రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి
మెదక్ : రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండంలోని రాయవరం, తిమ్మాపూర్ గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.దిది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు.
నిరుద్యోగ సమస్యలపై జేఏసీ పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య, రాంరెడ్డి, మండలాధ్యక్షులు సత్యం, రాములు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.