తిరుమల: సోమవారం నిర్వహించిన ధార్మిక సదస్సులో పలు కీలక తీర్మానాలు తీసుకున్నామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గో సంరక్షణ, వేదశాస్త్రాల పరిరక్షణకు చర్యలు సహా 19 తీర్మానాలు చేసినట్లు స్ఫష్టం చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో కొత్త ఆలయాల నిర్మాణాలు చేపట్టాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
చిన్నారుల్లో భక్తిభావం పెంపొందించేందుకు తల్లులకు ధర్మబోధన శిక్షణ ఇవ్వాలని ధార్మిక సదస్సులో నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. యువతకు హిందూ ధర్మం తెలియజేయాలి.. పాఠశాల స్థాయిలో హిందూ ధర్మ ప్రచారం జరగాలని ధార్మిక సదస్సులో తీర్మానించారు. సప్తగిరులను జీవవైవిధ్య క్షేత్రంగా పరిరక్షించాలి.. 108క్షేత్రాలపై భక్తులకుఅవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ధార్మిక సంస్థలన్నీ టీటీడీతో కలిసి పనిచేస్తూ.. ప్రతి ఏటా ధార్మిక సదస్సులు జరగాలని తీర్మానించినట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: సమాజంలో మా గౌరవం పెరిగింది
Comments
Please login to add a commentAdd a comment