‘చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొచ్చారు. వారిలో ప్రత్యేక హోదాకు ఒక్కరైనా మద్దతిచ్చారా? ప్రత్యేక హోదాపై తోడుగా ఉంటామని ఒక్క నేతతోనైనా చెప్పించగలిగారా?’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా తిరుపతి లీలామహల్ సెంటర్‌లో జరిగిన చివరి బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.