రైస్‌ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం | Rice millers services appreciable thing: MLA Gopireddy | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం

Published Mon, Aug 22 2016 9:26 PM | Last Updated on Tue, Oct 30 2018 3:56 PM

రైస్‌ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం - Sakshi

రైస్‌ మిల్లర్ల సేవలు ప్రశంసనీయం

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 
నరసరావుపేట : పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందజేస్తున్న జిల్లా రైస్‌మిల్లర్ల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని అమరావతిలోని పుష్కరిణి ఘాట్‌–1లో జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్‌ తరఫున భక్తులకు కల్పిస్తున్న నిత్య అన్నదానం కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గోపిరెడ్డి పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ తరపున జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గోపిరెడ్డిని  సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ పుష్కర స్నానం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారందరి ఆకలి తీర్చే విధంగా మిల్లర్లు చేయూతనివ్వడం ప్రశంసనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడు ఊర భాస్కరరావు మాట్లాడుతూ పుష్కరాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి రోజూ 10 నుంచి 15 వేల మందివరకు అన్నప్రసాదం అందజేస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న మిల్లర్లు అందరికీ ఆయన తన కృతజ్ఞతలు చెప్పారు. ఎన్‌ఈసీ చైర్మన్‌ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, మిల్లర్లు చలువాది బ్రహ్మయ్య, పి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement