గుంటూరు జిల్లా నరసరావుపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేషన్ బెయిల్పై విడుదల అయ్యారు. అసైన్డ్ భూముల్లో రహదారుల నిర్మాణాన్ని అడ్డుకుని, రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసినందుకు ఆయనపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.