mla Parthasarathy
-
‘‘నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం’’
కర్నూలు, సాక్షి: కూటమి ప్రభుత్వంలో ఉండడం ఏమోగానీ.. అధికార మదంతో రోజుకొకరు వార్తల్లో నిలుస్తున్నారు. తాము ఏం చెబితే అదే శాసనం అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులకు వార్నింగ్లు ఇస్తున్నారు. తాజాగా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ తరహా దురుసు వ్యాఖ్యలే చేశారు.కూటమి నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ నేనే సీఎం.. నేనే డిప్యూటీ సీఎం. నేను చెబితే చంద్రబాబు చెప్పినట్టే. నేను చెబితే పవన్ కల్యాణ్ చెప్పినట్లే. ఎవరైతే ఇన్నాళ్లూ.. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపులు కొనసాగిస్తున్నారో వాళ్లంతా ఉన్నపళంగా వదలేసి వెళ్లిపోవాలి. .. అధికారుల నుంచి ఎలాంటి లేఖలు తేవడాల్లాంటివి ఉండవు. వాళ్లంతా లబ్ధి చేకూర్చేవన్నింటిని విడిచిపోవాలి. నేను చెప్పిందే ఒక పెద్ద లెటర్. లేకుంటే లెక్క మరోలా ఉంటుంది’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. ఐదు రేషన్ షాపులకు తాళాలు వేసి.. ‘ఇక నుంచి ఇవి మావే’ అంటూ ప్రకటన చేశారు. దీంతో రేషన్ డీలర్లు షాక్కు గురయ్యారు.‘‘ఎన్టీఆర్ హయాం నుంచి ఆ రేషన్ షాపులను తామే నడుపుకుంటున్నామని, ఇప్పుడు ఉన్నపళంగా లాగేసుకోవడం ఏంటని, తమ షాపులు లాకుంటే తాము రోడ్డున పడుతామంటూ’’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అహం భావంతో ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
అభివృద్ధి ఫలాలు అందకూడదని టీడీపీ కుట్రలు: పార్థసారథి
సాక్షి, కృష్ణా: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యమని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకూడదని టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా డెల్టాలో కెనాల్ ఆధునీకరణ పనులపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యనమలకుదురు-కంకిపాడు కెనాల్ ద్వారా 2 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. కెనాల్ అభివృద్ధి పనులపై టీడీపీ నేత బోడె ప్రసాద్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క గంపెడు మట్టి కూడా తీయలేదని,టీడీపీ నేతలు కాలువ పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీరు, చెట్టు పేరుతో కాంట్రాక్టులు పిలిచి అవినీతికి ఆస్కారం ఉన్న పనులే చేశారని మండిపడ్డారు. నీరు, చెట్టు కింద కాలువ పనులు చేయలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మే నెలలోనే రాష్ట్రంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి కమిటీ వేశారని గుర్తుచేశారు. జూన్లో వర్షాలు ప్రారంభమవడం వల్ల అప్పుడు పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. తర్వాత నుండి చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, అందుకే ఎక్కువ మిషనరీ ఉన్న ఒకే కాంట్రాక్టర్కు పనులు అప్పగించామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ నా బినామీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశారని అన్నారు. -
చంద్రబాబు పనిచేసింది కేవలం స్వార్ధం కోసమే: ఎమ్మెల్యే పార్థసారథి
-
‘టీడీపీవి దిగజారుడు రాజకీయాలు’
కృష్ణా జిల్లా: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఓటమి భయంపట్టుకునే ఎన్నికల నుంచి పారిపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్ధసారధి విమర్శించారు. సీఎం జగన్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దాంతోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం ముందు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ప్రశ్నించకుండా ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజల్లో టీడీపీ పై నమ్మకం పోయిందని పార్థసారధి విమర్శించారు. చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని -
రైతులను ఆదుకుంటాం:పార్థసారధి
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలైన యలమలకుదురు, పెద్ద పులిపాకలో ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి సోమవారం పర్యటించారు. యలమలకుదురులో డంపింగ్ యార్డును ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..పెద పులిపాక వరుకు రిటర్నింగ్ వాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కృష్ణమ్మ శాంతించడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని..రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. వరద సహాయక కేంద్రాలను పరిశీలించిన ఎంపీ పొట్లూరి.. ఇబ్రహీంపట్నం: వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం విజయవాడ ఎంపీ పొట్లూరి వరప్రసాద్ పర్యటించారు. వరద సహాయక కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.వరద బాధితులను పరామర్శించి..ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందిస్తామని తెలిపారు.ఆయన వెంటన వైఎస్సాఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. -
టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది..
సాక్షి, విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తూ మహిళా సాధికారితకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ పెద్దపీట వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని కొనియాడారు. బడుగు, బలహీన ప్రజల పక్షపతిగా సీఎం వ్యవహరించి, ఇచ్చిన మాట నిలుపుకున్నారని అన్నారు. బీసీ కులాలకు ఆదరణ పేరుతో పనిముట్లు ఇచ్చి గత చంద్రబాబు సర్కార్ మభ్యపెట్టిందని విమర్శించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదిక కల్పిస్తూ చట్టం చేయడం సాహసోపేత చర్యగా పేర్కొన్నారు. మహిళల సాధికారతకు కృషి చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. అలాగే స్థానికతకు పెద్దపీట వేస్తూ నిరుద్యోగితను తగ్గించేలా నిర్ణయం తీసుకున్నారని, దీంతో జగన్ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. -
విజయకాంత్ కేసు విచారణ వాయిదా
టీ.నగర్, న్యూస్లైన్: విజయకాంత్పై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడింది. తంజావూరులో 2012 ఆగస్టు 10వ తేదీ జరిగిన డీఎండీకే బహిరంగ సభలో మాట్లాడిన విజయకాంత్ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తంజావూరు జిల్లా కోర్టులో పిటషన్ దాఖలైంది. కపి స్థలంలో గత ఏప్రిల్ 4వ తేదీ జరిగిన డీఎండీకే బహిరంగ సభలో ఎమ్మెల్యే పార్థసారథి, ముఖ్యమంత్రికి పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు పిటిషన్ దాఖలైంది. ఈ రెండు కేసులు తంజావూరు కోర్టులో శుక్రవారం విచారణకు వచ్చాయి. ఈ కేసులో హాజరయ్యేందుకు విజయకాంత్ హైకోర్టులో మినహాయింపు పొం దారు. దీంతో కేసుల విచారణను ఫిబ్రవరి మూడవ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు.