సమావేశంలో మాట్లాడుతున్న మురళీధర్‌రావు
రేగొండ: (భూపాలపల్లి) రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయే అని, దేశంలో కాంగ్రెస్ పార్టీకి రాహుల్‌గాంధీ సారధ్యంలో భవిష్యత్ లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోలుసాని మురళిధర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని దుంపిళ్లపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించి, గూడెపల్లిలో బీజేపీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కొడవటవచలో ఉజ్వల ఉచిత గ్యాస్ కనెక్షన్‌లను పింపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎదురు లేదని అన్నారు. 2019 ఎన్నికలకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీని ఎదురించేది కేవలం బీజేపీ పార్టీ అన్నారు. మోదీ పాలన దళితులకు ప్రత్యేక ఓదాను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ మైండ్ గేమ్ అడుతున్నారని విమర్శించారు.
ఎన్ని జిమ్ముక్కులు చేసిన కేంద్రం, రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడం ఖాయం అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి, నాగపూరి రాజమౌళిగౌడ్, ఓలం కంపెనీ రీజనల్ అధికారి శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు వెన్నంపెల్లి పాపయ్య, వీరగోపాల్, రామారవు, నియోకవర్గ కన్వీనర్ నిషీధర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాదరావు, బాబురావు, జిల్లా కోశాధికారి తిరుపతిరెడ్డి మండల అధ్యక్షుడు మనోహర్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment