janga krishnamurthy
-
టీడీపీ ఎందరు బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి: అనిల్
-
బీసీ సీఎంలకూ సాధ్యం కాలేదు
సాక్షి, అమరావతి: కుల వృత్తులతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తున్న బీసీ సామాజిక వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక తోడ్పాటుతోపాటు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బీసీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ బీసీల శ్రమ, కృషి దాగుందన్నారు. బీసీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలకు ఇంత సంక్షేమం సాధ్యం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని 175 స్థానాల్లోనూ గెలిపించి సీఎం జగన్ రుణం తీర్చుకుంటామని, మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ నేతలు మాట్లాడారు. త్వరలో 26 జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ ప్రజా ప్రతినిధులు సామాజిక న్యాయానికి పెద్దపీట: బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే 243 బీసీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా వారికి దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. పోరాడే బాధ్యత మాదే: జోగి రమేశ్, గృహ నిర్మాణశాఖ మంత్రి బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైఎస్సార్ సీపీ స్వీకరించింది. బీసీ సామాజిక వర్గాలన్నింటిని ఏకం చేసి వారి ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. కలసికట్టుగా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అండగా నిలుద్దాం: సీదిరి అప్పలరాజు, పశుసంవర్థక శాఖ మంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి కుల అహంకారం ఉంది. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు. మత్స్యకారులను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని కుల అహంకారంతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీ హాస్టళ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అధికారం కోల్పోయాక రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకోవాలని చూశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం సాకారమైంది. ఆయనకు అంతా అండగా నిలవాలి. బాబు నైజాన్ని ఎండగట్టాలి: ఉషశ్రీ చరణ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి బీసీలను ఎంతో ఆదుకుంటున్న సంక్షేమ పథకాలను ఆపాలంటున్న చంద్రబాబు నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అనంతపురం అంటే బీసీల జిల్లా. వారంతా సీఎం జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టి అన్ని కులాలకు అండగా నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేసినా ఇంకా ఏం చేయగలమా? అని తపిస్తుంటారు. బీసీలను బెదిరించిన చంద్రబాబు: పోతుల సునీత, ఎమ్మెల్సీ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు గతంలో బెదిరించారు. సీఎం జగన్ నా బీసీ సోదరులు, అక్క చెల్లెమ్మలంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు అదే నిదర్శనం. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, హనుమంతరావు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, దాడి వీరభద్రరావు, వైఎస్సార్సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సమానంగా ఎదిగేలా తోడ్పాటు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా బీసీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో బీసీలకు విదిల్చింది కేవలం రూ.19,369 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పారదర్శకంగా లబ్ధి చేకూర్చింది. – గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి -
‘బీసీల అభివృద్ధికి పాటుపడే నాయకుడు సీఎం జగన్’
సాక్షి, గుంటూరు: బీసీ కులాల అభివృద్దికి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల బీసీ కులాల సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున్న ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని నర్సారావు పేటలో సోమవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీలె మోపిదేవి వెంటకరమణ, శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ యేసురత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి మాట్లాడుతూ... బీసీల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం హయాంలో బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. బీసీ కులాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, వారి అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల అభ్యున్నతికి అభివృద్దికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. బీసీలకు తగిన గుర్తింపు గౌరవం ఇచ్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా నిలిపారన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని పేర్కొన్నారు. ఆయన క్యాబినెట్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. బీసీలకు గుర్తింపు గౌరవం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, ఏడాదిన్నర కాలంలో 34 వేల కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు పెట్టిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
సీఎం జగన్ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోంది
సాక్షి, తాడేపల్లి: సంచార జాతుల 68వ స్వతంత్ర్య దినోత్సవ వేడుకలు వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమశాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. సంచార జాతుల వారిని గత ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ సంచార జాతుల వారిని పట్టించుకోలేదని విమర్శించారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేక అధ్యయన కమిటీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సంచార జాతుల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. బీసీ పక్షపాతి సీఎం జగన్ బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారని వ్యాఖ్యానించారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించారని తెలిపారు. (భూ సర్వే పైలట్ ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష) అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సంచార జాతుల వారు తమ సమస్యలను పాదయాత్రలో సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పాదయాత్రలో వారికి ఇచ్చిన హామీలన్నింటిని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. బాబు పాలనతో బీసీలు విసిగిపోయారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. పేదరికంపై గెలుపు కోసం ‘నవ రత్నాల పథకాలు’ ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదవాడిని గెలిపిస్తోందని పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన) -
స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉంది
-
అచ్చెన్న అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం?
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కాంలో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా పనిచేశారని, మంత్రి స్థానంలో ఉండి ఆయన అవినీతికి పాల్పడ్డారన్నారు. ‘‘స్కాంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ విచారణలో రుజువైంది. అచ్చెన్నాయుడు అరెస్ట్‌కు, బీసీలకు ఏం సంబంధం’’ అని ఆయన ప్రశ్నించారు. (కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు) బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంక్‌గానే చూశారు తప్ప.. చేసిందేమీలేదన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అచ్చెన్న తప్పు చేసి బీసీ కార్డు వాడుకోవడం దారుణం’ అంటూ దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాంలన్నీ బయటపడుతున్నాయని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
చంద్రబాబు అనే శనిని బీసీలు వదిలించుకున్నారు
-
రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా?
సాక్షి, అమరావతి : రాజధాని విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించే కార్యక్రమాల్లో బీసీలందరూ పాల్గొనాలని పిలుపినిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం జగన్ ఒక సముచిత, చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రశంసించారు. మూడు రాజధానులు అనగానే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని బడుగు బలహీన వర్గాలు స్వాగతిస్తున్నాయన్నారు. (బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా) రాజధాని ఎక్కడికి పోవడం లేదని, శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందని తెలిపారు. ప్రజల్ని తికమక పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాజధానికి 53 వేల ఎకరాల భూమి అవసరమా అని ప్రశ్నించారు. 53 వేల ఎకరాలు తీసుకుని చంద్రబాబు అమరావతిలో గ్రాఫిక్స్ చూపారని, అమరావతిని బ్రమరావతిగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు లెక్కల ప్రకారం అమరావతి నిర్మించాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందని ప్రశ్నించారు. ఒకే చోట రాజధాని వల్ల ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి నడుస్తున్నారని, జరుగుతున్న సంక్షేమ పథకాలపై చంద్రబాబుఅక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ఆపి రాజధాని చేపట్టాలా అని, అలా చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని జంగా కృష్ణమూర్తి తెలిపారు. -
‘అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం’
-
బాబుతో ప్రతాప్ కలిసి పనిచేశారు: జంగా
సాక్షి, తాడేపల్లి: రిజర్వేషన్ల ముసుగులో టీడీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ నేతలు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన ప్రతాప్ టీడీపీకి చెందిన వ్యక్తి అని అన్నారు. ప్రతాప్ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌కు దగ్గరి వ్యక్తి అని.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో అనేక సందర్భాల్లో కలిసి పనిచేశారని తెలిపారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే బీసీల సంక్షేమంపై దృష్టి పెట్టారని చెప్పారు. బీసీలను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీ వర్గాల మీద చంద్రబాబుకు ప్రేమ ఉంటే ప్రతాప్‌రెడ్డి వేసిన పిల్ ఉపసంహరింప చేయాలని సవాలు విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రైవేటు చర్చ పెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు నిజస్వరూపం గమనించే టీడీపీకి బీసీలు దూరమయ్యారని అన్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్ని విధాల న్యాయం చేశారని తెలిపారు. -
ముఖ్య విషయాలను దాచిపెట్టారు: ఇక్బాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య విషయాలను దాచిపెట్టారు.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. -
సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
-
సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి : వెనుకబడిన బీసీ సామాజిక వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. ఈ మేరకు బీసీ అధ్యయన కమిటీ సభ్యులు, బీసీ మంత్రులు, ఆ సామాజిక వర్గాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీల సమస్యలపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చలు, పరిశీలన అనంతరం కమిటీ నివేదినకు సమర్పించింది. దీంతో నేటి సమీక్షలో నివేదిక, అందులోని అంశాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎన్నో ఏళ్లుగా నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన సంచార వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ నిర్ణయించారు. బీసీల జీవన ప్రమాణాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. 10వేల నుంచి లక్ష జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని ఒక కేటగిరిగా, లక్ష నుంచి 10 లక్షల వరకు ఉన్న బీసీ వర్గాల వారిని రెండో కేటగిరిగా, 10లక్షలు ఆ పైబడి జనాభా ఉన్న బీసీ వర్గాల వారిని మూడో కేటగిరిగా విభజించి.. ఆ మేరకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా విస్తృత చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పదివేల లోపు ఉన్న సంచారజాతులు, గుర్తింపునకు నోచుకోని వర్గాల వారికి సరైన గుర్తింపునిచ్చి.. వారు కూడా సమాజంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాల్సిన చర్యలపై సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. గృహనిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, కులవృత్తులు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక వెసులుబాట్లు కల్పించాలన్న దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగాలని, అవసరమైన మరోసారి విస్తృత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీసీ సమాజిక వర్గాల ప్రతినిధులతో విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోసారి నిర్వహించే సమావేశంలో.. బీసీల అభ్యున్నతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించాలని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, అనిల్‌కుమార్ యాదవ్, ధర్మాన కృష్ణదాస్, శంకరనారాయణ, బీసీ వర్గాల ప్రతినిధులు పొల్గొన్నారు. -
అన్ని కులాలకు న్యాయం చేస్తాం
సాక్షి, తాడేపల్లి: బీసీలను తెలుగుదేశం పార్టీ వాడుకొని వదిలేసిందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. అన్ని కులాలకు న్యాయం జరిగేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సంచార జాతిలో ఉన్న కులాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారని వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెల్లబోయిన వేణుగోపాల్‌తో కలిసి జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని పేర్కొన్నారు. సంచార జాతుల ఆవేదనను సీఎం జగన్ విన్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఆర్థిక పరిపుష్టి కల్పించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకున్నారని తెలిపారు. సమాజంలో మార్పు రావాలన్నదే సీఎం వైఎస్ జగన్ ముఖ్య ఉద్దేశమన్నారు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించాలని, అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలని సీఎం పట్టుదలతో ఉన్నారన్నారు. చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించారని వెల్లడించారు. కార్పొరేషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నామినేటేడ్ పదవులు కూడా 50 శాతం ఇస్తారని చెప్పారు. మార్కెట్ యార్డు, దేవాలయాల్లో పదవులు 50 శాతం ఈ వర్గాలకే ఇస్తారని తెలిపారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని, బీసీ వర్గాలు తమ సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరారు. కులాలకు సంబంధించిన ఏ సమస్యనైనా ప్రభుత్వం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని కృష్ణమూర్తి పేర్కొన్నారు. -
బీసీలను టీడీపీ వాడుకుని వదిలేసింది
-
కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే..
సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ముకాసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని కొందరు రాజకీయ నేతలు చెబుతున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీ ప్రపంచంలో యువత ఉద్యోగాలు సాధించాలన్నా, విదేశాల్లో చదవాలన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పోటీ పడాలన్నా ఇంగ్లిష్ భాష తప్పనిసరి అన్నారు. వారి పిల్లల భవిష్యత్ బావుండాలి, బడుగు బలహీనవర్గాల విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉండాలా? అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగితే తమ కార్పొరేట్ స్కూళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందనే కొందరు విపక్ష నేతలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. తెలుగుకు అన్యాయం చేయాలనో.. పరభాషని తెలుగు భాషపై రుద్దాలనో తమ నేత ఆలోచన కాదన్నారు. పేదలంతా బాగా చదువుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనేదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పారు. బీసీలను టీడీపీ ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది రాష్ట్రంలో బీసీలందరినీ టీడీపీ కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంది తప్ప వారి అభివృద్ధికి ఏనాడు ఆలోచన చేయలేదని కృష్ణమూర్తి విమర్శించారు. ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కేవలం ఐదు నెలల్లోనే అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసి... బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కేటాయించిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్న కొందరు టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెడుతుంటే వ్యతిరేకిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌ది లాంగ్ మార్చ్ కాదు రాంగ్ మార్చ్
సాక్షి, విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని, రాంగ్ మార్చ్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని, అందువల్ల పవన్‌ను టీడీపీ అధ్యక్షుడిని చేయాలన్నారు. రాజకీయాల్లోనూ పవన్‌ది నటనే :ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పవన్ కల్యాణ్‌కు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ నటించడం అలవాటైపోయిందని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. అందులో భాగంగానే విశాఖలో లాంగ్‌మార్చ్ పేరుతో చంద్రబాబు డైరెక్షన్లో నటిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఆదివారం విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తూ.. మహిళా అధికారులపైన దాడులకు పాల్పడితే అప్పుడు పవన్ గాడిదలు కాశాడా? అని ప్రశ్నించారు. టీడీపీ ఇసుక దోపిడీపై నోరు మెదపవేం పవన్: మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు ధ్వజం ఎన్నికల ముందు తెరవెనక పొత్తులు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలు.. ఇప్పుడు ప్రత్యక్షంగానే కలసిపోయాయని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఇసుక అక్రమ రవాణాపై పవన్ నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదలను మంత్రి, ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 50 రోజులుగా కృష్ణా, గోదావరి, పెన్నా నదులకు వరద పోటెత్తిందని.. ఈ సమయంలో ఇసుకతీత ఎలా సాధ్యమో పవన్ చెప్పాలన్నారు. -
'రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారు'
సాక్షి,తాడేపల్లి : గ్రామ సచివాలయ ఉద్యోగాల పేరుతో ఒకేసారి లక్షా 27 వేల పోస్టులు భర్తీ చేయడం ఒక చరిత్ర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేయడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సచివాలయ ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువ మంది అర్హత సాధించారని తెలిపారు. ఈ నేపథ్యంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో మొదటి ర్యాంక్ వస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాధాకృష్ణ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీలను అణగదొక్కాలని వాళ్లిద్దరూ కంకణం కట్టుకున్నారని , అందుకే బీసీ నేతలను బాడుగ నేతలుగా రాధాకృష్ణ తన పేపర్‌తో పాటు చానెల్లో బహిరంగంగానే అభివర్ణించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు తప్ప మరొకరు సీఎం కాకూడదని రాధాకృష్ణ ఉద్దేశమని, పత్రికను అడ్డం పెట్టుకొని అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆగ్రహం వెళ్లగక్కారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని , చంద్రబాబు, రాధాకృష్ణ కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గమనించాలని కోరారు. -
టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ మహిళా సాధికారితకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ పెద్దపీట వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని కొనియాడారు. బడుగు, బలహీన ప్రజల పక్షపతిగా సీఎం వ్యవహరించి, ఇచ్చిన మాట నిలుపుకున్నారని అన్నారు. బీసీ కులాలకు ఆదరణ పేరుతో పనిముట్లు ఇచ్చి గత చంద్రబాబు సర్కార్ మభ్యపెట్టిందని విమర్శించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదిక కల్పిస్తూ చట్టం చేయడం సాహసోపేత చర్యగా పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కృషి చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అలాగే స్థానికతకు పెద్దపీట వేస్తూ నిరుద్యోగితను తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని, దీంతో జగన్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. -
బీసీలకు మరోసారి అవకాశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్‌ను ఆ పార్టీ ప్రకటించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. అందులో కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ సింగారి సంజీవ్‌కుమార్‌ను పోటీకి నిలుపుతున్నట్లు వెల్లడించారు. బీసీ (పద్మశాలి) వర్గానికి చెందిన డాక్టర్ సంజీవ్‌కుమార్ కర్నూలులోని ఆయుస్మాన్ హాస్పిటల్ అధినేతగానూ ఉన్నారు. ఈయన కర్నూలు మెడికల్ కాలేజీలోనే వైద్యవిద్యను అభ్యసించారు. యురాలజిస్టుగా రాణించడమే కాకుండా ఆనంద జ్యోతి ట్రస్టు ద్వారా సామాజిక సేవ కూడా చేస్తున్నారు. ఇక కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లోనూ బీసీ (బుట్టా రేణుక)కే ఆ పార్టీ సీటు కేటాయించింది. మరోసారి బీసీలకు ఈ సీటును కేటాయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు బీసీల పార్టీ అని చెప్పుకునే అధికార టీడీపీ మాత్రం ఈ సీటు వారికి కేటాయించకుండా.. ఉన్న సీట్లను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి 21 మంది డాక్టర్లు డాక్టర్ సంజీవ్‌కుమార్ తండ్రి సింగరి శ్రీరంగం. ఈయనకు మొత్తం ఆరుగురు (ముగ్గురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు) సంతానం. వీరందరూ డాక్టర్లే. అంతేకాకుండా వీరి పిల్లలు.. అంతా కలిపి మొత్తం 21 మంది డాక్టర్లుగా రాణిస్తున్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన జంగా కృష్ణమూర్తి
-
‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరు’
సాక్షి, అమరావతి : ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇవాళ ఉదయం ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ మాట ఇస్తే తప్పరని మరోసారి నిరూపించారు. బీసీని అయిన నన్ను ఇచ్చిన మాట మేరకు ఎమ్మెల్సీని చేశారు నన్ను. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసే బాధ్యత ఇచ్చారు. బీసీలను ఆదుకోవడానికి ఏం చేయాలో అధ్యయనం చేయమన్నారు. బీసీలకు ఎవ్వరూ ఇవ్వనటువంటి డిక్లరేషన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చారు. అంతేకాదు బీసీ గర్జనలోనే వైఎస్సార్ సీపీకి వచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీని ఇచ్చారు. ఇది బీసీలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.’ అని అన్నారు. నామినేషన్ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ముస్తఫా, ఆదిమూలం సురేష్, మేక ప్రతాప్ అప్పారావు, కంబల జోగులు, రక్షణ నిధి, పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, జంకే వెంకట రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదు
-
బీసీలను దూషించిన బాబుకు గుణపాఠం తప్పదు
సాక్షి, ఏలూరు: ఎన్నికలు వస్తుండటంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీసీలు గుర్తుకొస్తున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఆయన బీసీలను వాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని హేలాపురి టౌన్షిప్ పక్కనే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కీలకమైన ‘బీసీ గర్జన’ సభ ప్రారంభమైంది. ఈ సభలో జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల పట్ల చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న దమననీతిని ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే బీసీలను చంద్రబాబు దూషించారని దుయ్యబట్టారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన చంద్రబాబుకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలను మళ్లీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. బీసీలు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. -
‘ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్’
సాక్షి, విజయవాడ : ఐదేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు నాయుడు చేసిందేమి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితిలో ఉన్నాయన్నారు. బీసీలకు న్యాయం చేయాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఏడాదిన్నర క్రితమే బీసీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. బీసీల పరిస్థితిపై కమిటీ అధ్యయనం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కుల సంఘాలతో సమావేశమై నివేదిక రూపొందించామని తెలిపారు. ఫిబ్రవరి 17న ఏలూరులో జరిగే బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. బీసీలు ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు : జంగా ఐదేళ్లుగా బీసీలను గాలికొదిలేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోజయహో బీసీ అంటూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. చంద్రబాబు పాలనలో బీసీల జీవితాలు దుర్భర పరిస్థితికి వచ్చాయని ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో బీసీలకు చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు బీసీలపై చేసే వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీసీలు ఎవరూ చంద్రబాబుని నమ్మడం లేదన్నారు. వైఎస్ జగన్ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్రమంతా పర్యటించి సమస్యలను గుర్తించిదని, వాటి పరిష్కారం కొరకు వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. బీసీ కులాలన్ని ఏకమై చంద్రబాబుకు బుద్ది చెప్పాలని కోరారు. -
‘20న ఏపీలో నిరసన కార్యక్రమాలు’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు తీవ్ర అన్యాయం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 20వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందులో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పెద్ద ఎతున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేసే వరకు చంద్రబాబుకు బీసీలు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు బీసీలను పట్టించుకోకుండా మోసం చేసిన చంద్రబాబు.. ఆదరణ అంటూ నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఏం చేశాడని చంద్రబాబు జయహో బీసీ సభ పెడుతున్నాడని నిలదీశారు. చంద్రబాబును బీసీ ద్రోహిగా అభివర్ణించారు. బీసీలను బెదిరించి ఓట్లు వేయించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. టీడీపీ సభ్యత్వం కట్టలేదని పశ్చిమ గోదావరి జిల్లాలోని బీసీలపై దాడులు చేయడం దారుణమన్నారు. బీసీలకు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు ఇచ్చి సరిపెడతారా అని ప్రశ్నించారు. తమ పార్టీ బీసీలకు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని అన్నారు. -
ప్రజాసంకల్పయాత్ర.. బీసీలకు భరోసా యాత్ర!
సాక్షి, మల్లవరం : వైఎస్ జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర.. బీసీలకు భరోసా యాత్ర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, దివంగత నేత వైఎస్ఆర్ హయాంలో బీసీలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా మల్లవరంలో బీసీలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో బీసీ ప్రజలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తప్పుడు వాగ్దానాలు ఇస్తూ బీసీ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని అన్నారు. బీసీల స్థితిగతులను మార్చడానికి చంద్రబాబు ఏ ప్రయత్నం చేయలేదని, కానీ బీసీలకు అది చేసినట్టు, ఇది చేసినట్టు మభ్యపెడుతున్నారని ఆయన మండిపడ్డారు. -
సుబ్బయ్య టీడీపీ క్రియాశీల కార్యకర్త
పట్నంబజారు (గుంటూరు): మానవ మృగం అన్నం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్త అని వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సుబ్బయ్యకు ఎమ్మెల్యే కోటాలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నివాస గృహాన్ని కూడా మంజూరు చేశారని వెల్లడించారు. మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే మూడు రోజులపాటు ఏమీ మాట్లాడని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగా కృష్ణమూర్తి శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఘటన జరిగిన తరువాత దాచేపల్లిలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పిడుగురాళ్లలో ఉన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎందుకు అక్కడికి రాలేదో చెప్పాలని ప్రశ్నించారు. మూడ్రోజుల తర్వాత జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన ఎమ్మెల్యే యరపతినేనికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మైనర్ బాలిక పేరు చెప్పకూడదన్న విజ్ఞత లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్సీపీపై లేనిపోని అభాండాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. చట్టాలను నిర్వీర్యం చేస్తూ దోషులకు కాపలా కాసే నైజం టీడీపీదేనని విమర్శించారు. చిన్నారిపై అత్యాచార ఘటనకు చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ... చిన్నారిపై అత్యాచారం విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు చేసే పనిలో పడ్డారని దుయ్యబట్టారు. నిందితుడు సుబ్బయ్యకు ప్రభుత్వం మంజూరు చేసిన నివాస ధ్రువీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. -
దాచేపల్లి ఘటన నిందితుడు టీడీపీకి చెందిన వ్యక్తి
-
‘బాబు కపట ప్రేమ మరోసారి బయటపడింది’
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలపై కపట ప్రేమ మరోసారి బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో బీసీలకు అత్యున్నత పదవులు రాకుండా అడ్డుకున్న తీరు దారుణమని తెలిపారు. మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలపై ప్రేమ అంటూనే కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడంలో అర్థం ఏంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చెప్పేదొకటి, తర్వాత చేస్తోంది మరొకటన్నారు. బీసీ న్యాయమార్తుల విషయంలో చంద్రబాబు పంపిన నివేదికలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. -
బీసీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు
-
'బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్‌కు..'
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా : బీసీ నేతల సూచనలను తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నామని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. బీసీ సమస్యలు, అభ్యున్నతిపై పార్టీ బీసీ అధ్యయన కమిటీ శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, జంగా కృష్ణమూర్తి పార్టీ నేతలు సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి, పులువురు నేతలు హాజరయ్యారు. మెరుగైన డిక్లరేషన్ కోసం బీసీ సంఘాలను సంప్రదిస్తున్నామని ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి చెప్పారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో బీసీలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ అధ్యయన కమిటీ సభ్యుల మొదటి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, గ్రామాల్లో బీసీలను బానిసలుగా మార్చేసారని విమర్శించారు. బీసీలకు టీడీపీ అన్నిరకాలుగా అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీల స్థితిగతులను అధ్యయనం చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో బీసీల సమస్యలపై దృష్టి సారిస్తామన్నారు. బీసీలకు న్యాయం చెయ్యాలన్న వైఎస్ జగన్ ఆదేశాలతో అధ్యయన కమిటీ రాష్ట్ర పర్యటనకు వెళుతోందని వెల్లడించారు. అధ్యయనం అనంతరం అధినేత జగన్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు. నివేదిక ఆధారంగా బీసీ గర్జనలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీ గెలుపులో భాగస్వాములు కండి
కడప కార్పొరేషన్: 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంలో బీసీలు భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జంగా క్రిష్ణమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం కడపలోని పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జంగా క్రిష్ణమూర్తి మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల(బీసీలు)కు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదని అన్నారు. చంద్రబాబు పాలనలో బీసీలు మోసపోయారన్నారు. వైఎస్ఆర్ సుపరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని, అప్పుడు కులాల వారీగా సమస్యలను అధ్యయనం చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబు పోకడను ఎండగట్టాలన్నారు. మండల, వార్డు కమిటీలు కనీసం ముగ్గురు బీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కులానికి ప్రాధాన్యం ఇచ్చి నాయకత్వాన్ని పెంపొందించాలన్నారు. బీసీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని నవంబర్ 6 నుంచి వైఎస్ జగ¯Œన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్రలో వినతిపత్రాలు ఇవ్వాలన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బీసీలకు ఏం చేశారని టీడీపీ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, దానిని తిప్పికొట్టాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టి అన్ని వర్గాలను మోసం చేశారని దుయ్యబట్టారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య, నగర అధ్యక్షుడు చినబాబు మాట్లాడుతూ బీసీలు విద్య, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి సమస్యలు తీర్చగల సమర్థ నాయకుడు జగనేనని తెలిపారు.అనంతరం బీసీ నాయకుల సలహాలు, సూచనలను స్వీకరించారు. 2019లో అధికారంలోకి వస్తున్నాం 2019లో అధికారంలోకి వస్తున్నామని వైఎ స్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి భరోసా ఇచ్చారు. ఇస్త్రీపెట్టెలు, షేవింగ్ కిట్లు, వృత్తి పరమైన సామగ్రి ఇచ్చి బీసీలను కులవృత్తులకే పరిమితం చేయాలని చూసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బలిజలను బీసీల్లో, బోయలను ఎస్టీల్లో చేరుస్తానని ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని, కులాల మధ్య ఉన్న ఆసమానతలను తొలగించడమే ఆయన లక్ష్యమన్నారు. ఒక్కసారి అవకాశం కల్పించండి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు ఒక్క అవకాశం కల్పించాలని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా కోరారు. 35 ఏళ్లుగా బీసీలు టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నారని, అయితే ఆ పార్టీ బీసీలకు చేసిందేమీ లేదన్నారు. బీసీల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ విశేషంగా కృషి చేశారన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారని, ఆరోగ్యశ్రీ, పక్కాఇళ్లు, పింఛన్లు వంటి పథకాలతో ఆదుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అ«ధికారంలోకి వస్తే బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. అంతకుముందు వారు మహాత్మా జ్యోతిరావు పూలే, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కె. సురేష్‌బాబు, బీసీ నాయకులు శివయ్య యాదవ్, గోపాలస్వామి, విజయ్‌భాస్కర్, సురేష్‌కుమార్, బోలా పద్మావతి, టీపీ వెంకటసుబ్బమ్మ, పస్తం అంజి తదితరులు పాల్గొన్నారు. -
రేపు విజయవాడకు వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ సీపీ బీసీ సెల్ సమావేశం సోమవారం విజయవాడలో జరగనుంది. దీంతోపాటు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నెలరోజులకు పైగా దీక్ష చేస్తున్న చేనేత కార్మికులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ మంగళవారం ధర్మవరం వెళ్లనున్నారు. అకుంఠిత దీక్ష, పట్టుదల, దృఢసంకల్పంతో రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేలా చూసేందుకు వైఎస్ జగన్ పోరాటం కొనసాగించనున్నారు. తాను అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ను అమలు చేస్తానంటూ ఇచ్చిన హామీని తుంగలోతొక్కి సీఎం చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ బీసీ విభాగం నేతలు మండిపడుతున్నారు. ఏపీలో బీసీలను టీడీపీ కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలకే వాడుకుంటుంది తప్ప, వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనుంది. దీనికి వైఎస్ జగన్ అధ్యక్షత వహించనున్నట్లు వైఎస్ఆర్ సీపీ బీసీ విభాగం ఏపీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, వెనుకబాటు, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై జరగనున్న ఈ సమావేశానికి ఏపీ వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం నేతలు హాజరు కానున్నారు. -
విజయవాడకు వైఎస్ జగన్
-
‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’
గుంటూరు: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఒక సువర్ణయుగమని వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసి ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. ఎ్రరటి మండుటెండల్లో చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేపట్టారని... గుడిసెల్లో నివసించే పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించి, గుడిసెలేని గ్రామం ఉండాలని కృషి చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. చంద్రబాబు పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటైనా జరిగాయా అని ప్రజలను అడిగారు. రాజన్న పరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ తీర్మానాన్ని బాలరాజు బలపరిచారు. వైఎస్ఆర్ చిరస్మరణీయుడు అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి కొనియాడారు. ప్లీనరీలో ఆయన బీసీ సంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారని అన్నారు. అన్ని వర్గాలకు సమ న్యాయం చేసిన మహానుభావుడు వైఎస్ఆర్ అని ప్రశంసించారు. విద్యా, వైద్యం మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు అందేలా చూశారని చెప్పారు. పేదలకు విద్యాదాత వైఎస్ఆర్ అన్నారు. మహానేత ఆశయ బాటలో నడుస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేద్దామని, జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంబంధిత కథనాలు: ఏపీని బజారున పడేసింది టీడీపీనే: నాగిరెడ్డి భగవంతుడు పంపిన దూత వైఎస్ జగన్: రెడ్డి శాంతి వైఎస్ జగన్ సీఎం అయితేనే పోలవరం పూర్తి -
నిరసన జ్వాల
-
అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన జంగా కృష్ణమూర్తి
దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి అనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. గుండెకు సంబంధించి సమస్య తలెత్తటంతో చికిత్స కోసం నిమ్స్‌లో చేరినట్లు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన పార్టీ నాయకులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక జంగా తండ్రి వీరయ్య, తర్వాత ఆరు నెలల వ్యవధిలోనే తల్లి వీరమ్మ మృతిచెందడంతో మానసిక ఒత్తిడికి లోనై గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని పార్టీ నేతలు చెప్పారు. -
అమ్మేసిన భూములను ఆక్రమించుకోవడమా!?
ధ్వజమెత్తిన గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి పారిశ్రామికాభివృద్ధి జరగాలంటూ మరోవైపు అడ్డుకుంటారా? మీ హెరిటేజ్ కోసం కొన్న భూములూ అలాగే ఇచ్చేస్తారా? జగన్ ఇంటి ముందు ధర్నా చేసింది రైతులు కాదు.. టీడీపీ కార్యకర్తలు హైదరాబాద్: అమ్మేసిన భూములను ఆక్రమించుకోవాలని రైతులను ప్రోత్సహించడం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటిల నీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. విభజన నేపథ్యంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని ఓ వైపు ఉపన్యాసాలిస్తూ మరో వైపు ఫ్యాక్టరీలను అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం జగన్ ఇంటి వద్ద ధర్నా చేయడానికి వచ్చిన వారు రైతులు కానేకాదని, వారంతా ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలని తెలి పారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చి న హామీలను నెరవేర్చనందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీస్తుంటే సహించలేక ఆయనను అప్రతిష్టపాలు చేసేందుకే సరస్వతీ పవర్ కంపెనీ పట్ల కక్షతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ►రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమ తం అవుతున్నారు. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు. గద్దె నెక్కగానే చేసిన ఐదు సంతకాల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. జన్మభూమి కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉండటంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకే సరస్వతీ పవర్ కంపెనీ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ►భారతి సిమెంట్స్‌లో లాభాలు వస్తే వాటిని రైతులకు పంపిణీ చేసిన రైతు బాంధవుడు జగన్. చంద్రబాబు గాని, రామోజీ గాని భూములను తీసుకున్న పేద రైతులకు ఏనాడైనా తమ కంపెనీల్లో వచ్చిన లాభాలను పంచి ఇచ్చారా? ►మాచవరం మండలంలో సున్నపురాయి విస్తారంగా ఉన్నందున సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్క సరస్వతీ పవర్ వ్యవహారంలోనే విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు సోదరుడు కూడా మా ప్రాంతంలో ఐదారేళ్ల నుంచీ సిమెంటు ఫ్యాక్టరీ కోసం భూములు కొన్నారు. భవ్య, అంబుజ కంపెనీలు కూడా భూములు కొన్నాయి. కానీ జగన్‌ను అప్రతిష్టపాలు చేయడానికే ఒక్క సరస్వతీ విషయంలోనే రాద్ధాంతం చేస్తున్నారు. ►చంద్రబాబు హెరిటేజ్ కోసం కొనుగోలు చేసిన భూములను, టీడీపీ నేతలు విజయవాడలో రాజధాని పేరుతో తక్కువ ధరకు కొన్న భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తారా? ►సరస్వతీ పవర్ కంపెనీ వల్ల తమకు ఎలాంటి నష్టం కలుగలేదని, తాము అడిగిన దానికన్నా ఎక్కువ ధర ఇచ్చి భూములు కొన్నారని, ఫ్యాక్టరీ రావడానికి అడ్డుపడొద్దని వేడుకోవడానికి రైతులు వస్తే వారిని కనీసం కలవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడక పోవడం నిజంగా శోచనీయం. అదే జగన్ ఇంటి వద్ద ఘెరావ్ చేయడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు, ఓ సామాజిక వర్గం వారిని మాత్రం పిలిచి మరీ మాట్లాడారు. రైతులు కాని వారికి ప్రాధాన్యత నిచ్చిన చంద్రబాబు నిజమైన రైతులను కలవకుండా లాఠీ చార్జి చేయించారు. -
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్
-
రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు
►వైఎస్సార్ సీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో దాడి ►కౌన్సిలర్ భర్తతోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు ►బాధితులను పరామర్శించిన జంగా కృష్ణమూర్తి పిడుగురాళ్ల: పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని ప్రజాశక్తి నగర్లో గురువారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పోలు లక్ష్మీనారాయణమ్మ భర్త శ్రీనివాసరెడ్డి, పోలు అంకిరెడ్డి, బారెడ్డి మల్లారెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకుల తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది. పక్కా ప్రణాళికతో దాడి.. టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని క్షతగాత్రులు ఆరోపించారు. వార్డులో ఇటీవల వాటర్ ట్యాపు ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు తవ్వించిన బోరును వారి ఆదేశంతో సిబ్బంది బుధవారం సాయంత్రం పూడ్చివేయించారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన కౌన్సిలర్ భర్త శ్రీనివాసరెడ్డి గుంతను ఎందుకు పూడ్చుతున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రస్తుతం ట్యాపు ఏర్పాటు కుదరదని, అందుకే మున్సిపల్ అధికారుల ఆదేశాలమేరకు పూడ్చుతున్నామని సమాధానమిచ్చారు. అదేవార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వాయిరి వెంకట్రావు, ఇతర పార్టీ నాయకులు తాము ట్యాపు వేయించేందుకు తీయించిన గుంతను కౌన్సిలర్ భర్త పూడ్చివేయించాడని ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి శ్రీనివాసరెడ్డి బాబాయి పోలు తిమ్మారెడ్డి ఇంటిపైకి వెళ్లి దుర్భాషలాడి దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డాడు. బాధితుడు తిమ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పోలీసులకు ఫిర్యాదుచేయగా.. గురువారం ఉదయం పోలీసులు.. వెంకట్రావు తదితరులను స్టేషన్‌కు పిలిపించారు. కేసు నమోదు చేయకుండా మళ్లీ సాయంత్రం రావాలని, సాయంత్రం వెళ్తే శుక్రవారం ఉదయం రావాలని పోలీసులు చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి తదితరులు తెలిపారు. పోలీసు కేసు పెట్టారన్న కక్షతో టీడీపీ నాయకులు పథకం ప్రకారం గురువారం అర్ధరాత్రి తమపై దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. తన ఇంటి వద్ద బైకుపై ఇద్దరు వ్యక్తులు అటూ ఇటూ తిరుగుతుండడంతో అంకిరెడ్డి, మల్లారెడ్డిలతో కలసి వారిని ద్విచక్ర వాహనంపై వెంబడించగా.. కొంతదూరం వెళ్లిన అనంతరం మలుపు వద్ద అప్పటికే కాపుకాసిన వెంకట్రావు, సుబ్బారావు, శివయ్యలతోపాటు సుమారు 20 మంది తమ కళ్లలో కారం చల్లి కర్రలు, రాడ్లతో దాడిచేశారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు తలలు పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా, నిందితులను పట్టుకొచ్చిన పోలీసులు తమను కూడా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు జంగా పరామర్శ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతా వెంకటరామారావు, మండల అధ్యక్షుడు చల్లా పిచ్చిరెడ్డి, రేపాల శ్రీనివాసరావు, కట్టా వెంకటేశ్వరరెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు. -
జంగా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
పిడుగురాళ్ల, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టణంలో నిర్వహించిన ర్యాలీ పండగ వాతావరణాన్ని తలపించింది. పార్టీ నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మాజీ ప్రముఖులు పెద్దసంఖ్యలో వైఎస్సార్ సీపీకి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండీ ఉస్మాన్మేస్త్రీ, మాచవరం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోనంకి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచి మల్లెల ఆదినారాయణ,సొసైటీ మాజీ అధ్యక్షుడు దాచినేని వెంకయ్య, మాజీ కౌన్సిలర్ నాళం శకుంతల భర్త సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకుడు అత్తోట రామనరసింహరావు తమ అనుచరగణంతో పాల్గొన్నారు. వారితోపాటు 30వార్డుల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద నుంచి పోలీస్‌స్టేషన్ సెంటర్, ఐలాండ్ సెంటర్ల మీదుగా సత్యసాయి కల్యాణ మండపం వరకు ర్యాలీ కొనసాగగా.. ఎక్కడికక్కడ అభిమానులు ఎదురేగి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి రేపాల రమాదేవి, ఆమె భర్త శ్రీనివాసరావులకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్, టీడీపీ మాజీలు పెద్దసంఖ్యలో తరలిరావడంతో టీడీపీ శ్రేణుల్లో వణుకు మొదలైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న రాజకీయం ఆళ్ల రాకతో ఒక్కసారిగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా మారిందంటున్నారు. పార్టీ పట్టణ కన్వీనర్ చింతా వెంకట రామారావు, మండల కన్వీనర్ చల్లా పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.