
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి డా.గురుమూర్తి పాల్గొన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు.
రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు.
చదవండి:
లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి
‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’
Comments
Please login to add a commentAdd a comment