సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు.
అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్‌లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment