సాక్షి, హైదరాబాద్: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయంటూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ పారదర్శకంగా వ్యహరిస్తుందని తెలిపారు.
ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండబోదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తోపాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఇప్పటికే హామీ ఇచ్చాయన్నారు. కొందరు రైస్ మిల్లర్లు మాత్రం అవకతవకలకు పాల్పడుతూ దారి మళ్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment