సాక్షి , హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ మేరకు సంస్థ పాలక మండలి నిర్ణయించిందని తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వివరించింది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు సంస్థల అవసరాల మేరకు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని బోర్డు తీర్మానించింది.
కొత్తగా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఐటీ, ఫైనాన్‌స, టెక్నికల్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థలో ఆర్థిక సలహాదారుడి నియామకానికి ఆమోదం తెలిపింది. పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ సీవీ ఆనంద్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన ట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గోదాముల తనిఖీ: గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో పౌరసరఫరాల సంస్థ గోదామును ఆయన తనిఖీ చేశారు. ప్రజాపంపిణీని మరింత సమర్థంగా నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కందిపప్పును రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు విక్రరుుంచేందుకు కేంద్రం నుంచి కందులు కొనుగోలు చేసి మిల్లింగ్ చేరుుంచినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ గోదాములో 167 టన్నుల పప్పు నిల్వ ఉందని తెలిపారు.
పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం
Published Fri, Nov 25 2016 3:12 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement
Advertisement