1,200 ఫ్యాక్టరీలు మూత
Published Sat, Dec 17 2016 10:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM
బీజింగ్ : దట్టమైన మేఘాల వల్లే అల్లుకుపోతున్న వాతావరణ కాలుష్యంతో బీజింగ్ పరిసర ప్రాంతాల్లో పొలుష్యన్ అలర్ట్ ప్రకటించించారు. రాజధాని సమీపంగా ఉన్న 1,200 ఫ్యాక్టరీలను మూసివేయడం లేదా ఉత్పత్తి తగ్గించుకోవడం వంటివి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు జారీచేసిన వాటిలో ప్రభుత్వ దిగ్గజ ఆయిల్ రిఫైనరీ సినోపెక్ సంస్థ, కోఫ్కో ఫుడ్ ప్లాంట్లు ఉన్నాయి. ఆయిల్ రిఫైనరీ దిగ్గజం సినోపెక్ ఏడాదికి 10 మిలియన్ టన్నుల యన్షాన్ రిఫైనరీ చేస్తుందని మున్సిపల్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
500 కంపెనీలకు ఉత్పత్తిలో కోత విధించి, 700 కంపెనీలు కచ్చితంగా కార్యకలాపాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు పేర్కొంది. ఉత్తర చైనా వ్యాప్తంగా దట్టమైన కాలుష్య మేఘాలు ఆవరించడంతో, శుక్రవారం అర్థరాత్రి పర్యావరణ నిపుణులు రెడ్ అలర్ట్ కూడా జారీచేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా పేరొందిన చైనా ఎంతో కాలంగా పర్యావరణ సంబంధిత సమస్యతో సతమతమవుతోంది. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి కలర్-గ్రేడెడ్ వార్నింగ్ సిస్టమ్ను కూడా ప్రభుత్వం చేపడుతోంది.
Advertisement
Advertisement