
'కాంట్రాక్టర్ల కోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్టు'
కాంట్రాక్టర్ల కోసమే టీఆర్ఎస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును చేపడుతున్నారని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు.
నిజామాబాద్: కాంట్రాక్టర్ల కోసమే టీఆర్ఎస్ నేతలు మల్లన్నసాగర్ ప్రాజెక్టును చేపడుతున్నారని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. నిజామాబాద్లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.... ఆ ప్రాజెక్టు వల్ల 50 టీఎంసీల నీళ్లు కూడా రావని చెప్పారు.
టీఆర్ఎస్ నేతల జేబుల నింపడానికే రాష్ట్రంలో ప్రాజెక్టుల నాటకమాడుతున్నారని షబ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులనే ప్రజలకు చూపించి టీఆర్ఎస్ నేతలు మోసం చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు.