సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బృందం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలోనే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా శనివారం హైడ్రా బృందం కూల్చివేసింది.
కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. ఈనెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై కోమటిరెడ్డి.. హైడ్రాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్, ఎఫ్‌టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమిత భూమితో కట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చి వేసింది.
మరోవైపు.. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు.
ఇక, ఎన్ కన్వేషన్ కూల్చివేతపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయి. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నాం అని అన్నారు.
👉: ‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు)
Comments
Please login to add a commentAdd a comment