Jobs recruitment
-
2 నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి 11 వరకు గడువు ఉంది. దీంతో కనీసం రెండు నెలల తర్వాతే.. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను నమ్ముకుని.. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన నోటిఫికేషన్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల వరకు భర్తీ చేయనున్న ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లను ఏయే నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న మూడు రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. వీటిల్లో ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి. అయితే, అవి విడుదల కాలేదు.జనవరి 11 వరకూ గడువు.. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సీల స్థితిగతులను అధ్యయనం చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కమిషన్ ఈనెల 11న బాధ్యతలు స్వీకరించింది. రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వనుంది. జనవరి 11 వరకు ఈ కమిషన్‌కు గడువు ఉంది. మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. దీన్ని బట్టి చూస్తే కనీసం రెండు నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఓ స్పష్టత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
నెలాఖరులోగా గురుకుల పోస్టుల భర్తీ!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే గురుకుల డిగ్రీ కాలేజీలు, గురుకుల జూనియర్ కాలేజీల్లోని ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు గురుకుల పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులను భర్తీ చేశారు. మరో 7వేల ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియను తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) వేగిరం చేసింది. ఈ నెలాఖరులోగా అన్ని కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో డిగ్రీ కాలేజీల్లోని 793 లెక్చరర్ ఉద్యోగాలు, జూనియర్ కాలేజీల్లో 1,924 జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి 1ః2 నిష్పత్తిలో వేర్వేరుగా ప్రాథమిక ఎంపిక జాబితాలను విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన, అభ్యర్థులకు డెమో పరీక్షలను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిపై సంక్షిప్త సందేశాలు, ఫోన్ కాల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నారు. చివరివారంలో టీజీటీ అభ్యర్థుల జాబితా.. గురుకులాల్లో భర్తీ చేస్తున్న 9వేల ఉద్యోగాల్లో అత్యధికంగా 4,020 ఉద్యోగాలు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) కేటగిరీలోనివే. ఈ ఉద్యోగాలపైనే ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అర్హత జాబితాల కోసం వేచిచూస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఈనెల 20వ తేదీ తర్వాత సబ్జెక్టుల వారీగా 1ః2 నిష్పత్తిలో అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ విడుదల చేయనుంది. 24వ తేదీ నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. 26వ తేదీకల్లా పరిశీలన పూర్తిచేసి తుది జాబితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా 4,020 టీజీటీ, 1,924 జూనియర్ లెక్చరర్, 793 డిగ్రీ లెక్చరర్ పోస్టులు కలిపి 6,737 ఉద్యోగాలను నెలాఖరులో భర్తీ చేయనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం ఆధ్వర్యంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే అవకాశం ఉందని సమాచారం. -
గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది. వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీలు తాజాగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. రోస్టర్ పాయింట్ల మార్పులు... ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ చార్ట్ కీలకంగా పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్ సర్వీస్‌మెన్) రోస్టర్ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
సర్కారీ కొలువుల జాతర
కొత్తగా పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్టు వెలువడిన కథనం చిరకాలంగా కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం పర్యవసానంగా వచ్చే ఏడాదిన్నరకాలంలో 77 మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభా గాల నుంచి వరస నోటిఫికేషన్లు హోరెత్తుతాయి. కొత్తగా ఉద్యోగాలిస్తే జీతాల కోసం అదనంగా ప్రతి నెలా రూ. 4,500 కోట్లు వ్యయమవుతుందని ఒక అంచనా. అంటే ఏటా ప్రభుత్వానికి రూ. 54,000 కోట్ల అదనపు ఖర్చుంటుంది. ఈ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ వగైరాలకయ్యే వ్యయం అదనం. వీరందరికీ మున్ముందు పదోన్నతులు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు సరేసరి. అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రిక్రూట్మెంట్ ఆచరణలో సాధ్యమేనా అన్న సందేహం కూడా వస్తుంది. ఒక క్రమపద్ధతిలో అవసరానికనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే సమస్యలుండవు. ఆ విభాగాలు ఎలాంటి అంతరాయమూ లేకుండా సేవలందించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకేసారి జాతర మాదిరిగా ఉద్యోగాల భర్తీ చేపడితే నిరుద్యోగులకూ ఇబ్బందే. ఏ ఉద్యోగం వస్తుందో, ఏది రాదో తెలియక అన్ని పరీక్షలకూ హాజరుకావాల్సి వస్తుంది. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ విషయంలో అడపా దడపా విమర్శలు వస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అని కొందరు సచివులు ఎదురు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ పెనుభూతం యువతరాన్ని ఎంతగా పీడిస్తున్నదో తెలియడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, గురుగ్రామ్ తదితరచోట్ల వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలే నిదర్శనం. రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం, రహదారుల దిగ్బంధం వంటి ఘటనలు చూస్తుంటే యువత ఎంతగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారో అర్ధమవు తుంది. 1994 గణాంకాల ప్రకారం కేంద్రంలో 41.76 లక్షల ఉద్యోగాలుండేవి. 2014 నాటికి వాటి సంఖ్య 39.9 లక్షలు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర సిబ్బంది 34.5 లక్షల మంది. వీరుగాక చిన్నా చితకా ఉద్యోగాలతో సహా కేంద్రంలో 24.30 లక్షలమంది కాంట్రాక్టు నియామకాల కింద పనిచేస్తు న్నారు. కేంద్ర సిబ్బందిలో 92 శాతం మంది కేవలం ఐదు మంత్రిత్వ శాఖల్లో ఉంటారని చెబుతారు. ఇందులో 40 శాతం వాటాతో రైల్వేలు అగ్రభాగాన ఉంటే... హోంశాఖలో 30 శాతం, రక్షణ (పౌరవిభాగం)లో 12 శాతం సిబ్బంది ఉంటారు. నిజానికి బయట దొరికే ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల శాతం చాలా తక్కువ. మన జీడీపీ ఘనంగా కనబడటానికి తోడ్పడుతున్న సేవారంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. పైగా అక్కడా సాంకేతికత పెరిగి గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు క్షీణిస్తున్నాయి. ఏటా కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేవారు కోటీ 20 లక్షలమంది అని ఒక అంచనా. వీరిలో ఎందరికి ఉద్యోగాలు దొరుకుతాయి? వీరికన్నా చాలా ఏళ్లముందునుంచీ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి మాటేమిటి? పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడే ధోరణి కనబడదు. అక్కడ రెండు రంగాల్లో లభించే వేతనాలకూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ మన దేశంలో వేరు. ప్రభుత్వ సిబ్బందికి నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ సంఘాల సిఫార్సులు వస్తాయి. కాస్త వెనకో ముందో వాటిని అమలు చేస్తారు. ఇవిగాక ప్రైవేటు రంగంతో పోలిస్తే ఇతరత్రా సదుపాయాలు, క్రమం తప్పకుండా వచ్చే పదోన్నతులు అదనం. ప్రైవేటు రంగ సిబ్బంది యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలి. కార్మికసంఘాలు బలహీనపడ్డాయి గనుక ఉద్యోగులకు దినదినగండంగా ఉంటున్నది. లేబర్ కోర్టులు వగైరాలవల్ల పెద్దగా ఒరిగేది ఉండదు. ప్రైవేటు రంగంలో కూడా మెరుగైన పరిస్థితు లుండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు లేకపోగా... రేపో మాపో అమల్లోకి రానున్న లేబర్ కోడ్ వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నమవు తాయని బీజేపీ అనుకూల కార్మికసంఘంతో సహా అన్ని సంఘాలూ ఆరోపిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడేవారు నానాటికీ పెరుగుతున్నారు. నిరుద్యోగంపై కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుబట్టడం కుదరదు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా 90వ దశకం మధ్యనుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ కొలువులు తగ్గిపోయాయి. తాను అధికారంలోకొస్తే యువతకు ఉద్యోగాలిస్తాననీ, లేనట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తాననీ 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ ఉద్యోగాలూ ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతిని కూడా అందించలేకపోయారు. చివరకు 2019లో అధికారం లోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీయెత్తున యువతకు ఉద్యోగాలిచ్చింది. కేంద్ర స్థాయిలో క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టే ప్రధాన సంస్థల్లో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ప్రధానమైనవి. వీటిద్వారా గత ఐదేళ్లలో నాలుగున్నర లక్షలమందిని తీసుకున్నట్టు కేంద్రం చెబుతున్నది. ఇవిగాక ప్రస్తుతం వివిధ విభాగాల్లో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడివున్నాయి. కొలువుల భర్తీపై కేంద్రం తాజా ప్రకటనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. రానున్న ఎన్నికల కోసమే ఈ ఆర్భాటమంటున్నాయి. కావొచ్చు... ఉద్దేశాలు ఏమైనప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన నిర్ణయాన్ని హర్షించాల్సిందే. -
తెలంగాణ: 3,334 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. మొత్తం 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ.. తాజాగా బుధవారం మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. అటవీ శాఖలో 1,668: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు–1,393, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు– 92, టెక్నికల్ అసిస్టెంట్లు–32, జూనియర్ అటెండెంట్లు– 9, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్–18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు–14, జూనియర్ అసిస్టెంట్ (లోకల్ కేడర్)–73, జూనియర్ అసిస్టెంట్ (హెడ్ ఆఫీస్)–2, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ)–21, అసోసియేట్ ప్రొఫెసర్ (ఎఫ్సీఆర్ఐ)–4, పీఈటీ (ఎఫ్సీఆర్ఐ)–2, ప్రొఫెసర్– 2, అసిస్టెంట్ కేర్ టేకర్, కేర్‌టేకర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఫామ్ ఫీల్డ్ మేనేజర్, లైబ్రేరియన్, స్టోర్స్ ఎక్విప్మెంట్ మేనేజర్ ఒక్కోపోస్టు. అగ్నిమాపక శాఖలో 861: స్టేషన్ ఆఫీసర్లు–26, ఫైర్‌మెన్–610, డ్రైవర్ ఆపరేటర్–225. బ్రివరీస్ కార్పొరేషన్లో 40: అకౌంట్స్ ఆఫీసర్–5, అసిస్టెంట్స్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్–2లో 7, అసిస్టెంట్ మేనేజర్–9, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ గ్రేడ్ 2లో 8, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్–8, డేటా ప్రొసెసింగ్ ఆఫీసర్–3. ప్రోహిబిషన్ అండ్ ఎక్సెజ్ శాఖలో 751: ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్– 614, జూనియర్ అసిస్టెంట్స్ (లోకల్)–8, జూనియర్ అసిస్టెంట్స్ (స్టేట్)–114, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్–15 ప్రకృతి విపత్తుల నివారణ శాఖలో 14: జూనియర్ అసిస్టెంట్స్ (హెడ్ ఆఫీస్)–14 చదవండి: కలెక్టర్ టెన్నిస్ ఆట కోసం.. 21 మంది వీఆర్ఏలకు విధులు -
గూప్1,2 ఉద్యోగాలను భర్తీ చేయండి
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా గ్రూప్1,2 ఉద్యోగాలను భర్తీ చేయడంలేదని బీసీ సంక్షేమ సంఘం విమర్శించింది. సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యో గుల వయో పరిమితి ముగిసిపోతుందని, అందుకే తక్షణం డైరెక్టు రిక్రూట్మెంట్ కింద ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సంఘం నేతలు గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్, దాసు సురేశ్, ఉదయ్ తదితరులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి ఉద్యోగాల భర్తీపై వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై స్పందించిన సీఎస్, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. -
ఆ విషయంలో కేటీఆర్ తండ్రిని మించిపోయాడు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సైతం తండ్రి కేసీఆర్ మాదిరిగానే కొలువుల భర్తీ విషయంలో అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1,32,899 ఉద్యోగా లను భర్తీ చేసిందని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు శ్రవణ్ కుమార్ ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చారు. తెలంగాణ అమరవీరుల స్థూపం ‘గన్‌పార్క్’ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చకు రావాలంటూ కేటీఆర్‌కు ప్రతి సవాల్ చేశారు. మీడియా ఎదుట శాంతియుతంగా జరిగే చర్చకు కేటీఆర్ హాజరైతే శాలువా, పూలదండతో సత్కరించి చర్చకు ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ కేటీఆర్, ఇతర నాయకులు చర్చకు రాకపోవడంతో ఆగ్రహించిన కాంగ్రెస్ నేతలు... కేటీఆర్ కోసం వేసిన కుర్చీకి చెప్పుల దండ వేయడంతోపాటు కేటీఆర్‌కు పసుపు, కుంకుమ, చీర, గాజులను సమర్పించారు. అపాయింట్మెంట్ లెటర్లు కావాలి... ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లా డుతూ యువతను గందరగోళానికి గురిచేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ కేటీఆర్ లేఖలు రాయడాన్ని తప్పుబట్టారు. రాత్రిపూట ఇంట్లో కూర్చొని రాసుకొనే లవ్ లెటర్స్ తమకు అక్కరలేదని, కొలువుల భర్తీ కోసం యువతకు అపాయింట్మెంట్ లెటర్లు కావాలని చురకలం టించారు. 2014లో లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ప్రకటిం చారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన బిశ్వాల్ కమిటీ సైతం లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ కుటుంబం ఇంట్లో ఉద్యోగాలు ఉంటే సరిపోదని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమి కావాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 47% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ మాట్లాడటాన్ని ఖండించారు. తెలంగాణ వ్యతిరేకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి లక్షా పది వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. కాంట్రాక్టు పదాన్నే లేకుండా చేస్తామన్న కేటీఆర్... ఎందుకు కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్స హిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, కాంగ్రెస్ నేతలు మందడి అనీల్ కుమార్, ఇందిరా శోభన్, రవీందర్, డాక్టర్ మురళీ మనోహర్, మెట్టు సాయి, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్‌కు అబద్ధాల కోరు అవార్డు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను వక్రీకరించడంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌ను మించిపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు స్కోచ్ అవార్డు కాకుండా జాతీయ స్థాయిలో అబద్ధాల కోరు అవార్డు ఇవ్వాలన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కొత్తగా సృష్టించినవి కావని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణిలో ఇచ్చామని చెప్తున్న 12 వేల ఉద్యోగాలు కూడా వారసత్వ ఉద్యోగాలేనని వివరించారు. వేతనాలు చెల్లించలేక ఉద్యాన శాఖలో 400 మందిని, ఇతర కారణాలతో గ్రామపంచాయతీ స్థాయిలో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని మండిపడ్డారు. స్కూళ్లలో పనిచేసే స్వీపర్లను కూడా తొలగించారని, ఉద్యోగాలు ఇవ్వకపోగా తీసేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. బిస్వాల్ కమిటీ కూడా రాష్ట్రంలో 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందని, పదవీ విరమణ పొందినన్ని ఉద్యోగాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేకపోయిందని దుయ్యబట్టారు. ఉద్యోగాలివ్వని టీఆర్ఎస్కు, గిరిజన వర్సిటీ ఇవ్వని బీజేపీకి మండలి ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు అడిగే అర్హత లేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
ఇది ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం
సాక్షి,అమరావతి : ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి మధ్య పనిచేశారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల పేరిట ఇబ్బంది పెట్టారు. కొత్త నియామకాలు చేయకపోవడంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపైంది. సమయానికి డీఏలు, ఐఆర్‌లు ఇవ్వకుండా, పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి ఇక్కట్లకు గురిచేశారు. బలవంతపు పదవీ విరమణ జీఓల జారీకి ప్రభుత్వం ప్రయత్నిస్తే.. ఉద్యోగ సంఘాలు వాటిపై పోరాడకుండా సర్కారుకు వత్తాసు పలికి ఉద్యోగుల్ని మోసగించాయి. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికి ఉద్యోగ వ్యతిరేక సర్కారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం ఐఆర్ ఇస్తానని చెప్పడంతో పాటు సీసీఎస్‌ను రద్దు చేస్తామంటున్నారు. ఇది ఉద్యోగులకు శుభవార్త’ అంటున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమాఖ్య కన్వీనర్ కె వెంకటరామిరెడ్డితో సాక్షి ఇంటర్వ్యూ.. ఉద్యోగ సంఘాలు కుమ్మక్కయ్యాయి రాష్ట్రంలో ఉద్యోగులు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు. ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు. ఇప్పుడు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు రెండూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. వీరిద్దరూ కుమ్మక్కయి ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం సిగ్గుచేటు. మూడు డీఏలు పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? 50 సంత్సరాలకే బలవంతపు పదవీవిరమణ చేయించేలా దుర్మార్గమైన జీఓలు తయారు చేసిన ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? ఎన్నడూ లేని విధంగా పోస్టుడేటెడ్ ఐఆర్, డీఏలు ఇచ్చే ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతా? మా దగ్గర డబ్బులు వసూలు చేసి పనిచేయని హెల్త్‌కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మా సంక్షేమం గురించి ఆలోచిస్తుందని చెప్పాలా.? డీఏలు రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పటికి మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2014 నుంచి పెండింగ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు డీఏలను రద్దు చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. 50 ఏళ్లకే బలవంతపు పదవీవిరమణ జీఓల విడుదలకు ప్రయత్నించడం ముమ్మాటికి నిజం. ఆ జీఓల విషయం లీక్ చేశారన్న నెపంతో ఇద్దరు అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రతి ఉద్యోగికి 50 సంవత్సరాలు రాగానే.. ఆ ఉద్యోగి గత 5 సంవత్సరాల పనితీరు ఆధారంగా ఉద్యోగంలో ఉంచాలా? లేదా? అనేది ప్రభుత్వ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ జీఓల వల్ల ఉద్యోగం పోవడం మాట పక్కిన పెడితే వేధింపులు ఎక్కువవుతాయి. ఇలాంటి దుర్మార్గమైన జీఓలు ఎట్టి పరిస్థితుల్లో విడుదల కాకుండా అడ్డుకోవాలి. ఉద్యోగ సంఘ నాయకులకు ఒక సవాలు విసురుతున్నా. ధైర్యముంటే అలాంటి జీఓలు లేవని బహిరంగంగా చెప్పండి. ఎవరికీ సెంటు స్థలం ఇవ్వలేదు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగికీ స్థలం ఇవ్వలేదు. నెల క్రితం ఇళ్ల స్థలాల మంజూరులో నియమ నిబంధనలకు సంబంధించి పాలసీని మాత్రమే తయారుచేసింది. ఎప్పుడిస్తారో చెప్పలేదు. 20 ఐఆర్‌కే సన్మానాలు చేస్తున్నారు ప్రభుత్వం 20 శాతం ఐఆర్ ఇచ్చింది. దీనికే సన్మానాలు చేశారు. 2009లో 22 శాతం, 2014లో 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అప్పుడు ఎవరికి సన్మానాలు చేయలేదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం రావాలి. సీపీఎస్ రద్దు చేయడంతో పాటు, సక్రమంగా డీఏలు ఇవ్వడం, మంచి ఐఆర్ ప్రకటించి సకాలంలో పీఆర్సీ అమలు చేసే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఔట్ సోర్సింగ్ సిబ్బంది కష్టానికి తగిన వేతనాలు ఇవ్వాలి. 27 శాతం ఐఆర్ హామీపై హర్షం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని హామీనివ్వడం చాలా గొప్ప విషయం. 27 శాతం ఐఆర్ అంటే ఫిట్మెంట్ తప్పకుండా 30 శాతానికి పైగానే ఇస్తారు. సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీతో 1.8 లక్షలకు పైగా కుటుంబాలకు మంచి జరుగుతుంది. లక్ష ఉద్యోగాల్ని భర్తీ చేయాలి.. పనిభారం రెట్టింపైంది చాలా మంది ఉద్యోగులు పనివేళలతో సంబంధం లేకుండా పనిచేస్తుంటారు. ప్రభుత్వం ఉద్యోగులపై నమ్మకంతో పనిచేయించుకోవాలని గాని బయోమెట్రిక్ పేరిట ఉద్యోగుల్ని వేధించడం సరికాదు. ఉద్యోగులు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. రివ్యూ మీటింగ్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌ల హడావుడితో ఉద్యోగులపై ఒత్తిడి పెడుతున్నారు. నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంలో లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులపై పని భారం రెట్టింపవుతోంది. సచివాలయంలో ఒక సెక్షన్‌కు రెండు ఏఎస్ఓ పోస్టులు అవసరం కాగా.. ప్రస్తుతం రెండు సెక్షన్లకు ఒక్క ఏఎస్ఓ మాత్రమే పనిచేస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే..!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి ఉద్యమాలతో తెలంగాణ వస్తే. .వారినే మోసం చేసిన ఘన చరిత్ర టీఆర్ఎస్ది అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఉద్యోగాల ఇస్తామంటే అడ్డుకుంది కూడా కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను సైతం ఈ ప్రభుత్వం నింపలేకపోయిందన్నారు. అధికారంలోకి వచ్చి 40 నెలలు దాటినా ఇంకా ఖాళీలు భర్తీ చేయలేదు..టీఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో ఎవరూ సక్రమంగా లెక్కలు చెప్పడం లేదని, ఆర్థిక మంత్రి ఒక మాట, సీఎం ఒక మాట, మంత్రులు మరో మాట చెబుతున్నారని దుయ్యబట్టారు. డీఎస్సీ ఒక్కసారి కూడా వేయకుండా టీచర్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యోగ కల్పనలో రాష్ట్రం 10 స్థానంలో ఉందని చెప్పారు. తమ పార్టీలో విద్యార్థులకు సముచిత న్యాయం ఉంటుందని, సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యం అని ఉత్తమ్ వివరించారు. -
పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం
సాక్షి , హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ మేరకు సంస్థ పాలక మండలి నిర్ణయించిందని తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వివరించింది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు సంస్థల అవసరాల మేరకు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని బోర్డు తీర్మానించింది. కొత్తగా ఎన్ఫోర్స్మెంట్, ఐటీ, ఫైనాన్స, టెక్నికల్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థలో ఆర్థిక సలహాదారుడి నియామకానికి ఆమోదం తెలిపింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ సీవీ ఆనంద్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన ట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదాముల తనిఖీ: గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో పౌరసరఫరాల సంస్థ గోదామును ఆయన తనిఖీ చేశారు. ప్రజాపంపిణీని మరింత సమర్థంగా నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కందిపప్పును రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు విక్రరుుంచేందుకు కేంద్రం నుంచి కందులు కొనుగోలు చేసి మిల్లింగ్ చేరుుంచినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ గోదాములో 167 టన్నుల పప్పు నిల్వ ఉందని తెలిపారు. -
9వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
-
పక్కాగా ‘వెరిఫై’ చేస్తారు!
సాక్షి, హైదరాబాద్: నూతన రాష్ట్రం, రాజధాని ప్రాంతం కావడంతో కొత్తగా ప్రైవేట్ సంస్థలు వచ్చి రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ చెందిన వారు ఉద్యోగాల కోసం వచ్చే అవకాశం ఉంది. వీరిలో నేరచరితులు ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అత్యాధునిక ‘వెరిఫికేషన్’ సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. దీన్ని వినియోగించడం ద్వారా ఏదైనా సంస్థ రూ. 500 రుసుము చెల్లించి తమ వద్ద ఉద్యోగంలో చేరే వారి గత చరిత్రను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్నా సరిగా సాగట్లేదు. వెరిఫై సాఫ్ట్వేర్ రూపొందించాలని నిర్ణయించిన పోలీసు విభాగం ప్రాథమికంగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోనుంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 2,300 కోర్టులకు సంబంధించిన ఐదున్నర కోట్ల రికార్డులతో కూడిన డేటాబేస్‌తో అనుసంధానం చేసుకుంటారు. ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్లైన్లో పోలీసు విభాగానికి అందుబాటులోకి వస్తాయి. దీని ఆధారంగా ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తారు. ఈ డేటాబేస్‌ను అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ ఉండేలా ఇంట్రానెట్‌తో అనుసంధానిస్తారు. తద్వారా ఓ నేరం జరిగినప్పుడు ఆ తరహా నేరాలు చేసే వారు, గతంలో పలుసార్లు చేసిన వారు ఎవరు ఉన్నారు? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తక్షణం తెలుసుకోవడంతో పాటు డేటా నుంచే వారి ఫొటో, చిరునామా, వేలిముద్రలు కూడా సంగ్రహించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ఉపయుక్తకరం... పూర్తిస్థాయిలో అప్డేట్ అయిన ‘వెరిఫై’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తక్షణం వాటిని అందించే అవకాశం ఏర్పడుతుంది. దీని కంటే ముఖ్యంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నివేదికలు రూపొందించి దరఖాస్తుదారులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేటు కంపెనీలకు సమర్పించే అవకాశం ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా, పని మనుషులుగా, డ్రైవర్లుగా చేరే వారు పలు నేరాలు చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో అత్యధిక శాతం నేర చరిత్ర కలిగిన వారే ఉంటున్నారు. ‘వెరిఫై’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యజమానులు సైతం పోలీసులను ఆశ్రయించి తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. -
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి నోటిఫికేషన్ విడుదలైంది. 3783 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం లభించగా, ప్రస్తుతానికి 770 ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. బుధవారం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నోటిఫికేషన్ విడుదల చేశారు. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు సెప్టెంబర్ 20న పరీక్ష నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేయడానికి గడువు ఉంటుంది. అభ్యర్థుల వయో పరిమితి 18 నుంచి 44 ఏళ్లు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం కేంద్రాల్లో ఆన్లైన్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు ఘంటా చక్రపాణి తెలిపారు. నోటిఫికేషన్ వివరాలను వెబ్సైట్లో ఉంచారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20వ తేదీన పరీక్ష గ్రూప్ 1, 2 పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను ఈ నెలాఖరుకు ప్రకటిస్తాం సాధారణంగా అయితే సిలబస్ వివరాలను ఉద్యోగ ప్రకటనతో మాత్రమే ఇవ్వాలి. కానీ, కొత్త రాష్ట్రం, కొత్త సిలబస్ కాబట్టి ముందుగా చదువుకునే అవకాశం ఉంటుందని ఇస్తున్నాం అక్టోబర్ చివరిలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాం డిసెంబర్ లోపు గ్రూప్ 2 ఉద్యోగాల నియామకం ఉంటుంది గ్రూప్ 1కు ఇంకా కొన్ని సమస్యలున్నాయి వాటిలో 53 పోస్టులను మాకు ఇచ్చారు. కానీ వాటిలో కొన్నింటికి సంబంధించి న్యాయపరమైన సమస్యులన్నాయి. కమలనాథన్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మరికొన్ని కొత్త ఖాళీలు రావచ్చు. వాటిని బట్టి నవంబర్ నోటిఫికేషన్లో మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశముంది ఖాళీలన్నింటినీ క్రోడీకరించి పరీక్షలు నిర్వహిస్తాం 80 శాతం నియామకాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలనుకుంటున్నాం మార్చి నాటికల్లా గ్రూప్ 2 నియామకాలు మొత్తం పూర్తవుతాయి. ప్రభుత్వం సరేనంటే డిసెంబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం గ్రూప్ 2కు ఇంటర్వ్యూలు తప్పనిసరిగా ఉంటాయి ఇంతకుముందు జరిగిన లోపాలను సవరించి నియామకాలు చేపడతాం నియామకాలు పారదర్శకంగా ఉంటాయి. ఆ విశ్వాసం ఉన్నవాళ్లే దరఖాస్తు చేయండి ఇప్పటివరకు మేం చాలా ఫెయిర్‌గా వ్యవహరించాం. వివాదాలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలని అనుకుంటున్నాం ఏదైనా దాచిపెడితే వివాదం అవుతుంది.. మేం అంతా ఓపెన్‌గానే చేస్తున్నాం ఎవరైనా అడ్డుకుంటే మాత్రం మేమేమీ చేయలేం. -
ఆ లక్ష ఉద్యోగాలేవి..
ప్రకటనలకే పరిమితమైన ప్రభుత్వం నిరాశలో నిరుద్యోగులు.. నోటిఫికేషన్లపై గంపెడాశలు జనవరి నుంచే మొదలుపెడతామన్న టీఎస్పీఎస్సీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోని సర్కారు హామీలిచ్చి.. ఆచరణపై దృష్టి పెట్టని ప్రభుత్వ పెద్దలు విభజన సమస్యలు, హేతుబద్ధీకరణ పేరుతో కాలయాపన జిల్లా స్థాయి పోస్టుల భర్తీని కూడా పక్కనబెట్టిన వైనం గ్రూప్స్ సిలబస్ మార్పులపైనా ఎటూ తేల్చని సర్కారు కేబినెట్ ఆమోదించిన వాటికీ జారీ కాని నోటిఫికేషన్లు అంతులేని జాప్యంతో ఉద్యోగార్థుల్లో నిర్వేదం కొత్త రాష్ర్టంలో లక్ష ఉద్యోగాల భర్తీ.. ఉద్యోగుల పంపిణీ పూర్తి కాగానే ఖాళీ పోస్టులు ప్రకటిస్తాం.. ఖాళీలపై స్పష్టత రాలేదు. లెక్క తేలాక నియామకాలు చేపడతాం.. - వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్ త్వరలో 5 లక్షల ఉద్యోగాల భర్తీ - మీడియాతో ఎంపీ కేశవరావు కొత్త ఏడాదిలో కొత్త కొలువులు.. త్వరలో నోటిఫికేషన్లు - టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటన ఏడాదిలోగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. విభజనతో సంబంధం లేకుండా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయిలో 85 శాతం ఖాళీలు ఉన్నాయి. - అసెంబ్లీ సాక్షిగా మంత్రులు హరీశ్, ఈటల ఈ ప్రకటనలన్నీ వివిధ సందర్భాల్లో రాష్ర్ట ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు.. వాగ్దానాలు. కొత్త రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మరి లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి? ఖాళీ పోస్టుల ప్రకటన ఇంకెప్పుడు? నియామకాలు చేపట్టేదెన్నడు? సర్కారీ కొలువుల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగుల మౌన వేదన ఇది. భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ జనవరి నుంచే నోటిఫికేషన్లు మొదలవుతాయని ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఏప్రిల్ ముగుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల విభజన పేరుతో సర్కారు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. విభజనతో సంబంధం లేని పోస్టుల భర్తీ విషయంలోనూ సర్కారు శ్రద్ధ చూపకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిరాశలో మునిగిపోతున్నారు. ఇక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులుంటాయన్న అధికారులు.. కనీసం ఆ వివరాలను ఇప్పటికీ ప్రకటించకుండా ఉద్యోగార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు ఆలస్యంగా వచ్చినా.. ఆలోగా తగిన శిక్షణతో సన్నద్ధం కావాలనుకుంటున్న యువతకు నిర్వేదమే మిగులుతోంది. ఎందుకీ కాలయాపన? గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పోస్టుల భర్తీకి అనుసరించే సిలబస్‌ను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయడం లేదు. పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై ప్రొఫెసర్ హరగోపాల్ కమిటీ గతంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ)కు నివేదిక ఇచ్చింది. దాన్ని సర్కారుకు పంపి కూడా రెండు నెలలు కావస్తోంది. అయినా సిలబస్‌పై నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్ల జారీని ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కేబినెట్ ఆమోదించిన పోలీస్ కానిస్టేబుల్, నీటిపారుదల, విద్యుత్ శాఖల్లో ఇంజనీర్ పోస్టుల భర్తీ విషయంలోనూ పురోగతి లేదు. గత డిసెంబర్లో టీఎస్పీఎస్సీ ఏర్పాటైన తర్వాత ఉద్యోగాల భర్తీ వేగవంతమవుతుందని నిరుద్యోగులు ఆశించారు. జనవరి నుంచే నోటిఫికేషన్లు మొదలవుతాయని కమిషనూ ప్రకటించింది. మళ్లీ ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో కొన్నేళ్లుగా సర్వస్వం ధారపోస్తూ ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న యువత ఆందోళనకు గురవుతోంది. కనీసం విభజనతో సంబంధం లేని పోస్టులనైనా భర్తీ చేసి ఊరట కల్పించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అలాంటి ఖాళీ పోస్టులు ఇప్పటికిప్పుడు 76,548 ఉన్నాయి. ఇవన్నీ జిల్లా స్థాయి పోస్టులే. అయినా ఈ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. టీచర్ పోస్టులపై గందరగోళం ఇక డీఎస్సీ నోటిఫికేషన్ జారీపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందని విద్యా శాఖ వర్గాలు చెబుతుండగా, దాదాపు 3 లక్షల మంది నిరుద్యోగులు మాత్రం డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో స్కూళ్లలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపట్టాలని సర్కారు భావిస్తోంది. తద్వారా ఉన్న ఉపాధ్యాయులనే అవసరమైన చోట సర్దుబాటు చేసే ప్రణాళికలపై దృష్టి పెట్టింది. దీంతో కొత్త పోస్టుల భర్తీకి అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,323 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యా శాఖ తాజాగా లెక్కలు వేసింది. మరి వీటిని ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకం. లెక్చరర్ పోస్టులకు మరో లంకె! లెక్చరర్ పోస్టుల భర్తీ అంశం కాంట్రా క్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ముడిపడి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,377 డిగ్రీ లెక్చరర్, 3,173 జూనియర్ లెక్చరర్, 812 వొకేషనల్ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే వాటన్నింటినీ డెరైక్టు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం లేదు. మరోవైపు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో నేరుగా నియామకాలు చేపట్టే పోస్టుల్లోనూ కోత పడే అవకాశముంది. ఇక వీటి భర్తీ సంగతేంటో సర్కారుకే తెలియాలి. చిక్కుల్లో 20,591 పోస్టులు ఉద్యోగుల విభజన తర్వాతే రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, విభాగాధిపతి కార్యాలయాల్లోని 20,591 ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లను పునర్వ్యవస్థీకరించాలన్న వాదన ఉంది. ఈ ప్రక్రియను కూడా చేపడితే ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి లేదు. రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగంలోని 371(డి) అధికరణానికి సవరణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది. అందుకే ప్రస్తుత జోన్లను యథావిధిగా కొనసాగిస్తూ, విభజన పూర్తి కాగానే చేయాలని కోరుతున్నారు. - సాక్షి, హైదరాబాద్