నెట్‌వర్క్ : జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటూనే ఉన్నాయి. గురువారం 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వడగాడ్పులకు మొత్తం 31 మంది మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చిలకలూరిపేట పట్టణం సాంబశివనగర్ మొదటి లైనులో కొప్పుల పాండురంగనాయకమ్మ (62), నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో కొరిటాల దుర్గ (45), పాలపాడులో పత్తి ఏడుకొండలు (65), నరసరావుపేట పట్టణం నవోదయనగర్‌లో కె.హరిప్రసాద్ (61), వెంకటరెడ్డినగర్‌లో మరో వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం శివారు సీతారామరాజు కాలనీకి చెందిన సుశీలమ్మ (75), ఖాజీపాలెం గ్రామానికి చెందిన నారాయణం లక్ష్మీనరసమ్మ(65), చందోలు గ్రామానికి చెందిన ముతహరున్నీసా(75) మృతి చెందారు.
దాచేపల్లి మండలం కేసానుపల్లిలో కుంకలగుంట శాంతమ్మ(58), పొందుగల గ్రామ పంచాయతీ పరిధి శ్రీనివాసపురంలో బొజ్జా వెంకటరావమ్మ(45), భట్రుపాలెంలో ఉపాధిహామీ పనులకు వెళ్లిన వికలాంగురాలు భూక్యా బుజ్జిబాయి(30) మృతి చెందారు. గురజాల రూరల్ మండలం మాడుగులలో నాగెండ్ల సింగరయ్య(65), రెంటచింతల మండలం రెంటాల గ్రామానికి చెందిన షేక్ సుభాని (65), దుర్గి మసీద్ సెంటర్లో ఉండే రాయనబోయిన జానమ్మ(70), ముటుకూరులో గోసుల నాగులు భార్య గంగమ్మ(60) వడదెబ్బకు గురై మృతి చెందారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో గుడిపూడి సాంబశివరావు (57), దుగ్గిరాల మండలం ఈమనిలో పేరుకలపూడి వరహాలు(65), మండల కేంద్రం పెదనందిపాడులో దాసరి ఆదిశేషమ్మ(83) మృతి చెందింది.
కర్లపాలెం మండలం సమ్మెటవారిపాలెంలో పిట్టు వెంక మ్మ(60), చెరుకుపల్లి మండలం ఆరుంబాక పంచాయతీ ఎస్టీ కాలనీలో చౌటూరి సోమయ్య(36), పొదిలివారిపాలెంలో పొదిలి లక్ష్మీ నరసమ్మ(77), ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లలో యర్రంరెడ్డి పేరమ్మ(70), కొండ్రమూట్లలో అలవాలపల్లి నర్సారెడ్డి(70), ముప్పాళ్లకు చెందిన మాజీ రేషన్ డీలర్ షేక్ హుస్సేన్‌బీ(96) వడదెబ్బకు మృతి చెందారు. భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో కొమ్మినేని కృష్ణమూర్తి(62), పల్లెకోన గ్రామంలో చిలుమూరు రాజు(55), వెల్లటూరులో వాకా సీతారామయ్య(60), పొన్నూరు పట్టణానికి చెందిన వేముల లోక (75), పొన్నూరు పట్టణ 23వ వార్డుకు చెందిన గోళ్లమూడి ఆదాము(54), చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన మానుకొండ అంజమ్మ(70),గుంటూరు కొత్తపేటలో మిర్చి కమీషన్ వ్యాపారి సన్నిధి నాగ ఆంజనేయులు (63) వడదెబ్బకు గురై మృతి చెందారు.
వడదెబ్బకు 31 మంది మృతి
Published Fri, May 29 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement