TRS Govt
-
నాలుగేళ్లుగా చేయనిది.. ఈ రెండు నెలల్లో చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేయని రైతుల రుణమాఫీ ఈ రెండు నెలల్లో చేస్తుందా? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులు అమ్ముకునేందుకు కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు క్రమంగా ప్రైవేటుపరం చేస్తున్నారని, 56 వేల మంది ఉన్న ఆర్టీసీ కార్మికుల సంఖ్య 43 వేలకు చేరిందని, బస్సుల సంఖ్య 12 వేల నుంచి మూడు వేలకు పడిపోయిందన్నారు. ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న తాత్కాలిక కార్మికుల పరిస్థితేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులకు పరిమితం చేస్తున్నారని, ఆరు నెలలకు ఒకసారి సభ జరగాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించి చేతులు దులుపుకునేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయని. వాటిపై సభలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. భారీ వర్షాలకు పంట పొలాలు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా.. ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తరువాతే పంటపొలాలు బ్యాక్ వాటర్ కారణంగా నష్టపోతున్నాయని ఈటల ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా సమస్య పరిష్కరించే దమ్ము లేదని, అన్నింటికీ ముఖ్యమంత్రే అని ఎద్దేవా చేశారు. మూడు నెలలైతే ఈ ప్రభుత్వం ఉండదన్నారు. కక్షపూరితంగానే బీఏసీకి పిలువలేదు ఉమ్మడి ఏపీలో సైతం ఒక్క సభ్యుడు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, బీజేపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా పిలవకపోవడం కక్షపూరిత చర్య అని ఈటల మండిపడ్డారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి తెలంగాణ పాలకులకు లేదన్నారు. అసెంబ్లీలో చాలా రూములు ఖాళీగా ఉన్నా.. బీజేపీ సభ్యులకు కేటాయించలేదని విమర్శించారు. -
ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ కొత్త వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్‌నగర్ పేరును పాలమూరుగా, వికారాబాద్‌ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్ పేరును కరినగర్‌గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది. చదవండి: ‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్‌నే’ -
హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదు.. తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ మూడేళ్లలో రాజ్‌భవన్ ప్రజాభవన్‌గా మారిందని గవర్నర్ తమిళిసై అన్నారు. మూడేళ్ల పాలనపై గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మాట్లాడుతూ, రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని, ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోయినా తాను పని చేస్తానన్నారు. పలు సమస్యల పరిష్కారానికి సీఎంకు లేఖలు రాశానని, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పర్యటించానని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: ఈటల రాజేందర్‌తో భేటీ.. బీజేపీలోకి దివ్యవాణి? ‘‘రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తూనే ఉంటాను. మేడారం వెళ్లేందుకు హెలికాఫ్టర్ అడిగితే ఇవ్వలేదు. కనీసం సరైన సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. చివరికి 8 గంటల ప్రయాణం చేసి మేడారం వెళ్లా. ‘గవర్నర్’ ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కారు. రాజ్‌భవన్‌పై వివక్ష చూపుతున్నారు. సమస్యలు ఉంటే నాతో మాట్లాడొచ్చు. ఎటోహోమ్‌కు వస్తానని సీఎం రాకపోవడం కరెక్టేనా?. వాస్తవాలు ప్రజలకు తెలియాలి’’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. ‘‘రిపబ్లిక్ డేకు జెండా ఎగరేసే అవకాశం కల్పించలేదు. పెద్ద ఆసుపత్రి డైరెక్టర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటే.. తెలంగాణలో ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
స్కూళ్లల్లో వసతులు లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు: ఈటల రాజేందర్
-
‘కేటీఆర్.. చర్చకు రావాలి లేదా క్షమాపణలు చెప్పి రాజీనామా చెయాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.రెండున్నర లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని అమిత్‌షా చేసిన సవాల్‌ఫై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలి లేదా క్షమాపణలు చెప్పి, పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డా.ఎస్.ప్రకాష్‌రెడ్డి, కొల్లిమాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటేనే టీఆర్ఎస్కు వణుకు మొదలైందన్నారు. శ్రీలంకలో అవినీతి వ ల్ల ప్రజల చేతికి చిప్ప వచ్చింద ని, రాష్ట్రంలోనూ అ వే పరిస్థితులు రాబోతున్నా యన్న బండిసంజయ్ విమర్శలకు జవాబివ్వలేక కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని అన్నారు. చదవండి👉🏻 శెభాష్ శ్రీనివాస్.. అమిత్ షా అభినందన ఎనిమిదేళ్ల కుటుంబ, అవినీతి పాలనకు టీఆర్ఎస్ తిలోదకాలు ఇవ్వకపోతే ప్రజల చేతిలో గుణ పాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ సభలో లేవనెత్తిన అంశాలకు మంత్రులు సమాధానాలు ఇవ్వలేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మం డిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు అమిత్ షాను ‘వలస పక్షి’ అని సంబోధించారని, కేటీఆర్, ఇతర మంత్రులు తమ భాషను మానుకోవాలని సూ చించారు. టీఆర్ఎస్ తీరును బట్టే తమ సభ ఎంత విజయవంతమైందో స్పష్టమౌతోందని అన్నారు. చదవండి👇 బండి సంజయ్‌కు మోదీ ఫోన్.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్’ పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం పాస్‌పుస్తకంలో ‘పాట్ ఖరాబ్’ -
సర్కారు వారి మాట
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లుగా కంపెనీలు నెలకొల్పని పరిశ్రమల నుంచి ప్రభుత్వ భూముల స్వాదీనానికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగం సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌కు ఆనుకొని హెచ్ఎండీఏ పరిధిలో సుమారు రెండువేల ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాలను తిరిగి కంపెనీలు నెలకొల్పేవారికి కేటాయించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎకరం మొదలు వంద ఎకరాలకు పైగా భూములున్న కంపెనీలుండడం గమనార్హం. ఈ ప్రాంతాల్లోనే అత్యధికం... రెండేళ్ల క్రితం టీఎస్ఐఐసీ నుంచి స్థలాలను దక్కించుకున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కంపెనీల యజమానులు ఇప్పటికీ కంపెనీలను నెలకొల్పలేదు. ఇలా నిరుపయోగంగా ఉన్నవిలువైన ప్రభుత్వ స్థలాలు.. ప్రధానంగా ర్యావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్‌పార్క్, నానక్‌రామ్‌గూడలోని ఐటీపార్క్, నాచారం పారిశ్రామిక వాడ, పాశమైలారం, పటాన్చెరు ప్రాంతాలున్నాయి. గతంలో కేటాయింపులిలా.. ♦ నాలుగేళ్లుగా టీఎస్ఐఐసీ సుమారు 4,169 ఎకరాల భూములను 2,290 కంపెనీలకు కేటాయించింది. ఇందులో 95 సంస్థలు ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారివి. ఈ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రానికి సుమారు రూ.56,597 కోట్ల పెట్టుబడుల వెల్లువతోపాటు..1.50 లక్షల మందికి ఉపాధి దక్కనుందని టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు స్వా«దీనం చేసుకొని తిరిగి ఇతర సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు టీఎస్ఐఐసీ కార్యాచరణ సిద్ధంచేస్తోంది. ♦ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి భూములు స్వా«దీనం చేసుకోగా..సదరు యజమానులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం. గత ఏడేళ్లుగా టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేయనుంది. ♦ గత ఏడేళ్లుగా 18 ప్రాంతాల్లో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించింది . మరో 15,620 ఎకరాలను పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో రావిర్యాల, మహేశ్వరంలోని హార్డ్‌వేర్ క్లస్టర్, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లున్నాయి. రాబోయే రెండేళ్లలో 80 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. -
రైతు సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
చేవెళ్ల: రాష్ట్రంలో రైతు సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రైతులకు ఏదో చేశామని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. చేవెళ్ల మండలంలో గురువారం 6వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. చేవెళ్లలో రాత్రి బస చేసిన ఆయన ఉదయం 11.30 గంటలకు యాత్రను ప్రారంభించారు. చేవెళ్ల మీదుగా దామరగిద్ద, మీర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్ ఆలూరు మీదుగా రాత్రికి వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లికి చేరుకున్నారు. బండి సంజయ్ గురువారం ఎలాంటి సభలు లేకుండా యాత్ర మాత్రమే సాగించారు. ఈ సందర్భంగా దారి వెంట రైతుల సమస్యలు విన్న ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎంతో చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం నిజానికి ఏమీ చేయలేదన్నారు. రుణమాఫీ అతీగతీ లేదని, సబ్సిడీపై యూరియా అందిస్తామని మాట తప్పిందన్నారు. ఈ యాత్రలో భాగంగా పొలాల్లో పనిచేసుకుంటున్న వివిధ గ్రామాల రైతుల వద్దకు వెళ్లిన సంజయ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని దామరగిద్ద సమీపంలోని టమాటా రైతుల వద్దకు వెళ్లి ధరల విషయం ప్రశ్నించారు. అధిక వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నష్టపోతున్నామని, అరకొర పంటలు వచ్చినా వాటికి మార్కెట్లో ఆశించిన ధరలు లేక నష్టాలు వస్తున్నాయని రైతులు సంజయ్‌తో ఆవేదన వ్యక్తం చేశారు. మీర్జాగూడ సమీపంలోని ఒక పొలంలో బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావులు నాగలి పట్టి పొలం దున్నారు. రుణమాఫీ రాలేదని, సబ్సిడీపై రైతులకు వచ్చే పనిముట్లు ఇవ్వటం లేదని పలువురు రైతులు వివరించారు. మండలంలోని దామరగిద్ద, మిర్జాగూడ, బస్తేపూర్, ఖానాపూర్‌లలో పలువురు యువకులు బీజేపీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబో యేది బీజేపీ ప్రభుత్వమేనని, అది చూసే టీఆర్ఎస్ నాయకులకు భయం పట్టుకుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. బండి సంజయ్ యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు మతిపోతోందని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో సంజయ్‌కి ఘన స్వాగతం పూడూరు: బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర గురువారం రాత్రి వికారాబాద్ జిల్లాలో ప్రవేశించింది. పూడూరు మండలంలోని అంగడిచిట్టంపల్లి గేటు వద్దకు చేరుకోగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంగడిచిట్టంపల్లి గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. ధరణి కాటన్ మిల్లులో బండి రాత్రికి బస చేయనున్నారు. -
కాంగ్రెస్ ‘దళిత, గిరిజన దండోరా’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ దళిత, గిరిజన దండోరా మోగించడానికి సన్నద్ధమవుతోంది. ఏడేళ్లుగా ఎస్సీ, ఎస్టీలను వంచనకు గురిచేసిన వైనాన్ని ఎండగట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. క్విట్ ఇండియా ఉద్యమరోజైన ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17 వరకు పల్లెపల్లెనా ‘దళిత, గిరిజన దండోరా’కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఇక్కడ ఇందిరాభవన్‌లో టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు టి.జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్‌లు హాజరుకాగా, మరో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు అజారుద్దీన్, గీతారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతోపాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గైర్హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక, కోకాపేట, పోడు భూముల అంశాలు, వరదలు, దళితబంధు పథకంపై నేతలు రెండుగంటలకుపైగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు మీడియాకు వెల్లడించారు. అసైన్డ్ భూములను బలవంతంగా కొందరు లబ్ధిదారుల నుంచి లాక్కుంటున్నారని, వీరిపై ఫిర్యాదు చేద్దామంటే కలెక్టర్లు కూడా సీఎం కేసీఆర్ లాగానే తమ ఫామ్‌హౌస్‌లకు పరిమితమయ్యారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఏ పార్టీలో చేరతారో చెప్పలేదని, అయితే, దళితులకు జరుగుతున్న అన్యాయాలను గురించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు, డిమాండ్లివే ► దళితబంధు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ‘దళిత, గిరిజన దండోరాలో భాగంగా ఊరూరా ఎండగట్టాలి. ఆ తర్వాత బీసీ దండోరా పేరుతో మరో కార్యక్రమం చేపట్టాలి. ఏడేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ► రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా మరిం త బలోపేతమయ్యేందుకుగాను భావసారూప్యత ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలి. కోదండరాం, చెరుకు సుధాకర్, గద్దర్, విమలక్క లాంటి వారిని తమతో కలసి రావాలని ఆహ్వానించాలి. ► ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పై నిర్వహిస్తున్న ఆందోళనలను కట్టడి చేసే పేరుతో రాష్ట్ర పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయాలి. మానవ హక్కుల కమిషన్‌తోపాటు పలు కోర్టుల్లో కేసులు వేయాలి. ► కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతోపాటు సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలి. గిరిజనుల పోడు భూముల పరిరక్షణ కోసం గిరిజన ప్రజాప్రతినిధులతో కలసి కార్యాచరణ రూపొందించాలి. టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలు, డిమాండ్లివే ► దళితబంధు పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ‘దళిత, గిరిజన దండోరాలో భాగంగా ఊరూరా ఎండగట్టాలి. ఆ తర్వాత బీసీ దండోరా పేరుతో మరో కార్యక్రమం చేపట్టాలి. ఏడేళ్ల కాలంలో ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ► రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా మరిం త బలోపేతమయ్యేందుకుగాను భావసారూప్యత ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలి. కోదండరాం, చెరుకు సుధాకర్, గద్దర్, విమలక్క లాంటి వారిని తమతో కలసి రావాలని ఆహ్వానించాలి. ► ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యల పై నిర్వహిస్తున్న ఆందోళనలను కట్టడి చేసే పేరుతో రాష్ట్ర పోలీసులు దుందుడుకుగా వ్యవహరిస్తున్న తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేయాలి. మానవ హక్కుల కమిషన్‌తోపాటు పలు కోర్టుల్లో కేసులు వేయాలి. ► కోకాపేట భూముల్లో జరిగిన అవినీతిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతోపాటు సీబీఐకి కూడా ఫిర్యాదు చేయాలి. గిరిజనుల పోడు భూముల పరిరక్షణ కోసం గిరిజన ప్రజాప్రతినిధులతో కలసి కార్యాచరణ రూపొందించాలి. -
మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతికహక్కు మీకు లేదు
సాక్షి, మెదక్: రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు రైతుల విషయంలో తమను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మెదక్‌కు వచ్చిన మం త్రి విలేకరులతో మాట్లాడు తూ, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ రైతాంగానికి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణమాఫీ చేసిందన్నారు. మొదటి దఫా కింద రూ.25 వేల లోపు రుణాలన్న వారికి ఒకేసారి మాఫీ చేస్తామని బడ్జెట్ సమావేశాల్లోనే స్పష్టం చేశామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఏం ఉద్ధరించారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే ముందు తమ లోపాలను చూసుకోవాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటలన్నీ కొనుగోలు చేసి వారిని ఆదుకుంటోందన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ పాలితరాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వరితోపాటు మొక్కజొన్న, జొన్న, కంది, వేరుశనగ, పొద్దు తిరుగుడు వంటి అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసింది ఒక్క టీఆర్ ఎస్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా రైతుల కోసం ఇంతగా నిధులు ఖర్చు చేసింది లేదన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు రూ. 5 వేల చొప్పున ఏడాదికి పదివేలు అందజేస్తున్నామన్నారు. ఈ పథకం కింద రైతుల సంక్షేమం కోసం రూ.12 వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా రైతులు అకాల మరణం చెందిన సందర్భంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా ద్వారా రూ.5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అనవసర విమర్శలు చేస్తే ప్రజల్లో మీరే నవ్వుల పాలవుతారని అన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరితే కేంద్రం సహకరించడం లేదన్నారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జెడ్పీవైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి పాల్గొన్నారు. -
అధికారికంగా నిర్వహించాల్సిందే..
సాక్షి, సంగారెడ్డి: ఎంతోమంది త్యాగధనుల ఫలితంగా నిజాం నవాబు నిరంకుశ పాలన నుంచి విమోచనం పొందిన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలల్సిందేనని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాటిలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 13 నెలల తర్వాత నిజాం నుంచి తెలంగాణకు విముక్తి లభించినా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మజ్లిస్‌కు భయపడి కేసీఆర్ ఇంటి నుంచి బయటకు రావట్లేదని విమర్శించారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారిని, ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆ సంస్కారం కూడా లేదా.. రాష్ట్ర హోం మంత్రికే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే.. ప్రజలను ఏం కలుస్తావని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారు కానీ.. విమోచనం కోసం పోరాడిన వారిని స్మరించుకునే సంస్కారం కూడా ఆయనకు లేదని నిప్పులు చెరిగారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన్‌మంత్రి ఆవాస్‌యోజన, ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన, కిసాన్ యోజన, కిసాన్ పింఛన్ యోజన, తదితర పథకాలు రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలకు కేసీఆర్ కీడు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెంచిన అంచనా వ్యయాలను బట్టే కేసీఆర్ అవినీతి అర్థమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పారు. మజ్లిస్ కనుసన్నల్లో పాలన: జి.కిషన్‌రెడ్డి మజ్లిస్ పార్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. గతంలో పాలించిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్‌కు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా జరపలేదని నిజాం పాలన తనకు ఆదర్శమని కేసీఆర్ చెప్పడం తెలంగాణ ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలపై హత్యలు, అరాచకాలు, మానభంగాలు, అకృత్యాలు జరిగాయన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రజాకార్ల వారసత్వ పార్టీ మజ్లిస్ అని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం ఊరూరా విజయవంతమైందని, ఇదే ప్రభుత్వ పతనానికి నాంది అని పేర్కొన్నారు. కుటుంబ పాలన నుంచి విముక్తి కలగాలి: లక్ష్మణ్ కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి నుంచి తెలంగాణకు విముక్తి కలగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శించారు. విమోచన దినాన్ని జరపాలని బీజేపీ సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తోందని తెలిపారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కుమ్రం భీం వంటి త్యాగధనులున్న ఈ తెలంగాణలో విమోచన దినాన్ని జరపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రాన్ని కోరి విమోచన దినాన్ని అధికారికంగా జరిపించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, ఎంపీలు సోయం బాబురావు, ధర్మపురి అరవింద్, గరికపాటి రాంమోహన్‌రావు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, బాబూమోహన్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, పి.శశిధర్‌రెడ్డి, విజయపాల్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రోగాల నగరంగా మార్చారు
హైదరాబాద్: విశ్వనగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం అవగాహనలేమితో రోగాల నగరంగా మార్చిందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు రోగాలతో విలవిలలాడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధ్వజమెత్తారు. సీజనల్ వ్యాధుల కారణంగా నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో శనివారం అఖిలపక్ష నేతలు ఆ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజతో సమావేశమైన నేతలు రోగులకు అందిస్తున్న వైద్యం, సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డు–2లోకి వెళ్లి రోగులను పరామర్శించారు. ‘ఫీవర్’కే ఫీవర్: కోదండరాం ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ధర్మాసుపత్రి గా పేరుగాంచిన ఫీవర్ ఆస్పత్రికే జ్వరం వచ్చినట్లుందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. విషజ్వరాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు ఆస్పత్రుల సందర్శనలు, పరామర్శలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. రోగుల తాకిడి దృష్ట్యా ఓపీ కౌంటర్లలో ఉన్న వైద్యులపై అధిక పని భారం పడుతోందన్నారు. దీంతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసి అందుకనుగుణంగా సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. చోద్యం చూస్తోంది: ఎల్.రమణ రాష్ట్రమంతా విషజ్వరాలతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నగరం నాలుగు దిక్కుల్లో వెయ్యి పడకల ఆస్పత్రులు నాలుగు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని ప్రశ్నించారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించింది విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకేనన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సరైన కార్యాచరణ లేదు: చాడ వైద్యం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన కార్యాచరణ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రోగుల తాకిడి దృష్ట్యా ఫీవర్ ఆస్పత్రికి అదనపు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సాయిబాబా, సీపీఐ నేత అజీజ్ పాషా, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీ సర్కారుకు హైకోర్టు షాక్!
సాక్షి, హైదరాబాద్ : ఎర్రమంజిల్ ప్యాలెస్ కూల్చివేత- అసెంబ్లీ నూతన భవన నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంత వరకు ఎర్ర మంజిల్ భవనాలను కూల్చవద్దని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందని ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం స్పష్టం చేసింది. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం పిటిషన్ విచారణ సందర్భంగా తొలుత కౌంటర్‌కు గడువు కోరిన ప్రభుత్వ లాయర్.. తర్వాత ఈరోజు మధ్యాహ్నమే తమ వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. కాగా ప్యాలెస్ అనుమతి లేకుండా ఎర్రమంజిల్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారంటూ నవాబు వారసులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు ఎర్రమంజిల్‌లో ఉన్న 12 ఎకరాల భూమికి పరిహారం చెల్లించాలని కోరారు. 1951 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో... తుదితీర్పు వెలువడకముందే అసెంబ్లీ భవనాన్ని ఎలా నిర్మిస్తారని పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు సామాజిక వేత్త పాడి మల్లయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఇక చరిత్రాత్మక ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చి కొత్త అసెంబ్లీ భవన సముదాయం, సచివాలయం ప్రాంగణంలోని భవనాలన్నింటినీ కూల్చి అక్కడే కొత్త సచివాలయ భవనం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. -
ముందస్తు ఎన్నికలతో టీఆర్ఎస్ దుర్బుద్ధి: చాడ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఫలితాలు వెలువడ్డాక పరిషత్ ఎన్నికలు నిర్వహించి ఉంటే ఫలితాలు మరోరకంగా ఉం డేవని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. జూలై 3 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాలపరిమితి ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్బుద్ధితో విపక్షాలను నిలువరించేందుకు ముందస్తుగా పరిషత్ ఎన్నికలు పెట్టిందనేది సుస్పష్టమని వ్యాఖ్యానించారు. తమ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో 17 ఎంపీటీసీ స్థానాలు, ఖమ్మం జిల్లాలో 7, నల్లగొండ జిల్లాలో 2, కరీంనగర్ జిల్లాలో 3, నాగర్‌కర్నూల్ జిల్లాలో 2, యాదాద్రి, మంచిర్యాల, సూర్యా పేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానం చొప్పున గెలుపొందినట్లు తెలిపారు. -
రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ పరమైన హక్కులను కాలరాస్తూ వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి సునితా సంపత్ నామినేషన్ తిరస్కరించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తాండూరు మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న సునితా సంపత్ నామినేషన్ అన్నివిధాలుగా సక్రమంగా ఉన్నా తప్పుడు కారణాలతో నామినేషన్ రద్దు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే ఇంత నీచానికి దిగజారారని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణకు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈవీఎంల విషయంలో జిల్లా కలెక్టర్‌ను బలి చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నెలల కాలంలోనే మరో కలెక్టర్‌ను బలిపీఠం ఎక్కించేందుకు ప్రయత్నిస్తోందని ఉత్తమ్ అన్నారు. -
పదవీ విరమణ తప్పదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా ఒకటే చర్చ. అన్ని స్థాయి ఉద్యోగుల్లో ఆ ఆంశంపైనే హాట్ హాట్ డిస్కషన్. ఉత్తర్వులు ఎప్పుడొస్తాయని ఉత్కంఠగా ఎదురుచూస్తు న్న అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచనున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ సీట్లతో గెలవడం, కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేయడం అన్నీ జరిగిపోయాయి. అయితే ఆదేశాలు ఎప్పుడొస్తాయి.. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్న ఉద్యోగులకు తీపికబురు అందుతుందా లేదా అన్న దానిపై టెన్షన్ నెలకొంది. 1,200 మంది రిటైర్మెంట్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఈ నెలాఖరు కు 1,200 మంది పదవీ విరమణ చేయబోతున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. వీరిలో గెజిటెడ్ అధికారులు, కింది స్థాయి సిబ్బంది వరకు ఉన్నారు. వీరంతా సంబంధిత విభాగాధిపతులను కలసి పద వీ విరమణ పెంపుపై చర్యలు తీసుకుంటున్నారా.. ఎప్పటిలోపు ఆదేశాలొస్తాయి.. ఈ నెలలో ఆదేశాలొస్తాయా రావా అంటూ వాకబు చేస్తున్నారు. ఎప్పటి నుంచి అమల్లోకి.. పదవీ విరమణ వయసు ఆదేశాలు ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొస్తారా.. లేదా జూన్ 2 నుంచి అమల్లోకి తెస్తారా అన్న అంశాలపై జోరుగా చర్చ సాగుతోంది. కొత్త సంవత్సరం జనవరి నుంచి అమలు చేస్తే తాము నష్టపోతామని ఈ నెల పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు సీఎస్ ఎస్కే జోషిని కలసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికైతే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎంకు ఎలాంటి ప్రతిపాదన ఫైలు వెళ్లినట్లు సచివాలయంలో కన్పించట్లేదు. వయసు పెంపు ఉంటుందా లేదా అన్న దానిపై ఏ అధికారిని అడిగినా సరైన రీతిలో స్పందన రావట్లేదని రిటైర్ కానున్న అధికారులు చెబుతున్నారు. అధ్యయనం చేయబోతున్నారా? రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. కర్ణాటకలో విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. ఆయా రాష్ట్రా ల్లో పదవీ విరమణ వయసు పెంచడం వల్ల ప్రభుత్వంపై ఆర్థికంగా ఎంత భారం పడుతుంది.. ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. తదితర అంశాలపై అధ్యయనం చేసే అవకాశం లేకపోలేదని సచివాలయ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఈ నెల నుంచే పెంచితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై రూ. 260 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభాగాల వారీగా జాబితా.. పదవీ విరమణ వయసు పెంపుపై ఇప్పటివరకు ఏ విభాగానికి కూడా సచివాలయం నుంచి గానీ ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి సర్క్యులర్ వచ్చిన దాఖలాల్లేవు. దీంతో పదవీ విరమణ చేయాల్సిన అధికారులు సచివాలయంలో చక్కర్లు కొడుతున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా దీనిపై ఆరా తీస్తున్నారు. క్రిస్మస్ సెలవులు పోను పదవీ విరమణ చేయబోతున్న అధికారులు అధికారికంగా పనిచేసేది ఇంకా ఆరు రోజులే. ప్రభుత్వ సెలవులు, ఆప్షన్ హలిడే, ఆదివారాలు ఉండటంతో అసలు ఆదేశాలొచ్చే అవకాశం ఉండకపోవచ్చని పదవీ విరమణ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
టీఆర్ఎస్ తెలంగాణ పోరాటాన్ని మర్చిపోయింది
-
స్పీకర్‌కు నోటీసులపై కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది. -
మాట తప్పిన ప్రభుత్వంపై ఉద్యమించాలి
కాళోజీసెంటర్ (వరంగల్): రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిందని, మాట తప్పిన రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి అన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. అందుకు ఈ నెల 17 నుంచి 26 వరకు గ్రామాల్లో సభలు నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. హన్మకొండలోని బీజేపీ రూరల్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పదాధికారుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీలతో ప్రజలను మోసం చేస్తున్న విషయాలను వివరించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి కట్టా సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.విజయ్‌చందర్ రెడ్డి, నాయకులు తక్కళ్లపల్లి శ్రీదేవి, సిరంగి సంతోష్‌కుమార్, ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల్లోకి సంచార జాతులు
సాక్షి, హైదరాబాద్: 30 సంచార జాతులను గుర్తించి వారిని బీసీ కులాల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ కులాలను ఎవరూ గుర్తించలేదని ఆయనన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ కులాలు, సంచార జాతులు’పుస్తకాన్ని సీఎం శనివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. 30 సంచారజాతుల కులాలను బీసీ జాబితాలో చేర్చాల్సి వుందని జూలూరు పేర్కొనగా సీఎం వెంటనే స్పందించారు. సంచార జాతులను బీసీ కులాల్లో చేర్చే విషయంపై అధ్యయన బాధ్యతను రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించారు. బీసీ కులాల్లో సంచారజాతులకు సంబంధించిన అధ్యయనాన్ని సీఎస్‌తో మాట్లాడిన తర్వాత బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. బీసీ కులాలలో సారోల్లు, అర్వకోమటి, తోలుబొమ్మలాటవారు, కుల్లకడిగి, బైల్ కమ్మర, అహిర్, గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజికూటి వారు, శ్రీక్షత్రీయ రామజోగి, ఇనూటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారోళ్లు, ఓడ్, పాథం వారు, సాధనాశూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, కాకిపడగల, మందహెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలో చేర్చాల్సి ఉంది. బీసీలు, సంచార జాతుల కోసం నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, బీసీ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అధ్యయనాన్ని పుస్తకంలో జూలూరు పొందుపరిచారు. ప్రధానంగా సంచారజాతులకు కులాల పిల్లల విద్యాభ్యాసం కోసం ఏర్పాటు చేసిన 718 గురుకుల పాఠశాలల పురోభివృద్ధిని వివరించారు. సంచార కులాల పిల్లలు తొలిసారిగా బడిగడప తొక్కిన సందర్భాన్ని పుస్తకంలో ఆవిష్కరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేకే, వినోద్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
లెక్కలు తప్ప మొక్కలు లేవు: యెండల
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నాటామని చెబుతున్న మొక్కలు కాగితాల్లో తప్ప ఎక్కడా లేవని బీజేఎల్పీ మాజీ నేత యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 80 కోట్ల మొక్కలు నాటినట్టుగా ప్రభుత్వం లెక్కలు చెబుతోందని, దీని ప్రకారం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 65 వేల నుంచి 68 వేల మొక్కలు ఉండాలన్నారు. కానీ, ఏ గ్రామంలో ఇన్ని వేల మొక్కలు ఉన్నాయో చూపాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. కాగితాల్లో లెక్కలు తప్ప మొక్కలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. గ్రామజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ఎలా చెప్పుకుంటారని సీఎంని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని యెండల ప్రశ్నించారు. బీసీ జనగణన విషయంలో కోర్టు ప్రశ్నించే అవకాశముందని తెలిసినా నిర్దేశిత విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించలేదని విమర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎంతో కసరత్తు చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని, ఎన్నికలను వాయిదా వేయడానికి అన్ని రకాల కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు. రాష్ట్రంలో 12,751 గ్రామపంచాయతీలుంటే కేవలం 3,494 పంచాయతీలకే కార్యదర్శులున్నారని పేర్కొన్నారు. సచివాలయానికి రాని సీఎం గ్రామకార్యదర్శులతో ఎలా సమావేశమవుతారని ఎద్దేవా చేశారు. తక్షణమే గ్రామ కార్యదర్శుల నియామకాలు చేపట్టి, ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా రేష్మ రాథోర్ సినీనటి రేష్మరాథోర్ బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. నియామకపత్రాన్ని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌గౌడ్ అందజేశారు. ప్రధాని మోదీ చేపడుతున్న పథకాలు నచ్చడం వల్లే పార్టీలో చేరుతున్నట్టు ఆమె చెప్పారు. -
‘రైతు బీమా’ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతు శ్రేయస్తే తమ ధ్యేయమంటూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతు బీమా’ పథకం మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. ‘రైతు బంధు గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్’ పేరుతో పథకం అమలు చేయనుంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి అమలు కానున్న రైతు బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నారు. జీఎస్టీతో కలిపి ఏడాదికి 2,271 రూపాయలను రైతుల పేరిట ప్రభుత్వం జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ)కి చెల్లిస్తుంది. రైతు చనిపోతే నష్టపరిహారంగా 5 లక్షల రూపాయలను బీమా సంస్థ బాధిత కుటుంబానికి అందిస్తుంది. -
సమ్మెపై సస్పెన్స్!
-
దేశానికి ఆదర్శం టీఆర్ఎస్ ప్రభుత్వం
గుడిహత్నూర్ : దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ప్రభుత్వం మనదని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని సీతాగోంది జాతీయ రహదారి నుంచి మల్కాపూర్ మీదుగా మాలే బోరిగాం వరకు రూ.186 లక్షలు, మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు నుంచి దాజీతండా వరకు రూ.140 లక్షలతో ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించి చేపట్టనున్న బీటీ రోడ్లకు వీరు భూమి పూజ చేసి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం మునుపు ఎన్నడూ లేని విధంగా తీసుకొస్తున్న విప్లవాత్మక నిర్ణయాలు పథకాలు దేశంలో ప్రథమస్థానంలో నిలిచాయన్నారు. అన్ని సమాజిక వర్గాలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు ప్రజాదరణ పొందడమే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. అంతకు ముందు వీరు శిలాఫలకాలను ఆవిçష్కరించి పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు ఉయిక కమల, రాథోడ్ ప్రతాప్, ఏఎంసీ చైర్మన్ ఆడే శీల, ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, ఎంపీటీసీ లక్ష్మీ, రైతు సమితి మండల కన్వీనర్ కరాఢ్ బ్రహ్మానంద్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, సర్పె సోంబాయి, జాదవ్ రమేశ్, ఎండీ గఫార్, అబ్దుల్ గపార్, వామన్ గిత్తే, పాటిల్ రాందాస్, విలాస్ తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఘరానా మోసం..
సాక్షి, హైదారాబాద్: నగరంలో భారీ సైబర్ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్సైట్లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పార్టీలు మారినా పరిస్థితులు మారలే..
బచ్చన్నపేట: దేశాన్ని గత 70 సంవత్సరాలుగా వివిధ రకాల పార్టీలు పాలిస్తున్నా ప్రజల స్థితిగతులు, పరిస్థితులు మాత్రం మారడం లేదని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి శిక్షణ తరగుతులు జరిగాయి. ఈ శిక్షణ తగతులకు తమ్మినేని ముఖ్యఅతిథిగా, ప్రజానాట్య మండలి మాజీ రాష్ట్ర కార్యదర్శి పీఏ.దేవి, ప్రజా యుద్ధ నౌక గద్దర్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెల్ల సిద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు పాల్గొని మాట్లాడారు. పేదల హక్కులను కాపాడడానికి 70 సంవత్సరాలుగా ప్రజానాట్య మండలి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు. ఆనాడు దొరల పాలన విముక్తి కోసం నాట్య మండలి పని చేసినదని, నేడు ఈ ప్రభుత్వాల ఆడగాలను ఆపడానికి మళ్లీ ముందుకు వస్తుందని అన్నారు. తెలంగాణను ఏలుతున్న ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసింది ఏమీ లేదన్నారు. దేశంలో అశ్లీలత పెరిగి పోయిందన్నారు. ప్రభుత్వాల మోసాలను అరికట్టడానికి ప్రజానాట్య మండలి ముందుంటుందని అన్నారు. గద్దర్ ఆటాపాట... ప్రజానాట్య మండలి బహిరంగ సభలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన పాటలను అందరినీ అలరించినాయి. గద్దర్ గజ్జె కట్టి ఆడుతుంటే సభలో ఉన్న వారు అందరూ కోరస్ కలిపారు. కార్యక్రమంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా, రాష్ట్ర అధ్యక్షుడు వేముల ఆనంద్, నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మోకు కనకారెడ్డి, ఉడుత రవి, బొట్ల శ్రీనివాస్, మునిగల రమేష్, గొల్లపల్లి బాపురెడ్డి, మహబూబ్, సుధాకర్, నర్సింహా, వెంకటేష్, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
రైతుల అభివృద్ధికే ‘రైతుబంధు’ చెక్కులు
ఇంద్రవెల్లి : రైతుల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రైతుబంధు పథకం అమలు చేసి ఖరిఫ్‌లో ఎకరానికి రూ.4000 వేలు, రబిలో రూ.4000 అందిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. శుక్రవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం రెండో రోజు మండలంలోని కేస్లాపూర్, దన్నోర.కే, గట్టేపల్లి, ఇంద్రవెల్లి.కే రెవేన్యూ గ్రామల్లో చెక్కుల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేస్లాపూర్ గ్రామానికి సందర్శించి చేసిన చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వన్ని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎకరానికి రూ.4వేలు అందించడంతో పాటు కల్యాణలక్ష్మీ, పింఛన్ పథకం, కేసీఆర్ కిట్టు, ఇంటింటికి నల్ల తాగు నీటి సౌకర్యం కల్పిస్తున్నారని అన్నారు. ఆదేవిధంగా దన్నోర.కే గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కేంద్రాన్ని జిల్లా పర్యవేక్షకులు సుధాకర్‌రెడ్డి, పుల్లాయ్య సందర్శించి చెక్కుల పంపిణీ కార్యక్రమన్ని పరిశీలించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం వివరాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావ్, ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ శీవ్‌రాజ్, ఎంపీటీవో రమాకాంత్, జెడ్పిటీసీ సంగీత, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్‌రావ్, సర్పంచ్‌లు మెస్రం నాగ్నాథ్, జాధవ్ జముననాయక్, కోరెంగా గాంధారి, పెందోర్ అనుసూయ, మండల రైతు సమన్వయ కర్త తోడసం హరిదాస్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సుపీయన్, టీఆర్ఎస్ నాయకులు నగేష్, అంజద్ తదితరులున్నారు. టీఆర్ఎస్తోనే రైతులకు స్వర్ణయుగం ఖానాపూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని రైతుకు స్వర్ణయుగం రానుందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. శుక్రవారం మండలంలోని బీర్నంది, సోమర్‌పేట్‌తో పాటు పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హజరై మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా చూడడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. మేనిపెస్టోలో లేని కళ్యాణలక్ష్మీ, రైతుబంధు పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి సునీత, ఏఎంసీ చైర్మెన్ నల్ల శ్రీనివాస్, సర్పంచ్‌లు జక్కుల నవీన్‌యాదవ్, సుతారి రాజేశ్వర్, ఎంపీటీసీ దర్శనాల వెంకటేశ్, ఖానాపూర్, పెంబి టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, పుప్పాల శంకర్, మండల నోడల్ అధికారి విజయ్‌కుమార్, తహసీల్దార్ ఆరె నరేందర్, ఏడీఏ ఇబ్రహిం అనీఫ్, ఏవో ఆసం రవి, నాయకులు గోవింద్, పురంశెట్టి భూమేశ్, శ్రీదర్‌గౌడ్, అశోక్‌రావు, కిషన్, విక్రమ్‌నాయక్, ఎల్లయ్య, సుధాకర్ ఉన్నారు. -
రైతుబంధు కాదు.. రాబందు: దాసోజు
సాక్షి, హైదరాబాద్: రైతాంగాన్ని నాలుగేళ్లుగా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పేరిట హడావుడి చేస్తుండటం హాస్యాస్పదమని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం కేసీఆర్ రైతుబంధు కాదని, రైతు రాబందు అని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎకరానికి రూ.4 వేలు కాదని, రూ.40 వేలు ఇచ్చినా రైతుల ఉసురు కేసీఆర్‌కు తగలక మానదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాక 35 లక్షల పాస్ పుస్తకాలు బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. 4,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించని సీఎం ఇప్పుడు రైతుబంధు అంటూ వారిని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కోటి 24 లక్షల ఎకరాల సాగు భూమిని 45 లక్షల మంది రైతులు సాగు చేస్తుంటే.. కొత్తగా కోటి 39 లక్షల ఎకరాల్లో 58 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారని, వారందరికీ చెక్కులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, కొత్తగా 13 లక్షల మంది రైతులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారని ప్రశ్నించారు. వీరికి చెక్కుల రూపంలో వెళుతున్న రూ.600 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేటి నుంచే రైతు పాస్‌పుస్తకాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్ర రైతాంగానికి కొత్త పాస్‌పుస్తకాలు అందనున్నాయి. గురువారం నుంచి ఈనెల 19వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) గ్రామాల వారీగా ఈ పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పాస్‌పుస్తకాలను ఇప్పటికే క్షేత్రస్థాయికి తరలించిన రెవెన్యూ సిబ్బంది నేటి నుంచి ఈ పుస్తకాలను రైతులకు అందజేస్తారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలు, కౌంటర్లలో ఉదయం, సాయంత్రం వేళల్లో పాస్‌పుస్తకాల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 57.33 లక్షల పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, ఇందులో 4.8 లక్షల మంది రైతులు ఆధార్‌ను సమర్పించకపోవడంతో వారి పుస్తకాలను ముద్రించలేదు. దీంతో పాటు మరో 1.77 లక్షల మంది ఆధార్ ఇచ్చినప్పటికీ వారి ఫోటోలు సరిగా లేకపోవడంతో వాటిని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, ఫొటోలు సరిగా లేని రైతుల పాస్‌పుస్తకాలను తర్వాత ముద్రించి ఇస్తామని రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. 2016 జూన్ తర్వాత తొలిసారి వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016 సంవత్సరం నుంచి పాస్‌పుస్తకాల జారీ నిలిపివేశారు. మాజీ ఐఏఎస్ అధికారి రేమండ్‌పీటర్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా ఉన్న సమయంలో 2016 జూన్‌లో కొత్త పాస్‌పుస్తకాల జారీని నిలిపివేశారు. నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు తీసుకుంటున్నారని ఆర్బీఐ అధికారులు ఓ సమావేశంలో చెప్పడం, 17వేల కోట్ల రూపాయల రుణమాఫీలో రూ.1,700 కోట్లు నకిలీపాస్పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లోకి వెళ్లాయన్న నివేదికల నేపథ్యంలో రైతు పాస్‌పుస్తకాల జారీతో పాటు అప్పటికే ఉన్న పాస్‌పుస్తకాలు కూడా చెల్లవని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రమాణాలతో కొత్త పాస్‌పుస్తకాలు ముద్రించే బాధ్యతలను అప్పుడే మద్రాస్ ప్రింటింగ్ ప్రెస్‌కు అప్పగించారు. అయితే, సకాలంలో ఆ సంస్థ స్పందించలేదన్న కారణంతో ఎస్.కె.సిన్హా ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి పాస్‌పుస్తకాల ముద్రణ అనేక మలుపులు తిరిగి ఇప్పటికి ఓ కొలిక్కి చేరింది. దీంతో రైతులకు తెలంగాణ లోగోతో తొలిసారి పాస్‌పుస్తకాలు అందనున్నాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఈ పుస్తకంపై కాకతీయ కళాతోరణాన్ని కవర్‌పేజీపై ముద్రించారు. ‘తెలంగాణ ప్రభుత్వము, పట్టాదారు పాస్‌పుస్తకము, భూమి యాజమాన్య హక్కు పత్రం’అని రాసి ఉన్న ఈ పుస్తకాలను ఇప్పుడు రైతులకు అందజేయనున్నారు. మొత్తంమీద తమ భూములకు ఎట్టకేలకు కొత్త పాస్‌పుస్తకాలు వస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ: చాడ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. 3 రోజులపాటు మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు మంగళవారం ముగిశాయి. ఈ సమావేశం వివరాలను చాడ వివరించారు. టీఆర్ఎస్ పాలనపై ఉద్యోగులు, యువకులు, రైతులతోసహా అన్ని వర్గాలు ఆగ్రహం, అసంతృప్తితో ఉన్నాయ ని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ను, కేంద్రంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామిక, లౌకిక విశాల కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నయీం దోస్తులంతా ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారని చాడ ఆరోపించారు. ఆర్టీసీలో టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘమే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉందని, టీఎంయూ నేతృత్వంలోనే బస్‌భవన్‌ను ముట్టడించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీలతో చర్చిస్తున్నామన్నారు. జూన్ 2న అమరవీరుల ఆకాంక్ష దినం జరుపుతామని, గద్దర్, విమలక్కతో సహా కళాకారులతో ఆటపాటలు, ధూంధాం నిర్వహిస్తామన్నారు . -
కుంభకోణాలపై విచారణ జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: పాత కేసులను తిరగదోడటం కన్నా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై ముందు విచారణ జరిపించాలని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ఎంసెట్, మియాపూర్ భూముల కుంభకోణం, నయీం ఎన్కౌంటర్ స్కాం.. ఇలా చాలా స్కాములు వెలుగులోకి వచ్చాయని, వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాజకీయ ఎజెండాలో భాగంగానే కాంగ్రెస్ నేతలపై మళ్లీ కేసులు పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అమలవుతున్న సబ్సిడీ పథకాల్లో జరుగుతున్న కుంభకోణంపై విజిలెన్స్ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. విభజన చట్టం హామీలపై సుప్రీంకోర్టులో తాను వేసిన కేసు మూడోసారి విచారణకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు. విభజన హామీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేసులో ఇంప్లీడ్ కావాలని కోరారు. -
వారిని కాపాడటంలో తెలంగాణే ఫస్ట్: రేవంత్
సాక్షి, హైదరాబాద్: అవినీతిపరులను కాపాడటంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 2016లో సరైన సమాచారం లేదనే సాకుతో 125 మందిపై ఏసీబీ కేసులు ఉపసంహరించుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ నిమ్స్ వైద్యుడు శేషగిరిరావు, ఏసీపీ సంజీవరావులు రూ. కోట్లలో అవినీతికి పాల్పడినా వారిని కేసుల నుంచి తప్పించారని ఆరోపించారు. కేసీఆర్ బంధువర్గానికి చెందిన వారు ఎంత అవినీతికి పాల్పడ్డా వారిపై కేసులుండవని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆరే కమీషన్ తీసుకోమన్నారంటూ సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ వెల్లడించినా ఎందుకు విచారణ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ జరిపిన సమీక్షలో రాజకీయ కోణం కనపడుతోందని వ్యాఖ్యానించారు. -
రైతులను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: ఉత్తమ్
శాలిగౌరారం (నకిరేకల్): రైతులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం రామగిరికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చామల యాదగిరిరెడ్డి సంతాప సభకు ఉత్తమ్ హాజరై మాట్లాడారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో రైతుల ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కష్టాల్లో ఉన్న కర్షకులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు టీఆర్ఎస్ సర్కార్ కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు ఏ కష్టం రాకుండా వారి కళ్లలో సంతోషాన్ని చూడటమే ధ్యేయంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి నూక కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమాజ శ్రేయస్సే మీడియా లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: సమాజ శ్రేయస్సు, భావి తరాల ప్రగతి మీడియాకు అంతిమ లక్ష్యంగా ఉండాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆకాం క్షించారు. ప్రముఖ వ్యాపారవేత్త సి.ఎల్. రాజం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న ‘విజయక్రాంతి’దినపత్రికను హైదరాబాద్‌లో ని ఒక హోటల్లో శనివారం ఆయన ఆవిష్క రించారు. కార్యక్రమంలో గడ్కరీ సతీమణి కాంచన గడ్కరీ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారా యణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. నితిన్ గడ్కరీ మాట్లాడుతూ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, సాంకేతికరంగం వంటి ఎన్నో అంశాల్లో అభివృద్ధికి మీడియా పనిచే యాల్సి ఉందన్నారు. రాజకీయాలు ఒక్కటే మీడియా లక్ష్యం కాకూడదని, మిగిలిన చాలా అంశాల్లో ప్రగతి కోసం కృషి చేయాలన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడటానికి నిర్భయంగా, నిష్పక్షపాతంగా కొత్తపత్రిక వార్తలు రాయాలని కోరారు. పత్రికల ముడి సరుకు విదేశాల నుంచి దిగుమతి అవుతోంద న్నారు. దీనివల్ల దేశీయ మారకం విదేశాలకు తరలిపోవడంతోపాటు పత్రిక నిర్వహణ ఆర్థికభారంగా మారుతోందన్నారు. అనుకూలంగా రాసినవారికే ప్రకటనలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ చిన్న రాష్ట్రం లో ఇప్పటివరకు సుమారు రూ.వెయ్యి కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ అనుకూలంగా రాసిన వారికి ప్రభుత్వ ప్రకటనలిస్తూ, ఇవ్వనివారిని బెదిరిస్తూ అప్రజాస్వామిక చర్యలకు దిగారని ఆరోపిం చారు. అధికారంలో ఉన్నవారి బెదిరింపులకు మీడియా కూడా అనివార్యంగా లొంగిపోయి, ఏకపక్షంగా వార్తలు రాయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మీడియాపై నిర్బంధం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ మీడియాపై తీవ్రమైన నిర్బంధం తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రకటనలను నిలిపేయడం, ఇతర బెదిరింపులతో మీడియాను ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రిస్తోందని ఆరోపించారు. ఏ పత్రికలో ఏ వార్త రాయాలో ముఖ్యమంత్రి కార్యాల యమే ఆదేశిస్తోందని కోదండరాం ఆరోపించారు. విజయక్రాంతి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సి.ఎల్.రాజం మాట్లాడుతూ రాజకీయ పార్టీల కోసం కాకుండా ప్రజలు, ప్రజల కోసం పనిచేసే నాయకుల అండతో పత్రికను నడిపిస్తానని రాజం ప్రకటించారు. -
మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు
బాలానగర్ (జడ్చర్ల) : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ అన్నారు. బాలానగర్‌లోని జాతీయ రహదారి పక్కన మహ్మద్ నజీరొద్దీన్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో అదునాతన సదుపాయలతో నూతనంగా నిర్మించిన మసీద్‌ను సోమవారం ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మసీదుల అభివృద్ధితోపాటు, అందులో పనిచేసే గురువులకు జీతం ఇచ్చే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మసీద్ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు వాల్యానాయక్, ఇబ్రహిం, దాస్‌రాంనాయక్, గోపాల్‌రెడ్డి, గిరిజన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, మాజీ ఎంపీపీ నర్సింహులు, చెన్నారెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
నకిరేకల్ : టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఎమెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తుగ్లక్ లాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని అన్నారు. నకిరేకల్‌లోని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. ప్రజలపై అధికంగా భారం మోపుతూ రాజకీయ లబ్ధికోసం ఆరాటపడుతున్నారన్నారు. సాగు పెట్టుబడులకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కూడా రైతులను మోసం చేసేందుకేనన్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ భూస్వాములు, బడా కాంట్రాక్టర్లు బిల్డర్లు వేలాది భూములు కొనుగోలు చేశారన్నారు. వారిని బాగు చేసేందుకు ఎకరాకు ఏడాదికి రెండు దఫాలు పెట్టుబడి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు.వచ్చేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు. ప్రత్యేకించి 119 అసెంబ్లీ స్థానాల్లో నకిరేకల్ నుంచి రాబోయే 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్‌పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. తొలుత నకిరేకల్‌కు విచ్చేసిన రాజగోపాల్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘనస్వాగతం పలికారు. సమావేశంలో స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, కాంగ్రెస్‌మండల, పట్టణ అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, నడికుడి వెంకటేశ్వర్లు, మంగళపల్లి సర్పంచ్ ప్రగడపు నవీన్‌రావు, ఎంపీటీసీ గుర్రం గణేష్, నాయకులు చెల్ల కృష్ణారెడ్డి, మాదధనలక్ష్మి, పల్లె విజయ్, రాచకొండ సునీల్, మామిడి కాయల నాగయ్య, ఆరుట్ల శ్రవణ్ ఉన్నారు. -
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుత సీజన్లో రైతులు పండించిన చివరి గింజ వరకూ మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేశామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి ఈటల, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ గుండేటి ఐలయ్యతో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల తీరుపై ఆరా తీస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించాక గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగ సంక్షేమానికి సీఎం కేసీఆర్ సారథ్యంలో అద్భుత పథకాలకు రూపకల్పన జరుగుతోందన్నారు. రైతులు పంట సాగుకు పెట్టే పెట్టుబడి మొదలు ఆధునిక వ్యవసాయ పనిముట్లను రాయితీపై అందిస్తూ.. పంట దిగుబడులు వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర చెల్లించేది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. వరిధాన్యాన్ని ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొరుగు రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కొందరు రైస్‌మిల్లర్లు రూ.1620 నుంచి 1650 వరకు ధర చెల్లిస్తామంటూ గ్రామాల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోందన్నారు. అలాంటి వ్యాపారులు నాణ్యత సరిగా లేదంటూ తక్కువ ధర చెల్లించే అవకాశం ఉందని, వారితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ ద్వారా జరిగే క్రయ విక్రయాల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ అక్రమాలను నియంత్రిస్తున్నామన్నారు. అనేక పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అన్నదాత గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని ఎమ్మెల్యే దాసరి అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి పరితపిస్తున్న కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించాలన్న ఆశయసాధనకు అందరూ తోడ్పాటునందించాలన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు మంత్రి సాయంతో ముందుకు సాగుతామని మార్కెట్ చైర్మన్ ఐలయ్యయాదవ్ అన్నా రు. కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, మార్కెట్ వైస్ చైర్మన్ మాదారపు ఆంజనేయరావు, డైరెక్టర్లు జడల సురేందర్, రాజేందర్ పాల్గొన్నారు. -
ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వం
గుడిహత్నూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా మోసం చేస్తోందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని బెల్లూరిలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పల్లెపల్లెకు అనిల్ అన్న’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజల జీవితాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం సాధించుకున్నామన్న ఆనందం రాష్ట్ర ప్రజల్లో ఎక్కడా కన్పించడం లేదని, ప్రభుత్వ పాలన తీరుతో ప్రజలు విసుగెత్తి పోతున్నారన్నారు. అనవసర పథకాలు, కార్యక్రమాలు చేపట్టి ప్రజాధనాన్ని కొల్లగొడుతూ... కమీషన్ల ద్వారా సొంత బడ్జెట్ పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తమకు అర్హతలు ఉన్నప్పటికీ మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇవ్వడంలేదని గోడు వెల్లబోసుకున్నారు. ప్రతిపక్షాలైన మీరైనా న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమల్‌గౌడ్, మన్నూర్ పీఏసీఎస్ చైర్మన్ కేంద్రే వెంకట్రావ్, నాయకులు భీంరావ్ నాయక్, తెలంగే మాధవ్, దోమకొండ సుధాకర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
చెల్లని ‘బహిష్కరణ’
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఏ. సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ గత నెల 13న తెలంగాణ శాసనసభ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు సహజంగానే సంచలనం సృష్టించింది. ఆ శాసనసభ్యులిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్ స్థానాలు ఖాళీ అయినట్టు జారీ అయిన ప్రక టనను రద్దు చేయడంతోపాటు, వారి సభ్యత్వాలను కూడా హైకోర్టు పున రుద్ధరించింది. ఈ తీర్పు లోతుపాతులు, దాని పర్యవసానాలేమిటన్న విచికిత్స కన్నా ముందు హైకోర్టును ఒకందుకు అభినందించాలి. తమకు అన్యాయం జరి గిందని ఆశ్రయించిన శాసనసభ్యులకు సత్వర న్యాయం కలగజేయడానికి న్యాయ స్థానం కృషి చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణకు దారితీసిన పరిస్థితులు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్యప్రియులను కలవరపెట్టేవి. అసెంబ్లీ, శాసనమండలి ఉమ్మడి సమావేశాన్నుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అంతవరకూ అభ్యంతరపెట్టాల్సిందేమీ లేదు. రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలను గవర్నర్ ప్రసంగం విస్మరించిందనుకున్నప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం మామూలే. కానీ ఆనాటి నిరసన కట్టు తప్పింది. నిరసన వ్యక్తం చేస్తున్నవారివైపు నుంచి హెడ్ ఫోన్ సెట్ పడగా అది శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. దీన్ని అధికార టీఆర్ఎస్ తీవ్రంగా తీసుకుంది. ఆ మర్నాడు ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిసహా 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమా వేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడంతోపాటు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం అయింది. మన చట్టసభల్లో సర్వసాధారణంగా అధికార పక్షం ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతమాత్రాన ఏదైనా అనుకోవడం, దాన్ని అమలు చేయడానికి పూనుకోవడం సరైంది కాదు. ఏ నిర్ణయమైనా విచక్షణాయుతంగా ఉండాలి. హేతుబద్ధమైనదన్న భావన అందరిలో కలగాలి. ఇప్పుడు చట్టసభల కార్య కలాపాలు ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారు... ఎవరి ప్రవర్తనెలా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు హేతుబద్ధంగా ఉన్నారో, ఎవరు పిడివాదం చేస్తున్నారో సులభంగా విశ్లేషించుకుంటున్నారు. అందువల్ల చట్టసభల్లో చర్చలైనా, విమర్శలైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. సభ్యుల వ్యవహారశైలి హుందాగా ఉండాలి. సభ తీసుకునే నిర్ణయాలు సహే తుకంగా అనిపించాలి. బహిష్కరణ వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సభ్యులకు నోటీసులిచ్చి, వారి అభిప్రాయాలను కూడా వింటే ఉంటే వేరుగా ఉండేది. అలా జరగకపోవడంతో తమపై అకారణంగా బహిష్కరణ వేటు వేశారని కోమటిరెడ్డి, సంపత్‌లు చేస్తున్న ఆరోపణలకు విలువ పెరిగింది. స్వామి గౌడ్‌కు అసలు గాయమే కాలేదని వారు వాదిస్తున్నారు. ఆ ఫుటేజ్ ఉంటే బహి ర్గతం చేయమని సవాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జవాబు చెప్పకపోగా... హైకోర్టు అడిగినప్పుడు తత్తరపడటం, పరస్పర విరుద్ధమైన వాదనలు చేయడం... చివరకు అడ్వొకేట్ జనరల్ రాజీనామా బహిష్కృత ఎమ్మెల్యేల వాదనకు బలం చేకూర్చాయి. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఫుటేజ్ విడుదల చేస్తే తమ ఎమ్మెల్యే ప్రవర్తన ఎలా ఉన్నదో, దాని పర్యవసానమేమిటో జనం చూస్తారు. అంతిమంగా అది ప్రభుత్వానికే లాభిస్తుంది. ఫుటేజ్ విడుదలపై నిర్ణయించాల్సింది శాసనసభే తప్ప తాము కాదని ప్రభుత్వం చెప్పడం... సభేమో మౌనంగా ఉండిపోవడం ఎవరి ప్రతిష్టనూ పెంచదు. మన రాజ్యాంగం న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలకు పరిధుల్ని నిర్దేశించింది. ఒకదాని పరిధిలోకి మరొకటి జొరబడరాదని స్పష్టంగా చెప్పింది. అది వ్యవస్థల మధ్య సంఘర్షణను నివారించడానికి, రాజ్యాంగ పాలన సజావుగా సాగడానికే తప్ప ఆ పరిధులను చూపించి ఏ వ్యవస్థకా వ్యవస్థ తప్పించుకు తిరగడానికి కాదు. కానీ ఆచరణలో జరుగుతున్నది అదే. ఎలాంటి విమర్శలనైనా పట్టించుకోకుండా బండబారినట్టుండటం లేదా దబాయించడం కార్యనిర్వాహక వ్యవస్థ ఒక కళగా అభివృద్ధి చేసుకుంది. ఇక శాసనవ్యవస్థ తీరు విస్తుగొలిపేదిగా తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత నాలుగేళ్లకాలంలో జోరుగా సాగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఇందుకు నిదర్శనం. పార్టీ మారిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయొచ్చునని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా చెబుతున్నా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టనట్టు వ్యవహరిస్తారు. పార్టీల నుంచి ఫిర్యాదులంది ఏళ్లు గడుస్తున్నా వాటి సంగతి తేల్చరు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు కట్టబెడుతున్నా వారికేమీ అనిపించదు. చిత్రమేమంటే ఫిరాయింపు ఎంపీల విషయంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం మౌనంగా ఉండి పోతున్నారు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాల్లో స్పీకర్ల తీరు... ముఖ్యంగా ఉద్రి క్తతలు, గందరగోళస్థితి ఏర్పడినప్పుడు ఓపిగ్గా సభ్యులకు నచ్చజెప్పడం, ఉద్రిక్తతలు నివారించడం గమనిస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటివారికి ఫిరాయింపు జరిగిందో లేదో తేల్చడం ఎందుకంత కష్టమనిపిస్తున్నది? న్యాయవ్యవస్థ నిల దీసినప్పుడు దాన్ని జోక్యం చేసుకోవడంగా భావించే శాసనవ్యవస్థ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నట్టు? పరిధుల గురించి, అధికారాల గురించి, తమ స్వతంత్రత గురించి పట్టుబట్టే వ్యవస్థలు... అవి రాజ్యాంగం ద్వారా సంక్ర మించాయే తప్ప గాల్లోంచి ఊడిపడలేదని గుర్తించాలి. వాటి సారాంశం ప్రజా స్వామిక వ్యవస్థ పటిష్టతేనని తెలుసుకోవాలి. ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. సామాన్యులకే సహేతుకమనిపించని నిర్ణయాలు తీసుకుని లేదా నిర్ణయరాహి త్యాన్ని ప్రదర్శించి తమనెవరూ ప్రశ్నించవద్దంటే చెల్లదు. -
రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోంది : కోదండరాం
సాక్షి, సిరిసిల్లా : రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం రాజన్న సిరసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన చంద్రశేఖర్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు భూకబ్జాలు, ఇసుక మాఫియా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో టీజేఎస్ ఎవరితోను పొత్తు పెట్టుకోదని, స్వతంత్రంగా ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ప్రభుత్వం ప్రజలు, రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని కోదండరాం విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని.. ఆ భయంతోనే టీజేఎస్ సభలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే సహించలేదని, అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. -
అభివృద్ధిని చూసే పార్టీలోకి..
ఆసిఫాబాద్‌క్రైం : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తమ పార్టీలోకి వస్తున్నారని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో వాంకిడి మండలంలోని కనర్గాం గ్రామానికి చెందిన ప్రజలను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విధానాలు మెచ్చి పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని వాపోయారు. గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు, రెబ్బన ఎంపీపీ సంజీవ్, ఎంపీటీసీ రవీందర్, నాయకులు గాదవేణి మల్లేశ్, సుదర్శన్‌గౌడ్, జాడి రేణుక బాయి, రాజు బాయి, నందు, కిరణ్, జీవన్ తదితరులున్నారు. -
పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు
సాక్షి, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా జనగామ పోరుగడ్డ నుంచే పోరాటం మొదలు పెడతామని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతామన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకవైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం మాత్రం రైతులు ఆనందంగా ఉంటున్నారని చెప్పడం దారణమన్నారు. రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో పెంబర్తి రైతులను వచ్చి అడగాలన్నారు. భూములు లేని వారిని రైతు సమన్వయ సమితుల్లో నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లోనే రూ.14వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేయడంతో పాటు.. సక్రమంగా చెల్లించిన రైతులకు రూ.5వేల చొప్పున ప్రోత్సాహకం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పెట్టుబడి పథకంలో కౌలు రైతులకు అవకాశం కల్పించక పోవడం సిగ్గుచేటన్నారు. జనగామ నియోజకవర్గంలోని ఆదర్శరైతులతో సమావేశమై రైతుల సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. అనంతరం వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, ఎండీ అన్వర్, రంగరాజు ప్రవీణ్‌కుమార్, కొత్త కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, మేడ శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, ఎండీ నాజీజ్, క్రాంతికుమార్, నాంపల్లి చందన, లింగాజీ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ది నిరంకుశ పాలన
రాజేంద్రనగర్: రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలన కొనసాగిస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ విమర్శించారు. శివరాంపల్లి నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా శివరాంపల్లి చౌరస్తాలో ఆ పార్టీ జెండా ఎగురవేసి స్థానిక బస్తీ ల్లో పర్యటించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ప్రజల స్వేచ్ఛను టీఆర్ఎస్ అణచివేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ధర్నాలు, నిరసన కార్యక్రమాలను ఏ ప్రభుత్వాలు ఆటంకం సృష్టించవన్నారు. కానీ టీఆర్ఎస్ ధర్నాచౌక్‌తో పాటు ప్రతిపక్షాల ధర్నాలు, నిరసన కార్యక్రమాలను అడ్డుకుంటూ నేతలను ముందస్తుగా అరెస్ట్‌లు చేసి భయాం దోళన సృష్టిస్తుందని మండిపడ్డారు. 12 వందల మంది విద్యార్థుల త్యా గంతో రాష్ట్రం సిద్ధించిందని, నేటికీ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు మ్యాడం రామేశ్వర్రావు, ఆర్. గణేష్‌గుప్తా, కృష్ణాగౌడ్, రాజ్‌కుమార్, వెంకటేష్, శ్రీనివాస్‌రెడ్డి, శ్యామల, బాల్‌రాజ్, రాజు పాల్గొన్నారు. -
ప్రభుత్వం వారిని మోసం చేస్తోంది...
సాక్షి, హైదరాబాద్: రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు.ఆయన బుధవారం విలేకరులు సమావేశంలో మట్లాడుతూ... ‘తమ బాకీ తీర్చకుంటే దుబ్బాకలో రైతులపై చర్యలు తీసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరిస్తున్నారు. సీఎం మాట నమ్మి రుణమాఫీ అవుతుందని రైతులు సంబరపడ్డారు. కానీ వారిని ప్రభుత్వం మోసం చేసింది.’ అని ఆరోపించారు. కేసీఆర్ సొంతూరుకు కూతవేటు దూరంలో ఉన్న రైతులే అరిగోస పడుతున్నారని.. ఇక రాష్ట్రంలో మిగతా రైతుల పరిస్థితేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు మేలు కోరని ప్రభుత్వం.. రైతులకు మేలు చేసే ఉద్దేశముంటే ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేసి... రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి రైతుల రుణ సమస్యలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ రైతులతో కలిసి బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 23న ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. రైతుబీమాపై లేని ధీమా.. ‘రైతుబీమా’ పథకంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. 40లక్షల రైతుల బీమాకు రూ.1200 కోట్లు అవసరం. కానీ రూ.500 కోట్లతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో ఎక్కడా నిరశనలు, దర్నాలు చేయకుండా అడ్డకుంటున్నకేసీఆర్.. ఆయన మాత్రం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దర్నా చేస్తాడట’ అని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికలపై తెలంగాణలో బీజేపీ స్టాండ్ ఏమిటన్నది రేపు వెల్లడిస్తామన్నారు. -
ఎమర్జెన్సీని తలపించేలా కేసీఆర్ పాలన
సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ సాధనలో ప్రభుత్వతీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేదని శాసనసభలో బీజేపీ పక్షనేత జి.కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులతో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలిపే పరిస్థితులు లేవు. కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల్లో ప్రభుత్వంపై తీవ్ర నిరాశ, బాధ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కాళ్లకు ఇనుప సంకెళ్లు వేశారు. ఇప్పుడు రైతుల చేతులకు బంగారు సంకెళ్లు వేస్తున్నారు. వర్గీకరణపై పోరాడిన మంద కృష్ణను రెండుసార్లు జైలుకు పంపారు. మీడియా గొంతు నొక్కేస్తున్నారు. కలాలకు, కళాకారులకు సంకెళ్లు వేస్తున్నారు. ఇలా చేసి బంగారు తెలంగాణ సాధిస్తారా?’అని ప్రశ్నించారు. నేతల భాషపైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. రైతులకు పావలా వడ్డీకి రుణాలివ్వాల్సిన అవసరం ఉందని, ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు అరకొర నిధులతో పనులు జరగక ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి: ఆర్.కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందని, దీనిపై అధికారులతో చర్చించి వీలై నంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
పాలమూరుపై సవతి తల్లి ప్రేమ
కొల్లాపూర్: పాలమూరు జిల్లాపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా సీపీఐ పార్టీ ప్రథమ మహాసభలు సోమవారం కొల్లాపూర్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో సీపీఐ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీశ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో సంఘ్‌పరివార్ శక్తుల హింస ప్రజ్వరిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదన్నారు. ఇక తెలంగాణలో దొంగల రాజ్యం.. దోపిడీ పాలన కొనసాగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై లేదన్నారు. మూడేళ్ల క్రితం సీపీఐ పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తిచేయాలని సీఎంకు లేఖ రాసినా పూర్తి చేయలేదన్నారు. ఆంధ్రోళ్ల పాలనలో మనకు ఉద్యోగాలు వస్తలేవు అన్న కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎకరాకు రూ.4వేలు పెట్టుబడి ఇస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్.. పంటకు ఎందుకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదో చెప్పాలన్నారు. అమావాస్య చీకటిలో ఉన్నారు.. కమ్యూనిస్టుల పని అయిపోయిందని మోదీ, కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్టులు అమావాస్య చీకట్లో ఉన్నారని, త్వరలోనే పున్నమి వెలుగుల్లోకి వస్తామన్నారు. విడిపోయి పడిపోయామని, చీలిపోయి చితికిపోయామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. కమ్యూనిస్టులు ప్రజల గొంతుకగా ఉంటారన్నారు. రాజీలేని పోరాటం ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ విధానాలు అవలంభిస్తున్నాయన్నారు. కమ్యూనిస్టులు ప్రజలపక్షాన పోరాటాలు చేయాలన్నారు. సభలో సీపీఐ రాష్ట్ర నాయకులు ఈర్లనర్సింహా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌నర్సింహ ప్రసంగించారు. సభలో నాయకులు ఆనంద్జీ, ఫయాజ్, కేశవులు, వార్ల వెంకటయ్య, కొమ్ము భరత్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం సహకారంతోనే 24 గంటల విద్యుత్
ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు ధర్మపురి అరవింద్ చేపట్టిన పాదయాత్రను రెండోరోజు మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ ప్రారంభించి మాట్లాడారు. రైతులకు, పరిశ్రమలకు, వాణిజ్యా సంస్థల కోసం 765 కేవీ విద్యుత్ లైన్‌ను జార్ఖండ్ నుంచి డిచ్పల్లి వరకు తేవడం జరిగిందని తెలిపారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం కేంద్రం రాయితీలు ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.4కు యూనిట్ కరెంట్ ఒప్పందం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 చొప్పున ఆగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ఇప్పటికే 24 గంటల విద్యుత్‌ను 19 రాష్ట్రాలకు ఇస్తున్నాయని చెప్పారు. 10 కోట్ల ఎల్ఈడీ బల్బులను కూడా కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర పరిధిలో మూసివేసి ఉన్న కర్మాగారాలను తెరిపించడం జరిగిందని తెలిపారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్ రైతులను దగా చేశారని ఆరోపించారు. మూసివేసిన చక్కెర కర్మాగారాలను తెరిచే వరకు ఉద్యమాలు, పోరాటాలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2.72 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.825 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ.770 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి 4442 ఇళ్లు మాత్రమే నిర్మించారని వివరించారు. పాదయాత్రను ప్రారంభించే ముందు చెరుకు రైతులు, ఉత్పత్తిదారు ల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి ఆశీర్వాదాన్ని ధర్మపురి అరవింద్ తీసుకున్నారు. వర్షకొండ గ్రామంలో మహిళలు, రైతులు బీజేపీ నాయకులు పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలానికి పాదయాత్ర చేరుకుంది. స్థానిక నాయకులు ఆరవింద్, యెండల లక్ష్మీనారాయణకు వీడ్కొలు పలికారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు బాజోజి భాస్కర్, నాయకులు రాజారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బత్తుల శ్రీనివాస్, చిన్నారెడ్డి, చంద్రాగౌడ్, పెద్దబోయిన రమేశ్ పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే..
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ ఓయూ విద్యార్థుల త్యాగ ఫలితంగానే వచ్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం రోజుకో విద్యార్థి తమ ప్రాణాలు త్యాగం చేశారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ పరంగా నిరుద్యోగ సమస్య పునరావృతం అవుతోందే తప్ప ఉగ్యోగ ఖాళీలు మాత్రం భర్తీ కావడం లేదన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్, టీఆర్ఎస్ యువత రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. ఫీజు బకాయిలు చెల్లించలేక యువత చదువులు మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందలాది డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడటానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. గత నాలుగేళ్లలో కేవలం 16వేల ఉద్యోగాలను భర్తీ చేశారని తెలిపారు. నిర్దిష్టమైన ఉద్యోగుల క్యాలెండర్ ప్రకటించాలని లేకపోతే అసెంబ్లీ సమావేశాలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు. ప్రజలంతా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నారు: మురళీధరావు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అధికార టీఆర్ఎస్కు వ్యతిరేఖంగా ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరావు అన్నారు. నిరుద్యోగులంతా టీఆర్ఎస్కు వ్యతిరేక ఉద్యమంలో పనిచేయబోతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లా, మండలం, గ్రామంలో విద్యార్థులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నరన్నారు. కేంద్రం ప్రతి సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ముద్రయోజన ద్వారా స్వయం ఉపాధి కల్పించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని వెల్లడించారు. త్వరలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేపీ యువ మోర్చా నగారా మోగించిందని ప్రకటించారు. దేశంలో బీజేపీని ఎదిరించిన వ్యక్తిలేడని మురళీధర్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని, త్వరలో ఎన్నికలు జరగనున్న మేఘాలయ, త్రిపురలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. సనత్‌నగర్‌లోనే కాదు తెలంగాణలోను అధికారంలోకి వస్తామని తెలిపారు. యువత నిరుత్సాహంలో ఉంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణ యువత ఉద్యోగాలు లేక నిరుత్సాహంతో ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్ష ఇరవై వేల ఉద్యోగాలు ఖాళీలున్నాయని కానీ నాలుగేళ్లలో భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఐటీ కంపెనీలు వస్తున్నాయంటే కేవలం కేంద్రం కృషి వల్లేనని, ఇందులో రాష్ట్ర గొప్పతనం ఏమాత్రం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీ యువతకు అండగా ఉంటుందని రామచంద్రరావు తెలిపారు. -
త్వరలో రేవంత్ పాదయాత్ర
సాక్షి, వికారాబాద్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి త్వరలో పాదయాత్ర చేయనున్నారు. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొడంగల్ నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు యాత్ర కొనసాగే అవకాశముంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. పెండింగ్‌లో రైల్వే లైన్... వికారాబాద్–కృష్ణా రైల్వే లైన్ కోసం యూపీఏ హయాంలో సర్వే నిర్వహించారు. ఇందుకు రూ.750 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.375 కోట్ల చొప్పున భరించాలి. ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం తన వాటాగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్రానికి ఫైలును పంపలేదు. దీంతో అది పెండింగ్‌లోనే ఉంది. అది పూర్తయితే వికారాబాద్ నుంచి నస్కల్, పరిగి, దోమ, దాదాపూర్, కోస్గి, నారాయణ పేట్, మక్తల్ వరకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. కొడంగల్ సిమెంట్ ఫ్యాక్టరీకి గత ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నియోజకవర్గంలో సున్నపు నిక్షేపాలు, గనులు అధికంగా ఉన్నాయి. రైల్వే లైన్ వేస్తే సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటయ్యే అవకాశముంది. ఎత్తిపోతలకు జీవో జారీ చేసినా.. : నారాయణపేట్–కొడంగల్ ఎత్తిపోతల పథకం మక్తల్ మం డలం భూత్పూర్ వద్ద నిర్మించడానికి జీవో 69ను జారీ చేశారు. 8.5 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు రూ.1,453 కోట్లతో నిర్మించడానికి రిటైర్డ్ ఇంజనీర్లు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది. రోజు 15 కి.మీ. యాత్ర.. కొడంగల్–హైదరాబాద్ మధ్య దూరం 120 కి.మీ. ఉంటుంది. రోజూ 15 కి.మీ. పాదయాత్ర చేసే అవకాశముంది. కొడంగల్, బొంరాస్‌పేట్, పరిగి, నస్కల్ మీదుగా వికారాబాద్ చేరుకుంటారు. కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చి మన్నెగూడ, రంగారెడ్డి జిల్లాలోని చిట్టెంపల్లిచౌరస్తా, చేవెళ్ల, మొయినాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. -
తెలంగాణ బీజేపీలోకి చేరికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో చేరికలు కొనసాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ మాదిగ విద్యార్థి జేఏసీ చైర్మన్ గద్దల అంజిబాబు బీజేపీలో చేరినట్టు చెప్పారు. బీజేపీ ద్వారానే దళితులకు సామాజిక న్యాయం లభిస్తుందన్న నమ్మకంతో విద్యార్థి నేత గద్దల అంజిబాబు పార్టీలో చేరారని తెలిపారు. మంగళవారం సత్తుపల్లిలో టీఆర్ఎస్కు చెందిన దళిత నేత రామలింగేశ్వరరావు బీజేపీలో చేరినట్టు వివరించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యంపై అసంతృప్తితోనే దళిత నేతలు కమలదళంలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీల ఎబీసీడీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం బీజేపీనే అని అన్నారు. -
‘న్యాయం చేయకపోతే.. తీవ్ర పరిణామాలు’
సాక్షి, నల్లగొండ: కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ న్యాయం చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండలో జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ సంతాప సభలో ఆయన మాట్లాడారు. సీఎంకు తొత్తులుగా ఉన్న అధికారులకు ఈ వేదిక ద్వారా హెచ్చరికలు పంపుతున్నామని, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్త ఊరుకోమని అన్నారు. ఒక బీసీ నాయకుడు హత్యకు గురైతే సీఎంకు కనీసం విచారం వ్యక్తం చేసే తీరిక లేకపోవడం దారుణమన్నారు. జిల్లా మంత్రికి ఈ కేసులో భాగస్వామ్యం ఉంది కాబట్టే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాప్ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. హత్య కేసులో ఎందుకు కాల్ డేటా బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఈ హత్య కేసులో నిందితులను కాపాడే అవసరం ఎవరికి ఉందని, నిందితులకు ఐదురోజుల్లోనే బెయిల్ వచ్చిందని అన్నారు. స్థానిక పోలీసుల మీద శ్రీనివాస్ కుటుంబానికి ప్రజలకు నమ్మకం లేదని, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలన్నారు. ఈ హత్య నేపథ్యంలో బడుగు, బలహీనులకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో రాష్ట్రపతికి వివరించబోతున్నామని చెప్పారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను అణిచివేస్తామన్నారు. అధికార పార్టీ నేతలు అహంకారంతో జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస్ హత్యతో ప్రభుత్వం ప్రతిష్టను దిగజారిందన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ నేతలంతా ఐక్యమత్యంతో ఉన్నారనడానికి శ్రీనివాస్ సంతాప సభ సంకేతమే పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యపై ముఖ్యమంత్రిని అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు. -
ఇది ప్రజావ్యతిరేక పాలన
మొయినాబాద్(చేవెళ్ల): ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం మాజీ హోంమంత్రి సబితారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో జనాన్ని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పథకాల పేరుచెప్పి పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని.. ఈక్రమంలోనే అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరినవారిలో టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు శ్రీనివాస్, జలీల్, లింగంగౌడ్, నరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మహేష్, సాజిద్, ముస్తాఫా, జె.రాజేందర్, భిక్షపతి, రవి, రాజేందర్, యాదగిరి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహ్మారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఎంపీటీసీ సబ్యుడు మాధవరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు మక్బుల్, నాయకులు ప్రేంకుమార్, జంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జకరయ్య, రాములు, నాగేంద్రస్వామి, వినయ్, వడ్డె రాజు, మహేందర్, టి.రాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో నల్లవెల్లి గ్రామస్తుల చేరిక ఇబ్రహీంపట్నంరూరల్: రాహుల్‌గాంధీ నాయకత్వం దేశానికి అనుసరనీయమని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ అన్నారు. ఆదివారం యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 50మంది యువకులు ఆ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుబ్బాని ఆధ్వర్యంలో క్యామ మల్లేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మల్లేష్, భాష, శ్రీశైలం, శ్రీనివాస్, నాయకులు దండెం రాంరెడ్డి, శంకర్‌గౌడ్, శివకుమార్, రాంరెడ్డి, మంకాల దాసు, మల్లేష్, సిద్దంకి కృష్ణారెడ్డి, బాలశివుడు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘సమన్వయం’ ఎప్పుడు?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : రైతుకు పెట్టుబడి పథకంపై ప్రభుత్వం కసరత్తులో మునిగింది. వచ్చే ఖరీఫ్‌నుంచి ఎకరాకు రూ.4 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో గ్రామాల వారీగా రైతుల జాబితాను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. రైతు పెట్టుబడి పథకం, పండించిన పంటలకు మద్దతు ధర, విత్తనాలు, ఎరువులు ఇలా వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాలపై వచ్చే ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సమీక్షల మీద సమీక్షలతో స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే రైతులకు సహకారం అందించడంలో గ్రామాల్లోని రైతు సమన్వయ సమితులు, అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. జిల్లాలో 561 రెవె న్యూ గ్రామాల్లో ఇప్పటివరకు రైతు సమన్వయ సమితులు ఏర్పడ్డాయి. ఎప్పుడో సమన్వయ సమితులు ఏర్పడినా ఇప్పటివరకు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో గ్రామస్థాయిలో సమన్వయ సమి తుల బాధ్యులు మాత్రం .. ఎప్పు డు ‘సమన్వయం’అంటూ నైరాశ్యంలో ఉన్నారు. గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే బ్రేక్ భూ ప్రక్షాళన నుంచే రైతు సమన్వయ సమితులు కీలకం కానున్నాయని ప్రభుత్వం ప్రకటించినా చాలా గ్రామాల్లో ఈ కమిటీలు నామమాత్రంగా మారాయి. రాష్ట్రస్థాయిలో చైర్మన్ నియామకం కాకపోవడం, విధివిధానాలు ఖరారు కాకపోవడంతో గ్రామస్థాయి సమితుల ఏర్పాటుతోనే వీటి కి బ్రేక్ పడింది. గ్రామస్థాయిలో చైర్మన్లను ఎన్నుకోవడంతోపాటు మండల, జిల్లా స్థాయిలో సభ్యులు, చైర్మన్లను నియమించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల నుంచి చివరకు రాష్ట్రస్థాయి చైర్మన్ ఎంపిక జరగనుంది. గ్రామస్థాయి చైర్మన్ల ఎంపికతోనే ఈ ప్రక్రియను సరిపెట్టారు. ఇన్నిరోజుల నిలిచిపోయిన రైతు సమన్వయ సమితుల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు పూర్తి చేయాలని భవిస్తోంది. వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం అమలు చేస్తుండడం, రానున్న ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు తదితర వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ పథకాల్లో గ్రామ స్థాయి సమితులకు కీలకం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పెట్టుబడి పథకం రైతులకు సరిగ్గా అందుతుందా..? లేదా..? అన్నది పరిశీలించడానికి అధికారులతో పాటు ఈ సమితుల బాధ్యులకు కూడా పరిశీ లించే బాధ్యతలను అప్పగించనుంది. జిల్లాలో మొత్తం 563 రెవెన్యూ గ్రామాలుంటే 561 గ్రామాలకు అధికారికంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. గ్రామస్థాయిలో వీరు భూ ప్రక్షాళనలో క్రియాశీలకంగా పాల్గొనలేదు. ప్రభుత్వంనుంచి ఈ సమితులకు సంబంధించి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ప్రభుత్వ దూకుడు చూసి సమన్వయ బాధ్యతలు ఇకనైనా ఉంటా యా..? అని గ్రామాల్లో ఎంపికైన సమన్వయ సమితుల చైర్మన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆశావహుల ఎదురుచూపు .. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు మరోవైపు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేద్దామనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. రైతు సమన్వయ సమితి చైర్మన్లుగా ఎంపికైనవారు.. ప్రభుత్వం బాధ్యతలు ఇస్తే సర్పంచ్ ఎన్నికల పోటీ బరినుంచి తప్పుకోవాలనుకుంటున్నారు. ఇక అధికార పార్టీ మండలస్థాయి నేతలు మాత్రం మండల సమితి చైర్మన్ల కోసం పోటీ పడుతున్నారు. జిలాస్థాయి చైర్మన్లపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకున్నా ఈ పదవికి కూడా ఆ పార్టీలోని నేతలు సై అంటున్నారు. ఎవరికివారు తమకు ఈ పదవులు కావాలని ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలకు చెప్పారు. రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ ఏర్పడడం, దీనికి నిధులు కూడా భారీ ఎత్తున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో మండల, జిల్లాస్థాయి చైర్మన్ పదవులకు ఆశావహుల జాబితా పెరుగుతోంది. -
లేకపోతే ఆబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తా..!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగిన విషయం వాస్తవమని, దీనిని ఆధారాలతో సహా నిరూపిస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అవినీతిపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాను చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించలేకపోతే.. అబిడ్స్ సెంటర్లో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు రావాలంటూ టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన నేపథ్యంలో శుక్రవారం రేవంత్‌రెడ్డి గన్‌పార్కు వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సంపత్ కుమార్, నాయకులు కార్తీక్ రెడ్డి, రవీంద్ర నాయక్, జంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అవినీతి వాస్తవం! విభజన సమయంలో తెలంగాణకు 53.89శాతం విద్యుత్ కేటాయింపు ఘనత సోనియాదేనని రేవంత్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ఈ విషయమై చర్చకు వస్తామని టీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, భాను ప్రసాద్ సవాల్ విసిరారని, కానీ చర్చకు మేం సిద్ధమని చెప్పాగానే, టీఆర్ఎస్ నేతలు తోకమూడిచారని విమర్శించారు. 'నా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు. పోలవరం కడితే రక్తం ఏరులై పారుతుందని కేసీఆర్ అన్నారు. తర్వాత తన బినామీ సంస్థ ఎస్ఈడబ్ల్యూ కు ఆ ప్రాజెక్టు ఇప్పించుకున్నారు. ఆ సంస్థ నుంచి నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. దాన్ని నేనే బయటకు తీశా.. దాంతో టెండర్ రద్దు చేశారు. అదీ తెలంగాణ పట్ల నా విశ్వసనీయత. నా విశ్వసనీయత ఏమిటో కేసీఆర్, ఆయన కుటుంబాన్ని అడగాలి. ఎవరి విశ్వసనీయత ఏమిటో అమరవీరుల కుటుంబాలు, ఓయూ విద్యార్థులను అడుగుదాం' అని రేవంత్ విరుచుకుపడ్డారు. 'పోలీసు రక్షణ లేకుండా కేసీఆర్ వస్తారా? దళితుడ్ని సీఎం చేస్తానన్నావు. సోనియా కాళ్లు మొక్కి పార్టీ విలీనం చేస్తానన్నావు. ఇదేనా విశ్వసనీయత అంటే?' అని రేవంత్ ప్రశ్నించారు. -
మహిళల అభ్యున్నతే ధ్యేయం
జైనథ్(ఆదిలాబాద్): మహిళల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని 260 మంది మహిళలకు దళితబస్తీ పెట్టుబడి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద దళితులను రైతులుగా మార్చడమే లక్ష్యంగా దళితబస్తీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పెట్టుబడి ఖర్చుతోపాటు భూమి అభివృద్ధి, సాగునీటి సౌకర్యాల కల్పనకు నిధులు అందిస్తున్నామని అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 1500 ఎకరాలు అందించామని, త్వరలో మరో వెయ్యి ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ కంటే ముందు మే 15 వరకు ఖరీఫ్ కోసం ఎకరానికి రూ.4వేలు రూపాయల పెట్టుబడి ఖర్చును ప్రభుత్వం చెక్కుల రూపంలో అందిస్తుందని తెలిపారు. రబీలో పంటలు వేసుకున్న రైతులకు సైతం ఎకరానికి రూ.4 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని, గ్రామాల్లో క్లస్టర్ వారీగా మట్టి పరీక్షలు చేసే మినీ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. త్వరలో క్లస్టర్‌కు ఒక రైతు భవనం నిర్మించి, రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు శాశ్వత వేదికలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఇరవై ఏళ్లు కొనసాగుతారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అనంతరం దళితబస్తీ లబ్ధిదారులకు పెట్టుబడి ఖర్చు చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, బేల ఎంపీపీ రఘుకుల్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సర్సన్ లింగారెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ ఎల్టి భూమారెడ్డి, వైస్ ఎంపీపీ రోకండ్ల సురేశ్రావు, నాయకులు గంబీర్ ఠాక్రే, గడ్డ పోతరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎడ్లబండెక్కిన మంత్రి మంత్రి జోగు రామన్న గురువారం ఎడ్లబండిపై మార్కుట్‌యార్డుకు చేరుకున్నారు. ఎప్పుడూ కారులో తిరిగే మంత్రి బండెక్కి నడపడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. తాను ఒకప్పుడు స్వయంగా తన భార్యతో కలిసి చేనులో పని చేసిన రైతు బిడ్డనని, చాలా రోజుల తర్వాత ఎడ్లబండి నడపడం సంతోషంగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఘనంగా సన్మానం మంత్రి రామన్నను ఆయా మండలాల్లోని దళితబస్తీ లబ్ధిదారులు, మహిళలు ఘనంగా సన్మానించారు. తమ భూముల్లో బోర్లు, బావులు వేసుకునేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు. భూమి చదును చేసుకోవడానికి డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు. -
సత్రం భోజనం.. పెద్దారెడ్డి రికమండేషన్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల ముసుగులో టీఆర్ఎస్ సర్కారు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం అక్రమాలకు తెర తీసిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో అత్యంత అవినీతి దాగుందన్నారు. విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లపై శ్వేతపత్ర విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘డిస్ట్రిబ్యూషన్లకు ఐఏఎస్‌లను కాకుండా, కేసీఆర్ సన్నిహితులను నియమించుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఆయనతో చర్చకు కాంగ్రెస్ సిద్ధం. గోల్మాల్ ఒప్పందాలతో ఒక సంస్థకు ప్రభుత్వం రూ. 957 కోట్లు చెల్లించింది నిజం కాదా? కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్‌లు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్‌లను తప్పించింది వాస్తవం కాదా? ప్రభుత్వం ఐఏఎస్‌ల స్థానంలో అర్హతలేని అధికారులను నియమించడం ద్వారా తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్మాల్ ఒప్పందాలే. నాడు కాంగ్రెస్ ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా నేడు మిగులు విద్యుత్ సాధ్యమైంది. విద్యుత్ మిగులు, సరఫరాలో కేసీఆర్ సాధించింది శూన్యం. ఏపీలో అదనపు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? తెలంగాణలో విద్యుత్ సరఫరా చూస్తుంటే.. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్లుంద’ని రేవంత్ ఎద్దేవా చేశారు. నీ బతుకెంటో తెలుసుకో.. కాంగ్రెస్ పార్టీని తిడుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ముందు తన బతుకేంటో తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారంటే తాము నమ్మలేమన్నారు. గతంలో నకిలీ అవార్డులు తీసున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంకు ఉందని ఆరోపించారు. ఉత్తమ్‌కు అభినందనలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రేవంత్ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. -
యాదాద్రిలో గాడి తప్పిన పాలన..!
యాదాద్రి దేవస్థానంలో పాలన గాడి తప్పింది. తప్పులపై తప్పులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రిటైర్డ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావడం అధికారుల అలసత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రిలో అధికారుల పనితీరును చూసి భక్తులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. యాదగిరికొండ (ఆలేరు) : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోట్లు వెచ్చించి ఆలయాన్ని దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇక్కడి అధికార యంత్రాంగం మాత్రం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ విరమణ పొందినా.. దేవస్థానంలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి గత సెప్టెంబర్‌లో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే సంబంధిత సెక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రిటైర్డ్ ఉద్యోగి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రెండు నెలల వేతనం జమ అయ్యింది. ఇటీవల గుర్తించిన సదరు విభాగం అధికారులు సదరు రిటైర్డ్ ఉద్యోగిని పిలిపించి వేతన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా అతడు నిరాకరించడంతో విషయం కాస్తా బయటికి పొక్కింది. గతంలోనూ.. ఇలాంటి ఘటనలు దేవస్థానంలో కొత్తేమి కాదని గత రికార్డులు పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. గతంలో దేవస్థానంలో స్వీపర్‌గా పనిచేసిన ఉద్యోగి ఖాతాలో కూడా ఆరు నెలల వేతనం జమ అయింది. అదే విధంగా మరో ఉద్యోగికి అదనంగా ఇంక్రిమెంట్ కలిపిన ఘటనలు దేవస్థానంలో వెలుగుచూశాయి. అయినా కూడా సదరు విభాగం అధికారుల తీరులో మాత్రం నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తోందని తాజా ఘటనే రుజువు చేస్తోంది. ఏళ్లకు ఏళ్లుగా.. సహజంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు బదిలీలు సహజం. మహా అయితే మూడు, నాలుగు సంవత్సరాలకు ఉద్యోగుల బదిలీలు జరుగుతుంటాయి. కానీ, దేవస్థానంలో ఓ స్థాయి ఉద్యోగి మాత్రం ఏకంగా రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. కిందిస్థాయిలో ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు తెలిసిపోతోంది. ప్రసిద్ధ ఆలయంలో ఉద్యోగుల నిర్లక్ష్యం కనిపిస్తున్నా ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. కాగా, దేవస్థానంలో వెలుగుచూసిన ఘటనలపై వివరణ కోరేందుకు ఆలయ ఈఓ పలుమార్లు ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినా ఆమె అందుబాటులోకి రాలేదు. -
24గంటల కరెంట్‌తో లాభం లేదు
భువనగిరిటౌన్ : ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల విద్యుత్‌తో భూస్వాములకు తప్ప రైతులకు లాభం లేదని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నా రు. సోమవారం భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఆర్భాటాలు, ప్రచారాలు చేయడం తప్ప అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు మోసపోయారన్నారు. నాలుగు సంవత్సరాలు అవుతున్నా నిమ్స్ పూర్తి చేసి ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం కేసీఆర్ ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కయ్యారన్నారు. నిమ్స్ ఆస్పత్రిపై వివక్ష చూపుతున్నారని అలాంటి చర్యలు మానుకుని నిధులు కేటా యించాలన్నారు. నయీమ్ కేసులు ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు చెప్పడానికి ప్రతిపక్ష ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కలవడానికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వ డం లేదన్నారు. రాష్ట్రం లో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లడానికి భయపడుతున్నారన్నారు. అనంతరం నూతన సంవత్సరం పురస్కరించుకుని రహదారి బంగ్లాలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో చౌటుప్పుల్ ఎంపీపీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, తంగళ్లపల్లి రవికుమార్, పంజాల రామాంజనేయులు, బెండ లాల్‌రాజ్, బర్రె జహంగీర్, యాట నాగరాజు, భువనగిరి వెంకటరమణ, పి.శ్యాంగౌడ్, బి.భాస్కర్‌రెడ్డి, ఈరపాక నర్సింహ, ముల్తానీషా, బర్రె నరేష్, అందె నరేష్, మహ్మద్ సలావుద్దీన్, పడిగెల ప్రదీప్ ఉన్నారు. -
ప్రతి అడుగూ.. రైతు సంక్షేమానికే
దేవరకొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగూ రైతు సంక్షేమానికే వేస్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని చింతపల్లి, మాల్, కొండమల్లేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన మార్కెట్ యార్డు గోదాములను రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి, నక్కలగండి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. తెలం గా ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు నాణ్య మైన ఉచిత విద్యుత్‌తో పాటు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మెట్రిక్ ట న్నుల గోదాములను నిర్మించి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా మారిందని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ సాగు తాగునీటి సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రత్యేక దృష్టి సారించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందించేందుకు కృషిచేస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రెండు నా ల్కల ధోరణిని మానుకోవాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారని హెచ్చరించారు. చందంపేటలో ఓపెన్ జైల్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. డిండి ఎత్తిపోతలకు రూ.6,500 కోట్లు : ఎంపీ డిండి ఎత్తిపోతల పనులకు రూ. 6,500 కోట్లు కేటా యించి ప్రభుత్వం పనులు ప్రారంభించినట్లు ఎంపీ గు త్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో దేవరకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ముంపుబాధితులకు సహకారం అందించాలి : జెడ్పీ చైర్మన్ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోతున్న బాధితులకు సహకారం అందించాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని బెండల్రావు చెరువుకు మంజూరి ఇచ్చి తద్వారా సాగు, తాగునీరు అందించేందుకు సహకరించాలని ఆయన మంత్రి హరీశ్‌రావును కోరారు. సాగునీటికి ప్రణాళికలు : ఎమ్మెల్యే డిండి రిజర్వాయర్ ద్వారా రానున్న ఖరీఫ్ సీజన్లో సాగు నీరందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపా రు. ఇప్పటికే నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆ యా కార్యక్రమాల్లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, ఆర్డీఓ లింగ్యానాయక్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపీటీసీలు శేరిపల్లి కైలాసం, వస్కుల తిరుపతమ్మ, మూఢావత్ ప్రమీల, సర్పంచ్ అందుగుల ముత్యాలు, తహసీల్దార్ కిరణ్మయి, వైస్ ఎంపీపీప వేణుధర్‌రెడ్డి, హరినాయక్, నట్వ గిరిధర్, జాన్‌యాదవ్, లింగారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి చందంపేట (దేవరకొండ) : నిర్దేశించిన గడువులోగా నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. గురువారం చందంపేట మంలంలోని తెల్దేవర్పల్లిలో చేపడుతున్న నక్కలగండి బండ్ నిర్మాణ పనులను ఇతర మంత్రులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వహించొద్దని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ రిజర్వాయర్ సామర్థ్యం 7.50టీఎంసీలు కాగా మొదటి ఏడాది వర్షాకాలంలో 4 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సెల్బీసి టన్నెల్–1లో 43 కి.మీ. సొ రంగ మార్గంలో 30 కి.మీ ఇప్పటికేటి పూర్తయ్యింది. మరో 13 కి.మీ. పనులను వేగవంతంగా పూర్తి చేసేం దుకు ఏజెన్సిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిపారు. టన్నెల్–2ను సొరంగ మార్గ పనులు వంద శాతం పూర్తి కా గా 50 శాతం లైనింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. డిండిబ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్ పనులు 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే..
సాక్షి, హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాలే ప్రధానమన్న రీతిలో పంచాయతీరాజ్ చట్టానికి టీఆర్ఎస్ సవరణలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మె ల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ, సర్పంచ్ ఎన్నికను పరోక్ష పద్ధతికి మార్చా లని టీఆర్ఎస్ భావించడం సరికాదన్నారు. సవరణల విషయమై అఖిలపక్ష నేతలు, రాజ్యాంగ నిపుణులతో కమిటీని వేసి సమగ్రంగా చర్చించాలని సూచించారు. -
నిరుద్యోగంపై ఉమ్మడి పోరు
సాక్షి, హైదరాబాద్: సామాజిక రుగ్మతగా మారిన నిరుద్యోగంపై పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సరళీకర విధానాలతో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని, నిరుద్యోగంపై మాట్లాడే వారు తక్కువయ్యారని పేర్కొన్నారు. శనివారం జేఏసీ నేతలు గోపాల శర్మ, రఘు, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, భైరి రమేశ్, మాదు సత్యంతో కలసి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొలువుల కోసం కొట్లాట పేరిట సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులంతా సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా సభ జరుగుతుందని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను కూడా పిలిచి సభలో మాట్లాడిస్తామని చెప్పారు. సభకు ఎంతమంది వచ్చినా ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వానికే స్పష్టత లేదని విమర్శించారు. ఉద్యోగాల కేలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల్లో కీలకమైన ఉద్యోగాల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ్డటీఆర్‌ఎస్ ప్రభుత్వం నడవడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీలను గుర్తుచేయకుండా సభ్యుల హక్కులను అసెంబ్లీలో కాలరాశారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల విషయంలోనూ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని పేర్కొన్నారు. ఎల్.రమణతో భేటీ.. కొలువుల కొట్లాటకు మద్దతు ఇవ్వాలని కోరు తూ టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను జేఏసీ చైర్మన్ కోదండరాం, నేతలు పురుషోత్తం, గోపాలశర్మ తదితరులు కలిశారు. కొలువుల కోసం కొట్లాట నిర్వహించేందుకు గల కారణాలను, మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. భేటీ తర్వాత రమణ మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని విమర్శించారు. కొలువుల కొట్లాటకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఆర్.కృష్ణయ్య మద్దతు.. కొట్లాటకు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యను జేఏసీ చైర్మన్ కోదండరాం కోరారు. ఈ మేరకు శనివారం బీసీ భవన్లో కలిశారు. ఈ సందర్భంగా కొలువుల కొట్లాటకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కృష్ణయ్య వెల్లడించారు. 3 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు గతంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు తోడుగా, కొత్తగా పెరిగిన జిల్లాలతో అదనంగా పెరిగిన ఉద్యోగాలు ఏవని ప్రశ్నించారు. వివిధ శాఖల్లో ప్రస్తుతం 3 లక్షల దాకా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుప్పెడు మంది ఆంధ్రా కాంట్రాక్టర్లను బతికించడానికి తెలంగాణ విద్యార్థులను టీఆర్ఎస్ ప్రభుత్వం బలి పశువులను చేస్తోందని, దీనికి సంబంధించి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని చెప్పారు. కొలువుల కొట్లాటను అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అవరోధాలు ఎన్ని ఎదురైనా నిరుద్యోగులకు కొలువుల కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. కొలువుల కోసం కొట్లాట సభలో విద్యార్థుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేక వాల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 1 నుంచి 6 గంటల దాకా సభ జరుగుతుందని వివరించారు. సభకు హైకోర్టులో పర్మిషన్ తెచ్చుకోవడం విద్యార్థుల విజయంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అమరుల ప్రాంగణానికి శ్రీకాంతాచారి పేరుతో వేదిక నిర్మించినట్లు వివరించారు. సభలో పాల్గొనాలని జర్నలిస్టు, రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నేతలను కలిసినట్లు తెలిపారు. -
టీఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే..!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి ఉద్యమాలతో తెలంగాణ వస్తే. .వారినే మోసం చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ది అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఉద్యోగాల ఇస్తామంటే అడ్డుకుంది కూడా కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఈ ప్రభుత్వం నింపలేకపోయిందన్నారు. అధికారంలోకి వచ్చి 40 నెలలు దాటినా ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు..టీఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఎవరూ సక్రమంగా లెక్కలు చెప్పడం లేదని, ఆర్థిక మంత్రి ఒక మాట, సీఎం ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని దుయ్యబట్టారు. డీఎస్సీ ఒక్కసారి కూడా వేయకుండా టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్రం 10 స్థానంలో ఉందని చెప్పారు. తమ పార్టీలో విద్యార్థులకు సముచిత న్యాయం ఉంటుందని, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఉత్తమ్ వివరించారు. -
కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి టెండర్లలో అన్నీ అవకతవకలేనని ఆరోపించారు. కమీషన్లతోనే కేసీఆర్ ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు. పాలమూర్ జిల్లాకు కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదని అన్నారు. పాలమూరులో జరిగిన అభివృద్ది కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని స్పష్టం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం తమ ఘనత అని టీఆరెస్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలవడం ఖాయమని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని తెలిపారు. రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు మద్దతుధర కల్పిస్తామని, రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువతకు ..నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. -
ఇది ఆటవిక పాలన
సాక్షి, కొత్తగూడెం: కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం, శాసనసభలో అన్నీ తానై వ్యవహరిస్తున్న కేసీఆర్.. గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదన్నారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో 17వ సర్వే నంబరులో 1956లో పట్టాలు ఇచ్చిన పోడు భూములను లాక్కోవడం దారుణమన్నారు. విమానాశ్రయం ఏర్పాటు పేరుతో ఆదివాసీల భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, హరితహారం కోసం కూడా వారి భూములు తీసుకుంటున్నారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో గొత్తికోయలను చెట్టుకు కట్టేసి కొట్టడం చూస్తే రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతున్నట్లు అర్థమవుతోందన్నారు. నేరెళ్లలో దళితులపై అమానుషంగా వ్యవహరించారని అన్నారు. అనేక త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో పేద, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. స్వపరిపాలన కోసం తెలంగాణ సాధిస్తే కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని అన్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ చేయడంతో రాష్ట్రంలో రైతులపై రూ.8వేల కోట్ల వడ్డీ భారం పడిందని చెప్పారు. అడ్డగోలు నిబంధనల కారణంగా ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 25 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఇక పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేవలం 3శాతం పత్తి మాత్రమే వచ్చిందని సీఎం చెబుతున్నారని, గిట్టుబాటు ధరల స్థిరీకరణ కోసం ఇస్తానన్న రూ.500 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శాస్త్రీయత లేకుండా, నిపుణుల కమిటీ వేయకుండా జిల్లాల విభజన చేశారన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 1/70 చట్టం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పరిశ్రమల అభివృద్ధికి అవకాశం లేకుండా పోతోందన్నారు. ఇళ్లు కట్టుకున్నా చట్టబద్ధత ఉండడం లేదన్నారు. ఎంపిక చేసిన చోట్ల 200 ఎకరాల చొప్పున కేటాయించి పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో వైద్య కళాశాల, మైనింగ్ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలం ఏర్పాటు చేసి భద్రాచలాన్ని టెంపుల్‌టౌన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సింగరేణికి పుట్టినిల్లయిన ఇల్లెందులో 1000 మెగావాట్ల పవర్ ప్లాంట్‌తో పాటు, జిల్లాలో బొగ్గు అధారిత పరిశ్రమలు, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, పాల్వంచలో ఎరువుల కర్మాగారం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలమల్లేష్, పశ్య పద్మ, రావులపల్లి రామ్మూర్తి, సింగరేణి ఏఐటీయూసీ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి శేషయ్య, బందెల నర్సయ్య, ఆర్టీసీ ఏఐటీయూసీ ఈయూ నాయకుడు కె.భాస్కర్‌రావు, మహిళా సమాఖ్య నాయకురాలు నల్ల శ్రావణి, బరిగెల సాయిలు, సుగుణ, రాములు, పూనెం శ్రీనివాసరావు, కల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో దొంగల పాలన
కామేపల్లి: రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతుందని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక తెలంగాణ సమగ్రాభివృద్ధికి చేపట్టిన పోరుబాట కామేపల్లికి చేరుకుంది. సీపీఐ మండల కార్యదర్శి పుచ్చకాయల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకటరెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాయ మాటలతో, మాటల గారడీతో పాలన కొనసాగిస్తున్పానరని, హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని పార్టీలు జెండాలను పక్కన పెట్టి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో నైజాం పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని, దళితుడిని సీఎం చేస్తామని మాట తప్పారని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని, రాష్ట్రంలో 3.50 లక్షల మంది దళితులు అర్హులున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లు బాగోలేవని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి, ఇంత వరకు ఎవరికీ ఇవ్వలేదన్నారు. భూ సర్వే పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, లేని సమస్యలను సృష్టిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఇప్పటికే 3500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను పట్టించుకోలేదని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పొందుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏక పక్ష నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో పోలీసుల ఆగడాలు అధికమయ్యాయని అన్నారు. సీఎం కేసీఆర్ మెడలు వంచైనా ఎన్నికల హామీలను నెరవేర్చాలనే పోరుబాట చేపట్టామని, ప్రజలు ఏకమై ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర నాయకులు ఎన్.బాలమల్లేష్, పశ్య పద్మ, ఎండీ యూసుఫ్, షబ్బీర్‌పాషా, బరిగెల సాయిలు, సృజన, ఆర్.పాండురంగాచారి, రాములుయాదవ్, ఆర్.జఅంజయ్యనాయక్, కె.లక్ష్మీనారాయణ, పల్లె నరసింహా, నల్లా శ్రావణి, ఏపూరి లతాదేవి పాల్గొన్నారు. -
ఆదివాసీల భవితకు భరోసా
సందర్భం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెబితే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా నర్మగర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. గిరిజన స్త్రీలను, పసిపిల్లలను చెట్టుకు కట్టేసి లాఠీలతో చితక బాదుతున్న ఆటవిక సంఘ టన నన్ను కలవరపెట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి అడవుల్లో జలగలంచ గొత్తి కోయలకు చెందిన 30 మందిపై 300 మంది ఫారెస్టు సిబ్బంది చుట్టుముట్టి గొడ్డును బాదినట్టు బాదిన ఘటన అది. పోస్కో, వేదాంత కార్పొరేట్ కంపెనీలకు అడవిని అప్ప గించటం కోసం గ్రీన్‌హంట్ పేరుతోనో.. పులుల సంర క్షణ పేరుతోనో మాడ్ జాతులను వేటాడుతున్న వేళ కోయ, గోండు, గొత్తికోయలు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ అడవుల్లోకి వచ్చి నిమ్మల పడ్డారు. ప్రాంతం వేరైనా అడవి ఒక్కటే. జంగల్ వాళ్లది, జమీన్, జల్ వాళ్లదే. వాళ్ల అడవిలో వాళ్లను వది లేయటమే న్యాయం. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడు ఏజెన్సీలో 10 ఎకరాల లోపు భూమి సాగు చేసుకోవచ్చు. ఫారెస్టు అధికారులు చట్టాన్ని అతిక్రమించి గుడిసెలు పీకేసి, జీవనవిధ్వంసం చేసి నిర్వాసితులను చేయటం పార్లమెంటును దునుమా డటమే. ఈ అమానవీయ సంఘటనను అసెంబ్లీలో ప్రస్తావించాలని నిర్ణయించుకున్నా. కానీ ముందుగానే సీఎం కేసీఆర్ మానవత్వం చూపించారు. గొత్తికోయ లపై దాడిని తీవ్రంగా గర్హించారు. దాడులకు దిగిన ఫారెస్ట్ అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. ఇది తొలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు దక్కిన భరోసా. అడవిపై అప్పటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముండాలు, భిల్లులు, గోండులు, కోయలు, గొత్తికో యలు, కొండ రెడ్లు తిరుగుబాట్లు చేశారు. ఆ మాట కొస్తే క్రీపూ 431–404 పాల్పెనెసియన్ యుద్ధ కాలం నుంచి భూమిపై అధికారాలు, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకు గురి అవు తున్నాయి. భూములను, హక్కులను తిరిగి కాపాడు కునే క్రమంలో ఆదివాసీలు అప్పటి నుంచే పోరాట పంథాను ఎంచుకున్నారు. వాళ్ల ప్రతి పోరాటంలో భూ సమస్య ఉంది. ఆ భూముల్లో వాళ్ల బతుకు ఉంది. గిరి జన తిరుగుబాట్లను పాలకులు ఎప్పటికప్పుడు అణిచి వేస్తూనే ఉన్నారు. ఆదివాసీ పోరాటాలవల్లే 1917లో, 1959లో ఆదివాసీ భూ పరిరక్షణ చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాన్ని తుంగలో కలిపినప్పుడే గోదావ రిలోయ ప్రతిఘటనా పోరాటాలు, దండ కారణ్య ఉద్య మాలు పుట్టుకొచ్చాయి. ఆపై ప్రభుత్వం 1/70 చట్టం, పీసా (పంచాయతీరాజ్ విస్తరణ) చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చింది. ఉమ్మడి ఏపీలోని శ్రీకా కుళం నుంచి మహబూబ్‌నగర్ దాకా 31,845 చదరపు కిలో మీటర్ల వరకు గిరిజన ఉపప్రణాళిక ప్రాంతం విస్త రించి ఉంది. అయితే దాదాపు 845 గిరిజన గూడేలను, పెంటలను 5వ షెడ్యూల్లో చేర్చనందునే భూ పరి రక్షణ చట్టాలు ఉన్నా అమలు కావటం లేదు. రిజర్వు టైగర్ ప్రాజెక్టుల్లో పులికి, ఆటవికులకు మధ్య సంఘర్షణ జరుగుతోందని అటవీ సంరక్షణ అధికారులు చెప్తున్నారు. వారిని అడవి నుంచి బయటికి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆదివాసీ కూడా అటవీ ఆవరణ వ్యవస్థలో ఒక అంతస్థే. అడవి జంతువుకు, ఆదివాసీకి మధ్య ఒక స్పష్టమైన జీవన సర్దుబాటు ఉంది. ఆదివాసీలు సాయంత్రం ఐదు గంటల లోపే పనులు ముగించుకొని రాత్రి 7 గంటల లోపు వండుకొని తిని పడుకుంటారు. ఆ వేళకే అడవి జంతువులు బయటికి వస్తాయి. సూర్యోదయం వరకు యథేచ్ఛగా సంచరిస్తాయి. సూర్యోదయం తరువాత మళ్లీ ఆదివాసీ జీవన గమనం మొదలవుతుంది. ప్రకృతే వారికి ఆవిధంగా సర్దుబాటు చేసింది. ఇక్కడ పులికి ఆదివాసీకి బలమైన బంధుత్వం ఉంది. ఆదివాసీ పులిని బావ(పులిబావ) అని సంబోధిస్తాడు. ఆదిమ జాతుల్లో బావే ఆత్మీయుడు. పులి గాండ్రిస్తే కాలం కలిసి వస్తుం దని, చెట్టు ఫలిస్తుందని ఆదివాసీల నమ్మకం. ఎప్పటికీ వాటి క్షేమాన్నే కోరుకునే ఆదివాసీలతో పులి ఎక్కడ సంఘర్షణ పడుతుందో అటవీ శాఖ పెద్దలకే తెలియాలి. గ్లోబలైజేషన్లో భాగంగానే ఆధిపత్య దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీద కన్నేశాయి. విస్తా రమైన ఖనిజ సంపదను తవ్వి పట్టుకుపోవటానికి కార్పోరేట్ శక్తులు యుక్తులు, కుయుక్తులతో వల విసు రుతున్నాయి. ప్రకృతిని వడిపెట్టి ధ్వంసం చేసి డాలర్లు పిండుకునే తరహా అభివృద్ధి, దాని విస్తరణ వన జీవుల ప్రాణాలను తోడేస్తోంది. ఈ విలయం ఆగాలి. అపు రూప మానవ తెగలను అడవిలోనే బతకనివ్వాలే. ఇటీ వల సీఎం కేసీఆర్ అటవీ అధికారుల సమావేశంలో ఎవరు చెప్తే ఆదివాసీలపై దాడి చేశారని నిలదీయటం, ఆ సందర్భంగా చెప్పిన మాటలు ఆదివాసీ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాయి. వాళ్ల అడవిలో వాళ్లే ఉంటారనే సంకేతాలు వెలువడ్డాయి. కేసీఆర్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక సబ్ ప్లాన్‌తో 2017–18 బడ్జెట్లో రూ. 6,112 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 60 శాతం నిధులు ఇప్పటికే ఖర్చు చేసింది. గిరిజన యువతీ యువకుల్లో నైపుణ్యం వెలికితీసి వారిని తీర్చి దిద్దటం కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో 500 ఎకరాలలో గిరి జన వర్సిటీని నెలకొల్పబోతోంది. గిరిజన సంస్కృతి, సాహిత్యాన్ని పాఠ్యాంశంగా చేయటంతో పాటు వాటిపై విస్తృతమైన పరిశోధనలు జరుగనున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక ఎమ్మెల్యే మొబైల్ : 94403 80141 -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల్లో అంతులేని అవినీతి జరుగుతోందని, ప్రాజెక్టులపై పెడుతున్న పెట్టుబడి రాష్ట్ర ప్రజలమీద భారంగా మారుతోందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం (సీఎల్పీ) డిమాండ్ చేసింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎల్పీ సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయాలు, జీవో 39, భూసర్వే, గ్రామాల్లో విషజ్వరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం లో జాప్యం, దళితులకు భూపంపిణీ, డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో జాప్యం, అధికారులపై టీఆర్ఎస్ నేతల దాడులు తదితర అంశాలపై చర్చ జరిగింది. సీఎల్పీ భేటీ వివరాలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మండలిలో సీఎల్పీ డిప్యూటీ లీడర్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. రైతు సమన్వయ సమితులను కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలతోనే నింపారని, సీఎల్పీ దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తుందని చెప్పారు. భూ ప్రక్షాళనకోసం అనేక ప్రకటనలు చేశారని వాస్తవంగా అమలుజరగడం లేదని విమర్శించారు. జనగామ ఎమ్మెల్యే ఎకరం భూమి కబ్జాచేస్తే కలెక్టర్ రద్దు చేశారని, ప్రభుత్వం మాత్రం ఎమ్మెల్యేపై ఎటువంటి చర్య తీసుకోలేదని అన్నారు. పరిగిలో టీఆర్ఎస్ నేత హరీశ్వర్‌రెడ్డి సైతం తన కుమారుడి పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో దళిత బాధితుల పరామర్శకోసం మీరాకుమార్ వస్తే అనుమతి ఇవ్వలేదని, దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ పెన్షన్ విధానంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సచివాలయాన్ని బైసన్ పోలో గ్రౌండ్స్‌కి మార్చడానికి అంగీకరించమన్నారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ సంఘానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా సీఎల్పీలో చర్చించామన్నారు. అధికారులపై జరుగుతున్న భౌతిక దాడులు, హత్యలను సీఎల్పీ ఖండించిందని చెప్పారు. పంచాయతీరాజ్ చట్టానికి తూట్లు పొడుస్తూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటును కాంగ్రెస్ తప్పు పడుతోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపకంలో జరిగిన అవకతవకల వల్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని సమావేశం ఆందోళన వెలిబుచ్చింది. -
టీఆర్ఎస్పై తిరుగుబాటు వస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో అన్నివర్గాల్లో టీఆర్ఎస్పై తిరుగుబాటు మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ నేతలు డి.శ్రీధర్‌బాబు, సునీతా లక్ష్మారెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మల్లేశం, తాహెర్బిన్తో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలకు పార్టీ నేతలు, తెలంగాణ ఉద్యమకారులే ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులను ఏర్పడ్డాయని ఆయన విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళల పట్ల టీఆర్ఎస్ అత్యంత పాశవికంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేయడంతో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిముందు దళిత యువకుడు శ్రీనివాస్ ఆత్మాహుతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలోనే ఆయూబ్‌ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రజల ప్రాణాలను హరించడానికే పాలకులు ఉన్నారా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. దళితుల హత్యలు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించడం, పోలీసుల లాఠీ చార్జీ, థర్డ్ డిగ్రీ వేధింపులు, గిరిజన మహిళలను తాళ్లతో చెట్లకు కట్టేసి కొట్టడం, పంటలకు ధరలు ఇవ్వమని అడిగినందుకు గిరిజన యువకుల చేతులకు బేడీలు వేయడం, మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో మోసాలు, మహిళలను అవమానించడం వంటి ఎన్నో చర్యలకు టీఆర్ఎస్ పాల్పడిందని వివరించారు. శ్రీనివాస్, ఆయుబ్ ఖాన్ ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. వీటిపై ప్రజలు విసిగిపోయారని, తిరుగుబాటు తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు. -
తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే: ఉత్తమ్
సాక్షి, వరంగల్: భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత, తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వరంగల్‌లో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఉత్తమ్ మాట్లాడుతూ.. రైతుల కోసం చట్టాలు, భూసంస్కరణలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. గొత్తికోయల పై దాడి చేయడం అమానుషమని,దీనికి కారకులైన ప్రతిఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ... 2019లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ నిర్మాణాల పేరుతో నాణ్యత లేని పనులు చేసి, డబ్బులు దోచుకుంటుందని ఆరోపించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో వి.హన్మంతరావు, ఏఐసీసీ ఎస్సీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ సర్కార్‌ను కూల్చేస్తాం
♦ అదే టీ–మాస్ లక్ష్యం ♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో భూస్వామ్య పెట్టుబడిదారి ప్రభుత్వాన్ని కూల్చడమే టీమాస్ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం తెలంగాణ సామాజిక, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్‌గార్డెన్‌లో టీమాస్ ఫోరం జిల్లా ఆవిర్భావ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వం కోసం టీమాస్ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎంబీసీ కుల వర్గీకరణ చేయకుండానే రూ.కోట్ల నిధులు మంజూరు చేసి మరోసారి బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విద్య, రాజకీయ రంగాల్లో ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 19శాతం రిజర్వేషన్లు పెంచడంతోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెంచాలన్నారు. దేశంలో 52శాతంగా ఉన్న బీసీలకు కేవలం పార్లమెంట్లో 19సీట్లు మాత్రమే ఉన్నాయన్నారు. అన్ని కులాల వారు సంస్కృతి, సంప్రదాయలను సమాన రీతిలో గౌరవించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల వాటా ఆధారంగా రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలో జిల్లాలోని ప్రతి మండలం, గ్రామాల్లో టీమాస్ కమిటీలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పేదవాడికి కష్టం వస్తే అండగా నిలుస్తుందన్నారు. ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదు : గద్దర్ ప్రజాశక్తి ముందు ఏశక్తి నిలవదని ప్రజాయుద్ధనౌక, టీమాస్ ఫోరం స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్ అన్నారు. తెలంగాణ విముక్తికి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణను సాధించుకునేంతా వరకు ఉద్యమాలు జరిగాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా భువనగిరిలో బెల్లి లలిత ప్రాణత్యాగం చేసిందన్నారు. భువనగిరి రాజకీయ తీర్మానాలకు ప్రసిద్ధి చెందిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని, దానిని దెబ్బతిన్న ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. తెలంగాణ ఉద్యమానికి భువనగిరి చరిత్ర ఎంతో కీలకమైందన్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలో జరిగిన ఉద్యమ తీరును, ఆత్మబలిదానం, సామాజిక సమానత్వం, టీమాస్ లక్ష్యంపై కళా ప్రదర్శన ద్వారా సభికులను గద్దర్ ఎంతగానో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల నాయకులు చేరుపల్లి సీతారాములు, పల్ల ఆశయ్య, శ్రీరాంనాయక్, ధర్మానాయక్, కూరపాటి రమేష్, సిర్పంగ శివలింగం, బెల్లి కృష్ణ, అబ్దుల్ ఖాదీర్, అజయ్‌కుమార్, సాయిబాబా, ఎండి.జహంగీర్, బట్టు రామచంద్రయ్య, మాటూరి బాలరాజు, చిలుకమారి గణేష్, ధారావత్ గణేష్‌నాయక్, బట్టుపల్లి అనురాధ, జాన్‌వేస్లీ, మేడి పాపయ్య, కందగట్ల స్వామి, దాస్‌రాం నాయక్, ఎండీ.అబ్బాస్, శోభన్‌నాయక్, రావుల రాజు పాల్గొన్నారు. -
తెలంగాణ వచ్చినా దొరల పాలనే: తమ్మినేని
సాక్షి, ఖమ్మం: తెలంగాణ సాధించు కున్నా.. దొరల పాలనే సాగుతోం దని టీ మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఖమ్మంలో తెలంగాణ ప్రజా, సామాజిక సంఘాల ఐక్య వేదిక (టీమాస్) జిల్లా సదస్సు గురువారం నిర్వ హించారు. తమ్మినేని మాట్లాడుతూ ప్రజ లు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందినట్లని చెప్పారు. గద్దర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 93% అట్టడుగు కులాల ప్రజలు ఉన్నా.. 7% ఉన్న కులాల వారే పాలన సాగిస్తున్నారన్నారు. నాడు జీఎస్టీ మంచిదే అంటూ మద్దతు పలికిన కేసీఆర్.. నేడు ప్రభుత్వ ప్రాజెక్టులపై పన్నుల భారం పడేసరికి జీఎస్టీపై పోరాడుతానని చెబుతున్నారన్నారు. టఫ్ అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ రాష్ట్రంలో దొరల పాలన పారదోలేందుకు ప్రజలను సమీకరించాలన్నారు. -
గులాబీ కూలీ కాదు.. బహిరంగ అవినీతి
కేంద్ర హోంశాఖ, ఈసీ, సీబీఐలకు రేవంత్ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: గులాబీ కూలీ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులు చట్టవిరుద్ధంగా... బహిరంగ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు వసూలు చేశారని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖ, సీబీఐ, రాష్ట్ర ఏసీబీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన బహిరంగ వసూళ్లకు సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా అందజేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు తమ పరిధిలోని సంస్థల్లో కొద్ది సేపు పనిచేసినట్లు నటించి ఆయా సంస్థల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని రేవంత్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. చేపల విక్రయం, టీ, కాఫీల అమ్మకాల ద్వారా కూడా పెద్ద మొత్తంలో వసూలు చేసుకోవచ్చన్న వినూత్న ఆలోచన కేవలం టీఆర్ఎస్ మంత్రులకే వచ్చిందని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీ పేరిట జరిగిన వసూళ్లపై విచారణ జరపాలని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. -
హామీలను అమలు చేయలేని టీఆర్ఎస్: బీజేపీ
హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ప్రజల తరపున పార్టీ శ్రేణులు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నగరంలో ఇప్పటికీ నిర్మించలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంపై మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశ సంస్కృతికి వ్యతిరేకంగా పెరుగుతున్న క్లబ్బులు, పబ్బుల సంస్కృతి పై పోరాడాలన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రధానమంత్రి మోదీ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు. వితంతువులు కూడా సమాజంలో గౌరవంగా బతికేలా మహిళా మోర్చా కృషి చేయాలని కోరారు. సుష్మాస్వరాజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని. ఈ నెల 22, 23 తేదీల్లో వరంగల్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో మోర్చా నేతలు మాజీ మంత్రి పుష్పలీల, ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్ పాలన గాడి తప్పింది’
► ఇసుక దందాల్లో టీఆర్ఎస్ నేతలు కూరుకుపోయారు ► పెట్టుబడులకు రైతుల చేతిలో చిల్లరకూడా లేదు ► టీఆర్ఎస్ పాలనపై ద్వజమెత్తిన కోదండరాం సిరిసిల్ల జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ కోదండరాం మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు ఇసుక దందాలో కూరుకుపోయారని, ప్రభుత్వ పాలన గాడి తప్పిందని కోదండరాం విమర్శించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జూలై 7, 8, 9వ తేదీల్లో జిల్లాలో అమరవీరుల స్పూర్తియాత్రను నిర్వహిస్తామని వెల్లడించారు. ముస్తాబాద్ నుంచి మొదలయ్యే యాత్ర మూడురోజులపాటు జిల్లాలో సాగుతుందని, చివరిరోజు జిల్లాకేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలో విఫలమైందన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, నకిలీ విత్తనాల బెడద రైతులను వేధిస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రాథమిక సూత్రంపైనే రాష్ట్ర సాధనకు ఉద్యమించామని, ఆ మూడింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోందని తెలిపారు. మొదటి విడత అమరుల స్ఫూర్తియాత్ర సంతృప్తినిచ్చిందని, అదే స్ఫూర్తితో జిల్లాలో యాత్ర సాగిస్తామని వెల్లడించారు. -
ఓట్లు కాదు.. ఏట్లు పడతాయి: కాంగ్రెస్
హైదరాబాద్‌సిటీ: టీఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయారని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పడు వచ్చినా టీఆర్ఎస్ నేతలకు ఓట్లు కాదు.. ఏట్లే పడతాయని విమర్శించారు. సాగునీటి రంగానికి సంబంధించి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు రైతు వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పాలపూర్ రంగారెడ్డికి అనుసంధానం చేయడం సరికాదన్నారు. డిండి ప్రాజెక్ట్‌కు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. డిండి పాలమూరు అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సీఎంకు లేఖ రాసిన జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. డిండిని పాలమూరు రంగారెడ్డితో అనుసంధానం చేస్తే ఉద్యమం తప్పదన్నారు. అనుసంధానం జరిగితే అది టీఆర్ఎస్ నేతల వైఫల్యమే అవుతుందన్నారు. -
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం
► మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ జన్నారం(ఖానాపూర్): అన్నివర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ అన్నారు. మండలంలోని జన్నారం జామ మజీద్‌లో శుక్రవారం ఆయన ముస్లింలను కలిశారు. ఈ సందర్భంగా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొంతం శంకరయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంజాన్ పండుగ మతసామరస్యానికి ప్రతీక అన్నారు. పండుగ శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కలిసిమెలసి ఉండాలన్నారు. పార్టీ అధిష్టానానికి కట్టుబడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ నందునాయక్, సురేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
ఓ ఎలమందా..అందేనా గొర్రెల మంద!
► గొర్రెల పథకంలో అడుగడుగునా ఇబ్బందులే పొరుగు రాష్ట్రాల్లోనే జీవాలకు కొరత మరి 82 లక్షల గొర్రెలను రాష్ట్రానికి తెచ్చేదెలా? రంగంలోకి దిగిన దళారులు.. బోగస్ సభ్యత్వాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలు lఇప్పటికే 5.70 లక్షలకుపైగా దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్ రెండేళ్లలో 82 లక్షల గొర్రెల పంపిణీ..! రాష్ట్రంలో యాదవ, కుర్మల కోసం గొర్రెల పథకం కింద ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యమిది. మరి అంత పెద్ద మొత్తంలో గొర్రెలు కొనుగోలు చేయటం సాధ్యమేనా..? అసలు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అంత పెద్ద సంఖ్యలో గొర్రెలు అందుబాటులో ఉన్నాయా..? దూరప్రాంతంలో వాటిని కొంటే రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రవాణా ఖర్చులు తడిసి మోపెడు కావా? ఒక్కసారిగా లక్షల సంఖ్యలో కొంటే డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగిపోవా? ఈ పథకంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం ఆరంభ దశలోనే సర్కారుకు క్షేత్రస్థాయిలో అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గొర్రెల సంపదలో రెండో స్థానం దేశంలోనే గొర్రెలు అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 1.78 కోట్ల మేకలు, గొర్రెలున్నట్లుగా పశు సంవర్థక శాఖ లెక్కలు చెబుతున్నాయి. అందులో 1.23 కోట్ల గొర్రెలున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. గొర్రెల సంపదలో దేశంలో రాజస్థాన్ మొదటి స్థానంలో, ఏపీ మూడో స్థానంలో, కర్ణాటక నాలుగో స్థానంలో ఉన్నాయి. తక్కువ గొర్రెలున్న రాష్ట్రాలు ఎక్కువ గొర్రెలున్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయటం మార్కెట్ సూత్రం. కానీ.. ఇప్పటికే అత్యధిక గొర్రెలున్న తెలంగాణ ఒక్కసారిగా 41 లక్షల చొప్పున వరుసగా రెండేళ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా ఎంచుకోవటం గమనార్హం. పొరుగు రాష్ట్రాల్లోనే కొరత రాష్ట్రానికి సరిపడే గొర్రెలు పొరుగు రాష్ట్రాల్లోనూ అందుబాటులో లేవు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల ప్రకారం 43 వేల యూనిట్లు అవసరం. అంటే దాదాపు 8.60 లక్షల గొర్రెలు. వీటిని కర్ణాటక నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. కానీ కర్ణాటకలో రెండు జిల్లాల్లో కేవలం 9 లక్షల గొర్రెలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో అమ్మకానికి, అంగట్లోకి వచ్చేవి 2 లక్షలకు మించే పరిస్థితి లేదు. అదే విషయాన్ని ఇటీవల అక్కడి గొర్రెల పెంపకందారులు జిల్లా నుంచి వెళ్లిన బృందాలకు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అవసరమైన యూనిట్లను పంపిణీ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. దళారుల దందా.. ఒక్కో గొర్రెల యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 25 శాతం రూ.3,1250 లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తే.. మిగతా 75 శాతం(రూ.93,750) ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కానీ రవాణా ఖర్చుల పేరిట దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలు వసూళ్ల పర్వం మొదలైంది. ఇప్పటికే దళారులు సైతం ఈ పథకంలో రంగప్రవేశం చేశారు. ఇటీవల బాధితులు స్వయంగా ఓ మంత్రికి మొరపెట్టుకోవటం గమనార్హం. అంచనాకు మించి డిమాండ్ గొర్రెల యూనిట్లకు రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ సర్కారుకు దడ పుట్టిస్తోంది. ముందుగా ప్రభుత్వం వేసిన అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలున్నాయి. ఈ ఏడాది రెండు లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల కుటుంబాలకు యూనిట్ల పంపిణీ లక్ష్యంగా ఎంచుకుంది. 18 ఏళ్లు నిండి.. సొసైటీల్లో సభ్యులైన వారందరినీ అర్హులుగా ప్రకటించింది. లాటరీ పద్ధతిలో ఈ ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మిగతా వారికి యూనిట్ల పంపిణీకి సిద్ధపడింది. కానీ కుటుంబంలో అర్హుల సంఖ్యపై సీలింగ్ లేకపోవటం, పలు చోట్ల బోగస్ సభ్యులు నమోదు కావడంతో దరఖాస్తుదారుల సంఖ్య పెరిగింది. గత నెల(మే) 10 నాటికే గొర్రెల ఫెడరేషన్‌కు 5.70 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో ఈ సంఖ్య 6.50 లక్షలకు చేరుతుందని అధికారుల అంచనా . ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు వంతున అందరికీ యూనిట్లు పంపిణీ చేయాలంటే 1.30 కోట్ల గొర్రెలు అవసరం కానున్నాయి. రవాణాకు ఒక్కో యూనిట్‌కు రూ.2,000 మన రాష్ట్రంలో ఉన్న గొర్రెలు కొనుగోలు చేస్తే రీసైక్లింగ్ పేరిట అవినీతి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు సర్కారు నడుం బిగించింది. కానీ దూరాభారంతో రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాకు కర్ణాటకలోని దావణగెరే, చిత్రదుర్గ్ నుంచి గొర్రెలు కొనాలని నిర్ణయించారు. ఈ జిల్లాకు దావణగెరే 645 కి.మీ.ల దూరం. చిత్రదుర్గ్ 575 కి.మీ.ల దూరం. 250 గొర్రెలు రవాణా చేసే వ్యాన్లు కి.మీకు రూ.35 చొప్పున రేటు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన పది యూనిట్ల గొర్రెలను తెచ్చేందుకు రూ.23 వేల ఖర్చవుతోంది. అన్ని జిల్లాల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి. సిరిసిల్ల జిల్లాకు నెల్లూరు, కడప జిల్లాల నుంచి, నిజామాబాద్ జిల్లాకు అనంతపురం నుంచి గొర్రెలు తీసుకు రావాలని నిర్ణయించారు. దూరాల్లో స్వల్ప తేడాలున్నా ఒక్కో యూనిట్‌కు సగటున రూ.2 వేల చొప్పున రవాణాకే ఖర్చవుతోంది. అంటే ఈ ఏడాది పంపిణీ చేసే రెండు లక్షల యూనిట్లకు రూ.40 కోట్లు రవాణాభారం తప్పని పరిస్థితి నెలకొంది. కొండెక్కిన గొర్రె ధర రాష్ట్ర ప్రభుత్వం భారీగా గొర్రెలు కొనుగోలు చేస్తుందనే ప్రచారంతో పొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గొర్రెల ధరలు కొండెక్కాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.4 వేలకు లభ్యమైన గొర్రెలను ఇప్పుడు అమాంతం రూ.6 వేలకు పెంచేశారు. యూనిట్ల పంపిణీ సమయం దగ్గరపడుతుండటంతో ఈ రేటు మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. -
కరువును పారదోలుతాం: కడియం
జనగామ: రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తాగు, సాగు నీరందించి కరువును పాదదోలుతామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. జిల్లాలోని జనగామ మండలం చీటకోడూరు నాగులకుంట చెరువు వద్ద మిషన్ కాకతీయ ఫేజ్-3 పనులకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జనగామ ప్రాంతం సుభిక్షంగా మారిందన్నారు. జనగామలో గోదావరి నదీ జలాలతో చెరువులు నింపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జిల్లాలో 267 గ్రామాలకుగాను 250 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందనున్నట్లు చెప్పారు. అదేవిధంగా జనగామ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ 3 మండలాలకు కేజీవీబీ పాఠశాలలు మంజూరు అయినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ 3, 4వ విడతలో మిగిలిన అన్ని చెరువులను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, కలెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు నీడనిస్తోంది: బీజేపీ
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర పరిపాలనను తమ కుటుంబ పరిపాలనగా భావిస్తున్న పార్టీలకు ఇక భవిష్యత్తు ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ విస్తరణే ధ్యేయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారని చెప్పారు. అమిత్‌షా పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ స్పష్టత రాబోతోందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సర్కార్ నిద్రపోతోందని, పాతబస్తీలో ఐఎస్ఐఎస్ ప్రచారం చేస్తుంటే తెలంగాణ పోలీసులు ధర్నా చౌక్‌లో ప్టకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వం పోలీసులతో, అధికారులతో డ్రామాలు వేయిస్తోందని ఘాటుగా విమర్శించారు. రైతుల విషయంలో ప్రభుత్వం అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధర ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం పాతబస్తీని ఎంఐఎంకు తాకట్టు పెట్టారని ఒవైసీ బ్రదర్స్‌కు , ఉగ్రవాదులకు నీడనిచ్చే పార్టీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో యోగిలాంటి నాయకులు రాష్ట్రానికి వస్తారని అన్నారు. -
నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్-వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ధర్నచౌక్‌లో రెండు వర్గాలకు అనుమతినిచ్చి రెచ్చగోట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ధర్నాచౌక్‌లో స్థానికులు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికులు మాత్రం తమకు మానవతాదృక్పదంతో తాగటానికి మంచినీళ్లు ఇచ్చారని చెప్పారు. రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంటున్నారు జనాన్ని చంపడానికి ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌గారు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గరించి వాకబు చేస్తాడు కాని రైతుల సమస్యల గురించి మాత్రం పట్టించుకోరని వెద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసింనందుకు నిరసనగా "రైతులు ఉగ్రవాదులా" అనే వాల్‌పోస్టర్‌ను వీహెచ్ ఈసందర్భంగా ఆవిష్కరించారు. -
తెలంగాణ రైతులకు బేడీలు వేసినట్లే : కోదండరాం
హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును హరించొద్దని అలా హరిస్తే అది ప్రజాస్వామ్యం కానే కాదు అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వం రైతులకు భయపడడంతోనే రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో తేలిపోయిందన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేతకు నిరసనగా టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం మిర్చి యార్డులో ఆందోళన చేసిన రైతులకు బేడీలు వేసి కోర్టులో హాజరుపరిచడం దారుణమన్నారు. ఇది ఒక్క ఖమ్మం రైతులకు మాత్రమే వేసినట్లు కాదని..మొత్తం తెలంగాణ రైతులకు బేడీలు వేసినట్లు అని అభిప్రాయ పడ్డారు. ఒక్క ధర్నా చౌక్ ఎత్తివేస్తే నగరం అంతా ధర్నా చౌక్‌గా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే 15వ తేదీన చలో ధర్నా చౌక్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. వేదికను మూసివేసినంత మాత్రాన నిరసనలు ఆగవు అని స్పష్టం చేశారు. ఎవరి మార్గాల్లో వారు ధర్నా చౌక్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కంటితుడుపు చర్యే
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపు చర్యలు చేపడుతు న్నాయని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది రైతులపై కపట ప్రేమన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన రూ.5 వేలు ఏమాత్రం సరిపోదన్నారు. రాష్ట్రంలో 7లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండిస్తే, 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ధరతో ఎఫ్ఏక్యూ నాణ్యమైన మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన విధించడం సరికాదన్నారు. ఎఫ్ఏక్యూ మిర్చి కాకుండా క్వాలిటీ లేని లేదా రంగు వెలిసిన మిర్చిని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. కేవలం 33,700 మెట్రిక్ టన్నులకే సరిపె ట్టకుండా మిర్చి చివరి స్టాక్ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
రెతులపై కపట ప్రేమ: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: మిర్చి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమను చూపుతున్నాయని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ ధ్వజ మెత్తింది. కేంద్రం తాజాగా ప్రకటించిన రూ.5వేలు ఏ మూలకూ సరిపోవని, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మరో రూ.5వేలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జన్నేపల్లి శ్రీనివాసరెడ్డి గురువారం ప్రకటన విడుదల చేశారు. -
ప్రభుత్వ చేతగానితనం వల్లే...
రైతు సమస్యలపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మిర్చి కొనుగోలులో ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన నేప థ్యంలో కేంద్రం తీసుకున్న చొరవ రైతుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ముందుకు రాగా, దానిని కూడా టీఆర్ఎస్ ఫ్రభు త్వం రాజకీయం చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీ, బహిరంగసభల కోసం వ్యాపారుల నుంచి పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేసి రైతులను గాలికొదిలేశారన్నారు. తాను శుక్రవారం ఖమ్మం మార్కెట్‌యార్డును సందర్శించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. -
దమ్ముంటే విచారణ జరిపించాలి.: వీహెచ్
హైదరాబాద్‌సిటీ: దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..దిగ్విజయ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మీది..చేతనైతే విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్ ఓ నియంత అని అన్నారు. ముఖ్యమంత్రి బీసీలకు విలువివ్వడని, జ్యోతిరావ్ పూలే జయంతికి దండ కూడా వేయలేదని ఆరోపించారు. రైతుల బాధలు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపారు. ఇది రైతు ప్రభుత్వం కాదని, దళారుల ప్రభుత్వమని మండిపడ్డారు. దీనికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. రైతులను తుమ్ముల గూండాలని అనడం బాధాకరమన్నారు. రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. మిర్చీ రైతుల వద్దకు సీఎం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. నర్సింహన్‌కు కొనసాగింపు ఎందుకు?అని సూటిగా అడిగారు. గవర్నర్ నర్సింహన్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాలకు న్యాయం జరగదని చెప్పారు. ఈ విషయంలో రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని హనుమంతరావు తెలిపారు. -
ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన
బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ఆరోపణ అసెంబ్లీలోకి అనుమతించకపోవడానికి నిరసనగా ఆందోళన సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలోకి తమను అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ సభ్యులు జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నల్లకండువాలు ధరించి, నోటికి నల్లగుడ్డలు కట్టుకుని శాసనసభ వరకు నడిచివెళ్లారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, భూసేకరణ చట్టానికి సవరణలు చేసే సమావేశానికి తమను రాకుండా అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. గత సభలో సస్పెండ్ అయితే ఈ సభకు రాకూడదని ఏ చట్టంలో ఉన్నదో సీఎం, స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యతిరేక, నిజాం నిరంకుశ రాచరికం మాదిరిగా ప్రస్తుత పాలన సాగుతోందని, దీనికి టీఆర్ఎస్ తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. భూసేకరణ సవరణ చట్టం తప్పుల తడకలతో కూడినది కాబట్టే కేంద్రం తిప్పి పంపిందని, ఈ విధంగా వెనక్కు రావడం ప్రభుత్వానికి తలవంపులు కాదా అని కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. రైతులకు సరైన పరిహారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చట్టం తేవడం సరికాదని ఆయన చెప్పారు. గవర్నర్‌కు ఫిర్యాదు: శాసనసభ విధానాలను కూలదోసేలా, ప్రతిపక్షాలను పట్టించుకోకుండా, రాజ్యాంగాన్ని అపవిత్రం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నం దున రాజ్యాంగ పరిరక్షకుడిగా జోక్యం చేసుకోవాలని గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. ఆదివారం జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని కూడా కేవలం పది నిమిషాల్లోనే ముగించిన తీరు ప్రభుత్వ ఆధిపత్య ధోరణిని, అసహనాన్ని స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. చివరి సమావేశాల్లో సస్పెండ్ చేసినా ప్రత్యేక సమావేశాల్లో అనుమతి ఇవ్వాలని గవర్నర్ అన్నారని, దీనిపై స్పీకర్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు. తమ సస్పెన్షన్లపై ప్రభుత్వం పునరాలోచించకపోతే కోర్టులను ఆశ్రయించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. -
రైతులను తీవ్రవాదుల్లా చూస్తున్న ప్రభుత్వం
► బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ హన్మకొండ : రైతుల మార్కెట్లోనే రైతులను తీవ్రవాదుల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం నిర్భంధనాలు విధిస్తుందని బీజేపీ వరంగల్ అర్భన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. ఆదివారం హన్మకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మార్కెట్లో మద్దతు ధర అందించక పోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్టు, వీసాలతో వెళ్ళినట్లు రైతులు మార్కెట్‌కు ఆథార్ కార్డు, పహాణీనకల్ తీసుకురావాలని ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు. కందులు, పెసర్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరితే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని దుయ్యబట్టారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే రైతుకు కనీసం రూ.30 వేలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మిరప పంటకు బోనస్ ఇచ్చి ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వచ్చే ఏడాది నుంచి ఎకరాలకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు చొప్పున చెల్లిస్తామని చెప్పుతున్న ప్రభుత్వం మార్కెట్లో అన్యాయానికి గురవుతున్న రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులకు మేలు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం మినహా ఆచరణలో ఏమి కనపడదని దుయ్యబట్టారు. ఉట్టి ఎక్కనోడు స్వర్గంకు నిచ్చెన వేసినట్లుగా సీఎం కేసీఆర్ రైతులకు మేలు చెసే రాజ్యం అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైన మార్కెట్లో నిర్భందాలు ఎత్తివేసి, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. రైతులకు బీజేపీ అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పుల్యాల రవీందర్‌రెడ్డి, నాయకులు మారెపల్లి రాంచంద్రారెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, సంగాని జగదీశ్వర్, దామెర సదానందం, దొంతి మాదవరెడ్డి, రఘుపతి, ములుగు కృష్ణ పాల్గొన్నారు. -
రైతులు కష్టాల్లో ఉంటే ఆర్భాటాలా?
మాజీ ఎంపీలు పొన్నం, మధుయాష్కీ ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంక్షోభంలో ఉంటే.. వారిని ఆదుకోవడాన్ని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ప్లీనరీలు, బహిరంగ సభల పేరిట వృథా చేస్తూ ఆర్భాటాలకు పోతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ మండిపడ్డారు. గురువారం వారు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు అనేక విషయాల్లో మొట్టికాయలు వేసిన విషయం అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విడుదల చేసిన 19 జీవోలను న్యాయస్థానాలు కొట్టేశాయని వారు గుర్తు చేశారు. మూడేళ్లలో ప్రభుత్వం 12 వేల ఉద్యోగాలనే భర్తీ చేసిందన్నారు. అందుకే నిరుద్యోగుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనన్న భయంతో సీఎం కేసీఆర్ ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించకుండానే వెనుదిరిగారని విమర్శించారు. -
వరంగల్ సభకు వెయ్యి కోట్లు వసూలు
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ కోసం ఆ పార్టీ నేతలు రూ.1,000 కోట్లు వసూలు చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు ఉస్మానియా విద్యార్థులు గుడి కడతారని భావించారని, ఇప్పుడు ఆ విద్యార్థులే గోరీ కట్టడానికి సిద్ధమయ్యారని హెచ్చరించారు. మూడేళ్ళుగా సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఓయూ విద్యార్థుల ముందు కనీసం తలెత్తుకుని నిలబడే ధైర్యం కూడా కేసీఆర్ చేయలేకపోయారని.. ఇది సీఎం ఆయన పాలన, పరిస్థితిని తెలియజేస్తోందని రేవంత్ చెప్పారు. వరంగల్ టీఆర్ఎస్ సభ.. ప్రగతి నివేదన సభ కాదని, దోపిడీ దొంగల సభ అని విమర్శించారు. -
గన్మెన్లను తిప్పిపంపిన ఎమ్మెల్యే
హైదరాబాద్: తన రక్షణకు కేటాయోగించిన గన్ మెన్లను అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తిప్పి పంపారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా తన గన్మెన్లను ఎమ్మెల్యే తిప్పి పంపారు. రాష్ట్రంలో ప్రజలకు లేని రక్షణ తనకెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులే ప్రజలను భక్షిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్లీనరీ ఏర్పాట్లలో అధికార దుర్వినియోగం: పీసీసీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని పీసీసీ అధికార ప్రతినిథి బండి సుధాకర్ విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాల్లో లక్షల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్లీనరీల మీద..బహిరంగ సభల మీద వున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఎద్దేవా చేశారు. అమరుల త్యాగాల మీద, పునాదులపై అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. వారికి చేయాల్సిన ఆర్థిక సాయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. -
కేసీఆర్ గద్దె దిగడం ఖాయం
-
ఆ హామీ నెరవేరిస్తే టీఆర్ఎస్కి ప్రచారం చేస్తా..
-
ఆ హామీ నెరవేరిస్తే టీఆర్ఎస్కి ప్రచారం చేస్తా..
హైదరాబాద్: ఏడాదిలో హైదరాబాద్ వాసులకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం శుద్ధ అబద్ధమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, రాజిరెడ్డి అన్నారు. ఆ హామీని ప్రభుత్వం నెరవేరిస్తే 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తామని అన్నారు. ఈ మేరకు వారు భగవద్గీతపై ప్రమాణం చేశారు. తమ సవాల్‌ను రాష్ట్ర సర్కారు స్వీకరించాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టకపోతే ఎన్నికల్లో ఓటు అడగను అనడం కాదు... అసలు ఎన్నికల్లో పొటీనే చేయొద్దని టీఆర్ఎస్ నాయకత్వాన్ని, సీఎంను కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో నేటికీ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పారు. అబద్ధపు హామీలు ఇస్తూ.. ప్రజల్ని మోసం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
బీసీ బడ్జెట్ అంటే సరా?
సాక్షి, హైదరాబాద్: బీసీల బడ్జెట్ అని చెప్పుకుంటే సరిపోదని, బీసీ వర్గాల అభ్యున్నతికి కేటాయించిన నిధుల్లో పెరుగుదల ఉండాలని టీడీపీ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తాజా బడ్జెట్లో బీసీలకు చెప్పినంత గొప్పగా కేటాయింపుల్లేవని విమర్శించారు. కొన్ని పథకాలు భేషుగ్గా ఉన్నా వాటి కేటాయింపు అంకెలు అంతంతమాత్రంగానే ఉన్నాయని అన్నారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా గురువారం ఆయన శాసనసభలో ప్రసంగించారు. బీసీలకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారని, అందులో చేనేతకు సంబంధించిన రూ.1200 కోట్లు కలపడమేంటని ప్రశ్నించారు. ఎంబీసీలంటే ఎవరో తేల్చే సరికి ఏడాది గడుస్తుందని, వారి పేర కేటాయించిన రూ.వేయి కోట్ల నిధులకు ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్లకు నిధులు కేటాయించినా మిగతా కులాల సంగతే పట్టించుకోలేదన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు నిధుల్లో కోత పెట్టారని, రెండు పడక గదుల ఇళ్లకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. మభ్య పెట్టేందుకే భారీ కేటాయింపులు: రాజయ్య ప్రతి సంవత్సరం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నా ఖర్చు చేయడం లేదని సీపీఎం పక్ష నేత సున్నం రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వికలాంగులకు కేటాయింపుల్లో 70 శాతం నిధులు కూడా ఖర్చు కాకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడే ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో బడ్జెట్‌పై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సబ్‌ప్లాన్ అవసరమన్నారు. గిరిజన ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనులు ఇంకా ప్రారంభం కాలేదని అన్నారు. తక్షణమే మునిసిపల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సీఎం అంతరంగాన్ని ఆవిష్కరించింది: చింత ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతరంగాన్ని బడ్జెట్ ఆవిష్కరించిందని టీఆర్ఎస్ సభ్యుడు చింత ప్రభాకర్ పేర్కొన్నారు. మాకు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ ముఖ్యం అనే రీతిలో బడ్జెట్ కేటాయింపులను జరిపారన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను చూసి బడుగు, సబ్బండ వర్ణాలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. -
టీఆర్ఎస్పై దూకుడే..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిగ్విజయ్ హితవు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల అవి నీతిని సభలో ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచించారు. గురు వారం అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్ శాస నసభాపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఈ భేటీలో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరిం చాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. సీఎం మాటలకు చేతలకు పొంతన లేదన్నది అన్ని వర్గాల ప్రజల్లోకి బాగా పోయిందన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలు, వాటి అమ లులో వైఫల్యం, కేసీఆర్ కుటుంబ అవినీతి తదితరా లపై సభలో దూకుడుగా పోరాడా లని సూచించారు. మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిం దని, ఆ పథకంపై ప్రజల్లో టీఆర్ఎస్ కలిగిం చిన భ్రమలను తొలగించా లని భావన వ్యక్తమైంది. భగీరథపై సమ గ్రంగా అధ్యయనం చేసి ఆధారాలతో సహా సభలోనే ఎండ గట్టాలని సభ్యులు ప్రతిపాదిం చారు. సబ్‌ప్లాన్ నిధులు, బీసీలకు సబ్‌ప్లాన్, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితరాలపై సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయిం చారు. అయితే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టా ల్సిన అవసరం లేదని నిర్ణయించారు. బడ్జెట్ పైనే ఓటింగుకు అవకాశమున్నప్పుడు కొత్తగా అవిశ్వాసం అవసరంలేదనే ఈ నిర్ణయం తీసు కున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. భేటీలో ఆర్.సి.కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. వైఫల్యాలపై ఎండగడతాం: టీఆర్ఎస్ వైఫల్యాలను సభలోనే ఎండ గట్టాలని నిర్ణయించినట్టు సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించామన్నారు. ‘రీ డిజైన్ వల్లే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కోల్పోయాం. నిర్వాసితులకు భూ సేకరణ చట్టం–2013 ప్రకారమే పరిహారమి వ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కార్పొరేషన్ల నుంచి సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని పట్టుబడతాం. ధర్నాచౌక్‌ను తరలించాలన్న కుట్రపై పోరాడతాం. రైతులకు రుణమాఫీ చేయకుండామోసగించిన వైనం పైనా ఎండగడతాం’ అన్నారు. సమస్యలపై పోరాడండి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో గురువారం మైనారిటీ, గిరిజన, మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలను పెంచాలని సూచించారు. ఏప్రిల్ 9నుంచి 30వరకు గిరిజన పోరాటాలు చేయాలని నిర్ణయిం చామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో గిరిజన గర్జన, 13న దామరచర్లలో గిరిజనులతో బహిరంగసభ, 23న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో గిరిజన బహిరంగ సభ, ఏప్రిల్ 30న ఆదిలాబాద్‌లో గిరిజన సభ నిర్వహిస్తాం’’ అని ప్రకటించారు. యూపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను విశ్వసించబోనని దిగ్విజయ్ అన్నారు. -
‘తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి’
-
‘తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి’
హైదరాబాద్: రెవెన్యు మిగులు ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అవసరం లేకున్నా అప్పులు తెస్తున్నారని, అధికారం అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ హామీని అమలు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు అంచనాలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి జరుగుతోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. -
కేంద్రపథకాలకు ‘గులాబి’ రంగు వేస్తున్నారు
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు దుబ్బాక : కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం. రఘునందన్ రావు ఆరోపించారు. పల్లె పల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉప్పేసి పొత్తు కుదుర్చుకున్నట్లుగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన మరుగుదొడ్లకు గులాబిరంగు వేసుకుంటోందన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నామని చెప్పిన సీఎం రాష్ట్రంలో ఎంతమందికి మూడెకరాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేళ్ల కింద మంజూరు చేసిన లక్ష అవాస ఇళ్లలో ఎంతమందికి నిర్మించి ఇచ్చారో చెప్పాలన్నారు. దీపం పథకం కింద ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్లు, స్టౌలు సబ్సిడీపై కేంద్రం అందజేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నారాగౌడ్, పగడాల నరేందర్, వాసరి శ్రీనివాస్ యాదవ్, మన్నె బాబు, నాయకం తిరుపతి ముదిరాజు, అస్క నరేందర్, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పల్లె వంశీకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం : బీజేపీ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి మెదక్ : రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జగదేవ్‌పూర్ మండంలోని రాయవరం, తిమ్మాపూర్ గ్రామాల్లో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ రెండున్నర సంవత్సరాల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు.దిది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదన్నారు. నిరుద్యోగ సమస్యలపై జేఏసీ పోరాటం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల రాజయ్య, రాంరెడ్డి, మండలాధ్యక్షులు సత్యం, రాములు, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ వైఫల్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సూర్యాపేట : ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతిరెడ్డి సైదిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయని, కేవలం రెండు సీట్లు మాత్రం సమస్య ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అతికష్టమన్నారు. 2014 సంవత్సరంలో అధికారంలోకి రావాలనే కుయుక్తులతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. ఓట్లు, సీట్ల గురించి మాట్లాడడం తప్పా.. రైతులు, విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీపై ఎన్నడైనా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాట్లాడారా..అని ప్రశ్నించారు. సర్వేలు చేయించుకొని రాష్ట్రంలో 70 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా కాంగ్రెస్‌పార్టీకి రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో వచ్చేంత వరకూ గడ్డం తీయనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లశక్తిని గడ్డంతో పోల్చడం నీతిమాలిన పని అని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వైఎస్సార్సీపీకి ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లు రావడంతో పాటు నాలుగు చోట్ల డిపాజిట్లు దక్కాయని గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ ప్రస్తుతం రెండు ఎంపీ సీట్లు వస్తే ఆ ఎంపీలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలనే తపన తప్ప కాంగ్రెస్‌పార్టీకి, ప్రజాసమస్యలపై పోరాడుదామనే ఆలోచన లేదన్నారు. ఇతర పార్టీలను కించపరిచే విధంగా ఉత్తమ్ మాట్లాడడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు దొంతిరెడ్డి సైదిరెడ్డి, శేఖర్‌రెడ్డి, నాయకులు మద్ది ఉపేందర్‌రెడ్డి, గోరెంట్ల సంజీవ, ఎజాజ్, తాడోజు జనార్దన్చారీ, ఎండీ ఇఫ్రాన్, విష్ణు, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, చంటి, పవన్, వీరస్వామి, హరీష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్తో కలిస్తే ఐఎస్ఐతో కలసినట్టే
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తో కలిస్తే ఐఎస్ఐ ఏజెంటుతో కలసినట్టేనని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కుట్రలు చేసే ఐఎస్ఐతో కలసి పనిచేయడం, తెలంగాణ ప్రజల జీవన విధ్వంసానికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌తో కలసి పనిచేయడం ఒక్కటేనన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసలైన ఉద్యమకారులు ఆస్తులను, ప్రాణాలను, ఉద్యోగాలను పోగొట్టుకుంటే కేసీఆర్ మాత్రం మీడియా హౌజులు, ఫాంహౌజులు పెట్టుకుని వేలకోట్ల రూపాయలను సంపాదించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో అలవికాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, తెలంగాణకు పట్టిన చీడపురుగు అని వ్యాఖ్యానించారు. దొరలకు, దొర గడీలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల పక్షాన ఆవిర్భవించిన టీడీపీ, అదే లక్ష్యంతో కేసీఆర్‌పై పోరాడుతుందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'రాష్ట్ర భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం'
సాక్షి, హైదరాబాద్: కేంద్ర భూసేకరణ చట్టం 2013కు రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. ఈ బిల్లును అమలు చేస్తే ప్రజల నుంచి తీవ్ర నిరసనలను ఎదుర్కోవాల్సి ఉంటుం దని హెచ్చరించారు. బిల్లు సవరణపై రైతులు, వ్యవసాయ కార్మికులు వెంటనే నిరసనలకు దిగాలని పిలుపునిచ్చారు. కేంద్ర చట్టానికి మెరుగైన సవరణలు తెస్తామని చెప్పి... అందుకు భిన్నంగా జీవో 123, 214లను పరోక్షంగా అమలు చేసేందుకు పూనుకోవడం నియంతృత్వ పోకడలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర చట్టానికీ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకూ ఏమాత్రం పొంతన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్వాసిత ప్రజలకు వన్‌టైం సెటిల్మెంట్ కింద పునరావాస సౌకర్యాలు లేకుండా వారి బతుకులను బజారుపాలు చేయడం.. వారి గొంతు నొక్కడమే అవుతుందని ఆరోపించారు. -
టీఆర్ఎస్ పాలన సంతృప్తిగా లేదు
జేఏసీ చైర్మన్ కోదండరాం భీమదేవరపల్లి: రెండేళ్లు దాటినా టీఆర్ఎస్ పాలన అంత సంతృప్తిగా సాగడం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో రచించిన ‘మా పోరాటం’ పుస్తకాన్ని శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుతో కలిసి కోదండరాం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న హైదరాబాద్‌లో జేఏసీ కార్యవర్గ సమావేశంలో తాము అవలంబించే విధానాలు, భవిష్యత్ కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతులతో పాటుగా చేతివృత్తులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు వైద్యం, విద్య సైతం పూర్తిస్థాయిలో అందడం లేదని కోదండరాం అన్నారు. ప్రజల ఇబ్బందులను జేఏసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారి పక్షాన నిలుస్తుందన్నారు. నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో జేఏసీ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మా విధానాలు చేరువ చేసేందుకు త్వరలో మాస పత్రిక, వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. -
ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతాం
కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ యువజన విభాగం తెలంగాణ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ అన్నారు. సోమవారం కరీంనగర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువత అధ్యక్షుడు కంది వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డుకీడ్చిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో కనీసం దుప్పట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్‌తో పాటు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతింటి కల నెరవేర్చారని, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ రెండున్నరేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ అడుగు ముందుకు పడడం లేదన్నారు. పార్టీకి విధేయతగా ఉన్నవారందరికీ సముచిత పదవులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ మాట్లాడారు. అనంతరం అక్షయ్ యాదవ్, పిల్లిట్ల శంకర్, పిల్లిట్ల కుమారస్వామి, సంపతి శ్రీనివాస్‌లు 50 మంది అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సిరి రవి, కార్యదర్శి దుబ్బాక సంపత్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు. -
సీఎం హమీలు నీటి మూటలు
అల్లాదుర్గం: ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఒక్కటీ అమలు చేయలేదని, హమీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని భారతీయ జానత పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంచరణ్ యాదవ్ ఎద్దేవా చేశారు. మంగళవారం అల్లాదుర్గంలో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు తన చర్మం వలిచి చెప్పులు కుట్టిస్తానని చెప్పిన కేసీఆర్ నేడు రైతుల తోలు తీస్తున్నారని మండిపడ్డారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యువత బీజేపీ పాలనకు మొగ్గుచూపుతున్నారని, గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకు మండలంలో పర్యటిస్తామని తెలిపారు. త్వరలో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అల్లాదుర్గం మండల బీజేపీ నాయకులు కాళ రాములు, శంకరయ్య, టేక్మాల్ మండల కన్వీనర్ శ్యామయ్య, నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెద్దశంకరంపేట: రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎంపీపీ రాయిని సంగమేశ్వర్ అధ్యక్షతన పెద్దశంకరంపేట మండల పరిషత్ సాధరణ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రబీ సీజన్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన కరెంట్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రియాంక కాలనీలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎంపీటీసీ నిరసన.. వేసవిలో తాగునీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని పెద్దశంకరంపేట ఎంపీటీసీ సుభాష్‌గౌడ్ సభలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఇతర సభ్యులు జోక్యం చేసుకుని నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు రాజు, ఎంపీటీసీలు వేణుగోపాల్ గౌడ్, మాణిక్‌రెడ్డి, స్వప్న, సర్పంచ్‌లు జంగం శ్రీనివాస్, మధు, కాశీరాం, నర్సింలు పాల్గొన్నారు. -
కుమారుడి కోసమే కొత్త సచివాలయం
పెద్దపల్లి జిల్లా రైతుధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఫైర్ సాక్షి, పెద్దపల్లి: ‘ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఎంతోమంది సీఎంలు పాలించిండ్రు, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిండ్రు. కానీ కొడుకులెవరిని సీఎం లను చేయలేకపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వాస్తు దోషమంటూ ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రైతుధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయానికి వాస్తుదోషం లేదన్నారు. వాస్తుదోషం పేరుతో సీఎం కేసీఆర్ ఉన్న దాన్ని కూల్చివేసి కొడుకు కోసం కొత్త సచివాలయాన్ని కట్టించాలని అనుకుంటున్నాడని విమర్శించారు. రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్ అని చెబుతున్న సీఎం కేసీఆర్ రైతుల రుణమాఫీ కోసం కేవలం రూ.17 వేల కోట్లు ఒకేసారి కేటారుుంచలేరా? అని ప్రశ్నించారు. భారీ ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేస్తూ వేల కోట్లు కేటారుుస్తున్నారని, అదే రైతుల కోసం రుణమాఫీని ఒకేసారి చేయలేరా? అన్నారు. రాష్ట్రంలో 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వేలాది కోట్లను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కొత్త జిల్లాల విభజనను చేపట్టారని, ఇది పూర్తి కావడంతో ప్రజలు ప్రభుత్వ లోపాలను గుర్తించకుండా నియోజకవర్గాల పునర్విభజనను తెరమీదికి తెస్తున్నారని అన్నారు. రుణమాఫీని ఒకేసారి పూర్తిచేయాలని, రైతాం గానికి సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
ఎవరి దాడులకూ భయపడం: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న తమపై టీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వం దాడులు చేసినా భయపడబోమని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యలపై ప్రశ్నించే వారిపై దాడులు చేయడం మానుకోవాలన్నారు.ఎవరితోనూ రహస్య మంతనాలు జరపాల్సిన అవసరం తనకు లేదని, జూన్ 16న వారణాసిలో, 27న ఇందిరా పార్క్ దగ్గర ఉన్నానన్నారు. తమపై విమర్శలు చేసిన వారిపై కోపం లేదని... వారితో ఆరోపణలు చేయించిన వారికే సమాధానం చెబుతున్నామన్నారు. భూనిర్వాసితుల హక్కులను పరిరక్షించాలని కోరినా, రైతుల కరువు కష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి స్పష్టమైన ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోలేదని కోదండరాం విమర్శించారు. నూతన తెలంగాణలో తాము ఆశించింది ఇది కాదన్నారు. తమకు స్వప్రయోజనాలు లేవని, డీపీఆర్‌లు ప్రకటించి ప్రాజెక్టుల నిర్మాణాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం ఘనంగా ఉన్నా పథకాలకు మాత్రం చెల్లింపులు చేయట్లేదని...రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. పాలకులు సమస్యలపై చర్చిస్తే బాగుంటుందని కోదండరాం సూచించారు. ఈ నెల 11న మంథనిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా 13న వైద్యరంగ సమస్యలపై హైదరాబాద్‌లో సదస్సును, 20న సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలు, ఓపెన్ కాస్ట్‌ల సమస్యలపై హైదరాబాద్‌లో సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. -
స్కైవేల నిర్మాణాలకు సహకరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్కైవేలకు కంటోన్మెంట్ పరిధిలో భూసేకరణకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అధికారులు బుధవారం పరీకర్‌తో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేపట్టిన రెండు స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాల స్థలం అవసరమని, ఈ భూమి సేకరణకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతంలో భూమి కేటాయిస్తే స్కైవేల నిర్మాణాలకు కంటోన్మెంట్ పరిధిలోని భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పరీకర్ చెప్పినట్లు కేటీఆర్ మీడియాతో తెలిపారు. రెండు స్కైవేల నిర్మాణానికి ప్యారడైజ్ సర్కిల్ నుంచి కొంపల్లి వరకు (ఇందులో 3.8 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది), జూబ్లీ బస్టాప్ నుంచి షామీర్ పేట వరకు (ఇందులో 10 కి.మీ పరిధిలో కంటోన్మెంట్ భూమి ఉంది) స్కైవేల నిర్మాణాలను తలపెట్టామన్నారు. వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ పరిధిలోని సుమారు 100 ఎకరాల స్థలం అవసరమవుతుందని చెప్పారు. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రిని కోరినట్లు చెప్పారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. ‘కంటోన్మెంట్లో రహదారుల మూసివేతపై కూడా ఈ సందర్భంగా చర్చించాం. ఇక్కడ వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించా లని కోరాం. ఈ మూడు రహదారులకు సంబంధించి భూమి బదలాయింపు కింద ఔటర్ రింగ్ రోడ్డు బయట భూమి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పాం. దీనిపై సీఎంతో చర్చించి స్పష్టత ఇస్తామని హామీఇచ్చాం. వారం లోపు ఈ సమస్యను పరిష్కరిస్తాం’ అని కేటీఆర్ అన్నారు. పరీకర్‌ను కలసిన వారిలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఏ అండ్ యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్, ఆర్అండ్బీ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తదితరులున్నారు. -
మహిళలపై టీఆర్ఎస్ వివక్ష: శారద
సాక్షి, హైదరాబాద్: జోగినీలు, వికలాంగులు, భర్త విడిచిపెట్టిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష చూపుతోందని టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిగా మహిళలకు అభయహస్తం పింఛన్లు అందలేదన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం పేరిట కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. -
నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్!
-
నయీం కేసులో తొలి పొలిటికల్ వికెట్!
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కీలక పరిణామాలకు రంగం సిద్ధమవుతున్నది. గ్యాంగ్‌స్టర్ నయీంతో అంటకాగి.. అతని అక్రమాల్లో భాగమైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులపై వేటు వేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి పొలిటికల్ వికెట్ దీపావళి తర్వాత పడనుందని అత్యంత విశ్వనీసయ సమాచారం. నయీంతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ టీఆర్ఎస్ నేత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుపై మొట్టమొదటగా వేటు పడనుందని తెలుస్తోంది. ఆయనను పదవీ నుంచి తప్పించాలని టీఆర్ఎస్ అధిష్ఠాన వర్గం నిర్ణయించింది. దీపావళి పండుగ ముగిసిన వెంటనే నేతి విద్యాసాగర్‌రావు స్వచ్ఛందంగా మండలి డిప్యూటీ చైర్మన్ పదవి నుంచి దిగిపోనున్నారని సమాచారం. నవంబర్ 2న ఆయన రాజీనామా చేస్తారని, అనంతరం నవంబర్ 5న ఆయన స్థానంలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు నారదాసు లక్ష్మణరావు డిప్యూటీ చైర్మన్‌గా పగ్గాలు చేపడుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరింతమంది నాయకులపైనా వేటు! అండర్ వరల్డ్ నేరసామ్రాజ్యాన్ని స్థాపించి సామాన్యులను గడగడలాడించిన నయీంతో అనేకమంది రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు అంటకాగినట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నయీంతో సంబంధాలున్న పలువురు నాయకులు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా నయీం కేసు విచారిస్తున్న సిట్ కూడా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో నేతి విద్యాసాగర్ రావును పేరును ప్రస్తావించింది. ఆయనకు నయీంతో సంబంధాలు ఉన్నాయని పలువురు బాధితులు సిట్ ముందు వెల్లడించారు. అంతేకాకుండా నయీం బంధువులు కూడా నేతి సాయంతో తాము సెటిల్మెంట్లు చేసినట్టు వెల్లడించారని సమాచారం. నేతి విద్యాసాగర్‌రావుపై వేటు నేపథ్యంలో ఇతర రాజకీయ నాయకులపైనా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నయీం కేసులో తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తూ వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు పలువురిపైనా చర్యలు తప్పవని వినిపిస్తోంది. దీంతో నయీంతో సంబంధం ఉన్న టీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీల నేతల్లోనూ గుబులు మొదలైంది. -
హోంగార్డులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి
-
తాడుకు కోడిని కట్టి... చికెన్ తిన్నట్లుంది!
మహేశ్వరం: కేసీఆర్ పాలన చూస్తుంటే.. ‘తాడుకు కోడిని కట్టి ...చికెన్ తిన్నట్లు ఉంద’ని...పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ హోం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అప్పులు చేసి...ఆటోలు, కార్లు తీసుకొని జీవిస్తున్న వారి రేషన్ కార్డులు, పింఛన్లు ప్రభుత్వం తొలగించడం దారుణమని అన్నారు. అర్హుల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించినందుకు నిరసనగా సోమవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ,, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కుంటిసాకులతో అర్హులకు పథకాలు అందకుండా చేస్తోందన్నారు. అప్పుల బాధతో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీఎం వద్ద నియోజకవర్గ సమస్యలను లెవనేత్తే దమ్ము, ధైర్యం మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదని ఆమె విమర్శించారు. బతుకమ్మల పేరిట రూ.35 వేల కోట్లను సీఎం కుమార్తెకు విడుదల చేశారని ఆరోపించారు. ‘దసరా ముగిశాక విదేశాల్లో కవితమ్మ బతుకమ్మలు ఆడడం ఎంట’ని ఎద్దేవా చేశారు. చెవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ మీర్పేట్లోని టీకేఆర్ కాలేజ్‌లో ఇరిగేషన్, దేవాదాయ భూములు ఉన్నందుకు వాటిని కూల్చుతామని సీఎం కేసీఆర్ హెచ్చరించడంతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరారని విమర్శించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కనబడకుండా పోయారని అన్నారు. అంతకుముందు మహేశ్వరం చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తొలగించిన రేషన్ కార్డులను వెంటనే పురుద్ధరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఫ్లోర్‌లీడర్ ఎనుగు జంగారెడ్డి, మహేశ్వరం ఎంపీపీ పెంటమల్ల స్నేహ, పీఎసీఎస్ చైర్మన్ పోతర్ల అంబయ్య యాదవ్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, సీనియర్ నాయకులు కె.రఘుమారెడ్డి, కె.నర్సింహరెడ్డి, సుధాకర్‌రెడ్డి, బ్యాగరి సురేష్, ఎం.నవీన్, షేక్ అబుబాకర్, మహేశ్వరం, కందుకూరు పార్టీ మండల అధ్యక్షులు శివమూర్తి, కృష్ణానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
దీనావస్థలో భీం వారసులు
వీరి కుటుంబాల పరిస్థితి దయనీయం వెలుగులోకి భీం మనుమరాళ్లు.. కూలీ పనితో కుటుంబాల పోషణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వేడుకోలు కెరమెరి : నిజాం సర్కార్‌తో పోరాటం సాగించిన గిరిజన యోధుడు కుమ్రం భీం తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఆశయం కోసం పోరాడిన యోధుడిని ఎందరో స్మరించుకుంటున్నారు. కుమ్రం భీం త్యాగాలను ప్రభుత్వం గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారకపనులు చేపడుతోంది. కానీ ఆయన వారసులు మాత్రం దీనవస్థలో ఉన్నారు. నిన్నటివరకు భీం మనుమడు సోనేరావు, మనుమరాలు సోంబాయిలే తెలుసు. కానీ మరో మనుమడు, ఇద్దరు మనుమరాళ్లు ఉన్నారనే విషయం తెలియదు. వీరు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. చేతిలో పనిలేదు. వారికున్న సాగుభూమిలో పంటదిగుబడి లేకపోవడంతో పూటగడవడం కష్టంగా మారింది. వారి జీవన స్థితిగతులపై సాక్షి ప్రత్యేక కథనం. వారసత్వం పై అలసత్వం ‘కుమ్రం భీం’కు ఇద్దరు సంతానం. కుమారుడు మాధవరావు, కూతురు రత్తుబాయి. మాధవరావుకు ముగ్గురు పిల్లలు. సోనేరావు, భీమ్రావు వీరు సిర్పూర్(యు) మండలంలోని దోబే గ్రామంలో నివసిస్తున్నారు. రాధాబాయిది ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామం. భీం కుమారుల పరిస్థితి బాగు ఉన్నా.. చహకటి రత్తుబాయి నలుగురు పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈమెకు ముగ్గురు కూతుర్లు. ఒకరు సోంబాయి జోడేఘాట్‌లో, మరొకరు ఆడ జంగుబాయి, చహకటి ఎల్లు కొఠారిలో, ఇంకొకరు కుమ్రం కాసుబాయి సాకడ గ్రామంలో ఉంటున్నారు. స్ఫూర్తిదాతగా నిలిచారు భీం గొప్పవ్యక్తి..ఆదివాసీలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను గు ర్తించింది. దాంతో జోడేఘాట్ కొత్త పుంతలు తొ క్కనుంది. ఆయన త్యాగానికి గుర్తించిన సర్కార్.. జోడేఘాట్‌ను అభివృద్ధి బాటలో నిలిపేందుకు కృషిచేస్తోంది. కానీ, ఆయన వారసుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఇకనైన మా బతుకులు బాగుపడతాయంటే అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదంటు భీం మనమరాళ్లు ఆడ జంగుబాయి, కుంరం కాసుబాయి, చహకటి ఎల్లు ఆవేదన చెందుతున్నారు. జంగుబాయి గృహం పునాదులకే పరిమితం మండలంలోని కొఠారి గ్రామంలో కొన్నేళ్లుగా కు మ్రం జంగుబాయి నివసిస్తోంది. వీరికి పెంకుటి ల్లు దిక్కు. పదేళ్ల కిందట మంజూరైన ఇంది ర మ్మ గృహం పునాదులకే పరిమితమైంది. పాలక ప్రభుత్వాలు మారుతున్న వీరి బతుకుల్లో వెలు గు లేకుండాపోయింది. వీరిని పట్టించకున్న నా థుడే లేడు. ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసి ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. దీంతో వారు ఆ ఇంట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోసారి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదు. ఎలాంటి సాగుభూమి కూడా లేకపోవడంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. కాగా, ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో రోజుకు రూ. 100తో వంట మనిషిగా పనిచేస్తోంది. భీం వారసురాలైన ఈమెకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికసహాయం అందలేదు. ఈమె, భర్త జంగు, కళ్లు కనిపించవు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పెళ్లి అయింది. కనిపించని ఆర్థిక సహాయం మండలంలోని సాకడ గ్రామంలో నివసిస్తున్న భీం చిన్న మనుమరాలు కుమ్రం కాసుబాయి ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. గతంలో ఇల్లు మంజూరైన బిల్లు మాత్రం అందకపోవడంతో అప్పులు చేసి రేకుల ఇల్లు నిర్మించింది. ఉన్నా మూడెకరాల సాగుభూమిలో పంట దిగుబడి రాలేదు. దీంతో కుటుంబపోషణ భారమైంది. ఇప్పటికి శావుకారుల వద్ద నుంచి చేసిన అప్పులు తీర్చేదెలాగని ఆమె ఆందోళన చెందుతోంది. భీంతో సంబంధం ఉన్నట్లు కూడా అధికారులకు తెలియదు. అసలు ఆ దిశగా ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించలేదు. భర్త భీం, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎల్లుది కూడా అదే గతి మండలంలోని కొఠారిలో ఉంటున్న మనుమడు చహకటి ఎల్లు పరిస్థితి కూడా ఇదే. మూడెకరాల సాగుభూమి ఉన్నప్పటికి రాళ్లురప్పలతో కూడుకుంది. ప్రతీ సంవత్సరం అప్పు చేసి వేలకువేలు వెచ్చిస్తున్నప్పటికి దిగుబడి రావడం లేదు. ఖరీఫ్‌లో వ్యవసాయం చేస్తుండగా మిగిలిన రోజుల్లో కూలీ పని దిక్కు. భార్య చిత్తుబాయి, కొడుకు వినోద్, సంజు ఉన్నారు. పట్టించుకోని అధికారులు ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులకు కలిసి నివేదనలు సమర్పించిన స్పందించిన దాఖలాలు లేవు. ఐటీడీఏ నుంచి రుణం అందలేదు. ఎడ్డు జతలు కావాలని గతంలో దరఖాస్తులు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇళ్లు లేవు, వ్యవసాయ భూములు లేవు, ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం కుమ్రం భీం చేసిన త్యాగాలను గుర్తించి జోడేఘాట్‌లో రూ. 25 కోట్లతో స్మారక పనులు చేపడుతున్నప్పటికి భీం వారసుల పరిస్థితి మాత్రం కడు దయనీయంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలి తమను ప్రభుత్వం ఆదుకోవాలి. తాత కుమ్రం భీం పేరిట వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం మా కుటుంబాల గురించి పట్టించుకోవాలి. మమ్మల్ని కూడా గుర్తించి తగిన ఆర్థిక సహాయం అందించాలి. ఐటీడీఏ నుంచి రుణం ఇవ్వాలి. - ఆడ జంగుబాయి. కొఠారి ఎడ్ల జతలివ్వాలి వ్యవసాయం చేసేందుకు కనీసం ఎడ్ల జతలన్న ఇవ్వాలి. ఎలాంటి సహకారం లేకపోవడంతో అష్టకష్టాల్లో ఉన్నాం. ప్రభుత్వం సాగుభూమి అందించాలి. సోనేరావుకు ఇచ్చిన ట్లే ఆర్థిక సహాయం ఇవ్వాలి. - చహకటి ఎల్లు, కొఠారి భూమి పంచివ్వాలి మ తల్లి గారి భూమి దోబే గ్రామంలో ఉంది. ఒక్క మనుమడే లాభం తీసుకుంటున్నాడు. అది అందరికి దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి నాలుగు ఎకరాల భూమిని పంచి ఇవ్వాలి. మా పరిస్థితులను బాగు చేయాలి. - కుంరం కాసుబాయి, సాకడ -
ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలి
కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరిగిందనే నమ్మకముంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎంపీ లు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలొస్తే ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని కేసీఆర్ మాట్లాడటంపై సవాల్ చేశారు. ప్రజల్లో ఆదరణ పెరిగిందనుకుంటే ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి భయం ఎందుకన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుణ సహాయం కోసం 1.6 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని చెబుతున్న కేసీఆర్ రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. -
తెలంగాణలో నవశకానికి నాంది
హైదరాబాద్: తెలంగాణలో నవశకానికి దసరా పండుగ రోజున శ్రీకారం చుట్టారు. విజయదశమి పర్వదినం నాడు తెలంగాణ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి తెర లేచింది. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో ఒకేసారి 21 జిల్లాలను టీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది. సిద్ధిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మిగతా జిల్లాలను ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ప్రారంభించారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1. జగిత్యాల- డిప్యూటీ సీఎం మహమూద్ అలీ 2. వరంగల్ రూరల్- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి 3. రాజన్న(సిరిసిల్ల)- మంత్రి కేటీఆర్ 4. జనగామ- మండలి చైర్మన్ స్వామిగౌడ్ 5. జయశంకర్- అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి 6. మెదక్- డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి 7. యాదాద్రి- హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి 8. పెద్దపల్లి- మంత్రి ఈటల రాజేందర్ 9. కామారెడ్డి- మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి 10. మంచిర్యాల-మంత్రి పద్మారావు గౌడ్ 11. వికారాబాద్- మంత్రి మహేందర్ రెడ్డి 12. ఆసిఫాబాద్- మంత్రి జోగు రామన్న 13. సూర్యాపేట-మంత్రి జగదీశ్ రెడ్డి 14. కొత్తగూడెం-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 15. నిర్మల్-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 16. వనపర్తి-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి 17. నాగర్ కర్నూలు- మంత్రి జూపల్లి కృష్ణారావు 18. మహబూబ్ నగర్- మంత్రి చందూలాల్ 19. జోగులాంబ: మంత్రి లక్ష్మారెడ్డి 20. మేడ్చల్: మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ -
'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు'
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన బండారీ లేఅవుట్లో సహాయక చర్యలు చేపట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అక్రమ కట్టడాలకు కారణమైనవారు టీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ నిధులను ఆర్టీసీకి తరలించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. హైదరాబాద్‌పై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. -
'టీఆర్ఎస్ సర్కార్‌కు అలవాటైపోయింది'
కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం కరీంనగర్లో నిప్పులు చెరిగారు. మంచి జరిగితే ప్రభుత్వం గొప్పతనం... నష్టం జరిగితే గత ప్రభుత్వాల అసమర్థల అనడం ఈ ప్రభుత్వానికి అలవాటైపోయిందని టీఆర్ఎస్ సర్కార్‌పై మండిపడ్డారు. మిడ్ మానేరుపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్బంగా టీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మిషన్ కాకతీయ పేరుతో అవినీతి జరుగుతుందని పొన్నం విమర్శించారు. -
'అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తా'
హైదరాబాద్ : మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో జరిగిన అవినీతిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ...టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంసెట్-2 లీకేజీ విషయంలో మంత్రిని ఎందుకు కాపాడుతున్నారని ? నాగం ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతిపై హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. కృష్ణాజలాలపై ఏపీ ప్రభుత్వం పాలమూరు జిల్లాకు అన్యాయం చేయొద్దని సూచించారు. -
త్వరలోనే జీహెచ్ఎంసీలో భారీ బదిలీలు ?
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో త్వరలో భారీ బదిలీలు జరుగనున్నాయి. దసరా నాటికి జీహెచ్ఎంసీలోని ప్రస్తుతం ఉన్న 24 సర్కిళ్లను 30 సర్కిళ్లుగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈలోపు దీర్ఘకాలంగా జీహెచ్ఎంసీలో చాలాకాలంగా ఓకే స్థానంలో వారిని బదిలీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఐదారేళ్లకు పైబడి.. పదేళ్లు ఆపైన పనిచేస్తున్నవారి వివరాలు పంపించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి వచ్చిన వారు ఏళ్ల తరబడి టౌన్‌ప్లానింగ్, ఆరోగ్యం- పారిశుధ్యం, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో పాతుకుపోయారు. డీటీసీపీ నుంచి వచ్చిన వారు టౌన్‌ప్లానింగ్‌లో, పబ్లిక్ హెల్త్ నుంచి వచ్చిన వారు ఇంజినీరింగ్ విభాగంలో, వైద్య ఆరోగ్యశాఖ నుంచి వచ్చిన వారు ఆరోగ్యం - పారిశుధ్యం విభాగాల్లో కొనసాగుతున్నారు. వారిలో అధిక శాతం భారీగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఇటీవల ఏసీబీ దాడుల్లోనూ కోట్లకు కోట్లు అక్రమాస్తులు బయటపడుతున్నాయి. దాంతో దీర్ఘకాలంగా పని చేస్తున్నవారిని, అక్రమార్కులుగా పేరున్న వారిని బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నవారిని ఇతర కార్పొరేషన్లలోకి , ఇతర కార్పొరేషన్లలోని వారిని జీహెచ్ఎంసీకి బదిలీ చేసేందుకు వీలుగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను కూడా అమల్లోకి తేనున్నట్లు తెలిసింది. త్వరలో భారీ బదిలీలు జరుగనున్నాయని తెలిసే టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో ఇటీవల భారీగా కొత్త నియామకాలు జరిగినప్పటికీ వారిని తాత్కాలికంగా ఆయా పోస్టుల్లో నియమించారు తప్ప స్థిరమైన స్థానాలు కేటాయించలేదు. డిప్యూటీ కమిషనర్లు సైతం ఒక్కరే రెండేసి సర్కిళ్లకు పని చేస్తున్నవారున్నారు. ఒకసారి బదిలీలన్నీ పూర్తయ్యాక, మిగిలి ఉండేవారిని బట్టి స్థిరమైన స్థానాల్లో కేటాయించాలనే యోచనలో ఉన్నతాధికారులున్నట్లు తెలుస్తోంది. సాధారణ ఉద్యోగులతోపాటు ఐదారుగురు అడిషనల్/జోనల్ కమిషనర్లు సైతం బదిలీ కావచ్చునని తెలుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీలో కీలకమైన సదరు పోస్టుల్లోనూ కొత్తవారు రానున్నారు. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
అర్వపల్లి : ఎన్నికల సమయంలో దళితులకు టీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గోలి ప్రభాకర్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమిలేని దళితులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాలు ఉచితంగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రెండేళ్ల కాలంలో కేవలం 3వేల కుటుంబాలకు మాత్రమే భూమి పంపిణీ చేశారని చెప్పారు. రాష్ట్రంలో భూమిలేని దళితులు 2.91లక్షల కుటుంబాలు ఉన్నారని, అలాగే ఎకరంకన్న తక్కువ ఉన్న కుటుంబాలు 1.48లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య వాగ్ధానాలు ఎప్పటికీ తీరవన్నారు. దళితులకు చేసిన హామీలను ప్రభుత్వం నెరవేర్చక పోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నాసిరకంగా పుష్కరాల పనులు :వీహెచ్
హైదరాబాద్ : రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల పనులు నాసిరకంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీహెచ్ ఆరోపించారు. దీనిపై గవర్నర్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గుళ్లు గోపురాలు తిరగడానికి తప్ప ఆయనకు వేరే పనిలేదని ఎద్దేవా చేశారు. భవానీ ఘాట్ వద్ద నిర్మించిన బ్రిడ్జి నాసిరకంగా ఉందని... పిల్లర్ పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగుతోన్న పుష్కర పనులపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పుష్కర పనులు కాంట్రాక్ట్ తీసుకున్న సోమా కంపెనీ ఎవరిదో బయటకు రావాలని వీహెచ్ అన్నారు.గవర్నర్‌కు ఇచ్చే వినతి పత్రాలన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గవర్నర్ ఉన్నంత వరకు న్యాయం జరగదన్నారు. ఛలో మల్లన్న సాగర్‌కు తనను పిలవలేదని కాంగ్రెస్ నాయకులపై వీహెచ్ మండిపడ్డారు. నేను మల్లన్నసాగర్‌కు వెళ్తే.. ఎవరిని అడిగి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి అనడం దారుణమని వీహెచ్ వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులను ఆమె బెదిరించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన నాయకులే నన్ను వద్దని అన్నప్పుడు నేను ఎందుకు వెళ్లాలని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలు'
కరీంనగర్: తెలంగాణలో అవినీతి, అసమర్థ పాలన సాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. మంత్రులకు అధికారం లేక డమ్మీలుగా ఉన్నారని ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనకు రెండేళ్లతో హనిమూన్ ముగిసిందన్నారు. మల్లన్నసాగర్ తో యుద్ధం మొదలైందని అన్నారు. ప్రతిపక్షాలు లేకుండా శాసనసభను కేసీఆర్ నాశసనం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో హరించుపోయిన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియాదే అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మిషన్ భగీరథ పథకాల్లో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. -
'హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యావ్యవస్థపై టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గవర్నర్ ప్రమేయం లేకుండా వీసీల నియామకం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. వీసీల నియామకాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీలకు కేసీఆర్ ప్రభుత్వం ఇటీవల వీసీలను నియమించింది. అయితే నియామకాలను హైకోర్టు గురువారం కోట్టివేసింది. -
ప్రజావ్యతిరేక పాలన
మల్లన్నసాగర్ రైతులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్టు తాండూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని తాండూరు కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులను పరామర్శించేందుకు మంగళవారం వెళుతున్న తాండూరు నియోజకవర్గానికి చెందిన నాయకులు దారాసింగ్, ద్యావరి విష్ణువర్ధన్‌రెడ్డి, అపూ, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, జనార్దన్‌రెడ్డి, విద్యాసాగర్, రఘు, రాజ్‌కుమార్, అశోక్, నారాయణరెడ్డి, రాజు, పునీత్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులను శామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం వారిని దుండిగల్ ఠాణాకు తరలించి, వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బలవంతంగా రైతుల నుంచి భూములను లాక్కోవడం అన్యాయమన్నారు. దౌర్జన్యంగా కాకుండా ఇష్టపూర్వంగా రైతుల నుంచి భూములు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించాలని వారు ప్రభుత్వానికి సూచించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే తప్ప రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
చేవెళ్లరూరల్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ తెలిపారు. శనివారం మండలంలోని ఆలూరులో సీపీఐ గ్రామ శాఖ సభను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన సీపీఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అమలు పర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై మేధావులు, కళాకారులు, ఉద్యమకారులు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కివేస్తున్నారని వాపోయారు. ఇటీవల కోదండరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులతో ఎదురుదాడికి దిగారన్నారు. సీపీఐ మండల కార్యదర్శి సుధాకర్‌గౌడ్, మైనార్టీ సెల్ చేవెళ్ల అధ్యక్షుడు మక్బూల్, మహిళా సమాఖ్య నాయకురాలు మంజుల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అంజయ్య, ప్రభులింగం, వెంకన్న పాల్గొన్నారు. సీపీఐ ఆలూరు గ్రామ కార్యదర్శిగా దేవగోని మల్లేశం ఆలూరు గ్రామ కమిటీని పార్టీ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ గ్రామ కార్యదర్శిగా దేవగోని మల్లేశం, సహాయ కార్యదర్శిగా యాదయ్య, ఏఐవైఎఫ్ అధ్యక్షుడిగా కె. సుదర్శన్, కార్యదర్శిగా శ్రీనువాస్, వ్యవసాయకార్మిక సంఘం అధ్యక్షుడిగా అడివయ్య, రైతు సంఘం అధ్యక్షుడిగా బుచ్చన్న, ఏఐఎస్ఎఫ్ కన్వీనర్‌గా సుమలత, జంగయ్, నాయీబ్రహ్మణ సంఘం కన్వీనర్‌గా శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
నన్ను ముట్టుకుంటే తడాఖా చూపిస్తా : జగ్గారెడ్డి
మెదక్: కేసీఆర్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలని చూస్తోందని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ....తనను ముట్టుకుంటే తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. మరో నేత దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నాడు ప్రారంభిస్తే...దాన్ని ముందుకు కొనసాగించలేని అసమర్థ పాలన సీఎం కేసీఆర్‌దని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలనను కొనసాగిస్తున్నారన్నారు. త్వరలో కేసీఆర్‌ను ప్రజలే పాతరేస్తారని చెప్పారు. -
'కావాలనే మాపై బురద జల్లుతున్నారు'
హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ అప్లికేషన్లను కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బుధవారం విజయవాడలో పరకాల ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. కావాలనే మాపై బురద జల్లుతున్నారని తెలంగాణ మంత్రిపై ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం పోర్టల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవిలు జరిగాయని పరకాల ప్రభాకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మాపై ఆరోపణలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చాయో ముందు చెప్పాలని పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు రీ డిజైన్లు
► 2013 చట్టమే రైతులకు శ్రీరామరక్ష ► మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మహబూబ్‌నగర్: ‘పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసే సోయి లేని ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకునేందుకు దళారీగా మారి భూ దోపిడీకి పాల్పడుతోంద’ని మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం మండలంలోని పాలమూరు ఎత్తిపోతల పథకం వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసిత రైతాంగంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద రైతుల జీవితాలను కాపాడాలన్న సంకల్పంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కనపెట్టి నిరంకుశ ముఖ్యమంత్రి నాలుగు గోడల మధ్య నాలుగు పేజీల జీఓ నం. 123ని తీసుకువచ్చారని విమర్శించారు. రాజ్యాంగ రక్షకుడే భక్షకుడిగా మారి పేద రైతుల జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టుల రీడిజైన్ చేసి రూ.వేల కోట్లలో ప్రజాధనాన్ని దోచుకోవడానికి కుట్రపన్నారని విమర్శించారు. రైతులకు అండగా ఉండి 2013 భూ సేకరణ ప్రకారం పేద రైతులకు పరిహారం వచ్చే వరకు వారి ముందుండి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ప్రాజెక్టుల వ్యయం పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. రాష్ట్రంలో రైతులను పెడుతున్న ఇబ్బందులు చూస్తే నాటి రజాకార్ల జమానా గుర్తుకు వస్తుందని చెప్పారు. తరతరాలుగా నమ్ముకున్న భూమిని సాదా కాగితాలపై సంతకాలు తీసుకొని పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని, భూములు పోతాయన్న బాధతో గిరిజన, హరిజన రైతాంగం గుండెపోటుతో మృతి చెందిన ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు పేదల రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కర్వెన సభలో ఎత్తిపోతల పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇచ్చి మొదటి నెల జీతం ఇచ్చాకే పనులు ప్రారంభిస్తామని రైతులను బెదిరించే కార్యక్రమానికి పూనుకున్నారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు అద్దంకి దయాకర్, పవన్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, జెడ్పీటీసీలు సుధాపరిమళ, మణెమ్మ, నాయకులు బాలరాజుగౌడ్, మాన్యనాయక్, సంపత్‌రెడ్డి, రైతులు లక్ష్మణ్, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ తీరుపై సీపీఐ మండిపాటు
► ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా లేకుండా చేసిన ప్రభుత్వం ► ప్రాజెక్ట్ మార్పుతో జిల్లా ప్రజలకు అన్యాయం ► సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ ఆదిలాబాద్: ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మండిపడ్డారు. సోమవారం స్థానిక ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్ మార్పుతో జిల్లాకు ఎంతో అన్యాయం చేశారని మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటులో ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలను భాగస్వాములను చేస్తామని ప్రకటించిన కేసీఆర్ అందుకు విరుద్ధంగా నియంత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి వచ్చే వామపక్ష పార్టీలు, జేఏసీతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. పార్టీకి జిల్లా వ్యాప్తంగా 227 శాఖలు ఉన్నాయని జూలై 15 నుంచి అగస్టు చివరి వారం వరకు గ్రామస్థాయిలో ఉండి నియోజక వర్గాల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో జిల్లా మహసభలను నిర్వహించి అక్టోబర్‌లో రాష్ర్ట మహసభలను వరంగల్‌లో నిర్వాహిస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.తిరుపతి, సహయ కార్యదర్శి డి.సత్యనారాయణ, భీమనాధుని సుదర్శన్, లింగమూర్తి, పట్టణ కార్యదర్శి ఒడ్నాల శంకర్, రంగు మధునయ్య, జనార్ధన్, బాపు తదితరులున్నారు. -
ప్రజావ్యతిరేక సర్కార్‌ను సాగనంపండి : వైఎస్సార్సీపీ
కరీంనగర్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నగేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ నియంతపాలన కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో వ్యవ హరిస్తూ సామాన్యులను ఇబ్బంది గురిచేస్తోందని.. ప్రజావ్యతిరేక సర్కార్‌ను సాగనంపాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎస్ఈకి అందజేశారు. రైతులకు మూడో విడత రుణమాఫీ నిధులు రూ. 4250 కోట్లు ఒకే దఫాలో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల రుణమాఫీ విషయంలో స్పష్టత లేకపోవ డంతో బ్యాంకర్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. తద్వార రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, యెల్లంకి రమేశ్, నగర అధ్యక్షుడు దేవరవేణి వేణుమాధవరావు, యువజన విభాగం అధ్యక్షుడు కంది వెంకటరమణారెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు బోగే పద్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గండి శ్యాం, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు దీటి సుధాకర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
సూర్యాపేట : వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి.. రెండళ్ల పాలనలోనే చేసి చూపించామని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని మైనార్టీ గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రం వస్తే ఏం వస్తుందని ఎద్దేవా చేసిన వారున్నారని.. కానీ రాష్ర్టం వస్తే బంగారు తెలంగాణఅవుతుందని అప్పుడే కేసీఆర్ చెప్పారన్నారు. చెప్పిన మాటను నిలబెట్టుకునేలా పాలన సాగిస్తున్నారన్నారు. ఊహించిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పా రు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందన్నారు. మోదీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురిం చి మాట్లాడుతున్నారని తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 250 గురుకుల పాఠశాలలను ప్రారంభించామని పేర్కొన్నారు. విద్య ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే కేసీఆర్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆర్డీఓ కిషన్‌రావు, ఈడీ ఎండీ సలీంపాషా, ఓఎస్డీ సిరాజుల్లాఖాన్, ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, తహసీల్దార్ మహమూద్‌అలీ, కమిషనర్ వడ్డె సురేందర్, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్ర కాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, కెక్కిరేణి నాగయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, ప్రిన్సిపాల్ షేక్ జానిమియా, పి.స్వరూపారాణి, కరుణాకర్, మండాది గోవర్ధన్‌గౌడ్, మీర్ అక్బర్ పాల్గొన్నారు. -
పేదల నడ్డి విరిచిన టీఆర్ఎస్ : వైఎస్సార్సీపీ
మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు అమృతసాగర్ రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్, బస్ చార్జీలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు అమృతసాగర్ విమర్శించారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో ఎండీ ఖాలేద్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ధరలు పెంచుకుంటూ పోతే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యుత్, బస్ చార్జీలను ఒక్క పైసాకూడా పెంచకుండా బంగారు పాలన అందించారని గుర్తు చేశారు. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రాష్ర్టంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని అమృతసాగర్ కోరారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలతో మమేకమై ఉద్యమించాలని సూచిం చారు. పార్టీ నూతన కమిటీలను త్వరలో నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాదగోని జంగయ్యగౌడ్, జిల్లా కార్యదర్శులుగా నల్ల ప్రభాకర్, ఎండీ.ఖాలేద్, యాచారం, మంచాల మండలాల అధ్యక్షులుగా పి.జయరాజ్, బుగ్గరాములు, ఇబ్రహీంపట్నం మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా దూసారి వేణుప్రసాద్‌గౌడ్, మంచాల బీసీ సెల్ అధ్యక్షుడిగా భూర జంగయ్యగౌడ్‌ను నియమించాలని రాష్ట్ర అధిష్టానానికి ప్రతిపాదనలు పంపిం చినట్లు వివరించారు. నాయకులు డి.కుమార్‌గౌడ్, ఎల్. యాదగిరి, కె.సురేందర్‌రెడ్డి, ఎన్.మహేష్, టి.అబ్బాస్‌గౌడ్, కె.సతీష్, ఎస్కే జావిద్, ఆర్.రఘవీర్ పాల్గొన్నారు. -
'ఇస్తాంబుల్ అన్నారుగా ఏమైంది'
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్ తరహాలో అభివృద్ధి చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. మరీ ఇప్పుడు ఇస్తాంబుల్ ఏమైందో ప్రజలకు చెప్పాలని తెలంగాణ శాసనపక్ష ప్రతిపక్ష నేత కె జానారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రజల సెంటిమెంట్, అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లా ఏర్పాటు అయితే సరేకానీ, రాజకీయ అవసరాల కోసం జిల్లాలను విభజించొద్దని చెప్పారు. యాదగిరిగుట్టను జిల్లా చేయాలని తాను కోరుతున్నట్టు జానారెడ్డి తెలిపారు. -
'కాంట్రాక్టర్ల కోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు'
నిజామాబాద్: కాంట్రాక్టర్ల కోసమే టీఆర్ఎస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును చేపడుతున్నారని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. నిజామాబాద్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.... ఆ ప్రాజెక్టు వల్ల 50 టీఎంసీల నీళ్లు కూడా రావని చెప్పారు. టీఆర్ఎస్ నేతల జేబుల నింపడానికే రాష్ట్రంలో ప్రాజెక్టుల నాటకమాడుతున్నారని షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులనే ప్రజలకు చూపించి టీఆర్ఎస్ నేతలు మోసం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. -
కాంగ్రెస్ విధానాలనే టీఆర్ఎస్ అవలంభిస్తోంది : దత్తాత్రేయ
హైదరాబాద్: పదేళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాటించిన విధి విధానాలనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా అవలంభిస్తోందని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ...పార్టీ ఫిరాయింపులపై టీఆర్ఎస్కు చురకలంటించారు. ప్రలోభాలపై అధికార పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సాయంపై తెలంగాణ మంత్రలు అబద్ధాలు చెబుతున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. -
'టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో భేటీయ్యింది. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ....టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం రోజూ హత్యకు గురౌతుందని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంతృత్వాన్ని, కుటుంబ పాలనను బీజేపీ మాత్రమే ఎదుర్కొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలు బీజేపీలో లేరని చెప్పారు. ప్రస్తుతం దేశం మొత్తం బీజేపీ వైపే చూస్తోందన్నారు. బీజేపీకి, ఇతర పార్టీలతో పోలికే లేదని మురళీధరరావు స్పష్టం చేశారు. -
'కొత్త జిల్లాలపై మా అభిప్రాయాలు తీసుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేయడం సరికాదన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మల్లు రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో అందరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తెలంగాణలో మూడో విడత రుణమాఫీ వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని మల్లు రవి చెప్పారు. -
అమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ధ్వజం కేంద్రం ఇచ్చింది ముష్టి రూ. 36 వేల కోట్లు రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఆయన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తింది. తెలంగాణకు కేంద్రం ఈ రెండేళ్లలో ముష్టి రూ.36 వేల కోట్లు విదిల్చగా, రూ.90 వేల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణకు చాలా సాయం చేస్తున్నామని, తామిచ్చిన డబ్బు ప్రజలకు చేరడం లేదని అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ రాములునాయక్‌లతో కలసి ఆయన శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాలు కేంద్రం వద్ద భిక్షమెత్తుకోవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థికశక్తి ఆకాశం నుంచి ఊడిపడలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రాలే వివిధ పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లిస్తున్న విషయం మరిచిపోవద్దన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు 2014-15లో సీఎస్ఎస్ కింద రూ.5,028 కోట్లు, సెంట్రల్ ట్యాక్స్ కింద రూ. 8,189 కోట్లు, ఎన్డీఆర్ఎఫ్ కింద రూ.19 కోట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రూ.2,110 కోట్లు మొత్తంగా రూ.15,345 కోట్లు వచ్చాయని, ఇవే పద్దుల కింద 2015-16లో రూ.19,944 కోట్లు విడుదల చేశారని మంత్రి చెప్పారు. ఈ రెండేళ్లలో రూ.35,289 కోట్లు మాత్రమే అందాయన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, అవాస్తవాలు మాట్లాడడం ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నేతకు తగదని హితవు పలికారు. రెండేళ్లలో రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా ఆదరణ పొందలేకపోయిందని, చివరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఒకవైపు బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి తెలంగాణ ప్రభుత్వాన్ని, పథకాలను మెచ్చుకుంటుండగా, మరోవైపు ఆ పార్టీ అధ్యక్షుడు విమర్శలకు దిగడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణకి అద్దం పడుతోందన్నారు. భారీ మెజారిటీ తో కేంద్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే చేసిందేమిటని ఈటల ప్రశ్నించారు. ప్రధాని విదేశాల్లో విహరించడం తప్ప దేశ ప్రజల మనసులు దోచుకునే విధంగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారని విమర్శించారు. అంగన్వాడీలకు యూపీఏ ప్రభుత్వ హయాంలో రూ.15,800 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కేవలం రూ.8 వేల కోట్లకు కుదించిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇలాంటి చర్యలతో తాము పేదల పక్షంకాదని, కార్పొరేట్ వర్గాల పక్షమని ఎన్డీయే సర్కారు నిరూపించుకుందన్నారు. ‘‘కేంద్రం సాయం చేయకున్నా ఫర్వాలేదు. మా కాళ్లలో కట్టె పెట్టే చర్యలు ఆపండి.’’ అని ఈటల పేర్కొన్నారు. బీజేపీవి ఉల్టా పల్టా మాటలు: మహమూద్ అలీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సూర్యాపేట సభలో ఉల్టా పల్టా మాటలు మాట్లాడారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ విమర్శించారు. ఈ రెండేళ్లలో కేంద్రం తెలంగాణకు మద్దతుగా నిలవలేదన్నారు. కరువు సాయం కింద రూ.3 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్రం కోరితే కేంద్రం రూ.700 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. విదేశాల్లో తిరిగే ప్రధాని మోదీకి పేదల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణకు ఐఎఎస్ అధికారులను కేటాయించకుండా ఇబ్బందుల పాలు చేసింది కేంద్రం కాదా అని నిలదీశారు. -
వెల్లంకిలో సీపీఎం నేతల భిక్షాటన
నల్గొండ : అప్పుల బాధతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి సంక్షేమానికి తెలంగాణ సర్కార్ స్పందించకపోవడంపై సీపీఎం నేతలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం సీపీఎం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీతారాములతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చేతకానిది కాదు.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం'
మహబూబ్ నగర్: తెలంగాణ ప్రభుత్వం చేతకానిది కాదని.. చేవ ఉన్న చేతల ప్రభుత్వం' అని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం పాలన అంటే పాఠాలు చెప్పడం కాదని మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
కొత్తగా రెండు జిల్లాలు: మహేందర్ రెడ్డి
అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం నిధులు, నీళ్లు రాబట్టడంలో సఫలమయ్యాం జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం ‘సాక్షి’ఇంటర్వ్యూలో మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రగతిమార్గాలు రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశాం. దారి ఉన్న గ్రామాలు ప్రగతికి సూచికలనే మాటను నిజం చేసేలా.. పంచాయతీరాజ్ రోడ్లకు అత్యధిక నిధులు విడుదల చేశాం. గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేసే పల్లెల రోడ్లను అభివృద్ధి చేయడానికి రూ.800 కోట్లు మంజూరు చేశాం. జిల్లా చరిత్రలోనే తొలిసారి ఆర్అండ్బీ రోడ్లకు రూ.2వేల కోట్లను కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో సంప్రదింపులు జరపడం ద్వారా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్- బీజాపూర్ హైవేకు జాతీయ హోదా సాధించగలిగాం. జలం.. దక్కింది ఫలం జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోవడం... వ ర్షపు నీరు భూమిలోకి ఇంకేలా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాం. కనుమరుగవుతున్న నీటివనరులను కాపాడుకోవడమే ధ్యేయంగా మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టాం. రెండే ళ్లలో రూ.360 కోట్లతో 1,145 చెరువులను బాగు చేశాం. పూడిక తీత, నీటి నిల్వ సామర్థ్యం పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు అతిత్వరలోనే మనకు కనిపించనున్నాయి. ‘మా గ్రామం-మా చెరువు’ నినాదంతో ప్రతి చెరువును అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో నిధులు విడుదల చేస్తున్నాం. కోట్‌పల్లి ప్రాజెక్టు విస్తరణకు రూ.86 కోట్లు కేటాయించాం. ‘భగీరథ’ ప్రయత్నం సఫలం ఆడపడుచు బిందె పట్టుకొని బయటకు వెళ్లకూడదనే ఏకైక సంకల్పంతో అమలు చేస్తున్న మిషన్ భగీరథ కార్యరూపం దాల్చింది. జిల్లాలో రూ.2 వేల కోట్లతో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చే పనులకు టెండ ర్లను కూడా ఖరారు చేశాం. జూన్ మొదటి వారంలో మేడ్చల్ మండలంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నాం. అంతర్జాతీయ ఖ్యాతి గూగుల్, మైక్రోమ్యాక్స్, అమెజాన్, ఆపిల్ లాంటి సంస్థలకు జిల్లా కేంద్రబిందువైంది. నూతన పారిశ్రామిక విధానంతో జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగుల భద్రత లక్ష్యంగా... ‘షీ’ క్యాబ్‌లను ప్రవేశపెట్టాం. ప్రత్యేకంగా వారికోసం ఏసీ బస్సులను నడుపుతున్నాం. రూ.40 కోట్లు నష్టం వచ్చినా వారి రక్షణ దృష్ట్యా ఆర్డీనరీ బస్సుల్లోనూ క్యాబిన్లను ఏర్పాటు చేశాం. కృష్ణమ్మతో సస్యశ్యామలం సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లలో గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది. గోదావరి జలాలను జిల్లాకు తరలించాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా 2.40 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని నిర్ణయించింది. తద్వారా చివరి ప్రాజెక్టులో ఉన్న చివరలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు నీరందడం కనాకష్టమే. ఈ పరిణామాలను గమనించే పక్కనే ఉన్న కృష్ణానది జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించాం. ఫలితంగా డిండి, పాలమూరు- రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుల కింద 5 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురానున్నాం. కొత్తగా రెండు జిల్లాలు జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత పాటిస్తాం. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. లోక్‌సభ నియోజకవర్గాలకు అనుగుణంగా జిల్లాను రెండుగా విభజించాలని ప్రతిపాదిస్తున్నాం. నాతోపాటు పర్యాద కృష్ణమూర్తి సభ్యులుగా వ్యవహరిస్తున్న పున ర్విభజన కమిటీ ద్వారా కూడా ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించాం. అయితే, జిల్లాను మూడు ముక్కలు చేయాలనే అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. -
చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు: డీఎస్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తనకు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని టీఆర్ఎస్ ప్రభుత్వ సలహాదారుడు సీనియర్ నేత డి. శ్రీనివాస్ చెప్పారు. ఢిల్లీకి వెళ్లి సేవచేసే భాగ్యం తనకు కల్పించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అయితే టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కేసీఆర్ గురువారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వారిలో డి.శ్రీనివాస్‌ను రాజ్యసభ అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన గురించి అనేకమంది అనేక విధాలుగా మాట్లాడారంటూ డీఎస్ వాపోయారు. పనిచేసే నేతలకు పదవులు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో తనకు ఉన్న పరిచయాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ తోడుగా ఉంటానని చెప్పారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎవరూ అయిన పోటీ చేయొచ్చునని (కాంగ్రెస్‌ను ఉద్దేశించి) పరోక్షంగా డి. శ్రీనివాస్ విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే కేసీఆర్ తనను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నట్టు తెలిపారు. అందుకే తనకు ఈ అవకాశమిచ్చినట్టు చెప్పారు. టీఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్తు బాగుండదని చాలామంది అనుకున్నారని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో తామంతా నడుస్తామని డీఎస్ చెప్పారు. -
ఓయూపై డేగకన్ను
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం డేగకన్ను వేసింది. క్యాంపస్‌లో 42 మంది ఇంటెలిజెన్స్ అధికారులను నియమించింది. అందులో 22 మంది తెలంగాణ అధికారులు కాగా.. 20 మంది ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారు. వీరు విద్యార్థుల ఆందోళనలు, అధికారుల పనితీరు, అధ్యాపకులు, ఉద్యోగుల హాజరు శాతం తదితర వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. క్యాంపస్ అంతటా రూ.9 కోట్ల వ్యయంతో సుమారు 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. -
‘విభజన’ బదిలీలపై నిషేధం ఎత్తివేత
సాధారణ బదిలీలపై నిషేధం యథాతథం కారుణ్య నియామకాల అంశంపై స్పష్టత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన నిమిత్తం బది లీలు, ప్రమోషన్లపై విధించిన నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. 2014 మేలో విధించిన ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు ‘విభజన’ నాటి నిషేధం ఎత్తివేతకే వర్తిస్తాయి. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం యథాతథంగా కొనసాగనుంది. ‘విభజన’ పూర్తికావడంతో..: ఇరు రాష్ట్రాల మధ్య కమల్‌నాథన్ కమిటీ చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు అన్ని శాఖల్లో పూర్తయింది. తాత్కాలిక కేటాయింపు జాబితాలు కూడా వెల్లడయ్యాయి. కొన్ని శాఖలకు సంబంధించి తుది జాబితాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఏ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులు అక్కడ చేరిపోయారు. ఈ నేపథ్యంలో బదిలీలు, ప్రమోషన్లపై ‘విభజన’ నాటి నిషేధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక కేటాయింపులపై అభ్యంతరాలున్న ఉద్యోగులు మినహా... స్టేట్ కేడర్, సెక్రటేరియట్‌లోని పోస్టులు, హెచ్వోడీలు, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో తుది లేదా తాత్కాలిక కేటాయింపుల ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులందరికీ ఈ నిషేధం ఎత్తివేత వర్తిస్తుంది. ఇక విభజనతో ముడిపడి ఉన్న కారుణ్య నియామకాల విషయంలోనూ ఈ జీవోలో స్పష్టత ఇచ్చారు. 2014 జూన్ 2 తర్వాత మరణించిన/అనారోగ్య కారణాలతో రిటైరైన ఉద్యోగులు తుది కేటాయింపులో తెలంగాణ రాష్టానికి చెందినట్లయితే... జూన్ 2 కంటే ముందు మరణించిన/అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగులకు సంబంధించిన పోస్టు తెలంగాణకు కేటాయించి ఉంటే... ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి తెలంగాణ స్థానికుడై ఉంటే కారుణ్య నియామకానికి అర్హులుగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నిషేధం ఎత్తివేతకు సాధారణ బదిలీలపై నిషేధానికి సంబంధం లేదు. సాధారణ బదిలీలపై నిషేధం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కారుణ్య నియామకాల కమిటీ చైర్మన్‌గా ఎంజీ గోపాల్ కారుణ్య నియామకాల రాష్ట్ర స్థాయి కమిటీకి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్‌ను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనారోగ్యంతో రిటైరైన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ఉద్యోగం ఇచ్చే ప్రక్రియను ఈ కమిటీ పరిశీలిస్తుంది. నిబంధనల ప్రకారం మెడికల్ బోర్డులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలు, ఆయా విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించే బాధ్యతను చేపడుతుంది. -
'కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారు'
హైదరాబాద్ : రాష్ట్రంలో కరవును నివారించేందుకు కేంద్రం నిధులను ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఖర్చు చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంలో మహారాష్ట్ర సర్కార్‌ను చూసి నేర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో కరవుపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ మంగళవారం బీజేపీ నాయకులు డాక్టర్ కె.లక్ష్మణ్, జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ మాట్లాడుతూ... కరవుతో రైతులు చనిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేదని విమర్శించారు. కేంద్రం ముందు కేసీఆర్ కాకి లెక్కలు చెబుతున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. -
నీడలా వెంటాడుతాం..
కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ సర్కారు మీనమేషాలు ఓట్లు, సీట్లు, నోట్లు తప్ప ప్రజలగోడు పట్టదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా ముకరంపుర : ‘టీఆర్ఎస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఓట్లు, సీట్లు, నోట్ల రాజకీయాలే తప్ప ప్రజాసంక్షేమా న్ని పట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కరువుపై చర్చిస్తే పరువుపోతుందని భావిస్తున్న రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటుకు ఈ ధర్నా కనువిప్పు కావాలి. కరువుపీడిత ప్రాంతాలకు న్యాయం జరిగే వరకూ... ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాం.. రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువుతో చేతివృత్తులు, పేద, బడుగుబలహీనవర్గాల ప్రజలు 40 లక్షల మంది ఇప్పటికే పల్లెలను వదిలి వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశారు. అనేక వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్.. హామీలన్నింటినీ నీటిమూటలు చేసిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన శ్రీకాంతాచారి నుం చి ఆదిరెడ్డి వరకు ఆత్మబలిదానాలనూ ప్రభుత్వం విస్మరించిందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీతోపాటు కేజీటూపీజీ ఉచిత విద్యను అమలు చేస్తామన్న సీఎం ఆ ఊసే మరిచారన్నా రు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయనకున్న వారి ఆశలకు భంగపాటే ఎదురవుతోందన్నారు. రెండేళ్ల పాలనలో ఆ పార్టీ బలోపేతం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరువుపై దృష్టి మళ్లించేందుకే.. కరువుపై చర్చలేకుండా.. ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతోందన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కారు లక్షల కోట్ల అప్పు చేయడం తప్ప సాధించిందే మీ లేదన్నారు. తుదిదశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ దోపిడీ చేసేందు కు కొత్తగా ప్రాజెక్టుల రీడైజైన్లు అంటూ ముందుకుపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు అందించిన సహాయంపై శ్వేత ప త్రం విడుదల చేయాలన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు, వాణి జ్య పంటలకు రూ.20 వేల పరిహారమందిస్తూ పన్నులు, ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించకపోతే పలెపల్లెనా జాతీయ జెండాలు ఎగిరే సి ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శులు చింత సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కాశిపేట లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాాలు పద్మజారెడ్డి, నాయకులు బల్మూరి వనిత, ఆకుల విజయ, జిల్లా కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఆది శ్రీనివాస్, నారాయణరావు, ఆది కేశవరావు, కోమల ఆంజనేయులు, జగన్మోహన్రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, లింగంపల్లి శంకర్ తదితరులున్నారు. లక్ష్మణ్‌కు ఘనంగా స్వాగతం బీజేపీ రాష్ట్ర సారథిగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన లక్ష్మణ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారుు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్, రామగుండం బీజేపీ నాయకుడు కౌశిక్ హరి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదికపైకి బండి సంజయ్‌ను ఆహ్వానించగానే కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. కౌశిక్ హరి లక్ష్మణ్‌కు కండువా కప్పారు. బైక్‌ర్యాలీలో బాస సత్యనారాయణ, బేతి మహేందర్‌రెడ్డి, కౌశిక్‌హరి, గడ్డం నాగరాజు, కోమల మహేశ్, లక్ష్మణ్, లక్ష్మినర్సయ్య ఉన్నారు. వేదికపై బీజేపీ సాంస్కృతిక విభాగం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
'ఆర్ఎస్ఎస్ కు అండగా టీఆర్ఎస్ పాలన'
హైదరాబాద్: విద్యను కాషాయీకరణ చేయాలనే ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాను టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తుందని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్కు రిమోట్ కంట్రోల్‌గా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ)లోనూ, ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లోనూ అవమానకరంగా వ్యవహరించిందని ఆరోపించారు. వీసీ అప్పారావుపై కేసుల విషయం తేలకుండానే తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఓయూ విద్యార్థులపై ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తున్నారని షబ్బీర్ ఆరోపించారు. ఓయూలో జరిగిన చిన్నచిన్న సంఘటలపై పోలీసులు అతిగా స్పందిస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని ఓయూలో పోలీసులు దాడికి దిగారన్నారు. దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన విద్యార్థులకు భోజనం, నీళ్లు లేకుండా హింసించారని చెప్పారు. కరుడుగట్టిన నేరస్తులతో వ్యవహరించినట్టుగా విద్యార్థులతో పోలీసులు ప్రవర్తించడపై షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రమైన నేరారోపణ ఎదుర్కొంటూ, విచారణ పూర్తికాకుండానే వీసీగా అప్పారావును తిరిగి నియమించడంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కై విద్యను కాషాయీకరణ చేయడం, మతోన్మాద రాజకీయాలకు పాల్పడటంపై ప్రజల్లో ఎండగడ్తామని హెచ్చరించారు. విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును డిస్మిస్ చేసేదాకా, దాడులకు దిగిన పోలీసులపై చర్యలు తీసుకునేదాకా పోరాడుతామని హెచ్చరించారు. -
ఏవీ డబుల్?
► టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు ► ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగింపు ► 31 వరకు ముచ్చటగా మూడోసారి... మొత్తం 2,160 ఇళ్లకు అంచనా వ్యయం రూ.151.06 కోట్లు. సయ్యద్‌సాబ్‌కా బాడాలో జీప్లస్ 3 పద్ధతిలో ...మిగిలిన ప్రాంతాల్లో 9 అంతస్తుల్లో అపార్టుమెంట్లుగా నిర్మిస్తారు. వీటికి లిఫ్టులు, సెల్లార్లు ఉంటాయి. వీటి నిర్వహణకు గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని వాణిజ్యానికి వీలుగా నిర్మించి వాటిని అద్దెవ్వాలని యోచిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో కదలిక కనిపించడం లేదు. ఐడీహెచ్ కాలనీ తర్వాత నగరంలో ఎక్కడా ఈ పనులు సాగుతున్న దాఖలాలు లేవు. గ్రేటర్ ప్రజలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. తొలి దశలో గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో... ఒక్కో ప్రాంతంలో కనీసం 400 ఇళ్లు నిర్మించాలని భావించారు. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో శంకుస్థాపన చేశారు. ఒక్క చోట కూడా పనులు ప్రారంభం కాలేదు. తొమ్మిది బస్తీల్లో రూ.151 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. దీనికి తొలి గడువు జనవరి 21తో... రెండో గడువు ఈ నెల 24తో ముగిసింది. అయినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గడువును మార్చి 31 వరకు పొడిగించారు. గిట్టుబాటు కాదని... ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు స్థలం అందుబాటులోకి రావాల్సి ఉంది. వీటి నిర్మాణంపై ప్రభుత్వ విధానం కూడా స్పష్టంగా లేకపోవడంతో ఏ క్షణాన ఎలాంటి మార్పులు చేస్తారోననే సంశయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా... 9 అంతస్తుల్లో నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు పొందాలంటే నిబంధనలు పక్కాగా అమలు చేయాలి. ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్ఓసీ పొందాలి. ఈ సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యానూ కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐడీహెచ్ తరహాలో సాధ్యమేనా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మోడల్‌గా సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.9.48 లక్షలు వెచ్చించారు. అవి జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. టెండర్లు పిలిచిన వాటిలో ఒక బస్తీ మినహా మిగతావన్నీ 9 అంతస్తులవే. ఎక్కడి వారికి అక్కడే ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి ఎంచుకున్నారు. 9 అంతస్తులు కావడంతో యూనిట్ ధర తగ్గించినట్లు చెబుతున్నారు. వివిధ బస్తీల ప్రజలకు కౌన్సెలింగ్ చేసి.. సూత్రప్రాయంగా వారిని ఒప్పించినప్పటికీ... వారు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయించి... కాంట్రాక్టరుకు స్థలం అప్పగించేందుకు సమయం పడుతుంది. నిర్మాణ సంస్థల ఆసక్తి బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణానికి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించాయి. వీటిలో ఎల్ అండ్ టీ, ముంబైకి చెందిన టాటా హౌసింగ్, పుణేలోని చైనా కంపెనీ శాని, అదే నగరానికి చెందిన షిర్కే తదితరమైనవి ఉన్నాయి. అయితే అవి స్లమ్స్‌లో నిర్మాణానికి సుముఖంగా లేవని తెలుస్తోంది. విశాలమైన ఖాళీ స్థలాల్లో టవర్స్‌తో ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించనున్నందునప్రీ ఫ్యాబ్రికేటెడ్ తయారీకీ మూడు ప్రాంతాల్లో 15 ఎకరాలు కావాలని కొన్ని సంస్థలు కోరినట్లు తె లిసింది. ఖరారు కాని విధి విధానాలు విశాల మైదానాల్లో ఇళ్ల నిర్మాణంపై ఇంతవరకు స్పష్టత లేదు. వీటి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మొత్తం స్థలంలో 50 శాత ం నిర్మాణ కంపెనీకి ఉచితంగా ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. రెండు టవర్లలో నిర్మాణాలు చేపడితే.. ఒక టవర్‌ను పూర్తిగా నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలనేది మరో ఆలోచన. రెండు టవర్లకు మధ్య గోడ కడతారు. నిర్మాణ సంస్థ తమ టవర్‌ను పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకోవ చ్చు. ఈ రెండూ కాక మరో ఆలోచన కూడా చేసినట్లు తెలిసింది. యూనిట్ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3.8 లక్షలు భరించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ఇవ్వాలనేది మూడో యోచన. ఇంకా ఏదీ ఖరారు చేయలేదు. మౌలిక సదుపాయాలకు ఒక్కో ఇంటికి రూ.75 వేల వంతున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. గ్రేటర్‌లోని 24 ప్రాంతాల్లో మొత్తం 8,650 ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పేదలకు ఉంటున్న చోటే ఇళ్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసిన 9 బస్తీలకు మాత్రం తొలుత టెండర్లు ఆహ్వానించారు. ప్రతిపాదనలు చేసిన బస్తీలు.. 1. పిల్లిగుడిసెలు, 2.జంగమ్మెట్, 3.గోడేకిఖబర్, 4.కాంగారినగర్, 5.లంబాడితండా,6.ఇందిరానగర్, 7.దోబీఘాట్ (చిలకలగూడ), 8.హమాలీబస్తీ, 9.కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్, 10. సయ్యద్‌సాబ్‌కాబాడా, 11.పార్థివాడ, 12.అంబేద్కర్ నగర్(లంగర్‌హౌస్), 13.మంగాడి బస్తీ, 14.సార థి నగర్, 15.మైలార్‌దేవ్‌పల్లి, 16.చిత్తారం బస్తీ 17. కేశవ్‌నగర్ 18. పటాన్చెరు 19. భగత్‌సింగ్‌నగర్, 20.ఎరుకల నాంచారమ్మ నగర్, 21. సింగంచెరువు, 22.హరిజన బస్తీ (కౌకూరు), 23.కొత్తపేట ఎన్టీఆర్నగర్, 24. బహదూర్‌పురా. ఇవి కాక మరో 23 ప్రాంతాలను కూడా అధికారులు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఐడీహెచ్ కాలనీలో ఇంటి విస్తీర్ణం: 580 చ.అ. జీప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. ప్రస్తుతం టెండర్లు పిలిచినవి 560 చ.అ. వీటిని సెల్లార్ + 9 పద్ధతిలో నిర్మించనున్నారు. ఐడీహెచ్ కాలనీ మాదిరిగానే లివింగ్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, బెడ్రూమ్, కిచెన్, రెండు రకాల టాయ్లెట్లు, బాత్రూమ్లు ఉంటాయి. శంకుస్థాపన చేసిన ప్రాంతాలు 1.రసూల్‌పురా క్రాస్‌రోడ్ 2.కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్ 3.లంబాడి తండా, బాగ్‌లింగంపల్లి చౌరస్తా 4.శ్రీసాయిచరణ్ కాలనీ, బాగ్‌లింగంపల్లి చౌరస్తా 5.కాంగారి నగర్ 6.పిల్లిగుడిసెలు 7.సర ళాదేవినగర్ 8.చిత్తారమ్మ బస్తీ 9.హమాలీ బస్తీ 10. చిలకలగూడ దోబీఘాట్ 11. ఎరుకల నాంచారమ్మ నగర్ (మన్సూరాబాద్) యూనిట్ వ్యయం.. వివిధ విభాగాల వాటా.. గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి వ్యయం: రూ.7 లక్షలు ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా: రూ. 1.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.3.8 లక్షలు జీహెచ్ఎంసీ వాటా: రూ. 1.7 లక్షలు