సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ మహిళా సాధికారితకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ పెద్దపీట వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని కొనియాడారు. బడుగు, బలహీన ప్రజల పక్షపతిగా సీఎం వ్యవహరించి, ఇచ్చిన మాట నిలుపుకున్నారని అన్నారు. బీసీ కులాలకు ఆదరణ పేరుతో పనిముట్లు ఇచ్చి గత చంద్రబాబు సర‍్కార్ మభ్యపెట్టిందని విమర్శించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదిక కల్పిస్తూ చట్టం చేయడం సాహసోపేత చర్యగా పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కృషి చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అలాగే స్థానికతకు పెద్దపీట వేస్తూ నిరుద్యోగితను తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని, దీంతో జగన్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment