N convention building
-
మాదాపూర్ లో N కన్వెన్షన్ ను కూల్చివేసిన అధికారులు
-
Today Highlights: టుడే టాప్-10 న్యూస్
1. అందుకే కూల్చేశాం.. ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రాఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా స్పందించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తమ్మిడికుంట చెరువు, ఎఫ్టిఎల్, బంఫర్ జోన్లో..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి2. అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్ధికసాయంఅచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి3. ముంబైలో కూలిన హెలికాప్టర్మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి4. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డుభారత క్రికెట్లో మరో శకం ముగిసింది. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి5. అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ సీరియస్అచ్యుతాపురం సెజ్ ఘటనపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాన్ని సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి6. ఇంద్ర గుర్తుగా అశ్వనీదత్‌కు కానుక ఇచ్చిన చిరుటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. చిరు కెరియర్లో ఇంద్ర సినిమాకు చాలా ప్రత్యేక స్థానం ఉంది.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి7. ప్రజలపై టాక్స్ పిడుగు..భారీగా పెరిగిన వెహికిల్స్ ధరలుకార్లు, బైకుల ధరలను అప్పుడప్పుడు తయారీ సంస్థలే పెంచుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వమే వెహికల్ ట్యాక్స్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి8. అభయ కేసు.. నిందితుడు యూటర్న్కోల్కతా వైద్యురాలిపై హత్యాచారం కేసులోని ప్రధాని నిందితుడు సంజయ్‌రాయ్‌తో పాటు మరో ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి9. హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్‌రెడ్డి మండిపాటుహైడ్రా కూల్చివేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా నడిపిస్తోందని..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి10. మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అమెరికా స్పందనయుద్ధంతో అల్లాడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన..మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి -
N కన్వెన్షన్ కూల్చివేతపై భట్టివిక్రమార్క సంచలన కామెంట్స్
-
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి స్పందన..
ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్లు మల్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.2014కు ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఉన్న చెరువు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని మీడియా సమావేశంలో విలేకర్లను ఎదురు ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి. ‘హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారు. బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం. రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాం.చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతాం. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన పేర్కొన్నారు. -
అన్యాయంగా కూల్చేశారు..నాగార్జున ఎమోషనల్
-
ఎన్ కన్వెన్షన్‌పై హైడ్రా కొరడా.. మంత్రి కోమటిరెడ్డి కీలక పాత్ర !
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా బృందం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈక్రమంలోనే ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా శనివారం హైడ్రా బృందం కూల్చివేసింది.కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా నేలమట్టం చేసింది. ఈనెల 21వ తేదీన ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై కోమటిరెడ్డి.. హైడ్రాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా గూగుల్ మ్యాప్, ఎఫ్టీఎల్ ఆధారంగా ఎన్ కన్వెన్షన్ కట్టడం ఆక్రమిత భూమితో కట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం విచారణ చేపట్టింది. మంత్రి ఫిర్యాదు మేరకు అన్ని శాఖల అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకొని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చి వేసింది. మరోవైపు.. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజాము నుంచే మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు.ఇక, ఎన్ కన్వేషన్ కూల్చివేతపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తాజాగా ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించిన చర్యలు తప్పవు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయి. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నాం అని అన్నారు. 👉: ‘హైడ్రా’ ఉక్కుపాదం.. నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత (ఫొటోలు) -
నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
-
'నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమే'
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంపై విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రెవిన్యూ అధికారులు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ భవనాన్ని తనిఖీ చేసి అక్రమ నిర్మాణం చేపట్టారని గుర్తించగా, ఎన్ కన్వెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి హైకోర్టులో వాదించారు. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారని చెప్పారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద ఎన్కన్వెన్షన్ నిర్మాణానికి చేసిన దరఖాస్తును జీహెచ్ఎంసీ తిరస్కరించిందని అన్నారు. తనిఖీలు కోసమే ఎన్కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లారని కోర్టుకు తెలిపారు. హైదరాబాద్‌లో చెరువులను పట్టించుకోవడం లేదంటూ లోకాయుక్తలో గతంలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, లోకాయుక్త ఆదేశాలమేరకే లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఎన్కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లిందని రామకృష్ణారెడ్డి తెలిపారు. జీహెచ్ఎంసీకి కూల్చివేతతో సహా అన్ని అధికారాలున్నాయని, హైకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఎలాంటి చర్యలకూ దిగబోమని చెప్పారు. కాగా ఇది ఏమాత్రం సర్వే ఎక్సర్సైజ్ కాదని, నోటీసులు ఇవ్వకుండా వ్యక్తుల ఆస్తుల్లోకి చొరబడటం హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్ కన్వెన్షన్ తరపు న్యాయవాదులు వాదించారు. జీహెచ్ఎంసీ అధికారులు చట్టపరమైన ప్రక్రియను అనుసరించలేదని చెప్పారు. ప్రైవేటు ఆస్తుల్లో తనిఖీలు చేసేముందు కచ్చితంగా నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు.