rice millers
-
ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించం.. రైస్ మిల్లర్లకు డీఎస్ చౌహాన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయంటూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ పారదర్శకంగా వ్యహరిస్తుందని తెలిపారు.ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండబోదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తోపాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఇప్పటికే హామీ ఇచ్చాయన్నారు. కొందరు రైస్ మిల్లర్లు మాత్రం అవకతవకలకు పాల్పడుతూ దారి మళ్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. -
కూటమి ప్రభుత్వం కమీషన్ల దందా
-
కమీషన్ల కోసం కపట నాటకం!
సాక్షిప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వంలో కమీషన్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా సాగిపోతోందని కూటమి సారథులు చెబుతోన్న మాటలకు, వాస్తవానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. ఇసుక, మద్యం దందా.. దౌర్జన్యాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులతో రెచ్చిపోతుండటాన్ని సుపరిపాలనగా చెప్పుకుంటున్నారు. అన్నింట్లోనూ కమీషన్ల కక్కుర్తితో జేబులు నింపుకుంటోన్న పెద్దలు ఇప్పుడు రైస్ మిల్లర్ల పొట్ట కొట్టేందుకు తగ్గేదేలే అంటున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల విడుదల కోసం కమీషన్ ఇస్తేకానీ విడుదల చేయనని ఓ మంత్రి బీషి్మంచుకుని కూర్చున్నారు. దీంతో కొంత మంది వసూళ్ల బాధ్యతలను భుజాన వేసుకున్నారు. డిసెంబర్ మొదటి వారం నాటికి సదరు మంత్రి అడిగిన మేరకు వసూళ్లు పూర్తి చేసి అప్పగించే పనిలో బిజీగా ఉన్నారు. గత నెలలో కాకినాడ కేంద్రంగా జరిగిన రైస్ మిల్లింగ్ రంగ ప్రముఖల భేటీలో ఈ మేరకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సాగింది. నాడు జరిగిన ఒప్పందం ప్రకారం నాలుగైదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సీఎంఆర్ బకాయిల కింద రూ.200 కోట్లు విడుదలయ్యాయి. తొలి విడతగా విడుదలైన బకాయిలకు గత నెలలో కుదిరిన ఒప్పందం మేరకు 8 శాతం కమీషన్ వసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు కమీషన్‌గా రూ.16 కోట్లు వసూలు చేస్తున్నారు. బకాయిలు వచ్చాయని సంతోíÙంచాలో.. భారీగా కమీషన్ ఇవ్వాల్సి వచ్చినందుకు ఏడవాలో అర్థం కావడం లేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ అసలు సంగతి.. » ప్రజా ప్రయోజనాల కోసం ప్రతి వ్యవసాయ సీజన్లో కోటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ చేసేందుకు అనుమతిస్తుంటుంది. ఇది ఏ ప్రభుత్వంలో అయినా సీజన్‌కు ముందు జరిగేదే. ప్రభుత్వం ఇచ్చే కోటా ప్రకారం మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యాన్ని తిరిగి అప్పగించడం పరిపాటి. అలా ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇచ్చిన రాష్ట్రంలోని మిల్లర్లకు ప్రభుత్వం సుమారు రూ.1,600 కోట్లు బకాయి పడింది. » సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయకత్వాన ప్రభుత్వం గద్దె నెక్కడంతో సీఎంఆర్ బకాయిల విడుదల కోసం మిల్లర్లు కూటమిలోని పెద్దల వద్ద లాబీయింగ్ చేశారు. బకాయిలు రూ.200 కోట్లు వంతున దశల వారీగా విడుదల చేయాలని పలువురు ప్రతిపాదించారు. » ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్ లక్ష్యం 37 లక్షల టన్నులుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 80 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 20 లక్షల టన్నులు స్థానిక అవసరాలకు వినియోగిస్తే మిగిలిన 60 లక్షల టన్నులు కస్టమ్‡ మిల్లింగ్‌కు ఇవ్వాలని మిల్లర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. » రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మిల్లులపై ఆధార పడ్డ వేలాది మంది లారీ, జట్టు, ప్యాకింగ్ కారి్మకులకు ఉపాధి లభిస్తుందని మిల్లర్లు కోరుతున్నారు. ఈ అంశంతో పాటు రైస్ మిల్లుల రాష్ట్ర కార్యవర్గంలో మార్పులపై ఆ రంగ ప్రముఖులు ఇటీవల కాకినాడలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) బకాయిలు మొత్తంగా సుమారు రూ.1600 కోట్ల విషయం చర్చకు వచ్చింది. ఖరీఫ్ సీజన్లో కస్టమ్ మిల్లింగ్‌లో ధాన్యం సేకరణ జరగాలంటే బకాయిలు విడుదల చేయాల్సిందేనని మిల్లర్లు పట్టుబట్టారు. మొత్తం బకాయిలు ఇప్పటికిప్పుడు ఒకేసారి విడుదల చేసే పరిస్థితులు లేవని తేల్చారు. రూ.200 కోట్ల వంతున విడుదల చేయించేందుకు ఒక మంత్రి తరఫున కొందరు నాటి సమావేశంలో వకాల్తా పుచ్చుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. » మొదటి విడత విడుదల అనుకున్నట్టు జరగాలంటే విడుదల చేసే బకాయి మొత్తంలో 10 శాతం కమీషన్ ఇవ్వాలని పట్టుబట్టారు. బకాయిలు పెరిగి పోయి మిల్లుల నిర్వహణ సవాల్‌గా మారిందని అభ్యంతరం వ్యక్తం కావడంతో చివరకు 8 శాతానికి ఒప్పందం కుదిరిందని సమాచారం. గత ప్రభుత్వంలో ఎవరికీ చిల్లి గవ్వ కమీషన్ ఇవ్వలేదని కొందరు విబేధించినా, చివరకు వారు కూడా మెజార్టీ నిర్ణయాన్ని కాదనలేకపోయారని తెలిసింది. పథకం ప్రకారం ఎగుమతులపై విష ప్రచారం » ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కాకినాడ పోర్టు ద్వారా పేదల బియ్యం విదేశాలకు తరలి పోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికల సభల్లో గగ్గోలు పెడుతూ కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బ తీశారని మిల్లింగ్ రంగంలో ఉన్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గడచిన ఐదేళ్లలో కోటి 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు ప్రాధాన్యతను గుర్తించకుండా కమీషన్ కోసమే ఇంత చౌక బారుగా వ్యవహరిస్తారా? అని విస్తుపోతున్నారు. » రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన మిల్లర్లే లక్ష్యంగా కూటమి నేతలు రైస్ మిల్లులు, గోడౌన్లపై వరుస దాడులు చేయించారు. తాము చెప్పినదంతా నిజమేనని ప్రజలను నమ్మించేందుకు పీడీఎస్ బియ్యంగా సుమారు 48 వేల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం సీజ్ చేసింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలో మకాం వేసి.. మిల్లులు, గోడౌన్లపై దాడులను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఇంతా చేసి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేక పోయారనే విమర్శలొచ్చాయి. సీజ్ చేసిన బియ్యంలో పీడీఎస్ లేదనే నిర్ధారణతో 70 శాతం బియ్యాన్ని దశల వారీగా విడుదల చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సీజ్ చేసిన మిగిలిన బియ్యంపై 6ఎ కేసులకే పరిమితమయ్యారు. కూటమి పెద్దల ఇంత హడావుడి వెనుక మిల్లర్లను దారికి తెచ్చుకోవడమేనని తేలిపోయిందని జనం విస్తుపోతున్నారు. -
రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం
-
Telangana: మిల్లర్లపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైస్ మిల్లర్లపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. పైసా పెట్టుబడి లేకుండా ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా, సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్) చేసేందుకు వెనుకాడుతున్నారంటూ.. మిల్లులపై కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం పెట్టే నిబంధనల మేరకు ప్రతి రైస్ మిల్లు పనిచేయాలని.. లేకుంటే మిల్లు సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం మేరకు ధాన్యం అప్పగించి, తప్పనిసరిగా మిల్లింగ్ చేసేలా నిబంధన పెట్టింది. బ్యాంకు గ్యారంటీ ఇవ్వలేమంటూ తప్పించుకునే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిపడ్డ డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ చట్టం కింద జప్తు చేయాలని నిర్ణయించింది. ఆయా మిల్లుల ఆస్తులను ఇతరుల పేర్లపైకి బదలాయించే అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా రిజి్రస్టేషన్ శాఖను అప్రమత్తం చేసింది. మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్! రాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి, మిల్లింగ్ సదుపాయాల కొరతను ఆసరాగా చేసుకొని.. మిల్లర్లు కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మిల్లింగ్ కెపాసిటీతో సంబంధం లేకుండా సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయింపులు, ఏళ్లకేళ్లు గడిచినా బియ్యాన్ని అప్పగించకపోవడం, మిల్లు ల్లో ధాన్యం లేకపోవడం.. వంటి అవకతవకలతో పౌర సరఫరాల సంస్థ తీవ్ర నష్టాలను చవిచూసింది. దీనితో 2014–15లో రూ.4,747 కోట్లుగా ఉన్న సంస్థ అప్పులు.. 2023–24 నాటికి రూ.58,623 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల మాయాజాలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొన్ని మార్గదర్శకాలను రూపొందించి... ఖరీఫ్ సీజన్ నుంచే నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది. కచ్చితంగా మిల్లింగ్ చేసేలా.. మిల్లులు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి అప్పగించకుండా మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం, ఏళ్లకేళ్లు బకాయిలు అలానే ఉండటం వంటి సమస్యలకు చెక్ పెట్టేలా.. ప్రభుత్వం ధాన్యానికి బ్యాంకు గ్యారంటీ నిబంధన తెచ్చింది. ఈ నిబంధన వల్ల కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) చేయలేమంటూ మొండికేస్తున్న మిల్లర్లను దారికి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి... 2015, 2016లలో విడుదలైన 18, 36 జీవోలు, వాటికి సవరణ చేస్తూ 2023 అక్టోబర్‌లో జారీ చేసిన జీవో నంబర్ 25ను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లు దాని కెపాసిటీలో కనీసం 50శాతం మేర ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని సీఎంఆర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మిల్లు లైసెన్స్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనితో కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని దించుకోమని మిల్లర్లు మొండికేసే పరిస్థితి తప్పనుంది. 2,054 మిల్లులు ‘గ్యారంటీ’కి రెడీ రాష్ట్రంలోని సుమారు 3,500 మిల్లులకుగాను.. 2,054 రైస్‌మిల్లులు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి ధాన్యాన్ని తీసుకునేందుకు అంగీకరించాయి. ఇందులో 1,274 రా రైస్ (ముడి బియ్యం) మిల్లులు కాగా.. 780 బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) మిల్లులు. ఇప్పటివరకు 1,669 మిల్లులు (992 రా రైస్, 677 బాయిల్డ్ మిల్స్) బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ ఇచ్చాయి. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లుల సామర్థ్యం 57.76 లక్షల మెట్రిక్ టన్నులు. డీఫాల్టర్ల విషయంలో ప్రత్యేక చర్యలు మూడు విడతల కన్నా ఎక్కువగా సీఎంఆర్ ఇవ్వకుండా ఎగవేసిన మిల్లర్లను డీఫాల్టర్లుగా గుర్తించి ధాన్యం కేటాయించకూడదని, లేదా షరతులతో కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 1,777 డీఫాల్టర్లను గుర్తించగా.. అందులో 362 మంది మిల్లర్లు కొన్నేళ్లుగా వరుసగా సీఎంఆర్ ఎగవేస్తూ వస్తున్నారు. వారికి ఈ ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయించడం లేదు. మిగతావారు మొత్తం బకాయి మొత్తం బియ్యాన్ని, అపరాధ రుసుముతో సహా అప్పగించి... దీనితోపాటు కొత్తగా ఇచ్చే ధాన్యానికి సంబంధించి 25 శాతం బ్యాంకు గ్యారంటీ ఇస్తే ధాన్యం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి ఎగవేతదారులుగా గుర్తించిన 362 మంది మిల్లర్లలో.. కేవలం 10 మంది మిల్లర్లే ఏకంగా రూ.605 కోట్ల విలువైన 1.67 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. వీరిలో ఆరుగురు సూర్యాపేట జిల్లావారుకాగా, ఇద్దరు కరీంనగర్ వారు నాగర్‌కర్నూల్, నిజామాబాద్‌ల నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా వారి ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరిస్తున్నారు. వారు ఆస్తులు అమ్ముకోకుండా, వేరేవారి పేరిట బదిలీ చేయకుండా రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. బ్యాంక్ గ్యారంటీ తీసుకునే ధాన్యం కేటాయింపులురైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేసి... కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం మిల్లులకు పంపుతుంది. మిల్లర్లు మూడు నుంచి ఆరు నెలల్లోగా ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి... వచ్చిన బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఇలా ధాన్యం తీసుకున్న చాలా మిల్లులు ఏడాదిన్నర, రెండేళ్లయినా బియ్యం తిరిగివ్వని పరిస్థితి. 2022–23 రబీ సీజన్లో మిల్లులకు కేటాయించిన 65 లక్షల టన్నుల ధాన్యంలో... సుమారు 30 లక్షల టన్నులను మిల్లింగ్ చేసి, బియ్యాన్ని మార్కెట్లో అమ్మేసుకున్నారు. అందులో 25 లక్షల టన్నుల మేర రికవరీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. ఆ బకాయిల విలువ రూ.7 వేల కోట్లుగా లెక్కగట్టగా.. ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే రికవరీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే ధాన్యానికి సంబంధించి మిల్లర్ల నుంచి కొంత మేర బ్యాంకు గ్యారంటీలు తీసుకుంటోంది. మిల్లులకు వాటికి సామర్థ్యానికి తగిన మేరకే ధాన్యాన్ని కేటాయిస్తోంది. -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
సన్నబియ్యానికి ‘నూకలు’ చెల్లినట్టే!
సాక్షి, హైదరాబాద్: సన్నబియ్యంలో నూకల పేరిట మిల్లర్లు భారీ స్కెచ్ వేశారు. 100 కిలోల సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు వస్తాయని కొత్తరాగం ఎత్తుకున్నారు. నిబంధనల ప్రకారం ఖరీఫ్‌లో 100 కిలోల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం లెక్కన ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. ఈసారి కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం (సన్నాలు) భారీ ఎత్తున వస్తాయని భావిస్తున్న మిల్లర్లు మిల్లింగ్‌లో చేతివాటం చూపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రబీలో వచ్చే ధాన్యాన్ని రా రైస్‌గా మిల్లింగ్ చేస్తే నూకల శాతం పెరుగుతుందని చెబుతూ వచ్చిన మిల్లర్లు.. ఈసారి సన్న ధాన్యానికి కూడా ఇదే వంక పెడుతున్నారు. గతంలో ఎన్నడూ ఖరీఫ్ ధాన్యం ఔటర్న్పై ఒక్కమాట కూడా మాట్లాడని మిల్లర్లు ఎకాఎకిన 9 కిలోల బియ్యానికి టెండర్ పెడుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సన్నబియ్యం ధర కిలోకు రూ. 50 చొప్పున లెక్క వేసుకున్నా... 9 కిలోలకు రూ. 450 అవుతుంది. క్వింటాల్ సన్న ధాన్యానికి రైతుకు ప్రభుత్వం రూ. 500 బోనస్‌గా ఇవ్వాలని భావిస్తుంటే... మిల్లింగ్ పేరు మీద క్వింటాల్ ధాన్యానికి రూ. 450 విలువైన బియ్యాన్ని ఎగవేసే పన్నాగంలో మిల్లర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. 9 కిలోల బియ్యానికి బదులు నూకలు ఇస్తామనడం పట్ల పౌరసరఫరాల శాఖ అధికారులే విస్తుపోతున్నారు. బ్యాంక్ గ్యారంటీలపైనా తకరారు! ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధంగానే బ్యాంకు గ్యారంటీలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలలో పొందుపరిచారు కూడా. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించాల్సి ఉండగా, ముసాయిదాతోనే నిలిపివేసి, మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రైస్‌మిల్లు కెపాసిటీకి అనుగుణంగా కేటాయించిన ధాన్యం విలువలో 25 శాతం మేర బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. మిల్లును లీజుకు తీసుకుంటే.. కేటాయించిన ధాన్యం విలువలో 50 శాతం మేర లీజుదారుడు చెల్లించాలి. అయితే ఈ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనేది తమకు తలకు మించిన భారమని, మిల్లింగ్ చార్జీలు కూడా ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని, ఏపీ వంటి రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ.100 చెల్లిస్తుంటే మనరాష్ట్రంలో కేవలం రూ. 10 మాత్రమే ఇస్తున్నారని మిల్లర్లు చెబుతున్నారు. అది కూడా చాలా కాలంగా ఇవ్వడం లేదని వారి ఆరోపణ. ఈ నేపథ్యంలో బ్యాంకు గ్యారంటీలను ఎత్తివేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక సీజన్లో సీఎంఆర్ ఇవ్వకుండా డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారంటీ తీసుకొని ధాన్యం కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అంటే ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లర్లు తాము ఇవ్వాల్సిన బియ్యాన్ని అప్పగించడంతోపాటు అదనంగా 25 శాతం జరిమానా మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తే వారికి ధాన్యం కేటాయిస్తారు. ఇలా ఒక సీజన్లో సీఎంఆర్ డిఫాల్ట్ అయిన మిల్లులు రాష్ట్రంలో 791 ఉన్నట్టు పౌరసరఫరాల సంస్థ తేల్చింది. రెండు, అంతకంటే ఎక్కువ సీజన్లలో డిఫాల్ట్ అయిన మిల్లులకు ఈసారి ధాన్యం కేటాయించమని మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో తేల్చిచెప్పారు. 386 మిల్లులను డిఫాల్ట్ మిల్లులుగా తేల్చడం గమనార్హం. మొత్తానికి బ్యాంకు గ్యారంటీల అంశం కూడా అటకెక్కినట్టేనని పౌరసరఫరాల శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్‌మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రా రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం రైస్‌మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్ అయిన రా రైస్‌మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు. 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్ మిల్లింగ్ డెలివరీపై ఖీమ్యానాయక్ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్‌ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. డీఎస్వో ఎస్.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్‌మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
డిఫాల్టర్లకు పెనాల్టీ
సాక్షి, హైదరాబాద్: నిర్ణీత గడువులోగా ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా విదిల్చింది. 2021–22 వానా కాలం సీఎంఆర్ గడువు పలు వాయిదాల తరువాత ఏప్రిల్ 31తో ముగిసింది. అయినా రాష్ట్రంలోని 494 రైస్ మిల్లులు బియ్యం అప్పగించలేదు. వీటినుంచి 2.22 ఎల్ఎంటీ బియ్యం ఎఫ్‌సీఐకి చేరాల్సి ఉంది. ఈ బియ్యం రికవరీకి గడువు కోరినా ఎఫ్‌సీఐ అంగీకరించలేదు. దీంతో ఎఫ్‌సీఐ నుంచి సుమారు రూ. 700 కోట్లు రాలేదు. ఇప్పుడు మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేసినా, నిబంధనల మేరకు ఎఫ్‌సీఐకి పంపకుండా రాష్ట్ర అవసరాలకే (స్టేట్ పూల్) వినియోగించుకోవాలి. దీంతో పౌర సరఫరాల శాఖ నష్ట నివారణకు చర్యలు చేపట్టింది. 494 రైస్ మిల్లులను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారి నుంచి 25 శాతం పెనాల్టీతో 125 శాతం సీఎంఆర్‌ను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హోదాలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 25 శాతం నగదు.. 100 శాతం బియ్యం.. డిఫాల్టర్ల నుంచి 125 శాతం బియ్యాన్ని రికవరీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిల్లర్ల గుండెల్లో పిడుగు పడినట్లయింది. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ విలువ రూ. 700 కోట్లు అనుకుంటే... రూ. 175 కోట్లు(25 శాతం) పెనాల్టీ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో 5 శాతం వెంటనే చెల్లించాలి. అప్పుడే మిల్లర్ నుంచి బియ్యం రికవరీ ప్రారంభమ వుతుంది. మిల్లర్లు ఇప్పటికే బియ్యాన్ని విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో రికవరీకి రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి స్టేట్‌పూల్‌కు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వంద శాతం రికవరీయే కష్టమవుతుంది కాబట్టి, 25 శాతం బియ్యాన్ని నగదు రూపంలో వసూలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పౌరసరఫరాల శాఖ, సంస్థ డీఎంలు, డీఎస్‌ఓలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. పెనాల్టీ నుంచి 5వ వంతు మిల్లర్ల నుంచి వసూలు చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. ఓ వైపు సీఎంఆర్.. మరోవైపు ధాన్యం అన్లోడింగ్.. ఇప్పుడు డిఫాల్ట్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఓవైపు సీఎంఆర్ అప్పగించేందుకు మిల్లులు నడుపుతూ ప్రస్తుత యాసంగి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకొనే విషయంలో సర్కార్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ధాన్యానికి కొర్రీలు పెడుతూ ప్రతి 40 కిలోల బస్తాపై 3 నుంచి 5 కిలోల అదనపు ధాన్యాన్ని రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. -
ప్రజావాణి: ఈ మహిళ పేరు స్వప్న.. తాగడానికి నీరు దొరకలేదు
ఈ మహిళ పేరు స్వప్న. వెల్గటూర్ మండలం ముంజంపల్లి స్వగ్రామం. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి వేదిక వద్దకు చేరుకుంది. తాగడానికి సమీపంలో ఎక్కడా నీరు దొరకలేదు. దాహంతో తపించిపోయింది. జగిత్యాల: అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నాయి. దాహం కోసం ప్రజలు తపిస్తున్నారు. అయినా, కలెక్టరేట్లో సోమవారం చేపట్టిన ప్రజావాణిలో కనీస సౌకర్యాలు కల్పించలేదు. కలెక్టరేట్ మొత్తంగా పచ్చదనం పర్చుకుని, ఆహ్లాద వాతావరణం పంచుతూ ఉన్నా.. మౌలిక వసతులు లేవు. దీంతో ప్రజావాణికి హాజరైన అభాగ్యులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్టాండ్ నుంచి దాదాపు కి.మీ. దూరం కలెక్టరేట్ ఉంది. అక్కడిదాకా ఆటోలు, ప్రైవేట్ వాహనాలు తప్ప ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. అధిక వ్యయ ప్రయాసలకోర్చి ప్రజావాణికి చేరుకున్నా తాగేందుకు చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. సమస్యలు పరిష్కరించండి ప్రజావాణి ద్వారా స్వీకరించే అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. ప్రజా వాణి ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభాగ్యుల నుంచి 54 ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు. ధాన్యం తూకంలో మోసాలు.. ధాన్యం తూకంలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని, కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ నాయకులు కోరారు. ప్రజావాణిలో వారు ఒక వినతిపత్రం అందజేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో విధంగా ధాన్యం తూకం వేస్తున్నారని ఆరోపించారు. మిల్లుకు చేరాక ధాన్యంలో మళ్లీ కోత విధిస్తున్నారని వారు ఆరోపించారు. ఇలాంటి మోసాలను అరికట్టి, కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జలేందర్, కంచర్ల అఖిల్, రాకేశ్, తిరుపతిరెడ్డి, రాజు పాల్గొన్నారు. రైతులను ఆదుకోండి ధాన్యం కొనుగోళ్లలో నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని, అన్నదాతలను ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న నష్టాలపై వారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్, మ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సిరాజొదీ్దన్ మన్సూర్, నాయకుడు వాకాటి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల మోసం
-
Telangana: రైస్ మిల్లర్లకు తీపి కబురు.. జీఎస్టీ బకాయి రద్దు..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి, హైదరాబాద్: ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రాసెస్ చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడాన్ని మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతికి సంబంధించిన 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) బకాయిని రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర రైస్ మిల్లర్లు, రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీపి కబురుతో మిల్లర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భాల్లో గతంలో సీ– ఫారం దాఖలు చేస్తే సీఎస్టీలో 2 శాతం రాయితీని కలి్పంచే విధానం ఉండేది. ఆ విధానం ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశారు. అనంతరం తెలంగాణ ఏర్పాడ్డాక మొదట్లో అమలు చేశారు. 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2017 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రాష్ట్రం నుంచి చేసిన బియ్యం ఎగుమతులకు సీ– ఫారం సబి్మట్ చేయలేదనే కారణంతో బియ్యం ఎగుమతిదారులకు సీఎస్టీలో 2 శాతం పన్ను రాయితీ కలి్పంచడం నిలిపివేశారు. దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని కొంతకాలంగా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద వాపోతున్నారు. బియ్యం ఎగుమతి చేశామా.. లేదా? అనేది నిర్ధారణ చేసుకోవడమే సీ ఫారం ఉద్దేశమని, అది లేనంత మాత్రాన తమ హక్కును ఎలా రద్దు చేస్తారని అడుగుతున్నారు. సీ ఫారం బదులు తాము ఎగుమతులు చేసినట్లుగా నిర్ధారించుకోవడానికి ఇతర పద్ధతులను పరిశీలించాలని విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. తాము చేసిన లోడింగ్, రిలీజింగ్ సరి్టఫికెట్లు, లారీ, రైల్వే పరి్మట్లు, వే బిల్లులు తదితర ఏ ఆధారమైనా తాము సబ్మిట్ చేస్తామని, వాటిని పరిగణనలోకి తీసుకుని రెండేళ్ల కాలానికి సంబంధించిన 2 శాతం పన్ను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని సోమవారం దామరచర్లలో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్, ఉపాధ్యక్షుడు కర్నాటి రమే‹Ù, సంఘం మిర్యాలగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ తదితరులు సీఎంను కలిసి వివరించారు. వారి అభ్యర్థనను పరిశీలించిన కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే రైస్ మిల్లర్లకు, రాష్ట్ర రైతులకు ప్రయోజనం కలిగేలా సమాలోచన చేయాలని రైతుబంధు సమితి అధ్యక్షుడిని ఆదేశించారు. సీఎస్ ఉత్తర్వులు 2015, ఏప్రిల్ 1 నుంచి 2017, జూన్ 30 వరకు జరిగిన బియ్యం అమ్మకాల లావాదేవీలపై సీఎస్టీని ఎత్తివేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర రాష్ట్రాలకు అమ్మిన ధాన్యం విషయంలో సీ–ఫారంలు సమరి్పంచకపోయినా, పరి్మట్, లోడింగ్ సర్టిఫికెట్, రవాణా రశీదులు, వే బిల్లుల్లాంటి ఆధారాలను సమరి్పస్తే 2 శాతం కన్నా ఎక్కువ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి రైస్ మిల్లర్స్ కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుతుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిõÙకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీ– ఫారం నుంచి మినహాయింపు ఇచ్చేందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అభినందనీయులని పేర్కొన్నారు. చదవండి: పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు.. -
తరుగు పేరుతో ఇబ్బంది పెడితే చర్యలు
వైరా: ధాన్యం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగం గా శనివారం ఆయన వైరా మార్కె ట్ యార్డ్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే లావుడ్యా రాము లునాయక్‌లతో కలసి తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ‘కుప్పలు.. తిప్పలు, ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న మిల్లర్లు ’శీర్షికతో గురువా రం ‘సాక్షి’ప్రధాన సంచికలో ప్రచురితమై న కథనాన్ని పలువురు మంత్రి దృష్టికి తీ సుకొచ్చారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్ తేమ శాతం ఎంత ఉంటే కొను గో లు చేస్తున్నారని ఆరా తీయడంతో పాటు స్వయంగా తేమ శాతాన్ని పరీక్షించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీల ద్వారా మిల్లర్ల అక్రమాలను అడ్డుకోవాల ని సూచించారు. పలువురు రైతులు కొణి జర్ల మండలంలోని ఎస్ఆర్ మిల్లు యజ మాని బస్తాకు పది కేజీలు తరుగు పేరుతో తీస్తున్నారని ఫిర్యాదు చేయగా.. వెంటనే ఆ మిల్లును సీజ్ చేయాలని కలెక్టర్ గౌత మ్ను మంత్రి ఆదేశించారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
ధాన్యం అన్‌లోడింగ్‌కు మిల్లర్లు ఓకే
సాక్షి, హైదరాబాద్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చే యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు (అన్లోడింగ్) మిల్లర్లు అంగీకరించారు. వేసవిలోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వంతో కలసి నడుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు మిల్లర్లతో రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం హైదరాబాద్ లోని పౌరసరఫరాల శాఖ భవన్లో భేటీ అయ్యారు. కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాల నుంచి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపుతున్న అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాల ని కోరారు. అదే సమయంలో మిల్లర్లు రైతులను తరుగు, తాలు పేరుతో ధాన్యం కోతలతో వేధించడాన్ని మంత్రి తప్పుబట్టారు. మిల్లర్‌కు, రైతుకు మధ్య సంబంధం ఉండరాదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాల ప్రకారమే ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నామని, అందువల్ల ఒక్క కిలో కూడా మిల్లుల్లో కోత పెట్టరాదని ఆదేశించారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ యాసంగి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చార్జీలు నిర్ణయిస్తుందన్నారు. అలాగే రైస్ మిల్లర్ల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని గంగుల హామీ ఇచ్చారు. మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం... ఈ భేటీలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ధాన్యం సేకరణ, మిల్లింగ్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మిల్లర్లను దొంగలుగా చిత్రీకరించడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికే నష్టాల్లో ఉండటం వల్ల యాసంగిలో ఎఫ్‌సీఐ కోరిన మేరకు 67 శాతం ఔటర్న్ రాదనే భయంతో ధాన్యం అన్‌లోడింగ్‌కు కొందరు మిల్లర్లు భయపడుతున్నారని మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్‌రెడ్డి మంత్రికి వివరించారు. రాష్ట్రంలో 2,400 మిల్లుల్లో 1,500కుపైగా బాయిల్డ్ మిల్లులున్నా యని... ఎఫ్‌సీఐ, కేంద్రం తీరుతో వాటిపై ఆధారపడి న లక్షలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. రా రైస్ మర ఆడించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువ బియ్యం వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల తమకు నష్టాలు లేకుండా చూడాలని కోరారు. భేటీలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేషన్ జీఎంలు, మిల్లర్లు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎస్ కమిటీ భేటీ యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. ఈ భేటీలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం కొనుగోళ్లు, ఎఫ్‌సీఐకి అందించాల్సిన ధాన్యంపై చర్చించారు. -
వా(వ)రి గోస ఎవరికెరుక! మిల్లర్లు కొనరాయే.. అరిగోస పడి అగ్గువకు అమ్ముడాయే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండాపోతోంది. మిల్లర్లు తమ ఇష్టానుసారంగా ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనలో పడ్డారు. నాలుగు రోజుల కిందటి వరకు బాగానే ధర చెల్లించిన మిల్లర్లు ఒక్కసారిగా తగ్గించేశారు. శుక్ర, శనివారాల్లో ప్రాంతాన్ని బట్టి ఒక్కో క్వింటాల్‌పై రూ.300 నుంచి రూ.450 వరకు తగ్గించి కొనుగోలు చేశారు. నాలుగు రోజుల కిందటి వరకు సన్నరకం (చింట్లు) ధాన్యం క్వింటాల్‌కు రూ.2,200 చెల్లించగా, మిర్యాలగూడ ప్రాంతంలోని కొన్ని మిల్లుల్లో సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.1,850 చెల్లించారు. ఇక త్రిపురారంలోని ఓ మిల్లులో శనివారం క్వింటాల్‌కు కేవలం రూ.1,750 మాత్రమే చెల్లించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెండు, మూడు రోజులు పడిగాపులు.. నల్లగొండ జిల్లాలో ముందస్తు నాట్లు వేసిన ప్రాంతాల్లో సన్నాల కోతలు 15 రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. దీంతో పది రోజులుగా రైతులు మిల్లులకు వచ్చి ధాన్యం అమ్ముతున్నారు. మొదట్లో ధాన్యం తక్కువగా రావడంతో ఎక్కువ ధర చెల్లించిన మిల్లర్లు, ఇప్పుడు ధాన్యం రాక ఎక్కువ కావడంతో ధరను తగ్గించేశారు. అంతేకాక రైతులు ఎక్కువ సంఖ్యలో వస్తుండడంతో రెండు, మూడు రోజల పాటు కొనుగోలు చేయకుండా పెండింగ్ పెడుతున్నారు. రైతులు విసిగిపోయి తక్కువ ధరకైనా అమ్ముకొని వెళ్తారనే ఉద్దేశంతోవారు వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకోక తప్పడం లేదు. కొనుగోళ్లలో జాప్యం వల్ల త్రిపురారం మండలంలోని ఒక్కో మిల్లు వద్ద 20 నుంచి 30 ట్రాక్టర్లలో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. 25 శాతం ఉమ్మడి జిల్లా నుంచే.. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ధాన్యం దిగుబడిలో 25 శాతం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే వస్తోంది. అత్యధింగా 250 రైస్ మిల్లులు ఉన్నది ఇక్కడే. నల్లగొండ జిల్లాలో 130, సూర్యాపేట జిల్లాలో 83, యాదాద్రి జిల్లాలో 37 మిల్లులు ఉన్నాయి. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సన్నాలు, దొడ్డు ధాన్యం కలిపి దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో సన్నాలు 2,34,752 ఎకరాల్లో సాగు చేయగా, 4,59,446 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దొడ్డు ధాన్యం 2,09,226 ఎకరాల్లో సాగు చేయగా అందులో 6,54,157 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, మొత్తం 4,43,973 ఎకరాల్లో వరి సాగు చేయగా, సన్న, దొడ్డు ధాన్యం కలిపి 11,13,604 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 4,61,532 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. అందులో 3,45,081 ఎకరాలలో సన్న రకాలు, 1,16,449 ఎకరాలలో దొడ్డు రకాలను సాగు చేశారు. తద్వారా 8,28,196 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 3,26,058 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వస్తుందని లెక్కలు వేశారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్లు మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.. ధర స్థిరంగా ఉండేలా చూడాలి నాకున్న 8 ఎకరాల్లో హెచ్ఎంటీ రకం సాగుచేశా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు మిల్లుకు వెళుతున్నారు. మొదట్లో ధర బాగానే పెట్టినా ఇప్పుడు క్వింటాల్‌కు రూ.1,870 మాత్రమే చెల్లిస్తున్నారు. ధర స్థిరంగా ఉండేలా చూడాలి. – చల్లా ప్రదీప్‌కుమార్, అన్నపరెడ్డిగూడెం ధర తగ్గించారు మొన్నటి వరకు మిల్లర్లు రూ.2,200 పెట్టినా ఇప్పుడు ధర తగ్గించారు. నాకున్న 2.1 ఎకరాల్లో చింట్లు సాగు చేయగా 65 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. క్వింటాలుకు రూ.1,850 ఇస్తామంటున్నారు. – ధీరావత్ తుకారాం, ఏడుకోట్ల తండా రూ.1,750 ఇస్తున్నారు ఈసారి పంట దిగుబడి తగ్గింది. దీనికి తోడు ధర తగ్గించారు. మొదట రూ. 2,200 ఉందని సంతోష పడ్డాం. ఇప్పుడు మిల్లుకు వచ్చేసరికి క్వింటాలుకు రూ.1,750 ఇస్తున్నా రు. గత్యంతరం లేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నాం. – యేమిరెడ్డి వెంకట్‌రెడ్డి, త్రిపురారం -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
తరుగని..దగా!..తాలు, నల్లబడ్డ ధాన్యం పేరుతో మిల్లర్ల తరుగు
ఈ రైతు పేరు డప్పురి భుజంగం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ గ్రామం. రెండెకరాల 30 గుంటల్లో వరివేయగా.. 70 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. పుల్కల్ కొనుగోలు కేంద్రానికి తెచ్చి తూకం వేయించాడు. బస్తాకు 40కిలోల ధాన్యానికి బదులు 42 కిలోల చొప్పున తూకం వేశారు. నిబంధనల ప్రకారం 17% తేమ ఉన్నా పర్వాలేదు. అలాంటిది అంతకన్నా తక్కువగా 15 శాతమే తేమ ఉన్నా తరుగు తీశారు. దీనితో మూడు క్వింటాళ్ల ధాన్యాన్ని నష్టపోయాడు. ..ఒక్క భుజంగమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వరి పండించిన రైతులందరిదీ ఇదే సమస్య. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెస్తే.. రోజుల తరబడి ఎదురుచూపులు. ఎలాగోలా తూకం పూర్తయి మిల్లర్లకు పంపితే.. తాలు, తరుగు పేరిట కోతలు. మిల్లర్లను ఎంత బతిమాలినా.. ఏమాత్రం కనికరం లేకుండా బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి రైతు అరిగోస పడుతున్నాడు. నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకుంటున్నా.. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల దోపిడీతో నిండా మునుగుతున్నాడు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసినా.. మిల్లర్లు బస్తాకు రెండు కిలోల నుంచి నాలుగు కిలోలదాకా తరుగు తీస్తుండటంతో నష్టపోతున్నాడు. రైతులు ఇదేమిటని అడిగితే మిల్లర్లు ధాన్యాన్ని తిప్పిపంపేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నారు. రైస్‌మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మిల్లర్లు అడ్డగోలుగా తరుగు తీస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. కొనుగోలు కేంద్రం నుంచే మొదలు.. కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తాలో 40కిలోల ధాన్యాన్ని నింపుతారు. ధాన్యంలో తేమ 17శాతం, అంతకన్నా తక్కువ ఉంటేనే తూకం వేస్తారు. అయితే కొనుగోలు కేంద్రాల్లోని హమాలీలు, నిర్వాహకులు తరుగు, ఇతర వేస్టేజీ పేరుతో సాధారణంగానే ఒక కిలోదాకా ఎక్కువ ధాన్యం వేసి.. 41 కిలోలతో బస్తాను నింపుతున్నారు. కానీ 40 కిలోల లెక్కనే నమోదు చేస్తున్నారు. ధాన్యం మొత్తం ఎన్ని బస్తాలు, మద్దతు ధర ప్రకారం అదే సొమ్ము ఎంత అన్న వివరాలను ఒక చీటీ మీద రాసి రైతులకు ఇస్తున్నారు. నిజానికి ఇక్కడితో రైతుల బాధ్యత పూర్తయినట్టే. తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆ ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ అధికారులు సూచించిన మిల్లులకు పంపుతారు. మిల్లుకు చేరగానే కొర్రీలు.. మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకుని.. తమకు అందినట్టుగా నమోదు చేయాలి. కానీ ఇక్కడే కొర్రీలు మొదలవుతున్నాయి. ధాన్యంలో తాలు, తేమ ఎక్కువగా ఉన్నాయని, నల్లటి ధాన్యం ఉందని సాకులు చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఫోన్ చేసి.. ‘‘మిల్లు వాళ్లు వడ్లు తీసుకోరట. తరుగు ఉంది. వడ్లు నల్లబడ్డాయి. ఒకవేళ తీసుకోవాలంటే.. బస్తాకు కనీసం 2 నుంచి 4 కిలోల తరుగు తీయాల్సి ఉంటుంది. మీరు సరేనంటే మిల్లు వాళ్లు తీసుకుంటారట. లేకుంటే తిప్పి పంపేస్తామంటున్నారు..’’ అని చెప్తున్నారు. రైతులు చేసేదేమీ లేక తరుగుకు ఒప్పుకుంటున్నారు. 40 కిలోల బస్తాకు 2 కిలోల నుంచి 4 కిలోల వరకు అంటే.. క్వింటాల్‌కు 5 నుంచి 10 కిలోల ధాన్యాన్ని వదులుకోవాల్సి వస్తోంది. జాప్యం ఇందుకే.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు మిల్లర్ల జోక్యం మితిమీరడం వల్లే వానాకాలం పంట కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. రోజుకు లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు మొదలై నెలా 15 రోజులు దాటినా.. ఇప్పటివరకు లక్ష్యంలో 33 శాతమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మొత్తంగా కోటి టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 34.26 లక్షల టన్నులే పూర్తయింది. ఈ నెలాఖరు వరకు కూడా కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంతా కుమ్మక్కై! కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లుల యజమానులు కుమ్మ ౖక్కై రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చాలా చోట్ల మిల్లర్లు చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని.. వారు చెప్పినట్టు ధాన్యం సేకరణ సాగుతోందని రైతులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పౌర సరఫరాల సంస్థ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 453 కేంద్రాలు తెరవగా కొనుగోళ్లు దాదాపుగా పూర్తయి 427 కేంద్రాలను మూసేశారు. అదే సమయంలో భూపాలపల్లి, కొత్తగూడెం, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లు మొదలేకాలేదు. బస్తాకు 2 కిలోలు కట్ చేశారు మా పొలంలో పండించిన వడ్లను ఊరిలోని ఐకేపీ సెంటర్లో అమ్మిన. కానీ జనగామలోని రైస్‌మిల్లు వాళ్లు వడ్లలో తాలు ఉందంటూ రెండు రోజులు లారీ నుంచి వడ్లు దించుకోలేదు. తర్వాత బక్కో బస్తాకు 2 కిలోల లెక్కన తరుగు కింద కట్ చేశారు. నా 600 బస్తాలకు 12 క్వింటాళ్లు తరుగు చూపించారు. అంటే రూ. 24 వేలు నష్టపొయిన. – కొల్ల నర్సిరెడ్డి, రైతు,బండనాగారం, జనగామ జిల్లా తాలు, తప్ప లేకుండా తేవాలి వడ్లలో తాలు, రాళ్లు లేకుండా శుభ్రం చేసి ధాన్యం తేవాలి. కొందరు కొనుగోలు కేంద్రంలో ఉన్న నిర్వాహకులను మేనేజ్ చేసుకుని, ధాన్యం కాంటా వేయిస్తున్నారు. దానిని రైస్ మిల్లులకు పంపుతున్నారు. తాలు లేకుండా తెస్తే ఎలాంటి కటింగ్ ఉండదు. మేం కూడా రైతులమే.. –మినుపాల ప్రకాశ్‌రావు, రైస్ మిల్లు యాజమాని, సుల్తానాబాద్ తరుగు తీస్తే కఠిన చర్యలు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చేంత వరకే రైతుల బాధ్యత. కొనుగోలు కేంద్రం నుంచి రైస్‌మిల్లులకు పంపించాల్సింది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే. ధాన్యం ఒక్కసారి రైస్‌మిల్లుకు చేరాక.. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. రైస్‌మిల్లర్లు ధాన్యంలో కోతపెట్టడం, తాలు, తరుగు తీయడం అనేది నిబంధనలకు విరుద్ధం. మిల్లర్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – గంగుల కమలాకర్,పౌరసరఫరాల శాఖ మంత్రి -
నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో మిల్లింగ్ బంద్
సాక్షి, కరీంనగర్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) కొర్రీలపై రైస్ మిల్లర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. సీఎంఆర్ నాణ్యత విషయంలో పెడుతున్న కొర్రీలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మిల్లర్లు కఠిన నిబంధనలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వానాకాలం సన్నరకం ధాన్యం ప్రభుత్వం కేటాయించనుండడం, సీఎంఆర్ తగ్గే అవకాశం ఉండడం, ఎఫ్‌సీఐ నిబంధనలతో కోట్లల్లో నష్టం వస్తుండడంతో ధాన్యం మిల్లింగ్ సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉన్న బియ్యంపై ఆ సంస్థ పెడుతున్న ఆంక్షలు మిల్లర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ విషయమై అధికారులకు పలుమార్లు చేసిన విజ్ఞప్తులు ఫలించకపోవడంతో సీఎంఆర్ నిలిపివేతవైపే మిల్లర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేయాలని నిర్ణయించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితిలో మిల్లింగ్ నిలిపివేస్తే కొనుగోళ్లపై ప్రభావం చూపనుంది. మిల్లర్లపై ఒత్తిళ్లు.. ప్రతీ సీజన్లో ధాన్యం తీసుకునే విషయంలో మిల్లర్లపై పౌరసరఫరాలశాఖ ఒత్తిళ్లు సాధారణంగా మారాయి. పంట కోతల సమయంలో వర్షం, తెగుళ్లు ఇతర సమస్యలతో ధాన్యం నాణ్యత తగ్గిపోతోంది. రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కొనుగోళ్లలో సడలింపులు ఇస్తోంది. ఇవే సడలింపులతో గత వానాకాలంలో తెగుళ్లు సోకిన ధాన్యం కొనుగోలు చేసి, తమకు కట్టబెట్టడాన్ని మిల్లర్లు వ్యతిరేకించారు. అనంతరం దిగుమతి చేసుకున్నారు. సదరు ధాన్యం మరాడించగా.. వచ్చిన బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ ఇబ్బంది పెడుతోందని మిల్లర్లు పేర్కొంటున్నారు. దీంతో రెండునెలల క్రితం నాణ్యతతో కూడిన బియ్యం ఉత్పత్తిపై జిల్లా అధికారులు ఎఫ్‌సీఐ నాణ్యత నియంత్రణ అధికారులతో మిల్లర్లకు అవగాహన కల్పించారు. చివరికి బియ్యాన్ని తీసుకోవడానికి ఎఫ్‌సీఐ నిరాకరించడంతో ప్రభుత్వమే దిగి వచ్చి, పొడి బియ్యం బదులు బాయిల్డ్ బియ్యం తీసుకునే వెసులుబాటు కల్పించింది. తాజాగా యాసంగికి సంబంధించి సీఎంఆర్ బియ్యం తీసుకోవడానికి కూడా ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. ఈ క్రమంలో బియ్యంతోపాటు ప్యాకింగ్ చేసే సంచుల నాణ్యత కూడా సమస్యగా మారడంతో మిల్లర్లు సమ్మెకు దిగుతున్నారు. సన్నధాన్యం సేకరణపై ప్రభావం నియంత్రిత సాగుపై ప్రభుత్వ ప్రచారంతో ఈ సీజన్లో 60 నుంచి 70శాతం మంది రైతులు సన్నరకం ధాన్యం సాగుచేశారు. దీంతో సన్నాల దిగుబడి ఈ సారి ఇబ్బడిముబ్బడిగా వచ్చే అవకాశముంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ వానాకాలం సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 18,78,958 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. సన్నధాన్యం సాధారణ రకం కిందకు రావడం, ఈ సీజన్లో పొడి బియ్యం సీఎంఆర్‌గా ఇవ్వాల్సి ఉండడం, తదితర కారణాలతో మిల్లర్లు ఎఫ్‌సీఐ తీరుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించారు. ధాన్యాన్ని పొడి బియ్యంగా ఇవ్వాల్సి ఉండటం, ప్రభుత్వానికి పొడి బియ్యమే ఎక్కువగా అవసరం కావడంతో మిల్లర్లు సీజన్‌కు ముందే ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తేనే మిల్లింగ్.. చిన్నచిన్న సాకులతో సీఎంఆర్ సేకరణకు ఎఫ్‌సీఐ కొర్రీలు పెడుతోంది. గోదాములకు పంపిన బియ్యాన్ని తిప్పి పంపుతోంది. తిరిగి పాలిష్ చేసి పంపడానికి ఒక లారీకి అదనంగా రూ.7 వేల భారం పడుతోంది. ఈ సారి సన్న వడ్ల లెవీ తక్కువ వస్తుంది. నిబంధనల ప్రకారం సీఎంఆర్ ఇవ్వడం మిల్లర్లకు కష్టమే. రైస్ మిల్లర్లకు కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. న్యాయం చేయాలని మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌ను కలిసి వినతిపత్రాలు అందించాం. సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి మిల్లింగ్ నిలిపివేస్తున్నాం. – నగునూరి అశోక్‌కుమార్, రైస్‌ఇండస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి -
పేదల బియ్యంలో అవినీతి పురుగులు
జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు.. పరాకాష్ట స్థాయికి చేరాయి. ఓ వైపు ధాన్యం కొనుగోలులో ధరలు, తరుగుల పేరుతో రైతుల కడుపులు కొడుతున్న మిల్లర్లు.. మరో వైపు పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేసి సీఎంఆర్ పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారు. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి రూ.కోట్లు గడిస్తున్నారు. సీఎంఆర్ కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా దర్జాగా మార్కెట్లో విక్రయించి మరో రకంగానూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. సాక్షి, నెల్లూరు: సివిల్ సప్లయిస్, ఎఫ్‌సీఐ అవినీతిని ఆసరాగా చేసుకుని జిల్లాలో రైస్ మిల్లర్లు నిరుపేదల కడుపులు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని ఓ వైపు మోసం చేస్తూ, మరో వైపు రైతులను దోచుకుంటూ, సీఎంఆర్‌కు ఇచ్చిన ధాన్యాన్ని నాణ్యమైన బియ్యంగా మార్చుకుని రూ.కోట్లకు పడగలు ఎత్తుతున్నారు. జిల్లాలో నెలకు 1.9 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం కార్డుదారులకు సరఫరా చేయాల్సి ఉంది. మార్చిలో కరోనా తర్వాత కేంద్రం కూడా బియ్యం ఉచితంగా అందిస్తోంది. నెలకు రెండు దఫాలు సరఫరా చేస్తున్నాయి. అంటే దాదాపు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతున్నాయి. సాధారణంగా రేషన్ బియ్యం తక్కువ శాతం వినియోగం ఉంది. దీంతో మిల్లర్లు దళారుల ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసి తిరిగి సీఎంఆర్‌కు సరఫరా చేస్తున్నారు. ♦పేదల ఆకలి తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత ఆహార సంస్థ, పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కేజీ బియ్యం రూపాయికే సరఫరా చేస్తున్నాయి. ♦పేదలకు ఇచ్చిన రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు పలు మార్గాల్లో సేకరించి తిరిగి మిల్లులకు చేర్చి పాలిష్ చేసి సీఎంఆర్‌గా మళ్లీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు, భారత ఆహార సంస్థకు సరఫరా చేస్తున్నారు. ♦ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ♦జిల్లాలో ఎక్కువగా నెల్లూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలో ఉన్న రైస్ మిల్లర్లు దీన్నే వ్యాపారంగా మార్చుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. ♦కొంత మంది మిల్లర్లు కనీసం పాలిష్ కూడా చేయకుండానే సంచులు మార్చి మళ్లీ పౌర సరఫరాల సంస్థకు అప్పగిస్తున్నట్లు సౌత్‌రాజుపాళెం మిల్లులో వెలుగు చూసిన వాస్తవాలే బట్టబయలు చేస్తున్నాయి. ఒక కన్సైన్మెంట్కు రూ.5 లక్షలు ఆదాయం పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఆడించి బియ్యం సరఫరా చేసేందుకు ట్రేడింగ్ మిల్లులకు అధికారులు అప్పగిస్తున్నారు. ఇలా సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఇచ్చే మిల్లింగ్ చార్జీల ద్వారా ఒక కన్సైన్మెంట్ (220 క్వింటాళ్లు)కు నికరంగా రూ.15 వేలు ఆదాయం ఉంటుంది. కానీ నాణ్యమైన బియ్యం బదులుగా రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ ద్వారా సరఫరా చేస్తే దాదాపు రూ.5 లక్షల వరకు మిగులుతోంది. ♦జిల్లాలో ట్రేడింగ్ కేటగిరీలో 146 రైస్ మిల్లులు ఉన్నాయి. అందులో సీఎంఆర్ పెండింగ్‌తో 6ఏ కేసులు నమోదైన మిల్లులు మినహాయించి 135 మిల్లులకు ప్రభుత్వం సీఎంఆర్ ధాన్యం సరఫరా చేస్తోంది. ♦ఇందులో దాదాపు అత్యధిక మిల్లులు ప్రభుత్వ సరఫరా చేసిన ధాన్యాన్ని ఆడించి నాణ్యమైన బియ్యంగా బయట మార్కెట్లో అమ్ముకుంటున్నాయి. ♦ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన సీఎంఆర్‌కు రేషన్ బియ్యాన్ని సేకరించి పాలిష్ పట్టి సరఫరా చేస్తున్నారు. ♦ఇటువంటి బియ్యాన్ని టెస్టింగ్ ద్వారా గుర్తించి వాటిని నిరాకరించాలి్సన ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల కార్పొరేషన్ అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై దిగుమతి చేసుకుంటున్నారు. ♦రేషన్ బియ్యం కిలో రూ.10లకు కొనుగోలు చేసి పాలిష్ పట్టించి, తిరిగి సీఎంఆర్‌గా రూ.27.60లకు విక్రయిస్తున్నారు. ♦ఒక్కో రైస్‌మిల్లు ఏడాదికి వందకు పైగా కన్సైన్మెంట్లు సరఫరా చేస్తే దాదాపు రూ.5 కోట్లు మిగులుతున్నట్లు అంచనా. ♦ఇలా రేషన్ బియ్యం సీఎంఆర్‌గా రీసైక్లింగ్ జరుగుతుండడంతో ధాన్యం డిమాండ్ తగ్గిపోతోంది. దీంతో మిల్లర్లు రైతులను అడ్డుగోలు ధరలకు దోచుకుంటున్నారు. విజిలెన్స్ దాడుల్లో.. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వేలాది టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడం సర్వసాధారంగా మారింది. ఇటీవల మర్రిపాడులో రేషన్ డీలర్ ఇంటి నుంచి దళారులు రేషన్ బియ్యం సేకరించి వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ♦కృష్ణపట్నం పోర్టులో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే ఇతర దేశాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పేదల బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ♦కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురంలోని రైస్‌మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో 20 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం 17.5 టన్నుల నూకలు ఉన్నట్లు గుర్తించారు. ♦నెల్లూరు రూరల్ మండలంలోని అల్లీపురం ప్రాంతంలో 20 టన్నుల రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. నెల్లూరురూరల్ మండలం సౌత్‌రాజుపాళెంలోని లక్ష్మీనరసింహ లారీ పార్కింగ్ యార్డులో అక్రమంగా నిల్వ చేసిన నిరుపేదలకు పంచాల్సిన చౌక బియ్యం 77 టన్నులు పట్టుబడ్డాయి. సీఎంఆర్ లేబుల్‌తో ప్యాక్ చేసిన 263 బస్తాలతో పాటు 1,280 బస్తాల చౌక బియ్యం స్టాక్ చేసినట్లు పక్కా సమాచారంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.28 లక్షల పైమాటే. ఇటీవల వెంకటేశ్వరపురం ఎఫ్‌సీఐ గోదాముల్లో భారీస్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు అధికారులు నిగ్గు తేల్చారు. -
40 కేజీల బస్తాకు 5 కేజీల తరుగా..?
సాక్షి, సత్తుపల్లి: రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని లారీల్లో వరంగల్‌లోని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లారు. కాని రెండు రోజులుగా మిల్లర్లు కొర్రీలు పెడుతూ దిగుమతి చేసుకోవడం లేదు. 40 కేజీల బస్తాకు మూడు నుంచి ఐదు కేజీల ధాన్యం తరుగు తీసేసి దింపుకుంటామని, లేకుంటే వెనక్కి తీసుకెళ్లాలంటున్నారు. దీంతో సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని బుగ్గపాడు, కాకర్లపల్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుమతి చేసుకోకుండా లారీలను వెనక్కి పంపిస్తే ఒక్కో లారీ కిరాయికి రూ.40వేల వరకు నష్టం వస్తుందని, ఆ నష్ణాన్ని రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిధులు కల్పించుకొని న్యాయం చేయాలని కోరారు. దీనిపై కాకర్లపల్లి సొసైటీ చైర్మన్ తుమ్మూరి శ్రీరాంప్రసాద్ మాట్లాడారు. ఈ సమస్యను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరామన్నారు. -
అన్నపూర్ణ.. మన తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: వరి దిగుబడులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోందని, ఈ క్రమంలో ‘రాష్ట్ర సమగ్ర ధాన్యం, బియ్యం విధానం’ రూపొందించనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. రైస్ మిల్లర్లతో పాటు ఇతర భాగస్వా ములందరితో చర్చించి, విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. రైస్ మిల్లర్లకు అండగా ఉండి, వారిని రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు. విధానం ముసాయిదాపై మంత్రివర్గంలో చర్చిస్తామని, అసెంబ్లీలోనూ చర్చించి, ఆమోదిస్తామని వివరించారు. రాష్ట్రంలో వరిపంట సాగు, ధాన్యం దిగుబడులు, బియ్యం తయారీ– అమ్మకం– ఎగుమతులు, దీనికి అవలంబించాల్సిన విధానం తదితర అంశాలపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇప్పుడున్న పద్ధతిని మార్చాల్సిందే.. ‘సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితికి, ఇప్పటికి చాలా తేడా వచ్చింది. కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణం, ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పూర్తి, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వంటి వాటితో రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. దీంతో రాష్ట్రంలో వరిసాగు పెరుగుతోంది. ఈసారి యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతున్నది. కోటి టన్నులకుపైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో 55 నుంచి 60 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగులోకి రానుంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరిసాగవుతుంది. మనం ఏటా కనీసం 2.25 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నం. రాష్ట్రం రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇంత పెద్దఎత్తున పండిన ధాన్యాన్ని సేకరించి, మిల్లుకు పంపి బియ్యం తయారుచేసి, వాటిని అమ్మడం చాలా పెద్ద పని. దీనికోసం ఇప్పుడున్న పద్ధతి పనికి రాదు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా పండిన ధాన్యం బియ్యంగా మారి అమ్మకం జరిగే వరకు అన్ని సజావుగా సాగాలంటే సమగ్ర ధాన్యం మరియు బియ్యం విధానం అమలు చేయాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రగతిలో రైస్‌మిల్లులను భాగస్వాముల్ని చేస్తాం ‘రాష్ట్రవ్యాప్తంగా 2,200 రైస్ మిల్లులున్నాయి. ఇవి ఏడాదికి కోటి టన్నుల బియ్యం తయారు చేయగలవు. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కరెంటు ఉండకపోయేది. ఫలితంగా 20–30 లక్షల టన్నుల బియ్యం తయారుచేయడం కష్టంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ధాన్యం పుష్కలంగా ఉంది. 24 గంటల నిరంతరాయ కరెంటు ఉంది. దీన్ని అవకాశంగా మార్చుకుని రైసు మిల్లులు ఎక్కువ మొత్తంలో వడ్లు పట్టాలి. రాష్ట్ర ప్రజల అవసరాలు తీరడమే కాకుండా, ఎఫ్‌సీఐకి పంపించడానికి, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి అనువుగా మిల్లులు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. ఇంకా మరికొన్ని మిల్లులు రావాలి. రైసుమిల్లులు బాగా నడవడానికి, అవి లాభాల్లో ఉండటానికి ప్రభుత్వపరంగా చేయాల్సిన సాయం చేస్తాం. రైసుమిల్లులు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలి’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంప నాగేందర్, మోహన్‌రెడ్డి, నాయకులు చంద్రపాల్, బొచ్చు భాస్కర్, ప్రభాకర్‌రావు, తోట సంపత్‌కుమార్, కాంతయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సీఎం మాటల్లో మరికొన్ని ముఖ్యాంశాలు ► రైసు మిల్లర్లకు ఇకపై అధికారుల నుంచి వేధింపులుండవు. అనేక అనుమతులు తీసు కోవాల్సిన పనిలేకుండా మార్పులు తెస్తం. ► ప్రస్తుతం కరోనా ప్రభావంతో రైసుమిల్లుల్లో పనిచేసే హమాలీలు సొంత రాష్ట్రమైన బిహార్ వెళ్లారు. మళ్లీ సీజన్ వచ్చింది కాబట్టి, ప్రత్యేక బస్సుల్లో వారిని తిరిగి రప్పించేం దుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది. ► రైస్ మిల్లర్లకు సరైన మార్కెటింగ్ వ్యూహం ఉండాలి. తెలంగాణ ప్రజలు ఏ రకం బియ్యం తింటారు? ఇతర రాష్ట్రాల వారు ఏ రకం బియ్యం తింటారు? అనేది సరిగ్గా అంచనా వేసి, అందుకనుగుణంగా ధాన్యం రకాలను పండించాలి. వాటిని ఎప్పటికప్పుడు బియ్యంగా మార్చి ఇటు రాష్ట్ర ప్రజలకు, అటు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపించాలి. ► రాష్ట్రంలో రైసుమిల్లుల స్థాపనకు పారిశ్రామికవాడల్లో స్థలం కేటాయించే అవకాశాలను పరిశీలిస్తాం. రైసు మిల్లులను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌గా గుర్తించి, అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం. ► రాష్ట్రంలో గోదాముల సంఖ్యను పెంచాలి. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండేవి. ప్రస్తుతం 22 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యానికి గోదాముల సంఖ్యను పెంచాం. దీన్ని 40 లక్షలకు పెంచాలి. ► రైసుమిల్లుల్లో గోదాములు నిర్మించుకోవడానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తాం. ► రాష్ట్రంలో రైసుమిల్లులు ఎక్కువున్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ రైల్వే సైడింగ్స్ ఏర్పాటు చేయాలి. ► రైస్‌మిల్లుల ఎల్టీ కేటగిరీని 70 హెచ్‌పీల సామర్థ్యం నుంచి 150 హెచ్‌పీల సామర్థ్యానికి పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నాం. -
మిల్లర్ల చిల్లర వేషాలు
జిల్లాలో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోళ్ల విషయంలో దొంగాట ఆడుతున్నారు. ఓ వైపు వరికోతలు ఊపందుకున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు అన్నదాతలకు నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నా.. కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడంలో జాప్యం చేస్తూ ప్రభుత్వానికి సహకరించడం లేదు. మరో వైపు దళారులను రంగంలోకి దింపి కల్లాల్లోనే ప్రభుత్వ మద్దతు ధరకంటే భారీగా తగ్గించి కొనుగోళ్లు చేయిస్తూ అన్నదాతల కష్టాన్ని దోచుకుంటున్నారు. కొంత మంది మిల్లర్లు అరకొర మొత్తానికే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బయట మాత్రం రూ.కోట్ల పెట్టుబడులు పెట్టి దళారులతో ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మిల్లర్ల తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సాక్షి, నెల్లూరు: ఆరుగాలం కష్టపడి పంట పండించే అన్నదాతలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకనేక చర్యలు చేపడుతోంది. పంట సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించి ఆదుకున్న ప్రభుత్వం.. పంటల దిగుబడులకు ముందే మద్దతు ధర ప్రకటించి అధికార యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలోకి పంపించి రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు చేపడుతోంది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు. అయితే ధాన్యం కేటాయించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వకుండా, సహకరించకుండా చిల్లర వేషాలు వేస్తున్నారు. మరో వైపు దిగుబడులు వచ్చిన ధాన్యాన్ని రైతులు కల్లాల్లో నిల్వ చేయలేని పరిస్థితులను ఆసరాగా చేసుకుని దళారులను రంగంలోకి దించి దారుణంగా ధరలు తగ్గించి కొనుగోలు చేయిస్తున్నారు. గత టీడీపీ హయాంలో సీఎంఆర్ బియ్యం సరఫరాలో భారీ అవినీతికి పాల్పడి ఆ పార్టీ పెద్దల సహకారంతో కేసులతో మమ అనిపించుకుని దర్జాగా ఉన్న మిల్లర్లు.. తాజాగా దొంగాట ఆడుతూ అధికారులకు చుక్కలు చూపెడుతున్నారు. రైతులను దోచుకుంటున్నారు. జిల్లాలో ఈ ఏటా సుమారు 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంది. ప్రస్తుతం ఎకరాకు 3.5 నుంచి 4 పుట్ల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో పాటు సాగునీరు పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. ఈ ఏడాది జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు గాను 90 కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. దళారులతో దోపిడీ మిల్లర్లు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోళ్లు కేంద్రాలకు బ్యాంక్ గ్యారెంటీల విషయంలో కావాలనే జాప్యం చేస్తూ మరో వైపు దళారుల ద్వారా కల్లాల్లోనే కొనుగోళ్లు చేయిస్తున్నారు. ధాన్యం దిగుబడులు ప్రారంభం కావడంతో బ్యాంక్ గ్యారెంటీలు లేని కారణంగా కొనుగోలు కేంద్రాలకు పంటను విక్రయించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రాల నుంచి కూడా మిల్లులకు ధాన్యం కేటాయించలేపోతున్నారు. కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకోలేక.. నిల్వ చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులు గత్యంతరం లేక దళారులకే విక్రయాలు చేసుకుంటున్నారు. పరిస్థితులను అనుకూలంగా చేసుకుని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రభుత్వం వరి సాధారణ రకం క్వింటాకు రూ.1,815 వంతున పుట్టికి (850 కేజీలు) రూ.15427.50, ఏ గ్రేడ్ రకం పుట్టికి రూ.15597.50 మద్దతు ధర నిర్ణయించింది. కానీ దళారులు మాత్రం పుట్టి ధాన్యం రూ.11,500 నుంచి రూ.12,000 వంతున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలో పుట్టి ధాన్యానికి రెండు వేల తగ్గించారు. మద్దతు ధరకంటే రూ.4 వేలు తక్కువతో కొనుగోలు చేసూ్తనే.. తేమ పేరుతో ప్రతి బస్తాకు నాలుగు కేజీల వంతున తరుగు తీసుకుంటూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు. రూ.24 కోట్లకే బ్యాంక్ గ్యారెంటీలు గత నెల రోజులు నుంచి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, జాయింట్ కలెక్టర్ వినోద్‌కుమార్ సారథ్యంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 189 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించి మిల్లర్లను బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాలని పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా వారు సక్రమంగా స్పందించడం లేదు. నెల రోజులు నుంచి ఉన్నతాధికారులు ఆదేశాలను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏఓ కుంటిసాకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 65 మంది మిల్లర్లు కేవలం రూ.24 కోట్ల మేరకే బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వడం గమనార్హం. టీడీపీ హయాంలో దోపిడీ టీడీపీ హయాంలో మిల్లర్లు, అధికారులు, ఆ పార్టీ పెద్దలు కుమ్మక్కై సీఎంఆర్ బియ్యం సరఫరా విషయంలో భారీగా అవినీతి పాల్పడ్డారు. 2015–16 ఏడాదిలో కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం 3.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేశారు. మిల్లర్లకు సీఎంఆర్ రైస్ పద్ధతిలో ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అంటే 67 శాతం బియ్యం అంటే 2.16 లక్షల టన్నుల మెట్రిక్ బియ్యానికి గాను 1.97 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 18,905 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉంది. దీని విలువ రూ.36 కోట్లు ఉంది. అప్పటి నుంచి మిల్లర్లు బియ్యం ఇవ్వకపోవడంతో వారికి జరిమానాలతో 2017 నాటికి బకాయిలు రూ.56 కోట్లకు చేరింది. మొత్తం దాదాపు 37 మంది మిల్లర్లు అక్రమాలకు పాల్పడినట్లు లెక్క తేలింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు అండగా నిలవడంతో నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. ఆపై ఏకంగా పౌరసరఫరాల సంస్థ కార్యాలయానికి అగ్నిప్రమాదం జరిపించి రికార్డులు కాలిపోయేలా చేశారు. ఈ ప్రమాదం వెనుక మిల్లర్ల హస్తం ఉందన్న విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. కానీ మిల్లర్లపై ఎలాంటి చర్యలు లేకుండా ప్రభుత్వ పెద్దలు కాపాడారు. ఆపై స్వల్పంగా బకాయిలు రాబట్టారు.జిల్లాలో ఇప్పటి వరకు 90 ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 391.120 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశాంమని, మిల్లర్ల నుంచి బ్యాంక్ గ్యారెంటీలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రోజ్‌మాండ్ తెలిపారు. -
మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
-
మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు
సాక్షి, కాకినాడ: రేపటి నుంచి మిల్లర్లు అందరూ ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ.. ధాన్యంతో పాటు పత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కొన్నిచోట్ల మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకు వచ్చారన్నారు. వచ్చే నాలుగైదు రోజుల్లో కొనుగోలుకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయబోతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారన్నారు. కనీస మద్దతు ధర తగ్గితే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని ఆయన తెలిపారు.