
సాక్షి, గుంటూరు: లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.
‘‘ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని’’ గోపిరెడ్డి అన్నారు.
ఇవీ చదవండి:
‘శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు’
లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస
Comments
Please login to add a commentAdd a comment