
సాక్షి, గుంటూరు: అధికారులు అవినీతి రహితంగా పనిచేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నరసరావుపేట మున్సిపల్ కార్యాలయంలో డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫోన్ ద్వారా స్వీకరించారు. తన పేరు చెప్పుకుని పైరవీలు చేసేవారిని దూరంగా పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. పలు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే..అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.