campaigning
-
Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా కేజ్రీవాల్ ప్రచారంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో కేజ్రీవాల్ మూమూస్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలతో పాటు ఒక దుకాణం దగ్గర మోమోస్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ‘ఢిల్లీ వాసులకు, మోమోలకు మధ్య అనుబంధం విడదీయరానిది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ ఒక మోమోస్ విక్రేత అతనికి మోమోస్ అందించారు’ అని రాసింది. दिल्लीवालों और मोमो का रिश्ता थोड़ा गहरा है 🥟♥️नई दिल्ली विधानसभा में चुनाव प्रचार के दौरान एक मोमो वाले भाई ने दिल्ली के बेटे @ArvindKejriwal जी को रोककर खिलाये मोमो‼️ pic.twitter.com/ydnOddSK5y— AAP (@AamAadmiParty) January 19, 2025ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లపై పోటీకి దిగారు. 2013 నుండి న్యూఢిల్లీ స్థానం నుండి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా తన సత్తాను చాటేందుకు ఎన్నికల రంగంలోకి దిగింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 ఓటింగ్ జరగనుండగా, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే -
మోదీ వల్లే గెలిచాం: పవార్ సెటైర్లు
ముంబై: ప్రధాని మోదీకి ఎన్సీపీ(శరద్‌చంద్రపవార్) నేత శరద్‌పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్అఘాడీ(ఎమ్వీఏ) నేతలు ఉద్థవ్ థాక్రే, పృథ్విరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం(జూన్15) ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ‘ఎక్కడైతే ప్రధాని రోడ్‌షోలు చేశారో అక్కడ మేం గెలిచాం. ఇందుకే ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి’ అని పవార్ అన్నారు.తిరిగి తన మేనల్లుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్‌తో కలిసే అవకాశం లేదని శరద్‌పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఉద్ధవ్, చవాన్ తెలిపారు.కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కంటే కాంగ్రెస్,ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(ఉద్ధవ్) పార్టీల కూటమే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే. -
టీఎంసీకి బూత్ ఏజెంట్ ప్రచారం.. పట్టుకున్న బీజేపీ ఎంపీ
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్ జరుగుతోంది. దీనిలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని పలు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. హుగ్లీలో టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న బూత్ ఏజెంట్‌ను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ బూత్ ఏజెంట్‌కు డబ్బులు ఇచ్చి, ఒక ఆశా వర్కర్‌ను బూత్‌లో కూర్చోబెట్టారని లాకెట్ ఛటర్జీ ఆరోపించారు. ఆ ఆశా వర్కర్ బూత్‌లోకి వచ్చిన ఓటర్లతో టీఎంసీకి అనుకూలంగా ఓటువేయాలని కోరుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఆ మహిళ తృణమూల్ ఏజెంట్ అని లాకెట్ చటర్జీ పేర్కొన్నారు.ఆ మహిళను పట్టుకుని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం రాలేదని ఆమె అన్నారు. దీనిపై బూత్ ఏజెంట్‌ను ప్రశ్నించగా, ఆమె ఓటర్లు క్యూలో నిలుచునేలా చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో బూత్ వద్ద ఎక్కువ మంది ఓటర్లు లేరని లాకెట్ చటర్జీ తెలిపారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. -
ప్రియాంక పలకరింపు.. ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం
సాక్షి, మహబూబాబాద్/సాక్షి, సిద్దిపేట/హుస్నాబాద్‌రూరల్: ‘మందుల షాపులో ప్రతీ మందుపై ఎక్స్ పైరీ తేదీ ఉన్నట్లే.. బీఆర్ఎస్కూ కాలం చెల్లింది. ఓటమికి దగ్గరగా ఉన్న ఆ పార్టీ అంతిమ గడియలు లెక్కపెట్టుకుంటోంది’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ ఆగం చేశారన్నారు. ‘మా నాయనమ్మ ఇందిరాగాంధీ ఎప్పుడూ చెబుతూ ఉండేది. ప్రజాస్వామ్యంలో ఓటే కీలకం. ప్రజలు చైతన్య వంతులు’ అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచి్చందని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోందని చెప్పారు. ఈ చైతన్యంతో ఫాం హౌజ్‌లో ఉండి పాలించే నాయకులు కావాలో.. ప్రజల మధ్య ఉండి పాలించే కాంగ్రెస్ కావాలో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని తొర్రూరులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభల్లో ప్రియాంక ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంతం ప్రజలు చేసిన పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ఉందని చెప్పారు. I wanted to see Indiramma but cannot see, Now I have seen her Granddaughter Priyanka Gandhi Ji. A woman who met Priyanka Gandhi Ji expresses her love towards Gandhi Family.@INCIndia @INCTelangana @SpiritOfCongres pic.twitter.com/fvION4sSJY — Abdur Rahman Ansari (@AnsariiTweets) November 24, 2023 యువత జీవితాలు చీకటి మయం ‘రాష్ట్రం సాధిస్తే ఉద్యోగాలు వస్తాయని యువత ఆశలు పెంచుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ యువత జీవితాలను చీకటి మయం చేశారు. కష్టపడి చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. పేపర్ లీకేజీలతో చదువుకున్న వారి భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది. ఉద్యోగం రాలేదని విద్యారి్థని ఆత్మహత్య చేసుకుంటే. ఆ కుటుంబాన్ని ఓదార్చా ల్సిన ప్రభుత్వం, నాయకులు అసలు ఆమె పరీక్షే రాయలేదని వ్యంగ్యంగా మాట్లాడిన తీరు ప్రభుత్వానికి యువతపై ఉన్న శ్రద్ధకు నిదర్శనం’ అని ప్రియాంక అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజస్తాన్‌లో మాదిరిగా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేస్తామన్నారు. అదేవిధంగా ప్రాథమిక స్థాయి నుంచి మంచి విద్యను అందించేందుకు ప్రతీ మండలంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్‌ను నెలకొల్పుతామన్నారు. మహిళగా వారు పడే బాధలు తెలుసు ‘ఒక మహిళగా తెలంగాణలో మహిళలు పడే ఇబ్బందులు నాకు తెలుసు. పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఉప్పులు పప్పుల రేట్లు పెరిగినప్పుడు, గ్యాస్, కరెంట్ బిల్లులు భారమైనప్పుడు మహిళలే ఎక్కువ ఇబ్బంది పడతారు. ఇటువంటి ఖర్చులను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తాం. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలైన పథకాలు అమలు చేస్తాం’ అని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం పాటు పడే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం రైతుల భూములను గుంజుకుంటోందని మండిపడ్డారు. సాగునీటి కోసం రూ.లక్ష కోట్లు వెచి్చంచి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు పారీ్టలూ ఒక్కటే.. వారికి మద్దతుగా ఎంఐఎం ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. డబ్బులు పెరిగితే మనిíÙలో అహం పెరుగుతుందని, ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలకు అహం పెరిగి ప్రజల సమస్యలు పట్టడం లేదని చెప్పారు. పార్లమెంట్లో పెట్టిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలపడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ రెండు పార్టీలకు అంటకాగుతున్న ఎంఐఎం నాయకులు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశ ప్రజల స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ను విమర్శించడం శోచనీయమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని ప్రియాంక చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎంఐఎం 60కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంటే.. తెలంగాణలో 9 స్థానాల్లోనే ఎందుకు పోటీ చేస్తోందన్నారు. నాన్న (రాజీవ్ గాంధీ) చనిపోయిన తర్వాత తమ కుటుంబానికి పీవీ నరసింహారావు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ అభ్యర్థులు యశస్వినిరెడ్డి (పాలకుర్తి), పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్), పార్టీ రాష్ట ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, కర్ణాటక మంత్రులు దినేష్ గుండూరావు, తీన్మార్ మల్లన్న, తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజలను నమ్ముకుంది: పొంగులేటి బీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్‌రావు డబ్బులను నమ్ముకున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను నమ్ముకున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యదర్శి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. గతంలో ఇచి్చన హామీలను నెరవేర్చిన కాంగ్రెస్‌తోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ 9, మిత్రపక్షం సీపీఐ కొత్తగూడెం గెలుస్తుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడితేనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. కానీ దాని ఫలాలు మాత్రం కేసీఆర్ మాత్రమే అనుభవిస్తున్నారని, మన త్యాగాల ఫలం మనమే అనుభవించాలంటే కేసీఆర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. Priyanka Gandhi Surprise visit to a Farmer Family house in Telangana 👉 Today afternoon, Congress leader Priyanka Gandhi suddenly got an opportunity to speak to Ramadevi in the language of love in Telangana, not Telugu / Hindi#PriyankaGandhi #ByeByeKCR #TelanganaElection2023 pic.twitter.com/tYZHUeBaUI — Team Congress (@TeamCongressINC) November 24, 2023 ఉబ్బితబ్బిబ్బయిన కుటుంబం ప్రియాంక ఉన్న ఫళంగా ఓ గీతకార్మికుడి ఇంటికి వెళ్లారు. కుటుంబసభ్యులు ఆమెను చూసి ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సభను ముగించుకొని కొత్తగూడెం వెళ్తున్న క్రమంలో కిషన్‌నగర్‌లో నిర్మాణం అసంపూర్తిగా ఉన్న ఇంటికి మామిడి తోరణాలు, బంతిపూల దండలు కనిపించడంతో ప్రియాంక కారు ఆపి వారి ఇంట్లోకి వెళ్లారు. కుటుంబ యజమాని గీత కార్మికుడు జాగిరి రాజయ్య, రమ దంపతులతో కాసేపు ముచ్చటించారు. ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుండటంతో పూజ గురించి ఆరా తీశారు. ఇంటి నిర్మాణం ఎందుకు ఆపారని, దుకాణం ఎందుకు పెట్టుకోలేదని అడిగారు. దీంతో ఇంటి యాజమాని ఆర్థిక ఇబ్బందులే కారణమన్నారు. ఇంటి యజమానురాలిని ఆప్యాయంగా పలకరించి ఫోన్ నంబర్ తీసుకున్నారు. -
ఎన్నికల ప్రచారానికి తెర
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారాలు ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అన్ని రోడ్‌షోలు, ర్యాలీలు, సమావేశాలు గురువారం సాయంత్రం 6 గంటలకు నిలిపివేసినట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా తెలిపారు. రాజస్థాన్‌లో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం 6 గంటల కల్లా ప్రచారం ముగుస్తుందని సీఈవో పేర్కొన్నారు. గతంలో 2018 ఎన్నికల సమయంలో పోలింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని, ఈసారి ఒక ఒక గంట అదనంగా పొడిగించామని ఆయన చెప్పారు. రూ.682 కోట్లు స్వాధీనం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 10 నుంచి ఇప్పటివరకు రూ.682 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. గత ఎన్నికల్లో 65 రోజుల్లో పట్టుబడినదాని కంటే ఈసారి ఎన్నికల్లో 42 రోజుల్లోనే అత్యధికంగా ప్రలోభ సొత్తు, వస్తువులు పట్టుబడినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాల్లో మాత్రమే నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. కరణ్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించడంతో ఆ నియోజకవర్గానికి మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 73 సీట్లు దక్కించుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో అశోక్ గెహ్లాట్ సీఎం పీఠాన్ని అధిష్టించారు. -
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు!
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు! -
ఏ గుర్తు.. ఎంతిస్తరు..? కండువా వేసుకుని సిద్ధం..
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: శాసనసభ సాధారణ ఎన్నికల్లో పోటీపడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాటు చేసే ఎన్నికల ప్రచారసభ, ఇంటింటిప్రచారం.. ఏదైనా కార్యకర్తలు మాత్రం వాళ్లేనని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. పెద్దపల్లి సెగ్మెంట్లో ఇటీవల నిర్వహించిన సభలకు నేతలు మినహా హాజరైన వారిలో అధికశాతం పెయిడ్ కార్యకర్తలే అనడంలో అతిశయోక్తి లేదు. ఊళ్లలోనే ప్రచారం.. ► గ్రామాల్లో స్థానికంగానే ఇంటింటి ప్రచారం నిర్వహించే రాజకీయపార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ముందుకొస్తున్న వారు ఏ గుర్తుకు ప్రచారం చేయాలి, ఇలా చేస్తే తమకు ఎంత ఇస్తారని అడిగి మరీ వసూలు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ► అయితే ఆయా ఊళ్లలో ఉండే కొందరు చోటామోటా నాయకులు, గ్రామ పెద్దలు జనసమూహాన్ని తరలించేందుకు కొంతమొత్తాన్ని మాట్లాడుకుని అందులో కొంత నొక్కేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ► ఇంటింటి ప్రచారాన్ని స్థానికంగా ఉండేవాళ్లతో గంట, గంటన్నర సమయం పాటు నిర్వహిస్తూ రూ.100నుంచి రూ.150 దాకా చెల్లిస్తున్నట్లు సమాచారం. అలాగే మండల, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే అగ్రనేతల సభలకు వాహనాల్లో తరలించిన సమయాల్లో రూ.300 నుంచి రూ.500దాకా చెల్లిస్తే సదరు పార్టీ కండువా వేసుకుని సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు. ► కొద్దిసేపటికోసమే కావడంతో మహిళలు, వృద్ధులు సభలకు వచ్చేందుకు పోటీపడుతున్నారు. మగ వారినికి తీసుకొస్తే వారిని తీసుకొచ్చిన నాయకుడు తిరుగు ప్రయాణంలో మందుతో విందు ఏర్పాటు చేయాల్సి వస్తోందని ఎక్కువ మంది నేతలు మహిళలనే పిలి పించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల పెద్దపల్లిలో జరిగిన ఓ సభకు 30వేల మందికిపైగా మహిళలు హాజరుకావడం గమనార్హం. ఊపందుకోనున్న ప్రచారం.. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో గుర్తులు పొందిన అభ్యర్థులు ప్రచా రంలో మునిగి తేలుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు అగ్రనేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని జనసమీకరణలో తలమునకలయ్యారు. దీంతో పెయిడ్ కార్యకర్తలకు డిమాండ్ పెరుగుతోంది. వరి కోతలు కూడా ఇప్పుడే.. వరి కోతలు ఇప్పుడే రావడం.. ఎన్నికల ప్రచారసభలు జరగనుండడంతో వ్యవసాయ పనులకు కూలీ ల కొరత ఏర్పడుతోంది. వలసకూలీలతో కొన్ని ప్రాంతాల్లో కోతలు కోస్తుండగా.. యంత్రాలతో ఇంకొన్ని ఏరియాల్లో వరికోతలు ముమ్మరం చేస్తున్నా రు. ఏదైతేనేం.. సాధారణ ఎన్నికల ప్రచారపర్వం గడువు చివరి దవలో వస్తుండడంతో జోరు పెంచేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇవి కూడా చదవండి: చేరి.. చేజారి..! ‘హస్తం’లో తారుమారు రాజకీయం.. -
ఎన్నికలకు కళ
రాజకీయ నేతలను ప్రజలకు చేరువ చేయడంలో ఏడెనిమిదేళ్లుగా సోషల్ మీడియా కీలకంగా మారింది. ఫేస్బుక్, యూ ట్యూబ్ మొదలు ఇన్స్టాగ్రామ్ వరకు నాయకుల కార్యక్రమాలు క్షణాల్లో ప్రజలకు చేరిపోతున్నాయి. అయితే టెక్నాలజీ ఎంత గా అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ ప్రజలకు చేరువయ్యేందుకు కళారూపాలనే కొందరు నేతలు ఎంచుకుంటున్నా రు. ప్రజల్లో వీటికి ఆదరణ తగ్గకపోవడంతో ఇప్పుడు ఎన్నికల సీజన్లో ఆయా కళాకారులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటోంది. సోషల్ జమానా ఎన్నికల్లో గెలిచింది మొదలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే వరకు తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ఖద్దరు నేతలు సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై వ్యక్తిగత పేజీలతో పాటు ఫాలోవర్స్, ఫ్యాన్స్ పేజీలతో ప్రత్యేకంగా ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. తాము రోజువారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ప్రధాన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లు, లింకులను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ మేరకు బూత్ లెవల్ వరకు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు. మండల, యూత్, మహిళా తదితర విభాగాల బాధ్యుల తరహాలోనే సోషల్ మీడియా ఇన్చార్జ్ పోస్టులూ రాజకీయ పార్టీల్లో పుట్టుకొచ్చాయి. ర్యాలీలు, సభల్లో... బహిరంగంగా చేసే ర్యాలీలు, సభల్లో ఇప్పటికీ ఆదివాసీ నృత్యాలైన కొమ్ము కోయ, థింస్సా, గుస్సాడీ, బంజారా నృత్యాలు, డప్పు కళాకారులకు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రధాన నాయకుడు వెనుక వస్తుంటే అతనికి ముందు వరుసలో ఆదివాసీ/బంజారా కళాకారులు చేసే నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇళ్లలో ఉన్న వారు, వాణిజ్య సముదాయాల్లో ఉన్నవారిని బయటకు రప్పిస్తున్నాయి. తద్వారా నేతలు చేపట్టే కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, బంజారా కళలు.. తగ్గేదేలే అన్నట్టుగా తమ ఉనికిని చాటుకుంటున్నాయి. కొమ్ము కోయ.. రాష్ట్ర విభజనకు ముందు కొమ్ము, కోయ నృత్య కళాకారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవారు. విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లారు. ప్రస్తుతం చింతూరు కేంద్రంగా కొమ్ము కోయ నృత్య బృందాలు ఉన్నాయి. ఈ బృందాల్లో పొడవైన వాడి కలిగిన కొమ్ములు, నెమలి ఈకలతో చేసిన తలపాగా మగవాళ్లు ధరిస్తారు. మెడలో పెద్దడోలు వాయిద్యం కలిగి ఉంటారు. మహిళలు ఆకుపచ్చచీరలు ధరించి, తలకు ఎర్రని రుమాలు, కాళ్లకు గజ్జెలు కట్టుకుంటారు. మగవారు వేసే డప్పు వాయిద్యాలకు అనుగుణంగా మహిళలు నృత్యం చేస్తారు. అలరిస్తున్న గుస్సాడీ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆదివాసీ నృత్యం గుస్సాడీ. ఆదివాసీ పండగల సందర్భంగా ఈ నృత్యం చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రోత్సాహంతో జాతీయ పండగలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాజకీయ నాయకులు తమ కార్యక్రమాల్లో గుస్సాడీకి స్థానం కల్పిస్తున్నారు. గుస్సాడీ కళాకారులు ధరించే భారీ నెమలి ఈకలు, పూసలతో చేసిన తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బంజారా నృత్యం తెలంగాణ గిరిజనుల్లో అత్యధిక జనాభా లంబాడీలదే. ఇప్పటికీ తండాల్లో లంబాడీ మహిళలు పూ ర్వకాలం నుంచి వస్తున్న వేషధా రణ కొనసాగిస్తున్నారు. ఎరుపురంగులో అద్దాలు, చెమ్కీలతో చేసిన దుస్తులను ధరిస్తుంటారు. చేతులకు తెల్లని పెద్ద గాజులు, చెవులు, ముక్కుకు పెద్ద ఆభరణాలు పెట్టుకుని ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరు బంజరా భాష గోర్బోలీలో పాట లు పాడుతూ చేసే నృత్యాలు రాజకీయ ర్యాలీలలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. డప్పు బృందాలు ఒకప్పుడు వామపక్ష పార్టీ పట్ల ప్రజ లు ఆకర్షితులయ్యేలా చేసిన అంశాల్లో డప్పు బృందాలది ప్రత్యేక స్థానం. కళాకారులు కాళ్లకు గజ్జెలు కట్టి డప్పు వాయిస్తూ చేసే నృత్యాలు నేటికీ ఎవర్‌గ్రీన్‌గా కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కామ్రేడ్లకే పరిమితమైన డప్పు డ్యాన్సులను ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు అక్కున చేర్చుకున్నాయి. - తాండ్ర కృష్ణ గోవింద్ -
‘కారు’ దిగితే అట్లుంటది మరీ..!
కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కార్యక్రమాలను వేగవంతం చేసింది. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున పోలింగ్ బూత్‌కు పది మంది బాధ్యులను నియమిస్తున్నారు. ఈ పదిమంది కమిటీలో కొరు ఇన్‌చార్జీగా ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 266 బూత్‌లకు కమిటీలను వేసి, ఇన్చార్జీలను నియమించనున్నారు. వారంతా పార్టీ నిర్దేశించే కార్యక్రమాలను అమలు చేస్తారు. పార్టీ కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న శుభం ఫంక్షన్ హాల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్నీ అక్కడి నుంచే నడిపించనున్నారు. అలాగే మీడియాకు సమాచారం ఇవ్వడానికి విద్యానగర్‌లోని ఓ అపార్టుమెంటులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు ఉండడానికి వీలుగా పలు ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అద్దె ఇళ్లను ఎంపిక చేసి అందులో మకాం పెడతారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో ప్రచార పనులు వేగవంతమయ్యాయి. సీఎంవో నుంచి ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి రెగ్యులర్‌గా వచ్చిపోతున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్య నేతలతో సమావేశం నిర్వహణకు.. నియోజకవర్గంలో ఒక్కో మండలం/పట్టణం నుంచి ఇరవై మంది చొప్పున వంద మందితో ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారని, అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాల్సి ఉండగా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై దృష్టి కాంగ్రెస్, బీజేపీలలో క్రియాశీలకంగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. మండలాలవారీగా నాయకుల జాబితాలను రూపొందించి వారిని ఏదోరకంగా కారెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో.. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బూత్‌కు పది మందితో కమిటీని ఏర్పాటు చేసి, జాబితాను కంప్యూటరీకరిస్తారు. వారికి ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. అలాగే సోషల్ మీడియాల టీంలను ఇప్పటికే అలర్ట్ చేశారు. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో గత పాలకుల విధానాలతో జరిగిన ఇబ్బందులను వివరిస్తూ, ప్రస్తుతం జరిగిన మేలును కళ్లకు కట్టేలా రూపొందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కామారెడ్డి క్యాంపెయిన్ ఇన్‌చార్జీగా కేటీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి పోరులో ముందున్న బీఆర్ఎస్.. తాజాగా పలు నియోజకవర్గాలకు ప్రచార ఇన్చార్జీలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం బాధ్యతను ముగ్గురికి అప్పగించింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్కు ఇచ్చారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు ఇంకా ఎవరినీ నియమించలేదు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ అర్బన్‌తోపాటు బోధన్ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. క్యాంపెయిన్ ఇన్చార్జీల నాయకత్వంలో ఆయా నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
కమలంలో కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. మరో రెండు వారాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడొవచ్చనే అంచనాల నేపథ్యంలో...పార్టీలో ఏర్పడుతున్న పరిస్థితులు కమలనాథుల్లో కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల జాతీయ కార్యవర్గసభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో పలువురు అసంతృప్త నేతలు భేటీ అయ్యారు. ఇతర జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, గరికపాటి మోహన్‌రావుతో పాటు మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జి.విజయరామారావు, ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి పాల్గొన్న ఈ సమావేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్న ఈ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఉన్న సీనియర్ నేత, నగర పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బి.వెంకటరెడ్డి, ఆయన భార్య బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మలు.. తాము పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసినా, తగిన గుర్తింపు లేదని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీలో ఉన్నందున తమకు అంబర్‌పేట అసెంబ్లీ టికెట్ కేటాయించాలని కోరితే నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల భేటీ అయిన నేతల అసంతృప్తికి కారణాలు తెలుసుకుని వారిని బుజ్జగించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్‌కు నాయకత్వం అప్పగించినట్టు పార్టీవర్గాల సమాచారం. మాకేదీ గుర్తింపు..? రాష్ట్ర పార్టీలో ముఖ్య నేతలుగా, జాతీయ కార్యవర్గ సభ్యులు, సీనియర్లుగా ఉన్నా తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లభించడం లేదనేది అసంతృప్త నేతల ప్రధాన ఫిర్యాదుగా ఉన్నట్టు సమాచారం. అలాగే పార్టీ తీరు, నాయకత్వం వ్యవహారశైలి పైనా వారు ఆగ్రహంతో ఉన్నారని, అధిష్టానం వైఖరి, ముఖ్యంగా పార్టీ అగ్రనేత అమిత్ షా అనుసరిస్తున్న తీరు సైతం సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా.. కేవలం రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్లతోనే అమిత్ షా సమావేశం కావడం, తమను దూరం పెట్టడంపై వీరంతా కినుక వహించినట్టు తెలుస్తోంది. మోదీ, అమిత్‌షా, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు సైతం ఆయనకే గుర్తింపునివ్వడం, వేదికపైనా తమ పక్కన అవకాశం కలి్పంచడం వంటి వాటిపై కొందరు నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈటల తీరుపై అసహనం! గతంలో పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా, ఇప్పుడు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై పలువురు నేతలు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. తమకు తెలియకుండా, కనీసం సంప్రదించకుండా తమ ప్రాబల్య ప్రాంతాలు, నియోజకవర్గాల్లో చేరికలను ఈటల ప్రోత్సహించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమను సంప్రదించకుండా సంగారెడ్డి, ములుగు జిల్లాల్లో కొందరిని చేర్చుకోవడంపై వారు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వారు నిత్య అసంతృప్త వాదులే..! మరోవైపు అసంతృప్త నేతల తీరుపై ఇతర నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వీరు నిత్య అసంతృప్తులంటూ మండిపడుతున్నారు. తాము అనుకున్న స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని, ఇలాగైతే తామే ఢిల్లీ నుంచి ఎన్నికల కార్యాచరణను అమలు చేయాల్సి ఉంటుందంటూ క్లాస్ తీసుకునేందుకే.. కిషన్‌రెడ్డి, సంజయ్, ఈటలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారని వారు వివరిస్తున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను కూడా అమిత్‌షా పిలవలేదంటూ వారు గుర్తు చేస్తున్నారు. అధినేతల తీరుతో తప్పుడు సంకేతాలు! కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని, ఇది కేసీఆర్ సర్కార్‌కు, బీఆర్ఎస్కు ఏటీఎంగా మారిందంటూ విమర్శలు గుప్పించిన అమిత్ షా, నడ్డాలు.. ఇదిగో విచారణ, అదిగో విచారణ అంటూ తాత్సారం చేయడమే తప్ప ఎలాంటి చర్య తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇంకా అరెస్టు చేయకపోవడం వంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు కారణమౌతున్నాయని అసంతృప్త నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. కీలక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని జరుగుతున్న ప్రచారాన్ని ఈ కారణంగా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నామని వారు పేర్కొంటున్నట్లు సమాచారం. -
సాక్షాత్తు ఆయనే అలా చేయడం "ఆశ్చర్యంగా ఉంది": శరద్ పవార్
సాక్షి, ముంబై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆయనే ఎన్నికల ప్రచారంలో అలా చేయడం ఆశ్చర్యం కలిగించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎవరైనా మతం లేదా మతపరమైన అంశాన్ని తీసుకున్నప్పుడూ అది భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తుందన్నారు.అది అసలు మంచిది కాదని చెప్పారు. ఐతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మతపరమైన నినాదాలు చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందన్నారు. తాము లౌకిక వాదాన్ని అంగీకరిస్తామని, పైగా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం కోసమే ప్రమాణం కూడా చెప్పారు. కాగా, మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని బార్సు గ్రామంలో మెగా ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న స్థానికుల విషయమై ప్రశ్నించగా..తాను వీలు కుదిరినప్పుడూ..ఆ ప్రదేశాన్ని సందర్శించడమే గాక నిపుణులతో చర్చించి.. గ్రామస్తుల సమస్యను ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు. (చదవండి: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ.. మహిళా ప్యాసెంజర్లతో ముచ్చట్లు.. సమస్యలపై ఆరా..) -
ఆ ఊళ్లో ఎన్నికల ప్రచారమే ఉండదు! కానీ..
గుజరాత్లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉన్నందున గుజరాత్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. గుజరాత్లో రాజ్‌కోట్ జిల్లాలోని రాజ్ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ. పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని, ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు. ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్ కనెక్షన్, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్ఓ ప్లాంట్ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. (చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు) -
Munugode Bypoll: ప్రచారానికి జనాన్ని పిలిస్తే ఒక బాధ, పిలవకపోతే మరో బాధ
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేస్తున్నాయి. పోటీలో వివిధ పార్టీల అభ్యర్థులు, చాలా మంది స్వతంత్రులు ఉన్నప్పటకీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నడుమనే తీవ్రమైన పోటీ నెలకొంది. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూడు పార్టీలు నిత్యం సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనం మధ్యలో ఉంటున్నాయి. ఆయా పార్టీలు తమ కార్యకర్తలో సమావేశాలు నిర్వహిస్తే హంగామా కనిపించకపోవడంతో.. సామాన్య ప్రజానీకాన్ని సమీకరిస్తున్నాయి. ఆ క్రమంలో గ్రామాలు, కాలనీలకు చెందిన జనం పార్టీల సమావేశాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. జన సమీకరణతో మొదలవుతున్న నేతల కష్టాలు సమావేశాలు నిర్వహణ వరకు బాగానే ఉన్నా అసలు సమస్య మాత్రం జనసమీకరణతోనే. సమావేశాలు, రోడ్‌షోలకు ఒకొక్కరికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లిస్తున్నారు. ఒక్కో పార్టీ ఆయా కార్యక్రమాల పరిస్థితి మేరకు జనాన్ని సమీకరిస్తున్నాయి. ఇంతే మంది కావాలని కూడా చెబుతున్నాయి. అయితే పిలిచినదాని కంటే ఎక్కవగా జనాలు తరలివెళ్తున్నారు. వద్దన్నా వినకుండా వస్తుండడంతో అందరికీ డబ్బులు చెల్లించలేక స్థానిక నేతులు తలలు పట్టుకుంటున్నారు. వద్దని చెబితే ‘రేపు మా ఓటు వద్దా’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో జనాన్ని వద్దనలేక, అధిష్టానం వద్ద సరిపడా డబ్బులను తెప్పించుకోలేక నానా పాట్లు పడుతున్నారు. ఒక్కోసారి స్థానిక నేతలే సొంతంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకునేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు. కొందరికి కాసులు.. మరి కొందరికి కష్టాలు.. సాధారణంగా ఎన్నికలు అంటేనే రాజకీయ పార్టీల నాయకులకు పండుగ అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుత ఉప ఎన్నికలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అన్ని పార్టీలకు స్థానికంగా బాధ్యతలు చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఇన్‌చార్‌్జలు వచ్చారు. వారంతా సభలు, సమావేశాలు, ప్రచార వ్యవహారాలు, జన సమీకరణ వంటి అన్ని అంశాలు చూసుకుంటున్నారు. దీంతో స్థానిక నేతలకు ఎలాంటి పని లేకుండా పోయింది. కేవలం అసిస్టెంట్లుగానే మారారు. ఇదిలా ఉంటే జన సమీకరణ, ఇతర విషయాల్లో ఆయా పార్టీల్లోని కొంత మంది స్థానిక నేతలకు కాసుల వర్షం కురిపిస్తే మరి కొందరికి మాత్రం కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు ఇన్‌చార్జ్‌లు స్థానిక నేతల ద్వారానే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి కొందరు మాత్రం స్వయంగానే చూసుకుంటున్నారు. ఏదేమైనా ఇన్‌చార్‌్జల రాకతో అన్ని పార్టీల్లో లోకల్ లీడర్లకు మాత్రం నాలుగు పైసలు వెనుకేసుకోలేని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. -
మునుగోడులో తిట్ల దండకం!.. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్'
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల స్టార్ ప్రచారకర్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దుమారం రేపుతున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార పర్వంలో పైచేయి సాధించేందుకు చేస్తున్న విమర్శలు వివాదాలు రేపుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటర్లు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచార విన్యాసాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. గురువారం చౌటుప్పల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏకంగా సమాధి కట్టిన ఘటన ప్రచారంలో కొత్తపోకడకు దారితీసింది. హడావుడిగా నేతలు అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో క్రియాశీల కార్యకర్తలను మోహరించి ప్రతీ ఓటరును చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఊరూరా విందులు జోరుగా సాగుతున్నాయి. మద్యం, శీతల పానీయాలు, చికెన్ విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సామాజిక సమీకరణాలపై అన్ని పార్టీలు దృష్టి సారించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఓటర్లను కలుసుకునే బాధ్యతను అప్పగించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి చేరికల పేరిట హడావుడి చేస్తూ నేతలు కండువాలు కప్పే పనిలో తీరికలేకుండా ఉన్నారు. చేరికలు నిరంతరంగా సాగుతుండటంతో ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టబెడుతున్నారు. మండలాలు, గ్రామాలు, సామాజికవర్గాల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓటరు జాబితాను అన్ని పార్టీలు వడపోసి, వివరాలను క్షేత్రస్థాయిలో అందజేశాయి. నాయకుల మాటల తూటాలు... టీఆర్ఎస్ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయన అసలు ప్రజాప్రతినిధిగానే పనికిరారని, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని, అదీగాక గెలిచిన పార్టీలో కోవర్టుగా పనిచేశారని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపై విమర్శలు గుప్పిస్తోంది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు బఫూన్లని, వారు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు/ ఎమ్మెల్యేలను దండుపాళ్యం బ్యాచ్‌గా, నీతి, జాతిలేని రాక్షసులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్, అల్లుడు వెన్నుపోటు స్టార్.. సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్, మిగిలింది లిటిల్ స్టార్. వీళ్లంతా బందిపోటు స్టార్స్’ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం టీఆర్ఎస్, బీజేపీలను ఏకిపారేస్తున్నారు. ‘ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజదొంగ.. తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నారు. మంత్రులు మందు పోసే దివాలాకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అడ్డమైన గాడిదలు టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి’ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
మునుగోడులో శ్రుతిమించిన ఎన్నికల ప్రచారం.. అలా చేయడం కరెక్టేనా?
సాక్షి, యాద్రాద్రి: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. పరస్పర ఆరోపణలతో రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, తాజాగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సమాధి కట్టిన ఘటనపై కాషాయ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని బీజేపీ నేత మనోహర్‌రెడ్డి తెలిపారు. సమాధి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఓడిపోతామన్న భయంతోనే, ప్రజా మద్దతు లేకే టీఆర్ఎస్ చిల్లర పనులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మునుగోడు ఓటర్లకు ప్రలోభాలు వేగవంతమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఓ రాజకీయ పార్టీ పంపకాలకు శ్రీకారం చుట్టేసింది. ఇంటింటికీ కిలో చికెన్, 2 లీటర్ల థమ్సప్ పంపిణీ చేసింది. చౌటుప్పల్ మండలంలోని ఒక గ్రామానికి ఓ పార్టీ నేత ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆ గ్రామంలో 2200 మంది ఓటర్లు, 812 కుటుంబాలున్నాయి. గ్రామ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న నేత అనుచరులు, స్థానిక లీడర్లు కలిసి 90శాతం కుటుంబాలకు చికెన్, థమ్సప్ పంపిణీ చేశారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల నుంచి మొదలుపెట్టి గంటలో పంపిణీని పూర్తి చేశారు. -
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ విస్తృత ప్రచారం
-
Munugode Bypoll: చుట్టూ మనవాళ్లే.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయం?
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దుండగులు చేతివాటం ప్రదర్శించి జేబులు కత్తిరించేస్తున్నారు. ఏకంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి జేబులోంచి నోట్ల కట్ట కొట్టేశారు. మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల గ్రామంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సోమవారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగిసిన తర్వాత తన జేబు చూసుకుంటే అందులోని రూ.50 వేల నోట్ల కట్ట కనిపించలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయమైందంటూ ఆ అభ్యర్థి నోరెళ్లబెట్టాడు. అనంతరం ఆయన వెంట ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వా దానికి దిగారు. దీంతో మరో నాయకుడు కలుగజేసుకుని పోయిన డబ్బులు ఎలాగూ పోయాయి.. మనమెందుకు తగువులాడుకో వడం.. అంటూ వివాదాన్ని చల్లార్చారు. -
మునుగోడులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. తమ్ముడి కోసం ట్విస్ట్ ఇచ్చిన వెంకన్న!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలా విజయం సాధించాలో అనే దిశగా పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అయితే, ఇప్పటి వరకు మునుగోడు ఉప ఎన్నికల కోసం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా కోమటిరెడ్డి ప్రచారానికి వస్తారనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా కోమటిరెడ్డి అందరికీ షాకిచ్చారు. కాగా, మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంటకరెడ్డి దూరంగా ఉండనున్నట్టు సమాచారం. ఈనెల 15వ తేదీన కోమటిరెట్టి.. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాతే ఆయన మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల బరిలో కోమటిరెడ్డి సోదరుడు.. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు సమాచారం. అయితే, మునుగోడులో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో.. కోమటిరెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారానికి వస్తే హస్తం పార్టీకి అనుకూలంగా ఉండేది. కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: మునుగోడులో ‘బీజేపీకి కోవర్టుగా పనిచేస్తున్న వెంకటరెడ్డి!’ -
సీబీఐ దాడుల వేళ కేజ్రీవాల్ ‘మిస్డ్ కాల్’ క్యాంపెయిన్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. ఓ వైపు సీబీఐ దాడులు జరుగుతున్న క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మిషన్‌లో పాల్గొనాలని ‘మిస్డ్ కాల్’ ప్రచారం చేపట్టారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘భారత్‌ను నంబర్ వన్ చేసేందుకు మా నేషనల్ మిషన్‌లో పాలుపంచుకోండి. అందుకు 9510001000కు మిస్డ్‌కాల్ ఇచ్చి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టండి.’ అని వీడియో ద్వారా పిలుపునిచ్చారు. ట్విట్టర్లోనూ ప్రజలకు సూచించారు. మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడులు చేపట్టిన తర్వాత మాట్లాడారు కేజ్రీవాల్. ‘సీబీఐ దాడులపై ఎలాంటి భయం అవసరం లేదు. వారి పనిని చేసుకోనిద్దాం. మమ్మల్ని వేధించేందుకు పైనుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. మా నాయకుల పని అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతుంటే ఓర్వలేకపోతున్నారు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. మనీశ్ సిసోడియా ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో తొలి పేజీలో వచ్చిన కథనాన్ని సూచిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు.. ఇతర మంత్రులు కైలాశ్ గహ్లోట్, సత్యేందర్ జైన్‌లపైనా దాడులు చేశారని, ఎలాంటి ఆధారాలు వారికి లభించలేదన్నారు. भारत को दुनिया का नम्बर वन देश बनाने के लिए साथ आयें। इस मिशन से जुड़ने के लिए 9510001000 पर मिस कॉल करें। हमें देश के 130 करोड़ लोगों को जोड़ना है। — Arvind Kejriwal (@ArvindKejriwal) August 19, 2022 ఇదీ చదవండి: కేజ్రీవాల్ ఎఫెక్ట్.. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్ -
ఆత్మకూరు ఉపఎన్నికల్లో భారీ విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ సీపీ ప్రచారం
-
చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
-
చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య వివాదం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ ప్రజలకు తీపికబురు అందించింది. త్వరలోనే పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ పంజాబ్‌లోని జలంధర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో.. పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాల్గోన్నారు. కాగా, తాము.. సీఎం పదవి కోసం ఆశపడబోమని ఆ సభలో బహిరంగంగా హమీ ఇచ్చారు. కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అదే విధంగా ఒకరు నాయకత్వం వహిస్తే మరొకరు వారికి సహకారం అందిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పలు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ లేదా పంజాబ్ కోరుకుంటే త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు’. ఈ ప్రకటనతో చన్నీ వర్సెస్ సిద్ధూల మధ్య పోటీకి తెరపడినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు నాయకత్వం వహించలేరు.. ఒకరు మాత్రమే సరైన నాయకుడిగా ఉండగలరని ఆయన అన్నారు. సీఎం అభ్యర్థిని ఎవరు ఉండాలనే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలనే అడుగుతామన్నారు. అయితే, చన్నీ, నవజ్యోత్ సింగ్ ఇద్దరు నాయకులు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తారని తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా సిద్ధూ మాట్లాడుతూ.. క్రమశిక్షణ కల్గిన కాంగ్రెస్ సైనికుడిలా పనిచేస్తానని అన్నారు. తనను ‘షోపీస్’లా ట్రీట్ చేయోద్దని అన్నారు. ‘ మనమంతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ను అధికారంలో తేవడానికి ఐక్యంగా పోరాడదామన్నారు’. ఇదే వేదికపై ఉన్న చన్నీ కూడా.. సిద్ధూ దగ్గరకు వెళ్లి తమ ఐక్యతను చూపే ప్రయత్నం చేశారు. ఈ సభలో సీఎం చన్నీకూడా మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి పదవికి ఎవరి పేరును ప్రతిపాదించిన అభ్యంతరంలేదన్నారు.’ ఎవరి పేరు ప్రతిపాదించిన ప్రచారం కోసం పనిచేసే మొదటి వ్యక్తి తానేనని చన్నీ స్పష్టం చేశారు. ఆ తర్వాత చన్నీ.. అరవింద్ కేజ్రీవాల్‌పై ఫైర్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఉందని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురకలంటించారు. చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎమ్మెల్యే రోజా
బద్వేలు (వైఎస్సార్‌జిల్లా): బద్వేలు ఉప ఎన్నికల్లో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ దూసుకుపోతుందని అన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్‌సైడే అని ఎమ్మెల్యే రోజా అన్నారు. గెలుపు కోసం కాదు.. భారీ మెజార్టీ కోసం తాము.. ప్రచారం చేస్తున్నామని అన్నారు. తమ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని రోజా కోరారు. కాగా, ధరల పెరుగుదలకు కారణమైన బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. దొంగ నాటకాలాడిన ప్రజలను మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. వైఎస్సార్ సీపీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రోజా ప్రజలను కోరారు. చదవండి: చంద్రబాబు బూతు పంచాంగం డ్రామా ఫెయిల్: సజ్జల -
Huzurabad Bypoll: వారిని ఖుషీ చేసేందుకు కోళ్లు, పొట్టేళ్లు డోర్ డెలివరీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. రాష్ట్రంలో పెద్దపండుగగా భావించే బతుకమ్మ, దసరా వేడుకలతో ప్రచారం కాస్త నెమ్మదించినా.. జనాలు ఎన్నికల మూడ్ నుంచి బయటకు రాకుండా నేతలు నానా తంటాలు పడుతున్నారు. పండుగల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సిన నేతలంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో సందడి తగ్గింది. అయితే, దీన్ని ముందే ఊహించిన పలుపార్టీల నేతలు ఎన్నికల వాతావరణం చల్లబడకుండా ఎవరికితోచిన ప్రయత్నాలు వారుచేస్తున్నారు. ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునేందుకు పలు గ్రామాలు, వాడల్లో తమపార్టీ స్థానిక నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దసరా నేపథ్యంలో ఓటర్లను ఖుషీ చేసేందుకు మేకలు, కోళ్లు డోర్ డెలివరీ చేసేస్తున్నారు. 10కుటుంబాలకు ఒక మేక లేదా పొట్టేలు చొప్పున ఇచ్చి అంతా కలిసి పంచుకోమంటున్నారు. స్థానిక చికెన్ సెంటర్లకు చెప్పి దసరారోజు తమ వారికి ఉచితంగా చికెన్ పంపిణీ అయ్యేలా సిద్ధం చేశారు. దసరా వేడుకల సందర్భంగా కొన్నిచోట్ల నాయకులే ప్రత్యేక విందులు, బతుకమ్మ వేడుకల వద్ద డీజేలు ఏర్పాటు చేశారు. ఇక దసరా రోజున తమ అనుకూలవర్గం అందరికీ చేరేలా మాంసంతోపాటు మ ద్యంబాటిళ్లను కూడా సరఫరాకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో మహిళలకు చీరలు, ఇతర గృహోపకరణాలను పంచే యోచనలోనూ నేతలు ఉన్నారని సమాచారం. చదవండి: (Huzurabad Bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం) స్థానికేతరులకు రవాణా, భోజనం.. ►ఈనెల 8వ తేదీన నామినేషన్ల పర్వం ముగియగానే ప్రచారం జోరందుకుంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పొరుగు జిల్లాల నుంచి వచ్చిన అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు జోరుగా ప్రచారం నిర్వహించారు. ►ఈ క్రమంలో వారికి రవాణా, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేశారు. పండక్కివెళ్లి అదే ఉత్సాహంతో తిరిగి వచ్చేందుకు దసరా ఖర్చులకు కూడా ఏర్పాట్లు చేశారు. కొందరు కార్యకర్తలు కాకుండా రోజుకూలీకి వచ్చేవారికి నియోజకవర్గం అవతల చెల్లింపులు జరిపారు. ►ఇలా వస్తున్నవారికి రోజుకు భోజనం, రవాణా సదుపాయంతోపాటు రోజుకు రూ.300 వరకు ముట్టజెబుతున్నారని సమాచారం. మొత్తానికి దసరా పండుగ రోజు స్థానిక నేతలకు పనిభారం పెరిగింది. పండగరోజు కూడా ఓటర్లను కలుసుకోవడం, వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలోనే మునిగిపోయారు. మద్యం, బహుమతుల పంపిణీపై పోలీసు నిఘా..! ►హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా దసరా రోజున భారీగా మద్యం పంపిణీ జరక్కుండా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, ఫ్లయింగ్ ఫ్లయింగ్ టీములతో పోలీసులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ►ఇప్పటిదాకా రూ.1,45,20,727 రూపాయల నగదును, రూ.1,50,000 విలువ గల 30 గ్రాముల బంగారం రూ.9,10,000 విలువ గల 14 కిలోల వెండిని, రూ. 5,11,652 విలువైన 867 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ►ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎలాంటి చర్యలకు దిగినా వెంటనే కేసులు నమోదు చేస్తామని సీపీ సత్యానారయణ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఎక్కడ అలాంటి అనుమానాస్పద వేడుకలు జరిగినా డయల్ 100కు సమాచారమివ్వాలని సూచించిన విషయం తెలిసిందే. శనివారం నుంచి హోరెత్తనున్న ప్రచారం..! 16వ తేదీ నుంచి హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తనుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇక మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 17 వారాలుగా బీజేపీ– టీఆర్ఎస్ పార్టీలు నువ్వా–నేనా అన్న స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. 9వ తేదీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కూడా రంగంలోకి దిగారు. 13, 14వ తేదీల్లో బతుకమ్మ, 15వ తేదీ దసరాతో ప్రచారం కాస్త నెమ్మదించింది. అయితే, 16వ తేదీ నుంచి అన్ని పార్టీలు స్పీడు పెంచనున్నాయి. 16వ తేదీ తరువాత స్టార్‌క్యాంపెయినర్లు కూడా రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి జాతీయస్థాయి నేతలు, టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు ప్రచారబరిలో దూకనున్నారు. ఇకపై నేతల మాటల తూటాలతో హుజూరాబాద్ ఉపపోరు హోరెత్తనుంది. -
Huzurabad Bypoll: అధినేతలకు సిసలైన సవాలే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో కీలకమైన నామినేషన్ల పర్వం ముగియడంతో పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి సారించాయి. ఇప్పటికే బీజేపీ–టీఆర్ఎస్కు చెందిన స్థానిక నేతలు దాదాపు 17 వారాలుగా ప్రచారంలో తలమునకలయ్యారు. ఆ పార్టీల మధ్య నువ్వా–నేనా అన్న స్థాయిలో యుద్ధం నడుస్తోంది. శుక్రవారం నామినేషన్ల ఆఖరు రోజు అందరి కంటే ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్‌కు వచ్చి ప్రసంగించి కేడర్‌లో జోష్ నింపారు. మొత్తానికి ఇంతకాలం స్థానిక నేతలతో సాగిన ప్రచారం ఇంకాస్త రంగులద్దుకోనుంది. స్టార్ క్యాంపెయినర్లు ప్రచారానికి దిగుతుండటంతో వారి చరిష్మా పార్టీకి తప్పకుండా ఉపయోగపడుతుందని, ఓటర్లను వారు తప్పకుండా ఆకర్షించగలుగుతారని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో పేర్కొన్న టీఆర్ఎస్ నేతల్లో దాదాపు అంతా నాలుగు నెలలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ జాబితాలో ఫైర్ బ్రాండ్లకే పెద్దపీట వేశారు. దీంతో హుజూరాబాద్ ప్రచారం మరింత పదునెక్కనుంది. అధినేతలకు సిసలైన సవాలే.. మూడు ప్రధాన పార్టీలు విజయం కోసం బరిలో నిలిచాయి. ఈ స్థానంలో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ, పూర్వ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌కు ఇది తొలి ఉప ఎన్నిక కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా బైపోల్‌ను సవాలుగా తీసుకున్నారు. తనకు ఎంతో అచ్చివచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గం కావడంతో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా ఉపపోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో మూడు ప్రధాన పార్టీల అధినేతలకు ఈ ఉపఎన్నిక చాలాకీలకంగా మారింది. చదవండి: (Huzurabad Bypoll 2021:పెంచేటోళ్లు వాళ్లు.. పంచేటోళ్లం మేము) బండి, కిషన్, విజయశాంతి ప్రత్యేక ఆకర్షణ..! ప్రజాసంగ్రామ యాత్ర కావడం వల్ల ఇంతకాలం బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ ప్రచారానికి పెద్దగా అందుబాటులో లేకుండాపోయారు. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో తొలిస్థానంలో ఆయనే నిలవడం గమనార్హం. తరువాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, డీకే అరుణ, తరుణ్‌చుగ్, డా.లక్ష్మణ్, మురళీధర్‌రావు, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్, విజయశాంతి, చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్‌రాథోడ్ తదితరులు 20 మంది జాబితాలో ఉన్నారు. బండి, అరవింద్, డీకే, రఘునందన్ అంతా ఫైర్ బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ అందరిలోనూ బండి సంజయ్, కిషన్‌రెడ్డి, విజయశాంతి సభలకు జనాలు భారీగా వస్తారని పార్టీ అంచనా వేస్తోంది. కేసీఆర్, కేటీఆర్‌లే స్టార్లు..! అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా 20 మందితో కూడిన తమ స్టార్ క్యాంపెయిన్ల లిస్టు విడుదల చేసింది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు హరీశ్‌రావు, గంగుల, కొప్పుల, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుంకె రవిశంకర్, సతీశ్‌బాబు, పెదిŠద్ సుదర్శన్ రెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అయితే.. వీరంతా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన జూన్ 12 తరువాత నుంచి హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. 20 మంది జాబితాలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మినహా అంతా 17 వారాలుగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ లోకల్ స్టార్లుగా మారిపోవడం గమనార్హం. అజారుద్దీన్, సీతక్క ప్రత్యేకం.. కాంగ్రెస్ పార్టీ సైతం 20 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్, భట్టి, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అజారుద్దీన్, జగ్గారెడ్డి, అనసూయ సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉ న్నారు. వీరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్, జగ్గారెడ్డి, వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి అంతా ఫైర్బ్రాండ్లుగా పేరున్నవారే. ఈ జాబితాలో అజారుద్దీన్, అనసూయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఎన్నికల్లో అధిక ఖర్చు: సర్కోజీని దోషిగా తేల్చిన కోర్టు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీని ఆ దేశంలోని ఓ కోర్టు దోషిగా తేల్చింది. ఎన్నికల ప్రచారంలో నిర్ణయించిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం ద్వారా ఆయన నేరానికి పాల్పడినట్లు తేల్చింది. శిక్షగా ఏడాదిపాటు గృహ నిర్బంధంలోనే ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఎల్రక్టానిక్ మానిటరింగ్ బ్రేస్లెట్ ధరించి ఇంట్లో ఉండాలని తీర్పు చెప్పింది. ఈ శిక్షను ఆయన తిరిగి అప్పీల్ చేసే అవకాశం ఉంది. 2007 నుంచి 2012 వరకు అధ్యక్షుడిగా పని చేసిన సర్కోజీ, 2012 ఎన్నికల్లో నిర్ణయించిన ఆర్థిక మొత్తం కన్నా రెండింతలు ఎక్కువ ఖర్చు చేశారని కోర్టు తేలి్చంది. -
భాషా పరిజ్ఞానాన్ని మరోసారి రుచిచూపిన నారా లోకేష్
సాక్షి, ముత్తుకూరు: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మరోసారి రుచిచూపారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రోడ్‌షో నిర్వహించిన లోకేశ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోతే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి ‘పరామర్శించారా’ అనాల్సింది.. ‘పరవశించారా’ అంటూ నవ్వులు పూయించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గిస్తామని పునరుద్ఘాటించారు. రామాయపట్నంతోపాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదంటూ తన పరిజ్ఞానాన్ని చాటారు. అదే సమయంలో ‘ఏం పీకారు.. ఎంత దొబ్బారు’’ అంటూ సీఎంపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును ‘సైకోరెడ్డి’గా మారుస్తున్నానన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను పిల్లులతో పోల్చారు. వారు మ్యావ్..మ్యావ్ అంటున్నారని గేలి చేశారు. తాము అధికారంలోకి వస్తే తన తండ్రి చంద్రబాబుకున్న పెద్ద మనసు తనకు లేదని, అధికారులను, పోలీసులను వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. సభలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఈ సభలో పాల్గొనలేదు. చదవండి: (లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి) -
‘టీడీపీవి దిగజారుడు రాజకీయాలు’
కృష్ణా జిల్లా: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఓటమి భయంపట్టుకునే ఎన్నికల నుంచి పారిపోయాడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్ధసారధి విమర్శించారు. సీఎం జగన్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ గడపకు చేరుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ఏవైనా ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. దాంతోనే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ తన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం ముందు తాకట్టు పెట్టిందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ఐదేళ్లు ప్రశ్నించకుండా ఏంచేశారని ప్రశ్నించారు. ప్రజల్లో టీడీపీ పై నమ్మకం పోయిందని పార్థసారధి విమర్శించారు. చదవండి: నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని -
ఆ స్థాయి సోము వీర్రాజుకు ఉందా?: ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి డా.గురుమూర్తి పాల్గొన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు. చదవండి: లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి ‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’ -
లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి
సాక్షి, తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సైతం ఎమ్మెల్సీ లోకేష్ ప్రసంగం షరా మామూలుగా అపస్వర వాక్కులతో సాగింది. సోమవారం టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. తిరుపతి గాంధీరోడ్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్డుషో నిర్వహించి అక్కడే జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. వైఎస్సార్సీపీ నుంచి 22 మంది లోక్‌సభ సభ్యులు, 6 మంది రాజ్యసభ సభ్యులున్నారని, వారు రోబోలుగా మారి ప్రధాని మోదీ ఎదురు పడితే వంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి పాలనలో తిరుపతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదన్నారు. టీడీపీ తరపున ఒక రాజ్యసభ, ముగ్గురు లోకసభ సభ్యులు పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై, ప్రత్యేక హోదాపై సింహంలా గర్జిస్తున్నారని తెలిపారు. పుడచ్చేరి (పుదుచ్చేరి)లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అక్కడ ప్రత్యేక హోదా ప్రకటించిందన్నారు. పుదుచ్చేరిని పుడచేరి అంటూ ప్రసంగిస్తున్నప్పుడు సభలో నవ్వుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని జగన్ టాక్స్, కరప్షన్, బాదుడు(జేసీబీ) ప్రభుత్వంగా అభివర్ణించారు. ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.1500 ఉండగా నేడు 5 వేలకు పెరిగి బంగారు ధరను మించిందన్నారు. మద్యనిషేధమంటూ ప్రగల్భాలు పలికిన జగన్‌రెడ్డి ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ బ్రాంది, బూంబూం బీర్లతో సామాన్యుల నడ్డి విరిచి వేల కోట్లు దండుకుంటోందని విమర్శించారు. ఎన్నికల హామీలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్న జగన్‌రెడ్డి ఇప్పటికీ ఆ ఊసే ఎత్తలేదన్నారు. టీడీపీ పాలనలో 5లక్షల 16 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రస్తుత వలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలేనని, రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తిరుమలలో జరిగిన ఓ సమావేశంలో దళితుడైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి కూర్చునేందుకు కుర్చీ ఇవ్వకుండా.. అగ్ర వర్ణానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అవమానించారని తెలిపారు. టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. చదవండి: (జనాన్ని విసిగించిన నారా లోకేష్) అధికారుల అంతు చూస్తాం.. టీడీపీ కార్యకర్తలపై దారుణంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారుల అంతుచూస్తామని లోకేష్ హెచ్చరించారు. 2024లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అతిగా వ్యవహరించిన అధికారులకు వడ్డీతో సహా తగిన బుద్ది చెబుతామన్నారు. -
అక్కడ అలా లేదు.. మెడలో రెండు పార్టీలు!
కోడూరు (అవనిగడ్డ): పంచాయతీ ఎన్నికలు.. పైగా పార్టీలకు అతీతం.. కానీ అక్కడ అలాలేదు. ఆ అభ్యర్థి మెడలో ఏకంగా రెండు పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మద్దూరి సునీత మెడలో టీడీపీ, జనసేన పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండటంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. (చదవండి: ఒక ఊరు.. మూడు గ్రామాలు.. రెండు పంచాయతీలు!) గందరగోళమే లక్ష్యం.. ఓడినా నాదే పైచేయి! -
పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా?
సాక్షి, చెన్నై: ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. గ్రామాల్లో తిరుగుతూ అన్నాడీఎంకేను వ్యతిరేకిద్దాం అనే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.2021లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామసభలకు నిర్ణయించారు. జనవరి 10వ తేదీ వరకు 16 వేల గ్రామాల్లో ఈ సభల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ, స్థానిక సమస్యలపై దృష్టి అంశాలను పరిగణించి బుధవారం ఈ గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. డీఎంకే ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శుల నేతృత్వంలో ఆయా గ్రామాల్లో సభలు సాగాయి. ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారితో మాట్లాడడం, వారి సమస్యలను ఆలకించడం, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపించే విధంగా ఈ సభలు సాగాయి. చదవండి: రజనీకాంత్ జోష్‌కి బ్రేక్ స్టాలిన్ పర్యటన.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నంలో గ్రామసభకు స్టాలిన్ హాజరయ్యారు. ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో ఆయన పర్యటన ఆ గ్రామంలో సాగింది. గ్రామంలో నడుచుకుంటూ వీధివీధిన నడుచుకుని తిరుగుతూ కరపత్రాలను స్టాలిన్ అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావంతో అన్నా ఏళ్ల తరబడి ప్రజల కోసం శ్రమించారని గుర్తు చేశారు. అయితే, కొందరు పార్టీ ప్రకటించిన తర్వాత 24 గంటల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని పరోక్షంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తానూ..రౌడీనే అన్నట్టుగా తానూ రైతు అని గొప్పలు చెప్పుకుంటు సీఎం పళనిస్వామి అదే రైతులకు ద్రోహం తలబెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్ కేంద్ర వ్యవసాయ చట్టాల రూపంలో రైతులు తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, దీనిని వ్యతిరేకించకుండా మద్దతు పలుకుతున్న సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డీఎంకే నేతృత్వంలో మద్రాసు హైకోర్టు బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇక, పార్టీలో చేరే వారిని ఆహ్వానించే రీతిలో సభ్యత్వ నమోదుకు టోల్ ఫ్రీనంబర్‌ను డీఎంకే ప్రకటించింది. ఆ మేరకు 9171091710 నంబర్‌కు ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు. -
ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
సాక్షి, వేలూరు: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పును తీసుకురావాలని సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ తెలిపారు. మంగళవారం తిరువణ్ణామలై జిల్లాలో కమల్‌హాసన్ ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో నాలుగు ప్రాంతాల్లో ప్రజలను ఆయన సందర్శించారు. ప్రజలకు అభివాదం మాత్రం చేస్తూ ఎటువంటి ప్రచారం చేయకుండా వెళ్లారు. అనంతరం ప్రయివేటు కల్యాణ మండపంలో ఆయన అభిమానులు, కార్యకర్తలతో చర్చించారు. రాజకీయల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చదవండి: రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా! మక్కల్ నీది మయం అధికారానికి వచ్చిన వెంటనే సెయ్యారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటామని, నిరుపేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరువణ్ణామలై జిల్లాలో అధికంగా గ్రామీణ కళాకారులున్నారని, వారి కష్టాలు తనకు తెలుసునన్నారు. అధికారంలోకి వస్తే కుటుంబం కోసం ఇళ్లల్లో శ్రమిస్తున్న గృహిణులకు ప్రత్యేకంగా జీతాలు ఇస్తామని ప్రకటించారు. చదవండి: రజనీ రెడీ అంటే సీఎం అభ్యర్థిగా పోటీకి సై! -
క్వారంటైన్లో ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నేతలు, కార్యకర్తలంతా వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల నుంచి అన్ని పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలంతా పెద్ద సంఖ్యలో వచ్చారని, వారంతా లక్షణాలున్నా లేకున్నా 7 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అనుమానం ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఈ మేరకు బుధవారం డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరి ధిలో 10 రోజులపాటు ఎన్నికల ప్రచారంలో వేలాది మంది పాల్గొన్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొందరు కోవిడ్ నిబంధనలు పాటించలేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అందుకే నేతలంతా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వైద్యపరంగా అత్యవసరమైతేనే బయటకు రావాలని కోరారు. అంతర్జాతీయంగా, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత మొదలైందని పేర్కొన్నారు. అందుకే రోజుకు రాష్ట్రంలో 65 వేల పరీక్షలు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,090 కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు జరుగుతుండగా, వాటికి అదనంగా మరో 50 కేంద్రాల్లో పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 25, రంగారెడ్డిలో మరో 25 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటికి తోడు మరో 300 మొబైల్ వాహనాల ద్వారా కూడా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్యా వృద్ధాశ్రమాలు, చైల్డ్ హోమ్స్, అనాథ శరణాలయాల్లో ప్రతి పది రోజులకోసారి కరోనా పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల గురించి మరింత సమాచారం కోసం 104కు కాల్ చేయాలని, ఒకవేళ అది కలవకుంటే ప్రజారోగ్య డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 040–24651119కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చని చెప్పారు. పెళ్లిళ్ల వల్ల భారీగా కేసులు.. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పెళ్లిళ్ల వల్ల కూడా కొన్నిచోట్ల కేసులు ఆకస్మికంగా పెరుగుతున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లకు వందలాది మంది హాజరుకావడం వల్ల జగిత్యాలలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. సెకండ్ వేవ్ రాకుండా చూసే బాధ్యత మన చేతుల్లోనే ఉందన్నారు. మొదటి దశలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశామన్నారు. టీకా మొదటి డోసు ఇచ్చిన 3 వారాల తర్వాత మళ్లీ ఇంకో డోసు ఇవ్వాలని, అది ఇచ్చిన తర్వాత 9 నెలల పాటు దాని ప్రభావం ఉంటుందన్నారు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందరికీ అందించడానికి సమయం పడుతుందన్నారు. వాక్సిన్ సాఫ్ట్వేర్ డ్రై రన్‌కు రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసిందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బొగ్గులకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర బృందం డ్రై రన్ నిర్వహిస్తోందని తెలిపారు. గత నాలుగు నెలలుగా కరోనా వ్యాప్తి రేటు తగ్గిందన్నారు. రాష్ట్రంలో 70–80 లక్షల మందికి మొదటి దశలో కరోనా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే అందరికీ టీకాలివ్వడం సాధ్యం కాదని కేంద్రం రాష్ట్రాలకు తెలిపిందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రారంభానికి చర్యలు.. టీకా వచ్చిన తర్వాత వైద్య సిబ్బందికే ముందుగా వ్యాక్సిన్ ఇస్తామని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. మెడికల్ కాలేజీ తరగతులు ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నర్సులు పరిధి దాటి ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్వారంటైన్ సెలవులను రద్దు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, అదే పాటిస్తున్నామని చెప్పారు. కోవిడ్ సోకిన వారు 3 నెలల నుంచి ఏడాది పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో నాన్ కోవిడ్ సేవలు మొదలు పెట్టినట్లు వెల్లడించారు. అన్ని శస్త్ర చికిత్సలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. -
హరీశ్‌రావును టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్‌రావు అభ్యర్థి గెలుపుకోసం అన్నితానై ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు సుజాతను నేరుగా ఢీ కొనడం కంటే హరీశ్‌రావును ఢీ కొంటే ఉపయోగం ఉంటుందని హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థి సోలిపేట సుజాతను విమర్ఙంచడం కన్నా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హరీశ్‌రావును టార్గెట్ చేసి విమర్శిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గానికి ప్రచార నిమిత్తం వచ్చిన టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క హరీశ్‌రావును విమర్శించడం, టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత గురించి మాట్లాడడం, ఇతర విమర్శలు చేస్తున్నారు. హరీశ్ లక్ష్యంగా ప్రచారం.. రాష్ట్రంలో 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టు ఉన్న నియోజకవర్గాల్లో హరీశ్‌రావు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలోనే కొడంగల్‌లో రేవంత్‌రెడ్డితోపాటు హేమాహేమీలైన కాంగ్రెస్ పార్టీలు ఓటమి పాలయ్యారని ప్రచారం జరిగింది. అదే విధంగా హుజుర్నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లోని కీలక నాయకులు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు. ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకుని దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించాలంటే హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని మాట్లాడాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉందని కనిపిస్తోంది. అదే విధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా హరీశ్‌రావును టార్గెట్ చేసి వాఖ్యలు చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని గతంలో హరీశ్‌రావు ఏమి చేశాడని రఘునందన్‌రావు విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకే ఒక్కడిగా హరీశ్‌రావు.. విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ దుబ్బాక ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర కీలక నాయకులంతా దుబ్బాక నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. బీజేపీ నుంచి కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జిల్లాలో ప్రచారం చేస్తుండగా కేంద్ర, రాష్ట్ర నాయకులు రఘునందన్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు దుబ్బాక దారి పడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి హరీశ్‌రావు మాత్రం తనదైన శైలిలో వ్యూహ రచన చేస్తున్నారు. స్థానిక ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులను కలుపుకొని ప్రచారం పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిన మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, చిందం రాజుకుమార్‌లను టీఆర్ఎస్లో చేర్పించుకుని కాంగ్రెస్ క్యాడర్‌ను దెబ్బతీస్తున్నారు. మరోవైపు యువజన సంఘాలతో సమావేశాలు, సమీక్షలు, బైక్ ర్యాలీలు నిర్వహించి టీఆర్ఎస్ వైపు ఆకర్షింపచేస్తున్నారు. అదే విధంగా తాగునీటి ఇబ్బందులు పడ్డ దుబ్బాక ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడం, బీడీ కార్మికుల పెన్షన్లు, చేనేత కార్మికులకు చేయూత, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ ఇచ్చిన పథకాల గురించి పూసగుచ్చినట్లు ప్రజలకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల ఇబ్బందులు, బీజేపీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను చెబుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. ఇలా టీఆర్ఎస్కు ఓటేయాలని, మరో వైపు కాంగ్రెస్, బీజేపీ లను చిత్తుగా ఓడించాలని ప్రచారం చేయడం గమనార్హం. -
దేశ సామరస్యతపై కుట్ర
సాక్షి న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలు దేశ సామరస్యతను దెబ్బతీసేందుకు పన్నిన రాజకీయ కుట్రలో భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆ నిరసనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావని, వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లు ఎగదోస్తున్నాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలు సీఏఏ నిరసనల్లో రాజ్యాంగం, జాతీయ పతాకాలను ముందుపెట్టి అసలు కుట్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోమవారం ప్రధాని మోదీ తొలిసారి పాల్గొన్నారు. షహీన్బాఘ్ నిరసనల కారణంగా ఢిల్లీ పౌరులు ముఖ్యంగా సాటిలైట్ సిటీ ప్రజలు అనేక ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఢిల్లీ ప్రజలు కోపంగా, మౌనంగా ఈ ఓటుబ్యాంక్ రాజకీయాలను చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఈ అరాచకాన్ని ఆపేందుకు సహకరించాలని కోరారు. 21వ శతాబ్ది భారత్‌లో విద్వేష పూరిత రాజకీయాలు పనిచేయవని, అభివృద్ధి రాజకీయాలు మాత్రమే పనిచేస్తాయని కడ్కడూమా సీబీడీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ వ్యాఖ్యానించారు. బాట్లా హౌజ్ ఎన్‌కౌంటర్‌ను ప్రశ్నించినవారే ఇప్పుడు ‘తుక్డే తుక్డే’ నినాదాలు చేస్తున్నవారిని రక్షిస్తున్నారని కాంగ్రెస్‌పై పరోక్ష ఆరోపణలు చేశారు. పాక్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ఢిల్లీ ఒక నగరం కాదని, అది దేశ సాంస్కృతిక వారసత్వమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ ఢిల్లీవాసి చెమటోడ్చి ఢిల్లీని ప్రస్తుతమున్న స్థాయికి తెచ్చారన్నారు. గత రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీలు 21వ శతాబ్ది ప్రయోజనాలు ఢిల్లీకి అందకుండా చేశాయన్నారు. ఢిల్లీ వాసులు లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ఓటేసి దేశ భవిçష్యత్తు మారేందుకు బాట వేశారని, ఇప్పడు ఢిల్లీ భవిష్యత్తు మార్చడం కోసం మళ్లీ బీజేపీకే ఓటేయాలని కోరారు. ఢిల్లీ సురక్షితంగా, పరిశుభ్రంగా, ఆధునికంగా ఉండాలంటే తమ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ అనధికార కాలనీలను క్రమబద్దీకరిస్తామన్న తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఆప్ సర్కారు పీఎం ఆవాస్ యోజనను అడ్డుకుని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్‌కి మరోసారి అధికారమిస్తే కేంద్రం ప్రకటించిన ప్రజా సంక్షేమ పథకాలను అన్నింటినీ అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టం, కర్తార్‌పుర్ కారిడార్, 370 అధికరణం రద్దు, అయోధ్యపై కోర్టు తీర్పు, భారత బంగ్లాదేశ్ సరిహద్దు సమస్య పరిష్కారం.. తదితర అంశాలను ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ.. ఇవన్నీ 70 ఏళ్ల తరువాత, తమ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు. తాజా బడ్జెట్లో తమ ప్రభుత్వం సామాన్యుల కోసం, వ్యాపారుల కోసం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ వివరించారు. -
ఉపఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీబిజీ
సాక్షి, బెంగళూరు: మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ తరఫున ఉప ఎన్నికలు బరిలో ఉండటంతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అనర్హత ఎమ్మెల్యేల గెలుపుతో పాటు ప్రభుత్వ మనుగడకు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రచారంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. సీఎం బెంగళూరులోని యశవంతపున నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎస్టీ సోమశేఖర్ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్షాల ప్రచారం అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. మాటల యుద్ధం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై మరొకరు మాటల దాడికి దిగుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు.. తప్పు మీదంటే మీదని ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అయితే ఉప ఎన్నికల్లో భాగంగా బహిరంగ ప్రచారానికి కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆయా పార్టీల అభ్యర్థులు అనుచరులతో ముమ్మర సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరికొందరు మఠాలు, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలని భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎం యడియూరప్ప అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి వరాల హామీలు గుప్పిస్తున్నారు. హైఓల్టేజీ స్థానాలపై బెట్టింగ్? ఉప ఎన్నికలు జరిగే హొసకోటె, హుణసూరు, కృష్ణరాజపేటె, గోకాక్, యశవంతపుర, విజయనగర నియోజకవర్గాల్లో భారీ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ పార్టీ ఎక్కువ స్థానా ల్లో విజయం సాధిస్తుందనే దానిపై కూడా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్య పోటీ ఉందని.. ఇంకొన్ని చోట్ల కాంగ్రెస్– జేడీఎస్ మధ్యనే పోటీ ఉందని బెట్టింగ్ కాస్తున్నారు. చిక్కబళ్లాపుర, గోకాక్, శివాజీనగర స్థానా లపై కూడా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. -
రాజుకుంటున్న ‘హుజూర్నగర్’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం, పార్టీల మద్దతు తేలిపోవడం, ఎంత మంది అభ్యర్థులు రంగంలో ఉంటారో ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఉప ఎన్నికల్లో రెండు పారీ్టలు శాయశక్తులా పోరాడుతున్నాయి. ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీడీపీ కూడా ఈసారి రంగంలో నిలబడటంతో హుజూర్నగర్ ఉప పోరు రక్తికట్టిస్తోంది. అన్ని పారీ్టలు తమ బలగాలన్నింటినీ అక్కడే మోహరించిన నేపథ్యంలో గ్రామగ్రామాన కాళ్లకు బలపాలు కట్టుకుని నేతలు తమ అభ్యర్థుల కోసం ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోజూ ఎన్నికల సందడి కనిపిస్తోంది. ప్రచార హోరు... కార్యకర్తల్లో జోరు టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలయినా ఈసారి కైవసం చేసుకోవాలని ప్రయతి్నస్తోంది. పార్టీ ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని గులాబీ దళం గ్రామాలను చుట్టివస్తోంది. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సామాజిక వర్గాల వారీగా విభజించుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కేటీఆర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా నామినేషన్ల చివరి రోజున భారీ సభనే నిర్వహించింది. పార్టీ అతిరథ మహారథులు హాజరైన ఈ సభతో పార్టీ నేతల్లో ఐక్యత వచి్చందనే అభిప్రాయంతో కేడర్ ఉరకలు పెడుతోంది. ఉత్తమ్‌కు తోడుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటం, పండుగ తర్వాత మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారానికి రానుండటంతో హస్తం పార్టీ కూడా అధికార పారీ్టకి ధీటుగానే ప్రచార బరిలో దూసుకుపోతోంది. ఇక, బీజేపీ కూడా మండలాల వారీగా పార్టీ ఇన్చార్జులను నియమించి వీలునన్ని ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రయతి్నస్తోంది. టీడీపీ కూడా తన ఓటు బ్యాంకును రక్షించుకునే ప్రయత్నంలో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, సీపీఎం మాత్రం ఈ ఉప ఎన్నిక కారణంగా ఆత్మరక్షణలో పడింది. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురికావడం పార్టీ నేతలను షాక్‌కు గురి చేసింది. దీంతో అభ్యర్థిని సస్పెండ్ చేసి పార్టీ జిల్లా కార్యదర్శిని బాధ్యతల నుంచి తప్పించే వరకు వ్యవహారం వెళ్లిపోయింది. అయితే, అధికారికంగా పార్టీ పక్షాన ఓ స్వతంత్ర అభ్యరి్థకి మద్దతు ప్రకటించినా కార్యకర్తలు ఏం చేస్తారన్నది మాత్రం ఆసక్తికరంగానే మారింది. జీ హుజూరా... జై హుజూర్‌నగరా..? హుజూర్‌నగర్‌లో రోడ్‌షోకు వెళ్లిన సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ఓ వ్యాఖ్య నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. జీ హుజూరా? జై హుజూర్‌నగరా? అంటూ కేటీఆర్ చేసిన ఈ కామెంట్‌ను టీఆర్ఎస్తో పాటు అన్ని పారీ్టలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్‌కు జీ హుజూర్ అనకుండా హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి జై కొట్టాలనే అర్థంతో చేసిన కేటీఆర్ వ్యాఖ్యను క్షేత్రస్థాయి ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు బాగానే వాడుకుంటున్నారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్యను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, ఆయన్ను కలిసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదని, అలాంటి వ్యక్తి నియోజకవర్గంపైకి వందలాది మంది నేతలను పంపి దండయాత్ర చేయిస్తున్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్ దొరపాలనకు జీ హుజూర్ అనకుండా నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి జై హుజూర్నగర్ అనాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇతర పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రచారంలో కూడా ఈ వ్యాఖ్యలు చర్చకు వస్తుండటం గమనార్హం. ఎవరేం చేస్తారో..? గత ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల మధ్య జరిగితే ఈసారి రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించిన హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బహుముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ, టీడీపీతో పాటు ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులు చీల్చే ఓట్లే ఎవరికి నష్టం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఇక, గత ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారుతో సామీప్యత ఉన్న ట్రక్కు వల్ల తాము నష్టపోయామని టీఆర్ఎస్ వాపోతుండగానే, అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తులు కూడా నష్టం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ రోలర్, ట్రాక్టర్ నడిపే రైతు గుర్తులు కారు గుర్తును గందరగోళం చేస్తాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర పారీ్టల అభ్యర్థులు, స్వతంత్రులు, ఎన్నికల గుర్తులు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికి మేలు చేస్తాయి... ఎవరికి నష్టం చేస్తాయన్నది ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ప్రధాన పారీ్టలు ఎప్పటికప్పుడు తమ పరిస్థితిపై సర్వేలు, నివేదికలు తెప్పించుకోవడం ప్రారంభించాయి. మొత్తం మీద హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కారణంగా దసరా తర్వాత కూడా మరో 15 రోజుల పాటు పండుగ వాతావరణమే కనిపించనుంది. -
ప్రచారంలో పదనిసలు
ఈమధ్య రాజకీయ నాయకులు తమ ప్రచారంలో ఓ ప్రమాదకరమైన విషయంలో కాలుమోపుతున్నారని నాకనిపిస్తుంది . అసదుద్దీన్ ఒవైసీగారు నరేంద్రమోదీ మీద కాలు దువ్వుతూ ఒకానొక సభలో ‘‘గో మాంసంతో చేసిన బిరియానీ సేవించి తమరు నిద్రపోయారు ? ’’ అని విమర్శించాడు. ఇందులో ప్రత్యేకమైన ఎత్తుపొడుపు– గోవుల్ని ఆరాధించే పార్టీనాయకులు అలాంటి బిర్యానీని తినడం. వీరే 2018 తెలంగాణా ఎన్నికలలో ‘‘నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుని ఒక ప్యాకెట్ ‘కళ్యాణి’ బిర్యానీ అడుగుతా’’ అన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఉత్తరప్రదేశ్ మొరా దాబాద్ ఎన్నికల సభలో ‘‘ఇంతకాలం కాంగ్రెస్ దౌర్జన్యకారుల చేత బిర్యానీని తినిపించింది’’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు కార్యదర్మి ప్రియాంకా గాంధీ ‘‘మోదీగారు పాకిస్తాన్ బిర్యానీని సేవించడానికి పాకిస్తాన్ వెళ్లారు’’ అని వెక్కిరించారు. తెలుగులో ఓ సామెత∙ఉంది. ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నప్పుడు ఒకమాట చెప్తారు. ‘‘ఏమైనా చెయ్యండి కానీ అతని కడుపు మీద కొట్టకండి’’ అని. కారణం ఉపాధికి మూల స్థానం– కడుపు. దానికి సంబంధించినది దేన్ని కదిపినా మనిషి కదులుతాడు అయినా ఈమధ్య రాజకీయ నాయకులు ‘కడుపు’ మీద కొడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన చర్య అని ముందుగా అందరినీ హెచ్చరిస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. దానిని ఎత్తి చూపి ఆ ప్రాంతాలవారిని వెక్కిరించడం కద్దు. దక్షిణాదివారిని ‘ఇడ్లీ సాంబారు వాలా’ అంటారు. ఒకప్పుడు ఇది తమిళుల సొత్తు ఇప్పుడు ఇడ్లీ విశ్వరూపం దాల్చింది. వాషింగ్టన్ , దుబాయ్, మలేషియా– ఎక్కడయినా ఇడ్లీ దర్శనమిస్తుంది. తెలుగువారికి – దోశ, పెసరట్టు. నేను విజయవాడలో పనిచేసే రోజుల్లో రాత్రంతా రచన చేసి ఏ తెల్లవారు జామునో కడుపు తేలిక కాగా ఏలూరు రోడ్డుకి వచ్చేవాడిని. ఆ సెంటర్లో ‘మాతా కేఫ్’ ఉండేది. మాలాంటి వాళ్ల కోసం వేడి వేడి ఇడ్లీలు చేసేవాడు. ఓపట్టు ఎక్కువ పట్టాలంటే మినప దోసె. వీటిని తినడానికే ఓ రాత్రి వరకూ రచన సాగించేవారం. కాలిఫోర్నియాలో సాగర్ అనే తెలుగు మిత్రులు ఒక ఆంధ్రా హోటల్ తెరిచారు. పేరు? ‘‘దోసె ప్యాలెస్’’. అక్కడి దోసెలు తినడానికి 60–70 మైళ్ల దూరం నుంచి తెలుగువారు రావడం నాకు తెలుసు. మరి కేరళవారికి? పుట్టు కడలె చాలా అభిమాన వంటకం. సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకులు భీమ్‌సింగ్ గారి సతీమణి సుకుమారి ఇంట్లో తిన్న జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోదు. ఇక కర్ణాటకలో– ఆ మాటకు వస్తే మన రాయలసీమ పొలిమేరల నుంచి ‘రాగి ముద్ద’ చాలా ఫేమస్. నిజాం ప్రాంతంలో, కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో చాలా పాపులర్ వంటకం– బిర్యానీ. నాకో దురభిప్రాయం ఉండేది. ఇది బొత్తిగా ఉత్తర భారతీయుల ‘రుచి’ అని. నేను పొరపాటు బడ్డానని ఈ మధ్యనే గ్రహించాను. ఇవాళ ఎక్కడ చూసినా చెన్నైలో బిర్యానీ విశ్వరూపం కనిపిస్తోంది. బిర్యానీ హోటళ్ల వివరాల కోసం కంప్యూటర్ తెరిచాను. నాకు శోష వచ్చినంత పనైంది. ఒక్క చెన్నైలోనే దాదాపు 249 హోటళ్లున్నాయి. అదీ రకరకాల బిర్యానీ రుచులతో. మచ్చుకి కొన్ని మాత్రం – ఆసీష్ బిర్యానీ, తాళపుకట్టె బిర్యానీ, మలబార్ బిర్యానీ, అబ్దుల్లా బిర్యానీ, అంబాళ్ బిర్యానీ, తంగమ్ బిర్యానీ, స్టార్ చికెన్ బిర్యానీ, ముఘల్ బిర్యానీ, కరీం బిర్యానీ, ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ, బిలాల్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ, పారామౌంట్ బిర్యానీ, ది రాయల్స్ బిర్యానీ, సేలం ఆర్ఆర్ బిర్యానీ, తారిఖ్ బిర్యానీ, నయీం బిర్యానీ, సంజయ్ బిర్యానీ– ఇక్కడ ఆగుతాను. మొఘలుల కాలంలో ఇండియాకు దిగుమతి అయిన ఈ వంటకం – పేరు, రుచి మార్చుకుని ఇప్పుడు అంతటా దర్శనమిస్తోంది. అవధ్, హైదరాబాద్, పంజాబీ, కలకత్తా, దిండిగల్లు ఇలా మీ యిష్టం. విజయ్ మరూర్ అనే వంటగాడు– లక్షలాది మందికి అనుదినమూ ఆనందాన్నీ, ఉపాధినీ ఇచ్చే ఈ ‘గొప్ప’ దినుసుని రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడం అన్యాయమని వాపోయారు. మనూ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ సల్మా ఫరూఖీగారు తమ రాజకీయ వెక్కిరింతలకు నిక్షేపంలాంటి, కడుపుల్ని నింపే వంటకాన్ని వీధిన పెట్టడం దుర్మార్గం అన్నారు. ఏమయినా ఈ రాజకీయ నాయకులందరూ పప్పులో కాలేశారని నాకనిపిస్తుంది. పొరపాటు. ఈ మాట అన్నదెవరో పప్పుని దుర్వినియోగం చేశాడనీ, అతనికి బొత్తిగా పప్పు రుచి తెలియదని నా ఉద్దేశం. ఇప్పుడు – ఈ కామెంట్‌ను తిరగరాస్తున్నాను. ఈ రాజకీయ నాయకులందరూ నిర్ధారణగా ‘బిర్యానీ’లో కాలేశారు. వారందరికీ అర్థంకాని విషయం ఏమిటంటే మన దేశంలో బిర్యానీ రుచి కొత్త రాష్ట్రాలకూ, ప్రాంతాలకూ పాకుతోంది. రోజురోజుకీ దేశ ప్రజలు బిర్యానీ రుచిని మరిగి విర్రవీగిపోతున్నారు. కనుక బిర్యానీని అడ్డం పెట్టుకుని ఎద్దేవా చేసే నాయకులు వారికి తెలియకుండానే కొన్ని లక్షల ఓట్లు నష్టపోతున్నారని నాకనిపిస్తోంది. -గొల్లపూడి మారుతీరావు -
యూపీ సీఎంకు, మాయావతికి భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతికిఎలక్షన్ కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వారిద్దరినీ ఎన్నికల ప్రచారం నుంచి కొంత సమయం పాటు బ్యాన్ చేసింది. మతపరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం యోగిని మూడు రోజులు (72 గంటల పాటు), మాయావతిని రెండు రోజులు (48 గంటల పాటు) ఎన్నికల ప్రచారంనుంచి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆంక్షలు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా యోగి, మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రసంగాలనుఉదహరిస్తూ సోమవారం సుప్రీకోర్టు ఈసీపై విమర్శలు గుప్పించింది. ఎంతుకు ఉదాసీనంగా ఉంటున్నారని చురకలంటించింది. దీంతో రెండవ దశ ఎన్నికల బరిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నేతలిద్దరికీభారీ ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న యూపీ ఎన్నికల బరిలో యోగి మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించకుండా ఈసీ కట్టడి చేయడం రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీఎస్పీ, బీజేపీకి పెద్ద షాకే. -
ధర్మవరంలో టీడీపీ తరుపన ప్రచారం చేస్తున్న కానిస్టేబుల్
-
అవనిగడ్డలో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి సింహాద్రి రమేష్ బాబు ప్రచారం
-
బడి ముగిసాక బూట్లు ఇస్తారట..!!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన సుమారు రూ.130 కోట్ల నిధులను తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందర తన స్వప్రయోజనాల కోసం పక్కదారి పట్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్దిరోజుల ముందు కొన్ని ఉత్తర్వులు, షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా మరికొన్ని ఉత్తర్వులను సర్వశిక్ష అభియాన్ ద్వారా జారీ చేయించి కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు భారీ ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చుల కోసం ఇలా పిల్లల సొమ్మును దోపిడీ చేయడం అన్యాయమని గతంలో ఏ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించ లేదని పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. పాత తేదీలతో పలు ఉత్తర్వులు జారీ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో భారీగా కమీషన్లు దండుకొనేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారం బడి బయట ఉన్న విద్యార్థులను స్కూళ్లలో చేర్పించడానికి, బడి మధ్యలో మానేసిన వారిని (డ్రాపవుట్లను) తిరిగి పాఠశాలల్లో చేర్పించడానికి వీలుగా అన్ని గ్రామాల్లో ప్రచారం చేయించడానికి సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. విద్యాసంవత్సరం మొదట్లో అంటే పాఠశాలలు ప్రారంభమైన మొదట్లోనే ఈ నిధులను వినియోగించాలి. అయితే అధికార తెలుగుదేశం పార్టీ విద్యా సంవత్సరం చివర్లో ఈ నిధులను పక్కదారి పట్టిస్తోంది. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో కళాజాతాల పేరిట ప్రభుత్వ ప్రచారానికి తెరలేపింది. ప్రాథమిక స్థాయి తరగతులు ఏప్రిల్ 24 వరకు కొనసాగుతాయి. ఈలోగానే కళాజాతాల పేరిట నిధులను తమ ప్రభుత్వ ప్రచారానికి వినియోగించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ గీశారు. భవిత, నాన్ భవిత సెంటర్ల ఏర్పాటు, పత్రికల్లో ప్రకటనలు, కథనాలు రాయించడం వంటివి చేయించాలని తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే సీఎంఓ, మీడియా ఇంటర్వెన్షన్ కింద రూ.6.08 కోట్లు ఖర్చు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా తాజాగా అవుట్డోర్ అడ్వర్టయిజ్మెంట్ల కోసం మరో రూ.3.70 కోట్లు ఖర్చు చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయిస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం ప్రచారానికి పనికొచ్చేలా వాటికి బోర్డులు పెట్టి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది చివర్లో విద్యార్థులకు బూట్లు అంట ఎస్ఎస్ఏ ద్వారా నిర్వహించే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్దేశిస్తోంది. ఈ కార్యక్రమం కింద మధ్యాహ్న భోజనం, దుస్తుల పంపిణీ వంటివి చేపట్టాలి. బూట్ల పంపిణీ వాటిలో లేదు. అయినా ప్రస్తుతం విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లోని 29,71,098 మంది విద్యార్థులకు బూట్ల పంపిణీ కోసం అంటూ రూ.76 కోట్ల విడుదలకు ఎస్ఎస్ఏ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. పంపిణీ బాధ్యతలు వేర్వేరు సంస్థలకు కట్టబెట్టారు. జత బూట్లు, రెండు జతల సాక్స్‌లకు రూ.254 చొప్పున ధర నిర్ణయించారు. పాఠశాలలు మరో నెలరోజుల పాటే జరగనున్న సమయంలో ఇప్పుడు బూట్లకు ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎన్నికల ఖర్చుల కోసం కమీషన్లు దండుకోవడానికే తప్ప మరొకటి కాదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు యూనిఫామ్‌లు ఇవ్వలేదు.. మూడో యూనిఫామ్‌కి నిధులు! మరోపక్క 2018–19 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.180 కోట్లతో పంపిణీ చేయాల్సిన యూనిఫామ్‌లు ఇంకా పూర్తిగా పంపిణీ చేయలేదు. అనేక మండలాల్లోని విద్యార్థులకు ఒక్క జత కూడా అందలేదు. ఈ దుస్తుల కోసం కేంద్రం గతంలో రూ.400 ఇచ్చేది. ఇటీవల దీన్ని రూ.600లకు పెంచింది. ఈ పెరిగిన నిధులతో ఇప్పుడు 1నుంచి 5వ తరగతి వరకు ఉన్న 14,42,487 మంది పిల్లలకు మూడో జత అంటూ రూ.30 కోట్ల మేర ఆర్డర్లను ఓకే చేస్తూ ఎస్ఎస్ఏ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దుస్తుల కాంట్రాక్టులో కోట్లకొద్దీ నిధులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. అయినా మళ్లీ వారికే పనిని కేటాయించి సగం మొత్తాన్ని అడ్వాన్సుగా విడుదల చేయడం గమనార్హం. మదర్సాలు, ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు దుస్తుల పంపిణీ కోసం అంటూ మరో రూ.11 కోట్ల మేర కాంట్రాక్టు అప్పగించారు. డిజిటల్ తరగతుల్లోనూ స్వాహా పర్వం రాష్ట్రంలో 500 హైస్కూళ్లలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదుల వ్యవహారం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసింది. పలుచోట్ల డిజిటల్ కంటెంట్ లేకపోవడంతో ఆ గదులు మూతపడ్డాయి. కొన్నిచోట్ల డిజిటల్ తరగతుల కోసం పంపిణీ చేసిన ప్రొజెక్టర్లు పనిచేయడం లేదు. కంప్యూటర్లు కూడా ఇంటెర్నెట్ సదుపాయం లేక నిరుపయోగంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా తరగతులు అసలు నిర్వహించలేదు. అయినా వాటి నిర్వహణ ఖర్చుల కోసం అంటూ ప్రైవేటు కంపెనీకి రూ.2.27 కోట్లను అందించేందుకు ఎస్ఎస్ఏ ఉత్తర్వులు ఇచ్చింది. ఇవే కాకుండా స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మానటరింగ్ సిస్టమ్ (ఎస్ఐఎంఎస్) కింద డ్రాపవుట్ ప్రిడిక్షన్, వీక్షణం, ఐ–సంపద తదితర కార్యక్రమాల పేరిట మరిన్ని నిధులను ఆయా సంస్థలకు కేటాయించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. -
నీట్‌గా ఉంటే ఎక్కువ పైసల్!
సాక్షి,రాజేంద్రనగర్: ‘ఏం యాదన్న.. ఈమధ్య రోజూ టిక్..టాక్ తయారైపోతున్నావు. ఏంది సంగతి. ఆ ఏమి లేదు నర్సన్న. కూలీ అయితే రోజూ ఎలాగో అలా... పొయ్యేటొళ్లం. ఇప్పుడు ఎన్నికలు కదా. అందుకే ఉదయమే తానం చేసి, ఇస్త్రీ చేసిన బట్టలు ఏసుకొని ప్రచారానికి పోతున్న. గిట్ల మంచిగ తయారై పోతే నాలుగు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారు. అందుకే టిక్.. టాక్‌గా తయారై పోతున్నా. ’ఇదీ ప్రస్తుత పరిస్థితి. ఎన్నికల సీజన్ కావడంతో అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా బలగం చూపించుకుంటున్నారు. దీంతో నేతలు మహిళలతో పాటు పురుషులను రప్పించుకుంటున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ ప్రాంతాల్లో పని చేస్తే కూలీలను సైతం తమ వెంట తీసుకువెళ్తున్నారు. నేరుగా వారి వద్దకు వెళ్లకుండా వారి తరఫున ఉన్న కాంట్రాక్టర్లు, ఏజెంట్లు, మేస్త్రీలు వారిని ఆశ్రయిస్తున్నారు. మామూలుగా వెంట తిరిగే వారికి ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంతో పాటు డబ్బును ఇస్తున్నారు. ఓ మోస్తారు నాయకులుగా కనిపించేందుకు వారిని ప్రతిరోజు నీట్‌గా రెడీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉన్న వారికి ఇతరుల కంటే డబ్బు ముట్టజెబుతున్నారు. -
వ్యూహాల్లో అ‘ద్వితీయం’
షాద్‌నగర్ టౌన్: ఎన్నికల్లో విజయతీరం చేరుకోవాంటే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ప్రత్యర్థులు వేసిన ఎత్తులను చిత్తు చేయాలంటే రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గరుపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వాటిని నేతలు పసిగట్టి అప్రమత్తం అయితే ఫలితాన్ని సునాయసంగా అందుకోవచ్చు. అందుకు తగ్గట్లు నేతలు పావులు కదపాలి. తద్వారా ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు ప్రతి గల్లీకి వెళ్లి చక్రం తిప్పలేరు. దీనికోసం ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడాల్సి ఉంటుంది. గ్రామాల్లో ద్వితీయ శ్రేణి నేతలు అద్వితీయమైన వ్యూహాలు రచిస్తూ పార్టీతోపాటు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాన అనుచరులే అండ.. నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి పార్టీలో పదుల సంఖ్యలో ముఖ్య నాయకులు ఉంటారు. వీరే పార్టీ అభ్యర్థులకు ప్రధాన అనుచరులుగా ఉంటూ వారికి పెద్దదిక్కుగా వ్యవహరిస్తుంటారు. వీరు కార్యకర్తలను ఏకం చేయడం, ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మామూలు సమయాల్లో కంటే ఎన్నికల సమయంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర అన్ని పార్టీల్లో కీలకంగా మారుతుంటుంది. ఎన్నికల ప్రచార వ్యూహాన్ని రచించడం.. గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నాయకుల ఎత్తులకు పై ఎత్తులు వేసి పావులు కదుపుతున్నారు. బరిలో ఉండే తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుల సమాచారాలను చేరవేస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. అనుక్షణం.. అప్రమత్తం అనుక్షణం ప్రత్యర్థి పార్టీ నాయకుల కదలికలను గమనిస్తూ వారి కోటలను బద్దలు కొట్టి తమ పార్టీ జెండాను ఎగురవేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలు పావులు కదుపుతుంటారు. పార్టీ బలాన్ని పెంచడంతో పాటుగా ఎదుటి పార్టీలో అలకబూనిన నేతలను, అసంతృప్తిగా ఉన్న నాయకులను గుర్తించి అక్కున చేర్చుకొని సరికొత్త వ్యూహాలను అమలు చేసే బాధ్యతను నేతలు తమ భుజాలపై వేసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ అందరినీ ఆకట్టుకునే విధంగా మాట్లాడి ఓట్లు వేయించి ఎన్నికల్లో ఆధిపత్యం కొనసాగేలా దూసుకెళ్తున్నారు. అన్ని తామై వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణినేతలు ఆయా గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు. గెలుపోటముల్లో కీలక పాత్ర ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల గెలుపోటముల్లో రెండో శ్రేణి నేతలది కీలక పాత్ర. ఎన్నికల నేపథ్యంలో ప్రతిచోట నాయకులు పార్టీలు మారడం, కొత్త వారిని పార్టీల్లోకి చేర్చడంలో అభ్యర్ధుల ప్రధాన అనుచరులు కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ఎన్నికలు జరిగే సమాయానికి ఓటర్లను ఆకట్టుకొని వారి ద్వారా ఓట్లు వేయించే విషయంలోనూ వీరిపాత్ర అద్వితీయం. ఎన్నికల్లో గెలుపోటములు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నేతలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థి ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లు పాలించాలంటే ఈ నేతలే కీలకంగా మారుతున్నారు. -
కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్
సాక్షి, చేవెళ్ల: ‘దొరా.. కేసీఆర్.. ఇదేంది అన్నా.. తెలంగాణ వస్తే ఏమో చేస్తావని అనుకున్నాం కానీ, ఏమి చేయాలేదు’ అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏదో చేస్తావని నమ్మిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. దళితబిడ్డను ముఖ్యమంత్రి చేస్తానని చెప్పావా లేదా అన్నా... గుర్తు తెచ్చుకోండి అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబ సభ్యులంతా పడి అమ్మా నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని కేసీఆర్ అడిగారన్నారు. ప్రజలకు దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పి.. లోపల తననే ముఖ్యమంత్రి చేయమని అడగటంపై సోనియా ఆశ్చర్యపోయారని, దీంతో సోనియా.. దళితబిడ్డనే ముఖ్యమంత్రిని చేయాలి నేను మిమల్ని ముఖ్యమంత్రి చేయను, నీవు నా పార్టీలో చేరవద్దు అని పంపించారని విజయశాంతి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని, అలాంటి దేవతను విమర్శించే హక్కు, స్థాయి కేసీఆర్‌కు, కేటీఆర్‌కు, కవితకు లేదన్నారు. ఇంటింటికో ఉద్యోగం, దళితులకు భూమి, డబుల్బెడ్రూం ఇళ్లు అన్ని ఇచ్చి హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు ఆశీర్వదించాలని సభలు పెడుతున్నారని, మళ్లీ ప్రజలు ఓటు వేస్తారనే భ్రమలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని, అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాపీ, డ్వాక్రా సంఘాలకు రూ.10లక్షల వడ్డీలేని రుణాలు అందిస్తుందని, ఏడాదికి పేదలకు ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు. 5లక్షల వరకు ఆరోగ్యశ్రీ సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఎస్ రత్నంను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వస్తే ప్రజలకు అంతా మంచి జరుగుతుందని అనుకున్నామని, జిల్లాకు ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా రాలేదన్నారు. అప్పుడు ఓట్లు కోసం వచ్చాడు, ఇప్పుడు ఓట్ల కోసం వస్తాడని విమర్శించారు. ఈ ప్రాంతానికి ప్రాణహితను అడ్డుకున్నాడు.. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తీసుకొస్తామని చెప్పాడు. ఇప్పుడు దానిని పాలమూరు ఎత్తిపోతల అని మార్చాడన్నారు.ఆ నీళ్లు వస్తాయో రావో తెలియదన్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ.. తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. కేస్ రత్నంను అప్పుడు కొన్ని దుష్టశక్తులు కలిసి ఓడించాయని, ఈసారి భారీ మోజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సభలో చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి పి.వెంకటస్వామి, ఎమ్మెల్యే అభ్యర్థి కేఎస్ రత్నం, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, గోవర్దన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ అగిరెడ్డి, మహిళా నాయకురాలు సదాలక్ష్మీ, నాయకులు గోపాల్‌రెడ్డి, వెంకటేశంగుప్తా, వసంతం, మధుసూదన్‌గుప్తా, రవికాంత్‌రెడ్డి, శర్వలింగం, శ్రీనివాస్‌గౌడ్, టేకులపల్లి శ్రీను, శ్రీదర్‌రెడ్డి, కె.రామస్వామి, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, రఘువీర్‌రెడ్డి, విఠలయ్య, శివానందం, ప్రకాశ్‌గౌడ్, శంకర్, ప్రభాకర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సిత్రాలు
వట్పల్లి(అందోల్): రొట్టెలు చేస్తాను నాకు ఓటు వేయాలంటూ బీఎల్ఎఫ్ ఎమ్మెల్యే అభ్యర్థి పి.జయలక్ష్మీ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేశారు. సోమవారం మండల పరిధిలోని కేరూర్ గ్రామంలో ఇంటింట ప్రచారంలో భాగంగా రొట్టెలు చేస్తున్న మహిళ వద్దకు వెళ్లి నేను రొట్టె చేసిస్తాను నాకు ఓటు వేయమ్మ అంటూ అభ్యర్థించారు. మిర్చి తిని.. మద్దతివ్వండి మునిపల్లి(అందోల్): టీఆర్ఎస్ అందోల్ నియోజకవర్గ అభ్యర్థి క్రాంతికిరణ్ సతీమణి పద్మిని బుదేరాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌరస్తాలోని ఓ టిఫిన్ బండి వద్ద మిర్చి బజ్జీలను తయారు చేసి సందడి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని బండి నిర్వాహకుడిని, కస్టమర్లను కోరారు. ఓట్ల మోత మోగాలె.. జహీరాబాద్ టౌన్: బీజేపీ అభ్యర్థి జంగం గోపి ప్రచారంలో కళాకారులతో పోటీ పడి డప్పు వాయించి ప్రచారాన్ని హోరెత్తించారు. వివిధ రకాల ట్యూన్లు వాయించి అక్కడ ఉన్న వారితో ఔరా అనిపించారు. తనకు ఓటు వేయడం మరిచిపోవద్దని స్థానికులను కోరారు. బోనమెత్తిన అభిమానం -
ఎన్నికలు.. మద్యం.. మాంసం..
సాక్షి, రంగారెడ్డి : ఎన్నికల ప్రచారం జోరు మీదుంది. ఓట్ల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అలిసిపోతున్న నాయకులు, కార్యకర్తలు సేద తీరడానికి చల్లని బీరు, మద్యం కోసం వైన్స్‌ల బాటపడుతున్నారు. అభ్యర్థులు సైతం తమ అనుచరులు.. పార్టీ శ్రేణులు చేజారిపోకుండా మందుతో కూడిన విందులు ఏర్పాటు చేస్తున్నారు. కేవలం మద్యం మాత్రమే కాకుండా ప్రతిరోజు మాంసాహారం తప్పనిసరి అయింది. దీంతో మార్కెట్లో ఇప్పుడు మద్యం దుకాణాలతో పాటు చికెన్, మటన్ షాపులు సైతం కళకళలాడుతున్నాయి. దీంతో పనిలో పనిగా వంటలు, కేటరింగ్ చేసే వాళ్లకు మంచి చేతి నిండా పని దొరుకుతోంది. కడుపు నిండా తిండి.. ఎన్నికల ప్రచారం ప్రారంభంతో హోటళ్ల వద్ద సందడి పెరిగిపోయింది. చాయ్ తాగుతూ బాతాకానీ కొట్టే వారు కొందరైతే.. అభ్యర్థుల వెంట తిరిగి అలిసిపోయిన వారు ఘుమఘుమలాడే బిర్యానీల కోసం హోటళ్ల వైపు పరుగులు పెడుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో హోటళ్లలో బిర్యానీ సైతం దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లలో ఇప్పుడు బిర్యానీ దొరకడం కొంత కష్టంగానే మారిందని చెప్పవచ్చు. -
గులాబీ జోష్
సాక్షి,రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆదివారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతమయ్యాయి. ముందుగా తాండూరులో సభ నిర్వహించారు. అనంతరం సీఎం పరిగికి చేరుకున్నారు. ఆ తర్వాత షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో సభలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, జనం భారీగా సభలకు తరలిరావడంతో నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఆద్యంతం గులాబీ దళపతి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మధ్యమధ్యలో కేసీఆర్ విసిరిన పంచ్‌లు ఆకట్టుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభకు ముందు కళాకారుల ఆటాపాటలు ఉత్సాహపరిచాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం సభ సైడ్‌లైట్స్ తాండూరుకు మధ్యాహ్నం 1:10 గంటలకు కేసీఆర్ చేరుకున్నారు. 1:20 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, బీజేపీ, టీడీపీ నాయకులకు కేసీఆర్ టీఆర్ఎస్ కండువాలను కప్పి ఆహ్వానించారు. 1:26 గంటల నుంచి 1:57 గంటల వరకు కేసీఆర్ ప్రసంగించారు. మధ్యాహ్నం 2 గంటలకు సభా స్థలం నుంచి కేసీఆర్ హెలిపాడ్ వద్దకు బయలుదేరారు. మధ్యాహ్నం 2.10 గంటలకు తాండూరు నుంచి హెలికాప్టర్లో పరిగికి వెళ్లారు. సభలో కేసీఆర్‌తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు. సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి. తాండూరు ప్రాంతానికి చెందిన పర్యాద కృష్ణమూర్తి చిరకాల మిత్రుడన్న కేసీఆర్. తాండూరులో సభా ప్రాంగణం సరిపోకపోవడంతో జనాలు రోడ్లపై నిలబడి కేసీఆర్ ప్రసంగం ఆసక్తిగా విన్నారు. ఓ బాలుడు సభలో గులాబీ జెండాతో సందడి చేశాడు. సభకు వస్తుండగా హెలికాప్టర్లోంచి కోట్‌పల్లి ప్రాజెక్టును చూడగా పూర్తిగా ఎండిపోయందని కేసీఆర్ ప్రసంగంలో పేర్కొన్నారు. తాండూరులో దుమ్ము, ధూళితోపాటు కాలుష్యాన్ని తగ్గిస్తామని కేసీఆర్ హామీ. మేడలపై నుంచి కేసీఆర్‌ను చూసిన జనాలు. ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో కేసీఆర్ సభాస్థలికి చేరుకోకముందే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తమ ప్రసంగం ముగించారు. సాయంత్రం 5: 30 గంటలకు సీఎం హెలికాప్టర్ బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకొని కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. 5:40 గంటలకు హెలిపాడ్‌లో దిగింది. 5:54 గంటలకు సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. 30 నిమిషాల పాటు సీఎం ప్రసంగించారు. కండువా కప్పి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌తోపాటు ఆయన అనుచరులను సీఎం టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. క్యామ మల్లేశ్ పేరును తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించిన సీఎం. హెలికాప్టర్లో వచ్చి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లిన కేసీఆర్. క్యామ మల్లేశ్‌కు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం ప్రకటించగానే సభలో చప్పట్లు. -
ఆదివారం ‘ఎఫెక్ట్’
సాక్షి,రాజేంద్రనగర్: సెలవురోజు ఆదివారం కావడంతో కిందిస్థాయి నాయకులు, చోటామోట లీడర్లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం, ఆపై ఆదివారం కావడంతో ప్రజలు ఇళ్ల వద్దే ఉంటారని భావించిన నేతలు ముమ్మరంగా ప్రచారం చేయాలని భావించారు. బలగం చూపించుకోవడానికి జనం అవసరం కావడంతో చోటామోట లీడర్లు, గల్లీస్థాయి నాయకులను ఆశ్రయించారు. ప్రచారం తర్వాత బిర్యానీ, మద్యం, ఆపై డబ్బులు ఇస్తామని హామీ ఇస్తేనే వస్తామని వారు తెగేసి చెప్పడంతో చేసేది లేక నేతలు అంగీకరించాల్సి వచ్చింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఆదివారం పెద్దఎత్తున నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. -
ఎన్నికల ‘కూలీలు’
సాక్షి,మెదక్ : ఒకప్పుడు పల్లెకో, పట్టణానికో నాయకుడు వస్తే జనం స్వచ్ఛందంగా కదలివచ్చేవారు. ర్యాలీల్లో నేతలతో కలిసి పాదం పాదం కలిపేందుకు, సభల్లో వారి ప్రసంగాలు వినేందుకు పోటీపడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలి వచ్చేవారు.. నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు. దీంతో అభ్యర్థులు, ఆశావాహులు సభల కోసం, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ ఇక్కడ..రేపు అక్కడ.. కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే రేపు మరో పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. పలుచోట్ల చేరికల సందర్భంగానూ ఇలాంటి వింతలే జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకునేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లేక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమాని కూలి దొరుకుతుంది.. ‘రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాది. ఒక్కొమారు కూలీ పనులు దొరక్క పస్తులుండాల్సిన పరిస్తితి. కానీ ఎన్నికల పుణ్యాన మాకు గత 15 రోజులుగా రోజూ కూలి దొరుకుతోంది. ప్రచారానికి పోతే సాయంత్రానికి పైసలు పక్కాగా వస్తున్నాయయి. కడుపు నిండా అన్నం పెట్టి పంపుతున్నారు.’ అంటూ కొందరు ఎన్నికల కూలీలు సాక్షి ఎదుట సంతోషం వ్యక్తం చేశారు. -
కోల్లాపూర్లొ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌రావు ప్రచారం
-
ఇక సభల హోరే..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరపడింది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలుపుకొని మొత్తం 62 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలారు. పటాన్చెరు నియోజకవర్గంలో అత్యధికంగా 16 మంది పోటీ పడుతుండగా, అందోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఎనిమిది మంది మాత్రమే పోటీలో ఉన్నారు. ఇక ఎన్నికలకు కొద్దిరోజులే మిగిలుండడంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించనున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ఇక ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించాయి. వీలైనంత మేరకు విస్తృతంగా జనాల్లోకి వెళ్లేలా అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుండగా మిగిలిన పార్టీల్లో ఎలా ముందంజ వేయాలా అన్న సమాలోచనలు జరుపుతున్నారు. పటాన్చెరులో మహా కూటమి తరఫున కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు నామినేషన్ల స్క్రూటినీ అనంతరం స్వతంత్రులుగా బరిలో మిగిలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన సి.అంజిరెడ్డి, కొలన్ బాల్‌రెడ్డి, సపాన్‌దేవ్, శశికళ, షేక్ అబ్దుల్ ఘనీతో పాటు టీడీపీ టికెట్ ఆశించిన ఎడ్ల రమేశ్, కరికె సత్యనారాయణ బరి నుంచి తప్పుకున్నారు. బీజేపీ టికెట్ ఆశించిన గాలి వెంకటగిరి కూడా పార్టీ బుజ్జగించడంతో తన అభ్యర్థిత్వం ఉపసంహరించుకున్నారు. తన అభ్యర్థిత్వం ప్రకటించింది మొదలు శరవేగంతో కదిలిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు. అందోలులో బీఎస్పీ తరపున నామినేషన్ వేసిన అల్లారం రత్నయ్య చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక ప్రచార పర్వంలోకి..! నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ముగియడంతో వివిధ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. నాలుగు ప్రధాన పక్షాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎల్పీతో చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో మిగిలారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా పరి«ధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 25న నారాయణఖేడ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల షెడ్యూలు ఖరారు కానప్పటికీ, అభ్యర్తులు తమ నియోజకవర్గాల్లో ప్రచార షెడ్యూలును సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవకవర్గం బరిలో ఉన్న అభ్యర్థులు జహీరాబాద్ (ఎస్సీ) 14 పటాన్చెరు 16 సంగారెడ్డి 14 అందోలు (ఎస్సీ) 08 నారాయణఖేడ్ 10 మొత్తం 62 -
మెదక్‌లో లెక్క తేలింది..
ఎన్నికల ప్రక్రియలో రెండు ప్రధాన ఘట్టాలు ముగిసాయి. దీంతో రెండు స్థానాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులెవరో ఖరారయింది. మెదక్, నర్సాపూర్ నుంచి మొత్తం 31 నామినేషన్లు దాఖలయ్యాయి. స్క్రూటినీలో తిరస్కరించినవి, అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత ఆ సంఖ్య 19గా తేలింది. ఇప్పుడు అందరి దృష్టి మెదక్ నుంచి పోటీలో ఉన్న అన్నదమ్ములు శశిధర్‌రెడ్డి, ఉపేందర్రెడ్డిలపైనే ఉంది. ప్రత్యర్థులెవరో తేలడంతో అభ్యర్థులు వారి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా కేవలం పట్టుమని పదిహేను రోజులు కూడా లేవు. ఈ కొద్ది సమయంలో విజయం సాధించడానికి అన్ని రకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందరూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సాక్షి,మెదక్ : ,మెదక్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. 19 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. మెదక్ స్థానం నుంచి పన్నెండు, నర్సాపూర్ నుంచి ఏడుగురు పోటీలో ఉన్నారు. మెదక్ స్థానం నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఆయన తరఫున న్యాయవాది బాలయ్య మెదక్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వీరబ్రహ్మచారికి నామినేషన్ ఉపసంహరణ పత్రాలను అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డి విత్‌డ్రా చేసుకుంటారని ప్రచారం జరిగినా.. ఆయన నామినేషన్ ఉపసంహరించుకోలేదు. దీంతో మెదక్ నియోకజవర్గం నుంచి అన్నదమ్ములు ఉపేందర్‌రెడ్డి(కాంగ్రెస్), శశిధర్‌రెడ్డి(ఎన్సీపీ) పోటీలో ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు యాదగిరి, పుర్ర ఊశయ్య నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి అమ్మారెడ్డిగారి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి అశోక్‌కుమార్, ఎన్సీపీ నుంచి శశిధర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీల నుంచి ఐదుగురు అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులున్నారు. నర్సాపూర్ నుంచి ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి, బీజేపీ నుంచి గోపీ, బీఎస్పీ నుంచి సోమన్నగారి లక్ష్మీ, సీపీఎం నుంచి మల్లేశం పోటీ చేయనున్నారు. వీరితోపాటు మనపార్టీ తరఫున దిగంబర్ ముదిరాజ్, స్వతంత్ర అభ్యర్థి నవీన్ పోటీలో ఉన్నారు. ఆసక్తిగా అన్నదమ్ముల పోటీ.. మహాకూటమిలో మెదక్ టికెట్ దక్కించుకున్న టీజేఎస్ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను టీజేఎస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి ఇచ్చారు. అయితే కాంగ్రెస్ తరఫున ఉపేందర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి బీఫామ్ అందజేసింది. పొత్తు ధర్మం పాటించని కాంగ్రెస్ వైఖరిపై టీజేఎస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయింది. కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని టీజేఎస్ కోరినప్పటికీ స్నేహపూర్వక పోటీ పేరిట ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ నిరాకరించంది. దీంతో టీజేఎస్ అభ్యర్థి పోటి నుంచి తప్పుకోవాని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ వైఖరి వల్లే తాను పోటీలో నుంచి తప్పుకున్నానని, భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తారని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ముందుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి తన çసోదరుడైనా ఆయన నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిరాకరించారు. అన్నదమ్ముళ్లు ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఊపందుకోనున్న ఎన్నికల ప్రచారం ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఎన్నికలకు ఇంకా రెండు వారాలు సమయం ఉండటంతో అభ్యర్థులంతా ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రధాన రాజకీయపార్టీల అభ్యర్థులు స్టార్ క్యాంపెయినర్లను రంగంలో దింపేందుకు సిద్ధం అవుతున్నారు నర్సాపూర్ నియోకజవర్గం.. అభ్యర్థి పేరు పార్టీ చిలుముల మదన్‌రెడ్డి టీఆర్ఎస్ వాకిటి సునీత కాంగ్రెస్ అజ్జమర్రి మల్లేశం సీపీఎం సింగాయపల్లి గోపి బీజేపీ సోమన్నగారి లక్ష్మి బీఎస్పీ మన్నె దిగంబర్ ముదిరాజ్ మన పార్టీ నవీన్ స్వతంత్ర -
త్వరలో రైలు కూత
మెదక్ మున్సిపాలిటీ: వలస వాద పార్టీలతో పొత్తు పెట్టుకున్న లైన్‌లైని కూటమి ప్రజలకేం చేస్తుందని, ప్రజలకోసం పనిచేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. బుధవారం మెదక్ పట్టణంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పద్మాదేవేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్ సహకారంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారన్నారు. ఇందిరాగాంధీ మొదలుకొని ఎందరో హామీలిచ్చినా మెదక్ జిల్లా కేంద్రంగా ఏర్పడలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో జిల్లా ఏర్పాటు కలను నెరవేర్చుకున్నామన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఆగిపోలేదని, పద్మాదేవేందర్‌రెడ్డి నాయత్వంలో జిల్లాకు రైల్వేలైన్ కూడా పూర్తి కానుందన్నారు. రెండు, మూడు నెలల్లో మెదక్‌కు రైలు కూత వినిపించబోతుందన్నారు. అలాగే మెదక్‌కు ఇటీవలే రింగురోడ్డు మంజూరైందని, చేగుంట నుంచి మెదక్‌కు వచ్చే పూర్తిగా గుంతలమయంగా ఉండేదని, ప్రస్తుతం ఆ రోడ్డుపై వస్తుంటే ఏయిర్‌పోర్టులో రన్‌వే మీద వెళ్తున్నట్లుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక చెక్‌డ్యాం కూడా నిర్మించలేదని, 21వేల ఎకరాలకు నీరందించాల్సిన ఘనపురం ఆనకట్ట కాంగ్రెస్ హయాంలో 10వేలకు పడిపోయిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద కోట్లతో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు, కాల్వల మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో ఘనపురం ఆనకట్ట నీళ్లు కావాలంటే పాపన్నపేట రైతులు పత్రాలు పట్టుకొని హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కాని టీఆర్ఎస్ హయాంలో పద్మాదేవేందర్‌రెడ్డి ఒక ఫోన్‌చేస్తే సీఎం కేసీఆర్ స్పందించి రెండు పంటలకు నీటి విడుదల చేయించారన్నారు. రూ.2కోట్లతో మెదక్‌లో రైతు బజార్, స్థానిక పిట్లం చెరువులో రూ.9కోట్లతో మినీ ట్యాంకుబండ్ నిర్మించడం జరుగుతుందన్నారు. పాపన్నపేట రైతులు మాకు మార్కెట్ యార్డు కావాలి...జోగిపేట, మెదక్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని పద్మాదేవేందర్‌రెడ్డి కోరగానే రూ.3కోట్లతో మార్కెట్ యార్డు గోదాములు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆరవై యేళ్ల పాలనలో ఏడుపాయల దుర్గమ్మకు కేవలం పట్టు వస్త్రాలను మొక్కుబడిగా సమర్పించారే తప్ప రాష్ట్రప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఏడుపాయల అభివృద్ధికి ప్రతియేడు కోటి రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 50శాతం పనులు పూర్తయ్యాయన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు రామాయంపేటను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతోపాటు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్‌కు మహిళా డిగ్రీ కళాశాల సా«ధించిన పద్మాదేవేందర్‌రెడ్డిదేనన్నారు. చరిత్రలో ఎన్నడులేని విధంగా మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డి గెలుస్తుందన్నారు. మహా కూటమి మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డినే గెలిపించాలని ప్రజలను కోరారు. -
మాకు ‘పోటీ’ లేదు
నేనూ రైతునే.. కాపుదనపు బిడ్డనే.. నా పొలంలోనూ మోటార్లు కాలిపోయాయి. కాంగ్రెస్, టీడీపీ పాలనలో కరెంటు కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డం. వాళ్ల పాలనలో ప్రజలను ఏడిపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయం, పరిశ్రమలతోపాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నం. కరెంటు సరఫరాలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉంది. సాక్షి, మెదక్: మెదక్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి పోటీయేలేదని, లక్ష మెజార్టీతో పద్మాదేవేందర్‌రెడ్డిని గెలిపిస్తే ఉన్నతమైన స్థానం ఆమెకు లభిస్తుందని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మెదక్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన ప్రజా ఆశీర్వాద బహిరంగసభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడుతూ పద్మాదేవేందర్‌రెడ్డి చురుగ్గా పనిచేసే మహిళా నాయకురాలని, పద్మాదేవేందర్‌రెడ్డిని మళ్లీ గెలిపిస్తే మెదక్‌ను వరుసబెట్టి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. మెదక్‌లో ఇది వరకే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు సాగుతున్నట్లు వివరించారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాల దశల్లో ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మెదక్‌కు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు వస్తాయని హామీ ఇచ్చారు. ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు.. 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే తాను మెదక్ జిల్లాను ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం కాకపోయుంటే జన్మలో మెదక్ జిల్లా ఏర్పాటు అయ్యేది కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఘనపురం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాయన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఘనపురం కాల్వల దుస్థితిని కళ్లారా చూసి వాటిని అభివృద్ధి చేసే కొత్త ప్రయత్నం చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఘనపురం ప్రాజెక్టును, కాల్వలను అభివృద్ధి చేసినట్లు వివరించారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. వచ్చే ఏడాది జూన్ నెలలో కాళేశ్వరం నీళ్లు జిల్లాకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి కోరిక మేరకు మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసినట్లు చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు మొత్తాన్ని రూ.2016 కు పెంచనున్నట్లు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు. బలహీనవర్గాలు దళితులు, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో నీటిపారుల శాఖ మంత్రి హరీశ్‌రావు, జెడ్పీచైర్మన్ రాజమణి మురళీయాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ఉమాదేవి, ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నేతలు దేవేందర్‌రెడ్డి, మురళీయాదవ్, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: పద్మాదేవేందర్‌రెడ్డి గత ఎన్నికల్లో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తానని హామీ నిచ్చిన కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. అలాగే జిల్లా కేంద్రంతోపాటు కలెక్టరెట్‌ను మంజూరు చేశారని తెలిపారు. మహా కూటమి కుమ్ములాటలతోనే ఉందన్నారు. ఆ కూటమిలో నుంచి ఎవరు నిలబడ్డారో వారికే తెలియడం లేదన్నారు. అలాంటి కూటమికి అడ్రస్ లేకుండా తరిమి కొట్టాలన్నారు. అక్కా చెలెల్లు, అన్నా దమ్ములు ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ రాజమణి, మాజీ ఎమ్మెల్యేలు ముత్యంరెడ్డి, కరుణం ఉమాదేవి, మెదక్ మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ అర్బన్: సాయంత్రం 4 గంటలకు రావాల్సిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం 5.49 గంటలకు వచ్చారు. కేసీఆర్ వస్తున్న హెలీక్యాప్టర్‌ను చూసి ప్రజలు, కార్యకర్తల నినాదాలు, చప్పట్లు, ఈలలతో కేరింతలు కొట్టారు సభావేదిక మీదకు కేసీఆర్ 5.56 గంటలకు చేరుకొని... 5.58 గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. కేసీఆర్ సభా వేదిక వద్దకు చేరుకోగానే మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. కేసీఆర్ హెలీక్యాప్టర్ దిగగానే మాజీ మంత్రి హరీష్‌రావు, టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి హెలీప్యాడ్ వద్దకు పరుగెత్తుకు వెళ్ళి వేదిక వద్దకు తీసుకువచ్చారు. కేసీఆర్ పద్మ నా బిడ్డ... 2014 ఎన్నికల్లో గెలిపించారు. మళ్లీ గెలిపించండి అని అనడంతో కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నినాదాలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందు వేదికపై కళాకారుల ఆటపాటలు సభికులను ఆకట్టుకున్నాయి. వీరు మెదక్ అభివృద్ధిపై పాటలు పాడి అలరించారు. టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు మందుగుల గంగాధర్ వేదికపై పాడిన పాటలు అలరించాయి. చిన్నశంకరంపేట మండలం రామాయిపల్లి నుంచి బోనంతో వచ్చిన మహిళ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి కోడలు దీపిక, తల్లిదండ్రులతో కలిసి టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు వచ్చారు. మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి మాజీ మంత్రి కరణం రామచంద్రారావు సతీమణి కరణం ఉమాదేవిని స్వయంగా వేదికపైకి తీసుకెళ్లారు. ‘‘కాళేశ్వరం నీళ్లు వస్తే హల్ధీ, మంజీరాలు ఎన్నటికీ ఎండిపోవు. ఆ నీళ్లతో తూర్పుగోదావరి, డెల్టా ప్రాంతలకంటే మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది. ఇది జరిగితే బంగారు తెలంగాణ వచ్చినట్లే.’’ ‘‘రైతులు, ప్రజలకు మేలు చేసే పార్టీని గెలిపించాలి. పొరపాటున కాంగ్రెస్ అ«ధికారంలోకి వస్తే కరెంటు ఆగమైతది. తాగు, సాగునీరులో ఇబ్బందులు వస్తయి. ఎన్నికల సమయంలో ఎవరో ఏదో చెబితే ప్రజలు నమ్మొద్దు. మెదక్ ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి.’’ ‘‘ఎన్నికల్లో ఏం ఫలితం వస్తుందోనని మెదక్ నియోజకవర్గంలో సర్వే చేయించిన. పద్మాదేవేందర్‌రెడ్డికి 64 శాతం అనుకూలత ఉంటే, ఇతరులకు 20 నుంచి 30 శాతం ఉంది. మెదక్‌లో ప్రత్యక్షంగా పోటీ ఉన్నప్పుడే అలా ఉంటే.. ఇప్పుడే జోకర్, బ్రోకర్ కథ అయ్యింది. పద్మను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలి.’’ -
జోరుమీదున్న ‘కారు’
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగియడంతో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తారని.. రోడ్‌షోలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రోడ్‌షోలు ముగిసిన అనంతరం డిసెంబర్ 3న పరేడ్‌గ్రౌండ్‌లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఈ రోడ్‌షోలు ఉంటాయని వివరించారు. వీలును బట్టి రోడ్‌షోల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల దాకా కేటీఆర్‌తో టౌన్ హాల్ మీటింగ్స్ ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుం చి రోడ్‌షోలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోడ్‌షోల వివరాలు.. ఈ నెల 22న ఉప్పల్, కంటోన్మెంట్, 23న మహేశ్వరం, ఎల్బీనగర్, 24న జూబ్లీహిల్స్, సనత్‌నగర్, 25న విరామం, 26న గోషామహల్, ఖైరతాబాద్, 27న రా జేంద్రనగర్, శేరిలింగంపల్లి, 28న అంబర్‌పేట, ము షీరాబాద్, 29న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని రామ్మోహన్ తెలిపారు. సమన్వయ కమిటీ సభ్యులు వీరే.. జీహెచ్ఎంసీ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఇందులో బొంతు రామ్మోహన్ (జీహెచ్ఎంసీ మేయర్), పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (రాష్ట్ర కార్యదర్శి), గ్యాదరి బాలమల్లు (ప్రధాన కార్యదర్శి), మారెడ్డి శ్రీనివాసరెడ్డి (ప్రధాన కార్యదర్శి), నేవూరి ధర్మేందర్‌రెడ్డి (రాష్ట్ర యువజన సమన్వకర్త), వై.సతీశ్‌రెడ్డి (యువజన ప్రధాన కార్యదర్శి)లు సభ్యులుగా ఉన్నారు. -
ఇక ప్రచార ‘హోరు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి ఘట్టానికి తెరలేచింది. నామినేషన్ల ఘట్టం ముగిసిన నేపథ్యంలో ఇక రాష్ట్రం మొత్తం ప్రచారంతో హోరెత్తనుంది. జాతీయస్థాయి నేతల సభలు, ప్రసంగాలతో రాష్ట్రంలో రెండువారాలపాటు ఎన్నికల సందడి నెలకొననుంది. ఎన్నికల ప్రచారంలో మొదటి నుంచీ ముందున్న అధికార టీఆర్ఎస్ పక్షాన ఆ పార్టీ అధినేత కేసీఆర్ తన మలివిడత ప్రచారంలోనూ ఇప్పటికే ఆరుచోట్ల సభలను పూర్తి చేసుకోగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి పక్షాలు, బీజేపీ, సీపీఎంలతో పాటు అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మొత్తమ్మీద వచ్చేనెల 5 వరకు రాష్ట్రం ప్రచారంలో మునిగిపోనుంది. కారు జోరు... ఈ ఏడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వాన్ని రద్దుచేసిన మరుసటి రోజే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రచారాన్ని ప్రారంభించారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత కొంతకాలం ప్రచారానికి దూరం గా ఉన్న ఆయన.. ఈ నెల 19 నుంచి నియోజకవర్గస్థాయి సభలకు శ్రీకారం చుట్టారు. 19న ఖమ్మం, పాలకుర్తి, 20న సిద్ధిపేట, హుజూరాబాద్, సిరిసిల్ల, ఎల్లారెడ్డిలలో సభలు నిర్వహించిన కేసీఆర్.. ఈనెల 25వరకు ఈ ప్రచారాన్ని కొనసాగించనున్నారు. ఈ వారం రోజుల్లో ఆయన మొత్తం 31 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత మలివిడత షెడ్యూల్ ఖరారు కానుంది. దశలవారీగా కాంగ్రెస్... కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల శంఖారావాన్ని అక్టోబర్‌లోనే పూరించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేత సభలు, సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఇప్పటికే ప్రచారం చేసింది. ఈనెల 23న మేడ్చల్‌లో సోనియా, రాహుల్‌లతో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. కాంగ్రెస్ పక్షాన మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేయనున్నారు. రాహుల్, బాబు మళ్లీ ఒకే వేదికపై... రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈనెల 23న మేడ్చల్‌లో సభ తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో మరోమారు రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. ఆయన హాజరయ్యే ఈ సభలకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రానున్నారు. అనంతరం చంద్రబాబు టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుహాసిని తరఫున బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ, అమిత్‌షా కూడా... బీజేపీ కూడా జాతీయ నేతలతో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఒక విడత రాష్ట్ర పర్యటనను ముగించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. ఈనెల 25, 27, 28 తేదీల్లో మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చేనెల 3, 5 తేదీల్లో జరిగే సభలకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాల అగ్రనేతలు కూడా... సీపీఐ అభ్యర్థులు పోటీచేసే స్థానాల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, అగ్రనేతలు డి.రాజా, నారాయణ కూడా ప్రచారానికి వస్తారని తెలుస్తోంది. బీఎల్ఎఫ్ కూటమిగా బరిలో ఉన్న సీపీఎం అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు. -
364 నామినేషన్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు వెల్లువెత్తాయి. కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం 305 మంది అభ్యర్థులు 364 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు వరుస కట్టారు. ఈ ఒక్కరోజే అత్యధికంగా 180 మంది అభ్యర్థులు 231 సెట్లను ఆర్ఓలకు అందజేశారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు సందర్భంగా భారీగా జనసమీకరణ చేశారు. పోటాపోటీగా జనాలను తరలించి బలప్రదర్శన చేశారు. నామినేషన్ల దాఖలుతోనే తామేమిటో తెలియజేయాలనే తపన దాదాపు అందరిలోనూ కనిపించింది. కార్లు, బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. కళా బృందాలను సైతం రంగంలోకి దించాయి. శ్రేణులు భారీ జెండాలు చేతబట్టి ఉర్రూతలూగాయి. గ్రామాల నుంచి మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు అక్కడక్కడా సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల ముఖ్యనాయకులు కూడా నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. అత్యధికంగా ఎల్బీనగర్లో.. ఎల్బీనగర్ నియోజకవర్గానికి అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి మొత్తం 58 మంది తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఆ తర్వాత స్థానంలో శేరిలింగంపల్లికి 49 దాఖలయ్యాయి. అతి స్వల్పంగా చేవెళ్ల స్థానానికి 25 నామినేషన్లు అందాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా భారీగానే నేమినేషన్లు వేశారు. కాగా, మంగళవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. -
అధికారమే ‘హస్తం’ లక్ష్యం
రాష్ట్రంలో అధికారాన్ని ‘హస్త‘గతం చేసుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ.. అందుకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. నేడు నామినేషన్ల ప్రక్రియ పూర్తికానుండడంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించింది. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలతో పాటుగా ఛరిష్మా ఉన్న నేతలతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఈనెల 28న వికారాబాద్, తాండూరులో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ స్థాయిల్లోనే బహిరంగ సభలను నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఎక్కువమందిని తరలించడంతోపాటు నాయ కులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటోంది. సోమవారం నామినేషన్లు ముగిసిన అనంతరం బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈనెల 23నుంచి రాష్ట్రంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సభలను ఏర్పాటుచేయాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల కేంద్రాల్లో 28న బహిరంగసభలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అధిష్టానం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటించింది. 28న నిర్వహించే సభల్లో సోనియాగాంధీ పాల్గొంటారా.. లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. వచ్చే నెల 2 నుంచి రెండు, మూడు రోజులపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొననున్నారు. ఈనేపథ్యంలో ఆయన కొడంగల్, పరిగిలో సభలను ఏర్పాటు చేసేందుకు నేతలు చర్యలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్‌లో నిర్వహించే సభలో రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం మెండుగా ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈనెల 20 తరువాత రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ప్రచారం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ప్రచారం ప్రక్రియ వచ్చే నెల 5న ముగిసేవరకు నిత్యం కొనసాగనుంది. విజయశాంతి ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, సినీనటి విజయశాంతి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితర ముఖ్యులు ప్రచారంలో పాల్గొనని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేసే అవకాశముందని తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది స్టార్డమ్ ఉన్న నేతలు, సినీ, సామాజిక రంగాల ప్రముఖులతో ప్రచారం నిర్వహించేలా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు కేవలం 20 రోజులే సమయం ఉన్నందువల్ల ప్రచారంలో దూకుడు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలోని అన్ని స్థానాల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. ప్రచారంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఉండాలని అభ్యర్థులకు సూచిస్తోంది. అయితే, తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రోహిత్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతోపాటు ఆయన వర్గంనేతలను బుజ్జగించే పనిలో పార్టీ పెద్దలు నిమగ్నమయ్యారు. నారాయణరావు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నా.. ఇతర సీనియర్ నాయకులు అభ్యర్థికి సహకరించకపోయినా గెలుపు కష్టమేననే సంకేతాలు ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చేరినట్లు నేతలు చెబుతున్నారు. -
మోదీ పాలన జనరంజకం
సాక్షి, కడ్తాల్: ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, ప్రజలంతా మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని రేషన్ డీలర్ల సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఆచారికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రహ్లాద్ మోదీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ సంక్షేమ పథకాల పేరిట, ప్రజలను మభ్యపెట్టి అన్యాయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబపాలన సాగుతోందని దుయ్యబట్టారు. తన సోదరుడు దేశ ప్రధానిగా కొనసాగుతున్నా ఇప్పటికీ తాను రేషన్‌డీలర్‌గా ఉన్నానని తెలిపారు. దేశంలో రేషన్ డీలర్లకు కిలోకు 70 పైసలు కమీషన్ ఇస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం 20పైసలే ఇస్తున్నారని, డీలర్లు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశ్యంతో ప్రధాని రేషన్ డీలర్ల కమీషన్‌ను 70 పైసలకు పెంచారని గుర్తు చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రేషన్ డీలర్లను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఉద్యోగాలు కల్పించక, నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. సేవకుడిగా పనిచేస్తా: ఆచారి 35 ఏళ్లుగా కల్వకుర్తి నియోజకవర్గ సమస్యలపై పోరాడుతునే ఉన్నానని, తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సేవకుడిగా పనిచేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి కోరారు. రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ అంటూ మాటలకే పరిమితమైందని ధ్వజమెత్తారు. దేశంలో మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అనంతరం ఆచారి సమక్షంలో ఎర్రోల శంకర్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిప్రసాద్, ఎంపీటీసీ వీరయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, ఆనంద్, డాక్టర్ రమేశ్ ఉన్నారు. -
నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేసిన రాహుల్
-
వైరల్ : అచ్చం మోదీలాగా రాహుల్‌గాంధీ..!
మోరేనా : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచార హోరు పెంచారు. భారీ బహిరంగ సభల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మోరేనాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ నరేంద్రమోదీ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. మోదీ హవాభావాలతో ప్రసంగిస్తూ.. ‘మిత్రులారా..! నన్ను ప్రధాన మంత్రి అని పిలవకండి. వాచ్మెన్ అని పిలవండి’ అంటూ తియ్యగా మాట్లాడి నరేంద్ర మోదీ ప్రజల్ని మభ్యపెడతాడని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రజలను మిత్రులారా అని పేర్కొంటూ రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో వేల కోట్లు ఎగవేసిన మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలకు ‘సోదరుడి’గా వ్యవహరిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. కాగా, రాఫెల్ డీల్‌లో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం కల్పించిందనే ఆరోపణలతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఇక నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ వరసగా మూడు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ నుంచి అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలను రచిస్తోంది. -
నేడు రాష్ట్రానికి అమిత్ షా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. శనివారం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్‌నగర్‌లో ప్రారంభమయ్యే బీజేపీ ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, పదాధికారులతో సాయంత్రం 6:30 గంటలకు శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో భేటీæ కానున్నారు. వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. రోజంతా బిజీబిజీగా: ఈ నెల 15న రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా రోజంతా బిజీబిజీగా గడపనున్నారు. పార్టీ నిర్వహించే బహిరంగ సభకు హాజరవడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత 12 గంటలకు బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు లాల్‌దర్వాజ సింహవాహిణి మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. వీలైతే అక్కడ కొద్దిసేపు మాట్లాడి, ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది. మజ్లిస్‌కు కంచుకోట వంటి ఓల్డ్ సిటీలో దైవ దర్శనం చేసుకుని ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం ద్వారా రాజకీయ వేడిని పుట్టించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తర్వాత రోడ్ మార్గంలో అమిత్ షా మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్తారు. తెలంగాణలో తమ పార్టీ వైఖరి.. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామన్న అంశాలపై బహిరంగ సభలో స్పష్టత ఇవ్వనున్నారు. బహిరంగ సభ తర్వాత సాయంత్రం 6:30 గంటలకు శంషాబాద్ సమీపంలోని కొత్తూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించనున్నారు. గత జూలై 13న రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కేవలం సంస్థాగత విషయాలపైనే దృష్టి పెట్టిన అమిత్ షా ఈ పర్యటనతో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. షెడ్యూలు ఇలా.. ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రాక 12 గంటలకు బీజేపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ 1.45 గంటలకు లాల్‌దర్వాజ గుడికి రాక 3 గంటలకు మహబూబ్‌నగర్ బహిరంగ సభకు హాజరు 6 నుంచి 8 గంటల వరకు కొత్తూరులో ఆఫీస్ బేరర్స్‌తో సమావేశం 9 గంటలకు శంషాబాద్ నుంచి తిరుగు పయనం -
జార్ఖండ్‌లో ఐదుగురు మహిళలపై అత్యాచారం
-
రేపు గుజరాత్ తొలి దశ ఎన్నికలు
-
నేటితో ప్రచారం ముగింపు
– పట్టభుద్రుల నియోజకవర్గానికి 25 మంది.. –ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది పోటీ కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం మంగళవారం నాటితో పరిసమాప్తం కానుంది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో ప్రచారం చప్పగా సాగుతోంది. పట్టభద్రుల నియోజకవర్గానికి 25 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్ర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రచారంలో ముందు ఉన్నారు. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6గంటలకు ముగియనుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబందించి జిల్లా ఓటర్లు 82,591 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 6670 మంది ఉన్నారు. వీరికి ఇప్పటికే బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేశారు. కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓ కార్యాలయాల్లో ఎన్నికల సామాగ్రిని ఈ నెల 8న పంపిణీ చేయనున్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. -
మరో వివాదంలో విజయ్ కాంత్
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డిఎండికె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సహనం కోల్పోయిన విజయ్ కాంత్ పాత్రికేయులపై ఆగ్రహంతో ఊగిపోయారు. చెంప దెబ్బ కొడతానంటూ బెదిరించి మరో వివాదానికి కేంద్రంగా మారారు. అయితే ఆయన జర్నలిస్టులపై విరుకుచుపడడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డిఎండీకె, పీడబ్ల్యూఎఫ్ కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బరిలో ఉన్న విజయకాంత్ ఉల్లుందూర్ పేట్ నుంచి పోటీ చేస్తున్నారు. -
ప్రత్యేక ఆకర్షణగా హేమమాలిని
రంగంలోకి కేంద్ర మంత్రులు నేడు తిరుచ్చికి అమిత్ షా భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం కదిలిన ప్రచార రథాలు అసెంబ్లీలో ప్రతినిధులు అడుగు పెట్టడం లక్ష్యంగా తమిళనాట విస్తృత పర్యటనకు కమలం పెద్దలు సిద్ధమయ్యారు. ఐదుగురు కేంద్ర మంత్రుల ఎన్నికల ప్రచార పర్యటన రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. ఇక సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. ఇక, తమిళనాట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సిద్ధమయ్యారు. తిరుచ్చి వేదికగా బుధవారం అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. చెన్నై : రాష్ట్రంలో చిన్న పార్టీలతో కలసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధ పడ్డ విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే విధంగా ఎన్నికల్లో కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. ఇప్పటికే బీజేపీకి చెందిన 90 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయా అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నంలో దూసుకెళుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టడం లేదా, తమ ప్రతినిధులు ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టడం లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి కమలం పెద్దలు సిద్ధమయ్యారు. తమిళనాడు మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమయ్యారు. రంగంలోకి పెద్దలు : ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు తమిళనాట ప్రచారానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. తమకు గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్ని గురి పెట్టి వీరి ప్రచారం సాగేందుకు తగ్గ కార్యచరణ సిద్ధం అవుతున్నది. ఇక, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గట్కారి, సృతి ఇరాని, వెంకయ్య నాయుడు, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్ ఇక తమిళనాట తిష్ట వేయనున్నారు. పదే పదే వీరి ప్రచార పర్యటనకు సాగబోతున్నాయి. ఇందుకు తగ్గ ప్రచార రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. అలాగే, బీజేపీ ఎంపీ హేమమాలిని కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో పర్యటించేందుకు నిర్ణయించి ఉన్నారు. బీజేపీఅధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, ఉపాధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ పోటీ చేయనున్న నియోజకవర్గాలు హేమామాలిని ప్రత్యక ఆకర్షణగా నిలవబోతున్నారు. నేడు అమిత్ షా రాక : తమిళనాట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిద్ధమయ్యారు. బుధవారం తిరుచ్చి వేదికగా ఆయన ప్రచార బహిరంగ సభ జరగనున్నది. బీజేపీ, మిత్ర పక్షాల అభ్యర్థులను ఈ వేదిక మీద నుంచి ఓటర్లకు ఆయన పరిచయం చేయనున్నారు. అమిత్ షా రాక కోసం తిరుచ్చి మన్నార్ పురం ఆర్మీ మైదానం సిద్ధమైంది. బుధవారం ఉదయం పదిన్నర గంటలకు తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌షాకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. అక్కడి నుంచి రేస్ కోర్స్ రోడ్డులోని ఎస్ఆర్ఎం హోటల్‌కు అమిత్ షా చేరుకుంటారు. మిత్ర పక్షాల నాయకులు, అభ్యర్థులతో సమావేశం అవుతారు. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా రాకతో భారీ జన సమీకరణ దిశగా బీజేపీ వర్గాలు పరుగులు తీసి ఉన్నాయి. ఇక, బీజేపీ ఎన్నికల ప్రచార రథాలు చెన్నై నుంచి మంగళవారం కదిలాయి. ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన యాభై ప్రచార రథాలను బీజేపీ సిద్ధం చేసింది. తాంబరంలో జరిగిన కార్యక్రమంలో ఎనిమిది ప్రచార రథాలను జెండా ఊపి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు సాగనంపారు. కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ ప్రచారంలో మంత్రి కేటీఆర్
-
ఎన్నికలు బిహార్‌లో.. ప్రచారం పంజాబ్‌లో
చండీగఢ్: బిహార్‌లో ఎన్నికల సమరం ఊపందుకోగా పంజాబ్ ఎన్నికల ప్రచారంతో మారుమోగిపోతోంది. అదేంటి బిహార్‌లో ఎన్నికలు వస్తే పంజాబ్‌లో ప్రచారమేమిటీ, పంజాబ్‌లో అప్పుడే ఎన్నికలు వచ్చాయా అని అనుకుంటున్నారా.. మరేం లేదు. బిహార్‌కు చెందిన వారంతా దేశంలోని పలు రాష్ట్రాలు ప్రాంతాలతో పోలిస్తే పంజాబ్‌లోనే వివిధ పనుల్లో ఉండిపోయారంట. దీంతో నాయకులు, వారి తరుపు ప్రచార కార్యకర్తలు అంతా పంజాబ్ వీధుల వెంట బారులు తీరి తమ అభ్యర్థులకే ఓటెయ్యాలంటూ ప్రచారం దంచి కొడుతున్నారు. ముఖ్యంగా ఎలాగైనా బిహార్ అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న ఊపుతో ఉన్న బిజేపీ పంజాబ్‌లో చలో బీహార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే వేగంతో కాంగ్రెస్, జేడీయూ కూడా ఓటర్లను బీహార్‌కు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. పంజాబ్ లో దాదాపు 20లక్షలమంది బిహారీలు పంజాబ్ లో ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. -
ప్రచారంలో దూసుకుపోతోన్న ఆప్...బిజెపి
-
చత్తీస్ఘఢ్లో ముగిసిన ఎన్నికల ప్రచారం