
హైకోర్టు (పాతచిత్రం)
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్‌ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment