మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై తాము పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
హైదరాబాద్: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై తాము పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అరెస్టులకు తాము భయపడబోమని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం వారు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టీ హామీ ఇచ్చారు.