narasaraopet
-
ఏపీ వ్యాప్తంగా పోసానిపై 30కి పైగా ఫిర్యాదులు, 16 కేసులు నమోదు
-
మద్యం షాపులు అప్పగించాలంటూ బార్లో టీడీపీ నేత వీరంగం
-
‘మంత్రి’ దండం దక్కేనా!
సాక్షి, నరసరావుపేట: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగియడంతో ప్రస్తుతం కొత్తగా కొలువుదీరే ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజకీయాల్లో మంత్రి పదవులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. వాటి కోసం పోటీ పడే ఆశావహుల లిస్ట్ కూడా పెద్దదే. మంత్రి పదవుల కోసం వేయి కళ్లతో ఎదురు చూసే నాయకులతోపాటు నియోజకవర్గాలు ఉంటాయండోయ్.. నియోజకవర్గాలు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అమాత్యయోగం లేని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఇప్పటి వరకు గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు మంత్రి పదవులు దక్కలేదు. ప్రస్తుతం కొత్త క్యాబినెట్ ఏర్పడనున్న నేపథ్యంలో ఈ దఫాలోనైనా ఆ నియోజకవర్గంలో నెగ్గిన ఎమ్మెల్యేలకు చోటు దక్కుతుందేమోనన్న చర్చ జరుగుతోంది. 👉గురజాల నియోజకవర్గం 1955లో ఏర్పడింది, అంతకుముందు ఈప్రాంతం బెల్లంకొండ నియోజకవర్గం పేరుతో ఉండేది. 1955లో కేఎల్పీ(కృకార్ లోక్‌పార్టీ) తరఫున గెలిచిన ఎంబీ చౌదరీ మొదలు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ప్రజాప్రతినిధి ఒక్కరూ మంత్రి పదవి పొందలేదు. ఈ నియోజకవర్గంలో కొత్త వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి రెండు సార్లు, యరపతినేని శ్రీనివాసరావు మూడుసార్లు గెలిచినా మంత్రి పదవి రాలేదు. తాజా ఎన్నికల్లో యరపతినేని నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈసారైనా మంత్రి పదవి వరిస్తుందేమోనన్న చర్చ గురజాలలో జరుగుతోంది. అయితే గురజాల వాసి డొక్కా మాణిక్య వరప్రసాదరావు మాత్రం తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి వైఎస్సార్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. 👉పల్నాడు ప్రాంతంలోని మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఎవరూ మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గానికో ప్రత్యేకత ఉంది. 1955 నుంచి 2009 ఎన్నికల వరకు ఏ నాయకుడూ రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందలేదు. ఈ కారణం వల్లే మాచర్ల నుంచి మంత్రి లేరన్న వాదన ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 2019లో వరుసగా నాలుగోసారి విజయం సాధించడం, వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో పిన్నెల్లికి, మాచర్లకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే సామాజిక సమీకరణాల నేప«థ్యంలో అది సాధ్యం కాలేదు. ప్రభుత్వ విప్‌గా పిన్నెల్లి వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జూలకంటి బ్రహా్మరెడ్డి అధికార పార్టీ టీడీపీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు సమాచారం. మరి అమాత్య పదవి వస్తుందేమో వేచి చూడాలి. ఆ నియోజకవర్గాల నుంచి మంత్రులుసత్తెనపల్లిది మాత్రం విచిత్రమైన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకష్ణయ్యకూ మంత్రి పదవి దక్కలేదు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నన్నపనేని రాజకుమారి మాత్రం 1984లో నెలరోజులపాటు నాదెండ్ల భాస్కరరావు క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. ఆ తరువాత ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్కకపోవడం విశేషం. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచినా టీడీపీ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవితో సరిపెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ క్యాబినెట్లో సత్తెనపల్లి నుంచి ప్రాతినథ్యం వహించిన అంబటి రాంబాబు జలవనరులశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు గెలిచిన ఏ అభ్యరి్థకీ మంత్రి పదవి దక్కలేదు. 2014లో నూతన రాష్ట్ర తొలి క్యాబినెట్లో మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావును మంత్రి పదవి వరించింది. ఆ తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విడదల రజిని మంత్రిగా చేశారు. వినుకొండ నుంచి 1967, 72 ఎన్నికల్లో గెలిచిన భవనం జయప్రద పీవీ నరసింహరావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. పెదకూరపాడు నుంచి గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట నుంచి కాసు బ్రహా్మనందరెడ్డి, కృష్ణారెడ్డి, కోడెల శివప్రసాద్ మంత్రులుగా పనిచేశారు. -
సీఎం జగన్ నేటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారానికి సంబంధించిన ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురామ్ విడుదల చేశారు. సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని నరసాపురం స్టీమెర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో పామురు బస్ స్టాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. -
నరసరావుపేట ఇక బీసీలకు కోట
-
Narasaraopet Lok Sabha: చరిత్రలో తొలిసారిగా....
ఇప్పటి వరకు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపారీ్టలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించారు. బీసీలకు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధికారం కట్టబెట్టారు. జనరల్ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. తాజాగా జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించి వారిపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సాక్షి, నరసరావుపేట/సత్తెనపల్లి: నరసరావుపేట లోక్‌సభ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఎన్నికవ్వలేదు. సుమారు నలభై దాకా బీసీ ఉప కులాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో ఎప్పుడూ అగ్ర వర్ణాలకు చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఒరవడిని మార్చి బీసీలకు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్లో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పార్లమెంట్‌కు మాజీ మంత్రి పి అనిల్‌కుమార్ యాదవ్‌ను సమన్వయకర్తగా నియమించడంతో బీసీ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీసీలంతా సమష్టిగా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా.... 1952 నుంచి 2019 వరకు 15సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ ఏ రాజకీయపార్టీ కూడా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇక్కడ నుంచి సి.రామయ్యచౌదరి, మద్ది సుదర్శనం, కాసు బ్రహ్మానందరెడ్డి, కాటూరి నారాయణస్వామి, కోట సైదయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దనరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్‌కుమార్ యాదవ్‌ను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా అందిస్తామని సంబరాలు నిర్వహించారు. ఇటీవల నరసరావుపేటలో కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి మద్దతు పలికారు. వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఎన్నడూ వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దాఖలాలు లేవు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నంను శాసనమండలికి పంపారు. పల్నాడుకు చెందిన మరో బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ విప్‌గా సముచిత స్థానం కలి్పంచారు. గుంటూరు మార్కెట్ యార్డుకు చైర్మన్‌గా యాదవ సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల రాజానారాయణకు అవకాశం కలి్పంచారు. స్థానిక సంస్థలు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను బీసీలకు కేటాయించారు. గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం నరసరావుపేట ఎంపీ సీటు బీసీలకు కేటాయించడం చాలా సంతోషం. నరసరావుపేట ఎంపీ అభ్యరి్థతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం. – రాజవరపు శివనాగేశ్వరరావు, న్యాయవాది, శాలివాహన సంఘనేత, సత్తెనపల్లి రాజ్యాధికారం దిశగా బీసీలు బీసీలకు రాజ్యాధికారం అందించే దిశగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని బీసీలంతా íసీఎంకు రుణపడి ఉంటారు. అన్నింటా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. – ఎద్దులదొడ్డి కోటేశ్వరమ్మ, వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్, సత్తెనపల్లి -
సమరానికి సిద్ధం
-
నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
నరసరావుపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంలో భాగంగా నరసరావుపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆదివారం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రతీ అభ్యర్థి ఉద్యోగ అర్హత సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామక ప్రక్రియ కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం రాత్రికే పలు జిల్లాల నుంచి నిరుద్యోగ యువత పెద్దఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, కల్నల్ పునీత్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం కె.వినాయకం తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత బండారం బట్టబయలు.. సింగర్‌తో సహజీవనం చేసి..
నరసరావుపేట టౌన్(పల్నాడు జిల్లా): పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి దళిత యువతిని దగా చేసిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్ బండారం బట్టబయలైంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటలోని చంద్రబాబు కాలనీకి చెందిన ఓ దళిత యువతి ఆర్కెస్ట్రాలో పాటలు పాడేది. ఆమెకు రొంపిచర్ల మండలం సుబ్బాయపాలెంకు చెందిన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతి నవీన్‌తో నాలుగేళ్ల క్రితం పరిచయమైంది. తనకు వివాహం కాలేదని నమ్మబలికిన నవీన్ ఆమెతో సహజీవనం చేశాడు. ఆమె గర్భం దాల్చడంతో తక్కువ కులం దానివని దూషిస్తూ ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె కేసు పెడతానని చెప్పగా.. 2019 అక్టోబర్ 24న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బరంపేటలో కాపురం పెట్టాడు. 2020 మార్చిలో ఆమెకు బాబు జన్మించాడు. కాగా, నవీన్‌కు అప్పటికే మరో యువతితో వివాహమైన విషయం బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీయడంతో దళిత యువతిని మానసికంగా వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్ఆఫ్ చేశాడు. వేరే నంబర్‌ను వినియోగిస్తున్నాడని తెలిసి ఫోన్ చేయగా ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి బలవంతంగా ఇంటినుంచి బయటకు నెట్టాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరేంద్రబాబు బుధవారం తెలిపారు. నవీన్‌పై పేకాట, బెట్టింగ్ కేసులు నవీన్‌పై గతంలో క్రికెట్ బెట్టింగ్, పేకాట నిర్వహణ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికి టీడీపీ ముఖ్యనేతలు అతడికి రాష్ట్ర పదవి కట్టబెట్టి, పదవిలోనే కొనసాగిస్తున్నారు. దళిత యువతిని మోసం చేసి రోడ్డు పాల్జేయడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిందితుణ్ణి అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని పలువురు దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ -
పల్నాడు : నరసరావుపేట మార్కెట్ సెంటర్ లో అగ్నిప్రమాదం
-
గ్రామాలకు నిధుల దన్ను
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం సంతగుడిపాడులో ఈ ఏడాది జూన్‌లో దాదాపు రూ.7 లక్షలతో మూడు వీధుల్లో సిమెంట్ కాలువలు నిర్మించారు. గ్రామ సర్పంచి 25 రోజుల క్రితం సీఎఫ్ఎంఎస్లో బిల్లులు నమోదు చేయగా పది రోజుల్లో డబ్బులు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కంభరలో ఈ ఏడాది జూన్‌లో రూ.2.78 లక్షల పంచాయతీ నిధులతో సిమెంట్ కాలువలు నిర్మించారు. జూన్ 28వ తేదీన సీఎఫ్ఎంఎస్లో సర్పంచి బిల్లులు నమోదు చేయగా జూలై 1వ తేదీ కల్లా చెల్లింపులు పూర్తయ్యాయి. చిట్టిపూడివలసలో ఎండాకాలం రూ.1,45,919 పంచాయతీ నిధులతో బోర్ తవ్వి మోటార్ అమర్చుకున్నారు. దీనికి సంబంధించి బిల్లుల చెల్లింపులు జూన్ మొదటి కల్లా పూర్తయ్యాయి. తాలవరంలో రూ.1.03 లక్షల మండల పరిషత్ నిధులతో కొత్త పంపుసెట్ ఏర్పాటు చేసుకోగా సీఎఫ్ఎంఎస్ ద్వారా వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగాయి. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై వ్యక్తిగత అక్కసు, దురుద్దేశాలతో పదేపదే అసత్యాలను అచ్చోసే ‘ఈనాడు’ కన్ను ఈసారి పంచాయతీలపై పడింది. గ్రామ పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బ తీస్తున్నట్లు తప్పుడు కథనాలను ప్రచురించింది. నిజానికి అన్ని పంచాయతీల్లో కనీస అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను అందుబాటులోనే ఉంచింది. పంచాయతీరాజ్‌శాఖ ఇటీవల సేకరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూ. 462 కోట్ల మేర 14, 15వ ఆర్థిక సంఘం నిధులు అందుబాటులో ఉన్నాయి. మండల పరిషత్‌ల వద్ద మరో రూ.409 కోట్లు, జిల్లా పరిషత్‌ల వద్ద రూ.289 కోట్ల మేర 15వ ఆర్థిక సంఘం నిధులున్నాయి. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల స్థాయిలో స్థానిక అవసరాలకు తగ్గట్లుగా అభివృద్ధి పనులు నిర్వహించుకునేందుకు స్థానిక సంస్థల వద్ద మొత్తం రూ.1,160 కోట్ల మేర ఆర్థిక సంఘం నిధులున్నాయి. వీటికి అదనంగా పంచాయతీలకు ఇంటి పన్ను, ఇతర పరోక్ష పన్నుల రూపంలో ఏటా రూ.684 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుంది. ఆ నిధులు కూడా ఆయా పంచాయతీల జనరల్ ఫండ్ ఖాతాలో అందుబాటులో ఉంటాయి. ► ఈ ప్రకారం గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్ నిధులు కలిపి రూ.1,146 కోట్లు అందుబాటులోనే కనిపిస్తున్నాయి. ► ఇటీవల పంచాయతీల పర్యవేక్షణలో రూ.392 కోట్లతో వివిధ పనులు చేపట్టగా, మండల, జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన వాటితో కలిపితే మొత్తం రూ.511 కోట్ల మేర పనులు జరిగాయి. వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపులు సీఎఫ్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు జరిగిపోతూనే ఉన్నాయి. ► ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రెండు త్రైమాసికాలకు సంబంధించిన తలసరి గ్రాంట్ నిధులను కూడా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కేంద్రం నిధులు ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు గత ఏడాది రెండో విడతగా ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ఇంతవరకూ విడుదల చేయలేదు. గ్రామ పంచాయతీలకు రూ.678. 65 కోట్లు, మండల, జిల్లా పరిషత్‌లకు మరో రూ.290.86 కోట్లు కలిపి మొత్తం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.969 కోట్ల మేర కేంద్రం నుంచి గత ఏడాది బకాయిలు రావాల్సి ఉంది. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి విడతలో రూ.1,000 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ గ్రామాల్లో స్థానిక సంస్థలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరించారు. -
హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు
సాక్షి, గుంటూరు: అగ్నిపథ్‌ను నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన అల్లరు, విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావు పేట సాయి ఢిపెన్స్ అకాడమీ నుంచి ఆవుల సుబ్బారావుని పోలీసులు హైదరాబాద్ తీసుకెళ్లారు. సికింద్రాబాద్ అటాక్‌లో సాయి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. అల్లర్లలో 10 బ్రాంచ్‌ల విద్యార్థులున్నట్లు పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు అక్కడే ఉన్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసులో బుధవారం నుంచి సుబ్బారావును హైదరాబాద్ పోలీసులు విచారించనున్నారు. చదవండి: (అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు) -
బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు: మంత్రి అంబటి
-
భార్యకు యూట్యూబ్ చానల్.. రూ.4 కోట్ల ఆదాయం.. ఆ భర్త ఏంచేశాడంటే?
నరసరావుపే టౌన్(పల్నాడు జిల్లా): ఛీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు మంగళవారం తెలిపారు. వివరాలు.. బరంపేటకు చెందిన పోతుల విక్రమ్, లక్ష్మీజ్యోతి భార్యాభర్తలు. విక్రమ్ ఆదిత్య పేరిట లక్ష్మీజ్యోతి యూట్యూబ్ చానల్‌ను 2014లో నుంచి నిర్వహిస్తోంది. సుమారు ఈ చానల్‌కు 10 లక్షల మంది సబ్ స్క్రెబర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మీజ్యోతి హైదరాబాద్‌కు చెందిన వ్యాకుడ్ ఆవుట్ కంపెనీతో తన యూట్యూబ్ చానల్ ద్వారా యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భర్త విక్రమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా.. అయితే లక్ష్మీజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి వ్యాకుడ్ అవుట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భర్త విక్రమ్ రద్దు చేశాడు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతినెల వచ్చే ఆదాయాన్ని తన రెండో భార్య తమ్ముడు వావిళ్ళపల్లి సంతోష్ అకౌంటుకు మళ్లించాడు. రెండేళ్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసి దారి మళ్లించినట్లు లక్ష్మీజ్యోతి గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. -
వలంటీర్ల సేవలకు సలాం.. జగనన్న చిరు సత్కారం (ఫొటోలు)
-
వాలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాం: సీఎం జగన్
-
సేవా భావానికి సెల్యూట్: సీఎం వైఎస్ జగన్
సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలోని వలంటీర్ వ్యవస్థ వైపు.. ఇప్పుడు దేశం మొత్తం చూడడం గర్వంగా ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమ సభలో పాల్గొని.. వలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా.. అందునా జిల్లా కేంద్రం నరసరావుపేట నుంచి వలంటీర్ వ్యవస్థ అనే సేవా భావానికి సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని ప్రశంసించారు సీఎం జగన్. వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. లాభాన్ని పట్టించుకోకుండా.. సేవే పరమావధిగా వలంటీర్లు ముందుకు సాగుతున్నారంటూ గుర్తు చేశారు సీఎం జగన్. వలంటీర్ వ్యవస్థ ద్వారా 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు.. లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సేవలు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు సీఎం జగన్. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని, వలంటీర్లు అంటే గొప్ప సైనికులు, గొప్ప సేవకులని ప్రశంసలు గుప్పించారు. ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున చిరుసత్కారం అందజేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. -
సీఎం వైఎస్ జగన్ నరసరావుపేట పర్యటన
-
సీఎం జగన్ నరసరావుపేట పర్యటన.. అప్డేట్స్
అప్డేట్స్: 1.10PM రాష్ట్రంలో 2,33,333 మందికి రూ. 232 కోట్ల నగదు పురస్కారాలు.. బటన్ నొక్కి నగదు విడుదల చేసిన సీఎం జగన్ 1.00PM నరసరావుపేటకు పాలిటెక్నిక్, ఆటో నగర్, ఫ్లైఓవర్లు మంజూరు చేసిన సీఎం జగన్ 12.20PM వలంటీర్లకు వందనం. వలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నా. దేశం మొత్తం మనవైపు చూసేలా వలంటీర్ల వ్యవస్థ: సీఎం జగన్.రాష్ట్రంలో 2లక్షల 60వేలకు మందికి పైగా వలంటీర్లు ఉన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థ తీసుకురావాలనేది మా సంకల్పం. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా పాలన. ఏ పథకమైనా వివక్షకు తావు లేకుండా వలంటీర్లు సేవలు. వలంటీర్లు చేస్తున్నది ఉద్యోగం కాదు.. గొప్ప సేవ. - సీఎం జగన్ 12.10PM ► రావిపాడు గ్రామ వలంటీర్ రజిత ప్రసంగం. వలంటీర్లు అందరి తరపున సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన రజిత. ఏపీలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల గొప్పదనం గురించి.. వాటి వల్ల లబ్ధిదారులకు అందుతున్న ప్రయోజనాల గురించి వివరించిన వలంటీర్ రజిత. 12.05PM ► సీఎం వైఎస్ జగన్ పాలనలో వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్దిదారులకు అందుతున్న సేవల గురించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభా ప్రాంగణంలో చదివి వినిపించారు. 12.03PM ► ప్రజాసేవకు రాజకీయ అనుభవం అక్కర్లేదని.. సంకల్పం, ప్రజాసంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే సీఎం జగన్ లాంటి నేత రాష్ట్రానికి ఉంటే సరిపోతుందని ప్రసంగించారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అహర్నిశలు శ్రమిస్తూ వలంటీర్లు ప్రజలకు సేవల్ని అందిస్తున్నారంటూ ఉదాహరణలతో సహా ప్రశంసలు గుప్పించారు ఆయన. 11.48 AM ► వలంటీర్ వ్యవస్థ గురించి స్పెషల్ ఏవీ(ఆడియో విజువల్) ప్రదర్శన. 11.46 AM ► ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వలంటీర్లే వారధులన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్. 11.42 AM ► పెన్షన్ సహా ప్రతీ సేవల్ని ప్రజల ముంగిట చేరుస్తున్న వలంటీర్ల సేవలను కొనియాడిన అధికారులు. ► లాక్డౌన్ టైంలోనూ సమర్థవంతంగా విధులు నిర్వహించిన వలంటీర్లపై ప్రత్యేక ప్రశంసలు. 11.36 AM ► నరసరావుపేటలో కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ ► నరసరావుపేట, పల్నాడు జిల్లాలో వలంటీర్లకు సత్కార కార్యక్రమం. ► వలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా.. మూడు కేటగిరీల్లో పురస్కారాలను అందించనున్న సీఎం జగన్. ► అన్ని నియోజకవర్గాల్లో పండుగ వాతావరణం నడుమ వలంటీర్లకు అవార్డుల ప్రదానం. 11.26 AM ► సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న సీఎం జగన్.. అధికారులతో ఆత్మీయ పలకరింపు. 10.57 AM ► వలంటీర్ల అవార్డుల ప్రదాన కార్యక్రమం, బహిరంగ సభలో భాగంగా.. నరసరావుపేట చేరుకున్న సీఎం వైఎస్ జగన్. 10.42AM ► నరసరావుపేట బయలుదేరిన సీఎం జగన్. సీఎం వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరంగనాథరాజు ఉన్నారు. ► గ్రామ, వార్డు వలంటీర్ల సేవలకు సలాం అంటున్న ఏపీ ప్రజానీకం. నరసరావుపేటలో వలంటీర్లకు వందనం కార్యక్రమం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే ఏపీ వ్యాప్తంగా వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆరంభంలో దీనిపై తీవ్ర విమర్శలు చేసిన వారు సైతం.. ఇప్పుడు అభినందించేలా వలంటీర్లు అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. అందుకే వాళ్ల సేవలకు ప్రోత్సాహకంగా ఇవాళ పల్నాడు నర్సరావుపేటలో నిర్వహించబోయే బహిరంగ సభలో సీఎం జగన్ సత్కరించనున్నారు. ► వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. ► మొత్తం 2, 33, 333 మంది వలంటీర్లకు.. రూ.239.22 కోట్ల నగదు పురస్కారాలు. ► సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు, పింఛన్ల పంపిణీ, కరోనా థర్డ్ వేవ్‌లో ఫీవర్ సర్వే తీరు అంశాల ఆధారంగా వలంటీర్లకు పాయింట్లు కేటాయించి మూడు విభాగాల్లో అవార్డులు అందించనున్నారు. ► సేవా వజ్ర, సేవా రత్నతో పాటు కనీసం ఒక ఏడాది పాటు బాధ్యతగా పనిచేస్తూ విధి నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదు లేనివారికి సేవా మిత్ర అవార్డు అందించనున్నారు. ► స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగసభలో పాల్గొని.. వలంటీర్లను సత్కరిస్తారు. ► పీఎన్సీ కళాశాల వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ► తాడేపల్లి నుంచి ముందుగా.. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకుంటారు. ► ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ (గురువారం) పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పల్నాడు జిల్లా కేంద్రంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 10.50 గంటలకు పీఎన్సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదికపై వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు సీఎం జగన్. తిరిగి 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా.. ఉమ్మడి గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటలో ఇప్పటికే జిల్లా పాలనా యంత్రాంగం పనులు ప్రారంభించింది కూడా. -
నేను కొట్టలేదు అంతా అవాస్తవం: నరసరావుపేట డీఎస్పీ విజయ్ భాస్కర్ రావు
-
AP: ఇద్దరు యువతులను కాపాడిన ‘దిశ’
నరసరావుపేట రూరల్: గుంటూరు జిల్లాలో దిశ యాప్ ఇద్దరు విద్యార్థినులను ఆకతాయిల బారి నుంచి కాపాడింది. నరసరావుపేట రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రొంపిచర్ల మండలం గోగులపాడుకు చెందిన ఇద్దరు యువతులు ఆదివారం సాయంత్రం నరసరావుపేటకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఇక్కుర్రు గ్రామ శివారులో వారి ద్విచక్ర వాహనం టైర్ పంక్చర్ అయింది. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరు ఆకతాయిలు వారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించడం ప్రారంభించారు. దీంతో ఆ యువతులు దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కారు. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ ఎస్ఐ శ్రీహరి ఎనిమిది నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న లింగంగుంట్ల గ్రామానికి చెందిన ఆదినారాయణ, బుజ్జిలను అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్లిప్ కార్ట్, అమెజాన్‌లో డెలివరీ బాయ్‌లుగా పని చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు రొంపిచర్ల ఎస్ఐ హజరత్తయ్య తెలిపారు. వెంటనే స్పందించిన రూరల్ ఎస్ఐ శ్రీహరిని జిల్లా రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని, డీఎస్పీ విజయభాస్కర్, సీఐ అచ్చయ్య అభినందించారు. -
నారా లోకేష్ ఏంటి నీ హైడ్రామాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
-
లోకేష్ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే గోపిరెడ్డి
సాక్షి, గుంటూరు: లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ‘‘ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని’’ గోపిరెడ్డి అన్నారు. ఇవీ చదవండి: ‘శవాల మీద పేలాలు ఏరుకుంటూ లోకేష్ రాజకీయాలు’ లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస -
లోకేశ్ పర్యటన: రాజకీయ లబ్ధికే రభస
సాక్షి, అమరావతి బ్యూరో: ఉన్మాదుల అఘాయిత్యాలను ఆసరాగా చేసుకుని విపక్ష టీడీపీ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల గుంటూరులో ఉన్మాది చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించకుండా అడ్డుకున్న లోకేశ్ బృందం రచ్చను మరవకముందే మరోసారి అదే తరహాలో పర్యటనకు సిద్ధమయ్యారు. నరసరావుపేటలో ఏడు నెలల కిందట హత్యకు గురైన అనూష కుటుంబానికి పరామర్శ పేరుతో ఆయన మరో నాటకానికి తెరతీశారు. నారా లోకేశ్ గురువారం నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు ధర్నా పేరుతో సిద్ధమయ్యారు. అయితే కోర్టు విచారణ ప్రారంభమవుతున్న తరుణంలో లోకేశ్ బృందం రచ్చ చేసేందుకు ప్రయత్నించటాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనల సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలతోపాటు బాధిత కుటుంబాలకు బాసటగా నిలుస్తోందని గుర్తు చేస్తున్నారు. మూడు గ్రూపులతో నరసరావుపేటలో సతమతమవుతున్న టీడీపీని రక్షించుకునేందుకే నారా లోకేశ్ పరామర్శ పేరుతో వస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా భారీగా జన సమీకరణ చేపడుతున్న లోకేశ్ కార్యక్రమానికి అనుమతి లేదని రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. 21 నుంచి కేసు విచారణ ప్రారంభం.. సత్తెనపల్లి నియోజకవర్గం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష మరో యువకుడితో చనువుగా ఉండటాన్ని సహించలేక నిందితుడు మేడం విష్ణువర్ధనరెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 24న రావిపాడు శివారులోని పొలాల్లో గొంతు పిసికి హతమార్చాడు. ఈ ఘటనలో పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రెండు రోజుల్లోనే ప్రాథమిక చార్జిషీట్, ఎనిమిది రోజుల్లో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నెల 21 నుంచి కేసు విచారణ జరగనుంది. మృతురాలి కుటుంబ సభ్యులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు పరామర్శించి ప్రభుత్వం తరపున రూ.10 లక్షలు పరిహారం అందజేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నరసరావుపేటలో ఇంటి స్థలం ఇవ్వాలని బాధిత కుటుంబం కోరడంతో ఆ మేరకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. ప్రభుత్వం, పోలీసులను అభినందించిన జాతీయ ఎస్సీ కమిషన్.. గుంటూరులో ఆగస్టు 15న విద్యార్థిని రమ్య హత్యకు గురికాగా గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడమే కాకుండా ఏడు రోజుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రభుత్వ పరంగా పరిహారాన్ని వేగంగా అందచేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును, పోలీసుల చర్యలను జాతీయ ఎస్సీ కమిషన్ సైతం ప్రశంసించింది. ఇలా తక్షణమే స్పందిస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షం బురద చల్లేందుకు ప్రయత్నించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవీ చదవండి: రాజకీయ లబ్ధి కోసమే లోకేశ్ పర్యటన నాసిరకం రోడ్లేసి నిందలా? -
రెమ్‌డెసివిర్ బ్లాక్‌మార్కెట్‌పై నిఘా
సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల బ్లాక్‌మార్కెటింగ్‌పై అధికారులు నిఘా పెంచారు. ఈ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని డ్రగ్ ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఈ ఇంజక్షన్‌ను కొందరు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై ఔషధ నియంత్రణశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీ అండ్ ఎఫ్, హోల్‌సేల్ షాపులతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెట్టారు. గుంటూరులో బుధవారం ఓ వ్యక్తి 6 ఇంజక్షన్లు తీసుకెళుతుండగా పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పట్టుకున్న వ్యక్తిని విచారిస్తున్నారు. అదేరోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఒక ఆస్పత్రి ఐసీయూలో రోగులకు ఇవ్వాల్సిన ఇంజక్షన్లను బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురు మేల్ నర్సింగ్ సిబ్బందిని పట్టుకున్నారు. 7 డోసుల ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు నిఘా పెంచారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కేవలం కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే పంపిణీ జరగాలని, ప్రైవేటుగా ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోల్‌సేలర్లు, రిటెయిలర్లు కూడా ఇంజక్షన్ల లెక్క చెప్పాలని ఆదేశించారు. గుంటూరులో బ్లాక్ మార్కెట్లో ఇంజక్షన్ల విక్రయాల్లో వైద్యుల ప్రమేయం ఉన్నట్టు నగరంలోని వైద్యుల సంఘంలో గురువారం విస్తృతంగా చర్చ జరిగింది. ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు ఇంజక్షన్లు బ్లాక్మార్కెట్లో అమ్మితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇవి కోవిడ్ అనుమతి ఉన్న ఆస్పత్రుల్లో మాత్రమే అమ్మాలి. కొంతమంది ఇంజక్షన్లను సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రవిశంకర్‌నారాయణ్, డైరెక్టర్ జనరల్, ఔషధ నియంత్రణశాఖ చదవండి: టీడీపీ మాజీ మంత్రి ఉమకు సీఐడీ నోటీసు ఆరోగ్యశ్రీలో ఉచితంగా గుండెమార్పిడి -
గుంటూరు: నరసరావుపేటలో దారుణ హత్య
-
టీడీపీ దౌర్జన్యం.. కర్రలతో దాడి..
నరసరావుపేట రూరల్(గుంటూరు జిల్లా): పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులను భయాందోళనకు గురిచేసే లక్ష్యంతో గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. నరసరావుపేట మండలం అర్వపల్లికి చెందిన సర్పంచి అభ్యర్థి ధర్మవరపు అంజనాకు మద్దతుగా గురువారం యంపరాల వెంకట్రావు, పులుసు శ్రీనివాసరావులు నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మెయిన్ రోడ్డుపై వేచి ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని అంజనాకు ఎందుకు మద్దతిస్తున్నారంటూ.. కర్రలతో దాడికి పాల్పడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: డబ్బులిస్తాం.. మా వెంట రండహో!) నామినేషన్ వేశాడని 500 మామిడి మొక్కలకు నిప్పు రామగిరి: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన సిద్ధయ్య గురువారం వార్డు మెంబర్‌గా నామినేషన్ వేశాడు. అయితే ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు సిద్ధయ్య పొలంలో సాగు చేసిన 550 మొక్కలతో పాటు, వ్యవసాయ సామగ్రికి నిప్పుపెట్టారు. ఘటనలో సమీపంలోని రాము, రాంగోపాల్‌రెడ్డికి చెందిన పొలాల్లోని వ్యవసాయ సామగ్రి, పైపులు కూడా కాలిపోయాయి. రామగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.(చదవండి: ఒక ఊరు.. మూడు పంచాయతీలు!) పోలేపల్లిలో కాలిపోయిన మొక్కలను పరిశీలిస్తున్న పోలీసులు.. -
మనసున్న మారాజు మా జగనన్న..
సాక్షి, గుంటూరు: గోపూజ మహోత్సవంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. స్టాల్స్‌ను సందర్శిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓ గంగిరెద్దు వద్ద ఆగారు. అపుడు ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు ఎద్దు తలను ఆడించింది. ఆ క్షణంలో ఇనుప కంచెకు అటువైపు ఉన్న గంగిరెద్దు తల, ఫెన్సింగ్‌పై ఉన్న ఇనుప రాడ్‌కు తగిలేలా అనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఎం జగన్.. ఆ ఇనుప రాడ్‌పై తన చేతిని ఉంచారు. ఆ తర్వాత ఎద్దు తలను తన చేత్తో పక్కకి జరిపి జాగ్రత్త అంటూ గంగిరెద్దును ఆడిస్తున్న వ్యక్తిని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా.. మూగజీవికి ఇబ్బంది కలగకుండా సీఎం జగన్ చూపించిన చొరవ చూసి.. ‘‘మరోసారి మనసున్న మారాజు అని నిరూపించుకున్నారు’’ అంటూ ఆయనపై అభిమానం చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.(చదవండి: గోపూజ మహోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్) కాగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మొదట మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించిన ఆయన.. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
-
గోపూజ మహోత్సవంలో సీఎం జగన్
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో తలపెట్టిన గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి తన నివాసం నుంచి బయల్దేరి.. ఉదయం 11.30 సమయంలో నరసరావుపేటకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్.. తొలుతగా మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మేకతోటి సుచరిత, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్) రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున సంప్రదాయబద్ధంగా 2,147 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోమాత, గో ఉత్పత్తుల గొప్పతనంపై భక్తులకు తెలియజేస్తూ ఆలయాల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. ‘ఒక గోవులో 33 కోట్ల దేవతలుంటారనేది ప్రతీతని, గోవును పూజిస్తే ఆ దేవతల కరుణా కటాక్షాలూ లభిస్తాయని’ గోపూజ మహోత్సవ విశిష్టత గురించి నరసరావుపేట ఇస్కాన్ టెంపుల్ కార్య నిర్వాహకుడు వైష్ణవ కృష్ణదాస్ వివరించారు. ప్రతి ఇంట్లో గోవులను పూజించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆచరించి చూపిస్తున్నారని ఆయన కొనియాడారు. చదవండి: పక్కా పథకం ప్రకారమే అలజడులకు కుట్ర -
నేడు నరసరావుపేటకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జరిగే గోపూజ మహోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 2,679 ఆలయాల్లో గోపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం.. ఉదయం 11.25 గంటలకు నరసరావుపేట చేరుకోనున్నారు. మున్సిపల్ స్టేడియంలో వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు. అనంతరం గోపూజ మహోత్సవంలో పాల్గొనున్నారు మధ్యాహ్నం 1.10 గంటలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకోనున్నారు. చదవండి: సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు -
నిమిషాల్లో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి..
సాక్షి, గుంటూరు : నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం. జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిమిషాల వ్యవధిలో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి చేరింది. ఈ ఫేక్ న్యూస్‌కు కుల, మత, రాజకీయ రంగు పులిమారు. ఫేక్ న్యూస్‌పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్ చేసేటప్పుడు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై పోలీసుల నిఘా ఉంటుంది. రెండేళ్ల క్రితం కళాశాల ఖాళీ చేస్తున్న సమయంలో సామాగ్రి, షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినటంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇద్దరిపై కేసు నమోదు కాగా ఎల్ఐసీ కార్యాలయం పక్కన పాత కృష్ణవేణి జూనియర్ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసి సరస్వతి దేవీ విగ్రహం ధ్వంసం చేశారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశారు. దీనిపై ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడు చేసిన మురళి, మహేష్ రెడ్డి అనే ఇద్దరిపై పిడుగురాళ్ల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివాదాల సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా
సాక్షి, గుంటూరు : నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కరోనావైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి రావడంతో కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు. ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, నెగెటివ్ వచ్చే వరకు తనను ఎవరూ సంప్రదించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవ్వరూ అధైర్యపడవద్దని, త్వరలోనే ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తానని అన్నారు. గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. (చదవండి : కరోనా భారత్: 30 లక్షలు దాటిన కేసులు) -
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా
-
కళాశాల భవనాలకు సీఎం జగన్ శంకుస్థాపన
-
నరసరావుపేటలో జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.80 కోట్లతో వ్యయంతో పరిపాలనా,బోధన,హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలని తమ ప్రయత్నం అని, ఈ కాలేజీ శంకుస్థాపనే దీనికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. (వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి) ‘‘2016లో ఫస్ట్‌బ్యాచ్ పిల్లలను తీసుకున్నారు. మనం శంకుస్థాన చేసేసరికి అప్పుడు చేరిన పిల్లలు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చేశారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన ఇప్పటివరకూ చేయలేదు ఇప్పటివరకూ ప్రైవేటు కాలేజీలు, ల్యాబుల్లో నడుపుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులను మార్చాలని మనం ప్రయత్నంచేస్తున్నాం. వెనకబడ్డ పల్నాడు ప్రాంతానికి మేలు జరుగుతోంది. రూ.80 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్ చేశాం. వచ్చే సంవత్సరం మరోరూ.40 కోట్లు శాంక్షన్ చేస్తాం. మొత్తంగా రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నామని’ సీఎం జగన్ తెలిపారు. -
అష్ట దిగ్బంధంలో నరసరావుపేట
సాక్షి, గుంటూరు : జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్న గుంటూరు, నరసరావుపేటలో ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలిస్తోంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట కేంద్రంగా ఎక్కువగా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 253 పాజిటివ్ కేసులు నమోదు కాగా వాటిలో 109 కేసులు రూరల్ జిల్లాలోనివే. అందులోనూ 75 కేసులు ఒక్క నరసరావుపేటలోనివే. దీంతో నరసరావుపేటలో 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండు రోజులు ప్రజలెవ్వరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసర వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపుతామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక బృందాలు పోలీసులు పేటలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 920 ప్రైమర్, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఇంకా 200 మందికిపైగా గుర్తించి క్వారంటైన్ చేయాల్సి ఉన్నట్టు సమాచారం. దీంతో కాంటాక్ట్‌ల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను రూరల్ ఎస్పీ సీహెచ్ విజయరావు ఏర్పాటు చేశారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు ప్రత్యేక బృందాల్లో పని చేస్తున్నారు. ‘డ్రోన్’ కన్నుతో నరసరావుపేటలోని వరవకట్టు ప్రాంతంలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. డ్రోన్లతో ఎప్పటికప్పుడు లాక్ డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్, ఏఎన్ఎస్ పోలీసులు పేటలో 24/7 గస్తీ కాస్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో భద్రత కోసం మూడు ప్లటూన్ల ప్రత్యేక బృందాలు, ఎనిమిది మంది సీఐలు, 14మంది ఎస్ఐలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లను నరసరావుపేటకు అదనంగా ఇటీవల కేటాయించారు. ఫలిస్తున్న ప్రణాళికలు రెడ్‌జోన్ ప్రాంతాల నుంచి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించ కుండా గ్రీన్జోన్లను కాపాడుకునే విధంగా యంత్రాంగం ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగానే రెడ్‌జోన్ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. అక్కడ ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు క్వారంటైన్లో ఉండటం వల్ల యంత్రాంగం కొంత మేర ఊపిరి పీల్చుకుంటుంది. బయటకు రావొద్దు..దది ‘కరోనాను నిర్మూలించడంలో ప్రజలు తమవంతు సహకారం అందించాలి. ప్రధానంగా రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే వారి సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రజలు సహకరించాలి నరసరావుపేటలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. వైరస్ మూలాలు ఇక్కడి నుంచి రూరల్ జిల్లా మొత్తం వ్యాపిస్తున్నాయి. దీంతో పేటను అష్టదిగ్బంధం చేశాం. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నాం. ప్రజలు సహకరించాలి. ప్రతి ఒక్కరు పోలీస్ ఆంక్షలకు లోబడి నడుచుకోవాలని రూరల్ ఎస్పీ, విజయరావు స్పష్టం చేశారు. – విజయరావు, రూరల్ ఎస్పీ -
‘అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్’
సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనందకుమార్ నరసరావుపేటలో కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టారు. దానిలో భాగంగా అక్కడ 48 గంటల పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. రేపు, ఎల్లుండి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ మంగళవారం తెలిపారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని, ప్రజలంతా సహకరించాలన్నారు. (చదవండి: పట్టణాలకే పరిమితమైన కరోనా) ‘ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అత్యవసరమైనవి తప్ప మరెలాంటి కేసులు చూడటానికి వీల్లేదు. క్వారంటైన్ సెంటర్లలో మంచి ఆహారం అందిస్తున్నాం. ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా డ్రైఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోండి. లాక్ డౌన్ ఉల్లంఘించినవారిని జైలుకు పంపుతున్నాం’అని శామ్యూల్ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా గడిచిని 24 గంటల్లో కొత్తగా మరో 17కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 254కు చేరింది. 8 మంది మృతి చెందారు. (చదవండి: ఏపీలో కొత్తగా 82 కరోనా కేసులు) -
నరసరావుపేటలో ప్రముఖ వైద్యుడికి పాజిటివ్..
సాక్షి, గుంటూరు: రెడ్‌జోన్ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించామని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు పరుస్తున్నామని..పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కలిగిన అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నామని..కొంతమంది పోలీసులను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెడ్జోన్లలో డ్రోన్లు ద్వారా నిఘా పెట్టామని పేర్కొన్నారు. (ఉలిక్కిపడ్డ సిక్కోలు.. అసలు ఏం జరిగింది?) నరసరావుపేటలో ఒక ప్రముఖ వైద్యునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని.. ఆయనతో పాటు ఆసుపత్రి సిబ్బంది, 167 మంది ఔట్ పేషెంట్లను కూడా క్వారంటైన్‌కు తరలించామని వెల్లడించారు. పొందుగుల చెక్‌పోస్టు దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి ఉన్నవారినే ఏపీలోకి అనుమతిస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. -
బాబు ఇంకా ఆయనే సీఎం అనుకుంటున్నారు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ కలిసే ఎన్నికలు ఆపారని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తే వీళ్లు కుట్రలతో వాయిదా వేయించారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగి ఉంటే రూ.5800 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉండేదన్నారు. అధిక పర్యాటకులు వచ్చే గోవాలో ఈ నెల 23న స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇంకా తానే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేరళ సీఎం కూడా అదే చెప్పారు కరోనాకు పారాసిటమాల్ వేస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పడాన్ని చంద్రబాబు తప్పుపట్టడం, హేళన చేయడం సరికాదని గోపిరెడ్డి హితవు పలికారు. కేరళ ముఖ్యమంత్రి కూడా పారాసిటమాల్ వాడాలని శానిటేషన్ గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. కరోనా వ్యాధి తగ్గడానికి పారాసిటమాల్ మాత్రమే డ్రగ్ ఆఫ్ ఛాయిస్ అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయన్నారు. అంతేకాక కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ప్రణాళికతో సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భారత్‌లో 114 కరోనా కేసులు నమోదయ్యాయని, దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు దీనిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయన్నారు. అందులో భాగంగా విశాఖలో రెండు వందల బెడ్లు, ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేశామని తెలిపారు. (ఎన్నికల వాయిదా: అభివృద్ధి, సంక్షేమం ప్రశ్నార్థకం ) -
టీడీపీ నేతల అక్రమ మద్యం వ్యాపారం బట్టబయలు
సాక్షి, గుంటూరు/ ప్రకాశం : టీడీపీ నేతలు సాగిస్తున్న అక్రమం మద్యం వ్యాపారం బట్టబయలు అయింది. జిల్లాలోని నరసరావుపేట మండలం చింతలపాలెంలో కోళ్లఫారం కేంద్రంగా సాగిస్తున్న అక్రమ మద్యం దందాను పోలీసులు రట్టు చేశారు. సోదాల్లో మూడు వేల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేత కడియం కోటిసుబ్బారావు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తెచ్చి.. ఇక్కడ దందా సాగిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మంగమూరు డొంకలో ఓ నివాసంలో భారీగా అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న సుంకర్ హరిబాబును ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. స్థానిక అంజయ్య రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సుబ్రహ్మణ్య మద్యం కేసులను హరిబాబుకు సరఫరా చేస్తున్నట్టు పోలీలసు గుర్తించారు. సూపర్ వైజర్‌ను కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి అక్రమంగా సేకరించిన మద్యాన్ని.. నకిలీ బ్రాండ్ల పేరుతో నీటిని మద్యాన్ని కలిపి విక్రయాలు సాగిస్తున్నట్టు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. అలాగే హరిబాబు వద్దనున్న సుమారు 70 మద్యం బాటిళ్లు, 1600 లేబుల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
రౌడీషీటర్‌తో లోకేష్ ములాఖత్
సాక్షి, నరసరావుపేట : సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించటం.. అల్లర్లకు ఉసిగొల్పటం వంటి చర్యలకు పాల్పడటంలో తెలుగుదేశం పార్టీది మొదటి నుంచి అందెవేసిన చెయ్యిగా చెప్పుకోవచ్చు. తొమ్మిది క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉండి రౌడీషీటర్‌గా చెలామణి అవుతూ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ములాఖత్ అవ్వటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తల సంఘీభావం ముసుగులో టీడీపీ గూండాలను అక్కున చేర్చుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గొడవలు సృష్టించేందుకు టీడీపీ పక్కా వ్యూహం రచించిందన్న ఆరోపణలు సర్వతార వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళితే.. రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలేనికి చెందిన కుమ్మెత కోటిరెడ్డి తొమ్మిది క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడు. అతనిపై రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో 2014 నుంచి ఏ ప్లస్ రౌడీషీట్ ఓపెన్ అయి ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కోటిరెడ్డి తన గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్స్‌లు అపహరించాడు. ఆ సమయంలో పోలీసులు ఫైరింగ్ కూడా జరిపారు. 2013లోనే కోటిరెడ్డిపై హత్యాయత్నం, మహిళపై లైంగికదాడియత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు భూకబ్జాలు, బెదిరింపు వసూళ్లు, పలు దాడి కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 20న రామిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాజనాల వెంకటరెడ్డిపై కోటిరెడ్డి, అతని అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోటిరెడ్డిని వారం రోజుల క్రితం రొంపిచర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబులతోపాటు ఆ పార్టీ మాజీ మంత్రులు అతన్ని విడిచిపెట్టాలని పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులు వినకపోవటంతో స్టేషన్లో ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరతీశారు. అక్కడ నుంచి వైద్యశాలకు తరలించిన పోలీసులు ఎటువంటి హానీ లేదని వైద్యులు చెప్పిన సలహా మేరకు నిందితుడిని కోర్టులో హాజరు పరిచి సబ్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారా లోకేష్ సబ్ జైల్లో ఉన్న రౌడీషీటర్ కోటిరెడ్డిని శుక్రవారం ములాఖత్ అయి ఏకాంతంగా మాట్లాడారు. రొంపిచర్ల మండలంలో గత కొన్నేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్న కోటిరెడ్డిని లోకేష్ పరామర్శించటం పలు ఆరోపణలకు తావిస్తోంది. సొంత పార్టీలో నాయకులే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో రౌడీషీటర్‌ను లోకేష్ పరామర్శించటాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది!
సాక్షి, గుంటూరు: సెల్ఫీ దిగితే చాలా అందంగా ఉంటాం.. కానీ జీవితం అంతకంటే అందమైనదీ, అద్భుతమైనది. ఒక్క సెల్ఫీ కోసం అలాంటి జీవితాన్ని పణంగా పెట్టకూడదు. సెల్ఫీ విషాదాలు ఎన్ని జరిగినా.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సెల్ఫీ విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది. సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం.. జాగ్రత్త పడండి అంటూ వచ్చే సందేశాలు చూసి ఆ ప్రమాదం మనదాకా రాదులే అనుకుంటాం. అలా అనుకొనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ధనలక్ష్మి నిర్లక్ష్యంగా సెల్ఫీ దిగుతూ.. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది. నరసరావుపేటకు చెందిన 20 ఏళ్ల ధనలక్ష్మి... గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. బంధువుల ఇంట్లోని పెళ్లి కోసం తన స్వగ్రామం వెళ్లింది. అదే రోజు కండ్లకుంటలో నివసిస్తున్న తన అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో నీటితో పరవళ్లు తొక్కుతున్న గుంటూరు బ్రాంచ్ కాలువ కనిపించింది. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి కాల్వ వద్ద చాలాసేపు రకరకాల సెల్ఫీ ఫోటోలు దిగారు. అందరూ తిరగి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక్క ఫోటో దిగుతానంటూ ధనలక్ష్మి మళ్లీ కాల్వ వద్దకు వెళ్లింది. అంతే సెల్ఫీకి ఫోజిచ్చే క్రమంలో కాల్వలోకి జారి పడిపోయింది. అంతా తేరుకొని చూసేసరికి సెల్ ఫోన్ మాత్రమే గట్టుమీద కనిపించింది.. సెల్ ఫోన్లోని ఫోటోలు చూశాక ఆమె నీటిలో పడిపోయిందని నిర్ధారించుకున్నారు. పది నిమిషాల్లోనే ధనలక్ష్మి నీటిపై తేలుతూ కనిపించడంతో కాల్వలోకి దిగి బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రతి జ్ఞాపకాన్నీ స్మార్ట్ గా బంధించాలనీ.. అందరితో పంచుకోవాలనీ యువత ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జరిగే ప్రమాదాలను ఉపద్రవాలనూ గుర్తించకపోవడంవల్ల కన్నవారికి కడుపుకోత మిగులుతోంది.. సెల్ఫీ అందంగానే ఉంటుంది.. కానీ జీవితం అంతకంటే అపురూపమైనది.. ! -
పైరవీలు చేసేవారిని దూరం పెట్టండి..
సాక్షి, గుంటూరు: అధికారులు అవినీతి రహితంగా పనిచేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫోన్ ద్వారా స్వీకరించారు. తన పేరు చెప్పుకుని పైరవీలు చేసేవారిని దూరంగా పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. పలు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే..అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. -
ముగిసిన కోడెల అంత్యక్రియలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. గుంటురు జిల్లా నరసరావుపేటలో స్వర్గపురిలో కోడెల చితికి ఆయన కుమారుడు శివరామ్ నిప్పంటించారు. కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. అంత్యక్రియలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు హాజరయ్యారు. హైద్రాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ నుంచి కోడెల భౌతికాయాన్ని నిన్న రోడ్డు మార్గంలో గుంటూరుకు తరలించిన విషయం తెలిసిందే. నేతల నివాళి అనంతరం భౌతిక కాయాన్ని సత్తెనపల్లి మీదుగా నరసరావుపేటకు తరలించారు. -
నర్సరావుపేటలో రియాల్టర్ దారుణ హత్య
గుంటూరు : నర్సరావుపేటలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రావిపాడు రోడ్డులోని ఓ వెంచర్ సమీపంలో వ్యాపారి తడికమల్ల రమేష్ మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రెండు కోట్ల రూపాయల లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కేట్యాక్స్ ఖాతాలో రిజిస్ట్రార్ కార్యాలయం
సాక్షి, నరసరావుపేట(గుంటూరు) : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ ధనదాహానికి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయి. కాంట్రాక్టర్ నుంచి వచ్చే కమీషన్ల కోసం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని ముంపు ప్రాంతం అయిన వాగు పోరంబోకు స్థలంలో నిర్మించారు. ఎటువంటి అనుమతులు లేకున్నా అప్పటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కారణంగా అధికారులు నిబంధనలను కాలరాశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందన్న సాకు చూపి నిర్మాణ పనులు పూర్తి కాక ముందే భవనాన్ని ప్రారంభించారు. కోట్ల రూపాయలతో నిర్మించిన రిజిస్ట్రార్ కార్యాలయ భవనాన్ని నేడు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వివాదాల కేంద్రం.. నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ శాశ్వత భవనం మొదటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం ప్రకాష్ నగర్‌లోని అద్దె భవనంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అయితే శాశ్వత భవనంలో రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించాలన్న ఉద్దేశంతో పట్టణ శివారు స్టేడియం వెనుక భాగంలో భవన నిర్మాణానికి నాలుగేళ్ల కిందట స్థలాన్ని కేటాయించారు. వాగు పోరంబోకు స్థలంలో సుమారు రూ.3 కోట్లతో నూతన భవనాన్ని నిర్మించారు. వాస్తవానికి ప్రభుత్వ వాగులు, చెరువులు, కుంటలు తదితర వాటిలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టరాదని దేశ ఉన్నత న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒక వేళ నిర్మించాలంటే ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అనుమతి తీసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ప్రత్యేక మైన జీవో ద్వారా అనుమతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో పాటు ఒక శాఖ నుంచి మరో శాఖకు భూమి బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులు అందించాలి. దీనికి సంబంధించి మార్కెట్ విలువను అవసరాల కోసం భూమి తీసుకున్న శాఖ చెల్లించాలి. అదే విధంగా పట్టణ పరిధిలో భూమి ఉన్న కారణంగా భవన నిర్మాణానికి మున్సిపల్ అనుమతులు అవసరం. అయితే అవేమి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవన విషయంలో చోటు చేసుకోలేదు. అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది జగమెరిగిన సత్యం. కేవలం మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్ శివరామ్ అవినీతి ముందు నిబంధనలు అన్నీ నలిగిపోయాయి. పొంచి ఉన్న ముప్పు.. భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ముంపు ప్రాంతం కావటంతో పక్కనే ఉన్న వాగు పొంగి నూతనంగా నిర్మించిన జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నీటమునిగే ప్రమాదం ఉంది. గతంలో కురిసిన భారీ వర్షాలకు కార్యాలయ పరిసరాలు నీట మునిగి ఆ ప్రభావం రెండు మూడు రోజుల వరకు ఉండేది. దీంతో పాటు నిత్యం కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్న కారణంగా పట్టణ శివారు ఏర్పాటు చేసిన కార్యాలయంతో ప్రజల సొమ్ముకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ముందస్తు అనుమతులు లేకుండా ముంపు ప్రాంతంలో నిర్మించినందున పర్యావరణ పరిరక్షణ శాఖ ఏ క్షణంలోనైనా కార్యాలయాన్ని కూల్చివేసే అవకాశం లేకపోలేదు. స్వలాభం కోసం కార్యాలయ నిర్మాణం.. రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మించిన కాంట్రాక్టర్ నుంచి కోడెల శివరామ్ కమీషన్ రూపంలో రూ.50 లక్షల వరకు కే ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. కేవలం తన కమీషన్ కోసం ముంపు ప్రాంతం కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాడు. అప్పటి అధికారులు కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసినా బెదిరించి నిర్మాణ పనులు చేయించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లకు సుదూర ప్రాంతంలో నిర్మించిన రిజిస్ట్రార్ కార్యాలయానికి క్రయ, విక్రయదారులు సేవల కోసం వెళ్లాలంటే ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంది. పట్టణ నడిబొడ్డున అనేక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. నూతన రిజిస్ట్రార్ కార్యాలయానికి సమీపంలో కోడెల శివరామ్‌కు చెందిన వందలాది ఎకరాల భూములు ఉన్న కారణంగా వాటి విలువను పెంచుకోవాలన్న ఉద్దేశంతో ముంపు ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు విమర్శలు లేకపోలేదు. మార్పుకు అనేక చిక్కులు.. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నిర్మాణం పూర్తి అయిన నూతన భవనంలోకి మార్చాలంటే అనేక చిక్కులు తలెత్తుతున్నట్లు సమాచారం. భూమిని రిజిస్ట్రేషన్ శాఖకు బదలాయిస్తున్నట్లు గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో పాటు భవన నిర్మాణానికి మున్సిపల్ శాఖ అనుమతులు తీసుకోలేదు. ముఖ్యంగా లోతట్టు వాగు పోరంబోకు భూమికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యేక జీవో విడుదల కాలేదు. ఈ సమస్యల కారణంగా కార్యాలయ మార్పులో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాల ద్వారా తెలియవచ్చింది. అయితే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కోడెల శివరామ్ పుణ్యామా అంటూ కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు. -
మురుగు కాల్వలో పసికందు మృతదేహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు రోడ్డు మురుగు కాల్వలో పసికందు మృతదేహం లభ్యమైన ఘటన మరువక ముందే ఆ ప్రాంతానికి సమీపంలో మరో పసికందు మృతదేహం మురుగు కాల్వలో కనిపించటం కలకలం రేపింది. పల్నాడు రోడ్డు పాత చెక్‌పోస్టు వీధిలోని ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు సమాచారాన్ని వన్‌టౌన్ పోలీసులకు అందించారు. దీంతో ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సైడుకాల్వలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. నెలలు నిండని శిశువుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 20 రోజుల క్రితం పల్నాడు బస్టాండ్ ఎస్‌కేఆర్‌బీఆర్ కళాశాల ఎదుట ప్రధాన మురుగు కాల్వలో పసికందు మృతదేహాన్ని టూటౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సమీపంలోని ప్రైవేటు వైద్యశాలల్లో అబార్షన్ చేసి శిశువును కాల్వలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన మరువక ముందే మురుగు కాల్వలో మరో పసికందు ప్రత్యక్షమవ్వటం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
కోడెల కుమార్తెపై కేసు నమోదు
నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ కోడెల వరప్రసాదరావు కుమార్తె డాక్టర్ పూనాటి విజయలక్ష్మిపై సోమవారం మరో కేసు నమోదైంది. తమ నుంచి సర్జికల్ కాటన్ కొనుగోలు చేసి రూ.15 లక్షలను ఎగ్గొట్టారంటూ ఖమ్మం జిల్లా కొత్తూరు కు చెందిన చల్లా రవీంద్రరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రవీంద్రరెడ్డి డాక్టర్ పూనాటి విజయలక్ష్మికి చెందిన సేఫ్ ఫార్ములేషన్ లిమిటెడ్ కంపెనీకి నాలుగేళ్లుగా సర్జికల్ కాటన్ విక్రయిస్తున్నారు. గడచిన ఏడాది ఆ కంపెనీకి రూ.36 లక్షల విలువైన కాటన్ సరఫరా చేయగా.. రూ.21 లక్షలను తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.15 లక్షల కోసం రవీంద్రరెడ్డి విజయలక్ష్మి వద్దకు వెళ్లగా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. తనను తన్ని తరిమేయాలని కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, మరో ఉద్యోగి నాగేశ్వరరావును ఆదేశించటంతో వారు తనపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విజయలక్ష్మి, మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. -
నరసరావుపేట పరువు తీసేశారు...
సాక్షి, అమరావతి: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావుపై నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించడం సిగ్గు చేటు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ...‘ కోడెల వ్యవహారం కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోపెట్టినట్లు ఉంది. ఏకంగా అసెంబ్లీ ఫర్నీచర్‌ను దోచుకున్న ఘనుడు. అసెంబ్లీ ఫర్నిచర్ ప్రజల ఆస్తి, దాన్ని ఎలా తీసుకువెళతారు?. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ నీచమైన పనులు చేశారు. అవసరం అయితే మేం చందాలు వేసుకొని కొనిస్తాం. కోడెల.. నరసరావుపేట నియోజకవర్గం పరువు తీసేశారు. చదవండి: చేసిన తప్పు ఒప్పుకున్న కోడెల..! నరసరావుపేట వాసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కోడెల వల్ల నరసరావుపేట ఎమ్మెల్యేగా నేను సిగ్గుతో తలదించుకుంటున్నా. ఇప్పటికే కే ట్యాక్స్ పేరుతో దారుణమైన అక్రమాలకు పాల్పడ్డారు. కోడెల కుమారుడు వెయ్యి బైక్‌లకు ట్యాక్స్ కట్టకుండా రిజిస్టర్ చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేఖ రాసినట్లు బుకాయిస్తున్నారు. తప్పుడు తేదీలతో హడావుడిగా లేఖ రాశారు. వందల ఏళ్ల నాటి వారసత్వ సంపదను షోరూంలో పెట్టుకున్నారు. అసెంబ్లీలో ఇంకా ఘోరమైన దోపిడీలకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు కూడా అమ్ముకున్నారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఐ ఫోన్లు కూడా అమ్ముకున్నారు. అన్న క్యాంటీన్లలో భోజనాలు తన ఫార్మా కంపెనీ వర్కర్లకు అమ్ముకున్నారు. విచారణలో అన్నీ బయటకు వస్తాయి. అవినీతికి పాల్పడ్డ కోడెలపై చంద్రబాబుకు ఎందుకంత ప్రేమ?. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపుపై చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: కోడెల ఒప్పుకుంటే.. తప్పు ఒప్పవుతుందా? -
కోడెల ఇంటి ముందు కేబుల్ ఆపరేటర్ ధర్నా
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఎన్సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి ఎన్‌సీవీని కబ్జా చేశాడు. దీంతో ఎన్సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివరామకృష్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : కోడెల కుమారుడిపై కేసు) -
టీడీపీ అనుచరగణం అరాచకం
సాక్షి, నరసరావుపేట (గుంటూరు) : అధికారాన్ని అడ్డంపెట్టుకొని అవినీతికి పాల్పడిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుల అక్రమాల పుట్ట పగులుతోంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడి అవినీతిని ఆదర్శంగా తీసుకున్న తమ్ముళ్లు గత ప్రభుత్వ హయాంలో అరాచకాలకు తెగబడ్డారు. ప్రభుత్వం మారటంతో బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వస్తుండటంతో వారి అక్రమ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. నష్టపోయిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధితో పాటు ఇద్దరు మాజీ కౌన్సిలర్లను అదుపులోకి తీసుకున్నారు. అనేక మోసాలు: అధికారం అడ్డంపెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులను టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయ విజయలక్ష్మికి చెప్పి విద్యుత్ సబ్ స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి ఆంజనేయులు లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల్లో ఒకరు ఆళ్ల శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు నెల రోజుల కిందట చీటింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పాటు కోడెల కుమారుడు శివరామ్‌కు కే ట్యాక్స్ చెల్లించాలని దివ్యాంగుడైన కృష్ణారావును బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద సంతకాలు చేయించిన అభియోగంపై రూరల్ పోలీస్ స్టేషన్లో కొల్లి ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసులు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు కొల్లి ఆంజనేయులును శనివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. భూముల కబ్జా.. అదే విధంగా గుంటూరు రోడ్డులో ఉన్న తన పొలాన్ని కోడెల శివరామ్ అండదండలతో టీడీపీ మాజీ కౌన్సిలర్ కొవ్వూరి బాబు కబ్జాకు పాల్పడ్డాడని చిరుమామిళ్ల బసవయ్య ఇచ్చిన ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు కొవ్వూరు బాబు జమిందార్ ఫంక్షన్ హాల్ ఎదుట గతంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కొనుగోలుకు సంబంధించి లక్షలాది రూపాయలు అడ్వాన్స్‌లు తీసుకొని, దుకాణాలు తమకు ఇవ్వకుండా ఇతరులకు విక్రయించి మోసం చేశాడని బాధితులు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే నమ్మకంగా వ్యాపారం చేస్తూ వ్యాపారులు, ఖాతాదారుల నుంచి సుమారు రూ.8 కోట్ల నగదు, బంగారం అప్పుగా తీసుకొని బంగారు వ్యాపారి మారం శ్రీనివాసరావు కుటుంబంతో సహా సుమారు 30 రోజుల కిందట అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నష్టపోయిన బాధితులు సుమారు 80 మంది డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కాల్ లిస్ట్ వివరాలను పరిశీలించగా, టీడీపీ మాజీ కౌన్సిలర్‌తో తరచూ మాట్లాడుతున్నట్లు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలియవచ్చింది. కాగా మాజీ స్పీకర్ కోడెల కుమారుడు, కుమార్తె, వారి అనుచరగణం చేసిన అవినీతి, అక్రమ దందాలపై బాధితుల ఫిర్యాదుతో పలు స్టేషన్లలో కేసులు నమోదవ్వగా, వారంతా పరారీలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. -
కోడెల శివప్రసాదరావుకు అధికారులు షాక్
సాక్షి, గుంటూరు : టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు కే ట్యాక్స్ వసూళ్లపై కేసులు, మరోవైపు సొంత పార్టీ నుంచే అసమ్మతి ఎగసిపడుతోంది. తాజాగా కోడెలకు అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన గౌతమ్ హోండా షోరూమ్‌ను సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అయిదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్‌లో కూడా టాక్సులు చెల్లించకుండా 400 వాహనాలు విక్రయించినట్లు సమాచారం. దీంతో నరసరావుపేట, గుంటూరులోని రెండు షోరూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. -
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు అరెస్ట్
సాక్షి, గుంటూరు : పోలీసుల కళ్లుగప్పి పరారై తిరుగుతున్న అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, క్రికెట్ బూకీ శాకమూరి మారుతీ చౌదరిని నరసరావుపేట పోలీసులు నిన్న (శుక్రవారం) అదుపులోకి తీసుకున్నారు. అతడిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి అజ్ఞాతంలో ఉన్న మారుతి తిరిగి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడినట్లు తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాకమూరి మారుతి క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేవాడు. కోడెల శివరామ్ అండదండలతో యథేచ్ఛగా తన అనుచరులతో బెట్టింగ్ నిర్వహింపచేయడం, సమయానికి డబ్బులు ఇవ్వని వారిపై గూండాలతో దాడులు చేయటం వంటి చర్యలకు పాల్పడేవాడు. మాజీ స్పీకర్ కోడెల అండ పుష్కలంగా ఉండటంతో స్థానిక పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరించేవారు. రెండేళ్ల క్రితం రూరల్ ఎస్పీగా పనిచేసిన వెంకటప్పలనాయుడు మారుతి, అతని అనుచరులను అరెస్ట్ కేసు నమోదు చేశారు. విచారణలో మారుతికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ తన అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అతడి వద్ద పందేలు ఆడి నష్టపోయిన బాధితులు గత నెలరోజుల క్రితం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టూటౌన్ పోలీసులు వలపన్ని బీసీ కాలనీలో ఓ గృహంలో బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా దాడులు చేశారు. అయితే పోలీసుల రాకను ముందే పసిగట్టిన మారుతి పరారీ అవగా, అతని అనుచరులు ఖాజా, నాగూర్‌లను అరెస్ట్ చేశారు. -
కోడెల కుమార్తెపై ఉన్న కేసుల వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: భూ దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు, కే ట్యాక్స్ వసూలు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై నమోదైన 15 కేసుల వివరాలను లిఖితపూర్వకంగా తమ ముందుంచాలని పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజయలక్ష్మి అరెస్టుపై సోమవారం తగిన నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు శుక్రవారం పేర్కొన్నారు. ఓ భూమి కొనుగోలు వివాదంలో గుంటూరు పోలీసులు తనపై నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసును కొట్టేయడంతో పాటు తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలంటూ విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సోమయాజులు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ..ఎప్పుడో 2014లో ఘటన జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. ఎవరి వద్ద నుంచో ఆస్తి కొనుగోలు చేస్తే, ఆ ఆస్తికి ఫిర్యాదుకూ సంబంధం లేకపోయినా పిటిషనర్‌పై ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, గుంటూరు : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓ కాంట్రాక్టు విషయంలో కోడెల శివరామ్ తనను మోసం చేశారంటూ టీడీపీ నేత శివరామయ్య పోలీసులను ఆశ్రయించారు. ఏడు లక్షల రూపాయలు ఇస్తేనే పని చేయనిస్తానని తనను బెదిరించారని, ఆ తర్వాత డబ్బు తీసుకుని కూడా కాంట్రాక్టును రద్దు చేయించారని ఆరోపించారు. ఈ మేరకు శివరామ్‌తో పాటుగా ఆయన అనుచరులపై కూడా నరసారావుపేట వన్‌టౌన్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. కాగా ‘కే ట్యాక్స్’ పేరిట తమను వేధించారంటూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబంపై ఇప్పటికే పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, కుమారుడు శివరామ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. -
కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం
సాక్షి, నరసారావుపేట: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడి అక్రమాలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. నరసారావుపేట ఐలా బజారుకు చెందిన బసవేశ్వరరావు అనే వ్యక్తి మంగళవారం కోడెల శివరామ్‌పై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివరామ్‌తోపాటు మరికొంతమంది తన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్స్‌తో ఆక్రమించుకున్నారని, దీనిపై కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా.. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ
సాక్షి, గుంటూరు/నరసరావుపేట టౌన్: మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల కొడుకు, కుమార్తెపై కేసు పెట్టేందుకు పోలీస్స్టేషన్లకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దౌర్జన్యంగా తమ వద్ద లాక్కున్న డబ్బును వెనక్కు ఇప్పించాలంటూ వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా గురువారం మరో ఇద్దరు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి లంచాలు దండుకున్న కోడెల కూతురు విజయలక్ష్మీపైనా, లైసెన్స్ ఉన్నప్పటికీ మద్యం దుకాణానికి కే ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ లక్షలు వసూలు చేసిన కొడుకు శివరాంపై బాధితులు ఫిర్యాదు చేశారు. వీరిపై చీటింగ్, బలవంతపు వసూళ్ల సెక్షన్ 420, 384 కింద కేసు నమోదు చేశారు. ఇలా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు కోడెల కుటుంబం అక్రమ వసూళ్లు చేసిన విధానం బాధితుల కథనంతో వెలుగులోకి వస్తోంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం, కుమార్తె విజయలక్ష్మి నేరుగా ఈ వసూళ్లు చేశారని బాధితులు ఆధారాలు సమర్పిస్తున్నారు. తెలుగుదేశ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తోపుడు బండ్ల వ్యాపారుల మొదలు మద్యం వ్యాపారుల వరకు ఎవరినీ వదల కుండా ‘కే’ట్యాక్స్ వసూలు చేసింది. కొత్త ప్రభుత్వం అవినీతి ప్రక్షాళన దిశగా చర్యలు చేపడుతుండటంతో బాధితులంతా న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గత వారం రోజుల నుంచి నరసరావుపేట పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్లకు బాధితులు క్యూ కడుతున్నారు. కోడెల కుమారుడు, కుమార్తెపై ఇప్పటికే ఐదు కేసులు నమోదు అయ్యాయి. తాజాగా గురువారం మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ప్రత్యేక అధికారిని నియమిస్తే మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం కోడెల, ఆయన కుటుంబ సభ్యుల దాష్టికాలపై నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేయించాలనే యోచనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలిసింది. అదే జరిగితే భయంతో ఫిర్యాదు చేయకుండా ఉన్న వందలాది మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ వద్ద ఉన్న వీడియో, ఆడియో రికార్డుల ఆధారాలను సైతం అందించేందుకు బాధితులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బెదిరించి రూ.42 లక్షలు వసూలు చేశారు మద్యం వ్యాపారం సజావుగా సాగాలంటే తనకు రూ.50 లక్షల ‘కే’ట్యాక్స్ చెల్లించాలని, లేకుంటే కేసులు పెట్టిస్తానని కోడెల శివరాం బెదిరించటంతో విడతల వారీగా రూ.40 లక్షలు చెల్లించానని మద్యం వ్యాపారి మర్రిబోయిన చంద్రశేఖర్ టూటౌన్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. మద్యం షాపు నిర్వహించుకోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోడెల శివరాం బెదిరించాడన్నారు. చివరికి రూ.40 లక్షలకు ఒప్పుకునేలా చేశాడన్నారు. ‘కే’ట్యాక్స్ డబ్బులు కట్టటం ఆలస్యమైతే పోలీసులను పంపి బెదిరించేవాడన్నారు. దీంతో తన దగ్గర లేకున్నా వడ్డీకు అప్పు తీసుకొచ్చి మరీ రూ.40 లక్షల రూపాయలు కట్టానని తెలిపాడు. దీనిపై బలవంతపు అక్రమ వసూళ్ల నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం పేరిట మోసం చేశారు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మాజీ స్పీకర్ కోడెల కుమార్తె విజయలక్ష్మి, ఆమె అనుచరుడు కళ్యాణం రాంబాబు రూ.5.60 లక్షలు కాజేశారని వెంగళరెడ్డి కాలనీకి చెందిన షేక్ యాసిన్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి పట్టణంలో నిర్మించిన నూతన విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని రాంబాబు నమ్మబలికి విజయలక్ష్మి వద్దకు యాసిన్‌ను తీసుకు వెళ్లాడు. ఆమె ఉద్యోగం కావాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని కోరగా అంత చెల్లించలేనని రూ.5 లక్షల 60 వేలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇద్దరూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బ్రహ్మం తెలిపారు. -
‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు
నరసరావుపేట టౌన్: ‘కే’ట్యాక్స్ బాధితుల ఫిర్యాదుల మేరకు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె పూనాటి విజయలక్ష్మిలపై బుధవారం పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మితోపాటు కొల్లి ఆంజనేయులు, కొల్లి నరసింహారావు, పెద్దబ్బాయి మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.7 లక్షలు తీసుకొని మోసగించినట్లు పాతూరుకు చెందిన ఆళ్ల శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అళహరి శ్రీనివాసరావు తెలిపారు. సత్తెనపల్లికి చెం దిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జెల్ది ప్రసాద్ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి కులం పేరుతో దూషించిన కేసులో విజయలక్ష్మిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ చిన్న మల్లయ్య తెలిపారు. పూనాటి విజయలక్ష్మి తన అనుచరుల ద్వారా బెదిరించి అక్రమంగా రూ.10 లక్షలు వసూ లు చేసినట్లు ప్రకాష్‌నగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తాళ్ల వెంకట కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 384 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. ఈ ముగ్గురు బాధితులు మంగళవారమే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌కు అనుమతుల విషయంలో డాక్టర్ కోడెల శివరాం, పీఏ గుత్తా ప్రసాద్ తనను బెదిరించి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బిల్డర్ కోటపాటి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పొలం ఆక్రమిస్తామంటూ బెదిరించి కోడెల కుమార్తె విజయలక్ష్మి ఆమె అనుచరులు రాంబాబు, శ్రీనివాసరావు తన నుంచి రూ.15 లక్షలు వసూలు చేసినట్లు బాధితురాలు అర్వపల్లి పద్మావతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో నాలుగు ఫిర్యాదులు కోడెల శివరాం, పూనాటి విజయలక్ష్మిలపై ఐదు కేసులు నమోదు కాగా మరో నాలుగు ఫిర్యాదులు విచా రణ దశలో ఉన్నాయి. పొలం విషయంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి, రాంబాబు, శ్రీనివాసరావు తనను బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు నరసరావుపేటకు చెందిన సజ్జారావు శ్రీనివాసరావు ఫిర్యాదు చేయడంతో డబ్బులు వెనక్కి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భరోసా ఇవ్వడంతో వారంతా ఒక్కొక్కరే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పరారీలో కోడెల కుటుంబం నేరారోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరాం, విజయలక్ష్మి ప్రస్తుతం అజ్ఞాతంలోకి జారుకున్నారు. వారిని విచారించేందుకు పోలీసులు ఫోన్లు చేసినా స్పందన లేనట్లు తెలుస్తోంది. బాధితుల తాకిడితో వారిద్దరూ ఊరు విడిచి వెళ్లినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఓ బాధితుడికి డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలియడంతో మరికొందరు బాధితులు కోడెల నివాసం, కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. రుజువు చేయండి: కోడెల పాత గుంటూరు: తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. కేసులకు ఆధారాలు చూపించి రుజువు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో అభివృద్ధే ధ్యేయంగా శివప్రసాద్ పాలన సాగించారని చెప్పారు. -
కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు
‘కే’ ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం చేసిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఐదేళ్లుగా కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. అధికార బలంతో అణచివేతకు గురైన గొంతులు నేడు గళం విప్పుతున్నాయి. లక్షల రూపాయలను ముట్టచెప్పినా ఇంకా కావాలని వేధిస్తుండటంతో ఓపిక నశించిన బాధితులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నరసరావుపేట టౌన్: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోడెల శివరామ్ చేసిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ స్పీకర్ కోడెల తనయుడు కోడెల శివరామ్ గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని వ్యాపారులను బెదిరించి అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించారు. శివరామ్ అతని అనుచరులు డబ్బుల కోసం ఇంకా వేధిస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓ అపార్ట్మెంట్ అనుమతికి రూ.17 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించి అక్రమంగా వసూలు చేయటంపై బాధితుడి ఫిర్యాదుతో కోడెల శివరామ్ అతని ఆంతరంగికుడు గుత్తా నాగప్రసాద్, ఇంజినీర్ వేణుగోపాల్‌రావులపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. రామిరెడ్డిపేటకు చెందిన కె.మల్లికార్జున రావు రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు అనుమతుల కోసం ఇంజినీర్ ఉన్నం వేణుగోపాల్‌రావును రెండేళ్ల క్రితం సంప్రదించాడు. అనుమతులు కావల్సిన పత్రాలతో పాటు చెల్లించాల్సిన ఫీజులు, మామూళ్లు అందించాడు. అనుమతులు ఇప్పించకుండా వేణుగోపాల్‌రావు కాలయాపన చేస్తూ వచ్చాడు. పనులు ప్రారంభమై సగం పూర్తి అయిన సమయంలో కోడెల శివరామ్‌కు కప్పం చెల్లిస్తేనే అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తవుతుందని ఇంజినీర్ వేణు హెచ్చరించాడు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా మల్లికార్జునరావు నిర్మాణం కొనసాగించడంతో పంచాయతీ సెక్రటరీ భార్గవ్, ఈవోపీఆర్డీ శివసుబ్రహ్మణ్యం అక్కడకు వచ్చి పనులను నిలిపివేశారు. కోడెల శివరామ్‌కు కట్టాల్సిన మామూళ్లు (కేట్యాక్స్) చెల్లించిన తర్వాతే నిర్మాణం చేయాలని అలా కాదని నిర్మిస్తే జేసీబీతో కూల్చివేస్తామని బెధిరించారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు మల్లికార్జున రావును ఇంజినీర్ వేణు గుంటూరులోని కోడెల శివరామ్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ శివరామ్, అతని పీఏ గుత్తా నాగశివప్రసాద్ ఒక్కో ఫ్లాట్‌కు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసి అందరూ ఇస్తుంటే నువ్వెందుకు ఇవ్వవంటూ బెదిరించారు. నగదును వేణుకు అందించి పనులు ప్రారంభించుకోవాలని చెప్పటంతో వారి ఆదేశాల మేరకు రూ.17 లక్షలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని మొదట రూ.14 లక్షలు ముట్టచెప్పాడు. మిగిలిన రూ.3 లక్షల కోసం ఇంజినీర్ వేణు గత కొన్ని రోజులుగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ వ్యవహారాన్ని ఫోన్లో రికార్డు చేసి బాధితుడు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. సత్తెనపల్లి, రావిపాడు రోడ్లలో అపార్ట్మెంట్లు నిర్మించి కేట్యాక్స్లు చెల్లించిన మరికొందరు బాధితులు వన్‌టౌన్, రూరల్ పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వాపోయారు. కోడెల శివరామ్‌పై కేసు నమోదు... అపార్ట్మెంట్ అనుమతుల వ్యవహారంలో బెదిరించి నగదు వసూళ్లు చేసిన కోడెల శివరామ్, అతని పీఏ గుత్తా ప్రసాద్, ఇంజినీర్ వేణులపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్ఐ ఏవీ బ్రహ్మం తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసంలో విషాదం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సుబ్బాయమ్మ (85) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. సుబ్బాయమ్మ మృతి పట్ల పలువురు పార్టీ నేతలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి సంతాపం తెలిపారు. కాగా ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ అరవింద బాబుపై గెలుపొందారు. -
ఎస్ఐనంటూ యువతికి వల..!
సాక్షి, గుంటూరు: విజిలెన్స్ ఎస్ఐనంటూ యువతిని ప్రేమలోకి దింపి మోసగించిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న గన్మెన్ల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని యువతికి పంపి ప్రేమలోకి దించాడు. తర్వాత ఆమె తల్లి వద్ద రూ.12.50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపైనే నిందలు వేసి నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లి మంగళవారం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. నరసరావుపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్ ఫేస్బుక్లో రిక్వెస్టులు పెట్టి పరిచయమై తాను విజిలెన్స్ ఎస్ఐనంటూ తుపాకీ పట్టుకున్న ఫొటోను, ఓ నకిలీ ఐడీని యువతికి పంపాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతను ఎస్ఐ అని నమ్మిన యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు. బ్యాంకు లోను కింద రూ.15లక్షలు కట్టాల్సి ఉందని, డబ్బు ఇవ్వాలని కోరాడు. వారు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు. కొంతకాలం తరువాత పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపణలు చేశాడు. తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ డబ్బు అయినా ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సింది రూ.6 లక్షలే అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనిల్ ప్రవర్తన తో తన బిడ్డ జీవితం నాశనమైందని, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. -
కోడెలకు 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి..
సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన రకరకాల ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగితే టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు ఓడిపోతున్నారు అని తెలిసే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు తాత్కాలిక సీఎంగా ఉండి పోలవరంపై ఎలా రివ్యూ చేస్తావ్. ఇక కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. ఆయనపై ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కోడెల శివప్రసాద్ చేతిలో కీలుబొమ్మలా మారారు. కోడెలపై పోలీసులు ఎందుకు వెంటనే కేసు నమోదు చేయలేదు. కోడెల శివప్రసాదరావు పోలింగ్ కేంద్రాన్ని క్యాప్చరింగ్ చేసే వ్యక్తి. క్రిమినల్ మైండ్‌తో రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. ఆయన రిగ్గింగ్‌కు ప్రయత్నించడంతోనే ఇనిమెట్ల గ్రామస్తులు తిరగబడ్డారు. కోడెల 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. కోడెల నాకంటే కేవలం 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చి గెలిచారు. 23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్‌గా ఏం చర్యలు తీసుకున్నారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే నువ్వేం చర్యలు తీసుకున్నావ్. నరసరావుపేటలో కూడా టీడీపీ అభ్యర్థులని ఓడిస్తుంది నువ్వు కాదా?. కోడెలది దుర్మార్గపు మనస్తత్వం. నీ ఇంట్లో పేలిన బాంబుల వల్ల మరణించిన కుటుంబాలకు నువ్వేం చేశావ్. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు కోడెల నరకం చూపించారు. ఓటమి భయంతోనే కోడెల డ్రామాలు ఆడుతున్నారు. ఆయనతో పాటు కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లిన గన్మెన్లను కూడా వెంటనే సస్పెండ్ చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు సోదరి ప్రచారం
-
టీడీపీ అభ్యర్థిపై కేసు.. ఆయనే మా అమ్మ ప్రాణం తీశాడు!
నరసరావుపేట టౌన్ : నిర్లక్ష్యంగా వైద్యంచేసి వృద్ధురాలి మృతికి కారణమైన నరసరావుపేట అసెంబ్లీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబుపై కేసు నమోదైంది. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం టూటౌన్ పోలీసులను బాధిత కుటుంబ సభ్యులు కోరారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన పంపనాతి చిన్నయోగమ్మ (77) గతేడాది నవంబరు 6న ఇంట్లో జారిపడటంతో ఆమె ఎడమకాలు విరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను నరసరావుపేటలో డాక్టర్ అరవిందబాబు నిర్వహిస్తున్న అమూల్య నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అరవిందబాబు ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే, ఇంటికి వెళ్లిన రెండోరోజే కాలు నలుపుగా మారటంతో తిరిగి ఆస్పత్రికి వచ్చి చూపించారు. అయితే, భయపడాల్సిందేమీలేదని, క్రమంగా తగ్గుతుందని చెప్పి ఇంటికి పంపారు. కాలుకు స్పర్శ లేకపోవటంతో డాక్టర్ కోర్సు చదువుతున్న చిన్నయోగమ్మ మనవడు ఇది గమనించి వైద్యుడిని కలిసి నిర్లక్ష్యంపై ప్రశ్నించగా డాక్టర్ అరవిందబాబు దురుసుగా ప్రవర్తించారు. దీంతో అతడిపై రెండు నెలల క్రితమే టూటౌన్ పోలీసుస్టేషన్లో బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే, అధికార పార్టీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అనంతరం బాధితురాలిని గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కాలు తొలగిస్తేనే యోగమ్మ బతుకుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే మృతికి కారణం డాక్టర్ అరవిందబాబు నిర్లక్ష్యంవల్లే తన తల్లి మృతిచెందిందని ఆమె తనయుడు పంపనాతి వెంకటేశ్వర్లు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బి.ఆదినారాయణ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు వైద్యశాలలోని ఎముకల విభాగ వైద్యులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ అరవిందబాబుకు ఉన్న రాజకీయ పలుకుబడితో చర్యలకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారని బాధితులు వాపోయారు. కాగా, దీనిపై సీఐ ఆదినారాయణ మాట్లాడుతూ.. మృతురాలి కుమారుడు చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
గ్రామం ఒక్కటే..పేర్లు రెండు
సాక్షి, నరసరావుపేట : ఒకే గ్రామం.. కానీ రెండు నియోజకవర్గాలు. ఎదురెదురు ఇళ్లలోని వారు ఓటు వేసేది మాత్రం వేర్వేరు అభ్యర్థులకు. ఇటువంటి చిత్రమైన పరిస్థితి నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల సరిహద్దులోని రెండు గ్రామాల్లో నెలకొంది. కోటప్పకొండ సమీపంలోని యక్కలవారిపాలెం, కట్టుబడివారిపాలెం గ్రామాలు పేరుకే రెండు గ్రామాలు. ఒకే గ్రామంగా కలిసి ఉంటాయి. కేవలం రెండు గ్రామాలను విడదీసేది ఒక రోడ్డు మాత్రమే. రోడ్డుకు తూర్పున నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కట్టుబడివారిపాలెం ఉండగా, పశ్చిమాన నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని యక్కలవారిపాలెం గ్రామం ఉంది. ఎన్నికల సమయంలో రెండు నియోజకవర్గాల నాయకులు గ్రామాన్ని రెండు గ్రామాలుగా విడదీస్తున్న ఒకే మెయిన్‌రోడ్డుపై ప్రచారం చేస్తుంటారు. కొత్తపాలెం పరిస్థితి ఇదే.. కొత్తపాలెం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నరసరావుపేట మండలంలోని కొత్తపాలెం, చిలకలూరిపేట మండల పరిధిలోకి వచ్చే అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాలు రెండు కలిసే ఉంటాయి. ఈ రెండు గ్రామాలను కూడా విడదీసేది ఒకే రోడ్డు. రోడ్డుకు ఒక వైపు ఆమీన్సాహెబ్పాలెం(అవిశాయపాలెం), రెండో వైపు కొత్తపాలెం గ్రామాలున్నాయి. మిగిలిన సమయంలో రెండు గ్రామాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తుంటారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవి రెండు గ్రామాలని చెబితేగానీ తెలియదు. ఎన్నికల్లో మాత్రం ఇక్కడి ఓటర్లు తమ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల అభ్యర్థులకు ఓటు వేస్తుంటారు. -
వైద్యుడిపై పోలీస్ ఆఫీసర్ దాడి..!
సాక్షి, నరసరావుపేట రూరల్ : ఎన్నికల సమయంలో పోలీసులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన వీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట టూటౌన్ సీఐ ఆదినారాయణ.. అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న వైద్యునిపై అకారణంగా దాడికి పాల్పడి వీధి రౌడీలాగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ల ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరింది. ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన సుస్మిత ఆర్థో ట్రామాకేర్ సెంటర్లో రోగికి చికిత్స అందించేందుకు డాక్టర్ జయభారత్‌రెడ్డి తన కారులో అక్కడికి చేరుకున్నారు. కారు ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో ర్యాలీ రావడంతో అక్కడే విధుల్లో ఉన్న టూటౌన్ సీఐ ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న వాకీటాకీతో కారు అద్దంపై గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. డ్రైవింగ్ సీటులో ఉన్న డాక్టర్ జయభారత్‌రెడ్డిని కారు నుంచి బలవంతంగా చొక్కా పట్టుకుని కిందకు లాగి భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో జయభారత్‌రెడ్డి తాను డాక్టర్‌నని, రోగికి అత్యవసర చికిత్స అందించేందుకు వెళ్తున్నానని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ను గుర్తించిన స్థానికులు.. సీఐకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. కాగా, సంఘటనలో కారు అద్దం దెబ్బతినగా, డాక్టర్ జయభారత్‌రెడ్డి ఒంటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి చేరుకుని జయభారత్‌రెడ్డిని పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఐ దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. డాక్టర్ విధులకు ఆటంకం కలిగించిన సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ పట్టణ శాఖ అధ్యక్షుడు డా.ఏఏవీ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన సీఐ ఆదినారాయణపై జయభారత్‌రెడ్డి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
నరసారావు పేట వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్ధిలు నామినేషన్
-
నరసరావుపేటలో ఉద్రిక్తత..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని నరసరావుపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 12వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అయితే ఆయన ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు తమ వార్డులోకి రావద్దంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. -
ఉద్దండుల కోట.. నరసరావుపేట
సాక్షి,నరసరావుపేట: నరసరావుపేట అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు మొదటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఉద్దండులనే అందించాయనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. పలనాడు ముఖద్వారంగా ఉన్న నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం, గుంటూరు–ప్రకాశం జిల్లాలతో పాటు కలిసి కొన్నేళ్లపాటు కొనసాగిన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం మొదటి నుంచి విలక్షమైనవే. ఈ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన నల్లపాటి వెంకటరామయ్యచౌదరి ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర తొలిస్పీకర్‌గా 1953 నుంచి 1955 వరకు బాధ్యతలను నిర్వహించిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాసు బ్రహ్మానందరెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏడేళ్ల పాటు కొనసాగారు. కాసు కృష్ణారెడ్డి సైతం మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించి మంత్రి పదవులను చేపట్టారు. డాక్టర్ కోడెల అత్యధికంగా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వరుసుగా ఐదుమార్లు విజయం సాధించి, 12ఏళ్ల పాటు మంత్రివర్గంలో వివిధ శాఖలు నిర్వహించారు. పార్లమెంట్ సీటు రూటే సెపరేటు.. 1952లో నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా సీఆర్ చౌదరి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 1967, 71 ఎన్నికల్లో మద్ది సుదర్శనం రెండుసార్లు గెలుపొందగా, 1977, 1980లో కాసు బ్రహ్మానందరెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోంశాఖమంత్రిగా అత్యున్నత పదవిని చేపట్టారు. ఆయనతో పాటు కాసు వెంకటకృష్ణారెడ్డి సైతం రెండుసార్లు ఎంపీగా విజయాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 1999లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి, 1998లో మరో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2009లో మోదుగుల వేణుగోపాలరెడ్డి, 2014లో రాయపాటి శంభశివరావు ఎంపీలుగా ఇక్కడి నుంచి గెలిచినవారే. -
అధికార పార్టీ కాలనీకి పోలింగ్ బూత్ మార్చారు..
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా, నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలోని రొంపిచర్ల గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న బీసీ కాలనీలోని పోలింగ్ బూత్‌ను, అధికార పార్టీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి మార్చడంపై హైకోర్టు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారిని వివరణ కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ప్రాంతంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారని, అయితే ఇప్పుడు దానిని అధికార పార్టీకి చెందిన అగ్రకులాల వారు ఉన్న ప్రాంతానికి మార్చారని, దీని వల్ల తాము స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదంటూ దానమ్మ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్యాంసుందర్ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోటే పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగానే బీసీ కాలనీలో పోలింగ్ బూత్ ఉండేదని, ఇప్పుడు దానిని వేరే చోటుకు మార్చారన్నారు. అగ్రవర్ణాలు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పోలింగ్ బూత్‌ను మార్చారని, దీని వల్ల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని తెలిపారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ..పిటిషనర్‌ది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. తహసీల్దార్ నివేదిక ఇచ్చిన తరువాతనే పోలింగ్ బూత్‌ను మార్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కౌంటర్ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. -
హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా!
సాక్షి, గుంటూరు : ‘హవ్వ.. మరీ ఇంత కక్కుర్తా.. డబ్బు కోసం ఇంతకు దిగజారాలా.. పేదవాడి నోటి కాడ కూడును కూడా లాగేసుకుంటారా.. అన్న క్యాంటిన్లలోని భోజనం తరలించి సొమ్ము చేసుకుంటారా..’ అంటూ టీడీపీ నేతల వైఖరి చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లిలో ముఖ్య నేత తనయుడు, తనయ.. అన్న క్యాంటిన్లో భోజనాలను కూడా అమ్ముకుంటున్న దిగజారుడుతనాన్ని చూసి ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలు తార స్థాయికి చేరాయి. మరీ ముఖ్యంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అయితే ముఖ్య నేత కుమారుడు, కుమార్తెల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వీరి కన్ను ఇప్పుడు అన్న క్యాంటిన్లపైనా పడింది. అన్న క్యాంటిన్లలో రూ.5కే భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని ముఖ్యనేత కుమార్తెకు చెందిన ఓ వ్యాపార సంస్థకు మధ్యాహ్నం 150, సాయంత్రం 150 చొప్పున రోజుకు 300 భోజనాలను చేరవేస్తున్నారు. అన్న క్యాంటిన్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. పోనీ తమ కంపెనీలో పనిచేసే కార్మికులకైనా ఉచితంగా భోజనాలు పెడుతున్నారా అంటే అదీ లేదు.. ఒక్కో భోజనానికి కార్మికుల వద్ద నుంచి రూ.25 వసూలు చేస్తున్నట్టు సమాచారం. దీన్ని బట్టి రోజుకు భోజనాల ద్వారా కార్మికుల నుంచి రూ.7,500 చొప్పున నెలకు రూ.2.25 లక్షలు.. దోచేస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేదలకు పెట్టే అన్నంలోనూ అంత కక్కుర్తి అవసరమా అంటూ ముఖ్యనేత కుటుంబ సభ్యులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కే ట్యాక్స్ కట్టాల్సిందే.. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం, వ్యాపార సముదాయాల విస్తరణ పూర్తిగా నిలిచిపోయిందంటే వీరు ఏ స్థాయిలో ‘కే’ (వారి ఇంటి పేరు) ట్యాక్స్ వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీపై విమర్శలు చేస్తున్న అధికార పార్టీ నేతలు.. రాజ్యాంగ బద్ధమైన పదవిలో కొనసాగుతున్న ముఖ్యనేత కొడుకు, కూతురు ప్రజలపై విధిస్తున్న కే ట్యాక్స్‌పై నోరు మెదపలేకపోతున్నారు. ఇవేకాకుండా పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్న వారి నుంచి కూడా మామూళ్లు వసులుచేస్తున్నారు. చివరికి వారు తమ పార్టీ వారైనా సరే వదిలిపెట్టడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. రేషన్ మాఫియా దగ్గర నుంచి భూ కబ్జాల వరకూ దేన్నీ వదలడం లేదు. చివరకు కోటప్ప కొండ పండుగను సైతం తమ ధన దాహానికి వాడుకుని త్రికోటేశ్వరుని పవిత్రతకు భంగం కలిగించారు. తమ అనుచరుల ద్వారా కోడి పందాలు, గ్యాంబ్లింగ్, కోత ముక్కాటలను నిర్వహించి జనం వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబులు నింపుకొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే నాలుగున్నరేళ్లలో వీరు చేసిన అవినీతి దందా వెయ్యి పేజీల పుస్తకమవుతుందని స్థానికులు వాపోతున్నారు. -
గుంటూరు:నరసారావుపేటలొ ఉద్రిక్తత
-
టీడీపీ కార్యకర్తల హల్చల్: నరసరావుపేటలో ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలు హద్దుమీరుతున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే ఇంటిముందుకు చేరుకున్న కార్యకర్తలు ఆ పార్టీ నాయకుడు కోడెల శివరామ్ పుట్టిన రోజు వేడుకలను జరిపారు. టీడీపీ ఫ్లెక్సీలు చూపుతూ.. నినాదాలు చేస్తూ హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది సరైన పద్దతి కాదంటూ అభ్యంతరం వ్యకం చేసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను తరిమికొట్టారు. -
పేటలో బరితెగింపు
పేకాటను కట్టడి చేయాల్సిన పోలీసులే కాపు కాస్తున్నారు.. అరికట్టాల్సింది వారే ఆటాడిస్తున్నారు.. భయపెట్టాల్సి వారే ముడుపుల ముందు మోకరిల్లుతున్నారు. అధికార పార్టీ ఆగడాలను ఆడ్డుకోవాల్సిన వారే అన్యాయాలకు రక్షణ కంచె కడుతున్నారు. ఇదే అదనుగా నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహిస్తూ టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. అమాయక నిరుపేదలను జూదానికి బలి చేసి పచ్చని కుటుంబాల్లో కన్నీటి చిచ్చు రేపుతున్నారు. పర్యవేక్షించాల్సిన పోలీసు ఉన్నతాధికారులు కళ్లుమూసుకుని పోలీసు చట్టాలను వల్లె వేస్తున్నారు. నరసరావుపేట టౌన్: నరసరావుపేట డివిజన్లో జూదం మళ్లీ పురుడు పోసుకుంది. కొంత మంది అవినీతి అధికారుల పుణ్యమా అంటూ జూదం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఫలితంగా అనేక కుటుంబాలు రోడ్డున పడాల్సిన దుíస్థితి నెలకొంది. నివారణకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసు సిబ్బందిలో కొందరు జూదంలో ప్రత్యక్షంగా, మరి కొందరు ముడుపులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కోడి పందేలకు రంగం సిద్ధం నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాల్లొ పేకాట జోరుగా కొనసాగుతుంది. దీనికి తోడు ఏడాది చివరి రోజు వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కోడి పందేలు నిర్వహించేందుకు అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. నరసరావుపేట, రొంపిచర్ల మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఓ సరివి తోటలో సోమవారం రాత్రి కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికిగాను ఓ పోలీస్ అధికారి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ నేతలు, కొందరు పోలీసుల అండతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పేకాట రాయుళ్లు వస్తున్నారు. ప్రస్తుతం డివిజన్లో పోలీసుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూదంపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొరవడింది. దీన్ని ఆసరాగా చేసుకొన్న అక్రమార్కులు కొంత మంది పోలీసు సిబ్బందికి ముడుపులు చెల్లించి జూదం కొనసాగిస్తున్నారు. ఉత్తుత్తి దాడులే.. మండలంలోని లింగంగుంట్ల కాలనీ శివారులో గత బుధవారం రాత్రి దాడులు 8 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేసి 8 ద్విచక్రవాహనాలు, సుమారు రూ.లక్షా నలభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అనేక సార్లు లింగంగుంట్ల పరిసరాల్లో పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. ఇక్కడ ఒక వ్యక్తి జూదం నిర్వహిస్తూ అనేక మార్లు పట్టుబడినా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఉప్పు అందిస్తున్న సిబ్బంది దాడులు చేసేందుకు పోలీసులు లింగంగుంట్లకు వెళ్లే లోపే కొందరు పోలీసులు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. దీంతో పేకాట రాయుళ్లు పరారవుతున్నారు. గత బుధవారం అధికారులు దాడులకు వెళ్లే కొద్ది నిమిషాల వ్యవధిలోనే అప్పటి వరకు లక్షల్లో పందేలు కాసిన సుమారు 20 మంది జారుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో దీర్ఘకాలికంగా పని చేస్తున్న సిబ్బంది ఒకరు ముందస్తుగా ఉప్పు అందించినట్లు సమాచారం. పట్టుబడ్డ వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు లింగంగుంట్లలో జూదం ఆడుతూ పట్టుబడ్డవారిలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండటం గమనార్హం. క్రికెట్ బెట్టింగ్‌లో రెండు నెలల క్రితం ఓ కానిస్టేబుల్ పట్టుబడ్డారు. పట్టుబడ్డ కానిస్టేబుళ్లలో ఒకరు జిల్లా రూరల్ ఎస్పీ టీంలో విధులు నిర్వహిస్తుండటంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొరవడిన పర్యవేక్షణ.. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావును వారం రోజుల క్రితం తిరుపతికి బదిలీ చేసి ఆయన స్థానంలో సత్తెనపల్లి డీఎస్పీ వీ కాలేషావలిని ఇన్చార్జిగా నియమించారు. డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకపోవటాన్ని ఆసరాగా చేసుకున్న కొంత మంది అవినీతి అధికారులు, సిబ్బంది పేకాట నిర్వహించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యంగా నాదెండ్ల మండలం, లింగంగుంట్ల కాలనీ, కోటప్పకొండ, పమిడిపాడు, రెడ్డిపాలెం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు, పేకాట, జూదం ఎక్కువగా సాగుతున్నాయి. జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు పేకాటలో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులకు నివేదించాం. పేకాట, కోడి పందేల నిర్వహణపై సమాచారం ఉంటే తెలియజేయాలి. అక్రమార్కులకు సహకరిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు. జూదగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం. –కాలేషావలి, డీఎస్పీ -
శివశివా.. ఇదేం ఇంటిపోరు!!
సాక్షి, గుంటూరు: ఇంటి పోరు ఇంతింత కాదయా అన్నాడు ఓ కవి. దాని వల్ల ఇంటి యజమానికి ఇబ్బంది సహజమే. అయితే రాజ్యాంగ పదవిలో ఉన్న నేత ఇంట్లో పోరు మాత్రం ప్రజలను ఇక్కట్లు పాలుజేస్తోంది. గత కొంతకాలంగా గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ పోరు తారస్థాయికి చేరింది. సత్తెనపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఉన్న కాంప్లెక్సు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపుల కేటాయింపు ఆ నేత ఇంట్లో చిచ్చు రేపాయి. తాను చెప్పిన వారికే షాపులు కేటాయించాలని కూతురు పట్టుబడుతుండగా, ఇక్కడ ఆమె పెత్తనం ఏమిటంటూ కొడుకు మండిపడుతుండటంతో ఏం చేయాలో తెలియక సదరు నేత తలపట్టుకుంటున్నారు. కొడుకు, కూతురు మధ్య వివాదం తీర్చలేక ఆ నేత చేతులు ఎత్తేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి పోరుతో సత్తెనపల్లిలో కొన్ని నెలలుగా షాపులు కేటాయింపు జరగక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. షాపుల కేటాయింపులో రగడ.. సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్సు నిర్మించారు. అందులో కింద తొమ్మిది గదుల్లో గతంలో ఉన్నవారే వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం వీటిపైన మరో ఎనిమిది షాపులు నిర్మించారు. ఈ షాపులను ఎవరికి కేటాయించాలనే దానిపై రాజ్యాంగ పదవిలోని నేత తనయ, తనయుల మధ్య వివాదం ఏర్పడింది. ఎనిమిది షాపులను మెడికల్ షాపులకు కేటాయించి మెడికల్ కాంప్లెక్సుగా మార్చాలని కుమార్తె ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం మెడికల్ షాపుల నిర్వాహకులు ఒక్కో షాపునకు రూ. 5 లక్షలు చొప్పున చెల్లించారని సమాచారం. షాపుల నిర్మాణం చేపట్టే సమయంలోనే వీటిని తమ అనుయాయులకు కేటాయించి అందుకు తగిన ప్రతిఫలం పొందేలా కుమారుడు కొందరు వ్యాపారులకు హామీ ఇచ్చేశారని తెలుస్తోంది. సోదరి ప్రయత్నాలు తెలిసి ఆ నేత కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశారని, రాజకీయ వ్యవహారాలన్నీ తాను చూసుకుంటుంటే, ఇందులో ఆమె పెత్తనం ఏమిటంటూ గొడవకు దిగారని సమాచారం. తన మాట కాదని మెడికల్ షాపులకు ఇస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించినట్లు సమాచారం. దీంతో కొడుకు, కూతురు మధ్య సయోధ్య కుదర్చలేక సదరు నేత తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మరోపక్క సత్తెనపల్లిలోని ఏరియా వైద్యశాల ఎదురుగా మున్సిపల్ అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇందులో కింద 11 గదులు ఉండగా, పైఅంతస్తులో సైతం షాపులు నిర్మించేందుకు స్లాబు వేసి ఉంచారు. షాపులను టీడీపీ కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి ఒక్కోటి చొప్పున కేటాయిస్తానంటూ ఆ నేత తనయుడు కౌన్సిలర్లకు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా సదరు నేత ఇంటి పోరుతో వాటిని తమకు కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి షాపుల కేటాయించాలని కోరుతున్నారు. -
మర్యాదగా సీటు ఇవ్వకుంటే అంతు చూస్తా
సాక్షి, నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం జరిగింది. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే ఆర్టీసీ బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేవాలని కోరాడు. దానికి వారు నిరాకరించటంతో మర్యాదగా లేచి సీటు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. సీట్లో కూర్చొని ఉన్న మహిళా ప్రయాణికురాలిని సైతం అసభ్యపదజాలంతో దూషించాడు. ఇష్టారాజ్యంగా ప్రయాణికులతో వాదనకు దిగటంతో బస్సు డ్రైవర్ ప్రయాణికులకు సర్దిచెప్పి సీటు ఖాళీ చేయించి ఇప్పించాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు అనటంతో దిక్కున్నచోట చెప్పుకోమని కానిస్టేబుల్ బెదిరించాడు. విధినిర్వహణలో మద్యం తాగి వచ్చి కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించాడని ప్రయాణికులు వాపోయారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
టోపీ ఉంటే టోకెన్ ఇవ్వం
నరసరావుపేట టౌన్: ‘నారా హమారా–టీడీపీ హమారా’ పేరుతో ఎన్నికల వేళ ఓట్ల కోసం సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు సర్కారు నిజ స్వరూపం తేటతెల్లమైంది. ఆయన పాలనలో ముస్లింలు ఎదుర్కొంటున్న వివక్ష మరోసారి బయటపడింది. నమాజ్ చేసే టోపీ ధరిస్తే అన్న క్యాంటీన్లో భోజనం పెట్టబోమంటూ వృద్ధుడైన ఓ నిరుపేద ముస్లింను గెంటివేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు పూటలా నమాజ్ చేస్తానన్న గాలిబ్.. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం పెదతురకపాలెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గాలిబ్‌సాహెబ్ రెండు రోజుల క్రితం భోజనం చేసేందుకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల స్టేడియం వద్ద ఉన్న అన్నక్యాంటీన్కు వెళ్లాడు. టోకెన్ కోసం క్యూలో నిలబడగా తలపై ఉన్న టోపీని తొలగించాలని కౌంటర్లో ఉన్న సిబ్బంది పేర్కొన్నారు. గాలిబ్‌సాహెబ్ ఇందుకు నిరాకరిస్తూ తాను నిత్యం అల్లాను స్మరిస్తూ ఐదు పూటలా నమాజ్ చేస్తానని, టోపీ తీయడం సరికాదని బదులిచ్చాడు. సెల్ నంబరు చెప్పాలని సిబ్బంది సూచించగా తాను 70 ఏళ్ల వయసులో రోజువారీ కూలీకి అరటికాయల వ్యాపారం చేస్తుంటానని, తనకు సెల్ లేదని, అది ఎలా వాడాలో కూడా తెలియదని తెలిపాడు. అయితే భోజనం టోకెన్ ఇచ్చేది లేదంటూ బయటకు వెళ్లాలని క్యాంటీన్ నిర్వాహకులు ఆయన్ను ఆదేశించారు. తాను 1983 నుంచి టీడీపీ కార్యకర్తనని, ప్రభుత్వం పేదల కోసం అన్న క్యాంటీన్ నిర్వహిస్తుంటే భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ గాలిబ్ సాహెబ్ అభ్యంతరం తెలపడంతో సెక్యూరిటీ గార్డును పిలిచి బలవంతంగా గెంటేశారు. గాలిబ్‌సాహెబ్ తనకు జరిగిన ఈ అవమానం గురించి విలేకరులకు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. -
మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే వారికి భయం
-
కనకమ్ము మోగింది
కంచు మోగుతుందని తెలుసు.కంచు మోగినట్టు కనకమ్ము మోగదని తెలుసు.కానీ, నేరం దాగదు.దుర్భుద్ధి బయటపడకా మానదు.దొంగ బంగారం నిప్పులా కాలుతుంది.దొంగ దొరికేవరకు మోగుతూనే ఉంటుంది. డిసెంబర్ 26, 2006.ఉదయం 7 గంటలు.గుంటూరు జిల్లా నరసరావుపేట.చలి దుప్పటి కప్పుకున్న సూర్యుడు బద్దకంగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. జనం వెచ్చదనాన్ని తొడుక్కోవడానికి ఇళ్ల నుంచి మెల్లగా బయటకు వస్తున్నారు. కొంతమంది చలిని ధిక్కరిస్తూ పనుల్లో పడిపోయారు.ఆ సమయంలోనే చిన్న కలకలం.గీతామందిర్ రోడ్డులో పోలీసుల వాహనాలు ‘రయ్మ’ని దూసుకుపోతున్నాయి.వెనకనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లూ దౌడు తీస్తున్నాయి.దుమ్ము రేపుకుంటూ వెళుతున్న వాహనాలను చూసి ‘ఏం జరిగిందిరా..’ అని ఆందోళనగా అడిగాడు టీ స్టాల్ యజమాని తన సర్వెంట్‌తో. ‘అదే తెలియడం లేదు ..’ వాహనాలు వెళ్లినవైపునే చూస్తూ అన్నాడు సర్వెంట్.చుట్టుపక్కల వాళ్లు ఏం జరిగిందని తెలుసుకునే లోపునే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. ‘నరసరావుపేటలో బ్యాంకు దోపిడీ’ అని. దోపిడి ఎలా జరిగిందనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇంతకూ ఏం జరిగింది? నరసరావుపేట గీతామందిర్ రోడ్డులోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు.డిశంబరు 22న పనివేళలు ముగియగానే సిబ్బంది ఎప్పటిలాగే తాళాలు వేసి వెళ్ళారు.23, 24, 25 తేదీలు వరుసగా సెలవులు. 26వ తేదీ ఉదయం 6:15 గంటలకు బ్యాంక్ మెసెంజర్ కమ్ స్వీపర్ వెంకటేశ్వర్లు బ్యాంకు తాళాలు తీసేందుకు వచ్చాడు.కాని బ్యాంకు మెయిన్‌డోర్ తాళాలు తీసి పక్కన పడేసి వుండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి ‘సార్, బ్యాంక్‌లో దొంగలు పడ్డట్టున్నారు. తాళాలు పగలగొట్టి కిందపడేసి ఉన్నాయి’ అన్నాడు. హుటాహుటిన మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించి బ్యాంకుకు చేరుకున్నాడు.సీఐ ప్రసాద్ బ్యాంకు వద్దకు చేరుకొని, బ్యాంక్ మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉండటం గమనించి, విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.ఎస్పీ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్లూస్, డాగ్ స్వా్కడ్లకు సమాచారం చేరింది.వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. బ్యాంకు లోపలంతా పరిశీలించారు. ఎక్కడా ఫైళ్లు గానీ, ఫర్నీచర్‌గానీ దెబ్బతినలేదు. బంగారం ఉంచిన లాకర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. ఆ లాకర్ని గ్యాస్ కట్టర్‌తో కట్ చేశారు నిందితులు. అందులో వున్న రూ 3.75 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయని తేలింది. దాదాపు కిలో బంగారపు ముద్ద కిందపడి ఉండటం గమనించారు. లాకర్‌ను కట్ చేసే క్రమంలో వేడికి ఆభరణాలు కరిగి ముద్దగా మారి ఉంటాయి. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో బ్యాంకు వైపుగా వచ్చేవారు లేకపోవడంతో గుర్తించడానికి సమయం పట్టింది. నగదు పోలేదని నిర్ధారణకు రావడంతో ఇది ఎవరో తెలిసిన వ్యక్తుల పనేనని పోలీస్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. బ్యాంకులో పనిచేసే సిబ్బంది అందరినీ విచారించారు. ఎవరినీ అనుమానించలేని విధంగా సమాధానాలు రావడంతో మిస్టరీని ఛేదించలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ అప్పటి మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించింది.రెండేళ్లు గడిచాయి. నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో కేసును 2008 నవంబరు 24న సెంట్రల్ క్రై ం స్టేషన్ (సీసీఎస్)కు బదిలీ చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు సిబ్బందిని మరోసారి విచారించారు. అందరి జీవనవిధానాన్ని పరిశీలనలో ఉంచారు. బ్యాంక్ స్వీపరు కమ్ మెసెంజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లు దగ్గర బ్యాంకు మెయిన్‌డోరు తాళాలు ఉంటాయి. ముందుగా చిన్నవెంకటేశ్వర్లను పోలీసుస్టేషన్‌కి పిలిపించారు.‘వెంకటేశ్వర్లూ.. దోపిడీకి ముందు వారం రోజులు ఏమేం జరిగిందో చెప్పు..’ అని అడిగారు. ‘సార్.. నాకేం తెలియదు. మెయిన్ డోర్ తాళాలు ఒక్కటే నా దగ్గర ఉంటాయి. రోజూ వచ్చి బ్యాంకు తలుపులు తీసి చిమ్ముతుంటాను. లోపలి తాళాలు నా దగ్గర ఉండవు.. ’ అతను చెబుతుండగానే ‘మాకుతెలుసు. దొంగతనం జరగడానికి వారం ముందు ఏమైందో అది చెప్పు’ మరోసారి రెట్టించారు. అతని దగ్గర నుంచి వస్తున్న వాసనను పసిగట్టి ‘నువ్వు మందు తాగుతావా’ అని అడిగారు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకొని ‘అప్పుడప్పుడు తాగుతాను సార్’‘దొంగతనానికి ముందు వారంలో ఎవరెవరితో కలిసి మందు తాగావు ’కొన్ని నిమిషాలు ఆలోచనలో పడ్డ వెంకటేశ్వర్లు..‘స్నేహితులతో కలిసి తాగాను సార్. గోవిందం, రాములు, ఖాజాబాబు..’ అని పేర్లు చెబుతుండగా..‘ఖాజాబాబు ఎవరు?’ అని అడిగారు.‘బ్యాంకు అప్రయిజర్ వహీద్ కొడుకు సార్’పోలీసులకు ఏదో అర్ధమైనట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.‘కేసు పూర్తయ్యేవరకు స్టేషన్‌కి వస్తూ ఉండాలి’ ఆర్డర్ వేశారు పోలీసులు. అలాగే అంటూ వారి వద్ద సెలవు తీసుకున్నాడు వెంకటేశ్వర్లు. అప్పటికే అబ్దుల్ వహీద్ అతని కొడుకు ఖాజాబాబుకు సంబంధించిన ఫైల్ టేబుల్ మీద ఉంది. ఈ మధ్య కాలంలో వాళ్లు భారీగా స్థలాలు, వాహనాలు కొనుగోలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి.‘అబ్దుల్ వహీద్, ఖాజాబాబుల ఆస్తుల వివరాలే క్లూ అవనున్నాయా!’ ఫైల్ ఓపెన్ చేస్తూ అన్నాడు సీఐ.‘సార్, అతనికి సంపాదించే కొడుకులు ఉన్నారు. వారి పిత్రార్జితం ఆస్తి కూడా వచ్చిందని తెలుస్తోంది. అతన్నెలా అనుమానించగలం..’ అంటున్న సిబ్బందిని వారిస్తూ.. ‘గతంలో అతనికి పెద్దగా ఆస్తులు లేవు. కానీ ఈ రెండేళ్లలోనే అతనూ, అతని కొడుకు కొన్న ఆస్తుల వివరాలు ఇవి. ఒక సాధారణ ఉద్యోగి ఇతను. ప్రస్తుత ఖర్చు లక్షల్లో ఉంది. ఇందంతా ఎలా సాధ్యం? ఈ రెండేళ్లలో బ్యాంకు మిగతా సిబ్బంది ఆస్తులు కొన్నట్టు రుజువులు లేవు. బ్యాంకు దోపిడీ ఒక్కరితో అవదు. ఇది కొంతమంది కలిసి చేసిన పని. బంగారం మాత్రమే దోపిడీ జరిగిందంటే తెలిసినవారి పనే అయ్యుండాలి. విచారిస్తే .. వివరాలు అవే తెలుస్తాయి’ దృఢంగా అన్నాడు సీఐ.అంతే, తర్వాత పోలీసుల పని వేగవంతమైంది. అబ్దుల్ వహీద్, ఖాజాబాబులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.విచారించడం మొదలుపెట్టారు. వివరాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బ్యాంక్ అప్రయిజర్‌గా పని చేస్తున్న వహీద్‌కు బ్యాంకులో తాకట్టుగా చాలా బంగారం వచ్చి చేరిందని అర్థమైంది. దాని మీద అతడు కన్నేశాడు. అయితే బ్యాంకులోకి అడుగుపెట్టడం చాలా కష్టమైన పని. ముఖ్యంగా మెయిన్‌డోర్‌ను ఛేదించాలి. ఛేదించాలంటే వాటి తాళాలు కావాలి. అందుకే తన కుమారుడు ఖాజాబాబును రంగంలోకి దించాడు. తండ్రి కోసం బ్యాంకుకు వస్తూ పోతున్నట్టు నటించిన ఖాజాబాబు వెంకటేశ్వర్లుతో స్నేహం చేశాడు. అతనికి మద్యం బలహీనత ఉన్నట్టు కనిపెట్టి తరచూ తాగుడులో కూచోబెట్టేవాడు. ఒకరోజు మద్యం మత్తులో వుండగా అతని వద్ద వున్న బ్యాంక్ మెయిన్ డోర్ తాళాల ముద్రలను సేకరించాడు ఖాజాబాబు. తర్వాత ఆ ముద్రలతో డూప్లికేట్ తాళాలు చేయించాడు. తండ్రితో పాటు బందువు జానీబాషా, గ్యాస్ కట్టర్ షేక్ సుబానీ, స్నేహితులైన షేక్ మౌలాలి, అబ్దుల్ ఖాదర్, పఠాన్ ములాసాఫ్లను ఈ దోపిడీలో భాగస్తులను చేసి, ప్లాన్ రచించాడు ఖాజాబాబు. డిసెంబరు 22 అర్థరాత్రి డూప్లికేట్ తాళాలతో సునాయాసంగా బ్యాంకు తలుపులు తెరిచి, లోపలకు వెళ్లారు.బ్యాంకులో బంగారం ఎక్కడ ఉంచుతారో వహీద్‌కు తెలుసు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం లాకర్ రూమ్ తాళాలను పగలగొట్టారు. అయితే, లాకర్ని తెరవడం అంత సులువు కాలేదు. గ్యాస్ కటర్ షేక్ సుభాని కటర్‌తో లాకర్ని తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ కటింగ్ టైమ్‌లోనే వేడికి లాకర్లో ఉన్న బంగారం కొంత కరిగి కిందపడింది. లాకర్ని కట్ చేసి లోపలున్న బంగారం తీసి మూటగట్టారు.వచ్చిన దారినే చీకట్లో కలిసిపోయారు.దోపిడీ చేసిన బంగారంమూటను టౌన్‌లోని వరవకట్ట సమీపంలోని బావిలో పడేశారు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.తర్వాత శని, ఆది, సోమవారం క్రిస్మస్.. ఇలా వరసగా సెలువులు అవడంతో విషయం వెలుగులోకి రాలేదు.విచారణలోనూ వీరి మీద అనుమానం ఎవరికీ రాలేదు.మూడు నెలలు ఓపిక పట్టారు.తర్వాత బంగారం మూటను బావిలో నుంచి బయటకు తీసి, కరిగించి, బిస్కెట్ల రూపంలోకి మార్చారు. వాటిని అమ్మి నగదు చేసుకున్నారు. కొంత బంగారాన్ని అందరూ కలిసి పంచుకున్నారు. దీంట్లో పెద్ద మొత్తం వహీద్, ఖాజాబాబులు సొంతం చేసుకున్నారు. పోలీసులు రికవరీలో భాగంగా బంగారంతో పాటు వారందరి స్థిర, చర ఆస్తులనూ సీజ్ చేశారు. సీసీఎస్ సీఐ విజయభాస్కరరావు దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా ఇద్దరు కానిస్టేబుళ్ళు బి.నరశింహారావు, అబ్రహాంలను పూర్తి స్థాయిలో నిఘాకు కేటాయించారు. బ్యాంకు సిబ్బంది లావాదేవీలు గమనించడమే వీరి పని. ఎవరూ పెద్దగా ఆస్తుల కొనుగోళ్లకు దిగలేదు. కాని వహీద్ జీవన శైలి మాత్రం ఒక్కసారిగా మారింది. అదే క్లూగా తీసుకుని పై అధికారులకు తెలియచేశారు కానిస్టేబుళ్లు. దీని ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. దోపిడీకి పాల్పడింది బ్యాంకు అప్రయిజర్ వహీద్, అతని బృందమే అని నిర్ధారించారు. 2009 జూన్ 5న అప్పటి ఎస్పీ లడ్హా కేసు దర్యాప్తులో ప్రతిభను చూపిన సీఐ సి.విజయ భాస్కరరావు, కానిస్టేబుళ్ళు అబ్రహాం, నరశింహారావులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. స్వా«ధీనం చేసుకున్న రూ 3.25 కోట్ల విలువచేసే బంగారం, వాహనాలు, స్థలాలను కోర్టుకు అప్పగించి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. ఒరిజినల్‌గా పడే కష్టంతో వచ్చే సంపాదనలో ప్రశాంతత ఉంది.ఎప్పుడైతే డూప్లికేట్ మార్గంలో దిగుతామో జీవితం నాశనమవుతుంది. – వుయ్యూరు శ్రీహరిబాబు, గుంటూరు -
కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు
గుంటూరు జిల్లా: నాపై ఆరోపణలు చేసిన కోడెల శివరామ్ బహిరంగ చర్చకు పోలీసు పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్‌లతో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..సత్తెనపల్లి, నరసరావుపేటలో కోడెల కుటుంబం ఎన్నో భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. రైల్వే కాంట్రాక్టర్లను కమిషన్ కోసం కోడెల శివరాం బెదిరించాడని, సత్తెనపల్లిలో మిఠాయి దుకాణం దగ్గర కూడా మామూళ్లు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో గుంటూరులో రూ.150 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని చెప్పారు. సొంత కార్యకర్తల గురించి కూడా కోడెల పట్టించుకోరని విమర్శించారు. ప్రస్తుతం నరసరావుపేటలో ప్రశాంత వాతావరణం ఉందని, దానిని చెడగొట్టవద్దని విన్నవించారు. కోడెల కుటుంబం వల్ల మళ్లీ ఉద్రిక్తత నెలకొంటోందని వ్యాఖ్యానించారు. అవాంఛనీయ శక్తులను తరిమికొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కడం దారుణం
నరసరావుపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల గొంతును వినపడనీయకుండా అణచివేయాలనుకోవటం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో అవినీతికి చిరునామాగా కోడెల కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నరసరావుపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన సభను జరగనీయకుండా తనతో పాటు కొంతమంది నాయకులను హౌస్ అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడుతో కలసి పాత్రికేయులతో మాట్లాడారు. స్థల వివాదంలో తాను లూథరన్ అంధుల పాఠశాల ఉన్న ఏఈఎల్సీ సంస్థ చైర్మన్‌ను కలిశానని చెప్పారు. ఆయన తాము ఎవ్వరికీ లీజుకు ఇవ్వలేదని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న వారు కూడా శుక్రవారం పాత్రికేయులతో మాట్లాడుతూ తాము లీజుకు తీసుకోలేదని, కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారన్నారు. తాము లీజుకు తీసుకున్నట్లు డాక్యుమెంట్ తీసుకొస్తే వెంటనే తమ ఖర్చులతో తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తామని వారు ప్రకటించారన్నారు. ఈ వ్యవహారంలో నకిలీ లీజు అగ్రిమెంట్‌ను టీడీపీ నాయకులు సృష్టించారని గోపిరెడ్డి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు సాయితేజ డెవలపర్స్ పేరుపై ఒక సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధం చేసుకున్నారని, దానిలో ఏడుగురు వ్యక్తుల పేర్లు ఉండగా అందులో ముగ్గురు టీడీపీకి చెందినవారని గోపిరెడ్డి వివరించారు. వారిపేర్లు బయటపెట్టకుండా కేవలం వైఎస్సార్సీపీకి చెందిన వారి పేర్లే బయటపెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. గుంటూరులో సంగతి మాట్లాడరే ? గుంటూరులో ఏఈఎల్‌సీకి చెందిన ఆరు ఎకరాలు మంత్రి నక్కా ఆనందబాబు చేతిలో ఉన్నాయని గోపిరెడ్డి చెప్పారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన గ్రాండ్ హోటల్ నాగార్జున ఏఈఎల్సీ స్థలంలో నిర్మించినదేనని తెలిపారు. టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు స్థలం లీజుకు తీసుకొని రమేష్ హాస్పిటల్స్ నిర్మించేందుకు ఇచ్చారన్నారు. వీరందరూ టీడీపీకి చెందినవారేనని గుర్తు చేశారు. వీరు తీసుకున్నప్పుడు ఆందోళనలు, ఉద్యమాలు ఎందుకు చేయలేదని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కేవలం సంబంధం లేని వ్యవహారాన్ని తనకు చుట్టి తనపై బురదచల్లేందుకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తనపై కల్తీ పాలు, టీటీడీ లేఖలు అంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారని, అయితే ఏ విచారణకైనా తాను సిద్ధమని సవాల్ విసిరినా వారు స్వీకరించటం లేదని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం వారి చేతిలో ఉన్నా తనపై ఎందుకు కేసులు పెట్టటం లేదని ప్రశ్నించారు. తన ప్రమేయం లేదని తెలిసే కేసులు పెట్టలేదన్నారు. దమ్మూ ధైర్యం ఉంటే కేసులు పెట్టాలని, ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. అవినీతి సామ్రాట్ శివరాం స్పీకర్ డాక్టర్ కోడెల కుమారుడు శివరామ్ అవినీతికి చిరునామాగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేస్తున్న వ్యక్తే తమపై నిందలు మోపుతున్నాడన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ్ల గ్రామంలో సుబ్బారావుకు చెందిన 17 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆ స్థలంలో ఉన్న రూ.2 కోట్ల ఆస్తిని ధ్వంసం చేశారన్నారు. ఏడు ఇళ్లు నాశనం చేసి సుమారు 10 వేల కోళ్లను తిన్నారన్నారు. నరసరావుపేట పలనాడు రోడ్డులో ఎస్ఎస్ఎన్ కళాశాల అధ్యాపకుడికి చెందిన రూ.5 కోట్ల స్థలాన్ని, నల్లపాడులో సాంబిరెడ్డి అనే వ్యక్తికి చెందిన 2.5 ఎకరాల భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. తాను తిరుపతి పాదయాత్రకు వెళుతూ లక్షలు వసూలు చేశారనే శివరామ్ విమర్శలను ఎమ్మెల్యే గోపిరెడ్డి ఖండించారు. వెంకటేశ్వరస్వామి పాదయాత్రను కూడా రాజకీయం చేసిన దుర్మార్గుడు శివరామ్ అన్నారు. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లోఫర్స్ అంటూ శివరామ్ చేసిన వ్యాఖ్యలపై ప్రివిలేజ్ మోషన్‌కు వెళతామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకుండానే సత్తెనపల్లి, నరసరావుపేటలలో దోచుకున్న రూ.150కోట్ల డబ్బుతో గుంటూరులో కేఎస్పీ మాల్ నిర్మించారని తెలిపారు. ముఖ్యమంత్రి హెచ్చరించినా రైల్వే కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లతో పాటు సత్తెనపల్లిలో బాలాజీ స్వీట్స్ నుంచి నెలకు రూ.50వేలు వసూలు చేస్తున్నాడన్నారు. చివరకి తన పార్టీ కార్యకర్తలను కూడా వదలకుండా డబ్బులు వసూలుచేస్తూ వారే తనకు బలమని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక మాజీ ఎంపీపీ మట్టి తోలుకున్నాడని నాలుగు రోజుల పాటు జైలులో పెట్టించాడన్నారు. తన ఇంటిలో బాంబులు పేలి నలుగురు కార్యకర్తలు చనిపోతే ఇప్పటివరకు ఆ కుటుంబాలను ఆదుకోలేదని తెలిపారు. ఇటువంటి వ్యక్తికి ఆర్డీవో కార్యాలయం వద్ద పోలీసులు ఆరు గంటల పాటు మైకు ఇచ్చి స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే తప్పు లేనిదీ... ఏ తప్పూ చేయని తాము సభ పెట్టుకుంటామంటే హౌస్ అరెస్టుచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏ నేరం చేశాడని అరెస్టు చేశారు: బొల్లా వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఏ నేరం చేశాడని అరెస్టు చేశారంటూ ప్రశ్నించారు. డబ్బుల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని విధాలా ప్రజలను దోచుకుంటున్న వీరు అవినీతి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు నూరుల్ అక్తాబ్, పట్టణ అధ్యక్షుడు ఎస్.ఏ.హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా పాల్గొన్నారు. నరసరావుపేటలో నియంతృత్వ పాలన ? నరసరావుపేట టౌన్: నరసరావుపేటలో నియంత పాలన కొనసాగుతుందా అన్నట్లు శనివారం వాతావరణం కనిపించింది. ఎటుచూసినా ఖాకీలు గుంపులు గుంపులుగా లాఠీలు పట్టుకుని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పట్టణంలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. దీనంతటికీ టీడీపీ నేతల అవినీతిపై ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసరటమే కారణంగా కన్పిస్తోంది. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే ఎక్కడ తమ అవినీతి పుట్ట పగులుతుందోనని కలవరపాటుతో అధికార పార్టీ కుట్ర చేసి సభను భగ్నం చేసింది. 144 సెక్షన్ అస్త్రాన్ని ఉపయోగించి నియోజకవర్గ ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహం వద్ద చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఇతరులనెవ్వరిని అటుగా అనుమతించలేదు. దీంతో పాటు మల్లమ్మ సెంటర్, మున్సిపల్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయ సెంటర్, పల్నాడు బస్టాండు, ఆర్టీసి బస్టాండు వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డుగా డివైడర్లను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అటుగా వచ్చే వాహనాలను దారి మళ్లించారు. దీంతో ప్రజానీకం అసౌకర్యానికి గురైయ్యారు. పోలీసుల అదుపులో పట్టణం మూడు సబ్ డివిజన్ల అధికారులు, సిబ్బందితో పాటు గుంటూరు నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన సెంటర్లలో 10 నుంచి 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 10 వాహనాల్లో పోలీసులు గస్తీ తిరిగి జనాలను చెదరగొడుతూ భయబ్రాంతులకు గురిచేశారు. మరో ఐదు రోజుల పాటు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న దృష్ట్యా పోలీసులు ఇదే అత్యుత్సాహం ప్రదర్శిస్తే జనజీవనం అస్తవ్యస్తం అవ్వటం ఖాయం. -
గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత
-
గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహనిర్బంధం, ఉద్రిక్తత
గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికారం విషం కక్కుతోంది. పాలక పార్టీకి ఓ రూలు, ప్రతిపక్షానికో రూలు అన్నట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి, వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమానికి 144 సెక్షన్‌తో మోకాలడ్డారు. సాక్షి, నరసరావుపేట : పట్టణంలో అధికార యంత్రాంగం, పారదర్శకతకు పాతరేసి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోంది. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై వచ్చిన విమర్శలను నిగ్గు తేల్చుకునేందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడికి బహిరంగ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పోలీసులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ బహిరంగ చర్చకు వెళ్లకుండా గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డిని గృహనిర్బంధం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులను మొహరించారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అడ్డుకోవడమే లక్ష్యం : నరసరావుపేట, సత్తెనపల్లిలో జరిగిన అవినీతిని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకుంటే టీడీపీ నేతలు రాజీనామాకు సిద్ధపడాలని గోపిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. అయితే బహిరంగ సభలో ప్రతిపక్ష నాయకులు నోరు విప్పితే తమ అవినీతి ఎక్కడ బట్టబయలు అవుతుందోనన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుంది. బహిరంగ సభ, ర్యాలీలను ఎలాగైనా అడ్డుకోవాలనకున్న అధికార పార్టీనేతలు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మూడురోజుల పాటు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు నిషేధిత ప్రాంతమైన ఆర్డీవో ఆఫీసు సెంటర్లో ఆందోళన జాతర చేపట్టినప్పుడు అధికారులకు గుర్తుకురాని నిబంధనలు ప్రతిపక్షం ర్యాలీ చేస్తానన్నప్పుడు మాత్రం అకస్మాత్తుగా గుర్తుకువచ్చాయి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి చేపట్టనున్న నిరసన కార్యక్రమానికి 144 సెక్షన్ పేరుతో మోకాలడ్డారు. అధికారులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? 144 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టనున్న నేపథ్యంలో ఇన్చార్జి తహసీల్దార్ జి.శ్రీనివాస్ 144 సెక్షన్ అమలు చేయాలని శుక్రవారం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ సాకును అసరాగా చూపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ర్యాలీకు అనుమతులు ఇవ్వకూడదనేది అధికార పార్టీ కుట్ర. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నాయకులు మూడు రోజుల పాటు న్యాయస్థాన ప్రాంగణాలకు కూతవేటు దూరంలో గల ఆర్డీవో అఫీసు సెంటర్లో నానా యాగీ చేసినా, ప్రజలు, వ్యాపారస్తులు మూడు రోజుల పాటు ఇబ్బందులు పడినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు మాత్రం ముందస్తుగానే చర్యలు చేపడుతున్నారు. దీని వెనుక అధికార పార్టీ ఒత్తిడి ఉందని తేటతెల్లమవుతోంది. నాలుగో తేదీ వరకు 144 సెక్షన్ అమలు : ముందస్తు చర్యల్లో భాగంగా పట్టణంలో 144 సెక్షన్ అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసుశాఖ కోరిన నేపథ్యంలో 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశా. జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. –శ్రీనివాస్, తహసీల్దార్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య : ఏఈఎల్సీ ఆస్తుల అన్యాక్రాంతం వ్యవహారంలో రాజకీయ సవాళ్ల వివాదం శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. 144 సెక్షన్ అమల్లో వున్న కారణంగా నిరసనలు, బహిరంగ సభలు నిషేధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి కోరారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. –ఏవీ శివప్రసాద్, సీఐ తహసీల్దార్ జారీచేసిన 144 సెక్షన్ ఉత్తర్వులు -
మూడుసార్లు ఓడిపోయాం.. టీడీపీలో కలకలం
సాక్షి, గుంటూరు: అధికార తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీలో కలకలం రేగింది. టీడీపీ అధిష్టానంపై నరసరావుపేట మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి రామిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నియోజకవర్గ ఇన్‌ఛార్జిని ప్రకటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్లక్ష వైఖరికి నిరసనగా రేపటి (శనివారం) నుంచి ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. ఎంపీ నిధులతో జరిగే అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, నిజమైన టీడీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని రామిరెడ్డి వాపోయారు. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిను నియమించాలని అధిష్టానానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నరసరావుపేటలో టీడీపీ వరుసగా మూడుసార్లు ఓటమిని చవి చూసింది.. ఇకనైనా పార్టీ అధిష్టానం స్పందించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాలని పులిమి రామిరెడ్డి కోరారు. -
టీఎస్టీ, కేఎస్టీతో ప్రజల్ని దోచుకుంటున్నారు: వైఎస్ జగన్
సాక్షి, నర్సారావుపేట: ‘నర్సారావుపేటలోని వ్యాపారులు, దుకాణదారులు జీఎస్టీతో బాధపడుతున్నారు. జీఎస్టీకి అదనంగా రాష్ట్రంలో టీఎస్టీ కూడా ఉంది. టీఎస్టీ అంటే తెలుగు తమ్ముళ్లకు సంబంధించిన సర్వీస్ టాక్స్. జన్మభూమి కమిటీల నుంచి ప్రాజెక్టుల వరకు ప్రతి విషయంలో తెలుగుదేశం సర్వీస్ ట్యాక్స్ (టీఎస్టీ) కట్టాల్సిన పరిస్థితి నెలకొంది’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ అవినీతిపై మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా నర్సారావుపేట పట్టణంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. అశేషంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. టీఎస్టీతోపాటు నర్సాపేట నియోజకవర్గంలో కేఎస్టీ ట్యాక్స్ కూడా కట్టాల్సిన పరిస్థితి నెలకొందని, రైల్వే కాంట్రాక్టుల నుంచి విద్యుత్ ప్రాజెక్టులు వరకు, కొటప్పకొండ కాంట్రాక్టు నుంచి మద్యం కాంట్రాక్టుల వరకు, కొత్త సినిమా రిలీజైనా ఆఖరికీ ఆటోలు, తోపుడు బండ్ల నుంచి కేఎస్టీ వసూలు చేస్తున్నారని నర్సారావుపేట టీడీపీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. ఇలా టీఎస్టీ, కేఎస్టీ పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారని, ఎక్కడచూసినా లంచం, లంచం, లంచం ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిలో పురోగతి సాధించిందో లేదో తెలియదుకానీ, అవినీతిలో మాత్రం దేశంలోనే నంబర్‌వన్ పురోగతి సాధించిందని దుయ్యబట్టారు. నర్సారావు పేట నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుచేయాలని, నర్సారావు నుంచి చీరాల వరకు రోడ్డును నాలుగులైన్లుగా విస్తరించాలని, పెరుగుతున్న అవసరాల మేరకు నర్సారావుపేటలో మరో మంచినీటి రిజర్వాయర్ ఏర్పాటుచేయాలని ప్రజలు అడుగడుగునా తనను కలిసి అర్జీలు సమర్పిస్తున్నారని వైఎస్ జగన్ తెలిపారు. ఈ సమస్యలను టీడీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా ఒక్క ఏడాది కూడా వరి వేసుకునే పరిస్థితి లేదని రైతులు నాకు చెప్పారు నాగార్జున సాగర్ కుడి కాల్వలో నీళ్లు ఉన్నా.. రైతులు వరి పంట పండించలేకపోతున్నారు నాగార్జున సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 310 టీఎంసీలు నవంబర్ 1, 2017 నాటికి సాగర్‌లో 274 టీఎంసీల నీళ్లు ఉన్నా.. రైతులకు వరి పంట వేసుకునేందుకు నీళ్లు ఇవ్వలేదు నాగార్జున సాగర్ ఎడుమకాలువ ద్వారా తెలంగాణలోని రైతులు ప్రతి సంవత్సరం వరి పండిస్తున్నారు కేసీఆర్ ఎడుమ కాలువలో వరి పండిస్తున్నారు ఇక్కడ చంద్రబాబు మాత్రం సాగర్ కుడికాలువ ద్వారా వరికి నీళ్లు ఇవ్వడం లేదు మరి కేసీఆర్‌కు ఉన్నదేమిటి? చంద్రబాబుకు లేనిదేమిటి? చంద్రబాబుకు లేనిదేమిటో.. కేసీఆర్‌కు ఉన్నదేమిటో తెలుసా.. ఓటుకు కోట్లు కేసు అడ్డగోలు అవినీతి సంపాదనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి.. చంద్రబాబు ఆడియోటేపులు, వీడియోటేపులతో దొరికిపోయాడు. ఆ ఆధారాలన్నీ కేసీఆర్ దగ్గర ఉన్నాయి అందుకే కేసీఆర్‌ను నీళ్లు అడిగే ధైర్యం చంద్రబాబు చేయలేకపోతున్నారు ఈ నాలుగేళ్లో చంద్రబాబు ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించలేదు వరి మొదలు కందులు, పెసలు, పత్తి, మిర్చి, ఇలా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు ఆఖరికీ మార్కెట్యార్డుల్ని కూడా అవినీతి కేంద్రాలుగా మార్చారు రైతన్న మార్కెట్‌యార్డుకు వెళితే ఏ పార్టీ అని అడుగుతున్నారు రైతన్న పంటను అమ్ముకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి సబ్సిడీ ద్వారా వ్యవసాయ పనిముట్లు తీసుకోవాలంటే లంచాలు ఇవ్వాల్సిందే రాష్ట్రవ్యాప్తంగా రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది చంద్రబాబు నాలుగేళ్ల పాలన చూశాం ఈ నాలుగేళ్ల పాలనలో ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు రైతులు, మహిళలు, నిరుద్యోగుల సహా అందరినీ చంద్రబాబు మోసం చేశారు -
పాదయాత్రపై ప్రభుత్వం నిర్లక్ష్యం
సాక్షి, గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్‌కు జడ్ కేటగిరి ఉన్నా ఆ మేరకు భద్రత కల్పించడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. పాదయాత్రలో రోప్‌పార్టీ మినహా పోలీసులు మరెక్కడా కనిపించడం లేదు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. భద్రత కల్పించాలని వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారి వద్ద నుంచి సరైన స్పందన రాకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇవాళ సాయంత్రం నరసరావుపేట పట్టణంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా జనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. -
జేఎన్టీయూ నిర్మాణానికి స్థలం కేటాయింపు
నరసరావుపేట రూరల్: ఎట్టకేలకు జేఎన్టీయూ నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాల సొంత భవన నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. 2012–13 విద్యా సంవత్సరంలోనే వర్సిటీ ఏర్పాటుకు పునాది పడింది. అప్పటి వర్సిటీ పాలక మండలి నరసరావుపేటలో వర్సిటీ అనుబంధ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నరసరావుపేట మండలం కాకానిలో కొంత ప్రభుత్వ భూమి ఉండటంతో అక్కడ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అవే భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తూ జీవో జారి చేసింది. దీనిపై మీడియాలో భారీ దుమారం రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం చివరికి వర్సిటీకి స్థలం కేటాయించింది. రెండేళ్ల నుంచి స్థలం కోసం ఎదురుచూపు.. రెండేళ్ల క్రితం నరసరావుపేటలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ వర్సిటీ కళాశాల ఏర్పాటైంది. కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి అధికారికంగా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. దీంతో ప్రైవేటు స్థలాల్లోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఏపీఐఐసీకి కేటాయించిన కాకాని స్థలాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్ట్‌లో జీవో కూడా జారీ చేసింది. ఈ స్థలాన్ని తిరిగి కళాశాలకు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహించింది. రెండేళ్లుగా కళాశాలకు భూములను కేటాయించాలని కోరుతూ వర్సిటీ అధికారులు అనేక సార్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు 86 ఎకరాలు కేటాయింపు.. భవనాల నిర్మాణానికి ఇప్పటివరకూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం అద్దె భవనాల్లోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. రూరల్ పరిధిలోని పెట్లూరివారిపాలెం ఎ.ఎం.రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గతేడాది తరగతులు నిర్వహించగా ఈ ఏడాది పట్టణంలోని ఎన్.బి.టి అండ్Š ఎన్.వి.సి కళాశాలలో తరగతులు కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం కళాశాలకు 86 ఏకరాలు కేటాయిస్తూ శనివారం క్యాబినేట్ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, అధ్యాపకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం తీసుకున్నప్పటికీ పల్నాడు విద్యా హబ్‌గా ఉన్న నరసరావుపేటలో జేఎన్టీయూ భవన నిర్మాణాల కల సాకారం కానుందని పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులను సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న కళాశాల యాజమాన్యం సైతం భూమి కేటాయింపు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి.. కళాశాల భవన నిర్మాణాలకు వర్సిటీ రూ.80 కోట్లు ఖర్చుచేయనుంది. ప్రస్తుతానికి రూ.30 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో టెండర్లు పిలిచినా భూములు అప్పగించకపోవడంతో పనులు ఆగిపోయాయి. భూములను మాకు అప్పగించిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ఇందుకోసం అవసరమైన ప్రిలిమినరీ వర్క్ ఇప్పటికే పూర్తి చేశాం. భవనాలు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నాం. – కె.ఎస్.ఎస్ మురళీకృష్ణ, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ -
ఒక ఊర్లో వంద ఊర్ల జనం..!
సాక్షి, గుంటూరు: ఒక ఊర్లో వంద ఊర్ల జనం ఉండటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా... గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం గ్రామానికి వెళ్తే ఇది నిజమని నమ్మక తప్పదు. వందల ఏళ్ల క్రితం అనేక ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన వారంతా కలిసి గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అప్పట్లో ఏ ఊరు నుంచి వచ్చిన వారిని ఆ ఊరు పేరుతో పిలిచేవారు. కాలం గడిచేకొద్దీ ఆ ఊరి పేరు అతని ఇంటి పేరుగా మారిపోయింది. కేవలం పిలుపులకే పరిమితం కాకుండా జనన ధ్రువీకరణ పత్రాల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి అధికారిక గుర్తింపు కార్డుల్లో సైతం పేరుకు ముందు ఇంటి పేరుతోపాటు ఊరు పేరును నమోదు చేయించుకుంటూ దాన్ని శాశ్వతం చేసుకున్నారు. పుట్టే బిడ్డల పేర్ల ముందు సైతం తాతల కాలం నుంచి వస్తున్న ఊరి పేరును చేరుస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. నరసరావుపేట మండలం చినతురకపాలెం గ్రామంలో సుమారుగా 700 కుటుంబాలు నివాసం ఉంటుండగా అందులో 550కు పైగా కుటుంబాలు తమ ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరును చేర్చుకుంటున్నారు. ఇక్కడ నివాసం ఉండేవారంతా ముస్లింలు కావడం గమనించదగ్గ విషయం. వీరంతా పొదిలి, చావపాటి, పల్నాడు, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీనికి తోడు గ్రామంలో అంతా ముస్లింలు కావడంతో ఒకేపేరుతో అనేకమంది ఉండటం వల్ల గతంలో సులభంగా గుర్తించేందుకు పెద్దలు ఊరి పేర్లతో పిలవడం అలవాటు చేశారు. దీంతో షేక్ అనే ఇంటి పేరు ఉన్న వారంతా దానికి ముందుగాని, తరువాత గానీ ఊరుపేరును చేర్చి ఆ తరువాతే తమ పేరును రాసుకుంటారు. ఉదాహరణకు షేక్ నాగూర్‌బాషా అనే పేరు గల వ్యక్తికి షేక్ మధిరే నాగూర్‌బాషా అంటూ పిలవడంతోపాటు అధికారిక ధృవీకరణ పత్రాల్లోనూ నమోదు చేస్తూ వస్తున్నారు. తమకు పుట్టే బిడ్డలకు సైతం ఇవే పేర్లు పెడుతూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తుంది మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దాన్ని మేము కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకు సైతం అన్ని గుర్తింపు కార్డుల్లో ఇదే పేరుతో నమోదు చేయిస్తున్నాం. –షేక్ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు మేమంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి ఇలా అనేకమందికి పేర్లు పెడుతుండటంతో ఊరిపేర్లతో పిలవడం మొదలు పెట్టారు. పూర్వీకుల నుంచి ఇలానే పిలుస్తూ చివరకు గుర్తింపు కార్డుల్లో సైతం ఇంటి పేరు తరువాత ఊరి పేరు పెడుతూ వస్తున్నాం. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌకర్యంగా ఉంది. – షేక్ మధిరె నాగూర్‌బాషా, చిన్నతురకపాలెం గ్రామస్తుడు -
కిడ్నీమార్పిడి కేసు..సెంట్రల్ కమిటీ వివరణ
గుంటూరు : కిడ్నీ మార్పిడి రాకెట్ గుట్టురట్టు కావడంతో సెంట్రల్ కమిటీ ఈ విషయంపై స్పందించింది. శుక్రవారం సెంట్రల్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..శివనాగేశ్వరరావు కిడ్నీ మార్పిడి వ్యవహరంలో విజయవాడ ఆయుష్ హస్పటల్ యాజమాన్యం నిబంధలు పాటించలేదని తెలిపారు. గుంటూరు వేదాంత ఆసుపత్రిలో మాత్రమే శివనాగేశ్వరరావుకు కమిటి పర్మిషన్ ఇచ్చిందని వివరించారు. ఆయుష్ ఆసుపత్రి శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడికి సంబంధించి తమకు దరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఒక ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడికి అనుమతి తీసుకుని మరో ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకోకూడదన్నారు. ఏ ఆసుపత్రి అయినా కిడ్నీ మార్పిడి చేసే ముందు కిడ్నీ మార్పిడి కమిటి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్లపై ఎమ్మార్వో వివరణ
గుంటూరు జిల్లా : కిడ్నీ మార్పిడి కోసం వెంకటేశ్వర నాయక్‌ను వేదాంత ఆసుపత్రి యాజమాన్యం రిఫర్ చేసిందని నరసరావుపేట ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి తెలిపారు. గుంటూరు, నరసరావుపేటల్లో కిడ్నీ రాకెట్ వెలుగులోకి రావడంతో ఆమె వివరణ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ నేత కపిలవాయి విజయకుమార్ తనకు ఫోన్ చేశారని, వెంటేశ్వర నాయక్ తమ వాడే త్వరగా సర్టిఫికెట్ ఇవ్వమని తనతో చెప్పినట్లు వెల్లడించారు. వెంకటశ్వరనాయక్ సర్టిఫికేట్లు పోలీసు వెరిఫికేషన్‌లో నకిలీవని తేలిందని, వెంకటేశ్వర నాయక్‌ని పిలిచి విచారించామని చెప్పారు. కిడ్నీ ఇస్తే తనకున్న అప్పులు తీర్చేస్తామని చెప్పినందుకే తాను కిడ్నీ ఇస్తున్నానని వెంకటేశ్వర నాయక్ చెప్పారని వివరించారు. తన పైన కేసు పెడతామని చెప్పటంతో నాయక్ పారిపోయాడని చెప్పారు. -
గుంటూరులో కిడ్నీ రాకెట్ కలకలం
-
గుంటూరులో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు
గుంటూరు: జిల్లాలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు అయింది. ఆధార్ కార్డులో ఫోటో మార్చి రోగి బంధువుగా చూపించి కిడ్నీల కొనుగోళ్లు, అమ్మకాలు జరుపుతున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన ఓ డాక్టరే ఈ రాకెట్ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా ఈ దందా నడుస్తోన్నట్లు విచారణలో వెల్లడైంది. ఇప్పటికే మూడు కిడ్నీలు కొనుగోలు చేసినట్లు బయటపడింది. నాలుగో కిడ్నీ కొనుగోలు విషయంలో తేడా రావటంతో విషయం బయటికి పొక్కింది. ఈ విషయం గురించి గతంలోనే నరసరావుపేట తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వేదాంత ఆసుపత్రి ఎండీ వివరణ కిడ్నీ మార్పిడి తమ ఆసుపత్రిలో జరగలేదని వేదాంత ఆసుపత్రి ఎండీ డాక్టర్ రాధాకృష్ణ తెలిపారు. శివనాగేశ్వరరావు అనే వ్యక్తికి కిడ్నీ అవసరమని ప్రభుత్వానికి తామే రిఫర్ చేశామని, కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చిన వెంకటేశ్వర్ నాయక్‌ను శివ నాగేశ్వరరావు బంధువులే తీసుకువచ్చారని రాధాకృష్ణ చెప్పారు. ఐదు రోజుల క్రితం విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో శివనాగేశ్వరరావుకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందని వెల్లడించారు. ఈ కిడ్నీరాకెట్‌కు తమ ఆసుపత్రికి ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. -
గుంటూరులో ప్రజ్ఞ జైస్వాల్ సందడి
-
ప్రాణాలు తీస్తున్న 'కాల్' నాగులు
నరసరావుపేటలో కాల్ ‘నాగులు’ బుసకొడుతున్నాయి.. అవసరానికి అప్పు అడిగి తీసుకున్న పాపానికి సామాన్యులను నిత్యం వేధిస్తున్నాయి.. అసలుకు నాలుగింతల వడ్డీ కలిపి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి.. అవసరమైతే ప్రత్యక్ష దాడులకు దిగడం.. ఇంట్లో సామగ్రి తీసుకువెళ్లడం వీటి నైజం. ‘ఖాకీలు’ అండగా నిలబడతాయని ఒకరిద్దరు ధైర్యం చేసి ఠాణాల్లో ఫిర్యాదు చేసినా వచ్చిన స్పందన.. ఒక ‘ఉచిత సలహా’. సమస్యను కోర్టుల్లోనే తేల్చుకోవాలని చెప్పేసరికి, బాధితులు ‘చావు’ మెట్టు ఎక్కుతున్నారు. నరసరావుపేటటౌన్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంది. దీంతో అధిక వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఇంకా పెరిగిపోతున్నాయి. తాజాగా నరసరావుపేటలో రెండు నెలల వ్యవధిలో కాల్ ‘నాగుల’ వేధింపులకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు మహిళలు వేధింపులు తాళలేకే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాయడం గమనార్హం. ఎంతోమంది ఇప్పటికీ ఒత్తిళ్లను భరిస్తున్నారు. వీరి ఆగడాలపై కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఈ వ్యవహారాలను కోర్టులో చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం. తీసుకున్న అప్పునకు నాలుగింతల నగదు చెల్లించినా బాకీ తీరలేదని చెప్పడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కొందరు వ్యాపారులు అప్పుల తీసుకున్న వారి గృహాల్లో తిష్ట వేసి సామగ్రి తీసుకువెళ్లిన ఘటనలు జరిగాయి. దీనిపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు తెగబడిన సందర్భాలూ అనేకం. ఉదాహరణలు ఇవిగో.. ► నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి మువ్వా వెంకటేశ్వరరావుకు వ్యాపారంలో నష్టం వచ్చింది. తెచ్చిన అప్పులకు అధిక వడ్డీలు చెల్లించలేక, ఒత్తిళ్లు తట్టుకోలేక గతనెల 16వ తేదీన గుంటూరు రోడ్డులోని గల హిందూ శ్మశానవాటిక ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి అధిక వడ్డీలే కారణమని సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ► మరికొన్ని రోజుల తర్వాత పసనతోటకు చెందిన జరీనాబేగం చిట్ నడుపుతూ పాట పాడుకున్న వారికి డబ్బు చెల్లించేందుకు గాను వడ్డీ వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుంది. అధిక వడ్డీలు చెల్లించలేక బలవన్మరాణానికి పాల్పడింది. ► ప్రకాష్‌నగర్ కంభంపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాశీంబి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తె వివాహానికి వ్యాపారుల నుంచి అధికవడ్డీలకు నగదు తీసుకుంది. వారి నుంచి వచ్చిన వేధింపులు తాళలేక సూసైడ్‌నోట్ వ్రాసి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోయిన ప్రాణం ఎటూ తిరిగిరాదు అనుకున్నారో ఏమో మహిళల ఆత్మహత్యల సంఘటనలపై పోలీసులకు బాధిత బం«ధువులు ఫిర్యాదు చేయలేదు. ఊరు వదిలి వెళ్లిన కుటుంబాలు అనేకం.. ► గతేడాది నరసరావుపేట ఎన్జీవో కాలనీకి చెందిన పద్మజ అనే మహిళ వడ్డీ వ్యాపారులు వేధింపులకు తాళలేక ఇటీవల కుటుంబ సభ్యులతో సహా ఊరువిడిచి వెళ్లిపోయింది. ► మొదటి రైల్వేగేట్ సమీంలో టీ స్టాల్ నిర్వహించే నూర్జహాన్ అనే మహిళ ఇటీవల వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక రాత్రికి రాత్రే పట్టణం విడిచి వెళ్లింది. ► 20 రోజుల క్రితం రావిపాడుకు చెందిన షేక్ మీరావలి వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక గ్రామం వదిలి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో అధికవడ్డీ వ్యాపారుల వేధింపులతో ఊరు విడిచి వెళ్ళినట్లు బాధితుడు చెప్పడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కాల్‌మనీ వ్యాపారుల ఆట కట్టించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని ఉంటే, అసలు వెలుగులోకి రాకుండా కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలకు బలవుతున్నవారు అనేక మంది ఉన్నారనేది జగమెరిగిన సత్యం. -
నరసరావుపేటలో దారుణం
సాక్షి, నరసరావుపేట : ఇద్దరు పిల్లలతో కలసి తల్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన సోమవారం సాయంత్రం నరసరావుపేట పట్టణంలో చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మీకి ఇద్దరు సంతానం. కూతురు దిగ్విజయ, తనయుడు గణేష్ సాయిలు మార్టూరులో విద్యను అభ్యసిస్తున్నారు. దిగ్విజయ పుట్టిన రోజు కావడంతో సోమవారం పిల్లలను కలిసేందుకు విజయలక్ష్మీ మార్టూరుకు వెళ్లారు. పిల్లల్ని తీసుకుని సోమవారం మధ్యాహ్నానికి నరసరావుపేట చేరుకున్నారు. మార్కెట్ దగ్గర గల మూడో గేట్ వద్ద గూడ్స్ రైలు వస్తుందనగా పిల్లల్ని రైలు కింద తోసేశారు. అనంతరం తాను రైలు కింద పడ్డారు. ఈ ఘటనలో విజయలక్ష్మీ, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. చూస్తుండగానే తల్లి, పిల్లలు రైలు కింద పడటంతో గేటు వద్ద ఆ సమయంలో ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే విజయలక్ష్మీ పిల్లలతో కలసి ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రైతుల బాధలు తెలుసు కాబట్టే ధర్నా
నరసరావుపేట: ధర్నాలో పాల్గొన్న వారికి మాగాణి, మెట్టకు తేడా తెలియదని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చులకనగా మాట్లాడటం రైతులను అవమానించడమే అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తామందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారిమేనని అన్నారు. నరసరావుపేట పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్పీకర్ కోడెల ధర్నాలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండించారు. ఈ ప్రాంతంలోని వారందరికీ మాగాణి, మెట్ట గురించి క్షుణ్ణంగా తెలుసునని, ఈ ప్రాంతమంతా రెండు పంటలు పండిన భూములేనన్నారు. ప్రస్తుతం కరువు నేపథ్యంలో స్థానిక టీడీపీ నాయకులే ప్రభుత్వంపై సాగునీటి కోసం పోరాడాలని తమను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అవసరమైతే డ్యామ్ గేట్లు ఎత్తయినా నీరు విడుదల చేస్తామని తాము చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నామన్నారు. రైతుల కోసం కేసులు పెట్టినా భరిస్తామన్నారు. వెనుకంజ వేసే ప్రసక్తేలేదన్నారు. నరసరావుపేటలో ఎక్కడ ఇసుక, మట్టి ట్రాక్టర్లు, లారీలు కనిపించినా వారిని భయపెట్టి గుంటూరు గుంట గ్రౌండ్లో టీడీపీ నాయకులు నిర్మించే భవనం కోసం వాటిని తరలిస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వారికి కనీసం కూలి కూడా ఇవ్వకపోవడం నిజం కాదా? అని అన్నారు. కోటప్పకొండలో క్రషర్ మెషిన్ పెట్టి ఇతర క్రషర్ల యజమానులను భయపెట్టి తన కుమారుడి వద్దనే కంకర కొనాలని హుకుం జారీ చేసింది నిజం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ఈ నెల 14న ధర్నాలో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నకరికల్లు మండల అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, రాజుపాలెం జెడ్పీటీసీ మర్రి సుందరరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, నకరికల్లు నాయకుడు వంగా రాజగోపాలరెడ్డి ల్గొన్నారు. -
ఉద్యోగం వల.. నరకంలో విలవిల!
నరసరావుపేట నుంచి యూఏఈకి బాలికల అక్రమ రవాణా నిరుపేద కుటుంబాలే బ్రోకర్ల టార్గెట్ నెలకు రూ.20 వేల జీతం అంటూ మాయమాటలు తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్‌లు హోటళ్లలో డ్యాన్సర్లుగా వ్యభిచారంలోకి మెయిల్ ద్వారా ‘సాక్షి’కి సమాచారం ఇచ్చిన గుంటూరు వాసి సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా నుంచి బాలికల ను ఇతర దేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని కొందరు బ్రోకర్లు మైనర్లను అక్రమంగా రవాణా చేస్తూ భారీ ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో సేల్స్ గాల్స్‌గా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రులకు వల వేస్తున్నారు. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఇప్పిస్తామని చెప్పడంతో కూలినాలి చేసుకొని జీవితాలు వెళ్లతీసేవారు.. వారి మాయమాటలు నమ్మి బాలికలను అరబ్ దేశాలకు పంపుతున్నారు. అయితే అక్కడ ఏంపని చేస్తున్నారనే విషయం మాత్రం వీరికి తెలియడం లేదు. వారి మాటలు నమ్మి అక్కడకు వెళ్లిన అనేక మంది బాలికలు వ్యభిచార కూపంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని నరసరావుపేట కేంద్రంగా కొందరు బ్రోకర్లు బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న విషయం బయటకు పొక్కడంతో పోలీసులు సైతం ఉలికిపాటుకు గురవుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. నరసరావుపేట పట్టణంలో పెద్దచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న కనకం అనే మహిళకు చెన్నైకు చెందిన హరి అనే బంధువు ఉన్నాడు. హరి అప్పుడప్పుడు కనకం ఇంటికి వచ్చి వెళుతూ ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న అనేక మంది నిరుపేదలకు వలవేసి వారి కుమార్తెలకు అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. భారీ వేతనాలు, ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తానని వల విసిరాడు. తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే ఆశతో కొందరు తల్లితండ్రులు తమ కుమార్తెలను హరితో పంపారు. ఇలా నరసరావుపేటకు చెందిన సుమారు పది మంది బాలికలను హరి అరబ్ దేశాలకు పంపి అక్కడ హోటళ్లు, పబ్‌ల్లో డ్యాన్సర్లుగాను, మరికొందరిని వ్యభిచార వృత్తిలోకి దించినట్లు సమాచారం. వెళ్లిన వారిలో కొందరు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పగా, మరికొందరు భయంతో ఇష్టం లేకపోయినా నరకాన్ని అనుభవిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ విషయం కొందరు తల్లిదండ్రులకు తెలిసినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, బయటకు తెలిస్తే పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉంటున్నారు. వెలుగులోకి ఇలా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో వ్యభిచార గృహానికి వెళ్లిన గుంటూరు జిల్లా వాసికి నరసరావుపేటకు చెందిన ఓ మైనర్ బాలిక పరిచయమైంది. తెలుగు వ్యక్తి కలవటంతో ఆ బాలిక తన వేదన చెప్పి విలపించింది. తనను వ్యభిచార కూపం నుంచి తప్పించాలని వేడుకొంది. దీనికి చలించిన ఆయన.. వ్యభిచార గృహం నడిపే యజమానులకు కొంత పైకం చెల్లించి ఆమెను పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిర్వాహకులు అంగీకరించలేదు. ఈ విషయంలో కలుగచేసుకుంటే హతమారుస్తామంటూ హెచ్చరించారు కూడా. అక్కడ జరిగిన వ్యవహారాన్ని మెయిల్ ద్వారా ఆయన ‘సాక్షి’ కి సమాచారాన్ని చేరవేశారు. దీనిపై నరసరావుపేటలో సాక్షి ఆరా తీయగా మైనర్ బాలికల అక్రమ రవాణా వ్యవహారం గుట్టు రట్టయింది. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి సైతం వెళ్లటంతో బాలిక తల్లిని పిలిచి విచారిస్తున్నారు. తప్పుడు జనన ధృవీకరణ çపత్రాలతో పాస్‌పోర్టులు మైనర్ బాలికలకు పాస్‌పోర్టులు రావని తెలిసిన అక్రమార్కులు వారి పేర్లు, తల్లిదండ్రుల పేర్లు మార్చి, నకిలీ జనన ధృవీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు పొందుతున్నట్లు తెలిసింది. నరసరావుపేటకు చెందిన బాలికలకు సైతం ఇదే తరహాలో తప్పుడు పత్రాలు సృష్టించి హైదరాబాద్ చిరునామాలతో పాస్‌పోర్టులు పుట్టించినట్లు సమాచారం. అక్రమ రవాణా గుట్టు రట్టుయినా.. మైనర్ బాలికలు పేర్లు, అడ్రస్సులు తప్పుడువి కావటంతో తాము తప్పించుకోవచ్చనేది అక్రమార్కుల ఆలోచన. -
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
-
మున్సిపల్ అధికారుల ఓవరాక్షన్
నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో మున్సిపల్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. న్యాయవాది లక్ష్మీనారాయణకు చెందిన నల్లపాటి నారాయణ కాంప్లెక్సు(అపార్టుమెంట్)ను మున్సిపల్ సిబ్బంది కూల్చడానికి యత్నించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే భవనాన్ని కూల్చేందుకు పోలీసులతో తరలివచ్చారు. దీంతో లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నేత రాములు అధికారులను అడ్డుకున్నారు. గతంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ అనేక కేసులు వాదించారు. దీంతో కోడెల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ భవనాన్ని కూల్చేందుకు పూనుకున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. -
పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి
నరసరావుపేట: పౌరుషాలకు నెలవైన పల్నాడు గడ్డపై దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. శుక్రవారం నరసరావుపేటలోని రెడ్డి కాలేజీ గ్రౌండ్స్‌లో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. భారతదేశాన్ని ప్రభావితం చేసిన కుటుంబం నుంచి.. కాసు మహేష్ రెడ్డి వైఎస్ఆర్ సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పల్నాడులో కోడెల శివప్రసాద్ అక్రమాలకు పాల్పడుతున్నారని అంబటి ఆరోపించారు. నడికుడి నుంచి కాళహాస్తి వరకు రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ డబ్బులివ్వలేదని దాడికి పాల్పడ్డారని.. కోడెలపై అంబటి ధ్వజమెత్తారు. పల్నాడుతో సహా ఏపీలో ప్రజాస్వామ్యం కాకుండా పోలీసు రాజ్యం నడుస్తుందని అంబటి విమర్శించారు. పల్నాడు గడ్డపై జరుగుతున్న సభను చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతాయన్న ఆయన కర్రుకాల్చి వాతపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
పోలీసు రాజ్యం నడుస్తోంది: అంబటి
-
ప్రజాస్వామ్యం ఖూనీ!
పోలీసులను ఆయుధంగా మార్చుకున్న దేశం రాజ్యాంగేతరశక్తిగా ముఖ్యనేత, ఆయన తనయుడు జిల్లాలో కొనసాగుతున్న అణచివేత...అరాచకాలు ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు చెప్పిందే శాసనం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉంటూ సమాజంలో ఆటవిక పాలన కొనసాగిస్తున్న వైనంపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్నా మరో వైపు అణచివేత, అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాకు చెందిన ముఖ్య నేత, ఆయన తనయుడు రాజ్యాంగేతరశక్తిగా మారి ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. పోలీసులను ఆయుధంగా మలచుకొని తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. జిల్లాలోని ఆ రెండు నియోజకవర్గాల్లో వారు చెప్పిందే శాసనం. కన్ను పడితే కబ్జానే.. వ్యాపారమైనా, భవన నిర్మాణమైనా, చివరకు లాటరీ తగిలినా ఆయనకు కప్పం కట్టాల్సిందేనంటున్నారు. - సాక్షి, గుంటూరు గుంటూరు : జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యనేత, ఆయన తనయుడు సాగిస్తున్న అరాచక పాలన చూస్తే భీతిల్లాల్సిందే. దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అక్రమ రవాణా, నెలవారీ వసూళ్లు ఇలా పలు రకాల నియంతృత్వ పోకడలు అనుసరిస్తూ వివిధ వర్గాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. వీరి వ్యవహారశైలికి ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయకంపితులవుతున్నారు. వ్యాపారులు సైతం కలవరపాటుకు గురవుతున్నారు. నరకాసుర కోటగా .... అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నరసరావుపేటను సరకాసుర కోటగా మార్చేశారు. సత్తెనపల్లిని సర్వ నాశనం చేసేశారు. ఆ రెండు నియోజకవర్గాల్లో ఎవరైనా సరే ముఖ్యనేత తనయుడు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ఆయనకు కావాలంటే సొంత భూమినైనా వదిలేసి వెళ్లాల్సిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో కేబుల్ నెట్వర్క్ నడుపుతున్న వారిని బెదిరించి తమ కనెక్షన్లు మాత్రమే ఉండాలంటూ నిర్వాహకులకు హుకుం జారీ చేశారు. నరసరావుపేట పట్టణంలో ఏడాది కిందట జీసీవీని తనకు అప్పగించాలంటూ ఆదేశించారు. అందుకు అంగీకరించకపోవడంతో తన గూండాలను పంపి దాడులకు తెగబడ్డారు.కార్యాలయంపై దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. నేటికీ ఆ కేసులో ఒక్క నిందితుడిని కూడా గుర్తించని పరిస్థితి. ఎన్‌సీవీని నిర్వీర్యం చేయాలనే... పట్టణంలో నడుస్తున్న ఎన్‌సీవీని సైతం నిర్వీర్యం చేసి తన చానల్ మాత్రమే ఉండాలనే పథక రచన చేశారు. ఎన్సీవీ నుంచి కనెక్షన్లు తీసుకుంటున్న కేబుల్ ఆపరేటర్లను ఒక్కొక్కరినీ బెదిరిస్తూ తమ వైపున కు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. నిత్యం కేబుల్ వైర్లు కట్ చేయడం.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇంత చేసినా ఎన్సీవీ యాజమాన్యం లొంగకపోవడంతో సోమవారం సాయంత్రం ఎన్సీవీ కార్యాలయంపై తన గూండాలతో దాడి చేయించి వైర్లు కట్ చేయడమే కాకుండా కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు విన్నవిస్తున్నారు. -
అంతా రహస్యమే..
నరసరావుపేటలో రహస్యంగా వ్యాపారాలు పేటను కల్తీల కోటగా మారుస్తున్న అత్యాశాపరులు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయకున్నా పట్టించుకోని అధికారులు రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావంటే..మనుషుల మధ్య సంబంధాలు చెడగొడతాను..మనుషుల మధ్య ఆంతర్యాలు పెంచుతాను..మనుషుల మనసుల్లో అత్యాశను పెంచి..అదే మనుషుల ప్రాణాలను గాలిలో దీపంలా మారుస్తానని చెప్పిందట..ఇప్పుడ నరసరావుపేట ఆయిల్ వ్యాపారులూ ఈ రూపాయి పేరాశలో మునిగిపోయారు..పసిపిల్లలు తాగే పాల నుంచి వంటిట్లో నూనెల వరకు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిత్యం చెలగాటమాడుతున్నారు..అసలు వీరు ఏమి చేస్తున్నారో కూడా తెలియనంత రహస్యంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. నరసరావుపేట: పట్టణంలో వ్యాపారం మొత్తం రహస్యమే. అంతా కల్తీనే..తాము చేసేది పది మందికీ తెలియకుండా అంతా రహస్యంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు ఇక్కడి ఆయిల్ వ్యాపారులు. వారు ఏ వ్యాపారం చేస్తున్నారో...ఏ పేరుతో వ్యాపారం చేస్తున్నారో అనేది తెలియనే తెలియదు. వీరి దురాశ పుణ్యమాని నరసరావుపేట..కల్తీల కోటగా మారిపోయింది. ఏడాది కాలంలో అధికారులు ఇక్కడ 16 సార్లు పాలు, శనగనూనె మిల్లులు, వాటర్ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు. శనగనూనె, పామాయిల్, తవుడు నుంచి తీసిన రైస్ బ్రౌన్ ఆయిల్‌ను పీపాలు, ట్యాంకర్లతో టోకు మొత్తంగా దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిని తమ సొంత బ్రాండ్లపై తక్కువ రేటు ఉన్న ఆయిల్‌ను ఎక్కువ రేటు ఉన్న ఆయిల్‌తో కలిపి ప్యాకెట్లలో నింపుతున్నారు. రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం చేస్తున్నారు. కోటప్పకొండ, వినుకొండ, సత్తెనపల్లి రోడ్లు, బరంపేట ప్రాంతాల్లో ఇటువంటి ఆయిల్ మిల్లులు ఉన్నాయి. పట్టణంలో కొబ్బరి, శనగగుండ్లతో ఆయిల్ తయారు చేసే మిల్లులు చాలా ఉన్నా వాటికి నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. దాల్, రైస్ మిల్లుల్లో చాలా వాటికీ పేర్లు లేవు. బయటి నుంచి చూస్తే లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కొత్త వ్యక్తులకు పలానా పేరు గల మిల్లు అని చెప్పినా త్వరగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది. పరిశ్రమ పెట్టేందుకు పరిశ్రమల శాఖ, వ్యాపారం చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ, కార్మిక శాఖ నుంచి తగిన లెసైన్స్‌లు పొంది వీరు వ్యాపారం చేయాలి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న వ్యాపారానికి తగిన బోర్డు ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయాలి. నరసరావుపేటలో ఇవేమీ అమలు కావడం లేదు. నేమ్ బోర్డులు తప్పకుండా ఏర్పాటు చేయాలి లెసైన్స్‌లు తీసుకున్న వ్యక్తులు తప్పకుండా నేమ్ బోర్డులు ఏర్పాటు చేయాలి. బోర్డులు లేని వ్యాపారాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం - మంజులారాణి, వాణిజ్యపన్నుల శాఖాధికారి, నరసరావుపేట -
ఆశ పడ్డాడు.. పట్టు బడ్డాడు!
జిల్లాలో అవినీతి ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. సుమారు 15 రోజుల వ్యవధిలో ముగ్గురు చిక్కారు. ఈ నెల పదో తేదీన రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఆమదాలవలస మున్సిపల్ ఏఈ జి.రవి దొరికిపోగా.. 23వ తేదీన ఓ కేసు విషయంలో మూడు వేల రూపాయలు లంచం ఆశించి పొందూరు పోలీసు స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ బెండి త్రినాథ్ పట్టుబడ్డారు. ఇది జరిగి కనీసం 24 గంటలు కూడా గడవకముందే నరసన్నపేట మేజర్ పంచాయతీ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు రూ. 35 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయూరు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు.. ఉద్యోగులను కలవరపరస్తున్నాయి. * రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నరసన్నపేట పంచాయతీ ఈవో * సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న అధికారులు నరసన్నపేట: అది నరసన్నపేట మేజర్ పంచాయతీ కార్యాలయం.. శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు గంటల వరకూ ప్రశాంతంగా ఉన్న అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది.. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసినట్టు తెలుసుకొని సిబ్బంది ఉలిక్కిపడ్డారు. లంచం తీసుకుంటూ ఈవో సీహెచ్ ఉమామహేశ్వరావు, అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని రెడ్‌హ్యాడెడ్‌గా దొరికిపోవడంతో ఆందోళన చెందారు. వివరాల్లోకి వెళితే.. మేజరు పంచాయతీ ఈఓగా పనిచేస్తున్న సీహెచ్ ఉమామహేశ్వరరావును పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ పి.రంగరాజు చెప్పారు. వంశధార కార్యాలయానికి సమీపంలోని స్థలాల్లో ఒక ఇంటి ప్లానుకు సంబందించి రూ. 35 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఈఓతోపాటు అతనికి సహకరించిన కాంట్రాక్టు ఉద్యోగిని కూడా కేసులో బాధ్యునిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పోలాకి గ్రామానికి చెందిన పొట్నూరు వెంకటరమణ నరసన్నపేటలో ఇల్లు నిర్మాణానికి ప్లాన్ అప్రోవల్ కావాలని పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్లాన్ అప్రోవల్ ఇచ్చారు. అరుుతే సకాలంలో ఇల్లు నిర్మాణం కాలేదు. దీంతో ప్లాన్ అప్రోవల్‌కు కాలపరిమితి దాటింది. దీన్ని గమనించిన ఈఓ ఉమామహేశ్వరావు కొత్తగా ప్లాన్ పెట్టాలి, లేదా దీనిని రెన్యువల్ చేయాలని.. దీనికి కొంత ఖర్చు అవుతోందని వెంకటరమణకు చెప్పారు. అన్నీ సక్రమంగా ఉన్నా ప్లాన్ అప్రోవల్ రెన్యువల్‌కు రూ. 50 వేలు కావాలని డిమాండ్ చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. డబ్బు ఎందుకు ఇవ్వాలని వెంకటరమణ వాదించారని, అరుుతే డబ్బు ఇవ్వనిదే పనులు జరగవని ఈవో తేల్చి చెప్పినట్టు డీఎస్పీ వివరించారు. ఈవోకు రూ. 35 వేలు ఇచ్చేందుకు వెంకటరమణ అంగీకరించి.. తరువాత తమను ఆశ్రరుుంచినట్టు తెలిపారు. దీంతో 35 వేల రూపాయలను వెంకటరమణకి ఇచ్చి పంపించామని, ఆ సొమ్మును ఉమామహేశ్వరరావుకు ఇస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు. తీసుకున్న డబ్బు అక్కడే ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రఘుపాత్రుని శేఖర్‌కు ఈవో ఇవ్వడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టుకు తరలించామన్నారు. కాగా చీకటి పడిన తరువాత మారుతీనగర్‌లోని ఈఓ ఇంటి వద్ద కూడా తనిఖీలు చేపట్టారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐ కె.శ్రీనివాసరావు ఉన్నారు. రికార్డులు ఇచ్చేందుకు ససేమిరా ఏసీబీ అధికారులకు ఒక దశలో కొన్ని రికార్డులు ఇచ్చేందుకు పంచాయతీ సిబ్బంది ససేమిరా అన్నారు. ప్లాన్ అప్రోవల్‌కు చెందిన రికార్డులు కావాలని ఏసీబీ అధికారులు కోరగా కాగితాలు లేవని తప్పించుకోవడానికి చూశారు. దీంతో అధికారులు మరింత ఒత్తిడి చేయడంతో మరో గది నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. -
నరసరావుపేట.. అరాచక కోట
రాజ్యాంగేతర శక్తిగా మారిన టీడీపీ ముఖ్యనేత తనయుడు ఆగడాలకు అడ్డుపడినా..ప్రశ్నించినా దౌర్జన్యాలు, తప్పుడు కేసులు విలేకరులపై దాడులకు తెగబడుతున్న అధికారపార్టీ గూండాలు రౌడీ షీటర్లకు అధికారపార్టీ, పోలీసుల అండదండలు అవినీతి, అక్రమాలపై కథనాలు రాసినందుకే ‘సాక్షి’ విలేకరిపై దాడి పోలీసుల తీరుపై మండిపడుతున్న జర్నలిస్ట్, ప్రజాసంఘాలు ఒకప్పుడు బాంబుల మోతలు... ఫ్యాక్షన్ హత్యలు... రిగ్గింగ్‌లతో అట్టుడికిపోయిన నరసరావుపేట నియోజకవర్గంలోని పల్లెలు పదేళ్లుగా ప్రశాంతంగా ఉన్నాయి. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరసరావుపేట అరాచక కోటగా మారింది. దౌర్జన్యాలు, దాడులతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. గుంటూరు : అధికార పార్టీలో ముఖ్యనేత ఒకరు తన కనుసన్నలతో నియోజకవర్గాన్ని శాసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన తనయుడు మరో అడుగు ముందుకేసి ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించేశారు. అధికారుల బదిలీలనుంచి కార్యాలయాల్లో ఫైళ్ళ వరకు ధర నిర్ణయించి ధనార్జనే ధ్యేయంగా దందా కొనసాగిస్తున్నారు. తన ఆగడాలకు అడ్డుపడిన వారిపై దౌర్జన్యాలకు దిగడం, పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు బనాయిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఆయన అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తూ కథనాలు రాసే విలేకరులపైనా దాడులకు తెగబడుతు న్నారు. ముఖ్యనేత తనయుని అక్రమాలు, అరాచకాలపై వార్తలు రాయడం, తన అనుచరుడైన రౌడీషీటర్ పోలీస్‌స్టేషన్‌లో చేస్తున్న సెటిల్మెంట్లపై కథనం రాసినందుకు ‘సాక్షి’ నరసరావుపేట రూరల్ రిపోర్టర్ శివకోటిరెడ్డిపై గురువారం రాత్రి దాడికి ఉసిగొల్పారు. దీని వెనుక పోలీసు అధికారుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలను కాపాడాల్సిన పోలీసులే రౌడీషీటర్లతో చేతులు కలిపి ఇలాంటి చర్యలకు దిగడం హేయమైన చర్యగా జర్నలిస్ట్, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్ కోసం వెళ్తే ముందుగా ముఖ్యనేత తనయుని ఆమోద ముద్ర వేయించుకుని రమ్మంటూ సాక్షాత్తు రెవెన్యూ అధికారులే చెబుతుండడం గమనార్హం. ఎకరాకు రూ.లక్ష చొప్పున చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది. కోటప్పకొండ వద్ద వంద ఎకరాలు వెంచర్‌వేసిన ఓ రియల్టర్ ముఖ్యనేత తనయునికి అక్షరాల రూ. 50 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. అగ్రహారం గ్రామంలో పొలం తాను అడిగిన రేటుకు అమ్మలేదని దేవుడు మాన్యమంటూ ప్రచారం చేసి అధికారులచే జెండాలు పాతించారు. దీంతో బాధితులు ఇచ్చినంత తీసుకొని 20 ఎకరాల భూమిని ముఖ్యనేత తనయుని చేతిలో పెట్టారు. నరసరావుపేటలో అపార్టుమెంటు కట్టాలన్నా, రోడ్లు, డ్రెయిన్ల పనులు చేయాలన్నా, ముఖ్యనేత తనయుడు నిర్ణయించిన పర్సంటేజీలు చెల్లిస్తేనే అక్కడ పనులు జరుగుతాయి. ఫిర్యాదు చేశారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు గతంలో వ్యవసాయ పరికరాల మంజూరులో డబ్బులు అడిగారంటూ కొందరు టీడీపీ నాయకులే జిల్లా ఉన్నతాధికారులకు ముఖ్యనేత తనయునిపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. తన అవినీతిని బహిర్గతం చేశారనే కోపంతో వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి రౌడీషీట్లు కూడా తెరిపించారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా విలేకరులపై దాడులకు ఉసిగొల్పుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అవగతమవుతోంది. రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలు, కాంట్రాక్టర్లు, అధికారులతోపాటు, సొంత పార్టీ నాయకులను సైతం పట్టి పీడిస్తున్న ముఖ్యనేత తనయుని దౌర్జన్యకాండపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జిల్లాలో నివాసం ఉంటున్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ముఖ్యనేత తనయుని ఆగడాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ఉన్నతాధికారులైనా నరసరావుపేటపై దృష్టి సారించి ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు. -
చంద్రబాబువి నీతిమాలిన రాజకీయాలు మాజీ మంత్రి కాసు
నరసరావుపేట వెస్ట్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీతి మాలిన రాజకీయాలకు తెరతీశారని మాజీ మంత్రి, పీసీసీ క్రమ శిక్షణ సంఘం చైర్పర్సన్ కాసు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. తన గృహంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని కాసు ప్రశ్నించారు. రాను రాను విలువలతో కూడిన రాజకీయాలు తెరమరుగు కావటం బాధగా ఉందన్నారు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ తగ్గిపోతున్నాయన్నారు. నరసరావుపేటలో అధికారులు, పాలకులకు ముందుచూపులేకపోవటం వల్లనే తాగునీటి ఇబ్బందులు వచ్చాయన్నారు. రెండు, మూడు నెలలుగా తాను పరిస్థితిపై హెచ్చరిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. స్వచ్ఛ నరసరావుపేటకు తిలోదకాలు ఇచ్చారని, ఎక్కడ చూసినా కంపు కొడుతోందన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల నాటికైనా పూర్తిస్థాయిలో తాగునీరు అందించాలని, లేకుంటే లక్షలాది మంది యాత్రికలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం వెన్నుపోటులతో కూడిందేనని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఆశచూపించి తన పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. -
ముద్రగడకు కూరగాయల వర్తకుల మద్దతు
- ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వేసిన వర్తకులు నరసరావుపేట (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టోలో పొందుపరచిన కాపుల రిజర్వేషన్‌ను అమలుచేయాలని కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన కాపు నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతు పెరుగుతోంది. నరసరావుపేటలోని లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తకులు శనివారం కూరగాయల మార్కెట్ ముందు ఖాళీ కంచాలపై గరిటెలతో డప్పు వాయిస్తూ ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాపుల రిజర్వేషన్‌పై వెంటనే జీవో జారీచేయాలని, కాపు నాయకులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. లాల్‌బహదూర్ కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనకు వర్తక సంఘ అధ్యక్షుడైన షేక్ ఆదంషఫీ కూడా పాల్గొని మద్దతును తెలియజేశారు. -
టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ!
-- ఈఈని కలిసిన చిలకలూరిపేట ఎన్ఎస్పి ఉద్యోగులు -- ఇళ్లకు నీళ్ళు, కార్యాలయానికి కరెంట్ నిలిపివేత -- ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఉద్యోగులకు బెదిరింపులు -- మీరే పరిష్కరించుకోవాలంటున్న ఉన్నతాధికారులు నరసరావుపేట రూరల్ (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం తమను ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చిలకలూరిపేటలోని ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ క్యాంప్ కాలనీ వాసులు లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.ఆర్ మోహిద్దీన్‌కు శనివారం మొరపెట్టుకున్నారు. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో కలసి భాధితులు శనివారం ఈఈని కలిసారు. ఎన్ఎస్పి ఓఅండ్ఎమ్ సెక్షన్లో పనిచేస్తున్న 10 కుటుంబాలవారు క్యాంప్ కాలనీలో అనేక ఏళ్ళగా నివసిస్తున్నామని తెలిపారు. కాగా ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉందంటూ క్యాంప్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికే డ్రెయిన్లతో పాటు పైలాన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. తాము నివసిస్తున్న ఇళ్ళను కూల్చివేస్తామని, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నరని తెలిపారు. ఇళ్ళకు తాగునీరు సరఫరాతో పాటు కార్యాలయానికి కరెంటు కట్‌చేసినట్టు పేర్కోన్నారు. దీంతో కాలనీలో నివసించే కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నట్టు వివరించారు. ఎన్ఎస్పికి చెందిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. తమ జీతంలో ప్రతి నెలా ఇంటి అద్దెను మినహాయిస్తున్నారని తెలిపారు. ఎన్ఎస్పి స్థలంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం కోసం మమ్మల్ని రోడ్లు పాలు చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్ళాలో అర్ధంకావడం లేదన్నారు. దీనిపై స్పందించిన ఈఈ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆయన యూనియన్ నాయకులకు సలహా ఇచ్చాడు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తమ శాఖల నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఇండ్లను ఎలా ఖాళీ చేయించుతారని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటి చేపట్టిన పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్‌జీవొ నాయకులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియాన్ నాయకులు ఎన్.నాగరాజు, సి.కొండారెడ్డి, యం.మరియదాసు, ఎ.శివ, కోటిరెడ్డి, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేనూ పల్నాటి బిడ్డనే..!
వృత్తి పరంగా డాక్టర్ని అయినా తానూ పల్నాటి బిడ్డనేనని, ఇక్కడి గాలి పీల్చుతున్న వాడినేనని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కేసులకు, పోలీసులకు బెదిరేది లేదన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల తరపున పోరాటం చేస్తున్న తనను బలవంతంగా స్టేషన్‌కు తరలించడాన్ని తప్పు పట్టారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పాలకపక్షాన్ని హెచ్చరించారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల
-
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విడుదల
గుంటూరు: గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకుని, రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకు ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా సోమవారం ఉదయం నరసరావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసేందుకు ప్రయత్నించగా శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అరెస్ట్
-
నరసరావుపేట ఎమ్మెల్యేపై కేసు నమోదు
గుంటూరు : నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదయింది. తమ భూముల్లో రోడ్లు వేస్తున్నారంటూ ఈ నెల 11వ తేదీన రామిరెడ్డిపాలెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామస్తులకు మద్దతుగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
ఫైనాన్స్ కంపెనీలపై పోలీసుల దాడులు
నర్సరావుపేట (గుంటూరు) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'కాల్ మనీ' వ్యవహారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న పలువురిని అరెస్ట్ చేయడంతోపాటు ఫైనాన్స్ కంపెనీలపై నిఘా పెంచారు. తాజాగా గుంటూరు జిల్లా నర్సరావుపేటలో గురువారం సాయంత్రం నుంచి పలు ఫైనాన్స్ కంపెనీలతో పాటు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో దాదాపు 100 మంది పోలీసులు పాల్గొంటున్నారు. -
గుంటూరులో శివమణి ప్రదర్శన
-
వడదెబ్బకు 31 మంది మృతి
నెట్వర్క్ : జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటూనే ఉన్నాయి. గురువారం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వడగాడ్పులకు మొత్తం 31 మంది మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలూరిపేట పట్టణం సాంబశివనగర్ మొదటి లైనులో కొప్పుల పాండురంగనాయకమ్మ (62), నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో కొరిటాల దుర్గ (45), పాలపాడులో పత్తి ఏడుకొండలు (65), నరసరావుపేట పట్టణం నవోదయనగర్‌లో కె.హరిప్రసాద్ (61), వెంకటరెడ్డినగర్‌లో మరో వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు సీతారామరాజు కాలనీకి చెందిన సుశీలమ్మ (75), ఖాజీపాలెం గ్రామానికి చెందిన నారాయణం లక్ష్మీనరసమ్మ(65), చందోలు గ్రామానికి చెందిన ముతహరున్నీసా(75) మృతి చెందారు. దాచేపల్లి మండలం కేసానుపల్లిలో కుంకలగుంట శాంతమ్మ(58), పొందుగల గ్రామ పంచాయతీ పరిధి శ్రీనివాసపురంలో బొజ్జా వెంకటరావమ్మ(45), భట్రుపాలెంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన వికలాంగురాలు భూక్యా బుజ్జిబాయి(30) మృతి చెందారు. గురజాల రూరల్ మండలం మాడుగులలో నాగెండ్ల సింగరయ్య(65), రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన షేక్ సుభాని (65), దుర్గి మసీద్ సెంటర్లో ఉండే రాయనబోయిన జానమ్మ(70), ముటుకూరులో గోసుల నాగులు భార్య గంగమ్మ(60) వడదెబ్బకు గురై మృతి చెందారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో గుడిపూడి సాంబశివరావు (57), దుగ్గిరాల మండలం ఈమనిలో పేరుకలపూడి వరహాలు(65), మండల కేంద్రం పెదనందిపాడులో దాసరి ఆదిశేషమ్మ(83) మృతి చెందింది. కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెంలో పిట్టు వెంక మ్మ(60), చెరుకుపల్లి మండలం ఆరుంబాక పంచాయతీ ఎస్టీ కాలనీలో చౌటూరి సోమయ్య(36), పొదిలివారిపాలెంలో పొదిలి లక్ష్మీ నరసమ్మ(77), ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లలో యర్రంరెడ్డి పేరమ్మ(70), కొండ్రమూట్లలో అలవాలపల్లి నర్సారెడ్డి(70), ముప్పాళ్లకు చెందిన మాజీ రేషన్ డీలర్ షేక్ హుస్సేన్‌బీ(96) వడదెబ్బకు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొమ్మినేని కృష్ణమూర్తి(62), పల్లెకోన గ్రామంలో చిలుమూరు రాజు(55), వెల్లటూరులో వాకా సీతారామయ్య(60), పొన్నూరు పట్టణానికి చెందిన వేముల లోక (75), పొన్నూరు పట్టణ 23వ వార్డుకు చెందిన గోళ్లమూడి ఆదాము(54), చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన మానుకొండ అంజమ్మ(70),గుంటూరు కొత్తపేటలో మిర్చి కమీషన్ వ్యాపారి సన్నిధి నాగ ఆంజనేయులు (63) వడదెబ్బకు గురై మృతి చెందారు. -
ఆయిల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
-
ఆయిల్ మిల్లులో అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లా నరసారావుపేట శివారులోని దివ్య నాగసాయి ఆయిల్‌మిల్‌లో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటాలార్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని ఆయిల్ మిల్ యాజమాన్యం వెల్లడించింది. -
అమెరికాలో నర్సరావుపేట యువతి మృతి
గుంటూరు: ఉన్నత చదవుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి ఒకరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన అబ్బూరి లావణ్యగా గుర్తించారు. అలబామాలోని ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీలో చదువుతున్న లావణ్య ప్రమాదవశాత్తు కొలనులో జారిపడి మృతి చెందింది. లావణ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
భార్యతోనే భర్త....
నరసరావుపేట: భార్య ఆత్మహత్య చేసుకోవడంతో భర్త కూడా మనఃస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన గుంటూరు నాగరాజు(33)కు, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన మాధవితో పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం. వారు పర్చూరులో నివాసం ఉంటుంన్నారు. నాగరాజు ఒక హోటల్లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనఃస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దాంతో మాధవి ఆదివారం తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నాగరాజు తట్టుకోలేకపోయాడు. మాధవిలేని తన బతుకు ఎందుకు? అనుకున్నాడు. మనఃస్తాపం చెందిన నాగరాజు స్థానిక ప్రకాశ్ నగర్ ఆంధ్రా బ్యాంకు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మధ్యాహ్నం నంద్యాల నుంచి నల్లపాడు వెళ్లే గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ** -
వైసీపీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి
-
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి
గుంటూరు జిల్లాలో టీడీపీ అరాచకాలకు అడ్డుకట్ట పడటంలేదు. సాక్షాత్తు స్పీకర్ కోడెల శివప్రసాదరావు పాత నియోజకవర్గమైన నరసరావుపేటలోనే ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గొడ్డళ్లతో దాడి జరిగింది. నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘోరం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్యకర్తలు నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడినవాళ్లు కూడా స్పీకర్ కోడెల అనుచరులేనని బాధితులు ఆరోపిస్తున్నారు. నిండు శాసనసభలో స్పీకర్‌కే శాంతిభద్రతల విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెప్పుకొన్నా, ఆయన సొంత ప్రాంతంలోనే మళ్లీ అదేరోజు దాడులు జరగడం గమనార్హం. -
స్నేహితులంటే వారే!
సాదారణంగా స్నేహితులు కలిస్తే ఏం చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తారు అని టక్కున సమాదానం వస్తుంది. తరువాత ఫోటోలు, వీడియోలు, ఆ తరువాత ఫేస్ బుక్, వాట్స్ అప్ లోడ్ చేయటం....ఇలా అనేకం వస్తాయి. కాని కొందరు స్నేహితులు ప్రత్యేకంగా ఉంటారు. వారు చేసే పనులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సమాజానికి ఉపయోగపడేవిధంగా,ఆదర్శంగా ఉంటాయి. అటువంటి అయిదుగురు స్నేహితుల పరిచయమే ఈ కథనం. అయిదుగురు స్నేహితులు. శరీఫ్, నవీన్ రెడ్డి, కోటేశ్వర్ రావు, ఫనీ, మురళీ కృష్ణ. చిన్నపటి నుంచి కలసి చదువుకున్నారు. కలిసి తిరిగారు. ఆడుకున్నారు. అందరూ గుంటూరు జిల్లా నరసరావుపెటకు చెందిన వారు. స్థానిక ఎస్.కె.ఆర్.బి.ఆర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు కలసి చదువుకున్నారు. కాలేజీలో చదువు తున్నప్పుడు ఉద్యోగంలో సెటిల్ అయ్యాక సమాజానికి ఉపయోగపడే పని ఎదో చేయాలని అనుకున్నారు. బీ.టెక్. పూర్తి కాగానే అందరు వివిధ ఐటీ కంపనీలలో ఉద్యోగాలలో చేరాక వారు అనుకున్నది సాదించారు. 2005లో ఫ్రెండ్స్ టు సపోట్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. రక్తదానం చేస్తూ, దాని పట్ల అందరికీ అవగాహన పెంచుతూ ఎందరో ప్రాణాలని నిలబెడుతున్నారు. హైదరాబాద్‌లో 200 మంది రక్తదాన దాతలతో ప్రారంభమైన సంస్థలో ఇప్పుడు లక్షా 50 మందిపైగా డోనర్స్ దేశ వ్యాప్తంగా ఉన్నారు. రోజు 150 కొత్త డోనర్లు యాడ్ అవుతున్నారు. అట్లాగే 800 మంది రోగులు రక్తం అందుకుంటున్నారు. ఇంత జరిగినా ఈ సంస్థలో ఎవరికి పదవులు లేవు అందరు జస్ట్ ఫ్రెండ్స్. కేవలం ఐదుగురు లైక్ మైడెడ్ ఫ్రెండ్స్ కలస్తే ఒక మంచి పని సాద్యం అని వీరు అంటారు. నిరూపించారు కూడా. ఫ్రెండ్స్ టూ సపోట్ సంస్థ ఇప్పటికే ఎన్నో జాతీయ , అంతర్జీతీయ స్థాయి అవార్డులు పొందింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరుసగా ఐదు సంవత్సరాల నుంచి స్థానం సంపాదించింది. ఈ సంస్థ ఎక్కువగా పట్టణ ప్రాంతాలవారికి అందుబాటులో ఉంటుందని, రాబోయే రోజుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫోన్లో రక్తం అవసరం ఉన్న వారికి సమాచారం అందచేయాలని ఈ స్నేహితులు ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు ఫలించాలని, నలుగురికి ఉపయోగపడుతూ, మరో నలుగురికి ఆదర్శంగానిలవాలని ఆశిద్ధాం. - శిసూర్య -
దొంగల పార్టీకి అవకాశమిచ్చారు
నరసన్నపేట: రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోయి దొంగల పార్టీకి అవకాశమిచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో ఓటమికి గురైనప్పటికీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను సమష్టిగా పోషిస్తే భవిష్యత్‌లో అధికారం వైఎస్సార్ సీపీదేనని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం జరిగిన పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జన్మదినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలించే దొంగలతో పాటు ఈనాడు రామోజీరావు కూడా దొంగల పార్టీలో సూత్రధారేనని చెప్పారు. ఆ మీడియాకు నచ్చనివారు వ్యతిరేకిస్తే వెన్నుపోటు, నచ్చినవారు వ్యతిరేకిస్తే తిరుగబాటు అనేది ఈనాడు నీతి సూత్రమని ఎద్దేవా చేశారు. చంద్రబాబును అధికారంలోకి తేవడానికే.. ఆయన వస్తే రుణాలు మాఫీ అయిపోతాయంటూ తమ పత్రికలో రాసి ప్రజలను మోసగించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మాత్రం ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలంటూ బాబు అబద్ధాలకు ప్రజల్ని బలిచేసే మరో మోసానికి ఎల్లో మీడియా పాల్పడుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కాకుండానే కప్పదాట్లు వేస్తున్న ప్రభుత్వ తీరును కొద్ది రోజులు వేచి చూద్దామని, ఆ తరువాత నిలదీద్దామని చెప్పారు. గ్రామాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించినప్పుడు ఎన్నికల హామీలపై నిలదీయాలని సూచించారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లో బాధ్యతగల ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరించిన తీరుతో పార్టీ నాయకుల్లో, ప్రజల్లో రాష్ట్రానికి దిక్సూచి ఆయనేనని, సమర్థమైన పాలన అందించేందుకు సరైన నాయకుడు రాష్ట్రానికి దొరికాడని ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని ధర్మాన చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వి.కళావతి, కె.జోగులు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
వారి పనిపడతా: రాయపాటి
నరసరావుపేట: నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకుని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా ఎన్నికైన ఆయన శనివారం నరసరావుపేట వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన విజయానికి చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం దోహదపడ్డాయని చెప్పారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఇటీవల జరిగిన జమిలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర అధికారులను గుర్తించామని, తగిన సమయంలో వారి పనిపడతామన్నారు. -
ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుచేస్తా
నరసరావుపేట వెస్ట్, న్యూస్‌లైన్ :నరసరావుపేట కేంద్రంగా పలనాడు ప్రాంతాన్ని కలుపుకొని ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుకు కృషిచేస్తానని నరసరావుపేట ఎంపీగా ఎన్నికైన రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఎంపీగా విజయం సాధించిన అనంతరం శనివారం ఆయన నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను రాజకీయాలు చేయనని, అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు. వారానికి రెండురోజులపాటు నరసరావుపేట పార్లమెంటు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పలనాడులోని ప్రజలు ఫ్లోరైడ్, వెనుకబాటుతనం, నిరుద్యోగం లాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఎంపీ నిధులతో గ్రామాల్లో సోలార్, మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు. నరసరావుపేటలో కాపులకోసం కమ్యూనిటీహాలు, ముస్లింలకు రెండవ షాదీఖానా, ఖబర్స్తాన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు, రెవెన్యూ అధికారులను గుర్తించామని చెప్పారు. వారిని సరైన సమయంలో శిక్షిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వం, పవన్ కల్యాణ్ ప్రచారం తన విజయానికి కారణమని చెప్పారు. వాస్తవానికి ఇంకా ఎక్కువ మెజార్టీ రావలసి ఉందని అంటూ, నియోజకవర్గంలో తనకు వచ్చిన మెజార్టీపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.2 లక్షలతో గృహనిర్మాణాలను చేపట్టి మూడుగదులతో నిర్మించి ఇస్తామని, ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. నరసరావుపేట-పిడుగురాళ్ళ రైల్వేలైను నిర్మాణానికి కృషిచేస్తామని, డబుల్ డెక్కర్ రైలు జిల్లాలో ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, టీడీపీ చైర్మన్ అభ్యర్థి నాగసరపు సుబ్బరాయగుప్తా, కనపర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఓటు వేయవద్దని డబ్బు పంపిణీ!
గుంటూరు: ఎన్నికల వేళ అభ్యర్థులు దారుణాతిదారుణాలన్నింటినీ రెండు రోజుల్లో చూపిస్తారు. నమ్మలేనివిధంగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నికలలో గెలవడం కోసం డబ్బు - కులం - మద్యం - మతం - ప్రాదేయపడటం - బెదిరింపు...ఇలా ఏది వీలైతే అది, దేని ద్వారా పని అవుతుందనుకుంటే దానిని అనుసరిస్తుంటారు. చిత్రవిచిత్రాలు అన్ని చూపిస్తారు. విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తారు. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలు ప్రకటించినా పట్టించుకునేవారులేరు. ఆ నిబందనలు అన్నింటినీ తుంగలోతొక్కి వారి పని వారు చేసుకుంటూ పోతున్నారు. సాదారణంగా అభ్యర్థులు తమకు ఓటు వేయమని డబ్బులు ఇస్తుంటారు. కానీ గుంటూరు జిల్లా నరసరావుపేటలో మాత్రం అసలు ఓటు వేయవద్దని డబ్బులు పంచుతున్నారు. బిజెపి అంటే ముస్లీంలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఓటు వేస్తే బిజెపియేతర పార్టీకి ఓటు వేస్తారు. అందువల్ల వారిని ఓటింగ్‌కు రావద్దని డబ్బు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. సాలెంనగర్, ఇస్లాంపేటలలో విచ్చలవిడిగా డబ్బుపంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అత్యధిక మెజార్టీ ఖాయం
నరసరావుపేట ఈస్ట్, న్యూస్‌లైన్ :జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందనున్న నియోజకవర్గాల్లో నరసరావుపేట మొదటి స్థానంలో నిలుస్తుందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. మూడున్నరేళ్లుగా పార్టీ కోసం పని చేశానని, సమస్యలపై ఉద్యమాలు, దీక్షలు చేపట్టిన విషయం ప్రజలందరికి తెలుసని చెప్పారు. ప్రజలతో మమేకమైతేనే వాళ్లకు ఏం కావాలో తెలుసుకోగలుగుతామని, డబ్బుతో రాజకీయాలు చేయలేమని తెలిపారు. పట్టణం, గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహన ఉందని, పార్టీ అధికారంలో రాగానే పరిష్కరిస్తానని చెప్పారు. నరసరావుపేట ప్రజలు ఆత్మసాక్షిగా ఓటు వేయాలని, ప్రజల తరపున నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవడం చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు ఏ విధంగా మళ్లీ పొత్తుపెట్టుకున్నారని ప్రశ్నించారు. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తున్నాయని, అయినప్పటికీ వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని జననేత జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అన్నవరపు కిషోర్, పార్టీ పట్టణ యువజన విభాగం కన్వీనర్ రామిశెట్టి కొండ, ఎంఐఎం నాయకులు షేక్ మస్తాన్‌వలి, కాపు యువజన నాయకుడు ఎన్కే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ గెలిస్తే మంత్రి పదవి బోనస్..
రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ బహుళ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అనేది ఆ సెంటిమెంటు. గతంలో చాలాసార్లు ఆ విధంగా జరిగింది. ఈసారి అందరూ కొత్తవారే పోటీచేస్తున్న నేపథ్యంలో తొలిసారి గెలవగానే ఈ సెంటిమెంట్ ప్రకారం మంత్రి కూడా అయ్యే అదృష్టం ఉందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో గెలిచిన వారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెంటనే మంత్రులైన ఘనత ఉంది. రాజకీయ ఉద్దండుల కోటగా పేరొందిన నరసరావుపేట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఇది. అక్కడి నుంచి గెలిచిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఏడున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇంకో విశేషమేమిటంటే నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు దానికి ముందో, తర్వాతో ముఖ్యమంత్రులుగా కూడా చేసిన చరిత్ర ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆ కోవలోకి వస్తారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి 1983లో జరిగిన ఎన్నికలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవిని అలంకరించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారి రాష్ట్ర హోం మంత్రి పదవి పొందిన వ్యక్తిగా కోడెల రికార్డుల్లోకి ఎక్కారు. అక్కడి నుంచి వరుసగా మరో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. కోడెలకు ప్రత్యర్ధిగా ఉన్న కాసు వెంకటకృష్ణారెడ్డి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో మంత్రిగా కొనసాగారు. అయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే సెంటిమెంట్ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయినట్టేనని నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అదృష్టజాతకుడెవరో వేచి చూడాలి. -
జనహోరు..
- జననేతకు నీరాజనం పలికిన జిల్లా ప్రజలు - మండుటెండలోనూ తరగని అభిమానం - వైఎస్ జగన్ మూడురోజుల పర్యటన విజయవంతం - పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత పర్యటన - ఫ్యాన్ ప్రభంజనాన్ని చాటిన జనభేరి ప్రచారం నిరంతరం తమ సంక్షేమం కోసం పరితపించే నాయకుడెవరో.. తమ కలలు సాకారం చేయగల సమర్థుడెవరో ప్రజలకు బాగా తెలుసు.. అందుకే జననేతపై అభిమానం చాటుకున్నారు. భానుడు నిప్పులు చెరుగుతున్నా వెరవలేదు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ఎర్రటి ఎండలోనూ గంటలకొద్దీ నిరీక్షించారు. ఆత్మీయానురాగాలు పంచారు. వారందరిలో ఒకటే ఆశ.. రాజన్న బిడ్డను చూడాలని, ఆ అభిమాన నేత పలుకులు వినాలని. జనభేరి రథంపై చిరునవ్వులు చిందిస్తూ తమ ముందుకు వచ్చిన జగనన్నను చూడగానే వారి ముఖాల్లో వెలిగిపోయాయి. వైఎస్సార్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం విజయవంతమైంది. ఆయన పర్యటన ఫ్యాన్ ప్రభంజనానికి అద్దం పట్టింది. జగన్ ఉద్వేగపూరిత ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహాన్ని నింపాయి. సాక్షిప్రతినిధి, గుంటూరు, వైఎస్సార్ జనభేరికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన జననేతకు ప్రతి పల్లెలోనూ అఖండ స్వాగతం లభించింది. ఈ నెల 21వ తేదీ సోమవారం రాత్రి తెనాలి నియోజకవర్గం కొల్లిపర చేరుకొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులు గుదిబండి చినవెంకటరెడ్డి నివాసంలో బస చేశారు. మంగళవారం ఉదయం 10.45 నిమిషాలకు మాతృ వియోగంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. డెల్టాలో అపూర్వ స్వాగతం.. జిల్లాలో ఎన్నికల పర్యటనకు వచ్చిన జగన్‌కు డెల్టా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 11.05 నిముషాలకు కొల్లిపర నుంచి జగన్రోడ్షో ప్రారంభించారు. రోడ్ల వెంట బారులు తీరిన అశేష జనవాహిని, ప్రజలు, కార్యకర్తలు, మహిళలు, వృద్ధులు అభిమానం కురిపించారు. కొల్లిపర నుంచి బయలుదేరిన ఆయనకు తూములూరు వద్ద ఇటుకబట్టీ కార్మికులు, మహిళలు, మొక్కజొన్న రైతులు స్వాగతం పలికి వారి సమస్యలను వివరించారు. త్వరలోనే మీ కష్టాలన్నీ తీరుస్తానంటూ వారికి జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి శిరిపురం అడ్డరోడ్డుకు చేరగానే ప్రజలు జగన్‌పై పూలవాన కురిపించారు. అనంతరం అత్తోట చేరుకున్న జగన్‌కు రైతులు, రైతుకూలీలు వారి సమస్యలను వివరించారు. మీరు ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు తీరుతాయంటూ తెలిపారు. నంబూరు, కాజా గ్రామాల మీదుగా మంగళగిరిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఆయన చెప్పే ప్రతి మాటకు హర్షధ్వానాలు చేశారు. మంగళగిరి నుంచి దుగ్గిరాల మీదుగా తెనాలి చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అప్పటికే ప్రచార సమయం ముగియడంతో ఆయన ప్రసంగించకుండానే వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వేలసంఖ్యలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఆయనను అనుసరించారు. అక్కడి నుంచి ఆయన రాత్రి వినుకొండలోని బాలాజీ ఎస్టేట్స్‌కు చేరుకొని బస చేశారు.విను‘కొండంత’ అభిమానం... బాలాజీ ఎస్టేట్స్ నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు ప్రచారానికి బయలుదేరిన జగన్‌కు వేలసంఖ్యలో ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలతో కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. నారపురెడ్డి పల్లె వద్ద బీఈడీ కళాశాల విద్యార్థులను, మార్గంమధ్యలో రైతులు, మహిళలను పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. వినుకొండ పట్టణానికి చేరుకొనే సరికి సమయం సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలైంది. సుమారు గంటసేపు మండుటెండలో ఆయన ప్రసంగించారు. అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా బహిరంగసభ నుంచి వెళ్లలేదు. అనంతరం వినుకొండ నుంచి ప్రకాశం జిల్లా సంతమాగులూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించిన ఆయన నరసరావుపేట మండలం లక్ష్మీపురం, పిట్లూరివారిపాలెం మీదగా చిలకలూరిపేట బహిరంగసభకు హాజరయ్యారు. అన్నిగ్రామాల్లోనూ ప్రజల ఎదురేగి ఘనస్వాగతం పలికారు. చిలకలూరిపేటలో బహిరంగసభ అనంతరం పొన్నూరుకు చేరుకొని రాత్రి బసచేశారు. గురువారం ఉదయం పొన్నూరులో రోడ్‌షో అనంతరం అక్కడ జరిగిన బహిరంగసభలో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. శోభమ్మ అక్కలాంటింది..:జగన్ పొన్నూరు బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ ‘మీ అందరికో విజ్ఞప్తి ... ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం నాకు తెలిసింది. శోభమ్మ కారు ప్రమాదంలో గాయపడటం నా మనసును తీవ్రంగా కలచివేసింది. శోభమ్మ నాకు అక్కలాంటిది. నా కోసం ఆమె ఎంతో చేశారు. నా ప్రతి అడుగులోనూ అడుగై నడిచారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వెళ్తున్నా.. మండుటెండలో మేమంతా వేచి ఉంటే జగన్ మాట్లాడకుండా వెళుతున్నారని ఏమీ అనుకోవద్దు.. జగన్ మీ మనిషి... మీరు కాకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు..ఒక్క విషయం చెప్పదలచుకున్నా పొన్నూరు నియోజకవర్గ పార్టీ అభ్యర్తి రమణను, గుంటూరు ఎంపీ అభ్యర్థి బాలశౌరిలను గెలిపించండి’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. జగన్ పర్యటనతో జిల్లా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. పార్టీలో చేరిన ప్రముఖులు.. జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ సమక్షంలో పలువురు రాజకీయ ప్రముఖులు పార్టీలో చేరారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే చల్లా నారపరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షేక్ సుభాని, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దాసరి కిరణ్‌కుమార్, టీడీపీ నేత ఉగ్గిరాల సీతారామయ్య తదితరులు చేరినవారిలో ఉన్నారు. -
అవసరమైతే పోలింగ్ బూత్‌లోకి పోలీసులు
నరసరావుపేటవెస్ట్, న్యూస్‌లైన్ :నేరస్తులుగా పాతరికార్డులు ఉన్న వ్యక్తులు ఓటువేసేందుకు బూత్‌లలోకి వెళ్ళిన సమయంలో పోలింగ్ అధికారుల అభ్యర్థనపై పోలీసులు వారి వెంట ఉంటారని గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాత నేరస్తులు, రికార్డులు ఉన్న వ్యక్తులు పోలింగ్ బూత్‌లలోకి వెళుతుంటే క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తామని చెప్పారు. మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు సమయానికి స్పందించి మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులను వెంటనే అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినందుకు పోలీసులను ప్రశంసిస్తున్నానన్నారు. ఇంకా రెండు విడతల ఎన్నికలను పోలీసులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అధికారులు, సిబ్బంది చాలా బాగా పనిచేశారని కొనియాడారు. సమావేశంలో రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ, నరసరావుపేట డీఎస్పీ డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలపై పుస్తకాలు ముద్రణ ఏటీ అగ్రహారం(గుంటూరు): ఎన్నికల నిబంధనలపై ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ పలు రకాల సూచనలు ఆదేశాలతో కూడిన నూతన పుస్తకాలను రూపొందించారు. రెండు రకాలుగా రూపొందించిన ఈ పుస్తకాల్లో ఎన్నికల బందోబస్తు, డ్యూటీ సమయంలో అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, పలు సూచనలతో కూడిన వివరాలను పొందుపరిచారు. వీటిని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులకు, ప్రజలకు పంపిణీ చేసేందుకు 5 వేల పుస్తకాలను సిద్ధం చేశారు. అదేవిధంగా అర్బన్ జిల్లా పరిధిలో కూడా పంపిణీ చేసేందుకు రెండువేల పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో పుస్తకాలను ఆయా పోలీసు స్టేషన్లకు పంపనున్నారు. -
రాయపాటి...కలిసొచ్చేది ఏ పాటి !
సాక్షి, గుంటూరు :జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఎంపీ రాయపాటి కుటుంబం సైకిల్ ఎక్కడంతో తమకు అదనంగా కలిసొచ్చే ఓటు బ్యాంకు ఏమీ లేదని టీడీపీ కేడర్ పెదవి విరుస్తోంది. ఎంపీ రాయపాటి సాంబశివరావు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో తమకు కొత్తగా లాభించేదేమీ ఉండదని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గ్రామాల్లో మొన్నటి వరకు తమతో పోరాడిన వారితో ఇప్పుడు ‘చేతులు’ కలపాల్సి రావడం ‘దేశం’ కార్యకర్తలకు ఏ మాత్రం రుచించడం లేదు. ముఖ్యంగా రాయపాటి సొంత నియోజకవర్గం తాడికొండలోనే ఆయనవర్గానికి, టీడీపీ కేడర్‌కు నడుమ గొడవలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాయ పాటి వెన్నుదన్నుతో నామినేటెడ్ పోస్టులు అనుభవించిన నేతలకు, టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య తీవ్ర పొరపొచ్చాలున్నాయి. అయితే రాయపాటి చేరికతో ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో ఆయన వర్గం టీడీపీకి జై కొట్టింది. ఇప్పుడు వారితో టీడీపీ కేడర్ ఎలా మసలుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఎన్నికలు ముగిసే వరకు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కౌగిలింతలే అన్నట్లు వ్యవహరించాల్సి ఉంటుందని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. రాయపాటి సాంబశివరావుకు దాదాపు నరసరావుపేట ఎంపీ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే నరసరావుపేటలో అడుగుపెట్టేందుకు రాయపాటి ముహూర్తాలు చూసుకుంటున్నారని వినిపిస్తుంది.రాయపాటి రాకతో టీడీపీలో కొత్త తలనొప్పులు ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. గ్రూపుల గోల మొదలవుతుందా లేక రాయపాటి వర్గంతో టీడీపీ జెండా భుజానికెత్తుకుని ఆపత్కాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు కలసి నడుస్తారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే రాయపాటి వర్గం ఇవన్నీ కొట్టి పారేయడం గమనార్హం. టీడీపీలో స్థిరమైన గ్రూపులు లేవని, అన్నీ సీజనల్ గ్రూపులేనని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో టీడీపీలో చేరి వెనక్కు వెళ్లిన శ్రీనివాస్... రాయపాటి సాంబశివరావు సోదరుడు రాయపాటి శ్రీనివాస్ గతంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కొద్ది నెలలకే టీడీపీలో ఇమడలేక బయటకు వచ్చి మళ్లీ సొంత గూటికి చేరారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యం టీడీపీలో లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించి టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భూ స్థాపితం కావడంతో మళ్లీ తన కుమారుడు రాయపాటి మోహన సాయికృష్ణ సహా టీడీపీలో చేరారు. అయితే ఇప్పుడు శ్రీనివాస్ సైకిల్‌ను స్పీడుగా తొక్కగలరా లేదా అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
కోడెల వైఎస్ఆర్సిపికి ఓటు వేశారా లేక కాంగ్రెస్‌కా?
(జె.రవీంద్ర బాబు) నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాద్ ఈ రోజు జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీకి ఓటు వేసుకోలేకపోయారు. ఆయన కుటుంబానికి 29వ వార్డులో ఓట్లు ఉన్నాయి. అయితే ఆ వార్డులో టిడిపి అభ్యర్థి పోటీ చేయలేదు. పొత్తులో భాగంగా ఈ వార్డును బిజెపికి కేటాయించారు. సాంకేతిక కారణాల వల్ల బిజెపి అభ్యర్థి రాచకొండ ప్రసాద్ నామినేషన్‌ను తిరస్కరించారు. డమ్మీ అభ్యర్థులు గానీ, స్వతంత్ర అభ్యర్థులు గానీ పోటీలో లేరు. ఇక ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు మాత్రమే పోటీలో ఉన్నారు. ఆ ఇద్దరులో ఒకరికి ఆయన ఓటు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. వారిలో ఒకరికి ఆయన ఓటు వేశారు. అయితే ఆయన ఎవరికి ఓటు వేశారనేది పట్టణంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉందన్నారు. అందువల్ల ఓటు వేశానని చెప్పారు. అయితే పోటీలో ఉన్న రెండు పార్టీలు తనకు నచ్చని, తాను వ్యతిరేకించే పార్టీలన్నారు. రెండు పార్టీలలో ఏది తక్కువ ప్రమాదకారో ఆలోచించి ఆ పార్టీకి ఓటు వేసినట్లు తెలిపారు. -
రాయపాటి చూపు.. నరసరావుపేట వైపు...?
అరండల్‌పేట(గుంటూరు),న్యూస్‌లైన్: గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు జిల్లాలో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. ఒకసారి రాజ్యసభ సభ్యునిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా చలామణి అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.యూపీఏ ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డితో సన్నిహితంగా మెలగడంతో ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీలో చేరతారని అంతా భావించారు. అయితే సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఒత్తిడితో ఆయన కిరణ్ పార్టీలో చేరలేదు. చివరగా, తెలుగుదేశం పార్టీలో చేరాలని రాయపాటి నిర్ణయించుకున్నట్లు సమాచారం. వాస్తవానికి గుంటూరు పార్లమెంటు టికెట్‌ను రాయపాటి సాంబశివరావుకి ఇవ్వాలని తొలుత తెలుగుదేశం పార్టీ సైతం ఆలోచించింది. అయితే రాయపాటి పార్టీలో చేరేందుకు కాలయాపన చేయడం, ఆ లోపు మాజీ మంత్రి గల్లా అరుణ కుటుంబ సభ్యులు పార్టీలోకి వస్తే గుంటూరు పార్లమెంటు టికెట్ కేటాయించాలని కోరడం అందుకు పార్టీ అధిష్టానం అంగీకరించడం చకచకా జరిగిపోయాయి.నరసరావుపేట వైపు చూపు... తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు రాయపాటి సాంబశివరావు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా గల్లా జయదేవ్‌ను ప్రకటించడంతో నరసరావుపేట సీటు కేటాయించాలని కోరినట్లు సమాచారం. అయితే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ రాయపాటి తన ప్రయత్నాలను మమ్మురం చేసినట్లు సమాచారం. ఈ నెలలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గుంటూరులో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ తరువాత నరసరావుపేట పార్లమెంటు టికెట్ కేటాయింపు అంశం ఒక కొలిక్కి రావచ్చని జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. అదే సమయంలో నరసరావుపేట టికెట్ ఇవ్వకుంటే కనీసం కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నుంచి ఎంపీ మోదుగుల ... ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక్కడి నుంచి మోదుగుల పోటీ చేయకుంటే రాయపాటి సోదరుని కుమారుడు మాజీ మేయర్ రాయపాటి మోహనసాయికృష్ణకు టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెలుగుదేశం అధిష్టానం వద్ద రాయపాటి ఉంచినట్లు సమాచారం. ఏదిఏమైనా 2014 సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతూ వ్యూహాల్లో బిజీబిజీగా గడపాల్సిన రాయపాటి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది మరి కొద్దిరోజుల్లో తేలనుంది. -
నేడు జనభేరి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం నరసరావుపేట వేదికగా సార్వత్రిక ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత అన్ని పార్టీల కంటే ముందుగా జిల్లాలో ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఖమ్మంలో వైఎస్సార్ జనభేరి సభను ముగించుకుని బుధవారం రాత్రి గుంటూరు చేరుకున్నారు. =‘వైఎస్సార్ జనభేరి’ పేరిట నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సెంటర్లో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, నాయకులు ఏర్పాట్లు చేశారు. =ఈ సభలోనే జగన్ సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తన అనుచరులతో కలసి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. =గురువారం ఉదయం 9 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి జగన్ సాయంత్రం 5 గంటలకు నరసరావుపేట చేరుకుంటారు. =పేట శివారు జొన్నలగడ్డ రోడ్డులోని అమరా ఇంజినీరింగ్ కళాశాల వద్ద వేలమంది విద్యార్థులు జననేతకు ఘనస్వాగతం పలకనున్నారు. రెండు లక్షలమందికి వీలుగా ఏర్పాట్లు.. =జనభేరి సభ ఏర్పాట్లను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. =నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షలకు పైగా ప్రజలు వస్తారని అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు... =భారీ వేదికతో పాటు మహిళల కోసం సభావేదిక వద్ద ఇరువైపులా బారికేడ్లు నిర్మించి ముందుభాగంలో వెయ్యికి పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. =నియోజకవర్గాల కన్వీనర్లు, నాయకులు, సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు కూర్చునేందుకు మరో వెయ్యి కుర్చీలు సిద్ధం చేశారు. =అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీ చేరనున్న సందర్భంగా సభావేదిక వద్దకు వచ్చే మార్గంలో స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఆంధ్రా సింగపూర్!
సాక్షి, నరసరావుపేట :సహజంగా సింగపూర్ పేరు వినగానే జీవితంలో ఒక్కసారైనా అక్కడి అందాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని చూసి రావాలని.. అక్కడ షాపింగ్ చేయాలని సరదా పడుతుంటారు. అదంతా స్థితిమంతుల ఆలోచనలు. అయితే పస్తులతో గడపలేక కాయకష్టం చేసేందుకు సింగపూర్‌కు తరలివెళ్లి అక్కడ అష్టకష్టాలు పడి బతుకుజీవుడా అంటూ తిరిగి స్వగ్రామానికి చేరుకున్న కొందరు శ్రామికులను సృశిస్తే స్వగ్రామం కంటే సింగపూర్ ఏం గొప్పది కాదన్నవైనం స్పష్టమవుతుంది. ఒకరిని చూసి ఒకరు 300 మందిపైగా స్వగ్రామం వీడి అక్కడ వివిధ కంపెనీల్లో పనిచేసేందుకు సింగపూర్‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లాలంటే విమాన ఖర్చులతో పాటు కంపెనీ వీసా పొందేందుకు ఒక్కొక్కరికి సుమారు రెండు లక్షల వరకు ఖర్చవుతుంది. అయితే ఈ మొత్తాన్ని తీసుకున్న దళారులు కొందరికి మంచి కంపెనీల్లో పని ఇప్పించి అక్కడ అంతా బ్రహ్మాండంగా ఉందని తెలిసేలా మొదట్లో కొందరికి అవకాశం కల్పించారు. ఆ తరువాత దళారుల చేతుల్లో మోసపోయి కంపెనీలో పనిదొరక్క సింగపూర్ వీధుల్లో అక్కడి పోలీసులకు దొరక్కుండా దొంగచాటుగా పనులు వెతుక్కొని దుర్భర జీవితం అనుభవించిన వారు కోకొల్లలు. వివరాలు పరిశీలిస్తే.. పల్నాడు ప్రాంతంలోని చారిత్రాత్మక గ్రామమైన గురజాల మండలం జంగమహేశ్వపురం నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మంచి పంటలు పండుతూ కళకళలాడుతుండేది. అయితే 2004 ముందు ఐదేళ్ల పాటు రాక్షసకరువు తాండవించడంతో సాగర్ కాలువల ద్వారా నీరు రాక, వర్షాలు కురవక పంట పొలాలన్నీ బీడు భూములుగా మారి రైతుల ఆత్మహత్యలకు, వలసలకు వేదికగా నిలిచింది. చాలామంది రైతులు లారీ క్లీనర్‌గా, పట్టణాల్లోని పత్తి మిల్లులు, పొగాకు బ్యారన్లలో ముఠా కూలీలు వలసలు వెళ్లి జీవనం సాగించాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో సింగపూర్ వెళితే రోజుకు 8 గంటల వంతున పనిచేస్తే నెలకు వెయ్యి నుంచి రెండువేల డాలర్లు సంపాదించవచ్చని దళారులు ఆశ చూపడంతో అనేకమంది అమాయకులు వారి బుట్టలో పడ్డారు. మొదట్లో సింగపూర్ వెళ్లిన వారి పరిస్థితి బాగుండడంతో గ్రామంలోని వందలాది మంది వారిని ఆదర్శంగా తీసుకొని సింగపూర్ వెళ్లేందుకు దళారులను ఆశ్రయించారు. సింగపూర్‌లో ఉన్న కంపెనీలకు పదుల సంఖ్యలో మాత్రమే కూలీలు అవసరమైనప్పటికీ ఇక్కడి నుంచి వందల సంఖ్యలో పంపి దళారులు డబ్బు దండుకున్నారు. సింగపూర్ వెళ్లిన వారిలో అధిక శాతం మందికి కంపెనీలు పని చూపలేకపోవడంతో ఏంచేయాలో పాలుపోక దళారులకు చెల్లించిన డబ్బు అయినా సంపాదించుకొని స్వగ్రామానికి వచ్చేయాలనే ఉద్దేశంతో కంపెనీ నుంచి పారిపోయి రోడ్లవెంట పనులు చేసుకుంటూ అక్కడి పోలీసులకు దొరకకుండా దొంగతనంగా జీవనం గడపాల్సిన దుస్థితి నెలకొందని అనేకమంది వాపోయారు. మరికొందరైతే పోలీసులకు దొరికిపోయి అక్కడి నిబంధనల ప్రకారం ఒంటిపై వాతలు వేయించుకొని జైలు జీవితం గడిపి కట్టిన డబ్బులు సైతం చెల్లించుకోలేక అప్పులపాలై ఇంటికి తిరిగివచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే జంగమేశ్వరపురం నుంచి ఎక్కువ మంది వెళ్లడంతో ఈ గ్రామానికి మాత్రం ఆంధ్రా సింగపూర్‌గా పేరొచ్చింది. అయితే సింగపూర్ వెళ్లి జల్సాగా బతకలేదని... కూలి పని చేసి కష్టాలుపడి మోసపోయామని సింగపూర్ వెళ్లి వచ్చిన అనేకమంది బాధితులు సాక్షికి తెలిపారు. 2004 తరువాత ఆ గ్రామం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. వర్షాలు సకాలంలో కురవడం, సాగర్ కాలువల ద్వారా రెండు పంటలకు సాగునీరు అందడంతోపాటు పండిన పంటకు గిట్టుబాటు ఉండడంతో గతేడాది వరకు రైతుల పరిస్థితి మెరుగైంది. గతంలో ఉన్న అప్పులను తీర్చుకొని హాయిగా జీవనం సాగిస్తున్నారు. దీంతోపాటు తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రస్తుతం గ్రామానికి చెందిన సుమారు వంద మంది వరకు సాఫ్ట్వేర్ రంగంలో వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. -
జనమంతా జగన్ వైపే..
సాక్షి, నరసరావుపేట :రాష్ట్రంలో జనమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారని, ఆయన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు ప్రజల్లో నిర్ణయం జరిగిపోయిందని పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి తెలిపారు. పట్టణంలోని 29 వార్డులో శనివారం బులియన్ మర్చంట్ అసోసియేషన్ పట్టణ కార్యదర్శి కాపులపల్లి ఆదిరెడ్డి, పార్టీ పట్టణ కోశాధికారి వక్కలగడ్డ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విలువలతో కూడిన రాజకీయం చేస్తోందని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న ఇతర రాజకీయ పక్షాలను చూసి ప్రజలు చీత్కరించుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గం కార్యకర్తలకు, అభిమానులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాము రాజకీయాలకు కొత్త కావడంతో కుళ్లు, కుతంత్రాలు తెలియవని, నీతివంతమైన పాలన అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం శివుడి బొమ్మసెంటర్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విడదీయాలన్ని కుట్రలు పన్నే రాజకీయ నాయకులకు భవిష్యత్ లేకుండా చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సర్తాజ్ ఆలి, ఆళ్ళ పేరిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఎస్ఏ హనీఫ్, ఉపాధ్యక్షుడు కొత్తమాసు వెంకటమల్లారావు, రొంపిచర్ల, నరసరావుపేట మండల కన్వీనర్లు ఓబుల్‌రెడ్డి, శంకర్ యాదవ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సెల్ కన్వీనర్లు కందుల ఎజ్రా, కుంజానందా, వేముల శివ, షేక్ ఖాదర్‌బాషా, పట్టణ యువజన విభాగం కన్వీనర్ రామిశెట్టి కొండలరావు, పట్టణ మహిళా కన్వీనర్ సుజాతాపాల్, పట్టణ ఉపాధ్యక్షుడు బిల్డర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్.. కట్.. కట్ !
సాక్షి, నరసరావుపేట: వేసవి రాకముందే ప్రస్తుతం 8 నుంచి 12 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌పై ఆధారపడి ఉపాధి పొందే వేలాది మంది రోడ్డున పడాల్సిన పరిస్థితులు దాపురించాయి. మున్సిపాల్టీ పరిధిలో 6 నుంచి 8 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా పది నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఫొటోస్టాట్ మెషిన్లు, పౌండ్రిలు, జ్యూస్స్టాల్స్, కంప్యూటర్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, ఇంటర్నెట్ సెంటర్లు, పిండిమరలు వంటి చిరువ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారిని కరెంటు కోతలు తీవ్ర నష్టాలపాల్జేస్తున్నాయి. ఉదయం 8 గంటలకు కరెంట్ తీస్తే 10 గంటలకు కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఒకవేళ వెంటనే ఇచ్చినా మళ్లీ ఇష్టమొచ్చినట్లు కరెంటు కోత విధిస్తున్నారు. చలికాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక వేసవిలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తలచు కుంటేనే భయమేస్తుందని పలువురు వాపోతున్నారు. ఆ గ్రామాల్లో ఉపాధి ప్రశ్నార్థకం.. నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం, యల్లమంద గ్రామాల్లో విద్యుత్ మిషన్ల ద్వారా పరదాలు కుట్టి జీవనోపాధి పొందు తున్న 400 కుటుంబాల ప్రస్తుతం పనులు లేక అలమటిస్తున్నారు. 15 రోజులుగా రోజుకు 12 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. పరదాలు కుట్టాలంటే విధిగా కరెంటు తొక్కుడు మిషన్ అవసరం వుంది. పగలంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతున్నారు. ఇంకా, పౌండ్రి, సర్ఫ్ తయారీ, సిమెంటు బ్రిక్స్ తయారీ తదితర యూనిట్లలో పనిచేసే వారు కూడా విద్యుత్ కోతకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పరిస్థితి మరింత దారుణం.. కరెంటు కోతలు రైతులను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. భారీ వర్షాలకు ఖరీఫ్‌లో పంటలన్నీ నీటిపాల య్యాయి. ఆ నష్టాలను పూడ్చుకుందామని రబీ సాగుకు ఉపక్రమించిన రైతులను కోతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఏడుగంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని గాలికొదిలేసి రెండు మూడు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆ రెండు మూడు గంటలు విద్యుత్ సరఫరా సైతం వేళాపాళా లేకుండా ఇస్తుండటంతో పంటలు తడవక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. -
రబీకి నీరివ్వకుంటే ఎలా?
కాలువల మరమ్మతులు గురించి పట్టించుకోరు.. రబీలో వరికి నీరు ఇవ్వబోమని ఇప్పుడు చెబితే ఎలా.. ఇప్పటికే చాలా మంది రైతులు నారుపోసుకొని నాట్లు వేసుకుంటున్నారు.. సాగునీరు అందించని వారు వ్యవసాయశాఖ విత్తనాలు పంపిణీ చేస్తుంటే ఎందుకుఊరుకున్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు...కొందరు రైతుల వద్ద డబ్బులు తీసుకొని దొంగతూములు ఏర్పాటు చేస్తుంటే ఆయా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోరు...ఇవి నాగార్జున సాగర్ లింగంగుంట్ల సర్కిల్ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ల ఆగ్రహావేశాలు. నరసరావుపేటరూరల్, న్యూస్‌లైన్: ఎన్ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ‘వాలంతరి’(నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ క్షేత్రస్థాయి శిక్షణా సంస్థ) ఆధ్వర్యంలో నీటి పన్ను అంచనా, వసూలు, పంటల దిగుబడిపై నీటి పారుదల, రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. వాలంతరి అధికారి శంకర్‌బాబు అధ్యక్షత వహించగా, ఎన్ఎస్పీ ఎస్ఈ సన్యాసినాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాగునీటి వినియోగంపై రైతులందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జూన్, జూలైలో నాట్లు వేసుకుంటే ఖరీఫ్ అనంతరం రబీలో వరిసాగుకు ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పంట కాలువలకు మరమ్మతులు జరిగితేనే నీరు సక్రమంగా అందుతుందన్నారు. అనంతరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ) చైర్మన్లు ఒక్కొక్కరుగా ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత అనుపాలెం డీసీ చైర్మన్ బాలసైదులు మాట్లాడుతూ రబీలో వరిసాగు వద్దని చెబుతున్నారు, వ్యవసాయశాఖ వరి వంగడాలను ఎందుకు పంపిణీ చేసినట్టు అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ ఏడీఏ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి విత్తనాల పంపిణీ నిలిపివేశామని, అలాగే బహిరంగ మార్కెట్లో వరివంగడాలు అమ్మవద్దని దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. దీనిపై డీసీ సభ్యులు మాట్లాడుతూ మార్చి 31 వరకు సాగునీరు విడుదల చేయాలని, లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారని కోరారు. ఎన్ఎస్పీ ఎస్ఈ మాట్లాడుతూ అది అధికారుల చేతుల్లో లేదని, ఒకసారి నీటి విడుదల తగ్గించిన తరువాత పెంపు నిర్ణయం ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నారు. త్రిపురాపురం మేజరు డీసీ చైర్మన్ గంగినేని చంద్రశేఖర రావు మాట్లాడుతూ సొంత నిధులతో రెండేళ్ళ క్రితం రూ.4 లక్షలు వెచ్చించి కాలువల్లో పూడికతీత పనులు నిర్వహిస్తే ఇంతవరకు బిల్లులు రాలేదన్నారు. ఐనవోలు డీసీ చైర్మన్ చంద్రయ్య మాట్లాడుతూ కాలువల మరమ్మతులకు తాను వెచ్చించిన నగదును మార్చి 31లోగా ఇవ్వకుంటే నిరాహారదీక్ష చేస్తానని, అదీ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఎస్ఈ ఆవేశపడినందు వల్ల ప్రయోజనం ఉండదని, పరిస్థితులు గమనించాలన్నారు. అమరావతి మేజరు డీసీ చైర్మన్ యర్రగుంట్ల రమేష్ మాట్లాడుతూ మేజరు పరిధిలోని కెమైనర్ హెడ్ వద్ద కొందరు దొంగతూములు ఏర్పాటు చేసుకున్నారని, దీనికి డీఈ భరోసా ఇచ్చారని, అసలు తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎన్ఎస్పీ అధికారులు ఇలా వ్యవహరించడ భావ్యం కాదంటూ ఆరోపించారు. దీనిపై ఎస్ఈ మాట్లాడుతూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. తుర్లపాడు మేజరు డీసీ చైర్మన్ ఉడతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఓగేరు, కుప్పగంజివాగుల పరిధిలోని కాలువలకు నీరు విడుదల చేస్తే ఎత్తిపోతల పథకాల వల్ల రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు. ఎస్ఈ సమాధానం ఇస్తూ ఉన్నతాధికారుల అనుమతితో నీరు విడుదల చేస్తామన్నారు. సమావేశంలో వినుకొండ ఈఈ శ్రీనివాసరావు, నరసరావుపేట సర్కిల్ డీఈ రమణరావు, మాచర్ల ఈఈ బి.చిట్టిబాబు సత్తెనపల్లి ఈఈ నాగార్జున, వాలంతరి అధికారులు, డీసీ చైర్మన్లు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్నం’ మంటలు
సాక్షి, నరసరావుపేట :పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా బడిమానివేసే పిల్లల సంఖ్యను తగ్గించి విద్యాభివృద్ధికి కృషి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలులోకి తెచ్చింది. మొదట్లో పథకం బాగానే నడిచినప్పటికీ రోజు రోజుకు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధర లు ఆకాశాన్నంటుతుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ఏజెన్సీ నిర్వాహకులకు కష్టంగా మారింది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి 100 గ్రాముల బియ్యంతో పాటు 4 రూపాయల 35 పైసలు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆరు రూపాయల చొప్పున ప్రభుత్వం ఏజెన్సీ నిర్వాహకులకు చెల్లిస్తోంది. ప్రతి బుధవారం విద్యార్థులకు కోడిగుడ్డు అందించాలనే నిబంధన కూడా ఉండడంతో ప్రస్తుత మార్కెట్లో కోడిగుడ్డు ధర 4 నుంచి 5 రూపాయల వరకు పలుకుతుంది. దీంతో ప్రభుత్వం తమకు చెల్లించే డబ్బు కోడిగుడ్డు కొనుగోలుకే సరి పోతుందని, ఇక మిగతా వంట ఎలా చేయాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. బిల్లు లు కూడా ప్రతి నెలా రావడంలేదని, రెండు, మూడు నెలలకొకసారి వస్తుండటంతో మధ్యాహ్న భోజనం వండేందుకు కావాల్సిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లులు సరిపోక విద్యార్థులకు సరైన పోషక ఆహారం అందించలేకపోతున్నామని ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. గుదిబండగా మారిన గ్యాస్ సరఫరా.. అసలే సమస్యల కుంపటిలో కొట్టుమిట్టాడుతున్న తమకు ఇటీవల ప్రభుత్వం గ్యాస్ విషయంలో తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారిందని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. ఏడాదికి 9 సిలిండర్లు మాత్రమే సబ్సిడీ ధరల్లో ఇస్తామని, ఆపైన కావాలంటే రూ. 1350 చెల్లించాల్సిందేనంటూ ప్రభుత్వం నిబంధన విధించడం దారుణమని వాపోతున్నారు. రోజుకు 120 నుంచి 200 మంది విద్యార్థులకు వంట చేయాల్సిన తమకు వారానికి ఒక సిలిండర్ చొప్పున నెలకు 4, ఏడాదికి 40 సిలిండర్లకుపైగా అవసరం అవుతాయని, ప్రభుత్వ నిబంధనతో ఇక ఏజెన్సీలను మానుకోవాల్సి వస్తుందని మండిపడుతున్నారు. వంటశాలలు లేక ఆరుబయటే వంట అధికశాతం ప్రభుత్వ పాఠశాలల్లో వంటశాలలు లేకపోవడంతో ఆరుబయటే వంట చేయాల్సిన దుస్థితి నెలకొందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించి తమకు అందించే గ్యాస్, బిల్లులను పెంచాలని కోరుతున్నారు. అయితే వంటశాలల నిర్మాణానికి ఒక్కొక్క పాఠశాలకు రూ. 75వేలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తుండటంతో ఆ మొత్తంతో నిర్మాణం చేపట్టలేక కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లు పెంచాలి ఏడాదికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటిస్తుంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు రెట్టింపు ఇవ్వాలి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మాకందించే బిల్లులను కూడా పెంచాలి. - వెంకటరమణ, శ్రీనివాసగిరిజనకాలనీ బిల్లులు పెంచి ఆదుకోండి విద్యార్థులకు భోజనం పెట్టేందుకు ప్రభుత్వం అందిస్తున్న బిల్లులు సరిపోవడంలేదు. గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెపుల్లలు కొనలేకపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మా మొర ఆలకించాలి. - శిరసగండ్ల లక్ష్మీ, మాచవరం -
ఎల్లవేళలా మందు.. కొట్టు..!
సాక్షి, నరసరావుపేట :రాత్రి సమయాల్లోనూ నగదు డ్రా చేసుకునేందుకు బ్యాంకులు ఏటీఎం సెంటర్లు ఏర్పాటు చేసినట్లే... మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఈ పాలసీని ఆదర్శంగా తీసుకుని ఎనీటైమ్ మద్యం (ఏటీఎం) అంటూ విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఎక్సయిజ్ అధికారులు మామూళ్ల మత్తులో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. శాంతిభద్రతల అంశంపై రాత్రి పది దాటితే దుకాణాలు మూసేయాలంటూ చిరువ్యాపారులపై ప్రతాపం చూపే పోలీసులు కూడా మద్యం దుకాణాలకు మాత్ర మినహాయింపు ఇస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.నిబంధనలు బేఖాతరు.. వైన్‌షాపుల్లో క్వార్టర్ సీసాకు రూ.10 నుంచి రూ.15, ఫుల్ బాటిల్‌కు అత్యధికంగా రూ.150 వరకు ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇటు బార్లలోనూ ఈ ధర దాదాపు రెట్టింపుగా ఉంది. ఇలా విక్రయాలు చేసుకోవడానికి లోపాయకారిగా సహకరిస్తున్నందుకుగాను మామూళ్లను మళ్లీ నిర్ణయించారు. ఎమ్మార్పీ ఉల్లంఘనలు, రాత్రి పూట వ్యాపారం కొనసాగించేందుకు, వెన్షాపుల్లోనే మద్యం తాగే ఏర్పాట్లకు గాను గతంలో ఎక్సయిజ్ శాఖకు ఒక్కో షాపు నుంచి నెలకు సగటున రూ.20 వేలు ముట్టజెప్పేవారు. ప్రస్తుతం రూ. 5 వేల నుంచి రూ. 7వేలు వరకు ఉంది. బార్లు, వైన్‌షాపులు నిర్ణీత కాల వ్యవధి లేకుండా ఇష్టానుసారంగా నిర్వహించడానికి, బార్లలో జరిగే వివాదాలను సెటిల్మెంట్ చేయడానికి పోలీసు శాఖకు గతంలో ఒక్కో బార్ నుంచి రూ.15వేల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం రూ. 5 వేలుగా ఉంది. బార్లు, వైన్‌షాపుల్లో కనీస వేతనాలు అమలు చేయకుండా ఉండడం, బాలకార్మికులతో పనిచేయించేందుకు వీలుగా కార్మిక శాఖకు రూ.1000 నుంచి రూ.2 వేల వరకు ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే మద్యం ధరలు 8 నుంచి 10శాతం పెరిగాయి. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఒక్క నరసరావుపేట డివిజన్‌లోనే గతేడాది రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మళ్లీ రంగంలోకి దిగితే కాని మద్యం ధరలు కట్టడయ్యేలా లేవు. ఈఎస్‌పై మంత్రి కాసు ఆగ్రహం.. నరసరావుపేట పట్టణంలో తెల్లవారుజాము వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచుతున్నారని కొందరు సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి దష్టికి తీసుకురావడంతో ఆయన ఎక్సయిజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) మనోహకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అంటూ మండిపడ్డారు. కొందరు మద్యం వ్యాపారులు తన పేరు వాడుతున్నారని, ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేని పక్షంలో నీపై ఎక్సయిజ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. -
నా మెడికల్ సీటు కేవీపీకి ఇచ్చారు
సాక్షి, నరసరావుపేట :తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే పిల్లల వైద్య నిపుణుడినయ్యేవాడినని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గుల్బర్గాలో మెడిసిన్ చదివేందుకు వెళ్లానని, అయితే రాజకీయాలపై మక్కువతో వెనుదిరగడంతో ఆ సీటును కేవీపీ రామచంద్రరావుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమైక్యత, సమగ్రతపై అసెంబ్లీలో రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యవాదాన్ని వినిపించాలని కోరారు. రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ టర్న్, ఈ టర్న్ అనే పదాలు లేకుండా ఐక్యతతో ముందుకెళ్లాలని చెప్పారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులంతా సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి మంత్రులతో పాటు అన్ని రాజకీయ పక్షాలను ఒకచోటకు చేర్చడం హర్షణీయమన్నారు. జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాజీవ్‌గాందీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై డీజీపీతో మాట్లాడానని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. నరసరావుపేట పట్టణంలో తెల్లవారుజామున మూడు గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారని కొందరు మంత్రి కాసు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేనిపక్షంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ ఈఎస్‌ను హెచ్చరించారు.సమావేశంలో డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి కోటేశ్వరరావు, పెనుగొండవెంకటేశ్వర్లు, ఏలూరి సుబ్బారెడ్డి, నేలటూరి మురళి, దుర్గాబాబు తదితరులు ఉన్నారు. -
కౌలు రైతుల కన్నీళ్లు
కౌలు రైతుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రబీలో ఆరుతడి పంటలకు మాత్రమే విడతల వారీగా సాగునీరు అందిస్తామని, వరి పంటకు సాగునీరు ఇవ్వబోమని, ఒకవేళ వరి పంట సాగు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోక తప్పదంటూ ఎన్ఎస్పి అధికారులు ప్రకటనలు చేస్తుండటంతో ఏం చేయాలో పాలు పోక కౌలు రైతులు తలలు పట్టుకొని కూర్చున్నారు. ఆరుతడి పంటలకు సైతం మార్చి 31వ తేదీ వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని, తదనంతరం కాలువల ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామని ఎన్ఎస్పి ఎస్ఈ సన్యాసినాయుడు ఇటీవల చేసిన ప్రకటన అశనిపాతంగా మారింది. సాక్షి, నరసరావుపేట : మూడేళ్లుగా వర్షాలు సక్రమంగా కురవక, పంటలు సరిగా పండక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు ఈ ఏడాది ఖరీఫ్‌లో ముందుగా వర్షాలు కురవడంతో కొండంత ఆశతో పంటలు సాగు చేశారు. ముఖ్యంగా కౌలు రైతులు మూడేళ్లుగా పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు పడి ఈ ఏడాది ఎక్కువ పొలం తీసుకొని సాగు చేశారు. మొదట్లో అనుకూలించిన వాతావరణం అతివృష్టి రూపంలో పంటలను దెబ్బతీసింది. అధిక వర్షాలకు దిగుబడి తగ్గింది. ఎకరాకు 20 నుంచి 25 బస్తాలు మాత్రమే ధాన్యం పండింది. దీంతో కౌలు రైతుల ఆశలు అడియాశలయ్యాయి. వరి సాగు చేసిన రైతులు మొదటి పంటకు ఎకరాకు 15 బస్తాలు, రెండో పంటకు 10 బస్తాల చొప్పున కౌలు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మొదటి పంటకు ప్రకృతి అనుకూలించక దిగుబడి తగ్గింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 6,58,700 ఎకరాల్లో వరిసాగు చేశారు, దీంట్లో 70 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో ఎకరాకు 10 బస్తాల చొప్పున 65 లక్షల 87 వేల బస్తాల ధాన్యం దిగుబడులు తగ్గాయి. అంటే జిల్లాలో వరిరైతులు సుమారు రూ. 800 కోట్లు నష్టపోయారని అంచనా. ఇందులో కౌలు రైతులకు సుమారు రూ. 550 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో రెండో పంటగా వరి పండించుకునేందుకు ప్రభుత్వం సాగునీరు అందిస్తే కొంతమేర నష్టాల నుంచి బయటపడవచ్చని ఆశించిన కౌలు రైతులకు ప్రభుత్వ ప్రకటన అశనిపాతంగా మారింది. ఆరుతడి పంటలు వేసినా పది బస్తాల చొప్పున కౌలు చెల్లించాల్సిందేనంటూ భూ యజమానులు కౌలు రైతులపై ఒత్తిడి తెస్తుండటంతో కొందరు అసలు పంటలు సాగు చేయకుండా వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. రుణాలకు అవకాశం లేదు... కనీసం బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వరి పంట సాగు చేసి కొంతమేరకైనా నష్టాన్ని పూడ్చుకుందామని కౌలు రైతులు ఆశించారు. అయితే రబీలో వరిపంట సాగు చేస్తే రైతులకు రుణాలు ఇవ్వొద్దంటూ జిల్లా కలెక్టర్ బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వడంతో వీరికి రుణాలు కూడా మంజూరు కావడం లేదు. కొందరు రైతులు ఇప్పటికే నార్లుపోసుకోగా మరికొందరైతే వరినాట్లు కూడా వేశారు. ప్రభుత్వం, అధికారుల ప్రకటనలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతుసంఘాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి రబీకి సాగునీరు అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌గా ఉత్తమ్‌రెడ్డి
సాక్షి, నరసరావుపేట :వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌గా గానుగపంట ఉత్తమ్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ ఉత్తర్వులను వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా ఉత్తమ్‌రెడ్డి అందుకున్నారు. తన నియామకానికి సహకరించిన గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే), జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, గుంటూరు నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, నరసరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్లకు ఈ సందర్భంగా ఉత్తమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి జిల్లాస్థాయి పదవి అప్పగించిన పార్టీకి విధేయునిగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు. -
పాపం పసివాళ్లు
అతి చిన్నదైన జీవితాన్ని ఆనందంగా గడపటం చేతకాక ఎన్నో కుటుంబాలు ‘చితికి’పోతున్నాయి. అనుమానం పెనుభూతమై జీవితాలను అంతం చేసుకుంటున్నాయి. ఆ.. ఒక్క క్షణం ఓపిక పడితే ముందంతా బంగరు జీవితం వుందనే విషయాన్నే మరుస్తున్నారు. చివరకు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చిన్నారుల భవిష్యత్‌ను సైతం అంధకారం చేస్తున్నారు. అనాథలుగా మారుస్తున్నారు. సాక్షి, నరసరావుపేట :భార్యలపై అనుమానంతో భర్తలు అతి దారుణంగా హత్యలు చేస్తుంటే... క్షణికావేశంలో భార్యలు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక్క విషయాన్ని పెద్దలు ఆలోచించడం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తమ బిడ్డల భవిష్యత్ ఏమిటన్నది వారికే అర్థం కాకుండా ఉంది. కళ్ల ముందే కన్నతల్లి రక్తపు మడుగులో ప్రాణం వదులుతుంటే, తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు తరలిస్తుంటే ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. సమాజంలో కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావిస్తూ మానసిక పరిపక్వత రాకముందే బాల్య వివాహాలు చేస్తూ తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తున్నారు. చిన్న వయస్సులో కుటుంబ భారం మీద పడి ఏది మంచి, ఏది చేడో తెలియక అనాలోచిత నిర్ణయాలతో తమ జీవితాలను బుగ్గిపాలు చేసు కుంటున్నారు. క్షణికావేశాలకు లోనై భార్యలను సైతం చంపడానికి భర్తలు వెనుకాడకపోవడం లేదా భార్యలు బిడ్డలు ఏమైపోతారోననే ఆలోచన లేకుండా ఆత్మహత్యలకు పాల్పడటం వంటి సంఘటనలతో చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు దూరమై ఎందరో చిన్నారులు అనాథలుగా మారి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. నరసరావుపేట పట్టణం ఏనుగుల బజారులో శనివారం జరిగిన సంఘటన పరిశీలిస్తే.. కోపర్తి వెంకటరమణ తన కుమార్తె సీతారావమ్మ అలియాస్ విజయలక్ష్మికి15 ఏళ్ళ వయసులోనే గురజాల మండలం చ ర్లగుడిపాడుకు చెందిన తంగెళ్ల సత్యనారాయణరాజుకు ఇచ్చి వివాహం చేసింది. పెళ్లయిన ఏడాదికి వారికి ఓ పాప. ఆ తరువాత రెండేళ్లకు ఓ బాబు పుట్టారు. కొద్దిరోజులకు దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని విజయలక్ష్మి పుట్టింటిని ఆశ్రయించింది. భార్యను కాపురానికి పంప లేదని అత్తపైనా, పిల్లలను తనకు దూరం చేసిందని భార్యపైన కక్ష పెంచుకున్న సత్యనారాయణ రాజు శనివారం సాయంత్రం అత్తారింటికి చేరుకున్నారు. ఇంటి ముందు శుభ్రం చేస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన అత్తను సైతం హతమార్చేందుకు ప్రయత్నించగా ఆమె పరారైంది. ఈ సంఘటనను అక్కడే వుండి చూసిన వారి చిన్నారులు భీతిల్లిపోయారు. రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడవున్న వారిచేత కంట తడిపెట్టించింది. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అనాథలుగా మారారు. మరో సంఘటనలో... రొంపిచర్ల మం డలం మాచవరంలో మద్యానికి బానిసైన బొడ్డు బొల్లయ్య అనే వ్యక్తి మందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భార్యపై దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీలో ఉండటంతో ఏడాదిన్నర వయసు వున్న వారి పాప అనాథగా మిగి లింది. జిల్లాలో నెలకు ఒకటి చొప్పున జరుగుతున్న ఈ తరహా సంఘటనలకు క్షణికావేశమే కారణమని మానసిక వైద్యులు విశ్లేషిస్తున్నారు. -
మట్టిని మింగేస్తున్నారు..
సాక్షి, నరసరావుపేట: మట్టిని నమ్ముకున్న అన్నదాతలు అప్పులపాలవుతుంటూ అదే మట్టిని అమ్ముకుంటున్న అక్రమార్కులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.. అధికార పార్టీ అండదండలతో.. అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి ఇష్టానుసారంగా మట్టిని మింగేస్తున్నారు. బంజరు భూమి ఎక్కడ కనిపించినా అక్కడ వాలిపోతూ అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు పొక్లయిన్లు.. ఆరు టిప్పర్లు అన్న చందంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ మట్టి దందా కోటప్పకొండ ప్రాంతంలోని ఎర్రనేలల్లో అధికమైంది. నరసరావుపేట నియోజకవర్గం కోటప్పకొండ పరివాహక ప్రాంతంలో ఎర్రమట్టి భూములు అధికం. దీంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంపై పడింది. రోడ్డు కాంట్రాక్ట్ పనులు, నర్సరీలు,ఇళ్లకు తోలే మట్టి అంతా ఈ ప్రాంతం నుంచే తరలిస్తుండటం గమనార్హం. ఇక్కడి నుంచి అక్రమంగా తరలించిన మట్టిని వ్యాపారులు బహిరంగ మార్కెట్లో వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు. కొందరైతే వ్యవసాయ భూములను సైతం మట్టి క్వారీలుగా మార్చి లోయలను తలపించే విధంగా గుంతలు తీస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే ఆయా ప్రాంతాల్లోని గుంతలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చిన్నారులు, పశువులు మృత్యువాతకు గురైన సంఘటనలూ లేకపోలేదు. సామాన్యులపైనే ప్రతాపం.. గ్రామీణ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు రెండు, మూడు ట్రక్కుల మట్టిని మెరకకోసం తరలిస్తుంటారు. అదే పెద్ద నేరంగా భావించి అపరాధ రుసుం వసూలు చేయడం, ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసే రెవెన్యూ, మైనింగ్ అధికారులు అక్రమదందా సాగిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మనకెందుకొచ్చిన గొడవలే అని మిన్నకుండే అధికారులు నెలవారీ మామూళ్ల తీసుకుని సంతృప్తి పడిపోతున్నారు. దీంతో రాత్రి, పగలు అన్న తేడా లేకుండా యధేచ్ఛగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. వ్యవసాయ భూముల మధ్య మట్టి క్వారీలను ఏర్పాటు చేయటంతో సమీపంలో పంటలు వేసుకునే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు.. నిబంధనల ప్రకారం ప్రభుత్వ, సొంత భూముల్లో సైతం మట్టి క్వారీయింగ్ జరపాలంటే మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతులు తప్పనిసరి. ఫలానా భూమిలో క్వారీయింగ్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని తొలుత రెవెన్యూ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మైనింగ్‌శాఖ నిబంధనల ప్రకారం ట్రక్కుకు రూ.50 చొప్పున చెల్లించి క్వారీయింగ్ నిర్వహించుకోవాలి. కొందరు వ్యాపారులు ఎకరాకు అనుమతులు పొంది దానిని అడ్డుపెట్టుకొని 10, 15 ఎకరాల వరకు క్వారీయింగ్ నిర్వహించడమే కాకుండా ఒక్కో బిల్లుపై కనీసం 50 నుంచి 100 ట్రక్కుల మట్టిని తరలిస్తున్నారు. ఇక్కడి ఎర్రమట్టిని నర్సరీలు, ఇళ్లల్లో మొక్కలు పెంచుకునేందుకు ఉపయోగిస్తుండటంతో గిరాకీ పెరిగింది. ట్రక్కు ఎర్రమట్టి రూ.1800 పలుకుతుండగా టిప్పర్‌లారీ మట్టి రూ.3000కుపైగా అమ్మకాలు జరుపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. మట్టి క్వారీయింగ్ చేయాలంటే రెవెన్యూ అధికారుల నుంచి ఎన్వోసీ పొందాలి. మైనింగ్ అధికారులకు సీనరేజ్ చెల్లించి ట్రక్కులకు ట్రిప్సీట్లు పొందాల్సి ఉంటుంది. ఒక్కో ట్రిప్ షీట్‌ను ఒక ట్రక్కు మట్టి రవాణా చేసేందుకు మాత్రమే వినియోగించాలి. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్వారీయింగ్ జరిపే పొక్లయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. - ఎం.శ్రీనివాసరావు, నరసరావుపేట ఆర్డీవో -
గొలుసు లాక్కునేయత్నం: మహిళకు గాయాలు
నరసరావుపేట రూరల్, న్యూస్‌లైన్: ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు భర్తతో పాటు ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు వస్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. బాధితురాలు ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడడంతో గాయపడిన సంఘటన ఆదివారం కోటప్పకొండ ఆర్యవైశ్య సత్రం ఎదుట చోటుచేసుకుంది. రూరల్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలప్రకారం.. కోటప్పకొండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాలయ్య తన భార్య రాజ్యలక్ష్మి, కుమారులతో ద్విచక్రవాహనంపై కోటప్పకొండకు బయలుదేరారు. ఆర్యవైశ్య సత్రం వద్దకు రాగానే ఎదురు నుంచి ద్విచక్రవాహనంపై నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు రాజ్యలక్ష్మి మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. వారిని అడ్డుకునే క్రమంలో ఆమె ద్విచక్రవాహనంపై నుంచి కిందపడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. రూరల్ సీఐ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని కోటప్పకొండ పీహెచ్‌సీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇందిరమ్మ గృహాలపై విచారణ
నరసరావుపేట టౌన్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ గృహాలు నిర్మించుకొని వాటిని విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు విజిలెన్స్ అధికారులకు అందాయి. వారి ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను తీసుకొని స్కానింగ్ చేసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ ఏఈ ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో ఇందిరమ్మ మొదటివిడతలో 515మంది లబ్ధిదారులు గృహాలు నిర్మించుకున్నారని చెప్పారు. 45 గృహాల లబ్ధిదారులు వాటిని విక్రయించినట్లు జిల్లా విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. వారి ఆదేశాల మేరకు సమగ్రంగా విచారణ జరిపి గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు నమోదుచేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు వర్క్ ఇన్స్పెక్టర్లు కిరణ్, అనిల్, మున్సిపల్ అధికారులు ఉన్నారు.