
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్‌రెడ్డి
కాళోజీసెంటర్ (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిందని, మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అందుకు ఈ నెల 17 నుంచి 26 వరకు గ్రామాల్లో సభలు నిర్వహించి టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. హన్మకొండలోని బీజేపీ రూరల్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పదాధికారుల సమావేశం శనివారం జరిగింది.
ఈ సందర్భంగా బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీలతో ప్రజలను మోసం చేస్తున్న విషయాలను వివరించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కట్టా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.విజయ్‌చందర్ రెడ్డి, నాయకులు తక్కళ్లపల్లి శ్రీదేవి, సిరంగి సంతోష్‌కుమార్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment