gopireddy srinivasa reddy
-
సరస్వతి భూములపై పవన్ కామెంట్స్ కు దిమ్మతిరిగే కౌంటర్
-
జగన్ అంటే బాబుకు వణుకు.. మంత్రి అనితను పంపించి..
-
దేవునితో నీ నీచ రాజకీయం మానుకో.. బాబుపై ఫైర్
-
సూపర్ 6 అమలు జరగడం లేదు...
-
ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో ప్రభుత్వానికి నష్టమా?
నరసరావుపేట/నగరి/రాజంపేట/ప్రొద్దుటూరు క్రైం/పిడుగురాళ్ల: వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల వైద్య విద్య కల సాకారం చేయడం కోసం.. సామాన్యులకు ఉచితంగా అత్యుత్తమ వైద్యం అందించేందుకు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు మోకాలొడ్డుతోంది. తమది పెత్తందారుల ప్రభుత్వమని చెప్పకనే చెప్పింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.ఏకంగా రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించింది. 2023–24లో 5 కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు.. మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరు కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉండింది. దాదాపుగా పూర్తయిన ఈ కళాశాలల్లో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. పులివెందుల, పాడేరు కళాశాలలకు సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఆదేశాలు ఇచ్చింది.దీనికి సంతోషించాల్సింది పోయి పులివెందుల కళాశాలకు సీట్లు కేటాయించొద్దంటూ ఆగమేఘాలపై గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసింది. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు ప్రభుత్వం ఇలా పేద విద్యార్థులకు, పేద రోగులకు అన్యాయం చేయడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఈ విషయమై ఆదివారం పలువురు వైఎస్సార్సీపీ నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి బాబు వైఖరిని కడిగిపారేశారు.మీకు నష్టమేంటి బాబూ?ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వస్తే సీఎం చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో చెప్పాలి. వైఎస్ జగన్ తీసుకొచ్చాడనే దుగ్ధతో, కోపంతో, పగతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దారుణం. మీ హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా కట్టావా చంద్రబాబూ? మీకు ప్రైవేట్‌పైనే మోజు. ఒక పేద విద్యార్థి ప్రైవేటు మెడికల్ కళాశాలలో చదవాలంటే సుమారుగా రూ.1.5 కోట్ల డొనేషన్ చెల్లించాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించలేరన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గతేడాది 5 కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కావాల్సి ఉండింది. బాబు పుణ్యమా అని వాటికి మోక్షం లభించలేదు. – డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్షమించరాని నేరంజగనన్నపై ఉన్న ఈర్ష, ద్వేషాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కళాశాలలపై చూపుతున్నారు. కేటాయించిన సీట్లను ప్రభుత్వం రద్దు చేయమని కోరడం దుర్మార్గం. తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని తేకపోగా, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేటుపరం చేయాలనుకోవడం క్షమించరాని నేరం. ఎంబీబీఎస్ సీట్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? నీట్ పరీక్షలు రాసి మెడిసిన్ సీటు కోసం ఎంతో మంది వేచి చూస్తున్నారు. కొత్తగా ఐదు కాలేజీలు వస్తున్నాయంటే కొంచెం ర్యాంకు తక్కువగా వచ్చినా, సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లింది. – ఆర్కే రోజా, మాజీ మంత్రి సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంవైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసి పెత్తందారులకు అమ్ముకోవటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. మెడికల్ కాలేజీలు పూర్తి కాకుండా ప్రారంభించారని.. వసతులు, సిబ్బంది లేరని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రచారం చేయటం సిగ్గుచేటు. వైద్య కళాశాలలు ప్రారంభించటం అనేది మెడికల్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మెడికల్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించాకే కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తారు. ఇది కూడా మంత్రికి తెలియదా? – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి -
ఏపీకి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు
-
టీడీపీ నాయకుల వేధింపులకు మరో ఉద్యోగి బలి
-
రెడ్ బుక్ పై కాదు వ్యవసాయంపై దృష్టి పెట్టండి.. టీడీపీపై గోపిరెడ్డి ఫైర్
-
నిమ్మల పై గోపిరెడ్డి సెటైర్లు
-
పిన్నెల్లి అరెస్ట్ పై గోపిరెడ్డి రియాక్షన్
-
కార్యకర్తల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం
-
ఆ అభ్యర్థులకు హైకోర్టు రక్షణ
సాక్షి, అమరావతి: ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులను జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో వారికి హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్లయింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. కౌంటింగ్ ముగిసే వరకు తాడిపత్రిలో ఉండరాదని.. తాడిపత్రి బయట ఉండాలని జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, స్వతంత్ర అభ్యర్థి సోమశేఖర నాయుడులను హైకోర్టు ఆదేశించింది. నలుగురు కంటే ఎక్కువ మందితో తిరగరాదని.. ఎలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడరాదని అస్మిత్‌రెడ్డి, పెద్దారెడ్డిలతో సహా మిగిలిన అభ్యర్థులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్ తదితరులనూ ఆదేశించింది. పోలీసులు ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేస్తున్నారని, అందువల్ల అభ్యర్థుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ప్రధాన ఎన్నికల అధికారికి స్పష్టంచేసింది. అంతేకాక.. ఆయా కేసులకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేయడంగానీ.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడంగానీ చేయరాదని ఆదేశించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా ఎలాంటి అభిప్రాయం వ్యక్తంచేయడం లేదన్న హైకోర్టు, ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.అరెస్టుకు అవకాశం ఉంది.. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి..ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు తమను అరెస్టుచేసే అవకాశముందని, అందువల్ల తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్లతో పలువురు స్వతంత్ర అభ్యర్థులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు టి. నిరంజన్‌రెడ్డి, పి.వీరారెడ్డి, ఓ.మనోహర్‌రెడ్డి, పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాదులు ఎస్.రామలక్ష్మణరెడ్డి, చుక్కపల్లి భానుప్రకాశ్.. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి తమ తమ వాదనలను వినిపించారు.సుప్రీంకోర్టుకన్నా తామే ఎక్కువని ఈసీ భావిస్తోంది..పిటిషనర్లపై నమోదైన కేసులన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్షపడే కేసులని, అందువల్ల వారికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే కేసుల్లో అరెస్టుచేయడానికి వీల్లేదన్నారు. అయితే, ఎన్నికల సంఘం మాత్రం రామకృష్ణారెడ్డిని అరెస్టుచేసి తీరుతామని ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కన్నా తామే ఎక్కువన్న విధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని తెలిపారు. అలాగే, టీడీపీ నేత నారా లోకేశ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్చేసిన వీడియో ఆధారంగా ఎన్నికల కమిషన్ రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఆదేశించిందన్నారు. వాస్తవాలు విచారించకుండా ఇలాంటి వీడియోల ఆధారంగా అరెస్టుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇలా వ్యవహరించిన ఉదంతాలు గతంలో ఎక్కడా లేవన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన ఎనిమిది పోలీసు బృందాలు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల వెంటపడ్డాయన్నారు. తాము కౌంటింగ్ పూర్తయ్యే వరకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కోరుతున్నామని సీనియర్ న్యాయవాదులు తెలిపారు. ఇప్పుడు అరెస్టుచేస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లను నియమించుకునే అవకాశం కూడా ఉండదన్నారు. దీనివల్ల పిటిషనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ సమయంలో పీపీ నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ.. మధ్యంతర బెయిల్ ఇస్తే మొన్న జరిగిన ఘటనల వంటి వాటిని పునరావృత్తం చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలనుకుంటే షరతులు విధించాలని కోర్టుకు విన్నవించారు. ఎలాంటి ఘటనలు జరిగినా వారినే బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జ్యోతిర్మయి, హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పటివరకు పిటిషనర్లను అరెస్టు చెయ్యొద్దని పోలీసులను ఆదేశించారు.ఆ పిటిషన్ల విచారణ 30కి వాయిదా..ఇదిలా ఉంటే, ఎన్నికల సమయంలో, ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
ఇక ఉరుకునేదేలేదు.. టీడీపీ నేతలకు గోపిరెడ్డి వార్నింగ్
-
నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
నరసరావుపేట: ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటమి ఖాయమని తేలిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు దగ్గరుండి తన అనుచరులు, బౌన్సర్లతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిపై దాడులు చేయించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి కారు డ్రైవర్ హరితో పాటు ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి, మరో యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.టీడీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిముందు ఉన్న మూడు కార్లు, ఆయనకు చెందిన ఆస్పత్రి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేటలో మధ్యాహ్నం 2గంటల వరకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న బూత్ లోపలికి టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవిందబాబు, 20 మంది గూండాలు, బౌన్సర్లతో వచ్చారు. అంతకుముందు అదే బూత్‌కు వచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డిని మాత్రమే అనుమతించిన పోలీసులు ఇతర నాయకులను లోపలికి అనుమతించలేదు. అరవిందబాబు 20 మందితో రావటాన్ని బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు గంటెనపాటి గాబ్రియేలు ప్రశ్నించారు. దీంతో అరవిందబాబు గాబ్రియేలుపై చేయిచేసుకున్నాడు. దీంతో పోలీసులు అరవిందబాబుకు రక్షణ ఇస్తూ గాబ్రియేలు, అతడితో పాటు ఉన్న మరో నాయకుడు గోగుల మనోహరయాదవ్ను కొట్టారు. అరవిందబాబు బూత్ నుంచి బయటకు రాగానే అక్కడే కనిపించిన ఎమ్మెల్యే డ్రైవర్ హరిపై దాడిచేసి తీవ్రంగా కొట్టారు. తిరిగి వెళ్లిపోతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటి వద్దకు రాగానే ఆయన ఇంటిపైన, ఆస్పత్రిపైన టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా రాళ్లు, సీసాలు, కర్రలతో వారిపై టీడీపీ గూండాలు ఎదురు దాడికి దిగారు.పోలీసుల వ్యాన్లపై రాళ్లు వేశారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అయినా లెక్కచేయని టీడీపీ గూండాలు మళ్లీ గోపిరెడ్డి ఇంటిపైన దాడికి ప్రయత్నించారు. పోలీసులు ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగుతోంది. దాడులు చేయడానికి టీడీపీ గూండాలు, బౌన్సర్లు ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు టీడీపీ నేత అరవిందబాబు ఒంగోలు, హైదరాబాద్, చెన్నైల నుంచి భారీ ఎత్తున బౌన్సర్లను రప్పించినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన నరసరావుపేటలోని తన ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. మారణాయుధాలతో మళ్లీ దాడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోందన్నారు. నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే హింసాత్మక సంఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. తనను కేవలం రెండుకార్లు మాత్రమే వాడాలని చెప్పి.. శ్రీకృష్ణదేవరాయలు మూడుకార్లు, అరవిందబాబు ఏడుకార్లతో తిరిగినా అధికారులు చూసీచూడనట్లుగా పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. కలెక్టర్, ఎస్పీలు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్నారు. -
ముస్లింల రిజర్వేషన్లు తొలగించేందుకు బీజేపీతో బాబు రహస్య ఒప్పందం
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లా చినతురకపాలెం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే, నేడు చంద్రబాబు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి బీజేపీ పెద్దలతో కాళ్లబేరాలకు దిగాడని విమర్శించారు. బీజేపీ విధించిన మూడు షరతులకు టీడీపీ అంగీకరించిందని చెప్పారు. ముస్లింలకు కల్పిస్తున్న నాలుగుశాతం రిజర్వేషన్‌ను తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా రద్దుచేస్తామని బీజేపీ కేంద్ర నాయకుడు అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకారం తెలిపారన్నారు. అలాగే ప్రత్యేకహోదా ఊసే ఎత్తవద్దన్న బీజేపీ పెద్దల మాటలకు చంద్రబాబు మద్దతు ఇచ్చారని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా చంద్రబాబు మద్దతు తెలిపి బీజేపీతో పొత్తును ఖాయం చేసుకున్నారని పేర్కొన్నారు. ముస్లిం రిజర్వేషన్ వలన లబి్ధపొందిన గ్రామాల్లో చినతురకపాలెం ఒకటన్నారు. 2007 వరకు కనీసం ఇంజినీరింగ్ చదివిన వారు కూడా గ్రామంలో లేరని, పేదరికం కారణంగా ఉన్నతవిద్యకు గ్రామ విద్యార్థులు దూరమయ్యారని తెలిపారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ నాలుగుశాతం, ఫీజు రీయింబర్స్మెంట్ వలన గ్రామంలో విద్యావిప్లవం వ చ్చిందన్నారు. నేడు 29 మంది వైద్యులు గ్రామం నుంచి వచ్చారని, దీనికి నాలుగుశాతం రిజర్వేషన్ కారణమని తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీతో కాళ్లబేరానికి వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో రహస్య ఒప్పందం మేరకు ముస్లిం రిజర్వేషన్‌ను రద్దుచేస్తే వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. -
బాబు జైల్లో.. లోకేష్ ఢిల్లీలో పవన్ షూటింగ్ లో ఎమ్మెల్యే సెటైర్లు
-
స్కిల్ స్కామ్ జరగలేదని మాత్రం టీడీపీ చెప్పడం లేదు
-
‘మాచర్లలో మంట పెట్టింది చంద్రబాబే’
తాడేపల్లి: మాచర్లలో విధ్వంసానికి కారకుడు చంద్రబాబేనని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డాeరు. మాచర్ల టీడీపీ ఇంచార్జి విధ్వంసానికి సూత్రధారి అని అంబటి రాంబాబు విమర్శించారు. దాడులు చేయాలని చంద్రబాబు బహిరంగం సభల్లోనే రెచ్చగొట్టా మాట్లాడిన సంగతిని గుర్తు చేశారు. ప్లాన్ ప్రకారమే మాచర్లలో టీడీపీ నేతలు దాడులు చేశారని అంబటి స్పష్టం చేశారు. ‘మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డి’ మాచర్లలో రౌడీ రాజ్యానికి ఆజ్యం పోసిందే బ్రహ్మారెడ్డేనని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దారునంగా కొట్టారని, బ్రహ్మారెడ్డి గొడవలు సృష్టించడమే పనిగా పెట్టుకున్నారని, వైఎస్సార్సీపీ ప్రశాంత వాతావరణ కోరుకుంటోందన్నారు. చంద్రబాబు రౌడీ రాజ్యాన్ని కోరుకుంటున్నారని, హింస, నేర ప్రవర్తనతో ఎన్నికల్లో గెలవలేరన్నారు. -
చంద్రబాబు రాజకీయంలో పవన్ కల్యాణ్ బలిపశువు : గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
-
ప్రశాంతతను చెడగొట్టడమే టీడీపీ ధ్యేయం
నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రశాంతతను చెడగొట్టడమే ధ్యేయంగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడేం జరిగినా దానికి రాజకీయ రంగు పులిమి నరసరావుపేటలో బంద్‌లు, ఆందోళనలు చేసి శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తూ.. ప్రజల్లో ప్రశాంతతను చెడగొట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. హత్యకు గురైన మాచర్ల మండలం దుర్గికి చెందిన కంచర్ల జాలయ్యకు నేరచరిత్ర ఉందని, అతడో రౌడీషీటర్ అని గుర్తు చేశారు. అతడి హత్య రెండు కుటుంబాల మధ్య వ్యవహారమన్నారు. బ్రహ్మారెడ్డి ఇన్చార్జి అయ్యాకే.. మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక హత్యా రాజకీయాలు మొదలయ్యాయని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. 2009లో బ్రహ్మారెడ్డి నియోజకవర్గాన్ని విడిచి గుంటూరు వెళ్లాక 2022 వరకు 13 ఏళ్లపాటు ఎటువంటి ఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఆయన తిరిగి వచ్చాకే ఇలాంటి ఘటనలు ప్రారంభమయ్యాయనే విషయం అర్థమవుతోందన్నారు. సత్తెనపల్లికి చెందిన ఓ విద్యార్థి హత్య జరిగితే «నరసరావుపేటలో ధర్నా చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. జొన్నలగడ్డలో ఓ మహిళకు అన్యాయం జరిగిందంటూ ధర్నా చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారన్నారు. ఎక్కడ ఘటన జరిగితే అక్కడ ఆందోళన చేస్తే తప్పేమీ లేదన్నారు. ఏ ఘటనకు స్పందించాలో, దేనికి స్పందించకూడదో నరసరావుపేట టీడీపీ ఇన్చార్జికి తెలియదన్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటే గుండెనొప్పి వచ్చినట్టు సెంటిమెంట్ డ్రామాకు తెరతీసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడన్నారు. టీడీపీ హయాంలో వైఎస్సార్సీపీ వారిని కనీసం పోలీస్ స్టేషన్‌కు కూడా రానివ్వలేదన్నారు. ఇప్పడేదో బుద్ధిమంతులు మాదిరిగా చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారన్నారు. అధికారం కోసం పాకులాడుతూ.. 12 కేసులు పెట్టించుకున్నవారే టీడీపీ కార్యకర్తలంటూ వారిని రెచ్చగొడుతున్నారన్నారు. ఎక్కడో ఏదో జరిగితే నరసరావుపేటలో ఆందోళనలు చేస్తే ఊరుకునేది లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. -
రోడ్డుపై ధర్నాకు దిగిన ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
నారా లోకేష్ ఏంటి నీ హైడ్రామాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
లోకేష్ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు: లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ‘‘ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని’’ గోపిరెడ్డి అన్నారు. ఇవీ చదవండి: ‘శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు’ లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస -
‘విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర’
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నరసరావుపేటలో గోపూజ కార్యక్రమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదగా జరగడం సంతోషంగా ఉందన్నారు. దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర అని, దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కోటప్పకొండకు రెండో ఘాట్ రోడ్దు ఏర్పాటుకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్.. కోటప్పకొండను దర్శించి ఘాట్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. చదవండి: టీడీపీని బతికించుకునేందుకు దిగజారుడు రాజకీయం -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.