Bumana Karunakar Reddy
-
హిందూ సమాజంలో బాబు నేరస్తుడయ్యాడు: భూమన
తిరుపతి, సాక్షి : టీటీడీ లడ్డూపై ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా, సీఎం చంద్రబాబు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. ఎల్లో మీడియాలో వచ్చిన కధనంపై స్పందిస్తూ మాట్లాడిన భూమన.. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం ప్రధానిని కలుస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు, ఆయన దగ్గరకు వెళ్లినప్పుడు తిరుపతి లడ్డూ ఇస్తూ.. ‘ఇది కల్తీ లడ్డూ కాదు సార్. ఇది సిసలైన స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది’ అని చెబితే.. ‘బాబు చమత్కారానికి మోదీగారు విరగబడి నవ్వారట’..అని చెప్పారు. దీని వల్ల చంద్రబాబు దుర్భుద్ధి మరోసారి బట్టబయలైందని ఆయన వెల్లడించారు.తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపనున్న నేపథ్యంలో, ప్రధాని మోదీతో పాటు, సీబీఐని ప్రభావితం చేసేలా చంద్రబాబు మాట్లాడారని, సిట్ నివేదిక తనకు అనుకూలంగా తెచ్చుకునేలా ఆయన కుట్ర చేశారని, అందుకే లౌక్యంగా ప్రధానిని వాడుకున్నారని భూమన ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు అదేపనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో తిరుమల వైభవంలో ఎక్కడా తప్పు జరగలేదని, ఆ వైభవానికి భంగం వాటిల్లలేదని తేల్చి చెప్పారు. దీనిపై పీఠాధిపతులతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన, చంద్రబాబుకు దమ్ముంటే తన సవాల్‌కు స్పందించాలని కోరారు. లడ్డూ స్వీకరించిన సమయంలో ప్రధాని నవ్విన నవ్వుకు శతవిధాల అర్థాలుంటాయన్న భూమన, సర్వోన్నత న్యాయస్థానం లడ్డూ వివాదంపై మాట్లాడకూడదన్నా, సీఎం ప్రధాని వద్ద ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అసలు నివేదిక రాకుండా, ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండానే, విచారణ జరగకుండానే, బాబు ఎలా మాట్లాడుతారని నిలదీశారు. లడ్డూ ఇస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మోదీ ఆయనను మందలించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లడ్డూపై తప్పుడు ప్రకటన చేయడమే కాకుండా దేశ ప్రధానిని కూడా తప్పు దారి పట్టించేలా చంద్రబాబు వ్యవహారం ఉందని భూమన ఆక్షేపించారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు మాట్లాడింది తప్పు అని దేశమంతటా ధర్మ ఘోష చేస్తే, ప్రధాని ముందు భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా ఆయన వ్యవహరించారని గుర్తు చేశారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అదే పనిగా ప్రయత్నించడంలో భాగమే ప్రధాని వద్ద సీఎం వ్యాఖ్యాలని అభివర్ణించారు. ఏదేమైనా సిట్ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న టీటీడీ మాజీ ఛైర్మన్, గత ప్రభుత్వ హయాంలో తాను కానీ, తన కంటే ముందు ఛైర్మన్‌గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి కానీ ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ‘రాజీవనేత్రుని వద్ద తప్పులు చేస్తే తట్టుకోవడం ఎవరికీ సాథ్యం కాదు. స్వామి భక్తుడినని చెప్పుకునే చంద్రబాబు శ్రీవారి లడ్డూపై ఆరోపణలు చేయడం, స్వార్థ రాజకీయం కోసం దాన్ని పదే పదే వాడుకోవడం సమంజసం కాదు. ప్రాణం కాపాడిన పరామాత్మడితో బాబు పరాచికాలు ఆడితే ఆ పైశాచిక చేష్టకు ఫలితం ఎలా ఉంటుందో ఆ దేవదేవుడే నిర్ణయిస్తాడు. లడ్డూ కల్తీ ఆరోపణలు తీవ్రమైన నేరం. హిందూ సమాజంలో దృష్టిలో చంద్రబాబు ఓ నేరస్తుడిగా మిగిలిపోతారు’ అని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్: విజయసాయిరెడ్డి -
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. రమణ దీక్షితులుపై వేటు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశంలో బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు నీచాతినీచమైన ఆరోపణలు చేశారని, టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయర్లపై నిరాధార నిందలు వేశారని, దీంతో రమణ దీక్షితులును ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాగా, దేవస్థానం ఉద్యోగులకు బోర్డు శుభవార్త చెప్పింది. 4736 ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, 4200 కార్పొరేషన్ ఉద్యోగులతో కలిపి 9వేల మందికి జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. నడకదారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణం తిరుమల పెద్ద జీయర్‌స్వామి అనుమతి మేరకు, ద్వారపాలకులు అయినా జయవిజయలకు బంగారు తాపడం రూ.4 కోట్లతో తాళిబొట్లు తయారికి అంగీకారం పీఠాధిపతులు సదస్సులో సూచించిన సూచనలు ఆమోదం వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించే స్థలానికి రూ.8.16 కోట్లు తిరుచానూరు పద్మావతి అమ్మవాతి ఆలయాని విద్యుత్ అలంకరణలకు అమోదం భక్తుల సౌఖర్యార్థం శాశ్వత గోశాలకు బోర్డు మెంబర్ విరాళం ఎక్కవ సంఖ్యలో లడ్డు తయారికి సూపర్వైజర్ పోస్టుల కోసం ప్రభుత్వానికి లేఖ పాపవునాశానం వద్ద 682 మోటర్ పంపు సెట్లకు 3.18 కోట్లు ఆమోదం ఎంఏమ్ఎస్ సేవలు మూడు సంవత్సరాలు పోడొగింపు 1700 సంవత్సరాల చరిత్ర ఉన్న తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు అలిపిరి , గాలిగోపురం నరసింహ స్వామి ఆలయం వద్ద ఉన్న ముగ్గు బావి ఆధునీకరణ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచాలని నిర్ణయం బాలబాలికల్లో భక్తి పెంపొందించడానికి 99 లక్షలు పుస్తాల ముద్రణకు స్విమ్స్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి ఉచిత వైద్యం టీటీడీలో ఉన్న కాంట్రాక్టు, ఒఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్యాంటీన్లో రూ.10కే భోజనం అన్నప్రసాద కేంద్రం సూపర్ వైజర్ పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వానికి లేఖ ఇదీ చదవండి.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం -
తిరుమల: ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు
తిరుమల: సోమవారం నిర్వహించిన ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గో సంరక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణకు చర్యలు సహా 19 తీర్మానాలు చేసినట్లు స్ఫష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొత్త ఆలయాల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చిన్నారుల్లో భక్తిభావం పెంపొందించేందుకు తల్లులకు ధర్మబోధన శిక్షణ ఇవ్వాలని ధార్మిక సదస్సులో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యువతకు హిందూ ధర్మం తెలియజేయాలి.. పాఠశాల స్థాయిలో హిందూ ధర్మ ప్రచారం జరగాలని ధార్మిక సదస్సులో తీర్మానించారు. సప్తగిరులను జీవవైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలి.. 108క్షేత్రాలపై భక్తులకుఅవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక సంస్థలన్నీ టీటీడీతో కలిసి పనిచేస్తూ.. ప్రతి ఏటా ధార్మిక సదస్సులు జరగాలని తీర్మానించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: సమాజంలో మా గౌరవం పెరిగింది -
ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే.. టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయం పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయం వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయం కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం శ్రీవారి ఆలయ పెద్ద జీయార్, చిన్న జీయార్ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు పెద్ద జీయర్ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు చిన్న జీయర్ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు. -
‘బడుగు బలహీన వర్గాలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి సీఎం జగన్’
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరంలో వైఎస్సార్సీపీ బస్సు యాత్రలో భాగంగా బహిరంగ సభలో జరిగింది. ఈ సభలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందరూ అండగా నిలవాలన్నారు. తిరుపతి సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. పెత్తందారులకు, పేదవారికి జరిగే యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలని కోరుతున్నాను. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలగన్న సమాజాన్ని సీఎం జగన్ అందించారు. ఆయన ఆశయాలను నిరవేరుస్తూ అభినవ అంబేద్కర్‌లా ఉన్నారు. నిరంతర శ్రామికుడిలా ఉన్న సీఎం జగన్‌కి అండగా నిలవాలి. నేడు చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయాలను సీఎం వైఎస్ జగన్ తీసుకొన్నారు. వినూత్న పథకాలు.. విద్య వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చారు. సీఎం జగన్ నిర్ణయాలను పెత్తందారులు వక్రీకరిస్తున్నారు. టీడీపీ తోక పార్టీలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తూ దాడులు చేయిస్తున్నారు. 2024 ఎన్నికల యుద్ధంలో మరోసారి సీఎం జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం జగన్ నేరుగా వేల కోట్లు రూపాయలు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు. 8,288 మంది దళిత బిడ్డలు తిరుపతిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలు పొందుతున్నారు. దళితులకు 10 లక్షల గృహాలు మంజూరయ్యాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయంగా అభివృద్ధి చేస్తున్నాము. ఇవన్నీ సీఎం జగన్ చొరవతో జరుగుతున్నాయి. దమ్మున నాయకుడు సీఎం జగన్.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 2010లో తిరుపతికి వచ్చాను. భూమన కరుణాకర్ రెడ్డి మాకు శక్తిని ఇచ్చారు. అసెంబ్లీలో అచ్చమైన తెలుగులో మాట్లాడేది కరుణాకర్ రెడ్డి మాత్రమే. నేడు అభినయ్ రెడ్డి.. తండ్రిని మించిన తనయుడిగా మారిపోయాడు. 2024లో అభినయ్ రెడ్డి మంచి మెజారిటీతో గెలుస్తాడు. ఎన్టీఆర్ పార్టీ పెట్టాక వారి వెనుక బీసీలు నడిచారు. కానీ, దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి వచ్చాక బీసీలు అందరు కాంగ్రెస్ వైపునకు వచ్చారు. 2019లో సీఎం జగన్ బీసీ సమావేశం అనంతరం బీసీలందరూ ముఖ్యమంత్రి జగన్ వెంట నడిచారు. మేమంతా సీఎం జగన్ వెంటే.. పార్టీలో, పదవులలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు, నేడు నెరవేర్చారు సీఎం జగన్. ఐదు మంది డిప్యూటీ సీఎంలను చేసిన గణత సీఎం వైఎస్ జగన్‌దే. కార్పోరేషన్, మార్కెట్ కమిటీలలో 60 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. ఏ ముఖ్యమంత్రికి అయినా స్టేజ్ ఎక్కి నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని చెప్పే దమ్ము ధైర్యం ఉందా?. అలా, సీఎం జగన్ మాత్రమే చెబుతారు. ఆయన ఒక్కడికి మాత్రమే ఆ దమ్ము ఉంది. మా ధైర్యం సీఎం జగన్. 2024లో మరోసారి సింహంలా సింగిల్‌గా వస్తాడు.. 175/175 స్థానాల్లో విజయం సాధిస్తాడు. శ్రీకాకుళం, రాయలసీమ, కోస్తాలో సభలు మొదలైతే ఓ జాతరలా యాత్ర జరుగుతోంది. మరోవైపు టీడీపీ యాత్ర జనాలు లేక వెలవెలపోతోంది. మేమందరం సీఎం జగన్‌కు అండగా ఉంటాము. అభియనయ్ రెడ్డిని తిరుపతిలో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. తిరుపతి సాక్షిగా సీఎం జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారు. 175 స్థానాల్లో గెలుపు మనదే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. తిరుపతిలో 75 సంవత్సరంలో జరగని అభివృద్ధి నేడు చేసి చూపిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి, వారి తనయుడు అభినయ్ రెడ్డి. కాబోయే ఎమ్మెల్యే అభినయ్ రెడ్డికి అల్ ది బెస్ట్. యువతకు సీఎం వైఎస్ జగన్ ప్రోత్సాహం ఇస్తారు. నిజమైన బడుగు, బలహీన వర్గాలకి మేలుచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్ మాత్రమే. పేదవాడి తలరాత మారాలంటే 2024 ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. చంద్రబాబు తప్పు చేసి జైలుకు వెళ్లాడు. కానీ దానికి పచ్చపత్రికలు వంత పడుతున్నాయి. నేడు తిరుపతిలో వైఎస్సార్సీపీ సభకు భారీగా జనాలు వచ్చారు. 175 స్థానాల్లో ఎవరు పోటీ చేసినా సీఎం జగన్ పోటీలో ఉన్నట్టు భావించి అన్ని స్థానాల్లో గెలిపించాలని కోరుతున్నాను. అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యం.. తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్ని పార్టీలు అణగారిన వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకునేవారు. కాన్నీ, సీఎం జగన్ అన్ని రంగాల్లో వారికి ప్రాధాన్యత ఇచ్చారు. అట్టడుగున ఉన్న వారిని క్రియాశీలక రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్. తిరుపతి కార్పొరేషన్లో 23 సీట్లు 46శాతం బీసీలకు ఇచ్చిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళలకు మేయర్ అవకాశం ఇచ్చింది మా పార్టీనే. రాష్ట్రంలో పెత్తందార్లకు చంద్రబాబు అండగా నిలుస్తుంటే సామాన్య పేద వర్గాల ప్రజల పక్షాన సీఎం జగన్ అండగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 80 వేల ఓట్లు వేసి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే, ఈరోజు 2 లక్షలు మందికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. తిరుపతి నగరంలో 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు అభివృద్ధి చేశాం. మరో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లు రానున్న రెండేళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. వినాయక సాగర్ అభివృద్ధి చేసిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. రాజకీయాలంటే వ్యాపారం కాదు.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లలో అంచెలంచెలుగా ఎదిగారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సీఎం జగన్ నెరవేస్తున్నారు. పైరవీలతో వచ్చిన వ్యక్తి కాదు.. ఫైటర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి సీఎం జగన్. రాజకీయాలంటే వ్యాపారం కాదు, నిచ్చెన కాదు, ప్రజలకు సేవ చేయాలనే తపన. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధితో 38 వేల ఎకరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్‌ది. 40 ఏళ్లలో ఎక్కడా లేని అభివృద్ధి తిరుపతిలో చేసి చూపించాం. తిరుపతి అభివృద్ధి కోసం మా పోరాటం, ప్రజలకు మేలు చేయడంలో ఎక్కడా రాజీపడేది లేదు. అర్హత ఉంటే నా బిడ్డ అభినయ్‌ను గెలిపించండి, కాదు అంటే ఓడించండి. -
అగ్ని ప్రమాదఘటనాస్థలాన్ని పరిశీలినచిన భూమన
-
ఘనంగా తిరుపతి పుట్టినరోజు వేడుకలు
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరం 893వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ, కార్పొరేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే భూమన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ గోవిందరాజుస్వామికి సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జీయర్‌స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ల కళాప్రదర్శనల నడుమ ఆధ్యాత్మికయాత్ర శోభాయమానంగా సాగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన చెక్క భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. స్వామి భక్తులు పౌరాణిక వేషధారణలో భక్తిప్రపత్తులు చాటుకున్నారు. కనులపండువగా సాగిన యాత్ర ఆద్యంతం.. గోవిందనామ స్మరణతో తిరుపతి పులకించిపోయింది. తమ నగరం పుట్టినరోజును పురస్కరించుకుని నగరాన్ని పచ్చతోరణాలతో అలంకరించారు. పూలు చల్లుతూ, పసుపు నీళ్లు వారబోస్తూ శోభాయాత్రను స్వాగతించారు. గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ, కర్పూర హారతులు పడుతూ భక్తిని చాటుకున్నారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ ప్రజలు సమతాస్ఫూర్తి ప్రచారకర్తలై ముందుకు సాగారు. పుణ్యక్షేత్ర జన్మదిన వేడుకలు ఏటా కొనసాగాలని జీయర్‌స్వాములు ఆకాంక్షించారు. భగవంతుడి అనుగ్రహంతోనే.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎంతో పవిత్రమైందని చెప్పారు. గోవిందరాజుస్వామిని ముక్కోటి దేవతలు పూజిస్తారన్నారు. శ్రీ మహావిష్ణువే శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారంలో స్వయంభువుగా వెలిసిన మహాపుణ్యక్షేత్రమిదని తెలిపారు. దైవసమానులైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు 1130 ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేసిన ప్రాంతమని చెప్పారు. ప్రపంచంలో వ్యక్తులకు మాత్రమే జన్మదిన వేడుకలు జరుగుతాయని, అయితే ఓ ప్రాంతానికి జన్మదిన వేడుకలు జరగడమంటే ఒక్క తిరుపతికి మాత్రమేనని పేర్కొన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే తాను ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేస్తున్నానని, ఇది పూర్వజన్మ సుకృతమని చెప్పారు. తిరుపతి ప్రాభవాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతర శోభ: తాతయ్యగుంట గంగమ్మ జాతరలో తొలిరోజు
-
ప్రచారం లో దూసుకెళుతున్న వైఎస్సార్సీపీ
-
ఆ స్థాయి సోము వీర్రాజుకు ఉందా?: ఎమ్మెల్యే భూమన
సాక్షి, తిరుపతి: తిరుపతిలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఎంపీ మిథున్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్ధి డా.గురుమూర్తి పాల్గొన్నారు. వెంకన్న పాదాల సాక్షిగా మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిలదీశారు. రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్ ధరలు తగ్గిస్తామనడం లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బాబు, లోకేష్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని భూమన నిప్పులు చెరిగారు. చదవండి: లోకేషా.. పుడచేరి కాదయ్యా..పుదుచ్చేరి ‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’ -
ఎమ్మెల్యే భూమనకు కరోనా పాజిటివ్
సాక్షి, తిరుపతి : తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన రుయా ఆస్పత్రిలో చేరారు. ఇక భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు. కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. (కరోనా: ఆదర్శంగా నిలిచిన భూమన) -
వీవీని కాపాడండి: హృదయం చెమ్మగిల్లుతోంది
సాక్షి, తిరుపతి : ముంబైలోని తలోజా జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని వైఎస్సార్సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడుకు శనివారం బహిరంగ లేఖ రాశారు. అనారోగ్య సమస్యతో పాటు, ప్రాణాంతక కరోనా వైరస్ బారిపడిన వరవరరావు విడుదలకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. శరీరం మంచాన కట్టుబడి 81 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్న ఆయనపై ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. (ఆయన ప్రాణాలు కాపాడాలి) ‘వృద్య శల్యం శరీరంలో ఉన్న వరరరావు ప్రాణాలు కాపాడాలని ఉపరాష్ట్రపతిని కోరుతున్నా. వరవరరావు నిర్బంధం, అనారోగ్యము గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనలు అంకుర్బావ దశలో నాకు లభించిన గురువుల్లో వరవరరావు ముఖ్యులు. 46 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు (వెంకయ్య నాయుడు), నేను (భూమన కరుణాకర్‌రెడ్డి) 21 నెలల పాటు ముషీరాబాద్ జైల్లో వున్నప్పుడు వరవరరావు మన సహచరుడు. సహచర్యం, భావాజాలం కాదు, కానీ జైల్లో కలసి ఉన్నాం. రాజకీయ సిద్ధాంతాల్లోను జనక్షేమంకై నడిచే మార్గాల్లో ఎవరి భావాలు వారివి. కానీ మనం మనుషులం. మానవతా దృక్పధంతో స్పందించి వరవరరావు విడుదలకు చొరవ చూపుతారని ఆశిస్తున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. (వరవరరావుకు కరోనా పాజిటివ్) కాగా ప్రముఖ విప్లవకవి వరవరరావు(వీవీ)కు కోవిడ్ సోకిన నేపథ్యంలో వెంటనే ఆయనను జైలు నుంచి విడుదల చేసి, మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర ప్రభుత్వానికి వివిధ వామపక్ష పార్టీల నేతలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. వీవీతోపాటు 90 శాతం అంగవైకల్యమున్న ప్రొ.జీఎన్ సాయిబాబా, ఇతర రాజకీయ ఖైదీలను బెయిల్‌పై విడుదల చేయాలని కోరారు. మరోవైపు వరవరరావు కరోనా సోకడంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా వీరే..
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలిలో ఏడుగురుని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డితో పాటు హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు గోవింద హరి, ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు రాకేశ్ సిన్హా, ముంబై లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు అమోల్ కాలే, బెంగుళూర్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, భువనేశ్వర్ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు దుష్మత్ కుమార్, చెన్నై లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఏజే శేఖర్‌లను నియమిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 29 మందితో టీటీడీ 50వ ధర్మకర్తల మండలి రూపొందనుంది. ఎంపికైన వారు సెప్టెంబరు 23న తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
వారితో హోదాకు మద్దతని చెప్పించావా: జగన్
-
ఒక్క అవకాశం ఇవ్వండి
నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చేనేత కార్మికులను ఆదుకుంటా. చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 ఇస్తా. 2004లో నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నాన్న కంటే గొప్ప పరిపాలన అందిస్తా. చంద్రబాబు పార్టనర్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో బాబు కానీ, ఆయన కుమారుడు కానీ ప్రచారానికి వెళ్లరు. అలాగే చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం, ఆయన కుమారుడు లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఆ పార్టనర్ ప్రచారానికి రాడు. వీళ్లవి వేరువేరు పార్టీలా? ఒకే పార్టీనా? సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, కర్నూలు/సాక్షి, తిరుపతి: వ్యవస్థలో మార్పు కోసం నితీ, నిజాయతీకి పట్టం కట్టాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన పాలన కంటే మరింత గొప్ప పరిపాలన అందిస్తానని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్ల దుష్ట పరిపాలనకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి తాను ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేశాను తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. దేవుడిని, ప్రజలను తప్ప ఇంకెవరినీ నమ్ముకోలేదని తేల్చిచెప్పారు. 2014 ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదని అన్నారు. ఈరోజు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి, మోదీకి అప్పుడున్న గ్లామర్ ఇప్పుడు లేదని తెలిసి తాను ఆయనతో ఎందుకు పొత్తు పెట్టుకుంటానని ప్రశ్నించారు. జగన్ మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి, కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణం, చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతటా ప్రజలు నిర్ణయించుకున్నట్టే, లోకేశ్‌ను ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే... హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబు కాదా? మంగళగిరి సభలో.. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను దగా చేశాడు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా? 2014 మార్చి 2న రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రణాళికా సంఘానికి ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 31 వరకూ ప్రణాళికా సంఘం అమల్లో ఉంది. జూన్‌లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయండి అని కోరుతూ డిసెంబర్ 31 దాకా ప్రణాళికా సంఘానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. 2016 సెప్టెంబర్ 8న అర్ధరాత్రి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ప్యాకేజీ కావాలని చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నాడు. లేని ప్యాకేజీ ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ అసెంబ్లీ, శాసన మండలిలో రెండుసార్లు తీర్మానం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్రతిఏటా కేవలం రూ.3,500 కోట్లు ఇస్తే చాలంటూ కేంద్రానికి లేఖ రాశాడు. 2017 జనవరి 27న ప్యాకేజీ ఇచ్చిన నాలుగు నెలల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరీ బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి పదేళ్లు హైదరాబాద్‌పై ఉన్న హక్కును వదిలేసి పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా? రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది ఎవరు? రాజధాని నిర్మించకముందే స్విస్ చాలెంజ్ అంటూ సింగపూర్ కంపెనీలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని 1,700 ఎకరాల భూములను రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఆత్మగౌరవమంటూ మాట్లాడే పార్టనర్, ఎల్లో మీడియా చంద్రబాబు దుర్మార్గాన్ని ఎందుకు ప్రశ్నించరు. కుంభకోణాలన్నీ ఇక్కడే..: కుంభకోణాలన్నీ మంగళరిలోనే చోటు చేసుకున్నాయి. హాయ్‌ల్యాండ్ కుంభకోణం, సదావర్తి భూముల భూకుంభకోణం ఒక్కడే జరిగాయి. రైతులు భూములు ఇవ్వనందుకు అరటి తోటలను తగలబెట్టించింది ఇక్కడే. చంద్రబాబు అక్రమ నివాసం ఇక్కడే. చేనేత కార్మికులను వంచించింది కూడా ఇక్కడే. రిషితేశ్వరిని చంపింది ఇక్కడే. స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నది ఇక్కడే. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇవ్వలేదు కానీ ఇదే భూమిని చంద్రబాబు తనకు కావాల్సిన కంపెనీలకు లంచాలకు అమ్ముకున్నది ఇక్కడే. చంద్రబాబు, నారా లోకేశ్ ఏ రోజూ మంగళగిరిలో తిరిగిన దాఖలాలు లేవు. ఆర్కేకు ఓటేస్తే మీ ఆస్తులను రక్షిస్తాడు. మీ కుటుంబాలను అభివృద్ధి చేస్తాడు. ఆర్కేకు ఓటేసి గెలిపిస్తే నా కేబినెట్లో మంత్రిగా ఉంటాడు. ఎల్లో మీడియా చానళ్లలో మైకులు పట్టుకుని ప్రచారం చేసినంత మాత్రాన చంద్రబాబు చేసిన మోసాలు, వంచనలు, అరాచకాలు మంచి పనులు అయిపోతాయా? ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000..: ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ ఒక్కో ఓటుకు రూ.10 వేల చొప్పున పంచుతోంది. చంద్రబాబు పంచుతున్న డబ్బులకు మోసపోవద్దు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చేనేత కార్మికులను ఆదుకుంటా. ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 ఇస్తా. ఆ డబ్బు కోసం మీరు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. 2004లో నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డికి అవకాశం ఇచ్చారు. నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నాన్న కంటే గొప్ప పరిపాలన అందిస్తా. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా నుంచి ఇవ్వబోయే మొట్టమొదటి ఎమ్మెల్సీ పదవిని చేనేత కార్మికుడికే ఇస్తాను. చేనేత కార్మికులకు సముచిత స్థానం కల్పిస్తా. గత తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉన్నాను. ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా ఈ జగన్ అక్కడున్నాడు. నాయకుడంటే ప్రతి కార్యకర్త కాలర్ ఎగురవేసుకుని మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి. ఆ గుణాలు ప్రస్తుత పాలకులకు లేవు. అందుకే మార్పు కోసం ఓటెయ్యండి. ‘హోదా’కు అద్దె నేతలు మద్దతిచ్చారా? తిరుపతి సభలో.. రాష్ట్రానికి జీవనాడిలాంటి ప్రత్యేక హోదా సత్వరం వచ్చేలా తిరుమల శ్రీవారి ఆశీస్సులు కోరుతున్నా. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం, అవినీతి, అబద్ధం, అన్యాయం, అధర్మం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ ఎల్లో మీడియా అసత్య ప్రచారానికి దిగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పూర్తిగా మద్దతిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం మద్దతిస్తానంటే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ, చంద్రబాబుకు కేసీఆర్ అంటే ఇష్టం లేక విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు చాలామంది అద్దె నేతలను తీసుకొచ్చాడు. వారిలో ఒక్కరైనా ప్రత్యేక హోదాకు మద్దతిచ్చారా? హోదా విషయంలో ఏపీకి తోడుగా ఉంటామని ఒక్క నేతతోనైనా చెప్పించగలిగారా? నాయకుడు ఎలా ఉండాలంటే..: కుట్రలు ఈ రెండు రోజుల్లో తారస్థాయికి చేరుతాయి. దొంగ వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తారు. విజయసాయిరెడ్డి మాట్లాడకపోయినా మాట్లాడినట్లు చూపించారు. చాణక్య సర్వే అన్నారు. వారేమో మాకు సంబంధం లేదంటారు. గర్భిణిపై దాడి చేశారట. బుద్ధి ఉన్నోడు ఎవడైనా గర్భిణిపై దాడి చేస్తాడా? నేను తిరుపతికి చెప్పులు వేసుకొచ్చానని చంద్రబాబు పార్టనర్ అసత్య ప్రచారం చేశాడు. నేను 3,500 మెట్లు కాలినడకన వెళ్తే, ఆ పార్టనర్ బూట్లు వేసుకొని కొండపైకి వెళ్లాడు. గత తొమ్మిదేళ్లుగా నన్ను చూస్తున్నారు. 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ప్రజల్లోనే ఉన్నాను. ఏ పేదవాడికి ఏ అవసరం వచ్చినా ఈ జగన్ అక్కడున్నాడు. నాయకుడంటే ప్రతి కార్యకర్త కాలర్ ఎగురవేసుకుని మా నాయకుడని చెప్పుకునేలా ఉండాలి. ఆ గుణాలు ప్రస్తుత పాలకులకు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతి ఒక్కరికీ భరోసా ఉండేది. చంద్రబాబు హయాంలో మోసం, దగా తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. హామీల విషయంలో మోసం చేశాడు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతాం. మరో 36 గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల రోజు నాటికి కుట్రలు, కుతంత్రాలు తారస్థాయికి చేరుతాయి. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. వైఎస్సార్సీపీని గెలిపించుకుని, సంక్షేమ పాలన తెచ్చుకుందామని ప్రతి ఒక్కరికీ చెప్పండి. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నా. కేంద్రంలో ప్రధానమంత్రిగా ఎవరైనా కానివ్వండి, రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడని మర్చిపోవద్దు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి కాబట్టి కేంద్రంలో ఎవరైనా ఫర్వాలేదనే నినాదం తీసుకున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు అని ఎవరైనా చెబుతారు. చంద్రబాబు ఇల్లు ఎక్కడ అని అడిగితే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కట్టుకున్నాడని అంటారు. రాష్ట్రంలో సొంత ఇంటిలో ఉంటోంది ఎవరు? అద్దె ఇంటిలో ఉంటోంది ఎవరు? 3,648 కిలోమీటర్ల నా పాదయాత్రలో రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులు, పేదల కష్టాలు, బాధలను చూశా. వారి ఆవేదన విన్నాను. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ప్రతి ఇంటికీ నవరత్నాలను చేరుస్తా. ఐదేళ్ల దుష్ట పరిపాలనకు ముగింపు పలికే సమయం వచ్చేసింది. మాపై ఇంత దుష్ప్రచారమా? కర్నూలు సభలో.. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నుతున్నాడో ప్రజలకు తెలుసు. కుట్రలో భాగంగా మనపై దుష్ప్రచారం చేస్తున్నాడు. ప్రతి మైనారిటీ సోదరుడికీ చెబుతున్నా. వైఎస్సార్సీపీ పుట్టినప్పటి నుంచి నేటి వరకూ జగన్ అనే వ్యక్తి ఒక్కడిగానే వచ్చాడు తప్ప ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. జగన్ దేవుడిని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకున్నాడు. అంతే తప్ప ఇంకెవరినీ నమ్ముకోలేదు. 2014 ఎన్నికలకు ముందే దేశమంతటా నరేంద్ర మోదీ ప్రభంజనం ఉందని తెలిసినా కూడా మనం ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. ఈరోజు మన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి, మోదీకి అప్పుడు ఉన్న గ్లామర్ ఇప్పుడు లేదని తెలిసి నేను ఆయనతో పొత్తు పెట్టుకుంటానా? నేను ఈ అడుగులు వేయకపోతే..: చదువులు పూర్తి చేసుకున్న మన పిల్లలకు ఇక్కడ ఉద్యోగాలు రాక ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. వారికి న్యాయం జరగాలంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవాలి. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఎవరికీ తెలియదు. మోదీ కావొచ్చు, రాహుల్‌గాంధీ కావొచ్చు, ఇంకెవరైనా కావొచ్చు. ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, మాకు అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతే మనం వారికి మద్దతు ఇస్తామని ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. నేను ఈ అడుగులు వేయకపోతే మనకు ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. రాష్ట్రానికి హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది. నీతికి, నిజాయతీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దుర్యోధనుడు ఏం చేసినా కౌరవ సభలో కొందరికి గొప్పగానే కనిపించింది. అధికార మదంతో దుర్యోధనుడు చేసిన ప్రతి పనినీ పొగిడిన వారిని దుష్ట చతుష్టయం అంటాం. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఓడిపోతున్నా, నిజాన్ని దాచిపెట్టి గెలుస్తున్నాడని జర్మన్ రేడియోలో ప్రచారం చేసేవాడు ఆయన మంత్రి గోబెల్స్. దుష్ట చతుష్టయాన్ని చూసినా, హిట్లర్ కొలువులోని మంత్రి గోబెల్స్ పేరు విన్నా మన రాష్ట్రంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, టీవీ9లు గుర్తొస్తాయి. చంద్రబాబు చేసిన మోసాలకు ఓటమి ఖాయమని తేలినా ప్రజలను నమ్మించడానికి బాకా ఊదుతున్న గోబెల్స్ కుట్రలను ప్రతి ఒక్కరూ గమనించాలి. లోకేశ్ ఎమ్మెల్యే అయితే రైతులకు కష్టాలే మంగళగిరి నియోజకవర్గంలో లోకల్ హీరో ఆళ్ల రామకృష్ణారెడ్డి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన గురించి మీకు తెలుసు. తన పొలంలో తానే నాట్లు వేస్తాడు, పంటలు పండిస్తాడు. చాలా సామాన్యంగా ఉంటాడు. రైతులకు కష్టమొస్తే న్యాయం కోసం కోర్టులకు వెళ్తాడు. టీడీపీ ప్రలోభాలకు గురిచేసినా ఆయన చెక్కు చెదరలేదు. ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. టీడీపీ నుంచి బరిలో ఉన్న నారా లోకేశ్ ఇక్కడి నేల మీద కాలు కూడా పెట్టని వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే అయితే చుట్టుపక్కల రైతులకు ఎలాంటి రక్షణ ఉండదు. ఇప్పటికే గద్దల్లా వచ్చి వాలుతున్నారు. ఇష్టానుసారంగా పేదల భూములను ఆక్రమిస్తున్నారు. చంద్రబాబును ఓడించాలని రాష్ట్రమంతా నిర్ణయించుకున్నట్టే ఆయన కుమారుడు లోకేశ్‌ను ఓడించాలని మంగళగిరిలో ప్రతి ఒక్కరూ ప్రతిన బూనాలి. వైఎస్ జగన్ హామీలు - ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్ నేరుగా సీఎంకు రిపోర్ట్ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం. - ఫీజులు తగ్గించడమే కాదు.. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించే విధంగా నేరుగా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నేనే సమీక్షిస్తా. - నెలకు రూ.40 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్ హెల్త్ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్ హెల్త్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం. - ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తాం. వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ వచ్చేలా చేస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాం. - ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం. - మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. - పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. - పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం. - రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం. - అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం. - ఇల్లు లేని పేదల కోసం ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. - రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్ విడుదల చేస్తాం. - ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం. - ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, నెలకు రూ.5 వేలు వేతనమిస్తాం. - ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలిస్తాం. - జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం. - సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం. - చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు అందజేస్తాం. - అంగన్వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం. - ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం. - సంఘమిత్ర, వీవోఏలు, వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం. - మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తాం. - పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. - ప్రభుత్వమిచ్చే ఫ్లాట్లకు పేదలు తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణం మాఫీ చేస్తాం. - తొలి బడ్జెట్లోనే రూ.1,100 కోట్లు కేటాయించి 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం. - మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకం. - 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం. - చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తాం. -
ఎల్లో మీడియా వార్తలను ఖండిస్తున్నాం: వైఎస్సార్సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న వార్తలను ఖండిస్తున్నామని ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అందుబాటులో ఉన్న వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం కేంద్రకార్యాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి, అంబటిరాంబాబు, పార్ధసారథిలు మీడియాతో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసమే తమ అధినేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేశారని ఈ సందర్భంగా భూమన వ్యాఖ్యానించారు. ఈ దాడి పట్ల డీజీపీ, టీడీపీ నేతల తీరును వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వతంత్ర విచారణ సంస్థతో ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్రహోంమంత్రి, గవర్నర్లు కలుస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు జీవితమంతా నేరచరిత్రేనని, తమ పార్టీపై బురద జల్లేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ పాదయాత్రకు సిద్దంగా ఉన్నప్పటికీ గాయం కారణంగా కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరామని భూమన పేర్కొన్నారు. ఆ వార్తలు అవాస్తవం: పార్థసారథి ఏపీ పోలీసులను వైఎస్ జగన్ అవమానించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పార్థసారథి స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య వార్తలను ఖండిస్తున్నామన్నారు. తాము తెలంగాణ పోలీసుల దర్యాప్తును కోరుకోలేదన్నారు. ఇక అధికారులను తామెక్కడా తక్కువ చేసి మాట్లాడలేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు మాటలు అభ్యంతరకరమన్నారు. దేన్నైనా చంద్రబాబు మసిపూసి మారేడు చేస్తారని, అందుకే తాము స్థానిక దర్యాప్తును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముద్దాయిలను కాపాడటానికే చంద్రబాబు, డీజీపీలు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. -
ఎర్రచందనం వేలం వెనుక కుట్ర : భూమన
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం వేలం వెనుక కుట్ర ఉందని సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎర్రచందనం ఆదాయం ద్వారా రుణమాఫీ చేస్తామని చెప్పి ..అడవుల్లో ఉన్న పచ్చదనన్నాంత మాఫీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పటి వరకు ఎర్రచందనం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో ఒక్కరూపాయి కూడా రుణమాఫీ చేయలేదన్నారు. 35 లక్షల ఎకరాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని పచ్చదండు తన్నుకుపోతోందని ధ్వజమెత్తారు. ఎర్రచందనం వేలం ద్వారా వచ్చిన ఆదాయం ఏమైందని భూమన ప్రశ్నించారు. పతంజలి సంస్థకు A గ్రేడు అమ్మి C గ్రేడుగా మార్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని మండిపడ్డారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పతంజలి సంస్థకు సరఫరా చేస్తున్న సీ గ్రేడ్ ఎర్రచందనాన్ని పట్టుకుంటే అది ఏ గ్రేడ్‌గా తేలిందన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందని, ఏపీ పరువు చంద్రబాబు బంగాళాఖాతంలో కలిపారని మండిపడ్డారు. చంద్రబాబు తన అనుచరులను అడవిలోకి పంపి దోపిడీ దొంగలకంటే దారుణంగా ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అండదండలతో టీడీపీ నేతలు బరి తెగించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టామని చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా వచ్చే వందల కొట్లతో వచ్చే ఎన్ని కల్లో చంద్రబాబు గెలవాలని చూస్తున్నారని భూమన తెలిపారు. -
ఎర్రచందనం వేలం వెనుక చంద్రబాబు కుట్ర
-
బాబు గిమ్మిక్కులను ప్రజలు నమ్మరు
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజలు నమ్మరని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 2014లో 600 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఓటమి భయంతో సీఎం అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. వేలాది రూపాయలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలని చూసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు నాంది కావాలని, చంద్రబాబుకు కనువిప్పు కావాలని చెప్పారు. జనంలోకి జగన్ వస్తుంటే ప్రజలు హారతులు పడుతున్నారని, బాబు వస్తే భయంతో పరుగుదీసి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను, అధికారులను భయభ్రాంతులకు గురి చేసి లబ్ధి పొందేందుకు కుట్రలు పన్నుతున్నారని, చివరకు ఎన్నికలు వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ ఉన్నప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ఇప్పుడు రాక్షస పాలన సాగుతున్నట్లు ఉందన్నారు. రాష్ట్రంలో ఇంతటి దుర్మార్గపు పాలన ఏనాడూ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ మాటలు నీటి మూటలు కాకుండా చూడండి
కేంద్రమంత్రి వెంకయ్యకు వైఎస్సార్సీపీ నేత భూమన సూచన సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలన్న కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. తన మాటలను నీటి మూటలు కాకుండా కార్యరూపం దాల్చేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి సూచించారు. సన్మాన సభల్లో సుద్దుల మాదిరిగా ఉత్తి మాటలు చెబితే సరిపోదని, లోక్‌సభలో రెండింట మూడొంతుల మెజారిటీ ఉన్నందున చిత్తశుద్ధితో చట్ట సవరణకు కృషి చేయాలని భూమన కోరారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోయినా అడిగే అధికారం లేకుండా పోయిందని, స్పీకర్ అధికార పార్టీ నుంచి వచ్చిన వారు కావడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. అందుకే ఈ విచక్షణాధికారాన్ని స్పీకర్ల పరిధి నుంచి తీసేసి ఎన్నికల కమిషన్‌కు అప్పగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, తర్వాత చట్టం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ 26న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సహా జాతీయ పార్టీల నేతలందరికీ ఈ విషయాన్ని సూచించారని చెప్పారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రికి వైఎస్ జగన్ రాసిన లేఖను ఆయన ప్రదర్శించారు. తమ పార్టీ ఎంపీ ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించిన అంశంపై లోక్‌సభ మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేసినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. బాబును ఎందుకు మందలించలేదు? ఏపీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబును.. ఆయనకు ఆత్మీయుడైన వెంకయ్య హెచ్చరించి, వారించి ఉండాల్సిందన్నారు. శాంతిభద్రతల్లో రాష్ట్రం ఐదో స్థానానికి దిగజారిందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపైనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. గతంలో ఒకరిద్దరు చాలని చెప్పి.. ఇపుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటున్న చంద్రబాబును చూస్తుంటే కన్యాశుల్కంలో మరో గిరీశంలా మారారన్నారు.