ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలి | Congress leader Shabbir Ali fire on TRS Govt | Sakshi
Sakshi News home page

ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలి

Published Fri, Oct 14 2016 3:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలి - Sakshi

ఫిరాయించిన వారితో రాజీనామా చేయించాలి

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగిందనే నమ్మకముంటే కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎంపీ లు, ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ సవాల్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికలొస్తే ప్రతిపక్షాలకు సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని కేసీఆర్ మాట్లాడటంపై సవాల్ చేశారు.
 
  ప్రజల్లో ఆదరణ పెరిగిందనుకుంటే ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి భయం ఎందుకన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రుణ సహాయం కోసం 1.6 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని చెబుతున్న కేసీఆర్ రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement