సాక్షి, హైదరాబాద్: విద్యార్థి ఉద్యమాలతో తెలంగాణ వస్తే. .వారినే మోసం చేసిన ఘన చరిత్ర టీఆర్‌ఎస్‌ది అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఉద్యోగాల ఇస్తామంటే అడ్డుకుంది కూడా కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులేనని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఈ ప్రభుత్వం నింపలేకపోయిందన్నారు.
అధికారంలోకి వచ్చి 40 నెలలు దాటినా ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు..టీఆర్‌ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఎవరూ సక్రమంగా లెక్కలు చెప్పడం లేదని, ఆర్థిక మంత్రి ఒక మాట, సీఎం ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని దుయ్యబట్టారు. డీఎస్సీ ఒక్కసారి కూడా వేయకుండా టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్రం 10 స్థానంలో ఉందని చెప్పారు. తమ పార్టీలో విద్యార్థులకు సముచిత న్యాయం ఉంటుందని, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఉత్తమ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment