baddam ballreddy
-
ఎమ్మెల్యేగా హ్యాట్రిక్.. ఎంపీగా బ్యాడ్‌లక్
రాజేంద్రనగర్: శాసనసభకు మూడుసార్లు ఎన్నికై హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ నాయకుడు బద్దం బాల్‌రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం విజయం అంచు వరకు వెళ్లి ఓటమి పాలయ్యారు. ‘గోల్కొండ సింహం’గా అభిమానులు పిలుచుకునే ఈయన తుది శ్వాస వరకు ఎన్నికల్లో పోటీచేశారు. బద్దం బాల్‌రెడ్డి నగరంలోని కార్వాన్ నియోజకవర్గం నుంచి 1985లో ఎంఐఎం అభ్యర్థి రసూల్‌ఖాన్‌పై 9,777 ఓట్లతో, 1989లో ఎంఐఎం అభ్యర్థి ఆగాపై 30,066, 1994లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ సజ్జద్పై 13,293 ఓట్లతో విజయం సాధించారు. వరుసగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ వీరుడిగా పేరొందారు. కానీ, పార్లమెంట్లో కాలుమోపేందుకు శతవిధాలా ప్రయత్నించినా విజయం సాధించలేదు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈయన 1991లో 39,524 ఓట్లతో ఓటమి పాలయ్యారు. 1998, 1999 ఎన్నికల్లో సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి పరాజయం పొందారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి విజయం కోసం తుదివరకు ప్రయత్నించారు. కాగా, తన చివరి దశలో 2018 డిసెంబర్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
మాట తప్పిన ప్రభుత్వంపై ఉద్యమించాలి
కాళోజీసెంటర్ (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిందని, మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అందుకు ఈ నెల 17 నుంచి 26 వరకు గ్రామాల్లో సభలు నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. హన్మకొండలోని బీజేపీ రూరల్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీలతో ప్రజలను మోసం చేస్తున్న విషయాలను వివరించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి కట్టా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.విజయ్‌చందర్ రెడ్డి, నాయకులు తక్కళ్లపల్లి శ్రీదేవి, సిరంగి సంతోష్‌కుమార్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు
సిరిసిల్లటౌన్: కేంద్రం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రంలో కేసీఆర్ డబుల్బెడ్రూం పథకం అమలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్ల అయ్యప్ప ఫంక్షన్‌హాలులో పార్జీ జిల్లాస్థాయి ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నిర్ధిష్టంగా నిధులు అందించగా.. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వమ పథకాలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అజీవన సహయోగ్ పథకం ప్రకారం పార్టీ సభ్యుల నుంచి నిధులు సేకరిస్తున్నామని తెలిపారు. పార్టీకి అందించే విరాళాలు చెక్కులు, డీడీలు, డిజిటల్ లావాదేవిల రూపంలోనే తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మహిళాధ్యక్షురాలు గడ్డం లత, అజీవన సహాయ నిధి ఇన్చార్జి విద్యాసాగర్, సిరిసిల్ల నియోజవర్గ ఇన్చార్జి అన్నల్దాస్ వేణు, గడ్డం భాస్కర్, గూడెల్లి వేణు, ఎనగంటి నరేష్, బాలసాని అనీల్ ఉన్నారు. కేంద్రం నిధులతోనే ‘డబుల్’ పథకం -
'వంద పోలింగ్ కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్'
హైదరాబాద్: హోంగార్డులకు, జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని బీజేపీ నాయకుడు కిషన్‌రెడ్డి కోరారు. సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి భర్తపై ఇసుక మాఫియా చేసిన హత్యాయత్నంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 7 నుంచి 12 వరకు కిషన్‌రెడ్డి.. వారణాసిలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కార్వాన్లో 100 పోలింగ్‌కేంద్రాల్లో ఎంఐఎం రిగ్గింగ్ చేసిందని బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి ఆరోపించారు. అధికారులపై, ఎంఐఎం కార్యకర్తలపై విచారణ జరిపించాలని, ఈ వంద పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.