false cases
-
ప్రభుత్వ కుతంత్రం బట్టబయలు
రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై వందలాదిగా నమోదు చేస్తున్న అక్రమ కేసుల వెనుక ఉన్న అసలు పన్నాగం ఏమిటన్నది కూడా స్పష్టమైంది. అక్రమ కేసులతో వేధింపులు.. అక్రమ నిర్బంధాలతో రోజుల తరబడి థర్డ్ డిగ్రీతో సృష్టిస్తున్న అరాచకం.. వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నదాష్టీకం వెనుక టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కుతంత్రం ఉందని నిగ్గు తేలుతోంది.సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. పోలీసులను పాత్రధారులుగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు సూత్రధారులుగా సాగిస్తున్న అరాచక పర్వం గుట్టు ఆధారాలతో సహా రట్టు అయింది. బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలిచారన్న ఒకే ఒక్క కారణంతో మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఏకంగా అక్రమంగా పోక్సో కేసు పెట్టేంతగా బరితెగించిన పోలీసు వ్యవస్థ బండారం బయట పడింది. తెల్ల కాగితాలపై సంతకం చేయించుకుని పోలీసులే తప్పుడు ఫిర్యాదు రాసి అక్రమ కేసు నమోదు చేసేంతగా దిగజారారన్న నిజం విభ్రాంతి కలిగించింది. ఓ మాజీ శాసనసభ్యుడిపై అక్రమ కేసు నమోదు చేసేందుకే అంతటి కుతంత్రం పన్నిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు వత్తాసు పలికిన పోలీసు వ్యవస్థ తీరు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ప్రకాశం జిల్లాలో మరో నిర్వాకం విశాఖపట్నానికి చెందిన ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు నవంబరు 4న అక్రమంగా అదపులోకి తీసుకుని, దర్శి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నవంబరు 5న ఆయన సెల్ ఫోన్‌ను అన్‌లాక్ చేయించి, స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరకంగా హింసించారు. ఆయనపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాంతో ఆయన మొబైల్ ఫోన్ నుంచి ఓ అసభ్యకర పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ పోస్టు ఎందుకు పెట్టావని ఆయన్ని తమదైన శైలిలో ప్రశ్నించారు. దాంతో ఆ బాధితుడు ఎదురు తిరిగాడు. తన మొబైల్ ఫోన్ నవంబరు 5 నుంచి పోలీసుల జప్తులోనే ఉంటే.. తాను నవంబరు 11న ఎలా పోస్టు పెట్టగలనని ప్రశ్నించారు. ఇంతలో ఆయన కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో పోలీసులు వెంటనే అతన్ని విశాఖపట్నం తరలించారు. అక్కడ నుంచి అనకాపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.చివరికి ఏదో పాత అంశాన్ని సాకుగా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించారు. కాగా, టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసిన రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారులు సూత్రధారులుగా.. రాష్ట్రంలోని పోలీసు అధికారులు పాత్రధారులుగా ఈ అక్రమ కేసుల కుతంత్రాన్ని పక్కాగా అమలు చేస్తున్నారన్నది స్పష్టమైంది. పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తెల్ల కాగితాలపై సంతకాలతో కుట్రరెడ్బుక్ రాజకీయ కుట్రలను అమలు చేయడంలో తాము నాలుగాకులు ఎక్కువే చదివామంటున్నారు తిరుపతి జిల్లా పోలీసులు. అందుకోసమే గతంలో చంద్రబాబు వద్ద భద్రతా అధికారిగా పని చేసిన పోలీసు అధికారిని ప్రత్యేకంగా తెలంగాణ నుంచి డెప్యుటేషన్‌పై తెప్పించుకుని తిరుపతిలో కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఆయన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేసేందుకు పోలీసు వ్యవస్థ ప్రతిష్టనే పణంగా పెట్టేశారు. ఇటీవల తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓ బాలికను కొందరు దుండగులు అపహరించుకుపోయి వేధించారు. దాంతో ఆ బాలిక తండ్రి ఆవేదనతో తమకు న్యాయం చేయాలని బోరుమన్నాడు. విషయాన్ని చెవిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబం వద్దకు వెళ్లి బాలిక తండ్రికి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాడతామన్నారు. ఉదాసీనతపై సర్వత్రా నిరసనటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. పోలీసు వ్యవస్థ చేతగానితనం, ప్రభుత్వ పెద్దల ఉదాసనీతపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుతోంది. ఈ నేపథ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో బాలికపై జరిగిన దాడిని వక్రీకరించి ఏకంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేసి వేధించాలని ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారు. దాన్ని అమలు చేసే బాధ్యతను తిరుపతి జిల్లా పోలీసులు భుజానికెత్తుకున్నారు. బాధిత బాలికకు న్యాయం చేస్తామని మాయ మాటలు చెప్పి, ఆమె తండ్రితో తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత తమ కుట్రను అమలు చేశారు. బాధిత బాలిక తండ్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు ఆ తెల్లకాగితాలపై పోలీసులు రాసేశారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇతరులపై అక్రమ కేసు పెట్టి ఏకంగా పోక్సో చట్టంతోపాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, కేంద్ర ఐటీ చట్టంలతోపాటు ఏకంగా 11 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాస్త ఆలస్యంగా వాస్తవాన్ని గుర్తించిన బాధిత బాలిక తండ్రి పోలీసుల కుట్రను ఆదివారం బట్టబయలు చేశారు. తాను చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపైగానీ, ఇతరులపైనా గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పోలీసులే ఇదంతా చేశారని కుండబద్దలు కొట్టారు. దాంతో తిరుపతి జిల్లా పోలీసుల కుట్ర బట్టబయలైంది. -
‘సాక్షి’పై కక్ష.. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: సాక్షి పత్రికపై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. వరదల్లో అవినీతి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పేదలకు, నష్టపోయిన వారికోసం వచ్చిన విరాళాల్లోనూ అవినీతి చేశారని.. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ, ప్రజాసంఘాలపై ఎదురుదాడి చేశారంటూ దుయ్యబట్టారు.‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను నొక్కేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిరంతరం మేం ప్రజల పక్షాన పోరాడతాం. మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి’’ అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.సాక్షిని టార్గెట్ చేయడం సరికాదు: మేయర్ రాయన భాగ్యలక్ష్మివరదల్లో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఎంతో కొంత అవినీతి జరగకుండా ఎలా సాధ్యమని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. వరదల్లో ఎంత ఖర్చుపెట్టారా లెక్కలిచ్చింది కూడా వాళ్లే. ఎన్యుమరేషన్ జరగలేదని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కలెక్టరేట్ వద్ద నిత్యం వందల్లో బాధితులు ధర్నాలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రజలకు నిజం తెలియజేసే ఏకైక మీడియా సాక్షి మాత్రమే. సాక్షి మీడియాను టార్గెట్ చేయడం సరికాదు.చంద్రబాబు నియంతృత్వానికి ఇది నిదర్శనం: మల్లాది విష్ణు రాష్ట్రంలో ప్రజలపక్షం , ప్రతిపక్షం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి పత్రికపై ప్రైవేట్ వ్యక్తులతో కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. ప్రభుత్వ రాక్షసత్వానికి..నియంతృత్వానికి ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో ఎన్నో అసత్య కథనాలు ప్రచురించారు. గతంలో ఏనాడైనా ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డామా?. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించామా?. తప్పుడు ఆరోపణలపై సాక్షి పత్రిక ద్వారా వాస్తవాలను తెలియజేశాం. సాక్షి లేకపోతే ఏపీలో ప్రజలకు నిజాలు.. వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉండదుప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం అమానుషం. మీ తప్పులను ఎత్తిచూపిస్తున్నందుకు ప్రైవేట్ కేసులు వేయడం సరికాదు. కేబుల్ టీవీలో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. వరదల్లో అనేక మంది నష్టపోయారు. వరద బాధితులకు అండగా నిలిచిన సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే సాక్షిపై పెట్టిన కేసులు ఎత్తేయాలి. -
మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘బీజేపీలో చేరాల్సిందిగా నలుగురు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. లేదంటే మనీశ్ సిసోడియా మాదిరిగా తప్పుడు కేసులు, సీబీఐ, ఈడీ దాడులు తప్పవంటూ బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఆఫర్ చేశారు. తమతో పాటు మరో ఎమ్మెల్యేను కూడా తీసుకొచ్చిన వారికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు’’ అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నయానో భయానో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన వ్యూహాన్నే తమ పార్టీపైనా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ల ప్రలోభాలకు సిసోడియా లొంగకపోవడంతో ఇతర ఎమ్మెల్యేలపై పడ్డారు. కానీ వాళ్లంతా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. బెదిరింపులకు లొంగే, అమ్ముడుపోయే రకం కాదు’’ అన్నారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ పార్టీకి ద్రోహం చేయబోమని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘మేమంతా కేజ్రీవాల్ సైనికులం. భగత్‌సింగ్ అనుయాయులం. మీ సీబీఐ, ఈడీ మమ్మల్నేమీ చేయలేవు’’ అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ముగిసేదాకా తమపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విపక్షాలను లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ ప్రశ్నలకు బదులివ్వండి: బీజేపీ ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మద్యం పాలసీలో అవినీతి బట్టబయలు కావడంతో శిక్ష తప్పదనే అసహనంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా విమర్శించారు. వాళ్లకు దమ్ముంటే డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు. ‘‘ఆప్‌కు భారీ కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకే కేజ్రీవాల్ సర్కారు మద్యం లైసెన్సులు కట్టబెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. విచారణను తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒక్క ఫైలుపై తన సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై తమ ప్రశ్నలకు బదులివ్వలేక ఆప్ ఇలా తప్పుడు ఆరోపణలకు దిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు. ‘నిపుణుల కమిటీ వద్దన్నా వినకుండా హోల్‌సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులపరం చేశారు. భారీగా లంచాలు తీసుకుని బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకూ లైసెన్సులిచ్చారు’ అని అన్నారు. కేజ్రీవాల్ అండ్ కో నిజాయతీ, పారదర్శకతలకు పాతరేసి చూస్తుండగానే అవినీతిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది. -
‘ఆప్‌ని వదిలేసి బీజేపీలో చేరమని మెసేజ్ పంపారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఈ తరుణంలో మనీష్ సిసోడియాకు బీజేపీ నుంచి ఒక మెసేజ్ రావడం విశేషం. ఈ మేరకు మనీష్ సిసోడియా తనకు బిజేపీ ఒక మంచి ఆఫర్ ఇస్తూ ఒక సందేశాన్ని పంపిందని తెలిపారు. "మీరు ఆప్‌ని వదిలేసి బీజేపీలోకి చేరండి సీబీఐ కేసులన్ని మూసేస్తాం" అని ఒక ట్వీట్ వచ్చిందని చెప్పారు. అంతేకాదు తనపై పెట్టిన కేసులన్ని తప్పడు కేసులుని గట్టిగా నొక్కి చెప్పడమే కాకుండా మీరేం చేయాలకుంటే అది చేసుకోండి అని సిసోడియా బీజేపీకి సవాలు విసిరారు. తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్ వంశస్థుడునని అన్నారు. తన తల నరుక్కుంటానేమో కానీ అవినీతి కుట్రదారుల ముందు తలవంచనని తెగేసి చెప్పారు. ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు. (చదవండి: Delhi Excise Policy Scam: కేజ్రీవాల్‌కు సంకెళ్లే) -
ఢిల్లీలో 26నాటి ఘటనపై న్యాయ విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. అప్పటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వం రైతులపై తప్పుడు ఆరోపణలతో కేసులు బనాయించిందని ఆరోపించాయి. సింఘు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు శనివారం మీడియాతో మాట్లాడారు. పోలీసు నోటీసులు అందుకున్న రైతులు నేరుగా వారి వద్దకు వెళ్లకుండా, అవసరమైన సాయమేదైనా రైతు సంఘాల న్యాయ విభాగాల నుంచి పొందాలని సూచించారు. జనవరి 26వ తేదీ నాటి హింసాత్మక ఘటనలకు, రైతులపై తప్పుడు కేసులు నమోదు చేయడం వెనుక కుట్ర దాగుందని ఎస్కేఎం న్యాయ విభాగం సభ్యుడు కుల్దీప్ సింగ్ ఆరోపించారు. ఈ ఘటనలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న 16 మంది రైతుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఆ ఘటనలపై నమోదైన మొత్తం 44 ఎఫ్ఐఆర్లలో 14 ఎఫ్ఐఆర్లకు సంబంధించి 122 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారని, వారందరికీ న్యాయ, ఆర్థిక సాయం అందజేస్తామని మరో నేత రవీందర్ సింగ్ తెలిపారు. కొందరు రైతులపై దోపిడీ, హత్యాయత్నం వంటి కేసులు కూడా పెట్టారన్నారు. భోజనం ఖర్చుల కోసం జైలులో ఉన్న రైతులకు రూ.2 వేల చొప్పున ఎస్కేఎం అందజేస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు జైలులో ఉన్న 10 మంది రైతులకు బెయిల్ మంజూరు కాగా, మరో ఐదుగురి బెయిల్‌కు దరఖాస్తు చేశామన్నారు. తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు కాని వారిపై మొదట దృష్టి పెట్టినట్లు చెప్పారు. తీహార్ జైలులో ఉన్న 112 మంది రైతులను తమ న్యాయ విభాగం కలిసిందని వెల్లడించారు. ఇలా ఉండగా, ట్రాక్టర్ పరేడ్ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలకు కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న నటుడు దీప్ సిద్దు, ఇక్బాల్ సింగ్ అనే మరో వ్యక్తిని దర్యాప్తులో భాగంగా ఢిల్లీ నేర విభాగం పోలీసులు శనివారం ఘటనాస్థలికి తీసుకువచ్చి, సీన్ రిక్రియేట్ చేయించారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగిన ఘర్షణల్లో 500 మంది పోలీసులు గాయపడగా, ఒక ఆందోళనకారుడు చనిపోయిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు గాంధీజీ మనవరాలు మద్దతు ఘజియాబాద్: మహాత్మాగాంధీ మనవరాలు తారా గాంధీ భట్టాచార్జీ(84) రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపారు. గాంధీ నేషనల్ మ్యూజియం చైర్ పర్సన్ కూడా అయిన భట్టాచార్జీ శనివారం ఘాజీపూర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులతో మాట్లాడారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగించాలని వారిని కోరిన ఆమె.. రైతులపట్ల శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ కార్యక్రమంలో భాగంగా మేం ఇక్కడికి రాలేదు. మనల్ని పోషిస్తున్న రైతుల కోసం మాత్రమే వచ్చాం. అన్నదాతల కష్టాన్ని విస్మరించరాదు. రైతులకు లబ్ధి దేశానికే లబ్ధి’అని ఆమె అన్నారని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) తెలిపింది. ఆమె వెంట మహాత్మా స్మారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ మేనేజింగ్ ట్రస్టీ అశోక్ సరన్, గాంధీ స్మారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా, నేషనల్ గాంధీ మ్యూజియం డైరెక్టర్ అన్నామలై ఉన్నారు. -
పరీక్షలకే పరీక్ష!
ముంబై/వాషింగ్టన్: ఆమె పేరు వందన షా. ముంబైలో ప్రముఖ న్యాయవాది. సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండడంతో ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెని క్వారంటైన్ చేశారు. మూడు రోజుల తర్వాత ప్రభుత్వం పరీక్షలు చేస్తే ఆమెకి నెగిటివ్ అని తేలింది. ఈ మధ్యలో ఆమె అనుభవించిన వేదన వర్ణనాతీతం. ముంబ్రాలో నివసించే సమీర్ ఖాన్ అనే వ్యక్తి వేరే అనారోగ్యంతో ఆస్పత్రికి వెళితే ఎందుకైనా మంచిదని కరోనా పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. అదే రోజు థానె మునిసిపల్ కార్పొరేషన్ పరీక్షలో (టీఎంసీ) నెగిటివ్ వచ్చింది. ఈ సమస్య కేవలం వీరిద్దరిదే కాదు. ఎన్నో రాష్ట్రాల్లో ప్రైవేటు ల్యాబ్స్‌లో ఇదే పరిస్థితి. నోయిడాలో ప్రైవేటు ల్యాబొరేటరీల్లో కూడా ఇలా ఫాల్స్ పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మూడు రోజుల క్రితం ఇలా 19 మంది కోవిడ్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. అక్కడ పరీక్షలు చేస్తే వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారినందరినీ శనివారమే ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. అమెరికాలో ఫాల్స్ నెగిటివ్ సమస్య దక్షిణకొరియా, రష్యా వంటి దేశాల్లో ఫాల్స్ పాజిటివ్ ఫలితాలు వస్తే, అగ్రరాజ్యం అమెరికాలో దానికి విరుద్ధంగా ఫాల్స్ నెగిటివ్ వస్తున్నాయి. వాస్తవానికి ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకి ఉంటుంది కానీ, పరీక్షల్లో బయటపడదు. నెగిటివ్ వచ్చింది కదాని హాయిగా తిరిగేయడం వల్ల ఆ వ్యక్తి నుంచి మరికొందరికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అమెరికాలో ఇలా 15% మందికి ఫాల్స్ నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. సమస్యలివీ.. ► కోవిడ్–19 ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోంది. వారిని క్వారంటైన్ చేయడం, వారు ఎవరెవరినీ కలిశారో వెతికి పట్టుకోవడం, మళ్లీ వారికి పరీక్షలు ఇదంతా ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపుతోంది. ► మహారాష్ట్ర ప్రైవేటు ల్యాబ్స్‌లో ఫాల్స్ పాజిటివ్ వస్తూ ఉండడంతో రోగుల సంఖ్య ఎక్కువై పో యి ఆస్పత్రులు నిండిపోతున్నాయి. నిజమైన రోగులకు చికిత్స ఆలస్యం కూడా అవుతోంది. ► కరోనాపై చాలా భయాందోళనలు నెలకొన్నా యి. ఫాల్స్ పాజిటివ్ రావడం వల్ల సున్నిత మనస్కులు మానసికంగా కుంగిపోతున్నారు. కొందరైతే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ► ఫాల్స్ నెగిటివ్ సమాజానికి అత్యంత ప్రమాదకరం. ప్రపంచదేశాల్లో సగటున 29% వరకు ఇలాంటి కేసులు నమోదవుతున్నాయి. వారిలో వైరస్ ఉంటుంది కానీ లేదని నిర్ధారణ కావడంతో క్వారంటైన్ చేయరు. దీంతో వాళ్ల ద్వారా చాలా మందికి సంక్రమిస్తోంది. అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడానికి ఫాల్స్ నెగిటివ్ కూడా కారణమే. ► ఏ లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. తప్పుడు ఫలితం ఏదైనా ప్రభుత్వంపైనా, ప్రజలపైనా భారాన్ని మోపుతోంది. అందుకే అవసరమైతేనే పరీక్షలు చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కారణాలివీ.. ► కరోనా అనుమానితుడి నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు అత్యంత జాగ్రత్తగా పంపించాలి. అలా పంపే క్రమంలో ఆ బాటిల్ విరిగినా, ఇతర శాంపిల్స్‌తో కలిసిపోయినా, కలుషితమైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ► కరోనా కిట్స్‌లో లోపాలు కూడా తప్పుడు ఫలితాలకు కారణమవుతున్నాయి. రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్స్ ఫలితాల్లో తేడా 15–20% ఉంటోంది. ఇది చాలా ఎక్కువని వైద్య నిపుణుల భావన. ► మానవ తప్పిదం కూడా మరో కారణమే. పరీక్షలు చేసినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్లు అప్రమత్తంగా లేకపోయినా, వారిలో నైపుణ్యం కొరవడినా ఫలితాలు తప్పుగా వెలువడే అవకాశాలున్నాయి. ► శాంపిల్స్ తీసుకునే సమయం కూడా ఒక్కోసారి ఫలితాల్ని గందరగోళంలో పడేస్తుంది. వైరస్ మన శరీరంలో ప్రవేశించిన వెంటనే పరీక్షలు చేస్తే 50శాతం మందికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి పరీక్ష చేస్తే పాజిటివ్ వస్తుంది. శస్త్రచికిత్స కోసమో, మరేదైనా బాధతోనో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేవారికి విధిగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. వారికి పాజిటివ్ వస్తూ ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు పంపేస్తున్నారు. ఇక్కడ పరీక్షలు చేస్తే నెగిటివ్ వస్తోంది. దీంతో అసలైన రోగులకు చికిత్స ఆలస్యమవుతోంది. వ్యాధిలేని వారు కూడా ఆస్పత్రిలో చేరడం వారికి కూడా ప్రమాదమే –విజయ్ సింఘాల్, థానే మున్సిపల్ కమిషనర్ -
ఓడినా నైతిక విజయం నాదే: కొండా
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల నుంచి ఎంపీగా ఓడినా నైతిక విజయం తనదేనని కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలో చివరి వరకు గెలుపు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపినప్పటికీ, పట్టణ ఓటర్లను ప్రత్యర్థులు కొనుగోలు చేయడంతో తాను ఓడిపోయానని వివరించారు. శక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎమ్మెల్యే పైల ట్ రోహిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ పోలీసులు, అధికారులను తన స్వలాభం కోసం వాడుకుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి నానా ఇబ్బందుల కు గురిచేసిందని ఆరోపించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ నేతలని లక్ష్యంగా చేసుకున్నారని, సమావేశాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నారన్నారు. రాజకీయంగా తనను పూర్తిగా అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకుందని, నేతలు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని విశ్వేశ్వర్‌రెడ్డి సూచించారు. -
దేశంలో తప్పుడు కేసులు కోకొల్లలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో గూఢ చర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై మాజీ ఇస్త్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై కొనసాగిన తప్పుడు కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు ఇవ్వడం తెల్సిందే. ఇంతకాలం ఆయనకు మనో వేదనను కలిగించినందుకుగాను నష్ట పరిహారంగా ఆయనకు 50 లక్షల రూపాయలను చెల్లించాల్సిందిగా ఆ తీర్పులో సుప్రీం కోర్టు ఆదేశించింది. క్రయోజనిక్ రాకెట్ల తయారీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్‌కు అమ్మారన్న అభియోగంపై నంబి నారాయణన్‌పై కేరళ పోలీసులు 1994లో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత ఇది తప్పుడు కేసుంటూ దిగువ కోర్టే కొట్టివేసింది. అయితే తగిన నష్టపరిహారం కోసం నంబి నారాయణన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. ఇదే కేసులో అరెస్టై 1998లో కేసు నుంచి విముక్తి పొందిన మిగతా ఆరుగురిలో ఒకరు మాజీ ఇస్రో శాస్త్రవేత్త కే. చంద్రశేఖర్. సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన శుక్రవారం నాడు చంద్రశేఖర్ తీర్పు ఎలా వస్తుందో చూడాలని తీవ్ర ఉద్వేగానికి గురై కోమాలోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన భార్య కేజే విజయమ్మ స్వయంగా మీడియాకు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సుప్రీం కోర్టు తీర్పు ప్రారంభం కాగా, ఆ రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ కోమాలోకి వెళ్లారు. ఆయన ఆదివారం ఉదయం 8.40 గంటల ప్రాంతంలో కొలంబియా ఆస్పత్రిలో మరణించారు. ఈ నకిలీ కేసులో సుప్రీం కోర్టు భారీ నష్ట పరిహారాన్ని ఇప్పిస్తుందని ఆశించిన చంద్రశేఖర్, తీర్పు వినేవరకు ఆగి ఉంటే తృప్తిగా వెళ్లేవారని ఆయన భార్య విజయమ్మ వ్యాఖ్యానించారు. దేశంలో నకిలీ కేసులు ఇదొక్కటే కాదు. ఎన్నో ఉన్నాయి. వాటిలో చిక్కుకుని ఎంతో మంది ఎన్నో బాధలు అనుభవించారు. వాటిలో ఎక్కువ ముస్లింలపై దాఖలైన టెర్రరిస్టు కేసులే. నంబి నారాయణన్ కేసులో కూడా ఎవరో ఒక ముస్లిం పేరును వెల్లడించాల్సిందిగా ఐబీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారట. అప్పటికే ఇస్రోలో పనిచేస్తున్న అబ్దుల్ కలాం లేదా తన చిన్ననాటి మిత్రుడు అబూబేకర్ పేర్లను వెల్లడించినా ఫర్వాలేదని సూచించారట. ఈ విషయాన్ని ‘రెడీ టూ ఫైర్: హౌ ఇండియా అండ్ ఐ సర్వైవ్డ్, ది ఇస్రో స్పై కేసు’ పుస్తకంలో నారాయణన్ వెల్లడించారు. ఈ పుస్తకం గత ఏప్రిల్ పదవ తేదీన మార్కెట్లోకి వచ్చింది. గుజరాత్ అక్షరధామ్ కేసు కూడా నకిలీదే! 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్ ఆలయంపై దాడి చేశారన్న కేసును 2014లో సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో అరెస్టైన మొత్తం ఆరుగురు ముస్లింలు అమాయకులని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో బుద్ధి వక్రీకరించిందంటూ పోలీసులకు కోర్టు మొట్టికాయలు వేసింది. 2008లో ఇద్దరు ఢిల్లీ ముస్లిం యువకులపై పోలీసులు టెర్రరిస్టులని ముద్రవేయడమే కాకుండా తప్పుడు సాక్ష్యాలను సృష్టించినందుకు ఢిల్లీ పోలీసులను సీబీఐ తీవ్రంగా మందలించింది. ఈ కేసును ఢిల్లీ సెషన్స్ కోర్టు 2011లో కొట్టివేసింది. నలుగురు పోలీసు అధికారులు తమ వ్యక్తగత ప్రయోజనాల కోసం తప్పుడు కేసు బనాయించారని కోర్టు తీర్పు చెప్పింది. దేశంలో పలు సందర్భాల్లో మావోయిస్టులపై కూడా పోలీసులు తప్పుడు కేసులు బనాయించారు. వ్యక్తిగత కక్షల కోసం పోలీసులు నకిలీ కేసులు బనాయించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. 2010లో ఢిల్లీ పోలీసులు ఓ వ్యక్తిపై 18 తప్పుడు కేసులు బనాయించారు. పర్యవసానంగా ఆ వ్యక్తి 16 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. 2014లో ఓ టాక్సీ డ్రైవర్‌పై పోలీసులు దాఖలు చేసిన తప్పుడు రేప్ కేసును ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. అదే ఏడాది ఓ వ్యక్తిని హత్యకేసులో ఇరికించేందుకు ఓ పోలీసు అధికారి అఫీషియల్ డెయిరీని మార్చి వేశారు. ఈ కేసును కూడా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా పోలీసులు దాఖలు చేసిన తప్పుడు కేసులు కోకొల్లలుగా తేలుతాయి. బ్రిటీష్ కాలం నుంచి వచ్చిన పోలీసు చట్టాలను మార్చక పోవడం వల్లనే పోలీసులు తప్పుడు కేసులకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులను బనాయించిన పోలీసులకు కఠిన శిక్షలు విధించేలా చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నంబి నారాయణన్‌పై తప్పుడు కేసును బనాయించినందుకు 50 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పించిన సుప్రీం కోర్టు, తప్పుడు కేసుకు బాధ్యులైన పోలీసులకు శిక్షను ప్రకటించి కొత్త చట్టాలకు స్ఫూర్తినిచ్చి ఉండాల్సింది. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా కేసులు
అమరావతి: నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. ప్రతిపక్షం వైసీపీని బలహీన పరిచేందుకు అక్రమాలకు తెరతీస్తోంది. ఇందులో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని కేసులు బనాయిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీ ఎంఎల్ఏల విషయంలో వ్యూహాత్మకంగానే అడుగులేస్తున్నట్లు కనబడుతోంది. నంద్యాల ఉపఎన్నిలో గెలవడానికి వ్యూహాలు పన్నుతున్నట్లు అనుమానం ప్రజల్లో వస్తోంది. వైఎస్సార్సీపీ ఎంఎల్ఏల్లో వీలైనంతమందిని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచే ప్రయత్నాలను చేస్తోంది. తాజా పరిస్థితులను గమనిస్తే ఎవరికైనా అలాంటి అనుమానం రాకుండా మానదు. మొన్ననే చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా మంగళవారం మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే తిరుపతి సమీపంలోని సి రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇందుకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గ్రామస్తులతో పాటు ఆందోళన చేశారు. అదే అదునుగా భావించిన ప్రభుత్వం చెవిరెడ్డిపై కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించారు. తాజాగా సీఆర్డీఏ అధికారులు మంగళవారం రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో గ్రామసభ నిర్వహించారు. వాస్తవంగా అక్కడ జరిగే విషయాలను మినిట్స్ బుక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు అలా చేయలేదు. దీంతో రైతులు, స్థానికులు తమ అభిప్రాయాలను మినిట్స్ బుక్ లో రికార్డు చేయాలంటూ పట్టుపట్టారు. కానీ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. దాంతో రైతులు, స్ధానికులు టెంట్లను పీకేసి, కుర్చీలను విసిరేసారు. అక్కడి నుండి వెళ్ళిపోయిన అధికారులు రాత్రి రైతులు, మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై కేసు పెట్టారు. ఇక్కడే ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. సి రామాపురం గ్రామంలో చెవిరెడ్డిపైనా, పెనుమాక సీఆర్డీఏ సమావేశ విషయంలో ఆళ్లరామకృష్ణపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల వాదన. అయినా పోలీసులు ఎంఎల్ఏలపైన కూడా కేసులు పెట్టారంటేనే సర్వత్రా అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికలు మొదలయ్యే నాటికి వీలైనంతమంది ప్రతిపక్ష ఎంఎల్ఏలపై కేసులు నమోదు చేస్తే అవసరం వచ్చినపుడు అరెస్టులు చేసి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. దాంతో ఉపఎన్నికల్లో ఎల్ఏలు ప్రచారం చేసే అవకాశం లేకుండా చేసివైఎస్సార్సీపీని బలహీన పరచవచ్చు అనే ఆలోచనలో తెలుగుదేశం ఉన్నట్లు సమాచారం. -
'ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమ కేసులు'
► మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే మాచర్ల : రాష్ట్రంలో ప్రజల అభిమానంతో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ ప్రభుత్వం నిత్యం ఆయనపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తోందని మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) విమర్శించారు. మాచర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 11 మంది మృతి చెందితే వెంటనే స్పందించి జగన్ అక్కడకు చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు. దీన్ని సహించలేక జగన్‌పై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. మీడియాకు సంబంధించి ఏ వార్త వచ్చినా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులే రాజీ పడటం దారుణమన్నారు. శనివారం అనంతపురంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించే వరకూ కూడా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పలు విమర్శలు రావడంతో అరెస్టు చేసినట్లు ప్రకటించారని తెలిపారు. అక్రమ కేసుల నమోదులో ముందంజ పోలీసులు సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పక్షం చెప్పిందే వేదంగా భావిస్తూ అక్రమ కేసులు నమోదు చేయడంలో ముందంజలో ఉండడం బాధాకరమన్నారు. అధికారమనేది శాశ్వతం కాదనే విషయాన్ని ఆయా శాఖల అధికారులు మర్చిపోయి ఏకపక్షంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి చిట్టా సేకరిస్తున్నామని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పీఆర్కే తెలిపారు. -
టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం : బీజేపీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి మెదక్ : రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండంలోని రాయవరం, తిమ్మాపూర్ గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.దిది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. నిరుద్యోగ సమస్యలపై జేఏసీ పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య, రాంరెడ్డి, మండలాధ్యక్షులు సత్యం, రాములు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
'అమాయకులపై అక్రమ కేసులు'
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులతో పాటు అమాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు సోమవారం డీజీపీ అనురాగ్‌శర్మను కలిశారు. అనంతరం శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక వైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రకటనలు చేస్తూనే పోలీసులు కేసులు బనాయించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి కుమారునిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ జరిపి, కేసును ఎత్తివేయాలని డీజీపీకి వినతి పత్రం సమర్పించారు. డీజీపీని కలిసిన వారిలో నిరంజన్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
'రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది'
కాకినాడ : రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులపై ప్రభుత్వం వెంటాడి మరీ కేసులు పెడుతోందన్నారు. పోలీసు వ్యవస్థను టీడీపీ సర్కారు నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పచ్చచొక్కాలు వేసుకున్నవారిగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పెట్టే కేసులకు తాము భయపడమని, వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. -
అక్రమ కేసులకు చంద్రబాబుదే బాధ్యత
తణుకు అర్బన్ : ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెట్టడం, తుందుర్రు, పరిసర గ్రామాల ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడటం వంటి దురాగతాలకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ పేర్కొన్నారు. తణుకు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తుందుర్రు ఆక్వా పార్క్ బాధితురాలు ఆరేటి సత్యవతిని బృందాకరత్ గురువారం పరామర్శించారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడి అమాయకులపై హత్యానేరం కేసులు మోపి జైళ్లలో పెట్టడం దారుణమన్నారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా.. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్న తీరు బా«ధాకరమన్నారు. ఆక్వా పార్క్ నిర్మాణం వల్ల నీరు, గాలి కలుషితమవుతాయనే భయంతో ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వారి అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా తుందుర్రు పరిసర గ్రామాలను పోలీసు చట్రంలో నిర్బంధించి పరిశ్రమ నిర్మిస్తున్న తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోందన్నారు. తక్షణమే నిర్మాణాలను నిలుపుదల చేయాలని, లేకుంటే ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్తానని హెచ్చరించారు. ఆమె వెంట ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.స్వరూపారాణి, కార్యదర్శి రమాదేవి, తణుకు డివిజన్ సీపీఎం కార్యదర్శి పీవీ ప్రతాప్, ఆల్ ఇండియా లాయర్స్ యూని యన్ జిల్లా కమిటీ సభ్యుడు కామన మునిస్వామి, ఐద్వా తణుకు డివిజన్ కార్యదర్శి కె.నాగరత్నం, నాయకులు గార రంగారావు, బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్ల సురేష్, జేఎస్పీ నాయకుడు అనుకుల రమేష్, ఎల్ఐసీ ఏజెంట్ల యూనియన్ నాయకుడు పీఎల్ నరసింహరావు ఉన్నారు. -
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
-
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
పాణ్యం : కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసులు బనాయించి తమ వారిని తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. కొండజూటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న నానో కెమికల్ ప్యాక్టరీని అడ్డుకుంటున్న గ్రామస్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత మందిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే బాబు లక్ష్యం: మిథున్‌రెడ్డి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా కలకడ మండలంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్సీపీ పట్ల చంద్రబాబు సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రభుత్వం తీరుపై న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని మిథున్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
నన్ను ముట్టుకుంటే తడాఖా చూపిస్తా : జగ్గారెడ్డి
మెదక్: కేసీఆర్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలని చూస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ....తనను ముట్టుకుంటే తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. మరో నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నాడు ప్రారంభిస్తే...దాన్ని ముందుకు కొనసాగించలేని అసమర్థ పాలన సీఎం కేసీఆర్‌దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. త్వరలో కేసీఆర్‌ను ప్రజలే పాతరేస్తారని చెప్పారు. -
'ఖాకీ చొక్కా బదులు పచ్చ చొక్కా వేసుకోమనండి'
► అక్రమ కేసులు పెడితే సహించేది లేదు ► ఎస్ఐపై చర్యలు తీసుకోకుంటే పోరాటం ► సీఐ ఓబులేసుతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మైదుకూరు: ‘మీ ఎస్ఐకి ఖాకీ చొక్కా ఇష్టం లేకుంటే.. పచ్చ చొక్కా వేసుకోమనండీ.. అంతేకాని గ్రామాల్లో వర్గపోరు పెంచి.. అక్రమ కేసులు బనాయించి కక్షలు, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం తగదని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చాపాడు ఎస్ఐ శివశంకర్‌యాదవ్ వ్యవహరిస్తున్న తీరుపై సీఐతో ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చిన్నగురువళూరులో శనివారం పైపులైన్ విషయమై టీడీపీ వర్గీయులు వెంకటసుబ్బారెడ్డి, చంగా బ్రహ్మానందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల నడుమ స్వల్ప వాగ్వాదం ఏర్పడింది. సమస్యను స్థానికులే పరిష్కరించుకున్నారు. అయితే ఎస్ఐ శివశంకర్ టీడీపీకి చెందిన పి.వెంకటసుబ్బారెడ్డి(ఫైలట్) ఫిర్యాదు చేయకపోయినా అతని భార్య వెంకటసుబ్బమ్మ చేత ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీకి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని ఆశ్రయిం చారు. దీంతో ఆదివారం ఉదయం ఎమ్మెల్యే బాధితుల తరపున చాపాడు పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఎస్ఐ లేకపోవడంతో రూరల్ సీఐ ఓబులేసుతో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో చిన్న గొడవలు జరిగినా వైఎస్సార్సీపీ వర్గీయులనే టార్గెట్ చేసుకుంటూ నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారన్నారు. ఎస్ఐ ఇక్కడికి వచ్చినప్పటికీ నుంచి గ్రామాల్లో గొడవలు సృష్టించి టీడీపీ వర్గీయులకు సపోర్టు చేస్తూ వైఎస్సార్సీపీ వర్గీయులకు జైళ్లకు పంపిస్తున్నాడన్నారు. సుధాకర్‌యాదవ్ బదులు మీ ఎస్ఐనే తనతో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయమనండీ.. అంతేకాని అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదన్నారు. ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే బాధితులు, ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ప్రత్యక్ష పోరాటాలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. విచారిస్తానని, ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఓబులేసు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ రామచంద్రయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డిలు ఉన్నారు. మమ్మల్ని పోలీస్టేషన్‌కు రమ్మన్నారు గ్రామంలో జరిగిన వివాదంలో తమ పాత్ర లేకపోయినా అక్రమంగా తమపై కేసులు నమోదయ్యాయని, స్టేషన్ రావాలని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యేని ఆశ్రయించామని చిన్నగురువళూరుకు చెందిన బొర్రా వీరారెడ్డి శంకర్‌రెడ్డి, గంగాధర్‌రెడ్డి, కొండారెడ్డి, ఓబుళరెడ్డిలు తెలిపారు. ఫైలట్ వెంకటసుబ్బారెడ్డి, చంగా బ్రహ్మనందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిల మధ్య పైపులైను విషయమై స్వల్ప గొడవ జరిగింది. దీంతో ఎల్లన్నగారి వెంకటసుబ్బారెడ్డి సర్ధి చెప్పాడు. ఎవరూ దాడి చేయలేదు.. ఫైలట్ వెంకసుబ్బారెడ్డి ఇల్లు ఉన్న వీధికి నీటి పైపులైను ఉందని, కాని అక్రమంగా ఫైలట్ పైపులైను వేసుకోగా వద్దని ప్రశ్నించినందుకు తమపై గొడవకు దిగాడని చంగా బ్రహ్మనందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డిలు తెలిపారు. అనవసరంగా కేసులు పెట్టారని చెప్పారు. ‘పోలీసులే కక్షలు పెంచుతున్నారు’ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే గ్రామాల్లో కక్షలు, ఫ్యాక్షన్లను సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి అన్నారు. చిన్నగురువళూరులో శనివారం జరిగిన చిన్న గొడవపై ఎస్ఐ శివశంకర్‌యాదవ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంతో ఆదివారం ఎమ్మెల్యే పోలీసుస్టేషన్‌కు వచ్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనాది నుంచి చిన్నగురువళూరు ప్రజలంతా వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారని, ఇలాంటి గ్రామంలో జరిగిన చిన్న ఘటనను ఆసరాగా తీసుకుని ఎస్ఐ శివశంకర్‌యాదవ్ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ గ్రామంలో మొదటి నుంచి అన్ని రకాలైన ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని, ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి టీడీపీలో చేరాలని బెదించాడన్నారు. బాధితుల కోసం పోలీసుస్టేషన్‌కు రాగా ఎస్ఐ లేరన్నారు. ఎస్ఐపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే డీ ఐజీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈయనతో పాటు ఎంపీపీ రామచంద్రయ్య, జెడ్పీటీసీ సభ్యుడు బాలనరసింహారెడ్డి, ఉప మండలాధ్యక్షులు సానా నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. -
బాబూ.. ధైర్యముంటే ప్రభుత్వాన్ని రద్దుచెయ్
ఎమ్మెల్యేలను కొనటం కాదు... ప్రజల్లోకి వెళ్లి ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లోనే ఉన్నారు.. తగినంతమంది రాగానే మీడియాకు చెబుతాం.. ఆ తర్వాత గంటలోనే ప్రభుత్వం కూలుతుంది.. టీడీపీ పాలనపై గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయండంటూ మంత్రులను పురమాయించే బదులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సవాలు విసిరారు. ‘చంద్రబాబు మంత్రివర్గ సమావేశాలు పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు కొనడం లేదు...కొని నా దగ్గరకు ఇంకా ఎందుకు తీసుకు రావడం లేదు... తెలంగాణలో కేటీఆర్‌ను, హరీశ్‌రావును చూసి బుద్ధి తెచ్చుకోండి అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. అంతెందుకు ప్రభుత్వాన్ని రద్దు చేయండి, ప్రజల్లోకి పోదాం. నేను చాలెంజ్ చేస్తున్నా...నువ్వు గెలిచే సమస్యే లేదు, నువ్వు గెలుస్తావో... మేం గెలుస్తామో... ప్రజలే తీర్పు ఇస్తారు’ అని జగన్ అన్నారు. తుని సంఘటనలు, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై బుధవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రాలను సమర్పించిన అనంతరం జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించినపుడు ఆయన పై విధంగా స్పందించారు. ‘చంద్రబాబును గట్టిగా అడగండమ్మా...టీడీపీలో నుంచి వైసీపీలోకి ఎంత మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారో...’ అని జగన్ అన్నారు. ఇంతకీ ఎవరెవరు వస్తున్నారని మళ్లీ అడిగినపుడు ‘ నేను మాటలు చెప్పడం ఎందుకు మీరే చూస్తారు కదా...’ అన్నారు. వల్లభనేని వంశీ మీ పార్టీలో చేరుతున్నారంటున్నారు? నిజమేనా అని ప్రశ్నించినపుడు అవన్నీ ఇపుడు చెప్పడం సరికాదు అని జగన్ వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబుకు ఓ చెడ్డ అలవాటుంది. ఆయనకు మీడియాలో కొద్దో గొప్పో మద్దతు ఉంది. ఆ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయించడం ఆయనకు బాగా అలవాటైన పనే...వైసీపీ నుంచి అంత మంది, ఇంత మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని ఆ మీడియాలో రాస్తారు. టీవీల్లో చూపిస్తారు. అలా వాళ్లు రాయడం మా ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశాలు పెట్టి చంద్రబాబును ఎడాపెడా తిట్టడం చేస్తూ ఉంటారు’ అని జగన్ అన్నారు. ఇంకా అనేక అంశాలపై ఆయన మాటల్లోనే... మునిగే పడవలో బుద్ధి ఉన్న వారెవరైనా ఎక్కుతారా? ‘‘అసలు అది మునిగే పడవ. అందులో ఎవరైనా ఎక్కుతారా? ప్రజల్లోకి వెళ్లి విచారిస్తే చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారనేది స్పష్టం అవుతుంది. ఎన్నికల వేళ ఏం చెప్పావు, ఇపుడేం చేస్తున్నావు అని ప్రజలు కోపంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుద్ధి ఉన్నవాడెవ్వడూ చంద్రబాబు పార్టీలోకి పోడు. ఆ విషయం తెలిసినా చంద్రబాబు మాత్రం ప్రచారం ఆపడు. మా ఎమ్మెల్యేలు విలేకరుల సమావేశాల్లో తిట్టే తిట్లను దులిపేసుకుంటాడు. నాలుగు రోజులు ఆగి ఐదో రోజు మళ్లీ అలాంటి రాతలే రాయిస్తూ ఉంటాడు. ప్రజలకు కూడా వాటిపై విసుగెత్తింది. చంద్రబాబు వద్ద నల్లధనం, అవినీతి సొమ్ము ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. కానీ దేవుడున్నాడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు మొట్టికాయలు వేస్తారు. స్పీకర్ మీద అవిశ్వాసం కచ్చితంగా పెడతాం ఏపీ శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం కచ్చితంగా పెడతాం. ఆ విషయానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేంత బలం మా వద్ద లేదని, మా బలం 67 మందేనని అందరికీ తెలుసు. మాతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నా... ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన 21 మంది ఉన్నారని నేను ఎప్పుడూ చెప్పలేదు. మాకు ఆ సంఖ్య రాగానే కచ్చితంగా మీడియాను పిలిచి చెబుతా. అలా చెప్పిన గంటకే ప్రభుత్వం పడిపోతుంది. పాలమూరు - రంగారెడ్డి పథకాన్ని ఆపండి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణం ఆపాలి. మేం గవర్నర్‌కు విన్నవించిన నాలుగు ప్రధానాంశాల్లో ఇదొకటి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లందని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లే రావు. ఇక ఆ తరువాత ఉన్న నాగార్జునసాగర్‌కు కూడా నీళ్లుండవనే విషయాన్ని గవర్నర్‌కు వివరించాం. ఈ రెండు ప్రాజెక్టుల కింది ఆయకట్టుదారులంతా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని ఆపాలని కోరాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు ఆపడానికి గట్టిగా కృషి చేయాల్సింది పోయి ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడ్డం లేదు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికి పోయిన చంద్రబాబు ఆ కేసుల నుంచి బయటపడటం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాలనే ఫణంగా పెట్టారు. గిరిజన సలహా మండలి నియమించాలి రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు ప్రకారం గిరిజన సలహా మండలిని నియమించి తీరాలి. అలాంటిది చంద్రబాబు దురుద్దేశంతోనే నియమించడం లేదని గవర్నర్ దృష్టికి తెచ్చాం. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని నియమిస్తే నాలుగింట మూడోవంతు మంది గిరిజన ఎమ్మెల్యేలను అందులో నియమించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 7 గిరిజన ఎమ్మెల్యే స్థానాల్లో ఆరుగురు వైఎస్సార్సీపీకి చెందిన వారే ఉన్నారు. నిబంధనల ప్రకారం గిరిజన సలహామండలిలో ఎక్కువ మంది వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలే ఉంటారు కనుక, చంద్రబాబు చేసే అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు వారు అడ్డు తగులుతారనే ఉద్దేశ్యంతో వేయడం లేదు. గవర్నర్‌కు ఈ విషయాన్ని తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరాం. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇతరులపై తప్పుడు కేసులు తుని ఘటనల్లో చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకుని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్న సంగతిని గవర్నర్‌కు వివరించాం. తన తప్పుల నుంచి కాపాడుకోవడానికి ఇతరులపై ఏరకంగా తప్పుడు కేసులు పెడుతున్నారో కూడా వివరించాం. జనవరి 31వ తేదీన తాను అక్కడ సభ నిర్వహిస్తామని ముద్రగడ పద్మనాభం మూడు నెలల కిందటే నోటీసు ఇచ్చారు. అందరూ ఇందులో పాల్గొనండి. సంఘీభావం ప్రకటించండి అని అన్ని రాజకీయ పార్టీకు ఆయన విజ్ఞప్తి చేశారు కూడా...టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను చంద్రబాబు రావొద్దని కట్టడి చేసినా కింది స్థాయి కార్యకర్తలు సమావేశానికి వెళ్లారన్న సంగతి వాస్తవం. తునిలో రైల్వే ట్రాక్ పక్కన సభ జరుపుకోవడానికి అనుమతిని ఇస్తున్న సంగతి చంద్రబాబుకు తెలుసు. ముద్రగడ పద్మనాభం ప్రారంభోపన్యాసం 15 నిమిషాల్లో పూర్తయింది. నాతో పాటు బస్‌రోకో చేస్తారా? అని ప్రజలనడిగితే వారంతా చేతులు పెకైత్తి చేస్తామన్నారు. రైల్ రోకో చేస్తారా? సంఘీభావం తెలుపుతారా అని అడి గినపుడు వారంతా మద్దతు పలికారు. జనంలో మనోభావాలు ఇంత తీవ్రంగా ఉన్నపుడు ‘ఛలో...పదండి’ అని ముద్రగడ రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. లక్షలాది మంది తరలివస్తారని తెలిసినా చంద్రబాబు తగినంతమంది పోలీసులను ఎందుకు పెట్టలేక పోయారు? జనం రైల్వే ట్రాక్ మీదకు వెళ్లకుండా బారికేడింగ్ ఎందుకు చేయలేక పోయారు. ట్రాక్ పక్కన సభకు అనుమతినిచ్చింది చంద్రబాబే అయినపుడు ఈ ఏర్పాట్లు ఎందుకు చేయలేదు. చంద్రబాబు ఊహించలేదా...ఆయనకు ఇంటెలిజెన్స్ లేదా... లక్షమంది ఒక్క చోట ఏకమై రైలు ఆపడానికి రైల్వే ట్రాక్ ఎక్కితే ‘మాస్ హిస్టీరియా క్రియేట్ కాదా... రైల్వే ట్రాక్ వైపు వెళ్లకుండా బారికేడ్లు కట్టి ఉండాలి. ప్రతి కీలకమైన ప్రదేశంలో పోలీసులను పెట్టి ఉండాలి. కానీ అవేమీ చేయకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వారిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. బురద జల్లారు. తప్పుడు కేసులు బనాయించారు. అసలు ఏం పాపం చేశారని వీళ్లందరి మీదా తప్పుడు కేసులు పెట్టారు అని ఆలోచిస్తే బాధనిపిస్తుంది. చంద్రబాబు హామీలను నెరవేర్చనందుకే ఆ సభ జరిగింది. ఇవన్నీ గవర్నర్‌కు వివరించాం. ఈ వ్యవహారంలో జైల్లో పెట్టాలంటే ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబునే జైల్లో పెట్టాలి. చంద్రబాబుపైనే కేసు పెట్టాలి. కానీ ఈరకంగా అందరి మీదా తప్పుడు కేసులు పెట్టడం న్యాయం కాదని గవర్నర్‌కు చెప్పాం. గవర్నర్ నోటితోనే అబద్ధాలు చెప్పిస్తున్నారు శాసనసభా సమావేశాల సందర్భంగా చేసే ప్రసంగంలో మీ చేతే అబద్ధాలు చెప్పిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలపై మీ నోటితోనే ప్రభుత్వం అబద్ధాలు చెప్పిస్తోంది. మేమిచ్చే వివరాలు, సమాచారం కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాం. చంద్రబాబు ఎన్నికల వేళ పూర్తిగా రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పారు. రూ. 87,612 కోట్ల రైతు రుణాలను, రూ.14 వేల కోట్ల డ్వాక్రా మహిళలను రుణాలను మాఫీ చేస్తానని అన్నారు. ఈ రెండూ కలిపితే రూ. 1,00,200 కోట్లు అవుతుంది. ఈ మొత్తంపై వడ్డీయే రూ 30,000 కోట్లు అవుతుంది. కానీ రెండు దఫాల్లో చంద్రబాబు ఇచ్చిన రూ. 7,300 కోట్లు వడ్డీలో నాలుగో వంతుకు కూడా సరిపోదు. కానీ ఆయన మాత్రం అన్నీ మాఫీ చేసేశానని చెబుతున్నారు. అదే విషయాన్ని గవర్నర్ నోటితో కూడా చెప్పిస్తున్నారు. రైతుల రుణాలు మాఫీ కాక వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఇంటికో ఉద్యోగం... లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికి చేసింది మాత్రం సున్నా. అందుకే తనకు అలాంటి అబద్ధాలు ఇవ్వవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిందిగా గవర్నర్‌ను కోరాం. కానీ అది రాజ్యాంగ పరంగా ఆనవాయితీ అని, రాష్ట్ర మంత్రివర్గంలో వారు ఆమోదించి ఇచ్చిన వివరాలే తాను చెబుతానని గవర్నర్ మాకు చెప్పినపుడు బాధ కలిగింది. ఈ అన్ని అంశాలపై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు అన్యాయాలపై ప్రతిపక్ష పార్టీగా ప్రతి వేదికపైనా ఫిర్యాదు చేస్తాం. అది మా ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తాం.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అవినీతి కోసమే తాత్కాలిక ప్రాజెక్టులు: నేషనల్ మీడియాతో జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి తారస్థాయికి చేరుకుందని, అవినీతి కోసమే అనేక తాత్కాలిక ప్రాజెక్టులు పుట్టుకొస్తున్నాయని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన కొన్ని జాతీయ చానళ్లతో మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి వ్యవహారాలపై నిప్పులు చెరిగారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి 15 శాతం ఎక్సెస్‌కు టెండర్లు ఇచ్చారు. ఇద్దరు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనేలా ముందస్తు నిబంధనలు రూపొందించారు. ఇది మొత్తం ఓ అవినీతి వ్యవహారం. ఏపీలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. పట్టిసీమనే తీసుకుంటే అది కూడా తాత్కాలిక ప్రాజెక్టే. పోలవరంపై ఖర్చు పెట్టాల్సిన మొత్తాన్ని పట్టిసీమ అనే తాత్కాలిక ప్రాజెక్టుకు ఖర్చుపెట్టారు. టెయిలర్‌మేడ్ నిబంధనలతో టెండర్లను 23 శాతం ఎక్సెస్‌కు ఇచ్చారు. ఇదేమీ కొత్త కాదు. బాబు ఏం చేసినా కమిషన్ల కోసమే చేస్తున్నారు. తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక నివాసాలు, తాత్కాలిక కార్యాలయాల గురించి రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈవెంట్స్ మేనేజ్మెంట్ కోసం చేసే ఖర్చుల సంగతీ తెలుసు. రాజధాని శంకుస్థాపన కోసం ఒక రోజు కార్యక్రమానికి రూ. 400 కోట్లు ఖర్చు చేశారు. గోదావరి పుష్కరాలకు రూ. 1,600 కోట్లు ఖర్చుచేశారు. నామినేషన్ పద్ధతిన పనులు కేటాయించేశారు. తాత్కాలికం.. సమయం లేదు అని చెప్పారు. అంతేకాదు సీఎస్ సంతకం లేకుండానే కేబినెట్‌కు ఇరిగేషన్ ఫైళ్లు పోతున్నాయి. నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గాలేరునగరి, హంద్రీనీవా పనుల అంచనాల పెంపు వ్యవహారంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం చేయకపోయినా, సీఎస్ సంతకానికి నిరాకరించినా కేబినెట్ చేత ఆమోదముద్ర వేయించారు. ఇంకో దారి లేదు. ఈ అవినీతి వ్యవహారాలపై పోరాడడం తప్ప’’. వైఫల్యాలు దాచి.. మాపై నిందలు టీడీపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ప్రతిపక్షంపై బురద జల్లి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని జగన్మోహన్రెడ్డి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. తునిలో జరిగిన రైలు దహనం సంఘటన, అక్కడ జరిగిన పరిణామాలన్నింటిపైనా ప్రస్తుత హైకోర్టు సిట్టింగ్ జడ్జితో గానీ, లేదా సీబీఐతో గాని విచారణ జరిపించాలని ఆయనను కోరారు. అపుడే వాస్తవాలు వెల్లడై నిజమైన నిందితులెవరో తేలుతుందన్నారు. కొద్ది నెలల క్రితం చిత్తూరు నగర మేయర్ అనూరాధ దంపతుల హత్య జరిగినపుడు తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నప్పటికీ సొంత పార్టీ వారే ఈ నేరం చేశారని కుటుంబీకులు ఆరోపిస్తున్నప్పటికీ వైఎస్సార్సీపీ వారికి ఆ హత్యను ఆపాదించే యత్నం చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. లక్ష మందికి పైగా పాల్గొంటున్న సభకు ఏమాత్రం భద్రతా ఏర్పాట్లు చేయకుండా వైఎస్సార్సీపీపై నిరాధారమైన ఆరోపణలు చేయడంతో పాటుగా బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. తునిలో ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన సభ సందర్భంగా అక్కడ తగినన్ని పోలీసు బలగాలే లేవన్న విషయం గవర్నర్ దృష్టికి తెచ్చారు. 2014లో అధికారం చేపట్టిన దగ్గరి నుంచీ టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను, ఎంపీలు, ఎమ్మెల్యేలను భయకంపితులను చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నిందితుల విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, శేషాచలంలో ఎర్రచందనం స్మగ్లర్ల పేరుతో జరిగిన మూకుమ్మడి హత్యాకాండపై సరైన దర్యాప్తు చేయక పోవడం, గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది మరణించిన సంఘటనపై దర్యాప్తు జరగక పోవడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చారు. ఇలాంటి వైఫల్యాలను తాము అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తున్నపుడు అప్రజాస్వామికంగా తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తూంటే అసలు ఈ రాష్ట్రంలో ఒక చట్టం అనేది ఉందా? అనిపిస్తోందన్నారు. జగన్ వెంట గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జ్యోతుల నెహ్రూ, మేకపాటి గౌతమ్‌రెడ్డి, విశ్వాసరాయి కళావతి, సుజయ్‌కృష్ణ రంగారావు, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, పాముల పుష్ప శ్రీవాణి, దాడిశెట్టి రాజా, కాకాని గోవర్థన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, కిలివేటి సంజీవయ్య, బుడ్డా రాజశేఖరరెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేష్ తదితరులున్నారు. -
'కేసీఆర్ తో చంద్రబాబు కాంప్రమైజ్'
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని గవర్నర్ నరసింహన్ ను కోరామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ను కలిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు ప్రధాన అంశాలపై గవర్నర్ ను కలిసినట్టు చెప్పారు. ట్రైబల్ ఎడ్వైజరీ కమిటీ వేయాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు. తమ పార్టీ వారిపై ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన తప్పుడు కేసుల గురించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు కేసీఆర్ తో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే... 'ఈ రోజు గవర్నర్ గారిని నాలుగు ప్రధాన అంశాల మీద కలిసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేసీఆర్ గారు టెండర్లు కూడా పిలిచిన నేపథ్యంలో 90 టీఎంసీల నీళ్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా డైవర్ట్ అయితే రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి వస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు రావు.ఈ ప్రాజెక్ట్ ను ఆపాలని రిక్వెస్ట్ చేశాం. ఇదే ప్రాజెక్ట్‌కు సంబంధించి గతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి కూడా లేఖ రాశాం. రిక్వెస్ట్ చేశాం. అయినా ఫలితం కనబడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్‌ను ఆపడానికి కృషి చేయాల్సిన వ్యక్తి ...రాష్ట్రాన్ని పణంగా పెట్టాడు. కనీసం దాని గురించి మాట్లాడని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారు. ఓటు కోసం కోట్ల రూపాయిలు ఇస్తూ ఆడియో, వీడియో టేప్‌ల్లో దొరికిపోయారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకు కాంప్రమైజ్ అయ్యారు. ఆయన సేఫ్ జోన్లో ఉండటం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారు. రెండో అంశం: ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కు. రాజ్యాంగం ప్రకారం వేయాల్సిన కమిటీ. ఏడుగురు ట్రైబల్ ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఆరుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేస్తే... చంద్రబాబు నాయుడు చేస్తున్న దౌర్జన్యాలు ఆపేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో అడ్వైజరీ కమిటీ వేయడం లేదు. ఈ అంశంపై గతంలో గవర్నర్‌కు లేఖ ఇచ్చాం. మరోసారి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయాలని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చాం. మూడోది: కాపు గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన సంఘటనలను చంద్రబాబు నాయుడు ఏవిధంగా తప్పుదోవ పట్టించారో గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాం. తన తప్పులు తప్పించుకోనేందుకు తప్పదోవ పట్టించే విధంగా చేస్తున్నారనేది వివరించాం. ఆరోజు జరిగిందేమిటీ అన్నది ప్రతి ఒక్కరూ చూశాం. ముద్రగడ పద్మనాభం కాపు గర్జన సభకు అనుమతి కావాలంటూ జనవరి 31న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సభకు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా చంద్రబాబు కట్టడి చేసినా కేడర్ వెళ్లారు. ఆ మీటింగ్ రైల్వే ట్రాక్ పక్కన జరుగుతుందన్న విషయం అనుమతి ఇచ్చినప్పుడు తెలియదా? ఆ రోజు మీటింగ్ జరిగనప్పుడు ముద్రగడ పద్మనాభం 15 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత తనతో కలిసి ప్రజలందరూ బస్సు, రైలు రోకో చేస్తారా అంటే వాళ్లంతా చేస్తామన్నారు. లక్షమంది రైల్వే ట్రాక్ దగ్గరకు వెళితే మాస్ హిస్టీరియా క్రియేట్ అవదా? ఆ విషయాన్ని చంద్రబాబు ఊహించలేదా, ఇంటెలిజెన్స్ ఏమైంది. ఆ జరిగిన ఘటన ఇది అని అందరికీ తెలిసిందే. కానీ తాను పర్మిషన్ ఇచ్చింది తప్పు, దాని నుంచి తప్పించుకునేందుకు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు బనాయించారు. ఏం పాపం చేశారని తప్పుడు కేసులు పెట్టారు. ఏ రకంగా ధర్మమిది. నీవు తప్పిదం చేశావు. నువ్వు చేస్తానన్నది చేయనందుకే ఈ ధర్నా జరిగింది. కట్టడి చేయలేకపోవడం నీ రెండో తప్పు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గవర్నర్ కు రిప్రజెంట్ చేశాం. ఈ రకంగా చేయడం అన్యాయం. మాట ఇచ్చి తప్పినందుకు చంద్రబాబుని జైల్లో పెట్టాలి. ఆయనపై కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది. ఇంకో అంశం కూడా గవర్నర్ కి దృష్టికీ తీసుకు వెళ్లాం. గవర్నర్ స్పీచ్‌లో అన్నీ చేసేశామని చెప్పిస్తున్నారు. ఆ ప్రసంగాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ నోటితో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా రుణమాఫీ చేశామని చంద్రబాబు సర్కార్ చెప్పించింది. వడ్డీలో నాలుగో వంతు కూడా సరిపోని విధంగా రుణమాఫీ చేసి, మొత్తం రుణమాఫీ చేశామని చెప్పించారు. వడ్డీలు కూడా మాఫీ కానీ పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ నోటితో అబద్దాలు చెప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివరకూ చేసింది కూడా సున్నా. అబద్దాలు చెప్పించినప్పుడు చెప్పద్దు అని, అడగండి అని గవర్నర్‌తో అన్నాం. చంద్రబాబు హామీల అమలుపై సమగ్ర సమాచారం తెప్పించుకుని, పరిశీలించమని గవర్నర్‌ను కోరాం' అని తెలిపారు. కాగా, విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. స్పీకర్ పై అవిశ్వాసం పెడతామని చెప్పారు. -
తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆందోళన
తమపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని కోరుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మండలంలోని రాఘవాపురం పంచాయతీ పరిధిలో వీధిలైట్లను వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు సొంత డబ్బుతో వేయించారు. తనకు సమాచారం ఇవ్వకుండా లైట్లు ఏర్పాటు చేశారని.. సర్పంచ్.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ కేసులు ఎత్తి వేయాలని కోరుతూ కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. -
దాడులకు నిరసనగా కలెక్టరేట్లను ముట్టడిస్తాం
గుంటూరు: వైఎస్ఆర్ సీపీ శ్రేణులపై జరుగుతున్నదాడులు హేయమైనవని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. గురువారం ఆయన గుంటూరులో మాట్లాడుతూ...భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని పేర్కొన్నారు. 20 మంది తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి తిరిగి తమ పైనే కేసులు పెట్టడం దారుణమని ఆయన మండిపడ్డారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.