంలా తయారైంది. దీంలో ప్రభుత్వం కన్ను స్కూల్ బస్సులపై పడింది. ప్రజలకు అసౌకర్యం కలుగకుండా అదనంగా 6000 ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్న ప్రభుత్వం స్కూల్ బస్సుల ద్వారా 2000 వాహనాలను సమకూర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్కూల్ బస్సులను రవాణా కోసం ఉపయోగించుకోవాలలని భావిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మత్రి, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సూత్రప్రాయంగా తెలిపారు. పాఠశాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ఉన్నటువంటి 26 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు సెలవులు ఇచ్చే విషయమై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. -
చెన్నై పై వాయుగుండం ప్రభావం