
కృష్ణా జిల్లా: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఓటమి భయంపట్టుకునే ఎన్నికల నుంచి పారిపోయాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్ధసారధి విమర్శించారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికలు ఏవైనా ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దాంతోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం ముందు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ప్రశ్నించకుండా ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజల్లో టీడీపీ పై నమ్మకం పోయిందని పార్థసారధి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment