రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | TDP Cheap Politics on votes | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Wed, Oct 17 2018 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీకి అనుకూలురైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తూ టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. ఓట్లు తొలగింపు ద్వారా అడ్డదారిలో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సిసోడియాను మంగళవారం గోపిరెడ్డి కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 4 వేలు ఓట్లు తొలగించడానికి సిద్ధమయ్యారని ఈ సందర్భంగా చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement