ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభ’
ఇదే వేదికపై 2022 మే 6న ‘రైతు రుణమాఫీ’ హామీ
హామీ అమలు దేశానికి తెలిపేలా భారీ సభ
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓరు గల్లులో పర్యటించనున్నారు. హను మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఈ నెలాఖరున నిర్వహించ తలపెట్టిన రైతు రుణ మాఫీ కృతజ్ఞత సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరు కాను న్నారు. 2022, మే 6న ఇదే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్‌గాంధీ ముఖ్య అతిథిగా రైతు సంఘర్షణ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సభలోనే ఆయన రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. రూ.2 లక్షల మేరకు రైతుల రుణా లను మాఫీ చేయనున్నట్లు ప్రకటించడంతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీకి కూడా శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా రూ.లక్ష వరకు రాష్ట్రవ్యాప్తంగా 10,83,004 రైతు కుటుంబాలకు రూ.6,093.93 కోట్ల రుణాలను మాఫీ చేసింది.
మూడు విడతల్లో రూ.2 లక్షల మేర ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో హామీని అమలు చేసేందుకు కృషి చేసిన నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీపీసీసీ యోచి స్తోంది. రాహుల్‌గాంధీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ముఖ్యులు శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనతో చర్చించిన తర్వాత కృతజ్ఞత సభ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment