బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Comments At Corner Meeting Held In Warangal East Constituency Ahead Of Telangana Assembly Elections - Sakshi
Sakshi News home page

బీజేపీ గాలిని వాళ్లే తీసుకున్నారు : రాహుల్‌ గాంధీ

Published Fri, Nov 17 2023 5:12 PM | Last Updated on Fri, Nov 17 2023 8:59 PM

Rahul gandhi comments at warangal congress corner meeting - Sakshi

సాక్షి,వరంగల్‌ : తెలంగాణ ఇస్తే పేదలకు మంచి జరుగుతుందని భావించామని, అయితే వారికి ఎలాంటి మేలు జరగలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గంలో జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్‌ గెలవగానే రాష్ట్రంలో కులగణన చేపడతామన్నారు. కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

బీజేపీ మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు పెంచిందని విమర్శించారు. ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలనేది బీజేపీ కుట్ర అని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని రాహుల్‌ ఆరోపించారు. బీజేపీ బండిలో గాలిని ఆ పార్టీయే తీసుకుందని ఎద్దేవా చేశారు. 

‘ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల రూ.2,500 వేస్తాం. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తాం. విద్యార్థుల చదువు, కోచింగ్‌ కోసం యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తాం. చేయూత పథకం కింద వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల రూ.4 వేలు ఇస్తాం. కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులకు మాత్రమే మేలు చేస్తారు. ప్రధాని మోదీ ధనికులైన తన స్నేహితులకు మాత్రమే మేలు చేస్తారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పేదలను గుర్తించి ప్రతి ఒక్కరికి మేలు చేస్తుంది’ అని రాహుల్‌ తెలిపారు. 

ఇదీచదవండి..కేసీఆర్ ఇక అక్కడే ఉండిపోతారు: ఖర్గే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement