ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే.. | Key Decisions Taken In TTD Governing Council Meeting | Sakshi
Sakshi News home page

ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ.. కీలక నిర్ణయాలు ఇవే..

Published Tue, Dec 26 2023 1:24 PM | Last Updated on Tue, Dec 26 2023 5:38 PM

Key Decisions Taken In TTD Governing Council Meeting - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవాస్థానం(టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, వేతనాల పెంపుపై శుభవార్త అందించారు. 

టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవే.. 

  • టీటీడీ ఉద్యోగులకు ఈనెల 28న 3,518 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం
  • జనవరిలో మరో 1500 మందికి ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయం
  • రిటైర్డ్ ఉద్యోగులు తదితరుల కోసం మరో 350 ఎకరాలు 85 కోట్లతో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయం
  • శానిటేషన్ ఉద్యోగులు వర్క్ కాంట్రాక్టు ఉద్యోగులు వేతనాలు పెంచాలని నిర్ణయం
  • పోటు కార్మికులకు వేతనాలు 28 వేల నుండి 38 వేలుకు పెంపు, 10 వేలు పెంచాలని నిర్ణయం
  • వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులు, స్కిల్ లేబర్‌గా గుర్తించి తగిన విధంగా వేతనాలు పెంచాలని నిర్ణయం
  • ఫిబ్రవరిలో రెండు రోజులు పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని నిర్ణయం
  • కళ్యాణకట్టలో పీస్ రేట్ బార్బర్ల వేతనాలు కనీసం 20,000 ఇవ్వాలని నిర్ణయం
  • తిరుపతిలో పాత సత్రాలు తొలగించి కొత్త అతిథి గృహాల నిర్మాణం టెండర్లకు ఆమోదం
  • తిరుపతి పారిశుధ్యం పనులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఆమోదించాలని నిర్ణయం
  • జార్ఖండ్ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం
  • చంద్రగిరిలో మూలస్థానం ఎల్లమ్మ ఆలయానికి అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల కేటాయింపు
  • శ్రీనివాస దివ్య అనుగ్రహ యాగం చేసే భక్తులకు 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించాలని నిర్ణయం
  • శ్రీవారి ఆలయ పెద్ద జీయార్‌, చిన్న జీయార్‌ మఠాలకు ప్రతీ ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంపు
  • పెద్ద జీయర్‌ మఠానికి రెండు కోట్లు నుండి రెండు కోట్ల 60 లక్షలకు పెంపు
  • చిన్న జీయర్‌ మఠానికి ఒక కోటి 70లక్షల నుండి 2 కోట్ల 10 లక్షలకు పెంపు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement