న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఈ తరుణంలో మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ రావడం విశేషం.
ఈ మేరకు మనీష్ సిసోడియా తనకు బిజేపీ ఒక మంచి ఆఫర్ ఇస్తూ ఒక సందేశాన్ని పంపిందని తెలిపారు. "మీరు ఆప్‌ని వదిలేసి బీజేపీలోకి చేరండి సీబీఐ కేసులన్ని మూసేస్తాం" అని ఒక ట్వీట్ వచ్చిందని చెప్పారు. అంతేకాదు తనపై పెట్టిన కేసులన్ని తప్పడు కేసులుని గట్టిగా నొక్కి చెప్పడమే కాకుండా మీరేం చేయాలకుంటే అది చేసుకోండి అని సిసోడియా బీజేపీకి సవాలు విసిరారు. తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడునని అన్నారు.
తన తల నరుక్కుంటానేమో కానీ అవినీతి కుట్రదారుల ముందు తలవంచనని తెగేసి చెప్పారు. ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment